ఈ పుట వ్రాద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏవేవో కారణాంతరాల వల్ల ఎప్పటికప్పుడు దాటేస్తూనే ఉన్నాను. ఇక లాభంలేదని ఇదిగో 23వ తారీఖున మొదలు పెట్టాను. చూద్దాం ఎప్పటికి అవుతుందో.. ఇదిగో ఇవ్వాళ్టికి పూర్తి అయ్యింది.
అస్సలు విషయానికి వస్తే.. ఆఖరుగా అనుబంధం గురించి వ్రాద్దామనుకున్నా కదా.. ముందుగా కొంత ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతానికి చరిత్ర దగ్గర దగ్గరగా ఓ పాతికేళ్ళు ఉంటాయనుకోండి. అంటే నేను దాదాపుగా పది పన్నిండేళ్ళవాడిని అన్నప్పుడన్న మాట. అన్ని సంవత్సరాల క్రిందటి విషయానికి ప్రస్తుత కాలానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. చదివే మీరే ఆలోచిస్తుంటే.. గత నెలరోజులుగా నన్ను భరిస్తున్న వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
పాతికేళ్ళ క్రిందట, ’అక్కా’ అనిపించుకున్న పాపానికి, ఇక్కడ (అంటే అమెరికాలో) గత నెలన్నర నుంచి నన్ను మరియు నా చేష్టలను భరించ వలసి వచ్చిందంటే, వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో .. ఆ పరిస్థితిని మీ ఊహాతీతానికి వదిలేస్తాను. ఇక్కడ పేరులు అంత సమంజసంగా ఉండదేమో అని ప్రస్తావించడం లేదు, కానీ చిన్నప్పుడు నేను భరతనాట్యం నేర్చుకునేటప్పుడు, మా ఇంటికి దగ్గరలోనే ఉండే మరో సహ విద్యార్ధినితో కలసి సంగీత కళాశాలకు వెళ్ళేవాడిని. నేను తనకన్నా చిన్నవాడిని అందులోనూ ఆ అమ్మాయికీ నా వయస్సు తమ్ముడు ఉండటంతో వాళ్ళిద్దరూ నాతో చనువుగానే ఉండేవారు. మాఇంట్లో ఆడ పిల్లలు లేనందున, అందరు ఆడ పిల్లలందరూ మాకు అక్కలే!! అందుకని ఈ అమ్మాయిని.. అక్కా.. అక్కా.. అంటూ పలకరించడమే కాకుండా వాళ్ళింట్లో సరదాగా తిరిగే వాడిని. వాళ్ళింట్లో కూడా ఏమి అనుకునే వారు కాదు. ఆ అమ్మాయి తల్లి తండ్ర్లులు కూడా చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. కాలానుగుణంగా, ఆ అమ్మాయి పెద్దదయి.. చదువు రీత్యా, నాట్యాభ్యాశానికి తీరిక దొరకక పోవడం వల్ల నేను మాత్రమే కొనసాగించడం జరిగింది. ఈ కాలం వచ్చేటప్పటికి, మా నాన్నగారు చిన్న సైకిల్ కొనడం, సైకిల్ మనకి కొత్త.. దానితో సంతోషంలో ప్రపంచాన్నే జయించాం అన్న భావనతో సైకిలెక్కి ఒంటరిగా పయనించడం అలవాటు చేసుకున్నాను. ఇలా పాతికేళ్ళ క్రిందట ’అక్కా’ అనిపించుకున్న పాపానికి.. ఆ అమ్మాయే కాకుండా ఆమె భర్తకూడా, ఇద్దరూ ప్రస్తుతం ప్రతీ వారాంతం నన్ను భరిస్తున్నారు.
ప్రస్తుతం నేనువృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను. ఇక్కడ తెలుగు తెలిసిన వారెవ్వరూ లేక పోవడం నన్ను కొంచం ఆందోళనకు గురి చేసింది. ఎవ్వరూ లేరనుకుంటుండగా, ఎడారిలో ఒయాసిస్సులా ఇక్కడ నివసిస్తున్న జంట గురించి తెలిసింది. అంతే.. ’అక్కా..’ అంటూ ఉత్తరం వ్రాయడం, తరువాత ప్రత్యుత్తరం.. ఇలా కొంత మనో ధైర్యం తెచ్చుకుని ప్రయాణం మొదలుపెట్టాను. హైదరాబద్ నుంచి ఆంస్టర్‍డాం వరకూ కొంచం సరదాగే సాగింది. ఆంస్టర్‍డాంలో ఆరు గంటలు వేచి యున్న తరువాత మెమ్‍ఫసిస్‍కు పయనం. ఈ పయనమే అసలు సిసలు నరకం అనిపించింది. తరువాత మరో నాలుగు గంటలు కాలక్షేపం తరువాత మరో గంట ప్రయాణం తరువాత గమ్యస్థానానికి చేరుకున్నాను. ఏమీ తెలియని ప్రదేశం ... దేశం కాని దేశం.. ఎలాగోలా.. హొటల్‍కు చేరుకున్నా. మరునాడు ఉదయం వారిని కలసిన తరువాత పోయిన ప్రాణం లేచి వచ్చినట్లైంది. ఆ తరువాత ప్రతి వారాంతం వారింటికి వెళ్ళడం .. వారి అబ్బాయితో ఆడుకోవడం.. వారితో కలసి ఊరంతా తిరిగి రావడం.. ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి. కానీ ఎటువంటి రక్త సంబంధం లేని వాళ్ళు నన్ను ఎందుకు entertain చెయ్యాలో ఒక్క సారి ఆలోచించండి.
