నా మొదటి పుట నుంచి నేటి పుటకి ఒకే ఒక దారం.. ’మగాళ్ళంతా ఒక్కటే టైపు..’ అన్న ఆలోచనే. మొదటి పుటలో అస్సలు ఈ ప్రచురణల వెనుక ఆంతర్యమేమిటి అనేది మూల విషయమయితే, రెండవ భాగం వెనకాల ముఖ్య ఉద్దేశ్యం మగాళ్ళలో ఎన్ని భావనలు ఉంటాయూ అని తెలియ జేయడమే. మంచి చేడులు అన్ని చోట్ల ఉంటాయి. ’భాభా’లు అన్ని చోట్లా ఉంటారు. ఎవ్వరీ ’భాభా’లు అని అనుకుంటున్నారా.. ’భార్యా భాధితులు'. కానీ వాళ్ళని వెలుగులోకి తెచ్చే కన్నా భర్తల భాధితులనే ఈ సంఘం వెలుగు లోనికి తేవడం వల్ల, ఇలాంటి వార్తలు ఎక్కువ మంది ఆడవాళ్ళు చదవడం వల్ల.. ’మగాళ్ళు అంతా ఇలాగే ఉంటారేమో..’ అని జనరలైజ్ చేసేసి అందరినీ ఒకే తాటికి కట్టేసి మాట్లాడెస్తుంటారు.
రెండవ పుటలో ఉదహరించిన వాళ్ళందరూ మగ వాళ్ళైతే.. అస్సలు మగవాడు అంటే ఎలా ఉండాలి అనే నా ఆలోచనకు ప్రతి రూపమే ఈ మూడవ పుట. చదివిన తరువాత తప్పని సరిగా మీ మీ అభిప్రాయాన్ని తెలియ జేస్తారని తలుస్తాను. ఈ పుటలో నేను మగవాళ్ళనే ఎందుకు ఎత్తి గొప్పగా చూపాలి అని కూడా ఆలోచించిన పిదప, అస్సలు భార్యా భర్తలు అంటే ఇలా ఉండాలి అని తెలియ జేస్తే ఎలా ఉంటుందో అని కూడా అలోచించాను. దాని ఫలితమే ఈ స్త్రీ పురుష సంగమం. తత్ విధంగా ఇద్దరూ జీవితం అనేటటువంటి కాడిని మోసే రెండెద్దులుగా మాత్రమే కాక, జీవిత పయనంలో సాగే సంసారం అనే రైలు బండికి ఆధరవుగా నిలిచే రైలు పట్టాల్లాంటి వారని, సమాంతరంగా సాగి పోయే తోడూ నీడ అని, పాలు నీళ్ళలాగా కలసి పోవాలని, తెలియజేసే ఎన్నో ఉదాహరణలు మన ముందే ఉన్నా.. వాటిలోంచి కొన్ని ఇక్కడ ..
వ్యక్తి: నారాయణ మూర్తి జీవిత భాగ స్వామి: సుధా మూర్తి
వివరణ:
ఒక భర్తగా, సుధా మూర్తికి పూర్తి స్వాతంత్ర్యాన్నిచారు. ఆవిడ ఎదుగుదలను చూసి కుళ్ళుకోకుండా తన వంతు కర్తవ్యంగా ఆమెను ప్రోత్సాహిస్తూ.. ఆమె ఎదుగడానికి ప్రయత్నంగా తన కంపెనీ నుంచి నిధులు కూడా సమకూరుస్తున్నారు. ఇక్కడ సుధా మూర్తిగారి గురించిన కొన్ని ముఖ్య విషయాలు మనం గమనించాలి. సుధా మూర్తిగారు M.Tech చదివారు. చదువుకునే రోజుల్లో ఆవిడ బంగారు పతకాన్ని కూడా పొందారు. టెల్కో వారి పూణే ప్రాంత కార్యాలయంలో ఉద్యోగం కూడా చేసారు. నారయణ మూర్తిగారు కూడా ఆరోజుల్లో పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో పూణేలోనే పనిచేసేవారు. ఆరోజుల్లో మొదలైన సాన్నిహిత్యమే అనుకోండి లెదా వీరిద్దరికి ఉన్న పుస్తక పఠనం అయితే కానివ్వండీ, ఇద్దరిని ఒక్కటి చేసాయి.
అంతే అనుకుంటే మనం చాలా విలువైన విషయాలు కోల్పోయామని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ ఈరోజు ఇలా ఉంది అంటే అది సుధామూర్తి గారిచ్చిన పదివేల రూపాయల పెట్టుబడే అని చెబితే నమ్ముతారా? అంతే కాకుండా, ఎన్నో ఆలోచనలతో తాను చెయ్యాలని తపన పడుతున్న భర్తని అర్దం చేసుకుని తాను దాచుకున్న డబ్బుని నారాయణ మూర్తిగారికిచ్చి, ’నీకు మూడేళ్ళు సమయం అలాగే పదివేలు ఇస్తున్నా!!! ఈ మూడేళ్ళు ఇంటిని నేను నడిపిస్తా, మీరు నిశ్చింతగా మీ ఆలోచనలకు ఒక రూపం తెచ్చుకోండి. కుదిరిందా అంతా మంచిదే, లేక పోతే ఆ తరువాత ఇంటి భాధ్యత యధావిధిగా ఇద్దరం భరిద్దాం..’ అంటూ ప్రోత్సాహ పరిచారే, ఎంతటి గొప్ప హృదయం ..
నారాయణ మూర్తిగారు కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. భార్యకి ప్రయాణాలు అంటే ఇష్టమని తెలిసి అమెరికా చుట్టి వచ్చే అవకాసం వచ్చిందని సుధామూర్తిగారు చెప్పగా, వెంటనే చక్కగా వెళ్ళిరా.. నీ ఇష్టా ఇష్టాల్ని నేను ఏనాడూ కాదనను అని పంపించడమే కాకుండా.. ప్రతి రోజూ ఆవిడ బస చేసే హోటల్ కి ఫోను చేస్తూ ఉండేవారు. ఏనాడైనా అర్దరాత్రి వరకూ ఆమె దగ్గరనుండి తన ఫోన్ కాల్‍కి స్పందన లేదనుకోండీ తబ్బిబ్బయ్యేవారు. ఇవన్నీ నేను చెబటం లేదు, గూగులమ్మని అడగండి అదే చెబుతుంది.
ఇంతకన్నా మించిన భార్యా భర్తలు.. నా దృష్టిలో వీరు అసలు సిసలైన ..
ఆడ మగ
వ్యక్తి: బోడపాటి వీర రాఘవులు జీవిత భాగ స్వామి: శుంకర పుణ్యవతి
వివరణ:
రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు, అలాగే వీరిద్దరి గురించి కూడా చాలా తక్కువే తెలుసు అని కూడా తెలియజేయాలి. కానీ తెలిసిన కొంచంలో వీరిరువురూ చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్నట్లు అర్దమవుతోంది. ఎలాగంటారా.. రాఘవులు స్వతహాగా చలాకీ మనిషి. వేర్వేరు దృవాలు ఆకర్షితులవుతాయి అనేటటువంటిది సైన్సయితే, వీరిరువురు ఎలా ఆకర్షితులయ్యారో ఏ సైన్టిష్టు చెప్పలేని, విప్పలేని ఒక సూత్రంగా మిగిలిపోతుంది. ఇద్దరూ అభ్యుధయ వాదులే. ఇద్దరూ సంఘ సంస్కారానికి పాటు పడెవారే. ఒకరిది రాజకీయవాదమయితే మరొకరిది మహిళా లోకం.
వీరే ఇలా అనుకుంటే, వీరి అమ్మాయి ఒక ముస్లిమ్ యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను అంటే, సమాజంలోని సదురు సామాన్య తల్లి తండ్రుల్లా అరచి గీపెట్టి గోలచేయ్య కుండా, వీరి పెళ్ళి దగ్గరుండి జరిపించారు. నిరాడంబరుడు, నిగర్వి, బి వి రాఘవులు తన కుమార్తె వివాహం విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇట్టి గొప్ప ఆలోచనా పరిధి ఎంత మందికి ఉంటుంది?
పెళ్ళి చేసుకోగానే భార్య ఇంటి పేరు మార్చుకోవాలి అన్నది మన తెలుగు వారి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా అని నేను చెప్పను కానీ, పుణ్యవతి గారి ఇంటి పేరు ఇంతవరకూ మార్చుకోక పోయినా ఎటువంటి రభసా చెయ్యకుండా, ఆవిడను ఒక స్వతంత్ర భావాలు కలిగిన పరిపూర్ణ మహిళగా గుర్తించి, ఆవిడను ఒత్తిడి చెయ్యకుండా తన అభీష్టం మేరకు స్వేశ్చ నిచ్చి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారే.. ఇంతకన్నా ఏమికావాలి వీరు కూడా ఒక చక్కటి కుటుంబం లెక్కలోకి చేర్చక పోవడానికి. ఒకరి నొకరు అర్దం చేసుకున్న మరో
మగ ఆడ
ఇంకా ఎందరో.. మరెందరో.. ఎన్నో ఎన్నెన్నో జీవితాలు మనకు కళ్ళకు కట్టి నట్లుగా మన ముందే తిరుగాడుతుంటే.. ఎందుకో ఇంకా ఆ అలోచనలు. మహిళలూ నిద్రలేవండి, మీరెంతో .. మీ శక్తి ఎంతో మీకు తెలియదు. మీరు ఎవ్వరితోనూ తక్కువకాదు, అలాగే ఎదో మిమ్మల్ని ములగ చెట్టెక్కించాం కదా అని మగవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. వారూ మీతో సరి సమానమే. కాకపోతే, ప్రతీ నాణానికీ రెండు ముఖాలు ఉన్నట్లు, ప్రతి వ్యక్తిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. మనం దేన్ని చూస్తున్నాం అన్నదే మన వ్యక్తిత్వం అవుతుంది.
మగవాళ్ళలో చెడ్డ వాళ్ళున్నట్లే ఆడవాళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. మీకు వాళ్ళు కనబడక పోతే ఒక్క సారి మన ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఒక్క సారి గమనించండి. మీకే అర్దమవుతుంది. అంతకీ అర్దం కాకపోతే, నన్నడగండీ.. నేను చూపిస్తా మీకు అట్టి ’నారీ విలన్’లను. ముగింపులో చెప్పొచ్చేదేమిటంటే, ఏ విషయాన్నీ జనరలైజ్ చెయ్యకండీ. కొంచం అలోచించి statements ఇస్తూ ఉండండి.
ముక్తాయింపుగా, మరొక్క మాట,
మహిళలూ .. ఒక్క పిల్లల్నికనడానికిపెట్టడానికి తప్ప.. మీరు మరే విషయంలోనూ మగవారిపై అధార పడకండి.
దేవుడు మగవాళకి ఇచ్చినట్లు మీకూ అన్నీ సరి సమానంగా ఇచ్చాడు. అంతే కాకుండా ఈ రోజుల్లో మగాళ్ళతో సరి సమానంగా పోటీ పడుతూ మా ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు. కొంచం కుళ్ళుగా ఉన్నా, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. అలా అలా ముందుకు సాగి పోతూ ఉండండి. ఏమాత్రం తగ్గద్దు. ఇంక గోతికాడ నక్కల్లాగా, చిత్తాకార్తె కుక్కల్లాగా మిమ్మల్ని ఎప్పుడు మింగేద్దామా అని ఎదురుచూసే మగాళ్ళు ఇదే సమాజంలో ఉన్నారు, అలాగే మహిళా జనోద్దారకులూ ఉన్నారు. కాబట్టి, అందరూ ఒక్కటి కాదని తలుస్తారని భావిస్తూ.. సెలవు
ఇట్లు
భవదీయుడు
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
5 కామెంట్‌లు:
....మరొక్క మాట,
మహిళలూ .. ఒక్క పిల్లల్ని కనడానికి తప్ప.. మీరు మరే విషయంలోనూ మగవారిపై అధార పడకండి.
---------
దానికి మాత్రం ఎందుకూ? ఇంకొన్నేళ్ళలో ఎలాగా అఖ్ఖర్లేదేమో? ;-)
@ఒక్క పిల్లల్ని పెట్టడానికి తప్ప..
హ్మ్ ..ఒక డాక్టర్ గారి దగ్గర విన్నాను ఈ పద ప్రయోగ౦ మళ్ళీ ఇక్కడ. కనడ౦, పుట్టడ౦ వరకు మనుషులకి ఓకే ఈ 'పెట్టడ౦' అన్నది ఎలా వచ్చి౦ది చెప్తారా :)
మౌళి గారు,
కోడి గుడ్లు పెడుతుంది అనేది సర్వసాధారణ వాక్య ప్రయోగం. కానీ పెట్టిన గుడ్లు పిల్లలౌవ్వాలంటే ఎంతో శ్రద్ద మరియు ఓపిక కావాలి. అంతే కాకుండా, పొదిగే పిల్లలయందు తల్లికి మాతృభావన ఉండాలి అనే విషయం ఒక్క మనుష్య జాతికి మాత్రమే వీలు పడుతుంది. అలాంటి మాతృత్వ భావనలేక ఎంతో మంది పిల్లలొద్దనుకుని అబార్షన్ చేయించుకోవడం మనం చూడటం లేదు, అలాగే ఫలనా టైం (సమయాని)కే మా బిడ్డ జన్మించాలి అని నిర్ణయించి మరీ సిజేరియన్ చేయించుకునే తల్లుల గురించి తెలిసిన తరువాత వారు చేస్తున్న పనిని ఏమనాలో తెలియక ఇలా అన్వయించుకున్నాను. ప్రకృతి పరంగా నొప్పులొచ్చి పురుడు పోసుకున్న తల్లులున్న రోజులనుంచి దాదాపు అన్ని ప్రసవాలు సిజేరియన్ అయ్యే రోజులలోకి మనం వచ్చేసాం. అలాంటప్పుడు ప్రకృతికి విరుద్దంగా మనం చేస్తున్నదేమిటి? పిల్లలను కంటున్నామా లేక ఫలానా వేళకే మాకు పిల్లలు కలగాలి అని పెడుతున్నామా?
ఏమో నాకు మాత్రం పిల్లలను పెడుతున్నామేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు
చూడనే లేదు . బాగ చెప్పారు.
@ప్రకృతికి విరుద్దంగా మనం చేస్తున్నదేమిటి?
ఇది మాత్ర౦ చెప్పలేను. సిజేరియన్ తప్పు అని నేను అనుకోవడ౦ లేదు. ఇక నక్షత్రాన్ని బట్టి సిజేరీన్ అ౦టారా, అదికూడా ప్రకృతే నిర్ణయిస్తు౦ది :)
మౌళి గారు,
నా ఉద్దేశ్యంలో సిజేరియన్ తప్పు అని కాదు. కానీ ఆ పద్దతి తప్పని సరి అయిన పరిస్థితులలో మాత్రమే చెయ్యాలి గానీ ప్రతీ ప్రసవాన్ని సిజేరియన్ చెయ్యాలని కాదు. ఈ మధ్య అన్ని వైద్యశాలలో వైద్యులు ముందుగా చెప్పే మొదటి మాట బిడ్డ కడుపులో అడ్డు తిరిగింది కాబట్టి ఆపరేషన్ చెయ్యాలి అని. ఈ మాట వింటూనే ఆ దంపతుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి, ఇక వేరే దారి లేక అయిష్టంగానైనా ఒప్పుకోక తప్పదు. ఇలాంటి వారి పరిస్థితి ఓ ఎత్తైతే, మరి కొందరు అచ్చంగా మాకు పిల్లల్లు ఫలానా టైంకే పుట్టాలి కాబట్టి మీరు ఆ టైంకి మాకు ఆపరేషన్ చేసి పిల్లలను బయటకు తీయ్యండి అని డిమాండ్ చేసిన ఘటనలు కూడా లేక పోలేదు. ఇలాంటి ఘటనలనే నేను వ్యతిరేకించేది అంతే కాని ఆపధర్మ పరిస్థిత్లులలో చేసే సిజేరియన్ల గురించి కాదని గమనించ మనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి