25, జులై 2009, శనివారం

నన్నయ్య ఆది కవి - నేనొప్పుకోను !!

తెలుగు మాట్లాడేనేను నన్నయ్యను ఆది కవిగా ఒప్పుకోను. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నన్నయ్యను ఆది కవిగా నిర్ణయించి నా మనోః భావాలను దెబ్బదీసినది. ఇందుకు అసమ్మతిగా నేను న్యాయస్థానంలో ప్రజా వాఙ్మయాన్ని (సరిఅయినదో కాదో .. ఆంగ్లంలో చెప్పాలంటే, Public Litigation Interest) వేయ తలంచాను. ఖబడ్ దార్ !! అందరూ ఇక కాచుకోండి. చిన్నప్పుడు నాకు విధ్యా భుద్దులు నేర్పిన గురువులారా!! సిద్దం కండి.. చెరసాలలో ఊచలు లెక్క పెట్టడానికి. అబద్దపు విధ్యను భోదిస్తారా!! హన్నన్నా .. ఎంత కండ కావరము .. వీరికి తోడు మన అన్న తారక రామారావు గారు నన్నయ్యకు టాంక్ బండ మీద విగ్రహం కూడా కట్టిస్తారా!! చూస్తా అది ఎంత వరకూ నిలుస్తుందో, కట్టించిన ప్రభుత్వమే దిగి వచ్చి తమ తప్పు ఒప్పుకుని ఆ విగ్రహం తీసేటంత వరకూ పోరాడుతాను.


భళా !! ఏమి ఈ వైపరీత్యం .. ఎందుకీ పక్షపాతం.. నాకు తెలిసి నన్నయ్య వీళ్ళందరికీ లంచం ఇచ్చుంటాడు. కమాన్ నన్నయ్య.. కమాన్ .. ఏదీ నాకు లంచం ఇచ్చి చూడు. నిన్ను తీసుకెళ్ళి బొక్కలో పెట్టిస్తా.. అలాగే ఒరేయ్ తొక్కలో తెలుగోళ్ళలారా .. సభా ముఖంగా మీ అందరికీ ఇదిగో ఇదే నా హెచ్చరిక.. మర్యాదగా అందరూ కలసి ముక్త ఖంఠంతో నా మాటని ఒప్పుకున్నారా, సరి, పోనీలే యదవలు తెలియక తప్పు చేసారని క్షమించి ఒదిలేస్తాను. కాదని మొండికేశారా.. అంతే మరి .. ఇకపై మాటలుండవు.. ఓన్లీ చేతలే..


ఏమిటిది వీడికేమైందనుకుంటున్నారా !! ఏమీ కాలేదు .. నా ఈ పుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇవిగో వాటిల్లో మచ్చుకు కొని..


మొదటిది ) కాళ్ళకూరు నారాయణరావు గారన్న్ట్లట్లు పూజ్య పాదుడనే తెలుగు కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడంట. ఎప్పుడనుకుంటున్నారు క్రీ.పూ. 28వ సంవత్సరంలో అనుకుంటా. అందుమూలంగా నన్నయ్య కన్నా దాదాపు 1000 సంవత్సరాలకు ముందే ఈయన గురించి జనాలకు తెలుసు, ఆఫ్ కోర్స్ ఈయన కన్నడంలో రచించాడు అనేది ఓ నిజం అనుకోండి, అన్నంత మాత్రాన తెలుగులో రచించ లేదంటారా!!


రెండవది ) అంతెందుకండి, మాకు విధ్యా భుద్దులు చెప్పిన గురువులే చెప్పారు, గాధా సప్తశతి అనేదేదో కావ్యం ఉందంట. దానిని రచించిన వారిలో తెలుగోళ్ళు ఉన్నారంట. మరి ఆ తెలుగోళ్ళు ఈ కావ్యం కాకుండా ఏమీ పీకలేదా!! (అన్నమయ్య సినిమాలో తనికెళ్ళ భరణి అన్నమయ్యకు చెప్పిన డైలాగ్ .. "రాజుగారిమీద కవిత్వం చెప్పవయ్యా అంటే.. చక్కగా, నువ్వది పీకావో, నువ్విది పీకావో .." అన్న వైనంలో ఈ డైలాగ్) ఏదో ఒకటి పీకే ఉంటారు .. మరి అలాంటప్పుడు మన నన్నయ్యను ఆది కవి అని ఎలా అన గలుగుతున్నారు !! కమాన్ .. ఐఆమ్ హర్ట్.. ఐ వాన్ట్ టి స్పీక్ టు పెద్దారెడ్డి నౌ


మూడవది ) తెలుగు కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లుకు ధీటుగా కన్నడ భాషకూ మరో కవిత్రయం ఉంది. గౌరవనీయులైన నాగయ్య గారు ప్రస్తావించినట్లుగా, కన్నడ కవిత్రయం (పంపడు, రన్నడు, పొన్నడు) లోని పద్మ కవి (క్రీ.శ.950 నాటి సర్వ దేవుడు) తెలుగు దేశంలోనే పుట్టినా కన్నడ రచనలు చేసినారని , మొదట్లో వారు తెలుగు రచనలు చేసి ఉంటారని, కొందరు పండితుల అభిప్రాయం. మరి అట్లాంటప్పుడు మన పంపడు కూడా తెలుగోడేగా .. ఏంది కాదంటారా.. మరి ఈయన ఏమీ ఈ(పీ)కలేదంటారా!!


ఇవ్వన్నీ మనకొద్దు భాయ్ .. ఇప్పుడు సచ్చిన ఈళ్ళందర్నీ ఈడకు రప్పియాలే.. మన ప్రభుత్వ నిరంశ ధోరణి పై కోర్ట్ల కేసేయ్యాలా !! అప్పుడు గాని నాకు నిద్ర రాదు !!


చదివే మీరే ఏమంటారు?

ఈ పుట చదివిన తరువాత మీ అభిప్రాయాన్ని నిస్కర్షగా తెలియ జేయగలరు ..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

13 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

There are many people who believe that there was some literature in Telugu long before Nannayya - The issue is still being hotly debated

అజ్ఞాత చెప్పారు...

మీ సెటైరు అదిరింది. కులగజ్జితో "నన్నయ ఆదికవి కా"డనేవాళ్ళు కొందరు. ప్రాంతీయగజ్జితో ఆయన స్థానానికి ఎసరుపెట్టాలనుకునేవాళ్ళు కొందరు. అసలు జిల్లాకో ఆదికవి. ప్రతి ఉపకులానికో ఆదికవి ఉండాలి. ఛ ! ఒక్క నన్నయ్యేనా పదికోట్లమందికీ కలిపి ! ఇదన్యాయం !! అక్రమం !!

చైతన్య చెప్పారు...

నాకు రెండు తప్పుడు క(అ)నిపించాయి... అంటే విషయంలో కాదు... వ్యాఖ్యానంలో...
1)ప్రజా వాఙ్మయాన్ని ... ప్రజా వ్యాజ్యం అనాలనుకుంటా!
2)ప్రభుత్వ నిరంశ ధోరణి ... నిరంకుశ ధోరణి అనాలేమో !

ఇక పోస్ట్ సంగతి అంటారా... ప్రయత్నం బాగానే ఉంది... విషయం ఆలోచించేదే... మీరు దాన్ని కాస్త కామెడీ గా చెబుదామని ప్రయత్నించినట్టున్నారు... కానీ అక్కడక్కడ అది కొంచం మీరినట్టుగా నాకు అనిపించింది... అంటే నన్నయ లాంటి వాళ్ళని మరీ తీసిపారేసినట్టుగా...!

కొత్త పాళీ చెప్పారు...

మీరిచ్చిన ఉదాహరణలన్నీ తెలుగువారైన మనుషులు వేరేభాషల్లో రాసిన కావ్యాలుగా అనిపిస్తున్నాయి. అల్లాంటప్పుడు తెలుగులో నన్నయ్య ఆదికవి అని ఒప్పుకోడానికేమీ అభ్యంతరం కనబడదు!
రాసిన విధానం మాత్రం హాస్యాంగా బానే ఉంది.

Kathi Mahesh Kumar చెప్పారు...

నన్నయ్య ఆదికవాకవా కాదా? అనే ప్రశ్న కొద్దికాలంగా నలుగుతున్నదే. నన్నయ కంటే ముందే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన అధర్వణాచార్యుడు ఉన్నాడన్నది ఆల్రెడీ నిరూపించబడింది కూడా.

Dr.R.P.Sharma చెప్పారు...

ఇప్పటికి లభిస్తున్న గ్రంథరూపవాఙ్మయంలో నన్నయ ఆదికవి. మీరు నన్నయకుపూర్వం తెలుగు వారు చెప్పిన ఇతరభాషాకవిత్వాన్ని ప్రస్తావిస్తూ, "వారు తెలుగులో కూడా రాసే ఉంటారు" అని ఊహ మాత్రమే రాసారు.నన్నయకు పూర్వం శాసనాల్లో పద్యాలు కనిపించాయిగా? వాటినీ ప్రస్తావించవచ్చు కదా?

ఓ బ్రమ్మీ చెప్పారు...

భారద్వజ గారు,

అది నిజమే.. అందుకే ఈ ప్రయత్నం

చంద్రచూడ్ గారు,

మీతో నేనేకీభవిస్తాను. అందునా మా కృష్ణా జిల్లా వాసుడు కాదు కనుక నన్నయను అస్సలు క్షమించను. పైపెచ్చు నన్నయ్యకు ఒక బ్లాగులేదు, ఒక కవిత్వం కూడా అంతర్జాలంలో ప్రచురించలేదు. కాబట్టి మన చావా కిరణే ఆది కవి అంటాను. ఖండించే సాహసం చెయ్యగలరా!!

చైతన్య గారు,

మీ దిద్దుబాట్లను అంగీకరిస్తున్నాను. మీరు ఆలోచనలో పడ్డారంటే నా ఈ ప్రయత్నం కొంచం ఫలించినట్లే. స్పందించి నందులకు నెనరులు

కొత్తపాళీ (నారాయణ స్వామి) గారు,
మీరన్నది నిజమే. పరభాషను అలికి చిలికి ఆపోశన పట్టిన మన తెలుగోళ్ళు మాతృ భాషలో ఎంతో కొంత చెయ్యక పోయుంటారా!! అసంభవం. వాగే నోరు, తిరిగే కాలు ఎప్పటికీ ఊరకే ఉండవు. ఆ విధంగా ఒక వేళ వాళ్ళు వ్రాసినా, అవి భద్ర పరచలేదని నా అభిప్రాయం. ఏమంటారు?

మహేష్ గారు,
అధర్వణాచార్యుడు ఆంద్రీకరించాడని నిరూపించ బడలేదు. కానీ ఒకనొక భాషలోకి అనువదించాడని మాత్రం చెప్ప బడింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి భాషలలో తెలుగుకే ఎక్కువ ప్రాబబులిటి ఉండడం వల్లన అలా అనుకుంటారు. ఏమంటారు?

Dr. రామక పాండు రంగ శర్మ గారు,

మొదటిదిగా, మీఅంత పెద్ద వారు నా బ్లాగు చదివినందులకు నాకు చాల ఆనందంగా ఉంది. మీకు నా పాదాభి వందనం. (తప్పుగా పలికితే క్షమించండి). అయ్యా !! మీతో చర్చించే ఙ్ఞానం నాకు లేదు, కొంచం ఓపిక వహించి తరువాయి పుటలు చదవమని విన్నపం

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

నన్నయకు పూర్వం తెలుగు భాషగాని, తెలుగు వారుగాని, తెలుగులో రచనలుగాని, పద్యాలుగాని లేవని ఎవరూ అనడం లేదు. ఒక సమగ్ర కావ్య స్వరూపాన్ని తెలుగు భాషకు తొలిసారిగా అందించడం వలన ఆయనను మనం " ఆది కవి " గా గౌరవిస్తున్నాం ! ఇంతకీ ఈ విషయం విన్నారా ? నన్నయ, అతని మిత్రుడు నారాయణ భట్టు ... ఇద్దరూ కన్నడిగులట !

ఓ బ్రమ్మీ చెప్పారు...

డా. ఆచార్య ఫణీంద్ర గారూ,

స్పందించి నందులకు ధన్యవాదములు. నిజమేనండి, మీరన్నట్లుగా ఒక సమగ్ర రూపం లేక పోవడమూ.. అంతే కాకుండా దానికి హక్కు దారులము మేము అంటూ ఎవ్వరూ లేక పోవడమూ వల్లన వారి వారి ప్రచురణలకు ఐడెన్టిఫికేషన్ రాలేదు

హతవిధీ,

ఇది నిజమా.. మన నన్నయ్య కనడనా.. నేనొప్పుకోను!!!

mahigrafix చెప్పారు...

హాస్యాస్పద ధోరణిలో మీరు చేసిన ఈ సవాల్ అభినందనీయం.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

@phanindra gaaru

very nice explanation........

aravind gaani page చెప్పారు...

https://uniqguy.blogspot.in/2017/09/malliya-rechana-first-telugu-poet.html

It has been over thirty years since Malliya Rechana's composition Kavijanasrayam(Telugu Chandassu) was firmly established to 940 AD. The most authoritative Telugu historian Arudra Garu and many others have accepted it.

Erstwhile Andhra Pradesh IGNORED him on purpose from 30 years because the govt and people like you don't like anything to be proved before Nannaya.

And second,Kandukuri Veerashalingam and others have said that there is a deliberate attempt by some people to project Nannaya as first poet.

https://uniqguy.blogspot.in/2017/10/nannaya-nijaalu.html

aravind gaani page చెప్పారు...

Malliya Rechana - First Telugu Poet - 900-950 AD

Nannaya Nijaalu

 
Clicky Web Analytics