ఈ పుట వెనుక కధా కమామీషు ఏమిటంటే.. మొన్నా మధ్యన జ్యోతిగారితో పిచ్చా పాటిగా మాట్లాడుతుంటే, ఉద్దేశ్య పూర్వకంగా కాక పోయినా మామధ్య జరిగిన సంభాషణలో, ’అందరూ మగాళ్ళేగా.. అంతా ఒకే టైపు. మీ మగాళ్ళంతా ఇంతే..’ అన్నారు. అప్పుడని పించింది. నిజంగానే మగాళ్ళంతా ఒకే లాంటి వారా. అదేదో సామెత చెప్పినట్లు..
పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే నేమి? కంకర రాయితో కొట్టినా పగులుతుంది, అంతే కాకుండా బియ్యంలోని రాయి అన్నంలో కలసి పంటికడ్డం పడ్డా పగులుతుంది. అదీ ఇదీ గాక, దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి పీక మన్నా పీకుతాడు..
ఏది చేసినా పళ్ళు మాత్రం ఊడతాయి.. కాకపోతే వూడకొట్టే విధానం మాత్రం వేరు వేరు. మొదటి రెండూ మనకు నెప్పి చేసేవైతే, వైద్యుడు మనకు నెప్పి తెలియకుండా, డబ్బులు తీసుకుని, పీకి పెడతాడు. అంత మాత్రాన మనం వైద్యుడిని రాయిని ఒకే తాటితో కట్టేయ్యలేం కదా. వైధ్యుడిని రాళ్ళతో సమానంగా పోల్చుకో గలమా. ఒక్క సారి ఎవ్వరైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి
ఏందయ్యా నీకు పైసలిచ్చేది? గాఠిగా ఒక్కటిస్తే పోలా.. పన్నూడి చేతిలోకొస్తుంది. ఈ మాత్రందానికి నీకు వందివ్వాలా?
అని చూడండి. అప్పుడు వైద్యులుంగారి స్పందన ఎలా ఉంటుందో. ఇంతకీ చెప్పొచ్చిందేమిటంటే.. అందరు మగాళ్ళూ ఒక్కటేనా? అస్సలు తేడా లేదా? అన్న నా అలోచనల పరంపరలో భాగంగా నాకు తెలిసిన.. నాకు అర్దమయిన.. నా పీత బుర్రకి తెలిసినంత వరకూ.. నా అనుభవం మేరకూ.. నా పరిధిలో.. ఎదో చిన్న అభిప్రాయం.
ఎదోపాటలో చెప్పినట్లు.. ’మగువ మనసు తెలిసేనా మగజాతికీ..’ (అతడు సినిమాలోని ’నీతో చెప్పనా.. నీక్కూడా తెలిసేనా’ అన్న పాటలో మధ్యలో వస్తుంది) మాటలకు వ్యతిరేకంగా, మగజాతి సంగతి సరే.. అస్సలు స్త్రీ జాతికి తెలుసా అన్న నా సంసయానికి మన తెలుగు మహిళలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూద్దం.
ఆఖరుగా మరొక్క విషయం, జ్యోతి గారి అంత పెద్ద వారిని నా ఈ పుటలో ప్రస్తావించే అంత అనుభవం నాకు లేదు, అలాగే వారి అంత వయస్సు నాకు లేదు. ఇక్కడ జ్యోతిగారేదో అన్నారని చదువరులు అనుకుని వారిని ఆ దృక్పధంతో చూడనక్కర లేదు. అట్టి జ్యోతిగారే, ప్రమదావనం యొక్క మొదటి సమావేశం గురించిన సంగతులు ప్రచురిస్తూ..
నిజంగా మొగుళ్లని ఆడిపోసుకుంటాము గాని మంచి వాళ్ళే...
అని నిర్మొహమాటంగా ప్రచురించారు. ఆ మాటల్లో వారి అనుభవం, వారి గొప్పతనం, వారి హుందా తనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందువల్ల జ్యోతిగారిని నేను టార్గెట్ చేసుకుని ప్రస్తావిస్తున్నానని మాత్రం నామీద అభాండం వెయ్య వలదు. చాలా మంది ఆడ వాళ్ళు ఈ మాటని అంటూ ఉండగా విన్న నేను అప్పుడప్పుడూ మనసులో పడ్డ వేదనే ఈ ప్రహాసం. నా భార్య నా మొహం మీద అనక పోయినా, ఎప్పుడైనా మనసులో ఈ విధంగా అనుకుని ఉంటుందా?? (ఎమో!! సందేహమే..)
దీని రెండవ భాగం నుంచి కొన్ని సంఘటనలు, ఋజువులు, ఉదాహరణలతో మీ ముందుంటాను. అంత వరకూ.. సెలవు,
ఇట్లు,
భవదీయుడు
PS: ఈ పుట ద్వారా మహిళల మీద యుద్ధాన్ని ప్రకటించానని మాత్రం తలంచ వలదు. ’మగాళందరూ ఒకే టైపా..’ అన్న నా అలోచన ఎంతవరకూ ఏ ఏ కోణాలలో ఏ ఏ విధంగా మార్పు చెందుతుందో నన్నదే అని గమనించ గలరు.
3 కామెంట్‌లు:
చక్రవర్తి గారు,
భర్తల ప్రోత్సాహం లేకుంటే ఏ మహిళైనా విజయం సాధించలేదు.ఎందుకంటే ఆడవాళ్ళకి ఇల్లు, పిల్లలు దిద్దుకోవడం ముఖ్య కార్యక్రమం. అది ముగిసిన తర్వాత వేరే పనికాని, అభిరుచిని కాని పెంపొందించుకోవాలి, నేర్చుకోవాలి అన్నా భర్త సహకారం ఉండాలి. నేను చెప్పిన రెండు సందర్భాలు కరెక్టే. భర్త మీద అభాండాలు వేసినా, మెచ్చుకున్నా మేము ఎపుడు నిజమే చెప్తామండి. మీరు మరీ ఎక్కువ కంగారు పడకండి. కొందరు స్త్రీలు ఉంటారు ఎప్పుడూ మొగుడిని సాధించడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు. నా భర్త పేరు తగిలించుకోవడం ఇష్టం లేకున్నా, నా పేరుతోనే చలామణి అవ్వడం ఇష్టమే ఐనా, నా ఈ విజయాలకు మాత్రం నా భర్త ప్రోత్సాహం, పిల్లల సహకారం అని గర్వంగా చెప్పుకుంటాను. లేకుంటే ఇంటితో పాటు, ఇలా బ్లాగులు, పత్రికలలో రచనలు సమర్ధవంతంగా నిర్వహించగలిగేదాన్ని కాదు. అందుకే నా విజయాలన్ని వాళ్ళకే అంకితం ఇస్తాను మనస్పూర్థిగా.
జ్యోతి ఉవాచ - "ఆడవాళ్ళకి ఇల్లు, పిల్లలు దిద్దుకోవడం ముఖ్య కార్యక్రమం."
అది నిజం అయినా కాకపోయినా, పెళ్ళైన స్త్రీ చేసే కార్యకలాపాలన్నీ ఏదో ఒక మోతాదు లో భర్త కంట్రోలు లో ఉన్నాయన్నది నిజం.
హేహే, నిజంగా వారికీ తెలుసా అనేదే పెద్ద ప్రశ్న! అందరు మగాళ్ళు ఒకటే అనే భావన తో నేను జత కలపను,అప్పుడు మనకి ముషారఫ్ కి తేడ ఏమిటి? హ హ
కామెంట్‌ను పోస్ట్ చేయండి