ఇక్కడ మరో విషయం, ఉన్న వాడిని ఉండకుండా.. పెద్ద పుడింగ్ లాగా వాళ్ళింట్లో వంట చెయ్యడం మొదలు పెట్టాను.. మొదటి సారి చేసిన కూర నిండా ఉప్పే. ఉప్పగా ఉన్న ఆ కూరను, మొహమాటం కొద్ది తిని, "బాగుంది, బాగుంది .." అని వాళ్ళంటుంటే.. నిజంగా బాగానే ఉందేమో ఆని కొంచం రొమ్ము విరుచుకుని నేను తినడానికి ఉపక్రమించాను. తీరా మొదటి ముద్ద తిన్నాక గాని అసలు విషయం అర్దం కాలేదు. ఉప్పు కశం.. చేసిన తప్పుకి కొంచం సిగ్గేసింది. కుక్కిన పేనులాగా అయ్యింది నాపని. మారు మాట్లాడ కుండా తిన్నాను. రెండవసారి ప్రయత్నించినప్పుడు, ఉప్పు తక్కువైనా .. ఈ సారి కారం కొంచం ఎక్కువైంది. ఇన్ని సార్లు తినే తిండి చెడగొడుతున్నా, ఏమి అనకుండా.. అంతే కాకుండా.. "భలే.. భలే.. బాగుంది.. బాగుంది .." అని వాళ్ళంటుంటే.. వారి పెద్దరికానికి జేజేలు కొట్టాలనిపిస్తోంది. ఏదైనా ఒక వారాంత వెళ్ళడానికి కుదరలేదనుకోండి, అక్కేమో నాకు కాల్ చేసి... ఎక్కడున్నావు.. ఏమి చేస్తున్నావు.. అని ఆడుగుతుంది. ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే, ఏమయ్యానో అని తాను కంగారు పడుతుంది. అమెరికాలాంటి చోట్ల ప్రజలకు ఆనందానికి దొరికేదే వారాంతం. అట్టి వారాంతాలలో నాలాంటి వాడు వెళ్ళి పెద్ద పుడ్డింగ్ లాగా వాళ్ళ కాలాని చెడగొడుతూ ఉంటే.. ఎవ్వరైనా ఎందుకు భరిస్తారు? ఎంతకాలం భరిస్తారు? మరి వీళ్ళేంటీ.. వీళ్ళు మనుష్యులు కారా.. వీరికి కోపతాపాలు ఉండవా? నా మానసిక స్థైర్యం కోసం వీళ్ళ కాలాన్ని బలి ఇవ్వాలా?
ఇలా ఆలోచిస్త్తూ ఉంటే.. ఈ పుటకి మూల పదమైన "అనుబంధం" అనే పదం గుర్తుకు వచ్చింది. మన సంసృతిలో .. చుట్టరికాలు ఉండనక్కరలేదు.. కానీ ఆప్యాయతగా .. అక్కా.. అనో .. మామా .. అనో.. తాతా.. అనో .. పిన్నీ .. అనో.. పలకరించే పలకరింపు వెనుక ఎంతటి అనుబంధం ఉందో కదా అనిపిస్తుంది. ఈ అనుభూతి నాకేనా.. లేక మీకు కూడానా..
మీ స్పందనలకై ఎదురుచూస్తూ ఉంటాను,
ఇట్లు,
భవదీయుడు
6 కామెంట్‌లు:
ఇది మాత్రం చాలా నిజం
శంకరగిరి గారూ,
చాలా చాకచక్యంగా స్పందించారు.. ఇంతకీ ఏది నిజం..
౧) ’అక్క’ అని పిలిచి సతాయిస్తున్న దంపతుల భాధనా..
౨) నేను పెడుతున్న పోరు తీరా లేక
౨) ఆప్యాయత దాగున్న పిలుపా..
ఏదైనా కొంచం డీటైల్డ్‍గా చెప్పండి సారు..
