20, సెప్టెంబర్ 2008, శనివారం

దేవుడా!! నిన్ను ప్రశ్నించే వారు ఎవ్వరు???

క్రిందటి వారం మొదటి సారిగా చాలా దగ్గర నుంచి కొంత మంది అవిటి వారిని చూడడం జరిగింది. వారిలో ఒక తల్లి ఇద్దరు కూతుళ్ళు. తల్లి చక్కగా గుండుగా నిండుగా ఆరొగ్యంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఇద్దరు ఆడ పిల్లలలో, ఒక అమ్మాయి గుడ్డిది, మరొక అమ్మాయికి కాళ్ళు సరిగా ఉన్నట్లు లేవు. క్రచ్ పట్టుకుని నడుస్తోంది. ఫుట్‍పాత్ మీద నుంచి బస్సులోకి ఎక్కడానికి అచ్చంగా మూడున్నర నిమిషాలు పట్టింది. ఇంతక ముందు చెప్పినట్లుగా రెండవ అమ్మాయి గుడ్డిది. బస్సు ద్వారానికి కొంచం దూరంగా ఉండి తలుపు కోసం వెతుకుతోంది. ఆగని మనసు, గబుక్కున దిగి దారి తెలియ జేయడానికి ప్రయత్నం చేసాను. ఆ అమ్మాయి కర్ర పట్టుకుని తలుపు ఉన్న చోట కొట్టి చూపించాను.

 

నా ఈ చర్యని జీర్ణించు కోలేక, నన్ను, నా సయాహాన్ని సున్నితంగా తిరస్కరించింది. వెనకనే ఉన్న వాళ్ళ తల్లి నిదానంగా నాతో, ’వాళ్ళని తెలుసుకో నివ్వండి’ అంది. ఇలాంటి స్పందన నేను ఎదురు చూడక పోయినా, నా తొందర పాటుతనానికి కొంచం సిగ్గేసింది. వెంటనే క్షమాపణలు తెలియజేసి నా చోటులో నేను కూర్చున్నా. ఇదంతా గమనిస్తున్న ఆ బస్సు నడిపే అమ్మాయి, నా పరిస్థితిని అర్ధం చేసుకుని సున్నితంగా ఇలా అంది, ’ఇలా మనం సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? కాబట్టి వాళ్ళంతట వాళ్ళు అడిగేటంతటి వరకూ సహాయం చెయ్యకండి’.

 

వారిని చూసిన తరువాత, చాలా భాధ వేసింది. వాళ్ళని చూసి నేను ఎందుకు భాధ పడ్డానో అని ఆలోచించి, అస్సలు మనం ఎందుకు భాధ పడాలి? అని నన్ను నేను తిరిగి ప్రశ్న వేసుకున్నాను. అలాంటి వారిని చూసి ధైర్యాన్ని పెంచుకోవాలి కానీ భాధని ఎందుకు పెంచుకోవాలి? ఇలాంటి వారిని అవిటి వాళ్ళు అని మనం వాళ్ళని తక్కువ చేసి సంభోదిస్తున్నామా అని కూడా అనిపించింది. కానీ వీళ్ళని అంగ వైకల్యంతో భాధ పడుతున్న వాళ్ళు అనుకోవాలా.. లేక అంగ వైకల్యాన్ని అలాగే ఇలాంటి వైకల్యాన్ని ప్రసాదించిన ఆ దేవుడిని ఎదురించి, తెగించి జీవితంలో అనుక్షణం పోరాడుతూ అలుపెరుగని సుశిక్షుతులైన సైనికులుగా తలచుకోవాలా అన్న సంగ్ధిద్ఘంలో పడ్డాను.

 

అవును, చాలా మంది మానశికంగా కృంగిపోయి ఆత్మ న్యూనతా భావంతో ఎవ్వరి ఆశరా లేకుండా ఇంటిలోంచి కదలరు. అలాగే మరికొందరు, అన్నింటినీ తెగించి ఆత్వ స్థైర్యమే ఆలంబనగా వారెవ్వరికీ తీసిపోనట్లుగా మున్ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి వారిని గురించి తలంచి నప్పుడల్లా పిరికిపందలుగా ఆత్మహత్య చేసుకునే వారు వీరినెందుకు గమనించరు? ఇలాంటి వారి నుంచి స్పూర్తి నెందుకు పొందరు? జీవితం అనేది జీవించడానికే గానీ చావడానికి కాదని ఎందుకు తెలుసుకోరు? చావడం అనేది క్షణకాల క్రియ, కానీ జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం, క్రింద పడినా లేచినా సాగి పోవాలి కానీ కృంగి పోకూడదని ఎందుకు తెలుసుకోలేరు? అస్సలు తెలుసు కోవాలనుకునే ఆలోచన ఇలాంటి వారికి ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎదో వ్రాద్దామని మొదలు పెట్టి ఎదేదో వ్రాస్తున్నా.. అస్సలు విషయానికి వస్తా..

 

ఇలాంటి పిల్లలున్న తల్లి తండ్రులు గానీ ఇలాంటి పిల్లలు గానీ, దేవుడిని ఎప్పుడైనా ప్రశ్నిస్తే .. ఏమని ప్రశ్నిస్తారు అన్న ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. నా ఈ పుఱెకు పుట్టిన ఆలోచనలే ఈ పుటకు మూలం

 


మొదట.. తల్లి తండ్రులు

దేవుడా!!! మేమేమి పాపం చేసాము, మాకు ఇలాంటి పిల్లల నిచ్చావు? వీళ్ళ భాధని చూడలేక మేము పడే భాధకి ఉపశనమేమి? ఒక వేళ మేమే కనుక తప్పు చేసి ఉంటే, పాపపు పనులు చేసి ఉంటే, వాటి ప్రతి ఫలాన్ని మేము అనుభవించాలి గానీ, మా పాప భారాన్ని ఈ పసి కందులకు ఎందుకు ప్రసాదించావు?

 


పిల్లలు

వీరు ప్రశ్నించడం కన్నా, ’ఇదిగో మీకు.. ఈ అంగవైకల్యాన్ని ఇస్తున్నా.. ఎలా బ్రతుకుతారో చూస్తా..’ అని ప్రశ్నిస్తున్న దేవుడికి.. చిరు నవ్వుతో, ఆ ప్రశ్నకు జవాబుగా.. ఇదిగో .. ఇలా .. అనుక్షణం నీ అవలక్షణాన్ని ఎదుర్కుంటూ.. సాటి మనుష్యులకు సాటిగా బ్రతుకు సాగిస్తున్నాం .. సాగిస్తూ ఈ భవసాగరాన్ని అవలీలగా దాటేస్తాం.. అని చెప్పకనే చెబుతున్న వారి జీవన యానం, ఆ దేవునికి ధాటిగా .. ధీటుగా సమాదానం ఇస్తున్నారనిపిస్తోంది.

 


నేను

అసలు ఇవ్వన్నీ కాదండీ.. నాకే ఇంత భాధగా ఉందే.. చూసే వాడిని, నాకే, ఇంత ఇదిగా ఊందే.. ఇంక పడే వాళ్ళకి ఎలా ఉంటుంది? పాపం పసి కందులు .. ఎంతో మంది.. మరెంతో మంది.. ఈ జీవన పోరాటాన్ని సాగిస్తున్నారే.. ఎందుకిలా జరుగుతోంది? ఏమి ఉద్దరిద్దామని ఆ దేవుడు ఇలాంటి వాళ్ళని శృష్టిస్తున్నాడు?

 

ఏం.. ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరా?? లేరనా!! ఆయనది ఈ నియంకృశత్వం?? ఒక వేళ ప్రశ్నించినా సమాధానం చెప్ప వలసిన అవసరం లేదనా ఆయన భావన??

3 కామెంట్‌లు:

తెలుగుకళ చెప్పారు...

నమస్కారం. మీరు మాత్రమే కాదు ఆ సందర్భంలో మనవత్వం వున్నవాళ్ళెవరైనా అల్లాగే స్పందిస్తారు.మీరు సంతోషించాల్సిన విషయమేమిటంటే మానవత్వమున్న వారు ప్రతీ చోటా వాళ్ళకి ఎదురు పడాలికదా ,అలా సాయం తీసుకోవటం అలవాటైతే కొన్నిసార్లు వాళ్ళకిబ్బందే మరి .సాయం చేసే మీమనసు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగానే వుంటుంది .దేవుడిని తిట్టకండి పాపం అందరికీ అన్నీ ఇవ్వాలంటే కుదరాలిగా .టెక్నికల్ ప్రాబ్లెంసు వాడికి మాత్రం వుండవా ఎమిటి? అయినా అందుకే గా మనలాంటోళ్ళని పుట్టించింది.అందుకే అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేసి ,సత్తా వున్నవాళ్ళని సెహభాష్ అందాం .మీకు నచ్హ్చుతుందో లేదో కానీ నాకు తోచింది మాత్రం ఇఎదే.ధన్యవాదాలు.
ఉంటాను..... kala

Mauli చెప్పారు...

:)

అనుకున్నది అనుకున్నట్లుగా భలే వ్రాస్తారే.

అలా వ్రాయడ౦ లో ఉన్న తృప్తిని అస్వాదిస్తున్న మీకు అభిన౦దనలు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

మౌళ గారు,
ఇలా అర్దం చేసుకుని ప్రోత్సహించి నందులకు ధన్యుడను. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

 
Clicky Web Analytics