10 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
10 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నన్నయ్యపై వ్రాసిన పుట - ఆత్మావలోకనం

 

క్రిందటి సంవత్సరం జులై నెలలో ఏడవ తారీఖున నేను పూజ్యనీయులైన నన్నయపై ఒక పుట వ్రాసాను. ఆ తరువాత కొంతకాలానికి ఆ పుటని నేను పునఃపరిశీలించాను. అప్పుడు నాలో నాపై కలిగిన ఆలోచనలు, భావనలు, స్పందనలు, వగైరా వగైరా నన్ను ఆత్మావలోకనం చేసుకునేటట్టు చేసాయి. అలాంటి ఆత్మావలోకనం లోంచి ఉద్బవించినదే ఈ పుట. మరి మీ ఆలోచనలేమిటో సెలవివ్వండి

మొదటగా నా ఆలోచనలు.

అచ్చంగా అర ఠావు నిండా అచ్చు తప్పులు లేకుండా వ్రాయడం చేతగాని నేను.. ఆది కవి అని ఎంతో మంది చేత జేజేలు అందుకున్న మహానుభావుని గురించి (హాస్యాస్పదంగా నైనా సరే..) వ్రాయడమా. ఎంతటి మూర్ఖత్వము? గూగుల్ వాళ్ళని అడిగి కొన్ని కొన్ని వెబ్ సైట్లలో జరిగిన చర్చలను తీసుకుని వచ్చి ఏదో పాయింట్ ఉంది అని వ్రాయడం ఎంత మాత్రం హర్షదాయకం. ఒక వేళ్ళ నేను ఉదహరించిన పాయింట్స్ నిజమై ఉండొచ్చు, అన్నంత మాత్రాన నా భాషలో అంతటి చులకనా భావం అవసరమా!! అక్కడ స్పందించిన వారిలో మరో పూజ్యనీయులైన డా॥ పాండు రంగ శర్మగారు ఉదహరించిన పాయింట్ లాజికల్ గానే ఉంది. కానీ, నిజం చెప్పాలంటే, నాకు సదురు "పాండు రంగ శర్మగారి లాంటి వారితో ఈ విషయంపై చర్చించటం.." అనే విషయాన్ని కాదు కదా అస్సలు అలాంటి విషయాన్ని వీరిని అడగటానికి సరైన పదాలే నావద్ద లేవంటే, నాకు తెలుగు భాషపై ఉన్న పట్టు మీకే అర్దం అవుతుంది. అలాంటి నేను, అల్పులలో అత్యంత అల్పుడను, నన్నయ్య వంటి (ఘనాపాటి అనచ్చో లేదో తెలియదు) మహాను భావులను తూలనాడటమా.. ఎంతటి ఘోర తప్పిదము? నా స్వార్దం కోసం ఇలాంటి మహానుభావులు బలి కాకూడదు.

అంతటితో ఆగకుండా నాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను చులకనగా ప్రస్తావించడం ఏమాత్రమూ మెచ్చుకోదగినది కాదు. ఇది ఒక విధంగా గురు ధూషణే అని నా అభిప్రాయం. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచిస్తే, భహిరంగంగా చేసిన తప్పుని ఒప్పుకోక తప్పదని నా మనసుకు అనిపించింది. తత్ ఫలితమే ఈ పుట. అందుకని సభా పూర్వకంగా, బ్లాగు ముఖంగా ..

నన్నయ్య గారికి మరియు నాకు విధ్యా బుద్దులు

నేర్పిన గురువులకు హృదయపూర్వక క్షమాపణలు.

మన్నించండి.. క్షమించండి..

10, జనవరి 2010, ఆదివారం

తప్పిపోయినారు - పట్టి ఇచ్చిన వారికి బహుమానం

పై చిత్రం లో ఉన్న వ్యక్తి 2008 క్రిస్మస్ రోజునాటి నుంచి కనబడుట లేదు. కావున ఎవ్వరికైనా కనబడితే తెలియ జేయగలరు. పట్టి ఇచ్చిన వారికి తగిన బహుమానం. [[Wanted only  alive]]
.
.
.
.
నాయినా.. నువ్వు ఎక్కడ ఉన్నా కొంచం కనబడు.. నువ్వులేక మా ప్రక్క ఇంట్లో అంతా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళింట్లోని రామ చిలుక కూడా పారిపోయింది. కావున ఎక్కడ ఉన్నా వచ్చేయ్.. నిన్ను కొట్టము తిట్టము.

ఇట్లు
శ్రేయోలాభిలాషి

 

గమనికః ఇది ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో వ్రాసినది కాదు. It is an attempt to rebuild the interface with his person, with whom I lost contact with since Dec 2008 . తప్పుగా అనిపించిన యడల మన్నించండి.

 
Clicky Web Analytics