Sir,
Naaku idiee chadutuntee oka incidne tgurthuvachindiee...almost 15 yrs back...
Memu srikaulam nunchi kasiee pryanam ayyamu...naku appudu 12 yrs and ma nanna, amma, chelli, tammudu and tatayya tho...
appatilo mu nuga plan chesukopovadam valana memu general compartment lo vella valisi vachinidee...maa daddy antaka mundu army lo pani cheyadam valana ataniki train journeys alavatuu..
Memu andaramu kurdaa dataka oka chinna station lo toilets ki digamu..train start iepoinediee...ma tatayya ekka leka poyaru..so ma father kooda kindane undiepoyaru...
vallu next station ki call chesaru..so and so family please get down here..you husband will come in the next train..they mentioned srikakulam and telugu in the announcement...memu adiee viniee next station lo digipoyamu..
ikkada srikaklam and telugu ani announcement vini akkade railway divison lo panichestunna drivers vall family i mean aunty garlu station ki vachi matho matladiee...malli ma daddy unna station ki phone chesi..mammalani vallatho teesuku veltunnamu anee..meeru kooda next train lo ..menas goods lo ravadani station matladutamu ani cheppi matladaru..
next train is after 24 hrs..so ma father vallu next goods lo 4 hrs taruvata vacharu..
so memu mottamu 6 members vallo intlo 24 hrs unnamu...
Vallu iete mammalani ento premaga choosukunnaru..uncle iete maaku daggarundiee bath cheincharu...inko telugu family dlunch ki pilisaru...ivi annie kakundaaa maku next train ki TT to matladiee ac compartment lo seat ippinchiee, carriage kooda kattaru....
idiee nijamu iena anubadamu antee....
Naaku ippadaki aa situvation gurthu vaste saatie vaktini abimanichadanki bandalu, bandtuvatvalu avasaram ledu...just andaraniee preminchiee guanm untee chaalu..
This is my first comment to the telugu blogs..please comment back
చక్రవర్తి గారూ!
కొందరిని చూస్తే పెట్టబుద్ధౌతుంది,కొందరిని చూస్తే మొట్టబుద్ధౌతుంది అంటారు.మీరు మీ ఆప్యాయతతో వాళ్ళ మనసులని బంధించడం వల్ల మీ మధ్య అనుబంధం ముడిపడింది. కొన్నిబంధాలకి ఎప్ప్పుడు ఎక్కడ ఎలా ముడిపడుతుందో ఆ వేసిన వాడికి కూడా తెలియదు. ఆ రకంగా చూస్తే పరాయి చోటులో మీకు అదొక వరం. మనుషుల బలం బలహీనతా కూడా బంధాలే.బంధాలు పెంచుకోవటం చాలా సులువు. బతికినన్నాళ్ళు నిలబెట్టుకోగలగటం చాలా కష్టం. ఆ బంధాలు మీకు మరింత బలాన్నివ్వాలని కోరుకుంటూ ..............పద్మకళ.(తెలుగుకళ .బ్లాగర్స్.కాం )
కొన్ని సార్లు అమ్మల కన్నా,అక్కలు మనల్ని స్వంతపిల్లలకన్నా ఎక్కువగా చూసుకుంటారు.నాకు ఐదుగురు అక్కలు,ఒక చెల్లెలు(అందరూ పెద్దమ్మల పిల్లలే)అలాగే ఇంటి చుట్టుపక్కల నామీద ఒక్కరోజున్న అమ్మాయిలందరూ కూడా అక్కాయిలే.అలాగే చాలా సార్లు అక్కల కన్నా బావలు మరీ మంచివాళ్ళు దొరుకుతారు.ఇంతవరకూ నా స్వానుభవం.
ఇక మీ సంగతికి వస్తే మీరంటున్న అక్క,బావ గారు ఇక్కడ మన తెలుగు బ్లాగర్లలో చాలా మందికి తెలుసు,వారెలాంటివారో కూడా తెలుసుకాబట్టి,వారు ఇంత పరిచయమున్న మిమ్మల్నే కాదు,ముక్కూమొఖమూ తెలియని నాలాంటి వాళ్ళను కూడా ఇలాగే స్వంతమనుషులుగా చూసుకుంటారు.ఇంకో సంగతి ఈ సంగతి ఇక్కడితో మరిచిపోయి మామూలుగా బ్లాగులు రాయండి.ఆల్ ది బెస్ట్ :)
హహ, మీరు రాసినది ఎంత నిజమైన నవ్వు ఆపుకోలేకపోయాను. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం.నేను కూడా రేసెంట్ గ అమెరికా వచ్చాను.ఇక్కడ ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను తెలుగు వాడినని తెలుసుకుని పలకరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి