14, మే 2008, బుధవారం

మహిళలూ - వీరే మగాళ్ళు : రెండవ భాగం

సమయం: అప్పుడెప్పుడో.. 2004    స్థలం: ఒక విధ్యాలయం, విజయవాడ
పాత్రలు పాత్రధారులు: ప్రేమ అని తలచే ఉన్మాది, అలియాస్ మనోహర్ మరియు పైశాచికానికి బలైపోయున కుసుమం శ్రీలక్ష్మీ

సందర్బం:

దేవాలయానికన్నా పవిత్రమైనటు వంటి ఒక విధ్యాలయంలో పరీక్షా సమయానికై ఎదురు చూస్తూ సన్నిహితులతో ముచ్చట్లాడు తున్న శ్రీలక్ష్మికి తాను మరికొన్ని నిమిషాలే బ్రతికి ఉండేదన్న విషయం తెలియదు. దేవాలయం కన్నా పవిత్రంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయం ప్రక్కన పెడితే, విధ్యార్దులను శారదా తనయులుగా తీర్చిదిద్ద వలసిన ఒక కళాశాల ప్రాంగణం లోకి కొబ్బరి బోండాలు తెగగొట్టే కత్తితో ప్రవేశించాడు మన విలన్.. క్షమించాలి మన ఒక్క మగాడు, మనోహర్. రెండో అంతస్తులో తన వంతు కోసం ఎదురు చూస్తున్న శ్రీలక్ష్మిని నిండు క్లాసు రూము మధ్యలో.. విధ్యార్దుల సమక్షంలో.. నిర్దాక్షిణ్యంగా.. కిరాతకంగా.. పైశాచికంగా.. నరికేశి ఏమీ పట్ట నట్లు చక్కగా చెన్నై చెక్కేసాడు.

వీడూ మగాడే



సమయం: అటు తరువాత.. 2007 స్థలం: పునాదిపాడు ఊరి సరిహద్దు
పాత్రలూ పాత్రధారులు: అభం శుభం తెలియని కోనేరు నాగశ్రీ, పరువంలో ఉన్న స్నేహితులు శివ శంకర్, ప్రవీణ్ కుమార్, కిషోర్ బాబు

సందర్బం:

ఇది ఒక అన్నెం పున్నెం ఎరుగని పదవ తరగతి చదువుకునే బాలిక విషాధగాధ. స్నేహితునిగా భావించే శివ శంకర్ పిలుపుని కాదనలేక చెరువు గట్టుకు చేరుకుంది నాగశ్రీ. మెల్లగా తన స్నేహితులతో అక్కడకి చేరుకున్నాడు శంకర్. ఒంటరిగా ఉన్న నాగశ్రీని చూసిన ముగ్గురూ అదే అదునుగా భావించి, కలసి మానభంగం చేయ్యబోయ్యారు. విషయం అర్దం అయ్యి సహాయం కోసం అరచే లోపల ముగ్గురూ కలసి దాడి చేసి, అతి కౄరంగా సృహ కోల్పోయేలా కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు గుంతలో కప్పి పెట్టి పైన ఊపిరి కూడా ఆడకుండా చెత్త మరియూ గడ్డి వేసి కప్పి పాతేశారు.

వీళ్ళూ మగాళ్ళే



సమయం : మొన్నీమధ్య 2008 స్థలం: విజయవాడ
పాత్రలూ పాత్రధారులు: మీనాకుమారి, ఆమె తల్లి తండ్రులు మరియూ మరో ప్రెమోన్మాది సందీప్

సందర్బం:

పెళ్ళికి నిరాకరించారన్న ఒకే ఒక కోపంతో మీనాకుమారి గొంతుకును ఆమె తల్లి తండ్రుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా చీల్చే ప్రయత్నంలో తనని తానూ గాయ పరచుకుని ఊచలు లెక్క పెడుతున్నాడు. గాయంతో మృత్యువుతో పోరాడి గెలిచిన మీనా కుమారి విధి మిగిల్చిన గాయాన్ని ఎలా గెలవగలదు?

వీడూ మగాడే



సమయం: నిన్నగాక మొన్నీ మధ్య, 2008 స్థలం: బ్రిటన్
పాత్రలూ పాత్రధారులు: జ్యోతిర్మయి మరియు నాగరాజ్ కుమార్

సందర్బం:

ప్రేమ పేరుతో మరో విషాధం.

వీడూ మరో మగాడే



సమయం: 2008 ఏప్రెల్ నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: నేను, నా అర్దాంగి, మా కూర గాయల సంచీ మరియూ మనందరికీ సుపరిచితులైన తొలి తెలుగు బ్లాగరి, చావా కిరణ్

సందర్బం:

నా శ్రీమతి చేతిలోని కూరగాయల సంచీని చూచి, ’ఏమిటీ ఇటు నుంచి ఇటుగా కూరగాయలకా..’అని చావా కిరణ్ గారు అన్నారు.’అవునండీ.. తొందరగా వీలైతే కూరగాయలు కొన్నుకుని ఇంటికి చేరుకుంటాం..’ అని జవాబిస్తూ, ’మీరు ఇక్కడ దగ్గర్లో ఎక్కడ కొంటారు?’ అని ఎదురు ప్రశ్న వేసా.

’మాకు దగ్గర్లోని రైతు బజారుకు ఉదయానే వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇచ్చి సాయంత్రం మన సమావేశానికి హాజరు అవ్వడానికి పర్మీషన్ కొట్టేశా..’, చావా కిరణ్ గారి జవాబు
శ్రీమతి కి భయపడి అలా అన్నారని నేను భావించడం లేదు. తన అర్దాంగిని కూడా చర్చించి మరీ సమావేశాలకు హాజరవుతున్నారే అదే మనం గమనించాల్సిన విషయం

వీరూ మగవారే



సమయం: 2008 మే నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: eతెలుగు సమావేశానికి తరచుగా హాజరయ్యె సభ్యులు మరియూ మనందరికీ సుపరిచితులైన మరో తెలుగు బ్లాగరి, కశ్యప్

సందర్బం:

సమావేశం తేవ్ర స్థాయికి చేరుకుంది. ఏవేవో చర్చిస్తున్నాం. ఇంతలో కశ్యప్ గారి ఫోను మ్రోగింది. వెంటనే వారు లేచి, ’నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్, ఇంట్లో గ్యాస్ బండ అయ్యి పోయిందంట, ఇక నేను దయచేస్తాను, క్షమించాలి’ అంటూ క్షణంలో మాయమై పోయ్యారు.

దీన్ని బట్టి అర్దం చేసుకోవాల్సినదేమిటంటే, ఎంతో శ్రమ కోడ్చి, నిస్వార్దంగా అందరూ చేయు చేయు వేసి, మెల్లగా ఒక సంఘంగా తయారయ్యిన eతెలుగు సమావేశాని కన్నా ఇంటిలో ఉన్న తన శ్రీమతి పడే శ్రమముందు, eతెలుగు సమావేశంలో అప్పటికి తన పాత్ర ముంగింపుకు చేరుకున్నందున, ముక్తాయింపుకు సెలవిచ్చి, ఇంతి చేరువుకు ఇంటికి చేరుకున్నారు మన కాశ్యప్‍గారు. అర్దాంగి శ్రమను అర్దం చేసుకునేవారికి ఇదేమి పెద్ద విషయంకాదు.

వీరు మగవారే



పైన చెప్పిన వారందరూ మగవాళ్ళే.. ఏమైనా అంటే, ’పైన పేర్కొన్న ఉన్మాదులు ఒక్క సారిగా హత్య చేసి శారీరకంగా హింసిస్తారు, మిగిలిన వారేమో మానశికంగా హింసిస్తారు.. ఏది ఏమైనా, ఏ రాయైనా ఒక్కటె, మమ్మల్ని (మహిళల్ని) హింసించడమే మగవాళ్ళ మొదటి కర్తవ్యం.. అందరు మగాళ్ళు ఎదో విధంగా హింసించే వారే..’ అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు.

 

కానీ ఎదో కధలో చెప్పినట్లు, పులితోలు కప్పుకున్న నక్కలాగా, మంచిగా ప్రవర్తించే మగవాళ్ళంతా, మగాళ్ళ తోలు కప్పుకున్న ఆడవాళ్ళంటారా!!!!???? అంతే కాదు, ’మగాళంతా ఒకే రకం.. ’ అంటూ ఊటంకించే మహిళలకు, మహిళా జనోద్దరణకు పాటు పడిన కందుకూరి వీరేశ లింగం గారు గుర్తుకురారు..


వీరాధి వీరుడైన, ఒక భగత్ సింగ్, మగాడు కాదు
ఒక సుభాష్ చంద్ర బోస్, మగాడు కాదు
ఒక తాంతియా తోపే మగాడు, కాదు
ఒక లాలా లజపతిరాయ్, మగాడు కాదు
ఒక మహాత్మా గాంధీ, మగాడు కాదు
ఒక బాల గంగాధర్ తిలక్, మగాడు కాదు
మన ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు, మగాడు కాదు
ఒక బిపిన్ చెంద్రపాల్, మగాడు కాదు
వందే మాతరం గీత రచయత బంకిం చంద్ర చటర్జీ, మగాడు కాదు
ఒక రవీంద్ర నాధ్ ఠాగోర్, మగాడు కాదు
తనలో అర్ద భాగాన్ని పంచి పెట్టిన పరమశివుడు మగాడు కాదు..

మరి వీరెవరో.. ????


ఏమో!!! ఏది ఏమైనా మగాళ్ళంతా మగాళ్ళే.. వారిలో తేడాలు ఏమీ లేవు .. కరస్టే .. ’Men are from Mars and Women are from Venus', చదవక పోయినా మీరన్నదే కరస్టు. జీవితానుభవంలో ఇంకా రాటు తేలలేదు కనుక, వేమన గారి పద్యంలో

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు జల్లగాను,
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వధా అభిరామ వినురవేమా

అని చెప్పినట్లు.. ఎదేదో వాగేస్తున్నా.. ముక్కు పగిలేలా అనుభవఙ్ఞులు తమ విలువైన అభిప్రాయములు తెలుపగలరు.

అంతవరకూ సెలవు,
ఇట్లు
భవదీయుడు

5 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

చక్రవర్తి గారూ,
స్త్రీలందరికీ పురుషులంటే అసహ్యం ఉందనీ, ఆడాళ్లను 'వాళ్ళందరూ ' హింసించేస్తున్నారనీ, ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరూ అనరండీ! అలా అన్నారంటే వాళ్ళు అతివాద ఫెమినిస్టులు తప్ప (ఫెమినిస్టుల్లో కూడా అతివాదులు, అసలు వాదులు ఉన్నారని గుర్తించండి) వేరెవరూ కాదు. స్త్రీ పురుషుల సహకారంతో కొనసాగేవే నిజమైన కాపరాలు, సంసారాలూ! ఈ మనోహర్లూ, మరొకడు, మరొకడు ఆవెశంతో చేసిన హత్యలనే అందరూ నిరసించేది! వీళ్ళు కొంచెం సమ్యమనంతో వ్యవహరించి, ఆవేశాన్ని అదుపు చేసుకుని ఉంటే వాళ్ళూ పెళ్లి చేసుకుని ఉత్తమ భర్తలు గా ఉండగలిగి ఉండేవాళ్ళేమో !

నోట్: కూరలు, గ్యాసు తేవడం కూడా పేద్ద సహకారమేనా, త్యాగమేనా అని ఎవరినా అడిగితే ఏం చెప్పాలో ప్రిపేర్ అవ్వండి!

Kathi Mahesh Kumar చెప్పారు...

ఆడాళ్ళలో మేల్ చౌవ్వనిస్ట్ లు ఉండవచ్చు,మగాళ్ళలో ఫెమినిస్టులుండవచ్చు ఇవన్నీ ‘exceptions'. వాటి గురించి ఉదహరించి సమర్ధించుకోవడం అంత శ్రేయస్కరం కాదనుకుంటా. ఎందుకటే,తద్వారా మనం చేసే జనరలైజేషన్లు నిజానికి అద్దం పట్టలేవు.

ఇక అసలు సమస్యలోకి వస్తే,ప్రేమ హింసలకి కారణాలు మనసమాజంలో మారుతున్న సంబంధాలతో పాటూ మారని విలువలు అని నా అభిప్రాయం . ఇందులో మగాళ్ళదీ,ఆడవాళ్ళదీ సమానమైన భాధ్యతఉంది.

రాధిక చెప్పారు...

మగవాళ్ళందరూ అంతే అని ఎవరూ అనరండి.మీరు చెప్పిన మనోహర్ లాంటివాళ్ళు నూటికి ఒక్కళ్ళు వుంటే,ఆడవాళ్లని ఏదోరకంగా బాధించి[మానసికంగా,శారీరకంగా]ఆనందపడేవాళ్ళు నూటికి నలభై మంది ఉంటారు.బాధించడం అంటే షోల్డరింగ్,టచింగు,వల్గర్ గా కామెంట్ చెయ్యడం,వెకిలి చూపులు లాంటివన్న మాట.
అలాగే ఆడవాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు.అందులోనూ రెచ్చగొట్టేవాళ్ళు,కావాలని వెనుక తిప్పుకొనేవాళ్ళూ,అవకాశాన్ని బట్టి మన్సు మార్చుకునేవాళ్ళు చాలామందే ఉంటారు.
దేన్నీ జనరలైజ్ చెయ్యకూడదు.కానీ మళ్ళా మళ్ళా రిపీట్ అవుతున్న దుశ్చర్యలను,ఆగడాలను[మీరు ఉదహరించిన ఉన్మాదులలాంటివాళ్ళని]ఖండించడంలో తప్పులేదనుకుంటాను.
సుజాతగాఇ ప్రశ్నే నేనూ వేస్తున్నాను.గేస్ బండలు,కూరగాయలు లేకపోతే కష్టం ఎవరికి?మీరేగా బయటనుండి భోజనం తేవాలి.
అలాకాకుండా మీటింగ్ లో ఉన్నప్పుడు శ్రీమతిగారు ఫోను చేసి నాకు ఆడాళ్ళ మీటింగ్ వుంది నన్ను అక్కడ డ్రాప్ చెయ్యండి అంటే ఎంతమంది వెళతారో చెప్పండి.అది బాధ్యత అని ఒప్పుకుంటాము.
ఇక్కడ కస్యప్,కిరణ గార్ల ప్రేమని తక్కువ చెయ్యలని నా ఉద్దేశ్యం కాదు.గమనించగలరు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

@సుజాత గారూ,

కూరలూ, గ్యాసు తేవడం పెద్ద సహకారం కాదు గానీ.. చెప్పంగానే బయలు దేరారే.. శ్రీమతులకు అదే పెద్ద వరం. వారి మాటలకు విలువ నిచ్చి అన్నదే తడవుగా స్పందించారు చూసారూ అదే పదివేలు. ఆ విషయం గమన్నించాలి. ఇక్కడ తమరు అర్దం చేసుకోవలసిన త్యాగమేమిటంటే.. కశ్యప్ గారు eతెలుగు కార్య వర్గంలో ఒకానొక ముఖ్య సభ్యులు. అట్టి వారు, eతెలుగు సమావేశాని కన్నా తన భార్య పడే అవస్త గుర్తుకు చేసుకుని పిలిచినదే తడవుగా పరుగెత్తారే.. అది త్యాగం కాదంటారా?

@కతి మహేష్ కుమార్ గారూ,
మీతో నేను ఏకీభవిస్తాను. దీని కంతటికీ అస్సలు మూల కారణం ఏమిటంటే.. చాలా మంది ఆడవాళ్ళు కోపం వచ్చినప్పుడల్లా అనే మొదటి మాట, ’మీ మగాళ్ళంతా ఒక్కటే..’
ఇదే.. ఈ మాటనే నేను వ్యతిరేకించేది. అందరూ ఒక్క లాంటి వారు కారు అని వారు గ్రహిస్తే అంతే చాలు. అంతేకాకుండా, ఆడువారు అనే మరో statement ఎమిటో కూడా పైన ఉదహరించినట్లుగా మానసిక హింస, సారీరక హింస.. blah .. blah అంటూ దేని దేనికో లింకులు కలిపేస్తారు. ఏది ఏమైనా సమాజంలో ఆడవారికి ఎంత భాద్యత ఉందో మగవారికీ అంతే భాద్యత ఉందని నేనూ మీతో ఏకీభవిస్తాను.

@రాధికగారూ,
మీరు అనక పోవచ్చు. కానీ నేను చాలా చోట్ల కన్నాను మరియూ విన్నాను. అంతే కాకుండా మీ నిస్పక్షపాత వైఖరిని మెచ్చుకోలేకుండా ఉండలేను. చాలా బాగా వివరించారు.
వంటలు గురించి ప్రక్కన పెట్టి, సుజాతగారికి ఇచ్చిన వివరణలో మీకు సమాధానం లభిస్తుందని భావిస్తాను.
ఇక భాద్యత విషయానికొస్తే.. అందరు మగాళ్ళు ఒకే లాంటి వారు కాదు అని నేను భావిస్తున్నా కాబట్టి, ఎంత మంది ఆ భాద్యత తీసుకుంటారో నేను చెప్పలేను. కానీ నావరకూ నాకు నామీద అలాగే పైన ఉదహరించిన చావా కిరణ్ గారు మరియు కశ్యప్ గార్ల మీద నాకు నమ్మకముంది. తప్పని సరిగా మేము మీరు చెప్పిన త్యాగి లిస్టులో చేరుతామని మాత్రం చెప్పగలను.

జ్యోతి చెప్పారు...

చక్రవర్తి ,,

అందరు మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అందరు ఆడవాళ్ళు మంచివాళ్లు కాదు. కాని మగవాళ్ల వల్ల కష్టాలు పడే ఆడవాళ్లు ఎక్కువ కాబట్టి మగాళ్లు ఇంతే అని వాళ్ళ మాటలే ఎక్కువ కనబడతాయి.

ఇక చావా కిరణ్ ఇంట్లోకి కూరగాయలు తెచ్చి ఇచ్చి మీటింగ్ పర్మిషన్ తీసుకున్నానంటే నమ్మేసావ్. అలాగే కశ్యప్ మీటింగు మధ్యలో శ్రీమతి పిలవగానే వెళ్ళాడని జాలి పడ్డావ్. నీవు మీటింగ్ అయ్యక కూరగాయాలు తీసుకెళ్ళాలి అని సంచితో వచ్చావు.అయితే మీరు త్యాగాలు చేసినట్టేనా? ఇద్దరూ వర్కింగ్ కాబట్టి కిరణ్ వారానికి సరిపడా కూరగాయాలు తెచ్చిపెడతాడు. లేకుంటే ఏం తింటాడు మరి. కశ్యప్ సంగతి కూడా అంతే. గ్యాసు లేకుంటే సోమవారం పొద్దున వంట ఎలా? ఇద్దరూ పనికి వెళ్ళాలి. కష్టంకదా. అందుకే పరిగెత్తాడు. నీ సంగతి అంతే. మిగతా రోజులు తీరిక ఉండదు. ఐనా మీరు చేసింది మీకోసం కూడా. అదే కశ్యప్ శ్రీమతి తనకు షాపింగ కు తీసికెళ్ళమంటే అలా వెళ్ళేవాడా? ఐనా మీ ముగ్గురు కొత్త పెళ్ళికొడుకులు .. అలాగే పరిగెత్తుతారు నాయనా? ఓ పదేళ్ళ తర్వాత మీ కథలు చూద్దాం. ఏం చేస్తారో??

 
Clicky Web Analytics