3, మే 2008, శనివారం

మొదటి పుట

ఉబుసు పోక మొదలు పెట్టిన నా బ్లాగు ప్రయాణం ఇప్పుడిప్పుడె కొత్త పుంతలు తొక్కు తున్నట్లుంది. దాని ఫలితమే, ఈ భవదీయుడు. నిజానికి ఈ భవదీయుడిని ప్రారంభించి చాలా రోజులే అయ్యింది, కానీ రెండవ బ్లాగు అవసరమా(??) అన్న ప్రశ్నకు సమాధానం దొరకక ఇంత కాలం స్వీయ శోధనలో కాలం వెళ్ళబుచ్చా. మరి ఇప్పుడెందుకు మొదలు పెడుతున్నా నంటే, స్వీయ శోధనలో సమాధానం దొరికిందని దానర్దం కాదు. కానీ ఉబుసు పోక చేసే పనుల్లో భాగంగా అక్కడ ప్రసురిస్తే, ఏదైనా కొంచం తీవ్రత ఎక్కువై తప్పని సరిగా ఆలోచించ తగ్గ విషయాలు ఇక్కడ ఉంచితే బాగుంటుందని పించింది. అన్నంత మాత్రాన ఇక్కడ అన్నీ సీరియస్ విషయాలే ఉంటాయని మాత్రం భావించకండీ.

ఇక్కడ ప్రచురించ బోయే విషయాలు పొల్లు పోకుండా, స్వీయ భావాలే. స్వీయ ఆలోచనలే. నేనైతే ఎలా స్పందిస్తానో అలా. అదేదో బ్లాగులో చదివిన వాక్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక విధంగా ఆ మాటలు కొంచం అర్దవంతంగానే ఉన్నాయనిపిస్తోంది.

ముక్కు పగిలేంత వరకూ ముక్కు సూటిగా పోవడమే..

ఇదేదో బాగుందే. ఇంతకీ ఎవ్వరీ మహానుభావుడు? చదివే వారికి ఎవ్వరికైనా తెలిసి నట్లైతే తెలియజేయగలరు. వారికి మన తరుపున ధన్యవాదాలు తెలియజేద్దాం.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

2 వ్యాఖ్యలు:

రాకేశ్వర రావు చెప్పారు...

కొత్త బ్లాగు శుభాకాంక్షలు

ఇక మీ ప్రశ్నకు సమాధానంగా, ఈ బ్లాగు లో About Me లో ఆఖరి వాక్యం చూడండి.

చక్రవర్తి చెప్పారు...

ఓ మీరేనా .. ఆ రెడ్డి వారి రెడ్డిగారు. మీ పేరు చదివిన తరువాత గానీ అర్దం కాలేదు మిరు ఏవిధంగా గుర్తుండి పోయ్యారో.

ఏది ఏమైనా, స్పందించినందులకు ధన్యవాదములు.

ఇకపై ముక్కు పగిలేలా సూటిగా మహిళా లోకంపై ప్రచురించడానికి సాహసించాను. ధర్యం చేకూర్చగలరు.

 
Clicky Web Analytics