30, డిసెంబర్ 2008, మంగళవారం

e-తెలుగుతో నా అనుబంధం - మొదటి భాగం

హైదరాబాదులో ఈ మద్య జరిగిన పుస్తక ప్రదర్శన గురించి అందరికీ తెలుసు, కాబట్టి నేను కొత్తగా చెప్పొచ్చేది ఏమీ లేదు. కానీ ఇక్కడ నేను ప్రస్తావించే విషయలు e-తెలుగు సంఘం గురించి, అలాగే e-తెలుగు సంఘం తో నాకు ఉన్న అనుభవం గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. రాబోయే రెండవ భాగంలో పుస్తక ప్రదర్శనలో e-తెలుగు సంఘం యొక్క కార్యకలాపాలలో నా వంతు కృషి ఏమిటి? ఎలా? ఎందుకు? వంటి పలు విషయాలు ప్రస్తావిస్తాను.

నేను కాలానుగుణంగా మారుతూ ఉన్నాను అనేందుకు సాక్షమే ఈ పుట. నా ప్రవర్తనకి నేను ఎవ్వరికీ జవాబుదారీ కాక పోయినా, నా మటుకూ నేను ఎంత నిస్పక్షపాతంగా ఉన్నానో అని నేను తెలుసుకునే క్రమంలో వెలువడినదే ఈ ప్రచురణ. ఈ పుటకి ఉన్న శీర్షిక ఏమాత్రం సరిపోక పోయినా, రెండవ పుటకి ఇది ఉపోద్ఘాతం.

ఈ బ్లాగు నందు కొంచం సీరియస్ గా అనిపించే విషయాలు ప్రస్తావించినా, మరోవైపు సరదాగా ఉండేందుకు మొదలు పెట్టిన బ్లాగు, ’ఉబుసు పోక..’. దీనికి ముందు నేను ఎక్కువగా e-తెలుగు సైటు నందు చలాకీగా పాలు పంచుకుంటూ ఉండేవాడిని. ’అందరూ చేస్తుండగా లేంది మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం..’ అంటూ మొదలు పెట్టిన బ్లాగే ’ఉబుసు పోక..’. ఇదిగో అలా అలా కాల క్రమేణంలో నేను భవదీయుడుగా రూపాతరం చెందిన ఉదంతం జగద్విదితమే. నాకు తోడుగా, నా సహధర్మచారిణి తన మనసులో మాటగా మొదలు పెట్టి, మహిళా బ్లాగర్లాందరి నుంచి పొందిన ప్రోత్సాహంతో, ఇదిగో ఇప్పుడిప్పుడే తన ఊసులు నలుగురితో పంచుతోంది. అప్పట్లో మా దగ్గరే ఉంటున్న మా అమ్మ కూడా ’ఒక సగటు భారత నారి ఆలోచనలు..’ అంటూ తన అభి ప్రాయాలు ప్రచురించడం మొదలు పెట్టింది. కానీ ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా విజయవాడలో ఉండటం వలన కొంత కాలం తరువాత తను తిరిగి తన బ్లాగు ప్రపంచంలోకి అడుగిడుతుంది.

ఇన్ని బ్లాగులకు ప్రేరితమైన తెలుగు ప్రియులకు ఆలవాలమైన e-తెలుగు సంఘం గురించి మరో పుటలో నా అనుభవాలతో కలుస్తాను, అంతవరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

12, డిసెంబర్ 2008, శుక్రవారం

అందం శాపమా ? లేక అమ్మాయా!!! ఏది?

 

రెండు రోజుల క్రిందట TV9లో వార్తలు వింటుంటే చూసిన దృశ్యాలు నన్ను ఈ రెండు రోజులూ దుఃఖసాగరంలో ముంచి తేల్చాయి. శీర్షికలో చెప్పినట్లుగా.. అందంగా ఉండడం శాపమా? లేక అమ్మాయిగా పుట్టడం శాపమా? అంతే అనుకుంటే, అమ్మాయిగా పుట్టి అందంగా ఎదగడమే ఈ నాటి ఆడ పిల్లలు చేసుకున్న గత జన్మ కర్మ ఫలమా? జీవితపు ప్రారంభ దశలోనే అష్టకష్టాలకు ఎదురీదుతున్న స్వప్నిక మరియూ ప్రణీతలు ఏ జన్మలో చేసుకున్న పాపఫలం ఇది?

 

ఆశించద్దు అని ఎవ్వరూ చెప్పలేదే, కానీ శాసిస్తే ఎదుర్కునే హక్కు ప్రతీ వారికీ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కుంటారు? ఎవ్వరిని ఎదొర్కొంటారు? అలనాడు ప్రాణమే తీసిన అగంతకుడు చక్కగా ఊచల వెనుక మనో నిబ్బరంతో నిద్రపోతుంటే, ఈ నాడు ఉన్న జీవితాన్ని అంధఃకారం లోకి నెట్టేసిన కిరాతకులను కొమ్ముకాస్తున్న పోలీసు వ్యవస్థని ఎవ్వరు నిలదీస్తారు? ఏమి చేస్తే ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది? సబ్య సమాజం నివ్వెర పోయేటట్లు ప్రవర్తించిన కిరాచకుడి చర్యనుంచి వీరు బయట పడి నిండు జీవితాన్ని ఎలా పోరాడాలో నేర్చుకునేంత వరకూ వీరికి ఉపశమనమేది?

 

వయ్యస్సులో చిన్నదైనా, ’దేవుడనే వాడు ఉన్నాడు.. నాకు అన్యాయం చెయ్యడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు ..’ అంటూ పలుకుతున్న ఈ చిన్నారికి ఏమి చెప్పాలి? మున్ముందు ఉన్న జీవితం అంతా అంధః మయమై చీకటిలోనే రంగులు వెతుక్కోవాల్సిన పరిస్తితికీ, ఈ పిల్ల చేసుకున్న పుణ్యం ఏమిటి? దేవుడా!! నిన్ను ప్రశించే వారు ఎవ్వరూ లేరా? ఎవ్వరూ లేరని విర్రవీగుతున్నావా? లేక ఎవ్వరికి ఏమి నేర్పిద్దామని ఈ చిన్నారులకు ఇంత పెద్ద శిక్ష విధించావు? హింశ అన్నింటికీ ఒకదారి కాదు అని అందరికీ తెలుసు, మరి ఈ ఇద్దరు చిన్నారులను ఇంత కౄరంగా చేసేటట్లు తలంచిన యువతను పెంచే పెద్దలకు ఈ విషయాన్ని ఎవ్వరు తెలియ జేస్తారు?

 

శిక్ష పిల్లలకు ఎంత వేస్తారో అంతకన్నా ఓ విడత ఎక్కువగా వారిని కన్న తల్లి తండ్రులకు కూడా వెయ్యాలనేది నా అభిప్రాయం. ఇందులో వారి తప్పేంటి అంటారా.. అదేదో తెలుగు సామెత చెప్పినట్లుగా, మ్రొక్కై వంగనిది మానై వంగునా .. అన్నట్లు, మొక్కగా ఉన్నప్పుడే వీరి ఆలోచనలను పసిగట్టలేని తల్లి తండ్రులు, వారి నిర్లక్షానికి ఎంత పెద్ద రుసుము చెల్లించాయో ఈ పసి హృదయాలు. వయ్యస్సులో ఉన్న యువతను అర్ధం చేసుకో లేని తల్లి తండ్రులూ తల్లితండ్రులేనా? వీడెవడో ఇలాంటి పని చేస్తే మరొకడు ఎంచక్కా తాను ప్రేమించిన అమ్మాయి కాలం చేసిందని ఎంచక్కా పేపర్లో ప్రకటనే ఇచ్చేసాడే.. ఏమిటి ఈ ప్రవర్తన? వీరిని ఒక సక్రమమయిన దారిలో పెంచలేని తల్లి తండ్రులు ఇక ఉండీ ఏమి ప్రయోజనం?

 

పిల్లలు అప్రయోజకులుగా పెరుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించ లేనంత బిజీగా ఈ తల్లి తండ్రులు ఏమి చేస్తున్నారో నాకు అర్దం కావటం లేదు. ఇల్లు, ఇల్లాలు, కన్నవాళ్ళు, కని పెంచిన వాళ్ళు, వారి వారి భవిష్యత్తు వీటి  కన్నా ముఖ్యమైన విషయాలు ఉంటాయా.. వీటిల్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంతటి ఘాతుకాని పాల్పడుతున్న పిల్లలను పట్టించు కోని పెద్దల హస్తం ఇటువంటి చర్యలకు అన్యమస్తకంగా హేతువు కాదా? మరి వారికి ఎటువంటి శిక్ష పడాలి?

2, డిసెంబర్ 2008, మంగళవారం

రత్నమా? ముత్యమా? లేక పగడమా?

ఈ పుట ప్రచురించే ముందు చాలా సంశయించాను. కానీ, ఆలోచించిన కొద్దీ నాలో కలుగుతున్న భావనకి అన్యాయం చేస్తున్నానేమో అనిపించి ఎక్కువగా ఆలోచించడం మానేసి, ఇదిగో ఇలా మీముందు నా అభిప్రాయాన్ని ఉంచుతున్నాను. సద్బుద్దితో గ్రహిస్తారో లేక నా మది మందగతైందని తలుస్తారో మీ అభీష్టానికే వదిలేస్తున్నాను.

నేను స్వతహాగా తెలుగు TV ఛానళ్ళను చూడను. కారణాలేవైనా అవి ఎక్కువ శాతం స్త్రీని తక్కువ చేసి చూపించడమో, లేక, స్త్రీకి పలు పెడర్దాలు ఆపాదించడమో చేస్తుంటాయి అనే అభిప్రాయం నాలో చాలా బలంగా నాటుకు పోయింది. కానీ కొంత మంది స్త్రీలను చూసినప్పుడు, మహా పురుషులు అనే పదం వెలితిగా తోస్తుంది. అలాంటి మహిళలకు ఎలాంటి పద ప్రయోగం చెయ్యాలా అని బుఱ్ఱగోక్కున్నప్పుడల్లా, ఉన్న వెంట్రుకలు రాలటం తప్పితే మంచి పదం దొరకడం లేదు.

’మహా వనితలు’ అందాం అనుకుంటే.. ఈ పద ప్రయోగంలో వ్యంగ్యం తొంగి చూస్తున్నట్లుంది.

ఇంతకీ అస్సలు చెప్పొచ్చినదెవ్వరి గురించంటే.. విజయలక్ష్మి దేశికన్. వనితా TVలో నాకు చాలా నచ్చిన వ్యాఖ్యాత.

ఈవిడను ఇక్కడే, అంటే వనితాTV లోనే, మొదటి సారి చూడడం. అహా.. ఏమి మాధుర్యం.. నిజంగా పాత కాలంలో జయప్రద గృహిణిగా చేసిన పాత్రలు అన్నీ కలగలిపి ఈవిడలా ప్రాణం పోసుకున్నాయేమో. ఒక్క సౌందర్యమే ఈవిడ బలమనుకుంటే పొరపాటు చేసినట్లే అనిపిస్తుంది. ఈవిడ గళంలో ఉన్న గాత్ర శుద్ది విన్న వాళ్ళకే అర్దం అవుతుంది. అలవోకగా స్పందించె ఈవిడ సంగీత ఙ్ఞానానికి మచ్చు తునకలే వనితాTVలోవచ్చే కార్యక్రమాలు.

నేను ఈవిడను చూడక ముందు వరకూ  SP శైలజ గారు, అదేనండి మన బాలుగారి చెల్లెలు, అంటే తెగ అభిమానం. ఈవిడ కూడా చక్కగా నిండుగా చూడ ముచ్చటగా తయ్యరైయ్యె వారు. సందర్భానికి తగ్గట్టుగా వీరి ఆహార్యం ఉంటుంది. చాలా సామాన్యంగా, ఎక్కువ ఆభరణాలు లేకుండా, simpleగా, gentleగా చాలా చక్కగా తయ్యరయ్యే చాలా (.. ఇన్ని ’చాలా’లు అవసరం లేకపోయ్యినా...) కొద్ది మంది ఆడవాళ్ళలో ఈవిడ ఒక్కరు.

ప్రతీ మగువలోనూ ఏదో ఒక శక్తి అంతర్లీనంగా ఉంటుంది. కానీ అందరు మహీళ లోనూ ఉండే ఒకే ఒక్క గొప్పగుణం, స్త్రీ తత్వం. అటువంటి గొప్ప భావాన్ని కాదనుకుంటూ తమ తమ ఉనికిని మరచిపోయి ప్రఘల్బాలు పలికే మహిళలు ఇలాంటి వారిని చూసి ఏమనుకుంటారో??

ఇక అసలు విషయానికి వస్తే.. నాకు భార్యగా వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో అని నేననుకున్న కొన్ని ఊహలలో వీరిరువురూ నూటికినూరు శాతం సరి పొతారు. అఫ్‍కోర్స్.. ఈ విషయం నా శ్రీమతికి తెలుసనుకోండి, కానీ అన్నీ మనం కోరుకున్నట్లు జరిగితే, దేవుడనేవాడు ఎందుకు? నా విషయం ప్రక్కన పెడితే..

విజయలక్ష్మి దేశికన్.. ఈవిడ మాటలో ఎంత వినయం.. ఎంత స్పష్టత.. ఎంత కమ్మదనం.. అబ్బో.. ఏమి చెప్పమంటారు. శ్రావ్యమైన కంఠం.. ప్రతీ రాగం గురించి లోతైన అవగాహన..ఏ రాగాన్ని ఏ సంగీత దర్శకుడు ఏ ఏ సందర్బాలలో.. ఏ ఏ విధంగా .. ఎప్పుడెప్పుడు.. ఎలా ప్రయోగించారో తెలుసు కోవాలంటె, ఈవిడ చేసే కార్యక్రమాలు చూసి తీరాల్సిందే. విజయలక్ష్మి దేశికన్.. ఈ పేరు వింటుంటే, ఈవిడ తెలుగు అమ్మాయి లాగా అనిపించడంలేదు. కానీ ఈమె పలికే తెలుగు చూస్తూంటే, చాలా కాలంగా తెలుగుని చిలికి___ కాచి___ చల్లార్చి___ వాడ బోసారేమో అనిపిస్తోంది. ఈవిడ గురించి నాకు చాలా తక్కువే తెలుసు, చదువరులకు ఈవిడ గురించి ఏమైనా తెలిస్తే తెలియ జేయగలరని మనవి.

ఇంకా ఏవేవో వ్రాయాలని ఉన్నా.. భావ రూపం మరో వైపు మరలి నారీ లోకం అంతా ఒక్కటై కుమ్మేస్తారేమో అని భయంతో ముగిస్తున్నాను.

అఖరుగా.. ప్రతీ ఒక్కరి ప్రతిభా పాఠవాలు మెచ్చుకోవడం తప్పు కాదని భావిస్తూ, మీలోనూ అంతర్లీనంగా నిక్షిప్తమై అప్రయోజకంగా మిగిలిపోతున్న మీ మీ శక్తి యుక్తులను వెలుగు లోకి తెస్తారని ఆశిస్తాను.

14, అక్టోబర్ 2008, మంగళవారం

ఎందుకీ స్తబ్తత?

 

రోజూలాగే ఈ రోజు మొదలైందనుకున్నాను. కానీ ఏదో తెలియని నిస్సత్తువ. మనసంతా ఒక్కసారే శూన్యమైపోయింది. ఏమి చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో నాకే అర్దం కావటం లేదు. రోజూ లాగే, ఉదయానే లేచి కాలకృత్యలతో పాటుగా స్నానం అయ్యిన తరువాత అన్నం వండుకున్నా.. ఆఫీస్ లో తినడానికి కారియర్ సద్దుకున్నా.. ఆపిల్స్ తిన్నా.. సాయంత్రానికి బ్రెడ్ జామ్ మూట కట్టుకున్నా.. అంట్లు తోమి ఆరబెట్టాను. ఇన్ని చేస్తున్నా.. ఏదో శూన్యం .. యాంత్రికంగా చేసేస్తున్నా. నా ప్రమేయమేమీ లేకుండా అన్ని జరిగి పోతున్నాయి. అప్పుడు గుర్తుకొచ్చింది. చక్కగా కర్ణాటక సంగీతం వినవచ్చు కదా అని. అన్నదే తడవుగా esnips నుంచి దించుకున్న పాటలు గుర్తుకొచ్చాయి. ఏమ్ ఎస్ సుబ్బలక్ష్మి.. బాల మురళీ.. వంటి ఎందరో మహానుభావులు పాడిన గీతాలు అక్కడ ఉచితంగా దొరుకుతున్నాయి.


చూసారా.. ఇప్పుడు కూడా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో పోతున్నా.. దిశ నిర్దేశం లేకుండా.. ఏమిటిది.. ఎందుకిలా జరుగుతోంది. అప్పుడెప్పుడో ఒకసారి నాలోని ఆలోచనలన్నీ ఒక్కసారిగా కట్ట కట్టుకుని మూట ముల్లె సర్దుకుని నానుంచి నన్నడగకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాయి. ఎంతో కష్టపడి.. ఎన్నో వ్యయ ప్రయాశలకు తలలొగ్గి తిరిగి మామూలు స్తితికి వచ్చేటప్పటికి తలలోని ప్రాణం కాస్తా తోకలోకి వచ్చినంత పనైంది. మరి ఇప్పుడేంటి?? ఆలోచనలే కాదు.. మొత్తం భవిష్యత్తంతా శూన్యంగా తోస్తోంది. నాకు తెలిసినంత వరకూ వైరాగ్యాలు నాలుగు రకాలు. శ్మసాన , శృంగార, భక్తి మరియు ప్రసవ సమయాల్లో కలిగే భావనలే ఆ నాలుగు రకాలు, అని చిన్నప్పుడెప్పుడో మాతాతయ్య గారు చెప్పగా విన్నట్లు గుర్తు. తప్పైతే సరిదిద్ద గలరు. ఇప్పుడు నేనున్న పరిస్తితి వైరాగ్యమా!!! అయితే ఎలాంటిది? అర్దం కావటం లేదే..


అయిన వాళ్ళకి దూరంగా ఉన్నందునా ఈ స్తబ్తత? కానీ వృత్తి లేనిదే భుక్తి గడవదుకదా.. వృత్తి ధర్మం ముఖ్యమా !!! ప్రవృత్తి ముఖ్యమా!! ఏది ఆలోచించుకోవాలి.. ఏమిటిది? నాలో ప్రశ్నలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి? అన్నీ ఉన్నా ఏమీ లేని భావనను ఏమనుకోవాలి? ఇది నాకేనా.. ఇలాంటి భావన నాకే ఎందుకు కలుగుతోంది? నాలో ఏమి లోపించింది? అందరిలాగా నాలో ఉండాల్సిన భావ రాగ ద్వేష కోప తాపాలు ఎక్కడికి పోయ్యాయి? ఈ శూన్యం నన్ను ఎక్కడికి తీసుకు పోతోంది?

 

హమ్మో ఇన్ని ప్రశ్నలే.. వీటిలో దేనికైనా మీ దగ్గర బదులున్నట్లైతే, విన్నవించి ఆదుకో గలరని మనవి.
ఇట్లు
భవదీయుడు

1, అక్టోబర్ 2008, బుధవారం

బంధం - సంబంధం - అనుబంధం | అమెరికాలో నా ఆలోచనలు

ఈ పుట వ్రాద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏవేవో కారణాంతరాల వల్ల ఎప్పటికప్పుడు దాటేస్తూనే ఉన్నాను. ఇక లాభంలేదని ఇదిగో 23వ తారీఖున మొదలు పెట్టాను. చూద్దాం ఎప్పటికి అవుతుందో.. ఇదిగో ఇవ్వాళ్టికి పూర్తి అయ్యింది.

 

అస్సలు విషయానికి వస్తే.. ఆఖరుగా అనుబంధం గురించి వ్రాద్దామనుకున్నా కదా.. ముందుగా కొంత ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతానికి చరిత్ర దగ్గర దగ్గరగా ఓ పాతికేళ్ళు ఉంటాయనుకోండి. అంటే నేను దాదాపుగా పది పన్నిండేళ్ళవాడిని అన్నప్పుడన్న మాట. అన్ని సంవత్సరాల క్రిందటి విషయానికి ప్రస్తుత కాలానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. చదివే మీరే ఆలోచిస్తుంటే.. గత నెలరోజులుగా నన్ను భరిస్తున్న వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

 

పాతికేళ్ళ క్రిందట, ’అక్కా’ అనిపించుకున్న పాపానికి, ఇక్కడ (అంటే అమెరికాలో) గత నెలన్నర నుంచి నన్ను మరియు నా చేష్టలను భరించ వలసి వచ్చిందంటే, వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో .. ఆ పరిస్థితిని మీ ఊహాతీతానికి వదిలేస్తాను. ఇక్కడ పేరులు అంత సమంజసంగా ఉండదేమో అని ప్రస్తావించడం లేదు, కానీ చిన్నప్పుడు నేను భరతనాట్యం నేర్చుకునేటప్పుడు, మా ఇంటికి దగ్గరలోనే ఉండే మరో సహ విద్యార్ధినితో కలసి సంగీత కళాశాలకు వెళ్ళేవాడిని. నేను తనకన్నా చిన్నవాడిని అందులోనూ ఆ అమ్మాయికీ నా వయస్సు తమ్ముడు ఉండటంతో వాళ్ళిద్దరూ నాతో చనువుగానే ఉండేవారు. మాఇంట్లో ఆడ పిల్లలు లేనందున, అందరు ఆడ పిల్లలందరూ మాకు అక్కలే!! అందుకని ఈ అమ్మాయిని.. అక్కా.. అక్కా.. అంటూ పలకరించడమే కాకుండా వాళ్ళింట్లో సరదాగా తిరిగే వాడిని. వాళ్ళింట్లో కూడా ఏమి అనుకునే వారు కాదు. ఆ అమ్మాయి తల్లి తండ్ర్లులు కూడా చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. కాలానుగుణంగా, ఆ అమ్మాయి పెద్దదయి.. చదువు రీత్యా, నాట్యాభ్యాశానికి తీరిక దొరకక పోవడం వల్ల నేను మాత్రమే కొనసాగించడం జరిగింది. ఈ కాలం వచ్చేటప్పటికి, మా నాన్నగారు చిన్న సైకిల్ కొనడం, సైకిల్ మనకి కొత్త.. దానితో సంతోషంలో ప్రపంచాన్నే జయించాం అన్న భావనతో సైకిలెక్కి ఒంటరిగా పయనించడం అలవాటు చేసుకున్నాను. ఇలా పాతికేళ్ళ క్రిందట ’అక్కా’ అనిపించుకున్న పాపానికి.. ఆ అమ్మాయే కాకుండా ఆమె భర్తకూడా, ఇద్దరూ ప్రస్తుతం ప్రతీ వారాంతం నన్ను భరిస్తున్నారు.

 

ప్రస్తుతం నేనువృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను. ఇక్కడ తెలుగు తెలిసిన వారెవ్వరూ లేక పోవడం నన్ను కొంచం ఆందోళనకు గురి చేసింది. ఎవ్వరూ లేరనుకుంటుండగా, ఎడారిలో ఒయాసిస్సులా ఇక్కడ నివసిస్తున్న జంట గురించి తెలిసింది. అంతే.. ’అక్కా..’ అంటూ ఉత్తరం వ్రాయడం, తరువాత ప్రత్యుత్తరం.. ఇలా కొంత మనో ధైర్యం తెచ్చుకుని ప్రయాణం మొదలుపెట్టాను. హైదరాబద్ నుంచి ఆంస్టర్‍డాం వరకూ కొంచం సరదాగే సాగింది. ఆంస్టర్‍డాంలో ఆరు గంటలు వేచి యున్న తరువాత మెమ్‍ఫసిస్‍కు పయనం. ఈ పయనమే అసలు సిసలు నరకం అనిపించింది. తరువాత మరో నాలుగు గంటలు కాలక్షేపం తరువాత మరో గంట ప్రయాణం తరువాత గమ్యస్థానానికి చేరుకున్నాను. ఏమీ తెలియని ప్రదేశం ... దేశం కాని దేశం.. ఎలాగోలా.. హొటల్‍కు చేరుకున్నా. మరునాడు ఉదయం వారిని కలసిన తరువాత పోయిన ప్రాణం లేచి వచ్చినట్లైంది. ఆ తరువాత ప్రతి వారాంతం వారింటికి వెళ్ళడం .. వారి అబ్బాయితో ఆడుకోవడం.. వారితో కలసి ఊరంతా తిరిగి రావడం.. ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి. కానీ ఎటువంటి రక్త సంబంధం లేని వాళ్ళు నన్ను ఎందుకు entertain చెయ్యాలో ఒక్క సారి ఆలోచించండి.

 

ఇక్కడ మరో విషయం, ఉన్న వాడిని ఉండకుండా.. పెద్ద పుడింగ్ లాగా వాళ్ళింట్లో వంట చెయ్యడం మొదలు పెట్టాను.. మొదటి సారి చేసిన కూర నిండా ఉప్పే. ఉప్పగా ఉన్న ఆ కూరను, మొహమాటం కొద్ది తిని, "బాగుంది, బాగుంది .." అని వాళ్ళంటుంటే.. నిజంగా బాగానే ఉందేమో ఆని కొంచం రొమ్ము విరుచుకుని నేను తినడానికి ఉపక్రమించాను. తీరా మొదటి ముద్ద తిన్నాక గాని అసలు విషయం అర్దం కాలేదు. ఉప్పు కశం.. చేసిన తప్పుకి కొంచం సిగ్గేసింది. కుక్కిన పేనులాగా అయ్యింది నాపని. మారు మాట్లాడ కుండా తిన్నాను. రెండవసారి ప్రయత్నించినప్పుడు, ఉప్పు తక్కువైనా .. ఈ సారి కారం కొంచం ఎక్కువైంది. ఇన్ని సార్లు తినే తిండి చెడగొడుతున్నా, ఏమి అనకుండా.. అంతే కాకుండా.. "భలే.. భలే.. బాగుంది.. బాగుంది .." అని వాళ్ళంటుంటే.. వారి పెద్దరికానికి జేజేలు కొట్టాలనిపిస్తోంది. ఏదైనా ఒక వారాంత వెళ్ళడానికి కుదరలేదనుకోండి, అక్కేమో నాకు కాల్ చేసి... ఎక్కడున్నావు.. ఏమి చేస్తున్నావు.. అని ఆడుగుతుంది. ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే, ఏమయ్యానో అని తాను కంగారు పడుతుంది. అమెరికాలాంటి చోట్ల ప్రజలకు ఆనందానికి దొరికేదే వారాంతం. అట్టి వారాంతాలలో నాలాంటి వాడు వెళ్ళి పెద్ద పుడ్డింగ్ లాగా వాళ్ళ కాలాని చెడగొడుతూ ఉంటే.. ఎవ్వరైనా ఎందుకు భరిస్తారు? ఎంతకాలం భరిస్తారు? మరి వీళ్ళేంటీ.. వీళ్ళు మనుష్యులు కారా.. వీరికి కోపతాపాలు ఉండవా? నా మానసిక స్థైర్యం కోసం వీళ్ళ కాలాన్ని బలి ఇవ్వాలా?

 

ఇలా ఆలోచిస్త్తూ ఉంటే.. ఈ పుటకి మూల పదమైన "అనుబంధం" అనే పదం గుర్తుకు వచ్చింది. మన సంసృతిలో .. చుట్టరికాలు ఉండనక్కరలేదు.. కానీ ఆప్యాయతగా .. అక్కా.. అనో .. మామా .. అనో.. తాతా.. అనో .. పిన్నీ .. అనో.. పలకరించే పలకరింపు వెనుక ఎంతటి అనుబంధం ఉందో కదా అనిపిస్తుంది. ఈ అనుభూతి నాకేనా.. లేక మీకు కూడానా..

 

మీ స్పందనలకై ఎదురుచూస్తూ ఉంటాను,
ఇట్లు,
భవదీయుడు

20, సెప్టెంబర్ 2008, శనివారం

దేవుడా!! నిన్ను ప్రశ్నించే వారు ఎవ్వరు???

క్రిందటి వారం మొదటి సారిగా చాలా దగ్గర నుంచి కొంత మంది అవిటి వారిని చూడడం జరిగింది. వారిలో ఒక తల్లి ఇద్దరు కూతుళ్ళు. తల్లి చక్కగా గుండుగా నిండుగా ఆరొగ్యంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఇద్దరు ఆడ పిల్లలలో, ఒక అమ్మాయి గుడ్డిది, మరొక అమ్మాయికి కాళ్ళు సరిగా ఉన్నట్లు లేవు. క్రచ్ పట్టుకుని నడుస్తోంది. ఫుట్‍పాత్ మీద నుంచి బస్సులోకి ఎక్కడానికి అచ్చంగా మూడున్నర నిమిషాలు పట్టింది. ఇంతక ముందు చెప్పినట్లుగా రెండవ అమ్మాయి గుడ్డిది. బస్సు ద్వారానికి కొంచం దూరంగా ఉండి తలుపు కోసం వెతుకుతోంది. ఆగని మనసు, గబుక్కున దిగి దారి తెలియ జేయడానికి ప్రయత్నం చేసాను. ఆ అమ్మాయి కర్ర పట్టుకుని తలుపు ఉన్న చోట కొట్టి చూపించాను.

 

నా ఈ చర్యని జీర్ణించు కోలేక, నన్ను, నా సయాహాన్ని సున్నితంగా తిరస్కరించింది. వెనకనే ఉన్న వాళ్ళ తల్లి నిదానంగా నాతో, ’వాళ్ళని తెలుసుకో నివ్వండి’ అంది. ఇలాంటి స్పందన నేను ఎదురు చూడక పోయినా, నా తొందర పాటుతనానికి కొంచం సిగ్గేసింది. వెంటనే క్షమాపణలు తెలియజేసి నా చోటులో నేను కూర్చున్నా. ఇదంతా గమనిస్తున్న ఆ బస్సు నడిపే అమ్మాయి, నా పరిస్థితిని అర్ధం చేసుకుని సున్నితంగా ఇలా అంది, ’ఇలా మనం సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? కాబట్టి వాళ్ళంతట వాళ్ళు అడిగేటంతటి వరకూ సహాయం చెయ్యకండి’.

 

వారిని చూసిన తరువాత, చాలా భాధ వేసింది. వాళ్ళని చూసి నేను ఎందుకు భాధ పడ్డానో అని ఆలోచించి, అస్సలు మనం ఎందుకు భాధ పడాలి? అని నన్ను నేను తిరిగి ప్రశ్న వేసుకున్నాను. అలాంటి వారిని చూసి ధైర్యాన్ని పెంచుకోవాలి కానీ భాధని ఎందుకు పెంచుకోవాలి? ఇలాంటి వారిని అవిటి వాళ్ళు అని మనం వాళ్ళని తక్కువ చేసి సంభోదిస్తున్నామా అని కూడా అనిపించింది. కానీ వీళ్ళని అంగ వైకల్యంతో భాధ పడుతున్న వాళ్ళు అనుకోవాలా.. లేక అంగ వైకల్యాన్ని అలాగే ఇలాంటి వైకల్యాన్ని ప్రసాదించిన ఆ దేవుడిని ఎదురించి, తెగించి జీవితంలో అనుక్షణం పోరాడుతూ అలుపెరుగని సుశిక్షుతులైన సైనికులుగా తలచుకోవాలా అన్న సంగ్ధిద్ఘంలో పడ్డాను.

 

అవును, చాలా మంది మానశికంగా కృంగిపోయి ఆత్మ న్యూనతా భావంతో ఎవ్వరి ఆశరా లేకుండా ఇంటిలోంచి కదలరు. అలాగే మరికొందరు, అన్నింటినీ తెగించి ఆత్వ స్థైర్యమే ఆలంబనగా వారెవ్వరికీ తీసిపోనట్లుగా మున్ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి వారిని గురించి తలంచి నప్పుడల్లా పిరికిపందలుగా ఆత్మహత్య చేసుకునే వారు వీరినెందుకు గమనించరు? ఇలాంటి వారి నుంచి స్పూర్తి నెందుకు పొందరు? జీవితం అనేది జీవించడానికే గానీ చావడానికి కాదని ఎందుకు తెలుసుకోరు? చావడం అనేది క్షణకాల క్రియ, కానీ జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం, క్రింద పడినా లేచినా సాగి పోవాలి కానీ కృంగి పోకూడదని ఎందుకు తెలుసుకోలేరు? అస్సలు తెలుసు కోవాలనుకునే ఆలోచన ఇలాంటి వారికి ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎదో వ్రాద్దామని మొదలు పెట్టి ఎదేదో వ్రాస్తున్నా.. అస్సలు విషయానికి వస్తా..

 

ఇలాంటి పిల్లలున్న తల్లి తండ్రులు గానీ ఇలాంటి పిల్లలు గానీ, దేవుడిని ఎప్పుడైనా ప్రశ్నిస్తే .. ఏమని ప్రశ్నిస్తారు అన్న ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. నా ఈ పుఱెకు పుట్టిన ఆలోచనలే ఈ పుటకు మూలం

 


మొదట.. తల్లి తండ్రులు

దేవుడా!!! మేమేమి పాపం చేసాము, మాకు ఇలాంటి పిల్లల నిచ్చావు? వీళ్ళ భాధని చూడలేక మేము పడే భాధకి ఉపశనమేమి? ఒక వేళ మేమే కనుక తప్పు చేసి ఉంటే, పాపపు పనులు చేసి ఉంటే, వాటి ప్రతి ఫలాన్ని మేము అనుభవించాలి గానీ, మా పాప భారాన్ని ఈ పసి కందులకు ఎందుకు ప్రసాదించావు?

 


పిల్లలు

వీరు ప్రశ్నించడం కన్నా, ’ఇదిగో మీకు.. ఈ అంగవైకల్యాన్ని ఇస్తున్నా.. ఎలా బ్రతుకుతారో చూస్తా..’ అని ప్రశ్నిస్తున్న దేవుడికి.. చిరు నవ్వుతో, ఆ ప్రశ్నకు జవాబుగా.. ఇదిగో .. ఇలా .. అనుక్షణం నీ అవలక్షణాన్ని ఎదుర్కుంటూ.. సాటి మనుష్యులకు సాటిగా బ్రతుకు సాగిస్తున్నాం .. సాగిస్తూ ఈ భవసాగరాన్ని అవలీలగా దాటేస్తాం.. అని చెప్పకనే చెబుతున్న వారి జీవన యానం, ఆ దేవునికి ధాటిగా .. ధీటుగా సమాదానం ఇస్తున్నారనిపిస్తోంది.

 


నేను

అసలు ఇవ్వన్నీ కాదండీ.. నాకే ఇంత భాధగా ఉందే.. చూసే వాడిని, నాకే, ఇంత ఇదిగా ఊందే.. ఇంక పడే వాళ్ళకి ఎలా ఉంటుంది? పాపం పసి కందులు .. ఎంతో మంది.. మరెంతో మంది.. ఈ జీవన పోరాటాన్ని సాగిస్తున్నారే.. ఎందుకిలా జరుగుతోంది? ఏమి ఉద్దరిద్దామని ఆ దేవుడు ఇలాంటి వాళ్ళని శృష్టిస్తున్నాడు?

 

ఏం.. ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరా?? లేరనా!! ఆయనది ఈ నియంకృశత్వం?? ఒక వేళ ప్రశ్నించినా సమాధానం చెప్ప వలసిన అవసరం లేదనా ఆయన భావన??

11, సెప్టెంబర్ 2008, గురువారం

బంధం - సంబంధం - అనుబంధం | అమెరికాలో నా ఆలోచనలు - ౩.౧

ఈ శీర్షిక మొదటి పుట కొంచం సంచలనమే పుట్టించినట్లు కనబడినప్పటికి, రెండవ పుటపై ఎవ్వరి స్పందన కనబడ లేదు. ఏమో !!! మనకెందుకులే అనుకుని ఉంటారు. ఈ విధంగా ఆలోచిస్తోంటే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన ఆంగ్ల సామెత ఒకటి గుర్తుకొస్తోంది. ఈ సామెతలో మొదటి భాగం దాదాపుగా అందరికీ తెలుసు, కానీ మిగతా భాగమే ఎక్కువ మందికి తెలియదు అని నా అభిప్రాయం. ఒక వేళ తమరు కనుక తెలిసిన వాళ్ళలో ఉన్నట్లైతే, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి ముందుకు సాగిపోండి.

something is better than nothing

ఈ విషయం చాలా మంది తెలిసే ఉంటుంది. కొంచం నాటుగా చెప్పాలంటే, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు, ఏమి లేని కాడికి అంతో.. ఇంతో.. ఎంతో కొంత.. మెరుగేకదా!!! నేనూ ఇలాగే ఆలోచిస్తూ ఉండే వాడిని. కానీ ఒకరోజున నాన్నగారు నేను ఏదో పిచ్చా పాటి మీద తార్కికంగా మాట్లాడుకుంటున్నాం (మాట్లాడుకుంటున్నాం అనే కన్నా.. పోట్లాడుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది... లెదా కొంచం పాష్‍గా చెప్పాలంటే.. ’చర్చించు కుంటున్నాం’ అంటే ఫరవాలేదేమో.. ఏదైతే ఏంటి..)  మా మధ్య అస్సలు విషయం కొంచం ముదిరి పాకాన పడింది. అదిగో అప్పుడు వచ్చింది, పాశుపత్రాశ్త్రం లాంటి ప్రశ్న మా నాన్నగారి దగ్గర నుంచి.

something is better than nothing అని నేను ఒప్పుకుంటాను, but now tell me, "When NOTHING is better?"

అప్పట్లో ఈ ప్రశ్నకి నా దగ్గర సమధానం లేదు. కొన్ని విషయాలు మానాన్నగారు వెంటనే మాతో చర్చించరు. అందుకని ఆనాటి చర్చ అప్పటితో ముగించి నన్ను ఇరకాటంలో పడేశారు. సరే.. కొంత కాలం నేను కూడా ఆలోచించాలి కదా అని నేనూ ఈ విషయంపై దృష్టి సారించి చించడం మొదలు పెట్టాను. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా.. చించా..

 

ఎంత చించినా అసలు విషయం భోధ పడదే.. ఇక లాభం లేదనుకొని, "తండ్రీ శరణం .." అనేసాను. అదిగో అప్పుడు శ్రీ కృష్ణుడు పెట్టినట్లు ఓ పెద్ద ఫోజ్ ఇచ్చి ... ఓ పెద్ద కధ చెప్పి.. ఆఖరుగా..


" nothing is better than nonsense "


అని చావు కబురు చల్లగా చెప్పారు. ఏమిటి ఇక్కడ ఏమీ కనబడటం లేదు అనుకుంటున్నారా.. ఒక్కసారి మీ కీ బోర్డులోని Ctrl + A నొక్కి చూడండి అసలు రహస్యం బయట పడుతుంది. కధనంలో పట్టు తప్పుతుందేమో అని ఇదిగో ఇలా దాచానన్నమాట. ఈ ట్రిక్ ఎలా ఉంది? నేను ఏమీ అనుకోను చెప్పండి.

 

ఎందుకో ఈ మాట నిజంగానే చద్ది మూట లాగా అనిపించింది. తినగా తినగా వేము తియ్యనుండు అన్నట్లు, చించగా చించగా ఆ మాటల్లోని భావం మెల్ల మెల్లగా కాలంతోటి అనుభవం లోకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా నంటే, ఇక్కడి (అమెరికాలోని) ప్రజల్ని.. వారి వారి రీతులను గమనించిన తరువాత వీరు కూడా ( ఎక్కువ శాతం..) ఈ ఆలోచనతోనే ఉన్నారనిపిస్తోంది. ఈ పుటలో మూడవ పదం గురించి వ్రాద్దామనుకున్నంతలో something - nothing - nonsense విషయమే ఎక్కువై నందున, మరొక పుటలో మళ్ళీ కలుద్దాం .. అంత వరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

-----------------------------
మాటలాడ వచ్చు మనసు నిల్పగ రాదు, తెలుప వచ్చు, దన్ను దెలియ రాదు
సురియ బట్ట వచ్చు శూరుడు గారాదు, విశ్వధా అభిరామ వినురవేమ

9, సెప్టెంబర్ 2008, మంగళవారం

బంధం - సంబంధం - అనుబంధం : అమెరికాలో నా ఆలోచనలు ౨

మొదటి పుట చదవని వాళ్ళు ముందుగా దానిని చదివి తరువాత ఈ పుట దర్శించమని మనవి. మొదటి పుట చదివిన తరువాత పడ్డ మొట్టికాయలు కూడా చదవడం మర్చిపోవద్దు. మొట్టికాయల ప్రవాశం చదివిన తరువాత, ఇంత మంది ఇంతగా ఇదిగా చెబుతున్నారంటే.. వీరు స్పందించిన విషయాలు ఎంత వరకూ సమంజసం .. లేక నా ఆలోచనలలో ఎదైనా తేడా ఉందా అన్న సంశయం నన్ను ఈ రెండవ పుటను ప్రచురించే సమయాన్ని కొంచం ఆలస్యం చేసింది. ఏది ఏమైతేనేమీ, ఆలోచనలతో కర్తవ్యాన్ని మరవకూడదని, ఆలోచనలను ఆపకుండా, సమాంతరంగా వాటి పని వాటిని చేసుకోనిస్తూ ఇదిగో ఇక్కడ ఇలా. ఈ పుటలో "సంబంధం" అనే విషయాన్ని ’అమెరికాలో నివసిస్తున్న వారు ఎలా అనువదించుకుంటున్నారో’ అని నాకు అనిపించిందో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.

తెలుగులో పదాలన్నీ ఒకేలాగా అనిపుస్తున్నా.. నాకు మాత్రం "బంధం" అనేది ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించినదని, "సంబంధం" అనేది తప్పని సరిగా వ్యక్తులకు మాత్రమే కాదు గానీ ఒక వ్యక్తికి మరియు ఒక వస్తువుకు మధ్య ఉండేది కూడా కావచ్చు అనిపిస్తోంది. అందుకని ఇక్కడి మనుష్యుల మధ్య మాత్రమే కాకుండా ఇక్కడి ప్రతీ వ్యక్తీ తనతో అవసరం ఉన్న ప్రతీ వస్తువైనా / మనిషైనా / మరి ఏదైనా.. వంటి వాటి యందు ప్రవర్తిస్తున్నారో అని గమనించిన తరువాత నాకు అవగతమైన విషయాలు మాత్రమే ఈ పుట. ఇంతక ముందు చెప్పినట్లుగా ఈ పుట నేను ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాస్తున్నది కాదు. కాబట్టి ఎవ్వరూ తప్పుగా భావించరని తలుస్తాను.

అసలు విషయానికి వచ్చేముందు ఒక చిన్న ఉపోద్ఘాతం.. నేను భారతదేశంలో ఉండేటప్పుడు, తప్పని సరిగా వారానికి ఓ రెండు సార్లో (అధమ పక్షం) లేదా రోజూనో, మా అన్నయ్య ఫోన్ చేసి, ఎలా ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అంతా బాగానే ఉందా.. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఒక వేళ నేను ఆఫీస్ లో ఉంటే, కాల్ కట్ చేసి, నేను ఇంటికి వెళ్ళిన తరువాత నేను కాల్ చేసి వివరాలు అడుగుతూ ఉంటాను. ఈ తతంగం అంతా మా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది. ఇది మా మధ్య ఉన్న అతి సాధారణ మైన పని. అవసరం ఉన్నా లేక పోయినా ఫోన్ చేసి.. ’ఎలా ఉన్నావు’ అని పలకరించి పెట్టేస్తాం.

 

ఏదైనా విషయం ఉంటే ఓ పది నిమిషాలు పిచ్చాపాటి, లేకపోతే ఒక్క నిమిషం పని. అంతే. ఇక్కడేమో (అంటే అమెరికాలో..) ఎవ్వరికైనా ఫోన్ చేసి ’ఎలా ఉన్నార’ అని అడిగామో .. అంతే, వెంటనే ఎదుటి వాళ్ళు (వాడితో) ఏదో పని ఉండే చేశారనుకుంటారు. మనం ఏదీ అడగక ముందే, ’మేమేమైనా చెయ్యగలమా..’ అని అడిగేస్తారు. అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది స్పందన ఇలాగే ఉంది. ఇది వాళ్ళ గొప్పతనం అనుకుందాం. ’అక్కరలేద’ అని అన్న వెంటనే, పెద్ద.. పని లేనప్పుడు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసావు అన్నట్లు ఒక ఫీలింగ్ పెట్టి అయితే  ’అస్సలు సంగతేమిటో చెప్పి ఏడు..’ అన్నట్లు ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తారు.

 

దీనిని బట్టి ఇక్కడ public relation అనే మాటకి అర్దం లేదనిపిస్తోంది. ఎవ్వరైనా తమను పలకరిస్తుంటే, ఆనందం కన్నా ముందు భయాన్ని పెంచుకుంటున్నారు. ఏమన్నా అన్నమనుకోండి, ఎదుటి వాళ్ళు తమనుంచి ఏదో ఆశిస్తున్నారు అందుకనే తమని పలకరిస్తున్నారు అని ఆలోచిస్తారు. అనవసరంగా ఒకరినొకరు పలకరించుకోరు. ఏదైనా పని ఉంటేనే ఇద్దరు మాట్లాడుకుంటారు, అది సహోధ్యోగులైనా, మన ఇంటి ప్రక్కన నివశిస్తున్న వారైనా, మరి ఇంకెవరైనా. మరి భార్య భర్తల విషయమేమిటో!!! (నాకు తెలియదు...)

ఈ ప్రవర్తన ఇద్దరు మనుష్యుల మధ్యనే అనుకుందాం అనుకుంటే.. అంతటితో ఆగి పోలేదు. ఇక్కడి (అమెరికాలోని) వాళ్ళు చాలా సాధారణంగా కార్లు ఉపయోగిస్తారు. చాలా అసాధరణంగా ద్విచక్ర వాహనాలు వాడతారు. వ్యాయామానికి మాత్రమే ద్విచక్ర వాహనాన్ని వాడుతారు. ఇక్కడ నాకు తిరగడానికి కారు లేనందున, వీలైతే సౌఖ్యంగా ఉంటుంది కదా అని ఒక సైకిల్ కొంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. అన్నదే తడవుగా ఎవ్వరు అమ్ముతారు ? ఎంతలో ఉంటాయి? అని పరిశోధించడం మొదలు పెట్టాను. ఈ ప్రయత్నంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అర్దమయ్యాయి. సైకిల్ విషయం అనగానే.. నా గతం.. సైకిల్ తో నాకు ఉన్న అవినాభావ సంభంధాన్ని ఈ ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనిపించింది.

 

నాకు గుర్తున్నంత వరకూ నేను ఏడో తరగతి ఉత్తీర్ణుడినైన తరువాత నాన్నగారిని సైకిల్ కొనిపెట్టమని పోరితే ఎనిమిదవ తరగతి అయ్యిన తరువాత (దాదాపుగా 1983 లో అనుకూంటా) ఒక చిన్న సైకిల్ కొనిపెట్టినట్లు చూచాయగా గుర్తు. అప్పుడు దానిమీద ఉదయం పూట సంగీత కళాసాలకు అలాగే సాయంత్రం టూషన్ కు మాత్రమే వెళ్ళనిచ్చే వారు. ఎందుకంటే ఆ వేళల్లో ఎక్కువ రద్దీ ఉండదు మిగిలిన వేళల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, తెలిసో తెలియకో దేనికైనా గుద్ది గాయ పడతామో అని వారి అభిప్రాయం.

 

కానీ కొనిచ్చే ముందు వారు పెట్టిన షరత్తేమిటంటే, ’తొక్కినా తొక్కక పోయినా.. రోజూ సైకిల్ ని గుడ్డ పెట్టి తుడవాల్సిందే’. వర్షాకాలంలో ఎక్కువగా తొక్కేది ఉండదు. అందుకని ఎక్కువ కాలం లోపలే ఉంటుంది. ఆ వేళల్లో చక్కగా నూనె వేసి తళ్ళుక్కు మనేటట్లుగా రుద్ది రుద్ది మరీ శుబ్రం చేసేవాడిని. ఆ తరువాత కాలేజీ కి వచ్చిన తరువాత రేంజర్ సైకిల్ ఒకటి అమ్మ కొనిబెట్టింది. (చూచాయగా 1992 Decemberలో) దీనికీ వాళ్ళెవరూ చెప్పకపోయినా, అలవాటైన ప్రాణం కదా.. ఎవ్వరూ చెప్పనక్కరలేదు. ఆ తరువాత ఉద్య్గోగంలోకి వచ్చిన తరువాత ద్విచక్ర వాహనం. Feb 2002 లో కొన్నాను. Oct 2nd 2006 లో నేను ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో కాపురం మొదలు పెట్టాను. అప్పటి వరకూ నా బండిని నేనే తుడుచుకునే వాడిని. ప్రస్తుతానికి నేను తుడవక పోయినా, మా అపార్టుమెంటు వాచ్ మెన్, ’అయ్యా నేను తుడుస్తా.. నెలకు ఎంతోకొంత ఇవ్వండి’ అనడంతో మానేశాను. కానీ క్రమం తప్పకుండా నేనే దగ్గరుండి సర్వీసింగ్ చేయించుకుంటాను.

కానీ ఇక్కడి (అమెరికాలోని) వ్యక్తులను గమనించిన తరువాత, ఒక్క విషయం అర్దం అయ్యిందేమిటంటే. పనిచేస్తోందా, కానీయి. రిపేరుకు వచ్చిందా, మూల పడేయి, అంతే.. వెంటనే, కొత్తది కొన్నుక్కో. ఇక్కడ (అమెరికాలో) అప్పుడప్పుడు గరాజ్ సేల్స్ అనేవి జరుగుతుంటాయి. వీటి ఉద్దేశ్యమేమిటంటే, వారికి అవసరం లేనివి లేదా పనికిరాని వస్తువులు, ఎలా ఉన్న వస్తువులను అలా, యధావిధిగా అమ్మెస్తారు, కొనేవాళ్ళు అందుకు సిద్దమైతే ముందుకు వెళ్ళాలి. వీలైతే అమ్మెస్తారు, లేదా పారేస్తారు. వాటి స్థానంలో కొత్తవి తెచ్చుకుంటారు.

 

చాలా తక్కువ మంది తగిన పరికరాలు తెచ్చుకుని చెడిపోయిన వాటిల్ని బాగుచేసుకుని తిరిగి వాడుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కళ దగ్గర అధమ పక్షం రెండు సైకిళ్ళు పనిచెయ్యనివి ఉండటం గమనించాను. ఇలా చెడిపోయిన వస్తువుల్ని బాగుచేసుకుని వాడుకుందాం అని అన్నాననుకోండి, మన Independent లాంటి వాళ్ళేమే నాది చీపు మనస్తత్వం అంటారు. ఏమి చేస్తాం, కష్టం లోంచి పుట్టి పెరిగిన వాళ్ళం కదా, మాదంతా మట్టి వాసనే మరి. మా చమట కూడా వాసనే..

 

ఆఖరుగా చెప్పొచ్చినదేమిటంటే, "సంబంధం" అనేది "అవసరం ఉంటేనే" అని మాత్రమే వీరి అభిప్రాయము అనిపిస్తోంది. నేను తప్పుకావచ్చు. చదువరులు అచ్చు తప్పులెక్కడ ఉంటే అక్కడ ఎలాంటి పదం ఉంటే బాగుంటుందే తెలియ జేస్తారని తలుస్తాను. మరో పుటలో "అనుబంధం" గురించి వ్రాయడానికి ప్రయత్నిస్తాను. అంత వరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

--------------------------
మేడిపండు జూడ మేలిమై యుండున్, పొట్ట విచ్చి చూడ పురుగు లుండు
బెరుకువాని మదిని బింక మీలాగురా, విశ్వదా అభిరామ వినురా వేమా

5, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ఆహ... మొట్టికాయలు బాగానే పడ్డాయి..

నా క్రిందటి పుట, ’బంధం - సంబంధం - అనుభంధం | అమెరికా లో నా ఆలోచనలు - ౧’, నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనలకు నోచుకుంది. ఇన్ని ఎక్కువ స్పందనలకు నోచుకున్న మొదటి పుట ఇదే. ఇన్ని స్పందనలు గమనించాక, చదువరులు స్పందించిన తీరు చూస్తూ ఉంటే... కొంత మంది నేను కనిపిస్తే కల్చేసేటట్టున్నారే.. అన్నింటికీ కలిపి ఒక పుట నా స్పందనగా ప్రచురిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన తరువాత సమూహంగా అందరికీ .. ఇదిగో .. ఈ క్రింద విధంగా..

ముందుగా..


శంకరగిరి నారాయణ స్వామి గారి స్పందనేమో, సున్నితంగా మొట్టికాయ వేసి.. భడవా!! కొంచం జాగ్రత్త.. ఇంకొంచం స్పీడు పెంచావో మూతి పళ్ళు రాలి పడతాయి అన్నట్లుగా అనిపిస్తోంది. అంతే కాకుండా మొన్నామధ్య మన (ఇలా మన అని అనవచ్చో లేదో) భారత దేశానికి చెందిన వనిత.. పేరేంటబ్బా.. హా... గుర్తుకొచ్చింది.. సునీతా విలియమ్స్ .. (అయ్యయ్యో.. ఈమె కూడా వేరే దేశస్తుడిని పెళ్ళి చేసుకుంది కదా..) చెప్పినట్లుగా .. సరిహద్దులు లేని స్థావరం ఉంటే ఎలా ఉంటుందో .. జాతి మత భేధాలు లేకుండా మనుషులను చూడటం అలవాటు చేసుకొరా వెధవా.. అన్నట్లుంది. ఏమో నేనింకా ఈ Globalizationకి అలవాటు పడలేదు కదా.. ఇంకా కొంచం local గానే ఆలోచిస్తున్నా.. ఏమి చేస్తాం.. manufacturing defect..

 

అలాగే.. "పెద్దైన తరవాత వీరిని ఏమి అనాలో అని మిరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏదైనా ఎందుకు అనాలి? వారిని మానవులుగా చూస్తే పోలేదా?" అని ప్రశించారు. హు.. అలాగే చూడాలి అని నేను అనుకుంటున్నాను. అందరిని మానవులుగానే చూస్తూ పోతే.. ప్రతీ వ్యక్తి నివాశం ఉండేందుకు ఒక చోటు కావాలి కదా.. అది సమాజమైతే / సంఘమైతే బాగుంటుంది అని కదా అందరూ అనుకుంటాము .. అంతే కానీ సమాజానికి దూరంగా, అడవిలో ఉండలేం కదా.. అట్టి ప్రతీ సమాజానికి కొన్ని పద్దతులు .. రీతులు.. విలువలు .. వ్యవహారాలు.. వగైరా వగైరా.. ఇంకా .. ఇంకా.. ఏవో ఏవో ఉంటాయి కదా.. ప్రతి పిల్లవాడి Birth Certificate మీద Religion అనే చోటు ఎందుకు? చక్కగా తీసేయ వచ్చుకదా.. ఎందుకు తీయ్యలేదంటారు? ప్రతీ వ్యక్తీ యొక్క మూలాలు ఏమిటో తెలుసుకునేందుకే ఈ పని అని నా అభిప్రాయం. That gives the main identity of the individual from which kind of culture that he / she grew up. అట్లాంటి ప్రధాన గుర్తింపుని తీసేసి చూడడమంటే, ఎందుకో మనసు అంగీకరించడం లేదు.

 

శంకరగిరి గారూ.. క్షమించండి.. నేను అంత విశాల హృదయం ఉన్నవాడిని కాదు. Am little narrow minded, and am proud being what I am. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి నాకు ధైర్యం ఉంది. అలాగే ప్రతీ వ్యక్తీ తాను చేసిన పనులకు లేదా తన వ్యక్తిత్వానికి గర్వపడుతూ ఉంటూనే ఉంటాడు. I'm sure that every one is proud for what they are.

ఏది ఏమైనా, తమరి సలహాని అన్యధా గుర్తు పెట్టుకుంటాను.


ఇక Independent గారేమో నాది "చవక బారు సంస్కారమని..  cheap character.." అని నా బ్లాగులో ధైర్యంగా స్పందించారు. కొంచం కలవర పరచే విషయమైనా.. నిజాన్ని నిజంగా, నిర్బయంగా తెలియజేస్తే తప్పేంటిలే అని తలంచి, ఆయన స్పందనని moderate చెయ్యకుండా యధా విధిగా publish చేశాను. ఇక్కడ నిజం అనేది నాది చవక బారు సంస్కారమని కాదు, Independent గారి స్పందన అని గమనించ గలరు. నాది చవకబారు సంస్కారమైతే, మరి వీరి సంస్కారమేమైందో? సీతను అపహరించిన రావణాశురుడిని ఉద్దేశించి ప్రసంగించిన హనుమంతుడు, ఎక్కడా.. ఎప్పుడూ రావణాశురుడుని దూషించినట్లు లేదు, వీరిద్దరి సంభాషణలలో హనుమంతుడు రాముని యొక్క గొప్పతనాన్ని మాత్రమే వర్ణిస్తూ.. ’నీ మేలుకోరే చెబుతున్నా.. సీతని రామునికి తిరిగి అప్పగించు’ అని అన్నాడే గానీ.. ’నువ్వు వెధవవి.. నువ్వు సీతని తెచ్చిన తీరు చెడ్డది.. వగైరా .. వగైరా..’ అంటూ ఏమీ అనలేదే.. అదీ సంస్కారమంటే .. స్వశ్తుతి మరియు పరనింద ఎప్పుడూ మంచివి కాదు. ఈ విషయం ఈ మహానుభావునికి ఎప్పటికి అవగతమయ్యేనో.. పైగా నాది cheap character అంట.. మరి వీరిది ఎంతటి గొప్ప characteరో.. పైగా నన్ను .. "గ్రో అప్పు మై డియర్ .." అంట.. వీరెంత గ్రో అప్పు అయ్యారో..

 

ఏది ఏమైనా.. అయ్యా ఊరు పేరూ లేని Independent గారూ.. ముందు తమరు ముసుగు తీసి తమ నిజ స్వరూపమేమిటో నలుగురికీ చూపించే ధైర్యం తెచ్చుకోండి అంతే గానీ ఇలా దాక్కుని ’ముసుగు వీరుడుని’ అని గర్వ పడకండి. తమ ఉనికిని దాచుకునే వారు అయితే పిరికి పందలైనా అయ్యుండాలి లేదా విద్రోహ శక్తులైనా అయ్యుండాలి అని నా అభిప్రాయం.అదీ ఇదీ కాకపోతే అదేదో ఆంగ్ల సినిమాలో చూపించి నట్లుగా తమరేమీ Zorro గానీ / The Shadow హీరోగానీ / ఇలాంటివే మరేదైనా కాదు కదా.. ఇలాంటి వాళ్ళు కూడా తమ ఉనికిని దాచుకున్నా ఎదో ఒక ప్రతి రూపంలో కనబడుతునే ఉన్నారు. ప్రపంచం అంతా విస్తుపోయేటట్లు చేసిన కొన్ని మరణాల్లో ఒకటైన డయనా  కూడా తన ఉనికిని ఎక్కడ దాచుకోలేదు. తమరేమీ అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు కాదు కదా.. అంతటి ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులే తమ ఉనికిని దాచుకోనప్పుడు తమరింకా తమ ఉనికిని దాచుకుంటున్నారంటే.. ఇదేదో గూఢాచార వ్యవస్తలాగా అనిపిస్తోంది. తమరు నిరాధారులు కదా, అంతే లేండి. తమలాంటి వారు ఎవ్వరి మీద.. ఎలాంటి పేరు మీద అధార పడరు.. అయినా నాకెందుకులేండీ తమరి పుట్టు పూర్వోత్తరాలు. తమరన్నారు కదా నాది చీపు కారక్టరని.. అలాగే అనుకుందాం కొంత సేపు. తమరేమో గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళాయె. ఆ వ్యక్తిత్వాన్ని తమరి దగ్గరే ఉంచుకోండి, నలుగురికి పంచితే కరిగి కొంచం తరిగి పోతుందేమో .. జాగ్రత్త.

 

ఇక తమరి అడిన వాటికి, ’ఇలాంటి జాబితా అంటే ఏంటండీ మీ ఉద్దేశం? వేరే మతం వాళ్ళనీ, వేరే దేశం వాళ్ళనీ పెళ్ళి చేసుకున్నవాళ్ళు ఏ జాబితా? అలాగే వివిధ కారణాల వల్ల ఒక రిలేషన్షిప్ లోంచి, ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళే వాళ్ళు ఏ జాబితా?’, సమాధానం ఈ పుటలో ఒక చోట, ’జాతి మత భేధాలు లేకుండా ఒకటై, వసుదైక కుటుంబంలాగా కలసి మెలసి బ్రతుకుతున్నారు’ అని చెప్పినట్లు గుర్తు.. గమనించారా... కాబట్టి అలాంటి వారందరిని కలిపి వసుదైక కుటుంబీకులు అని అంటారు. ఇది నా అభిప్రాయం, తమరికి నచ్చక పోతే.. క్షమించండి.. ఏమి చేస్తాం నేను జీన్స్ పాంట్లు వేసుకోను.. అదేదో సినిమాలో చెప్పినట్లు.. నాదంతా కొంచం old fashion లేండి. నాలాంటి వాళ్ళని ఆ దేవుడే మార్చాలి.


ఇక అబ్రకదబ్ర అనీల్ గారి స్పందనల విషయానికొస్తే.. వీరి స్పందనలు చదువుతోంటే.. నా మాటల్లో ఇన్ని అర్దాలు, అపార్ధాలు, ఇన్ని నానా అర్దాలు ఉన్నాయా అని , కొంచం కొత్తగా మరికొంచం వింతగా అనిపించింది.

 

అయ్యా అబ్రకదబ్ర అనీల్ గారూ.. తమరు విచ్చేసినందులకు ధన్యవాదాలు.. అలాగే తమరు ఇక రానందులకు నెనర్లు. నాదంతా ఒకే పద్దతి. నా ఇంటికి వస్తే ఒక దణ్ణం, రానంటే మరో దణ్ణం. అంతే తప్పితే ఎవ్వరినీ బలవంత చేసేది ఏమీ లేదు. గాడిదనైనా గుర్ఱానైనా నీళ్ళదాకా లేదా గుగ్గిళ్ళ దాకా మాత్రమే మనం తీసుకెళ్ళగలం అంతేగానీ, వాటి చేత తాగించడమో తినిపించడమో చెయ్యలేం కదా.. పైగా తమరి స్వాతంత్ర్యాన్ని హరించే శక్తి నాకు లేదు. ఏది ఏమైనా తమరి స్పందనకు అన్యధా కృతఙ్ఞుడను. సరిగ్గా వ్రాసానో లేదో, I'm very much thankful for your visit and for your comments as well.


ఆఖరుగా, ఏది ఏమైనా.. కాలానుగుణంగా నా ఆలోచనలు ఉంటాయి అని మీరందరూ గమనించాలి. ఇవాళ్టి నా ఈ అభిప్రాయాలు రేపు మారవచ్చు, every thing is possible.. but only with time. అంత వరకూ just don't jump onto your conclusions. ప్రత్యేకంగా నన్ను నా బ్లాగులోనే దూషించే సాహసం చెయ్యవద్దని మనవి. మీకు కూడా బ్లాగులు ఉన్నాయి కదా.. చక్కగా మీ ఇష్టం వచ్చినట్లు నాకు అక్కడ తలంటేశేయ్యండి. ఎవ్వడు కాదంటాడో చూస్తా..

 

ఓ.. మర్చిపోయ్యాను.. మన Independent లాంటి వారు ఎవ్వరి మీదా.. అంటే ఎలాంటి ఒక్క బ్లాగు మీద ఆధార పడరుకదా.. (క్షమించేయ్యాండి సారూ.. ఓ Independent గారూ).

4, సెప్టెంబర్ 2008, గురువారం

మొదటి అమెరికా ప్రయాణ చిత్రాలు

మొదటి సారి నేను అమెరికా వచ్చినప్పుడు ఇక్కడే పని చేశాను.. ఈ బిల్డింగ్ ఆస్టిన్ పట్టణంలోని కాంగ్రెస్ రోడ్డులో ఉంది.



ఇదిగో నేను అప్పుడు ఇలా ఉండే వాడినన్నమాట .. అప్పుడూ ఇప్పుడూ అలాగే ఉన్నాను.. మరి రేపు పరిస్థితేమిటో చెప్పలేం..


ఇదిగో ఈ ఇంట్లోనే నేను బస చేసానన్న మాట.



3, సెప్టెంబర్ 2008, బుధవారం

భందం - సంభందం - అనుభంధం | అమెరికా లో నా ఆలోచనలు - ౧

ఈ పుట వ్రాద్దామని ఆలోచించినప్పటి నుంచి శీర్షిక ఏమి పెడదామా అని ఆలోచిస్తూ అస్సలు విషయాన్ని జాప్యం చేసాను. ఇక ఇంతకన్నా జాప్యం చేస్తే, అస్సలు విషయం మరుగున పడుతుందో అన్న భయంతో ఇక మొదలు పెడుతున్నాను. ఈ పుట యందు తెలియ జేసే విషయాలు ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే, కావాలని .. వారినే ఉద్దేశ్శించి వ్రాసినదని తలంచ వద్దని మనవి.

అదృష్టమో .. దురదృష్టమో .. నేను భారత దేశంలో పుట్టడం అనేది నిజం. అలాగే, భారతదేశం లోని తెలుగు పిల్లనే పెళ్ళి చేసుకున్నాను. ఇక్కడ ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే.. ఇక్కడ (అంటే అమెరికాలో) నేను చూసిన కొన్ని జంటల్లో ఎక్కువ మంది, పడమటి సంధ్యారాగం సినిమా లోని హిరో హిరోయిన్ల లాగా జాతి మత భేధాలు లేకుండా ఒకటై, వసుదైక కుటుంబంలాగా కలసి మెలసి బ్రతుకుతున్నారు. ఉదాహరణకు..

నాతో కలసి పనిచేసే ఒక సహ ఉద్యోగి స్వతహాగా తెలుగువాడు, అందునా హైదరాబాద్ వాస్తవ్యుడు. దాదాపు పదిహేడు సంవత్సరాల క్రిందట ఇక్కడ అమెరికా వచ్చి, ప్రస్తుతం ఇక్కడే స్థిర పడిపోయాడు. ఇతని తల్లి తండ్రులు కూడా కొంతకాలం ఇక్కడ నివశించి, అవశాన దశని మాతృ భూమిలో గడపాలనే ఉద్దేశ్యంతో, ఈ మధ్యనే తిరిగి భారత దేశం చేరుకున్నారు. ఇతను ఓ పదేళ్ళ క్రిందట ఇక్కడే ఉన్న ఓ పరాయి దేశ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఇతని అర్దాంగి విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్లు, ఆ అమ్మాయి ఈ దేశానికి పరాయి దేశస్తురాలు. బహుశా పోర్టిరికా అమ్మాయి అయ్యుండవచ్చు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పేర్లలో కొంత క్రైశ్తవ తత్వం మరి కొంత హిందూతత్వం. (మరి పెద్దైన తరువాత వీరిని ఏమి అనాలో? క్రైశ్తవులనా? హిందువులనా? )

ఇక్కడే పుట్టారు కాబట్టి వారికి అమెరికా వారసత్వం ఉంటుంది, అంతే కాకుండా అమెరికా రాజ్యాంగంలో ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకరణలు ఉన్నట్లు లేవనిపిస్తోంది. ఏది ఏమైనా, ఇలాంటి వారికి జాతి మత భేధాలు లెవనేది నా భావన. ఇక్కడ మరోక చిన్న విషయం ప్రస్తావించకుండా ఉండ లేక పోతున్నాను. పైన ఉదహరించిన ఆ పెద్దాయనకు ఒక తోబుట్టువు ఉంది. ఆ తోబుట్టువు కూడా హైదరాబాద్ నుంచే వచ్చింది. వచ్చేటప్పుడు చక్కగా పెద్దలు చూసిన పెళ్ళి చేసుకుని, పొందికగా ఓ పదేళ్ళు కాపురం చేసి, తరువాత విడాకులిచ్చేసి, ఇదిగో ఈ మధ్యనే మరో విదేశీయునితో కలసి జివితాన్ని పంచుకునేందుకు ఉవ్వుళ్ళూరుతూ వివాహ నిమిత్తమై తిరిగి భారత దేశం చేరుకుంది.

ఇలాంటి వారందరికీ (భవ) భంధాలే ప్రాధాన్యమనిపిస్తోంది. ఇంతెందుకు, మా పెద్దనాన్నగారి పెద్ద కొడుకు, వరసకు అన్నయ్య, ఇక్కడకు వచ్చిన తరువాత ఒక ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇక్కడ వీరు చేసిన పని మంచిదా.. లేద చెడ్డదా .. అని తర్కించుకునే కన్నా.. ఇలాంట్ వారికి ఏమి ప్రాధ్యాన్యం అని ఆలోచిస్తే అసలు విషయం మనకు భోధ పడుతుంది.

 

ప్రస్తు పుట అమెరికాలో నాకు తెలిసిన / చూసిన వ్యక్తుల నుంచి నాకు తోచినది భంధం అయితే.. మరొక పుటలో ఇక్కడి వారి సంభంధ భాంధవ్యాలెలా ఉంటాయో అవలోకనం చేసుకోవడాని ప్రయత్నిస్తాను.

అంత వరకూ తమ విలువైన స్పందనలకు ఎదురు చూస్తూ ఉంటాను,

ఇట్లు,

భవదీయుడు

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

2, జులై 2008, బుధవారం

నా కలల సౌధం - A Retirement Plan : Part-2

ఆగస్టు 2006 లో నాకు వివాహమయింది. అంటే దాదాపు రెండేళ్ళవస్తోంది. ఇంత కాలమవుతున్నా.. సంతాన యోగం ప్రాప్తిస్తుందో లేదో అన్న ఆలోచన ఒక వైపు శీతాకాలం పుండులా భాధిస్తున్నా, పదిహేనేళ్ళుగా పురిటి నెప్పులు పడుతూ మరికొన్ని ఏళ్ళ తరువాత రూపం దాల్చబోయే నా ఆలోచన, ఎంతో మంది బాలల బవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందనే మందు నా భాధకి ఉపశమనంలా పనిచేస్తోంది. ఏది ఏమైనా ఈ మాటల ద్వారా ఎదో చూచాయగా మీకు అర్దమయే ఉంటుదని అనుకుంటాను. లేదా..

 

నేను రిటైర్ అయ్యిన తరువాత చక్కగా ఒక విధ్యాలయం నిర్మించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక విధ్యాలయం అనేకన్నా రెండు రకాల విధ్యాలయాలు అంటే బాగుంటుందేమో.. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్య మేమిటంటే.. ఉచిత మరియు ఉన్నత విధ్యని చిట్టి చిన్నారులకు ఆదిలోనే అందించాలనేది వీటి ఆశయం.. ఛ.. వీటి ఆశయమేమిటి.. నా ఆశయం. పెద్దగా కాకపోయినా.. కనీసం ఒక చిన్న తరగతిలో పది మంది బాలలకైనా ఉచితంగా.. ఒకటో తరగతి నుంచి ఎంత వరకూ వీలైతే అంత వరకూ స్వయంగా విధ్యాభ్యాసం చేయాలనేది ఒక ఆలోచనైతే.. ప్రతీ చిన్నారికీ చిన్న నాటినుంచే ఉన్నతంగా పెంచుతూ .. వారి వ్యక్తిత్వాన్ని పెంపోందించే విధంగా విధ్యాభ్యాశం జరగాలనేది మరో ఆలోచన.

 

ఇప్పుడు వీటి రెండింటి గురుంచి కొంచం విపులంగా ..

 

మెదటిది - ఉచిత విధ్య:

ఇక్కడ చేరే ప్రతీ విధ్యార్ది తల్లి తండ్రులు వారి వారి బిడ్డలను చదివించే స్తోమత లేని వారు. మరో విధంగా చెప్పాలంటే, బాల కార్మికులు. చదవాల్సిన వయస్సులో సంపాదిస్తూ వారి వారి తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేటి వారు. వీరిలో అనాధలు కూడా ఉండవచ్చు. కానీ వారిలో చదవాలి అనేటటువంటి కోరిక బలంగా ఉండాలి. వారు వీరు అని కాకుండా.. ఎవ్వరిలోనైనా చదువుకోవాలనే తపన ఒక దావానలంలా అనుక్షణం వెలుగుతూ ఉంటే, వారికి నా ఈ చిన్న చేయూత వారిచేత అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుందని నమ్ముతాను.

రెండవది - ఉన్నత విధ్య:

ఇక్కడ చేరే ప్రతీ విధ్యార్ది తల్లి తండ్రులు వారి వారి బిడ్డలను చదివించే స్తోమత ఉన్నవారు. అంతే కాకుండా, వారి పిల్లల్ని వారి భవిష్యత్తుకై కలలు కనే వాళ్ళు వాటిని సాకారం చేసుకునే ప్రయత్నంలో నావంతు కృషి అగ్నికి ఆజ్యం పోసినట్లు అవ్వాలని నా ఆకాంక్ష. ఆంగ్లంలో చెప్పే ఒక నానుడి ఇక్కడ ప్రస్తావించాలి. Cheep and Best never go together. అందువల్ల, ఉన్నత ఆశయాలు సాధించాలనుకునే వారు, చాలా కష్ట పడాల్సి ఉంటుంది. ఇక్కడ కష్టం ఒక్క పిల్లలు మాత్రమే కాదు, వారి వారి తల్లి తండ్రులు కూడా. అప్పుడే మనం సమిష్టిగా అనుకున్నది సాధించగలం అన్ని నా అభిప్రాయం. ఇక్కడ చదువు ఒక్కటే కాకుండా, ఎదుగుతున్న పసి హృదయాలకు అనుగుణంగా వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా extra curricular activities కూడా సమాంతరంగా సాగుతుంటాయి. అమీర్ ఖాన్ తీసిన ఆఖరి సినిమా.. తారే జమీన్ పర్ లో చూపించినట్లుగా .. పిల్లలను వివిధ కళల వైపు ప్రోత్సహించ వచ్చు.. వివిధ ఆటలలో ప్రావిణ్యం పొందేటట్లు ప్రోత్సహించవచ్చు.

 

క్రిందటి పుట పూర్తిగా ఉపోధ్ఘాతమయితే.. ఈ పుటలో నాంది పలికాను. తదుపరి పుటలో మొదటి విధ్యాలయం గురించి.. అంత వరకూ..

ఇట్లు,

భవధీయుడు

30, జూన్ 2008, సోమవారం

నా కలల సౌధం - A Retirement Plan : Part-1

ఈ టపా వ్రాసేనాటికి నా వయస్సు ముఫ్ఫయి ఆరు .. కానీ నా ఈ ఆలోచన నేను ఇంటర్ మీడియట్ చేసే రోజుల్లోనే కలిగింది. అంటే 1991 - 1993లలో అన్నమాట.. దాదాపుగా పదిహేనేళ్ళ క్రిందట ఉద్బవించిన ఈ కల నానాటికీ వేళ్ళూని వివిధ ఆలోచనలతో దిన దిన ప్రవర్దమానంగా ఎదుగుతూ పలు పలు శాఖలతో, అంటే క్రొత్త క్రొత్త ఆలోచనలతో ఎన్నో ఎన్నెన్నో రూపాలు దాల్చుతోంది. నేను ఈ ఆలోచనలకు రూపకల్పన నా retirement అయ్యిన తరువాత చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఈ retirement ఎప్పుడో చెప్పలేదు కదా.. నాకు యాభై ఐదు వచ్చిన తరువాత ఇంక ఉద్యోగం చెయ్యకుండా, అంటే ఉద్యోగ రీత్యా సంపాదించ కుండా అన్న మాట. సంపాదన అనేది ఉద్యోగం నుంచి కాకుండా, పూర్తి సమయం నాకల కోసం వెచ్చిస్తూ వీలున్నప్పుడు ఆర్దిక సహాయం కావాలి కాబట్టి, part timeగా సంపాదిస్తానన్నమాట.

 

ఇక అస్సలు విషయానికి వద్దాం. నేను పుట్టింది, పెరిగింది అంతా పూర్తిగా విజయవాడ. నా చదువులో ఎక్కువ శాతం గవర్నమెంటు వారి విధ్యాలయాలలోనే జరిగింది. పదవ తరగతి వరకూ, గాంధీ నగర్ లోని, SKPVV Hindu High School లో.. SRR&CVR Govt Collegeలో ఇంటర్ మీడియట్  జరిగింది. ఇవే కాకుండా, ఘంటశాల వారి పేరు మీద నిర్మించ బడిన Govt musical collegeలో సర్టిఫికెట్ వరకూ నాట్యశాధన .. ఆ తరువాత, రాజమెండ్రిలో డిప్లోమా అన్నీ ప్రభుత్వ విధ్యాలయాలలోనే జరిగింది. ఆ తరువాత నేను చదువుదామనుకున్న, B.Sc., with Computers, ఆ రోజుల్లో, మా వూళ్ళో, అదేనండీ విజయవాడలో ఏ ప్రభుత్వ విధ్యాలయంలో లేక పోవడం వల్ల.. ఉన్న ప్రైవేటు విధ్యాలయాలలో డొనేషన్ కట్టి చదివే స్తోమత లేని నాకు దేవుడిచ్చిన వరంలా, విజయవాడకు 20KM దూరంలో ఉన్న Dr. Zakhir Hussain College of Arts and Scienceలో కొన్ని మెరిట్ సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలియడం వల్ల అక్కడ చేరవలసి వచ్చింది. ఇదంతా ఒక ఉపోధ్ఘాతం మాత్రమే.

 

ఈ ఉపోధ్ఘాతం వల్ల మీరు గమనించ వలసినది ఏమిటంటే, నాకు, ప్రబుత్వ విధ్యాలయాలకీ అవినాభావ సంభంధం ఉంది అని. అందువల్ల, ప్రభుత్వ విధ్యాలయాల మీద ఒకింత ఎక్కువ గౌరవం ఉందనే చెప్పవచ్చు. ఎందరో అనుకునేటట్లు, "ప్రభుత్వ విధ్యాలయాలలో చదువు", వానాకాలం చదువులా కాకుండా, చదువుకునే వాడి.. చదువు కొనే వాడికి ఉన్నంత తేడా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్రభుత్వాలు మనకు అన్ని వసతులూ కల్పిస్తున్నాయి, కానీ మనమే వాటిని ఉపయోగించు కోవటం లేదు అని నా అభిప్రాయం. ఇక్కడ ప్రభుత్వం అంటే, కాంగ్రేస్ అనో .. తెలుగు దేశం అనో.. లేక మరోక పార్టీ అని కాదు నా అభిప్రాయం. పార్టీ ఏదైనా, మౌళిక సదుపాయాలు సమకూర్చే యంత్రాంగం అని నా అభిప్రాయం.

 

"సృజన - అనుసృజన" గా ప్రచురిస్తున్న కొల్లూరి శోమ శంకర్ గారినుంచి ప్రేరేపితుడనై, ప్రతీ పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడితే బాగుంటుందని భావించి, నా ఈ కలని ఎంత విపులంగా వీలైతే అంత విపులంగా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ పుట ఉపోధ్ఘాతం అయితే, వచ్చే పుట నా కలకు నాంది. అంత వరకూ మీ మీ విలువైన స్పందనలు / సూచనలు / అభిప్రాయాలు / వగైరా .. వగైరా.. తెలియజేయడం మరచి పోవద్దు.

ఇట్లు,

భవదీయుడు

19, జూన్ 2008, గురువారం

నేను డిలీట్ చెయ్యకుండా ఉంచిన SMSలు

నా మొబైల్ చాలా పాత మోడల్. దానికి ఎక్కువ SMSలు పట్టే స్తలం (స్టోరేజ్ మెమొరీ) లేదు. నాకు స్వతహాగా SMSలు చాలా తక్కువగా వస్తాయి. అందులో నాకు నచ్చని వాటిల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. అలా తీసెయ్యగా మిగిలిన కొన్ని SMSలను ఇక్కడ పొందు పరచి, మొబైల్ నుంచి డిలీట్ చేసేస్తా.. బాగుంది కదా నా ఈ ఆలోచన. చక్కగా SMSలు ఉంటాయి, ఫోన్‍లో మెమొరీ ఖాళీ అవుతుంది. ఏమంటారు?

-------------------

1) I met MONEY one day, I said : "You are just a piece of paper.. ", money smiled & replied as "Of course, I'm a piece of paper .. but have never seen a dustbin in my life time"

2) Wait.... Cool.... relax... ok.... ready .... start.... 3.... 2.... 1.... now... it is time to delete this message and go to sleep.. good night.. sweet dreams (ఇక్కడ చుక్కలు ఉన్నచోట రెండు లేదా మూడు లైన్ల బ్రేక్ ఇవాలి. అందువల్ల చదివే వాళ్ళకు కుతూహలం పెరుగుతుంది)

3) living in the favourable and unfavourable situations is "Part of living". But smiling in all situations is "Art of living"

4) An ideal day should begun with a cute little yawn on your face along with a cup of coffee in our hand & a SMS from me on your mobile. Good morning.. and happy day ahead. (వేరే ఎవ్వరికైనా పంపించేందుకు ఈ SMSని ఉంచాను)

5) Few things can't be understood like our hearts.. we think it beats inside for us.. but it really beats for someone who is inside it.. Good night.. sweet dreams

6) Do you know what makes some people dearest? it is not just the happiness you feel when you meet them.. but the pain you feel when you miss them

7) Do you know the relation between SMILE & YOUR FACE... ?? Your face looks good with a smile, but smile looks better when it is on your face.. keep smiling... happy day ahead

8) Money says EARN ME LOT.. Time says PLAN ME LOT.. Flowers says LOVE ME LOT.. Study says LEARN ME LOT.. SMS says SEND ME LOT.. but i say, REMEMBER ME LOT.. happy day ahead..

9) When ever i miss you i write your name on every rock.. and i wish one of those to fall on your head.. as you can know that how much it hurts when i miss you.. good night .. sweet dreams

10) With out your SMS days are like MOODOUTDAY.. TEARS DAY... WASTE DAY .. THIRST DAY .. FRIGHT DAY .. SUFFER DAY.. SAD DAY.. so SMS me every day .. happy day ahead..

11) Successful careers are never built in a day .. so do your best on every day... happy day ahead..

12) For Free Resolutions of your disputes relating to PUS (Public Utility Services) by the Permanent Lok Adalat for HYD-PUS, with in 60 days, contact 040 - 2344 2499 (ఈ SMS ని ఎదైనా సమాచారంగా పనికొస్తుందని అలాగే ఉంచేసా.. మీలో ఎవ్వరికైనా ఉపయోగ పడుతుందేమో నని ఇక్కడ యధా విధిగా ఉంచాను)

13)  Every body wants ... some one special .. some one nice.. some one cute.. some one sweet.. some one honest.. some one intelligent .. why always ME... ME.. and ME??? (ఇక్కడ చుక్కలు ఉన్నచోట రెండు లేదా మూడు లైన్ల బ్రేక్ ఇవాలి. అందువల్ల చదివే వాళ్ళకు కుతూహలం పెరుగుతుంది)

14) All power is with in you. You can do any thing and every thing.. believe in that .. by Swami Vivekananada

15) Night is a nice gift, so open the gift by closing your eyes..  you will see the another world waiting for you .. enjoy it with sweet dreams.. happy dreams..

16) Beauty is ageless.. love is boundless.. heart beats are countless.. and friends like you is HOPELESS... oops... SHAMELESS.. chi.. chi.. sorry .. USELESS... aioyyoo extremely sorry PRICELESS.. (ఇక్కడ చుక్కలు ఉన్నచోట రెండు లేదా మూడు లైన్ల బ్రేక్ ఇవాలి. అందువల్ల చదివే వాళ్ళకు కుతూహలం పెరుగుతుంది)

17) When ever i want your presence, i read your SMS .. When ever i want to see you, i close my eyes.. when ever i want to hear your voice i throw stones at street dogs.. :-) Happy morning ..

18)  t h g ! u

       p o o 6

     6 u ! | ! w S

       d 3 3 >|

Confused..

Turn your mobile upside down and read it again..

19) 5 Steps to a lovely morning.. Close your eyes.. take a deep breath .. open your arms wide .. feel your heart beat .. & say it loud TOO EARLY ... LET ME SLEEP AGAIN...

20) A heart dies when it is not able to share its feelings.. but a heart kills it self, when another heart doesn't understand it's feelings .. happy morning..

21) Sun donates brightness.. Moon donates Coolness.. Smile donates happiness.. Cry donates sadness.. But my SMS donates your "remembrance".. Good night ..

22) Before the sun sets in the evening... before the memories fade.. before the network gets jammed... wish you and your family a happy new year..

23) Life is short.. LIVE IT.. Love is rare.. GRAB IT .. Anger is bad .. DUMP IT .. Fear is awful .. FACE IT .. Memories are sweet .. CHERISH IT.. Sender is GENIUS .. ACCEPT IT ..

 

--------------------

How are these?

22, మే 2008, గురువారం

బత్తీ బంద్.. ఎందుకు చెయ్యాలా?? నేను చెయ్య..

ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ విషయమై చాలా మంది చాలా విధాలుగా ప్రచారాలు చేస్తుంటే.. నా వంతు కర్తవ్యంగా నాకు తెలిసిన నాకు పరిచయమున్న వారికి ఈ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నించా. ఆ ప్రయత్నంలో నాకు ఎదురైన అనుభావల సంపుటి ఈ పుటకి మూల కధ.


పాత్రలు పాత్రధారులు : అస్మదీయుడు ఎలాగో ఉంటాకాబట్టి ప్రతీ సారి నేను ఉన్నానని కొత్తగా చెప్పనక్కరలేదు.

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఒక సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: నేనెందుకు ఒక గంట ఆర్పాలండీ. అదేదో బిల్లులు కట్టేవారు ఆపితే ఎదో పొదుపు క్రింద బిల్లు తగ్గుతుంది
అస్మదీయుడు: మరి మీకు కూడా ప్రొడక్షన్ తలకాయ నొప్పి తగ్గుతుంది కదా
విపఉ: ప్రొడక్షనా .. గాడిద గుడ్డా.. నేనెక్కడ చేస్తున్నా.. ఎదో వర్షాలు పడుతున్నాయి .. అక్కడెక్కడో మా వాళ్ళు కష్ట పడ్డట్టు చెబుతున్నారే.. నీళ్ళుంటే దానంతట అదే ప్రొడ్యూస్ అవుతుంది
అస్మదీయుడు: ఒకవేళ నీళ్ళు లేకపోతే ప్రభుత్వం మిమ్మల్నే కదా దుమ్మెత్తి పోసేది?
విపఉ:ఎవ్వడు పట్టించు కుంటాడు చెప్పండి..
అస్మదీయుడు:మరి విధ్యుత్ తక్కువైంది అని ప్రభుత్వం మిమీద మండి పడితెనో..
విపఉ: ఏముంది .. తక్కువైంది అనేస్తాం.. ప్రక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటే సరి..
అస్మదీయుడు:మరి అప్పుడు ప్రభుత్వం మీకు కేటాయించిన అర్దిక బడ్జట్‍లో సొమ్ములు లేకపోతేనో..
విపఉ: ఏముంది, ప్రభుత్వమే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తీసిస్తుంది
అస్మదీయుడు: మరి దానికెక్కడినుంచి వస్తుంది..?
విపఉ: ఇంకెక్కడి నుంచి .. బిల్లులు కట్టే వాళ్ళనుంచి .. అంతే గానీ నానుంచి కాదుగా.. అయినా మీ పిచ్చి గానీయ్యండీ దీనిలో మనకి ఒరిగేదేముంది.. గంట బొక్క తప్ప

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న మరో సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: చూడండీ మీరు వాడుకున్నా వాడుకోక పోయినా పెద్ద ఫరక్ పడదు సార్
అస్మదీయుడు: ఎలా అంటారు?
విపఉ: ఇప్పుడు మీరు వాడినా వాడక పోయినా మీ 3 phase కనక్షనుకు మీరు కడుతున్న బిల్లు ద్వారా మీకు అవుతున్న బిల్లు మొత్తం దాదాపు రెండు వందల యాభై రూపాయలవుతుంది
అస్మదీయుడు: అంటే దాదాపుగా వాడినా వాడకపోయినా నేనూ అంతే కట్టాలంటారా..
విపఉ: కదా.. అందుకని నేను చెప్పేదేమిటంటే.. బత్తీ బంద్ .. ప్రిజ్జు బంద్ .. అంటూ గోల చెయ్యకుండా ..
అస్మదీయుడు: మరి మనకే ఉపయోగ పడుతుందంటున్నారు కదా..
విపఉ: ఎవ్వరది అనేది.. మా డిపార్టుమెంటు వాళ్ళు చెప్పి కొన్ని గంటలు .. చెప్పకుండా కొన్ని గంటలు కోత విధించడం లేదా..
అస్మదీయుడు: ఇది అసమంజసం కదా..
విపఉ: మీరు ఎంత చెప్పండి, ఓ గంట బత్తీ బంద్ జేసి ఏమి జెయ్యాలంటా..
అస్మదీయుడు: చక్కగా మీ కుటుంబ సభ్యులంతా ఒక్క చోట జేరి ఏదైనా చెయ్యవచ్చుగదా..
విపఉ: అదేగదా నేను జెబుతుండా.. ఓ గంట బత్తీ బంద్ జేస్తే ఏమొస్తదీ .. బొచ్చు ఓ గొంట సీరియల్ బొక్క.. మళ్ళీ ఈ రోజేమైందో అని రేపటి వరకూ ఎదురు జూడాల..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: నాకెందుకు చెబుతున్నారు .. నేనేమైనా తేరగా దొరికానా.. అప్పుడే కదా చక్కగా వంట వండుకునేది.. అలాంటప్పుడు బత్తీ బంద్ అంటే ఎలా?
అస్మదీయుడు: ఆ ఒక్క రోజు వంటేదో ముందుగా చేసుకోవచ్చుగా..
గృహిణి: మా ఆయన వంట వేడిగా లేకపోతే తినరు.. తరువాత నేనే తినాలి.. మరునాడు కూడా చద్దన్నం ఎవ్వరు తింటారు?
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: ఏమిటండి అదికాదు.. ఇది కాదంటారు.. చద్దన్నం మీరు తింటారా.. మా ఆయన సంగతి మీకు తెలియదు..
అస్మదీయుడు: ఇది మీ ఇద్దరి మధ్య జరిగే విషయం కాదు.. అందరికీ సంభందించిన ..
గృహిణి: మా ఆయన నన్ను తిడుతూ ఉంటే.. మీరు చెప్పే ఈ అందరూ వస్తారా.. ఆయన చేత చీవాట్లు ఎవ్వరు తింటారు? పోనీ ఎవ్వరో ఎందుకు నువ్వు తింటావా..
అస్మదీయుడు: అది కాదండి .. (ఎదో చెప్పబోయేటంతలో..)
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. మీ మగాళ్ళంతా ఇంతే... ఒక్కడొచ్చి బత్తీ బంద్ అంటాడు.. మరొకడొచ్చి ఎందుకు బంద్ జేసావ్ అంటూ నా తాటవలుస్తాడు.. నీకు పుణ్య ముంటాది.. మరేదన్నా జెప్పు బిడ్డా..
అస్మదీయుడు: ఇంకే చెబ్తా..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: దానివల్ల వచ్చే ఉపయోగమేమిటి?
అస్మదీయుడు: (హమ్మయ్య.. చాలా కాలంగా ఎవ్వరూ అడగని ప్రశ్న అడిగింది అనుకుంటూ మొదలు పెట్టా..) భూగోళం చుట్టూ..
గృహిణి: భూగోళం చుట్టూ సరేగానీ.. నాకు ఏవిధంగా ఉపయోగమో చెప్పు బాసూ
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: నేను అనేది అదే.. అదికాదు.. ఇది కాదనకుండా .. అస్సలు విషయానికిరా..
అస్మదీయుడు: అంటే.. ఇలా ఒక గంట సేపు బత్తీ బంద్ జేస్తే మన వాతావరణానికి ..
గృహిణి: మళ్ళీ వాతావరణం గీతావరణం అంటావు .. మన గురించి చెప్పు బాసూ..
అస్మదీయుడు: (ఎదో చెప్పబోయేటంతలో..) ..
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. దాని వల్ల లాభం లేదు గానీ .. దానివల్ల జరిగే నష్టాలే చాలా ఉన్నాయి .. నీకు తెల్సా..
అస్మదీయుడు: నష్టాలా..
గృహిణి: అవును బాసూ..
అస్మదీయుడు: ఏమిటో..
గృహిణి: నేను చేసుకునే వంటలూ అవీ బాగా కుదిరినా .. లేక మిగిలిపోయినా చక్కగా తీసుకెళ్ళి ప్రిజ్‍లో పెట్టేస్తా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అలాగే వారానికి సరిపోయే కూరగాయలన్నీ ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అట్లాంటిది.. ఓ గంట బత్తీ బంద్ అంటే.. ప్రిజ్‍లో పెట్టిన కూరగాయలన్నీ కుళ్ళిపోవా.. నిన్న వండిన పులుసు పరిస్థితేమిటి?
అస్మదీయుడు: ఆ..
గృహిణి: అవన్నీ చెడిపోతే మళ్ళీ తెచ్చుకోవాలా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇవి కాకుండా.. పాలు కూడా ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇన్ని వస్థువులు చెడిపోతా ఉంటే.. బత్తీ బంద్ చెయ్యమంటావా.. నీకు కావాలంటే మీ ఇంట్లో జేసుకో .. అంతే గానీ ఊరికే ఇలాంటి సలహాలు ఇవ్వమాక...
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: వ్యాపారి

వ్యాపారి: దానివల్ల మా కస్టమర్లు ఆ గంట సేపు రావడం మానేస్తారు ..
అస్మదీయుడు: అదికాదండీ..
వ్యాపారి: చూడు నాయనా నీ సలహా వల్ల నాకు లాభం రాక పోయినా ఫరవాలేదు గానీ ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టమాకు .. నీకో దణ్ణం .. (ఇంక ఇక్కడినుంచి ఫో.. అని చెప్పకనే చెప్పాడు
అస్మదీయుడు: అదికాదండీ.. (ఇంకా ఎదో చెప్పి ఒప్పిద్దాం అనే ప్రయత్నంగా..)
వ్యాపారి: ఏమయ్యా.. ఆ గంట బిజినస్ వల్ల వచ్చే నష్టం నువ్వు భరిస్తావా..
అస్మదీయుడు: మరండీ..
వ్యాపారి: పనిచూసుకో ..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: తెలుగు దేశం కార్యకర్త - తెదేకా

తెదేకా: ఒక గంట ఎందుకు సారు.. మొన్న మా బాబు గారు చెప్పినట్లు..
అస్మదీయుడు: బాబుగారు ఈ విషయం గురించి చెప్పారా.. ఎమన్నారబా..
తెదేకా: అబ్బే .. బాబుగారు ఈ విషయంపై ఏమీ చెప్పలా.. రైతన్నలను తీసుకున్న బాకీల్లో దేనికీ తిరిగి కట్టద్దొన్నారుగా..
అస్మదీయుడు: అయితే..
తెదేకా: వారేమో తీసుకున్న రుణాలు కట్టొద్దన్నారుగా.. అలాగే... ఇది కూడా.. పూర్తిగా ఎగ్గొట్టేస్తే పోలా..
అస్మదీయుడు: అప్పుడు అసలుకే ఎసరొస్తుందిగా.. ఉన్న కరంటు కనక్షను పీకేస్తుంది కదా ప్రభుత్వం..
తెదేకా: దొంగ కనక్షన్ ఉండనే ఉందిగా..
అస్మదీయుడు: ప్రభుత్వం మీ మీద దొంగ కనక్షన్ కేసులు పెడితే..
తెదేకా: అప్పుడు మా బాబుగారున్నారుగా... తిరిగి.. ప్రభుత్వం పైనే కేసులు వెస్తారుగా..
అస్మదీయుడు: ఎలా..
తెదేకా: అధికార ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రతి పక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారని...
అస్మదీయుడు: (ఏమిటిది .. ఎక్కడ మొదలైంది .. ఎటు పోతోంది .. అని తలస్తూ .. ఇంక లాభంలేదని విరమించుకున్నా..) ..

----------------
ముఖ్యపాత్రధారి: కాంగ్రెశ్ కార్యకర్త - కాకా

కాకా: ఏం మాట్లాడుతున్నావు? నీకే మైనా అర్దం అవుతోందా..
అస్మదీయుడు: ఏం బాబూ.. ఎదో ప్రపంచం అంతా..
కాకా: ప్రపంచం అంటావు.. బొత్తిగా నీకు లోక ఙ్ఞానం లేకుండా పోతోంది
అస్మదీయుడు: నాకా..
కాకా: నీకు కాక పోతే .. నాకా మరి..
అస్మదీయుడు: ఏందుకంటారు..
కాకా: మరేమో మా పెద్దాయన చక్కగా ఉచితంగా ఇస్తా ఉంటే.. నువ్వేంది.. ప్రతి పక్షం వాళ్ళు చెప్పినట్లు .. వాగుతున్నావు..
అస్మదీయుడు: అదికాదు.. (ఎదో అనబోతుంటే..)
కాకా: ఏందీ ప్రతి పక్షం వాళ్ళదగ్గర ఎదైనా తీసుకున్నావా..
అస్మదీయుడు: నేనా ..
కాకా: ఫరవాలేదులే.. ఎంత తీసుకున్నావో చెప్పు .. నాకు ఎంతిస్తావో చెప్పు.. దీని గురించి నేనెవ్వరికీ చెప్పను..
అస్మదీయుడు: ..
కాకా: పెద్దాయనతో నేను మాట్లాడతా.. నువ్వెమీ వర్రీ గాకు..
అస్మదీయుడు: మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్దం కావటంలేదండి..
కాకా: ఒరేయి .. వీడ్నెవడురా లోపలికి పంపించింది..
అస్మదీయుడు: ..

----------------

ఇలా చాలా చాలా అనుభవాలు .. ఎన్నెని చెప్పను నా వెతలు .. సూక్ష్మంగా అందరూ బత్తీ బంద్‍కి వ్యతిరేకులే కానీ .. మన వంతు కర్తవ్యంగా ఎదో ఒకటి చెద్దాం అని అనుకోని పరిస్థితి చూస్తుంటే..

రాజుగారి పెళ్ళికి నావంతు భాగంగా గిన్నెడు నీళ్ళైతే ఎం పోతుందిలే..

అని అందరూ అనుకున్న వైనం గుర్తుకు వస్తోంది. చదివే చదవరులూ మరి మీరు వచ్చేనెల 15వ తారీఖున బత్తీ బంద్ పాటిస్తున్నారా..

మీ విలువైన స్పందనలకై ఎదురుచూస్తున్న

భవదీయుడు.

-------------------------------------------
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ! వినురవేమ!

16, మే 2008, శుక్రవారం

మహిళలూ .. నా దృష్టిలో వీరు మనుష్యులు

నా మొదటి పుట నుంచి నేటి పుటకి ఒకే ఒక దారం.. ’మగాళ్ళంతా ఒక్కటే టైపు..’ అన్న ఆలోచనే. మొదటి పుటలో అస్సలు ఈ ప్రచురణల వెనుక ఆంతర్యమేమిటి అనేది మూల విషయమయితే, రెండవ భాగం వెనకాల ముఖ్య ఉద్దేశ్యం మగాళ్ళలో ఎన్ని భావనలు ఉంటాయూ అని తెలియ జేయడమే. మంచి చేడులు అన్ని చోట్ల ఉంటాయి. ’భాభా’లు అన్ని చోట్లా ఉంటారు. ఎవ్వరీ ’భాభా’లు అని అనుకుంటున్నారా.. ’భార్యా భాధితులు'. కానీ వాళ్ళని వెలుగులోకి తెచ్చే కన్నా భర్తల భాధితులనే ఈ సంఘం వెలుగు లోనికి తేవడం వల్ల, ఇలాంటి వార్తలు ఎక్కువ మంది ఆడవాళ్ళు చదవడం వల్ల.. ’మగాళ్ళు అంతా ఇలాగే ఉంటారేమో..’ అని జనరలైజ్ చేసేసి అందరినీ ఒకే తాటికి కట్టేసి మాట్లాడెస్తుంటారు.

రెండవ పుటలో ఉదహరించిన వాళ్ళందరూ మగ వాళ్ళైతే.. అస్సలు మగవాడు అంటే ఎలా ఉండాలి అనే నా ఆలోచనకు ప్రతి రూపమే ఈ మూడవ పుట. చదివిన తరువాత తప్పని సరిగా మీ మీ అభిప్రాయాన్ని తెలియ జేస్తారని తలుస్తాను. ఈ పుటలో నేను మగవాళ్ళనే ఎందుకు ఎత్తి గొప్పగా చూపాలి అని కూడా ఆలోచించిన పిదప, అస్సలు భార్యా భర్తలు అంటే ఇలా ఉండాలి అని తెలియ జేస్తే ఎలా ఉంటుందో అని కూడా అలోచించాను. దాని ఫలితమే ఈ స్త్రీ పురుష సంగమం. తత్ విధంగా ఇద్దరూ జీవితం అనేటటువంటి కాడిని మోసే రెండెద్దులుగా మాత్రమే కాక, జీవిత పయనంలో సాగే సంసారం అనే రైలు బండికి ఆధరవుగా నిలిచే రైలు పట్టాల్లాంటి వారని, సమాంతరంగా సాగి పోయే తోడూ నీడ అని, పాలు నీళ్ళలాగా కలసి పోవాలని, తెలియజేసే ఎన్నో ఉదాహరణలు మన ముందే ఉన్నా.. వాటిలోంచి కొన్ని ఇక్కడ ..




వ్యక్తి: నారాయణ మూర్తి                              జీవిత భాగ స్వామి: సుధా మూర్తి

వివరణ:

ఒక భర్తగా, సుధా మూర్తికి పూర్తి స్వాతంత్ర్యాన్నిచారు. ఆవిడ ఎదుగుదలను చూసి కుళ్ళుకోకుండా తన వంతు కర్తవ్యంగా ఆమెను ప్రోత్సాహిస్తూ.. ఆమె ఎదుగడానికి ప్రయత్నంగా తన కంపెనీ నుంచి నిధులు కూడా సమకూరుస్తున్నారు. ఇక్కడ సుధా మూర్తిగారి గురించిన కొన్ని ముఖ్య విషయాలు మనం గమనించాలి. సుధా మూర్తిగారు M.Tech చదివారు. చదువుకునే రోజుల్లో ఆవిడ బంగారు పతకాన్ని కూడా పొందారు. టెల్కో వారి పూణే ప్రాంత కార్యాలయంలో ఉద్యోగం కూడా చేసారు. నారయణ మూర్తిగారు కూడా ఆరోజుల్లో పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో పూణేలోనే పనిచేసేవారు. ఆరోజుల్లో మొదలైన సాన్నిహిత్యమే అనుకోండి లెదా వీరిద్దరికి ఉన్న పుస్తక పఠనం అయితే కానివ్వండీ, ఇద్దరిని ఒక్కటి చేసాయి.

అంతే అనుకుంటే మనం చాలా విలువైన విషయాలు కోల్పోయామని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ ఈరోజు ఇలా ఉంది అంటే అది సుధామూర్తి గారిచ్చిన పదివేల రూపాయల పెట్టుబడే అని చెబితే నమ్ముతారా? అంతే కాకుండా, ఎన్నో ఆలోచనలతో తాను చెయ్యాలని తపన పడుతున్న భర్తని అర్దం చేసుకుని తాను దాచుకున్న డబ్బుని నారాయణ మూర్తిగారికిచ్చి, ’నీకు మూడేళ్ళు సమయం అలాగే పదివేలు ఇస్తున్నా!!! ఈ మూడేళ్ళు ఇంటిని నేను నడిపిస్తా, మీరు నిశ్చింతగా మీ ఆలోచనలకు ఒక రూపం తెచ్చుకోండి. కుదిరిందా అంతా మంచిదే, లేక పోతే ఆ తరువాత ఇంటి భాధ్యత యధావిధిగా ఇద్దరం భరిద్దాం..’ అంటూ ప్రోత్సాహ పరిచారే, ఎంతటి గొప్ప హృదయం ..

నారాయణ మూర్తిగారు కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. భార్యకి ప్రయాణాలు అంటే ఇష్టమని తెలిసి అమెరికా చుట్టి వచ్చే అవకాసం వచ్చిందని సుధామూర్తిగారు చెప్పగా, వెంటనే చక్కగా వెళ్ళిరా.. నీ ఇష్టా ఇష్టాల్ని నేను ఏనాడూ కాదనను అని పంపించడమే కాకుండా.. ప్రతి రోజూ ఆవిడ బస చేసే హోటల్ కి ఫోను చేస్తూ ఉండేవారు. ఏనాడైనా అర్దరాత్రి వరకూ ఆమె దగ్గరనుండి తన ఫోన్ కాల్‍కి స్పందన లేదనుకోండీ తబ్బిబ్బయ్యేవారు. ఇవన్నీ నేను చెబటం లేదు, గూగులమ్మని అడగండి అదే చెబుతుంది.

ఇంతకన్నా మించిన భార్యా భర్తలు.. నా దృష్టిలో వీరు అసలు సిసలైన ..

ఆడ మగ




వ్యక్తి: బోడపాటి వీర రాఘవులు                            జీవిత భాగ స్వామి: శుంకర పుణ్యవతి

వివరణ:

రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు, అలాగే వీరిద్దరి గురించి కూడా చాలా తక్కువే తెలుసు అని కూడా తెలియజేయాలి. కానీ తెలిసిన కొంచంలో వీరిరువురూ చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్నట్లు అర్దమవుతోంది. ఎలాగంటారా.. రాఘవులు స్వతహాగా చలాకీ మనిషి. వేర్వేరు దృవాలు ఆకర్షితులవుతాయి అనేటటువంటిది సైన్సయితే, వీరిరువురు ఎలా ఆకర్షితులయ్యారో ఏ సైన్టిష్టు చెప్పలేని, విప్పలేని ఒక సూత్రంగా మిగిలిపోతుంది. ఇద్దరూ అభ్యుధయ వాదులే. ఇద్దరూ సంఘ సంస్కారానికి పాటు పడెవారే. ఒకరిది రాజకీయవాదమయితే మరొకరిది మహిళా లోకం.

వీరే ఇలా అనుకుంటే, వీరి అమ్మాయి ఒక ముస్లిమ్ యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను అంటే, సమాజంలోని సదురు సామాన్య తల్లి తండ్రుల్లా అరచి గీపెట్టి గోలచేయ్య కుండా, వీరి పెళ్ళి దగ్గరుండి జరిపించారు. నిరాడంబరుడు, నిగర్వి, బి వి రాఘవులు తన కుమార్తె వివాహం విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇట్టి గొప్ప ఆలోచనా పరిధి ఎంత మందికి ఉంటుంది?

పెళ్ళి చేసుకోగానే భార్య ఇంటి పేరు మార్చుకోవాలి అన్నది మన తెలుగు వారి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా అని నేను చెప్పను కానీ, పుణ్యవతి గారి ఇంటి పేరు ఇంతవరకూ మార్చుకోక పోయినా ఎటువంటి రభసా చెయ్యకుండా, ఆవిడను ఒక స్వతంత్ర భావాలు కలిగిన పరిపూర్ణ మహిళగా గుర్తించి, ఆవిడను ఒత్తిడి చెయ్యకుండా తన అభీష్టం మేరకు స్వేశ్చ నిచ్చి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారే.. ఇంతకన్నా ఏమికావాలి వీరు కూడా ఒక చక్కటి కుటుంబం లెక్కలోకి చేర్చక పోవడానికి. ఒకరి నొకరు అర్దం చేసుకున్న మరో

మగ ఆడ




ఇంకా ఎందరో.. మరెందరో.. ఎన్నో ఎన్నెన్నో జీవితాలు మనకు కళ్ళకు కట్టి నట్లుగా మన ముందే తిరుగాడుతుంటే.. ఎందుకో ఇంకా ఆ అలోచనలు. మహిళలూ నిద్రలేవండి, మీరెంతో .. మీ శక్తి ఎంతో మీకు తెలియదు. మీరు ఎవ్వరితోనూ తక్కువకాదు, అలాగే ఎదో మిమ్మల్ని ములగ చెట్టెక్కించాం కదా అని మగవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. వారూ మీతో సరి సమానమే. కాకపోతే, ప్రతీ నాణానికీ రెండు ముఖాలు ఉన్నట్లు, ప్రతి వ్యక్తిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. మనం దేన్ని చూస్తున్నాం అన్నదే మన వ్యక్తిత్వం అవుతుంది.

మగవాళ్ళలో చెడ్డ వాళ్ళున్నట్లే ఆడవాళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. మీకు వాళ్ళు కనబడక పోతే ఒక్క సారి మన ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఒక్క సారి గమనించండి. మీకే అర్దమవుతుంది. అంతకీ అర్దం కాకపోతే, నన్నడగండీ.. నేను చూపిస్తా మీకు అట్టి ’నారీ విలన్’లను. ముగింపులో చెప్పొచ్చేదేమిటంటే, ఏ విషయాన్నీ జనరలైజ్ చెయ్యకండీ. కొంచం అలోచించి statements ఇస్తూ ఉండండి.

ముక్తాయింపుగా, మరొక్క మాట,


మహిళలూ .. ఒక్క పిల్లల్ని కనడానికి పెట్టడానికి తప్ప.. మీరు మరే విషయంలోనూ మగవారిపై అధార పడకండి.

దేవుడు మగవాళకి ఇచ్చినట్లు మీకూ అన్నీ సరి సమానంగా ఇచ్చాడు. అంతే కాకుండా ఈ రోజుల్లో మగాళ్ళతో సరి సమానంగా పోటీ పడుతూ మా ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు. కొంచం కుళ్ళుగా ఉన్నా, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. అలా అలా ముందుకు సాగి పోతూ ఉండండి. ఏమాత్రం తగ్గద్దు. ఇంక గోతికాడ నక్కల్లాగా, చిత్తాకార్తె కుక్కల్లాగా మిమ్మల్ని ఎప్పుడు మింగేద్దామా అని ఎదురుచూసే మగాళ్ళు ఇదే సమాజంలో ఉన్నారు, అలాగే మహిళా జనోద్దారకులూ ఉన్నారు. కాబట్టి, అందరూ ఒక్కటి కాదని తలుస్తారని భావిస్తూ.. సెలవు

ఇట్లు
భవదీయుడు


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

14, మే 2008, బుధవారం

మహిళలూ - వీరే మగాళ్ళు : రెండవ భాగం

సమయం: అప్పుడెప్పుడో.. 2004    స్థలం: ఒక విధ్యాలయం, విజయవాడ
పాత్రలు పాత్రధారులు: ప్రేమ అని తలచే ఉన్మాది, అలియాస్ మనోహర్ మరియు పైశాచికానికి బలైపోయున కుసుమం శ్రీలక్ష్మీ

సందర్బం:

దేవాలయానికన్నా పవిత్రమైనటు వంటి ఒక విధ్యాలయంలో పరీక్షా సమయానికై ఎదురు చూస్తూ సన్నిహితులతో ముచ్చట్లాడు తున్న శ్రీలక్ష్మికి తాను మరికొన్ని నిమిషాలే బ్రతికి ఉండేదన్న విషయం తెలియదు. దేవాలయం కన్నా పవిత్రంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయం ప్రక్కన పెడితే, విధ్యార్దులను శారదా తనయులుగా తీర్చిదిద్ద వలసిన ఒక కళాశాల ప్రాంగణం లోకి కొబ్బరి బోండాలు తెగగొట్టే కత్తితో ప్రవేశించాడు మన విలన్.. క్షమించాలి మన ఒక్క మగాడు, మనోహర్. రెండో అంతస్తులో తన వంతు కోసం ఎదురు చూస్తున్న శ్రీలక్ష్మిని నిండు క్లాసు రూము మధ్యలో.. విధ్యార్దుల సమక్షంలో.. నిర్దాక్షిణ్యంగా.. కిరాతకంగా.. పైశాచికంగా.. నరికేశి ఏమీ పట్ట నట్లు చక్కగా చెన్నై చెక్కేసాడు.

వీడూ మగాడే



సమయం: అటు తరువాత.. 2007 స్థలం: పునాదిపాడు ఊరి సరిహద్దు
పాత్రలూ పాత్రధారులు: అభం శుభం తెలియని కోనేరు నాగశ్రీ, పరువంలో ఉన్న స్నేహితులు శివ శంకర్, ప్రవీణ్ కుమార్, కిషోర్ బాబు

సందర్బం:

ఇది ఒక అన్నెం పున్నెం ఎరుగని పదవ తరగతి చదువుకునే బాలిక విషాధగాధ. స్నేహితునిగా భావించే శివ శంకర్ పిలుపుని కాదనలేక చెరువు గట్టుకు చేరుకుంది నాగశ్రీ. మెల్లగా తన స్నేహితులతో అక్కడకి చేరుకున్నాడు శంకర్. ఒంటరిగా ఉన్న నాగశ్రీని చూసిన ముగ్గురూ అదే అదునుగా భావించి, కలసి మానభంగం చేయ్యబోయ్యారు. విషయం అర్దం అయ్యి సహాయం కోసం అరచే లోపల ముగ్గురూ కలసి దాడి చేసి, అతి కౄరంగా సృహ కోల్పోయేలా కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు గుంతలో కప్పి పెట్టి పైన ఊపిరి కూడా ఆడకుండా చెత్త మరియూ గడ్డి వేసి కప్పి పాతేశారు.

వీళ్ళూ మగాళ్ళే



సమయం : మొన్నీమధ్య 2008 స్థలం: విజయవాడ
పాత్రలూ పాత్రధారులు: మీనాకుమారి, ఆమె తల్లి తండ్రులు మరియూ మరో ప్రెమోన్మాది సందీప్

సందర్బం:

పెళ్ళికి నిరాకరించారన్న ఒకే ఒక కోపంతో మీనాకుమారి గొంతుకును ఆమె తల్లి తండ్రుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా చీల్చే ప్రయత్నంలో తనని తానూ గాయ పరచుకుని ఊచలు లెక్క పెడుతున్నాడు. గాయంతో మృత్యువుతో పోరాడి గెలిచిన మీనా కుమారి విధి మిగిల్చిన గాయాన్ని ఎలా గెలవగలదు?

వీడూ మగాడే



సమయం: నిన్నగాక మొన్నీ మధ్య, 2008 స్థలం: బ్రిటన్
పాత్రలూ పాత్రధారులు: జ్యోతిర్మయి మరియు నాగరాజ్ కుమార్

సందర్బం:

ప్రేమ పేరుతో మరో విషాధం.

వీడూ మరో మగాడే



సమయం: 2008 ఏప్రెల్ నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: నేను, నా అర్దాంగి, మా కూర గాయల సంచీ మరియూ మనందరికీ సుపరిచితులైన తొలి తెలుగు బ్లాగరి, చావా కిరణ్

సందర్బం:

నా శ్రీమతి చేతిలోని కూరగాయల సంచీని చూచి, ’ఏమిటీ ఇటు నుంచి ఇటుగా కూరగాయలకా..’అని చావా కిరణ్ గారు అన్నారు.’అవునండీ.. తొందరగా వీలైతే కూరగాయలు కొన్నుకుని ఇంటికి చేరుకుంటాం..’ అని జవాబిస్తూ, ’మీరు ఇక్కడ దగ్గర్లో ఎక్కడ కొంటారు?’ అని ఎదురు ప్రశ్న వేసా.

’మాకు దగ్గర్లోని రైతు బజారుకు ఉదయానే వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇచ్చి సాయంత్రం మన సమావేశానికి హాజరు అవ్వడానికి పర్మీషన్ కొట్టేశా..’, చావా కిరణ్ గారి జవాబు
శ్రీమతి కి భయపడి అలా అన్నారని నేను భావించడం లేదు. తన అర్దాంగిని కూడా చర్చించి మరీ సమావేశాలకు హాజరవుతున్నారే అదే మనం గమనించాల్సిన విషయం

వీరూ మగవారే



సమయం: 2008 మే నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: eతెలుగు సమావేశానికి తరచుగా హాజరయ్యె సభ్యులు మరియూ మనందరికీ సుపరిచితులైన మరో తెలుగు బ్లాగరి, కశ్యప్

సందర్బం:

సమావేశం తేవ్ర స్థాయికి చేరుకుంది. ఏవేవో చర్చిస్తున్నాం. ఇంతలో కశ్యప్ గారి ఫోను మ్రోగింది. వెంటనే వారు లేచి, ’నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్, ఇంట్లో గ్యాస్ బండ అయ్యి పోయిందంట, ఇక నేను దయచేస్తాను, క్షమించాలి’ అంటూ క్షణంలో మాయమై పోయ్యారు.

దీన్ని బట్టి అర్దం చేసుకోవాల్సినదేమిటంటే, ఎంతో శ్రమ కోడ్చి, నిస్వార్దంగా అందరూ చేయు చేయు వేసి, మెల్లగా ఒక సంఘంగా తయారయ్యిన eతెలుగు సమావేశాని కన్నా ఇంటిలో ఉన్న తన శ్రీమతి పడే శ్రమముందు, eతెలుగు సమావేశంలో అప్పటికి తన పాత్ర ముంగింపుకు చేరుకున్నందున, ముక్తాయింపుకు సెలవిచ్చి, ఇంతి చేరువుకు ఇంటికి చేరుకున్నారు మన కాశ్యప్‍గారు. అర్దాంగి శ్రమను అర్దం చేసుకునేవారికి ఇదేమి పెద్ద విషయంకాదు.

వీరు మగవారే



పైన చెప్పిన వారందరూ మగవాళ్ళే.. ఏమైనా అంటే, ’పైన పేర్కొన్న ఉన్మాదులు ఒక్క సారిగా హత్య చేసి శారీరకంగా హింసిస్తారు, మిగిలిన వారేమో మానశికంగా హింసిస్తారు.. ఏది ఏమైనా, ఏ రాయైనా ఒక్కటె, మమ్మల్ని (మహిళల్ని) హింసించడమే మగవాళ్ళ మొదటి కర్తవ్యం.. అందరు మగాళ్ళు ఎదో విధంగా హింసించే వారే..’ అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు.

 

కానీ ఎదో కధలో చెప్పినట్లు, పులితోలు కప్పుకున్న నక్కలాగా, మంచిగా ప్రవర్తించే మగవాళ్ళంతా, మగాళ్ళ తోలు కప్పుకున్న ఆడవాళ్ళంటారా!!!!???? అంతే కాదు, ’మగాళంతా ఒకే రకం.. ’ అంటూ ఊటంకించే మహిళలకు, మహిళా జనోద్దరణకు పాటు పడిన కందుకూరి వీరేశ లింగం గారు గుర్తుకురారు..


వీరాధి వీరుడైన, ఒక భగత్ సింగ్, మగాడు కాదు
ఒక సుభాష్ చంద్ర బోస్, మగాడు కాదు
ఒక తాంతియా తోపే మగాడు, కాదు
ఒక లాలా లజపతిరాయ్, మగాడు కాదు
ఒక మహాత్మా గాంధీ, మగాడు కాదు
ఒక బాల గంగాధర్ తిలక్, మగాడు కాదు
మన ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు, మగాడు కాదు
ఒక బిపిన్ చెంద్రపాల్, మగాడు కాదు
వందే మాతరం గీత రచయత బంకిం చంద్ర చటర్జీ, మగాడు కాదు
ఒక రవీంద్ర నాధ్ ఠాగోర్, మగాడు కాదు
తనలో అర్ద భాగాన్ని పంచి పెట్టిన పరమశివుడు మగాడు కాదు..

మరి వీరెవరో.. ????


ఏమో!!! ఏది ఏమైనా మగాళ్ళంతా మగాళ్ళే.. వారిలో తేడాలు ఏమీ లేవు .. కరస్టే .. ’Men are from Mars and Women are from Venus', చదవక పోయినా మీరన్నదే కరస్టు. జీవితానుభవంలో ఇంకా రాటు తేలలేదు కనుక, వేమన గారి పద్యంలో

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు జల్లగాను,
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వధా అభిరామ వినురవేమా

అని చెప్పినట్లు.. ఎదేదో వాగేస్తున్నా.. ముక్కు పగిలేలా అనుభవఙ్ఞులు తమ విలువైన అభిప్రాయములు తెలుపగలరు.

అంతవరకూ సెలవు,
ఇట్లు
భవదీయుడు

13, మే 2008, మంగళవారం

మహిళలూ - మహరాణులు - మీ ఉద్దేశ్యమేమి? భాగం - ౧

ఈ పుట వెనుక కధా కమామీషు ఏమిటంటే.. మొన్నా మధ్యన జ్యోతిగారితో పిచ్చా పాటిగా మాట్లాడుతుంటే, ఉద్దేశ్య పూర్వకంగా కాక పోయినా మామధ్య జరిగిన సంభాషణలో, ’అందరూ మగాళ్ళేగా.. అంతా ఒకే టైపు. మీ మగాళ్ళంతా ఇంతే..’ అన్నారు. అప్పుడని పించింది. నిజంగానే మగాళ్ళంతా ఒకే లాంటి వారా. అదేదో సామెత చెప్పినట్లు..

పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే నేమి? కంకర రాయితో కొట్టినా పగులుతుంది, అంతే కాకుండా బియ్యంలోని రాయి అన్నంలో కలసి పంటికడ్డం పడ్డా పగులుతుంది. అదీ ఇదీ గాక, దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి పీక మన్నా పీకుతాడు..

ఏది చేసినా పళ్ళు మాత్రం ఊడతాయి.. కాకపోతే వూడకొట్టే విధానం మాత్రం వేరు వేరు. మొదటి రెండూ మనకు నెప్పి చేసేవైతే, వైద్యుడు మనకు నెప్పి తెలియకుండా, డబ్బులు తీసుకుని, పీకి పెడతాడు. అంత మాత్రాన మనం వైద్యుడిని రాయిని ఒకే తాటితో కట్టేయ్యలేం కదా. వైధ్యుడిని రాళ్ళతో సమానంగా పోల్చుకో గలమా. ఒక్క సారి ఎవ్వరైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి

ఏందయ్యా నీకు పైసలిచ్చేది? గాఠిగా ఒక్కటిస్తే పోలా.. పన్నూడి చేతిలోకొస్తుంది. ఈ మాత్రందానికి నీకు వందివ్వాలా?

అని చూడండి. అప్పుడు వైద్యులుంగారి స్పందన ఎలా ఉంటుందో. ఇంతకీ చెప్పొచ్చిందేమిటంటే.. అందరు మగాళ్ళూ ఒక్కటేనా? అస్సలు తేడా లేదా? అన్న నా అలోచనల పరంపరలో భాగంగా నాకు తెలిసిన.. నాకు అర్దమయిన.. నా పీత బుర్రకి తెలిసినంత వరకూ.. నా అనుభవం మేరకూ.. నా పరిధిలో.. ఎదో చిన్న అభిప్రాయం.

ఎదోపాటలో చెప్పినట్లు.. ’మగువ మనసు తెలిసేనా మగజాతికీ..’ (అతడు సినిమాలోని ’నీతో చెప్పనా.. నీక్కూడా తెలిసేనా’ అన్న పాటలో మధ్యలో వస్తుంది) మాటలకు వ్యతిరేకంగా, మగజాతి సంగతి సరే.. అస్సలు స్త్రీ జాతికి తెలుసా అన్న నా సంసయానికి మన తెలుగు మహిళలు  ఏవిధంగా స్పందిస్తారో వేచి చూద్దం.

ఆఖరుగా మరొక్క విషయం, జ్యోతి గారి అంత పెద్ద వారిని నా ఈ పుటలో ప్రస్తావించే అంత అనుభవం నాకు లేదు, అలాగే వారి అంత వయస్సు నాకు లేదు. ఇక్కడ జ్యోతిగారేదో అన్నారని చదువరులు అనుకుని వారిని ఆ దృక్పధంతో చూడనక్కర లేదు. అట్టి జ్యోతిగారే, ప్రమదావనం యొక్క మొదటి సమావేశం గురించిన సంగతులు ప్రచురిస్తూ..

నిజంగా మొగుళ్లని ఆడిపోసుకుంటాము గాని మంచి వాళ్ళే...

అని నిర్మొహమాటంగా ప్రచురించారు. ఆ మాటల్లో వారి అనుభవం, వారి గొప్పతనం, వారి హుందా తనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందువల్ల జ్యోతిగారిని నేను టార్గెట్ చేసుకుని ప్రస్తావిస్తున్నానని మాత్రం నామీద అభాండం వెయ్య వలదు. చాలా మంది ఆడ వాళ్ళు ఈ మాటని అంటూ ఉండగా విన్న నేను అప్పుడప్పుడూ మనసులో పడ్డ వేదనే ఈ ప్రహాసం. నా భార్య నా మొహం మీద అనక పోయినా, ఎప్పుడైనా మనసులో ఈ విధంగా అనుకుని ఉంటుందా?? (ఎమో!! సందేహమే..)

దీని రెండవ భాగం నుంచి కొన్ని సంఘటనలు, ఋజువులు, ఉదాహరణలతో మీ ముందుంటాను. అంత వరకూ.. సెలవు,

ఇట్లు,

భవదీయుడు

PS: ఈ పుట ద్వారా మహిళల మీద యుద్ధాన్ని ప్రకటించానని మాత్రం తలంచ వలదు. ’మగాళందరూ ఒకే టైపా..’ అన్న నా అలోచన ఎంతవరకూ ఏ ఏ కోణాలలో ఏ ఏ విధంగా మార్పు చెందుతుందో నన్నదే అని గమనించ గలరు.

3, మే 2008, శనివారం

మొదటి పుట

ఉబుసు పోక మొదలు పెట్టిన నా బ్లాగు ప్రయాణం ఇప్పుడిప్పుడె కొత్త పుంతలు తొక్కు తున్నట్లుంది. దాని ఫలితమే, ఈ భవదీయుడు. నిజానికి ఈ భవదీయుడిని ప్రారంభించి చాలా రోజులే అయ్యింది, కానీ రెండవ బ్లాగు అవసరమా(??) అన్న ప్రశ్నకు సమాధానం దొరకక ఇంత కాలం స్వీయ శోధనలో కాలం వెళ్ళబుచ్చా. మరి ఇప్పుడెందుకు మొదలు పెడుతున్నా నంటే, స్వీయ శోధనలో సమాధానం దొరికిందని దానర్దం కాదు. కానీ ఉబుసు పోక చేసే పనుల్లో భాగంగా అక్కడ ప్రసురిస్తే, ఏదైనా కొంచం తీవ్రత ఎక్కువై తప్పని సరిగా ఆలోచించ తగ్గ విషయాలు ఇక్కడ ఉంచితే బాగుంటుందని పించింది. అన్నంత మాత్రాన ఇక్కడ అన్నీ సీరియస్ విషయాలే ఉంటాయని మాత్రం భావించకండీ.

ఇక్కడ ప్రచురించ బోయే విషయాలు పొల్లు పోకుండా, స్వీయ భావాలే. స్వీయ ఆలోచనలే. నేనైతే ఎలా స్పందిస్తానో అలా. అదేదో బ్లాగులో చదివిన వాక్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక విధంగా ఆ మాటలు కొంచం అర్దవంతంగానే ఉన్నాయనిపిస్తోంది.

ముక్కు పగిలేంత వరకూ ముక్కు సూటిగా పోవడమే..

ఇదేదో బాగుందే. ఇంతకీ ఎవ్వరీ మహానుభావుడు? చదివే వారికి ఎవ్వరికైనా తెలిసి నట్లైతే తెలియజేయగలరు. వారికి మన తరుపున ధన్యవాదాలు తెలియజేద్దాం.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics