ఈ పుట వ్రాద్దామని ఆలోచించినప్పటి నుంచి శీర్షిక ఏమి పెడదామా అని ఆలోచిస్తూ అస్సలు విషయాన్ని జాప్యం చేసాను. ఇక ఇంతకన్నా జాప్యం చేస్తే, అస్సలు విషయం మరుగున పడుతుందో అన్న భయంతో ఇక మొదలు పెడుతున్నాను. ఈ పుట యందు తెలియ జేసే విషయాలు ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే, కావాలని .. వారినే ఉద్దేశ్శించి వ్రాసినదని తలంచ వద్దని మనవి.
అదృష్టమో .. దురదృష్టమో .. నేను భారత దేశంలో పుట్టడం అనేది నిజం. అలాగే, భారతదేశం లోని తెలుగు పిల్లనే పెళ్ళి చేసుకున్నాను. ఇక్కడ ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే.. ఇక్కడ (అంటే అమెరికాలో) నేను చూసిన కొన్ని జంటల్లో ఎక్కువ మంది, పడమటి సంధ్యారాగం సినిమా లోని హిరో హిరోయిన్ల లాగా జాతి మత భేధాలు లేకుండా ఒకటై, వసుదైక కుటుంబంలాగా కలసి మెలసి బ్రతుకుతున్నారు. ఉదాహరణకు..
నాతో కలసి పనిచేసే ఒక సహ ఉద్యోగి స్వతహాగా తెలుగువాడు, అందునా హైదరాబాద్ వాస్తవ్యుడు. దాదాపు పదిహేడు సంవత్సరాల క్రిందట ఇక్కడ అమెరికా వచ్చి, ప్రస్తుతం ఇక్కడే స్థిర పడిపోయాడు. ఇతని తల్లి తండ్రులు కూడా కొంతకాలం ఇక్కడ నివశించి, అవశాన దశని మాతృ భూమిలో గడపాలనే ఉద్దేశ్యంతో, ఈ మధ్యనే తిరిగి భారత దేశం చేరుకున్నారు. ఇతను ఓ పదేళ్ళ క్రిందట ఇక్కడే ఉన్న ఓ పరాయి దేశ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఇతని అర్దాంగి విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్లు, ఆ అమ్మాయి ఈ దేశానికి పరాయి దేశస్తురాలు. బహుశా పోర్టిరికా అమ్మాయి అయ్యుండవచ్చు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పేర్లలో కొంత క్రైశ్తవ తత్వం మరి కొంత హిందూతత్వం. (మరి పెద్దైన తరువాత వీరిని ఏమి అనాలో? క్రైశ్తవులనా? హిందువులనా? )
ఇక్కడే పుట్టారు కాబట్టి వారికి అమెరికా వారసత్వం ఉంటుంది, అంతే కాకుండా అమెరికా రాజ్యాంగంలో ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకరణలు ఉన్నట్లు లేవనిపిస్తోంది. ఏది ఏమైనా, ఇలాంటి వారికి జాతి మత భేధాలు లెవనేది నా భావన. ఇక్కడ మరోక చిన్న విషయం ప్రస్తావించకుండా ఉండ లేక పోతున్నాను. పైన ఉదహరించిన ఆ పెద్దాయనకు ఒక తోబుట్టువు ఉంది. ఆ తోబుట్టువు కూడా హైదరాబాద్ నుంచే వచ్చింది. వచ్చేటప్పుడు చక్కగా పెద్దలు చూసిన పెళ్ళి చేసుకుని, పొందికగా ఓ పదేళ్ళు కాపురం చేసి, తరువాత విడాకులిచ్చేసి, ఇదిగో ఈ మధ్యనే మరో విదేశీయునితో కలసి జివితాన్ని పంచుకునేందుకు ఉవ్వుళ్ళూరుతూ వివాహ నిమిత్తమై తిరిగి భారత దేశం చేరుకుంది.
ఇలాంటి వారందరికీ (భవ) భంధాలే ప్రాధాన్యమనిపిస్తోంది. ఇంతెందుకు, మా పెద్దనాన్నగారి పెద్ద కొడుకు, వరసకు అన్నయ్య, ఇక్కడకు వచ్చిన తరువాత ఒక ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇక్కడ వీరు చేసిన పని మంచిదా.. లేద చెడ్డదా .. అని తర్కించుకునే కన్నా.. ఇలాంట్ వారికి ఏమి ప్రాధ్యాన్యం అని ఆలోచిస్తే అసలు విషయం మనకు భోధ పడుతుంది.
ప్రస్తు పుట అమెరికాలో నాకు తెలిసిన / చూసిన వ్యక్తుల నుంచి నాకు తోచినది భంధం అయితే.. మరొక పుటలో ఇక్కడి వారి సంభంధ భాంధవ్యాలెలా ఉంటాయో అవలోకనం చేసుకోవడాని ప్రయత్నిస్తాను.
అంత వరకూ తమ విలువైన స్పందనలకు ఎదురు చూస్తూ ఉంటాను,
ఇట్లు,
భవదీయుడు
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
14 కామెంట్‌లు:
మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు
vinaayaka chavithi subhaakaamxalu.
mana aachaaraalaku tagga sambamdhaalavalla meeru sukhamgaa vunnaarukadaa adichaalu .marokari samgathi emdukulemdi.
subhaakaamkshalu
చవితి వినాయకుడు మిమ్ములను మీ కుటుంబాన్ని ఎల్ల వేళలా నీలాప నిందల నుంచి కాపాడాలని ఆశిస్తూ, అందుకోండి నా శుభాకాంక్షలు
శీర్షికతో సహా, వ్యాసంలో అప్పుతచ్చులు చాలా ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించగలరు.
విదేశీయులనీ, ఇతర మతస్తులనీ వివాహం చేసుకుంటే తప్పు పట్టాల్సినదేముంది? ఒకప్పుడు దగ్గరి చుట్టాల్లోనే చేసుకునేవాళ్లు. అంతకన్నా ముందు సొంత ఊర్లో వారినే చేసుకునేవారు. ఇప్పుడా పరిధి విస్తృతమయింది. వివాహమనేది వాళ్లిద్దరి వ్యక్తిగత విషయం. మనకు నష్టం లేనప్పుడు ఇటువంటివాటి మీద అభ్యంతర పెట్టాల్సిన అవసరమేముంది? ఇక సంస్కృతి సంగతంటారా.. అది మారకుండా ఉందెప్పుడు? యుగాల నుండీ వర్ణ సంకరాల్లేనిదెప్పుడు?
ప్రేమ పేరుతో జరిగే విచ్చలవిడితనానికి నేను వ్యతిరేకం. అయితే మీరు చెప్పిన ఉదాహరణల్లో వ్యక్తులని విమర్శించబోయేముందు వారి వైపునుండి కూడా ఆలోచించాల్సిన అవసరముంది కదా. ఏ కారణాలతో అలా చేశారో చెప్పి మరీ విమర్శ చేస్తే మీ టపా మరింత బలంగా ఉండేది. నేనో ఉదాహరణ చెబుతా చదవండి.
నాకు తెలిసిన ఒక తెలుగబ్బాయి - అమెరికాలో ఉద్యోగస్తుడు - పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య అమెరికా వచ్చిన వారం తిరిగేలోపు తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి చెక్కేసింది. అతను ఆమెకి క్లాస్‌మేట్ అట. ఎలాగోలా అమెరికా వచ్చి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె భర్త గతేమిటి? ఆమె చేసింది స్వార్ధంతో కూడిన మోసం. ఇది విమర్శించి తీరాల్సిన విషయం.
జాబు శీర్షికలోని మూడు పదాల్లోనూ ఉన్న తప్పులను చూసి - అలాంటి తప్పులపై వ్యంగ్య విసురేమోననుకున్నాను. కానీ జాబులో ఆ ధోరణి కనిపించలేదు. నేనేమైనా పొరపాటు పడ్డానా?
okay, go on...
అబ్రకదబ్ర అనీల్ గారు,
మొదటిగా, శీర్షికలోని అప్పు తచ్చులు అని మీకు అనిపించినవి ఏమిటో తెలియజేయగలరని మనవి. అలాగే, వ్యాసంలో తమరు గమనించిన / పొర్లిన అప్పు తచ్చులును కూడా తెలియజేస్తే, సంతోషిస్తాను.
రెండవది, ఈ పుటలో నేను ఎవ్వరినీ తప్పు పట్టలేదే!!! యత్ భావం తత్ భవతి అన్నట్లు, తమరు తప్పుగా భావిస్తున్నట్లున్నారు, అందుకే తమకి తప్పుగా అనిపిస్తోంది. కొంచం జాగ్రత్తగా మరొక సారి ఆశాంతం చదవగలరు. మీకు ఎక్కడో ఒక చోట, "ఇక్కడ వీరు చేసిన పని మంచిదా.. లేద చెడ్డదా .. అని తర్కించుకునే కన్నా.. ఇలాంట్ వారికి ఏమి ప్రాధ్యాన్యం అని ఆలోచిస్తే అసలు విషయం మనకు భోధ పడుతుంది." అని కూడా కనబడాలే. దీని అర్ధమేమి తిరుమలేశా.. నేనెవరినైనా తప్పు పట్టానా??? అలా తర్కించడం సమంజసం కదన్నానే.. తమకి ఆ విధంగా భోధ పడలేదా..
మరొక్క విషయం నేనెవ్వరినైనా అభ్యంతర పెట్టినట్లు తమకు అనిపిస్తోందా.. ఎవ్వరి ఆలోచనలు వారివి, ఎవ్వరి ఇష్టా ఇష్టాలు వారివి, వాటి గురించి ఆలోచించడం కన్నా వారి వారి ప్రాముఖ్యతలు ఏమిటో.. వారికి ఏమి ప్రాధాన్యమో మనం ఆలోచిస్తే బాగుంటుంది అని కదా నేను నేను వ్రాసింది. దానికి నేనేదో ఎవ్వరినో అభ్యంతర పెట్టినట్లు, మీరెందుకు తెగ ఫీల్ అవుతున్నారేమిటండి. కొంపదీశి తమరు కూడా, ఇలాంటి జాబితాలోకే చేరినవారా!!! ఏమోలేండి అయ్యుడచ్చు.. ఎందుకంటే, ఉన్నదంటే ఉలుకెక్కువంట.
మహానుభావా.. ఈ పుటలో నేను సంస్కృతి సంగతి ఏమాత్రమైనా తెచ్చానా.. అది మారిందో .. లేదో.. లేక వర్ణ సంకరణం అయ్యిందో.. ఎవ్వడికి కావాలండీ ఇవ్వన్నీ.. నేనేదో ఇక్కడి వ్యక్తుల మనోభావాలు నాకు ఎలా అనిపించిందో వ్రాస్తుంటే, పెద్ద వరద వచ్చి మన సంశృతి అంతా కొట్టుకు పోతున్నట్లు స్పందించారే. అయ్యా మరొక్క సారి తెలియ జేస్తున్నా.. నేనెవరినీ విమర్శించ లేదు, ఉన్నది ఉన్నట్లు తెలియ జేసా, అర్దం చేసుకునే వాళ్ళకి ఆ ఆ అర్ధాలు అవగతమవుతాయి. తమరు దీన్ని తప్పుగా భావిస్తే, ఇది తమకు తప్పుగా కనబడుతుంది. లేదా ఒప్పుగా తలస్తే, ఇంతకన్నా మంచి పుట మరొకటి ఉండదు అని మీకు అనిపిస్తుంది.
మీ స్పందనలో తెలియ జేసినట్లు ఈ రోజుల్లో స్వార్ధంతో కూడిన మోసాలు చాలా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయం తమరు గ్రహించాలి. మన పురాణాల్లో గానీ, ఉపనిషత్తులలో కానీ, హిందూ దర్మంలో ఎక్కడైనా గానీ, "విడాకులు" అనే పదం కానీ.. అలాంటి చర్య / క్రియ / ప్రక్రియ / an activity ఒకటి ఉన్నట్లు నేను చదువుకోలేదు, అలా ఉన్నదని ఎవ్వరూ చెప్పగా విననూ లేదు. తమరు ఒక వేళ చదివినా / విన్నా .. తదు వివరాలు నాకు తెలియజేస్తారని మనవి.
ఏది ఏమైనా ఇంత బాగా స్పందించినందులకు అన్యధా ధన్యవాదములు
చదువరి గారూ,
దయచేసి నా తప్పులేమిటో తెలియజేసి పుణ్యం కట్టుకోగలరు
Teresa,
Sure, i would. with all the encouragement from people like you i would definitely go further and further.
చక్రవర్తిగారూ,
తప్పులెన్నడం నా ప్రవృత్తి కాదు, అయినా పంటికింద రాళ్లల్లా తగులుతున్నాయి, ప్లస్ మీరు అడిగారు గనక చెబుతున్నాను.
టైటిలు - బంధం, సంబంధం, అనుబంధం.
వొత్తు బ కి కాదు ద కి ఉండాలి.
వ్యాసంలో నాకు కనబడిన మరికొన్ని -
భేదాలు, వసుధైక, అవసాన, క్రైస్తవ, బోధ, ..
ఇటువంటి తప్పులు ఇలా ఉండగా, వ్యాసంలో మీరు పేర్కొన్న కొన్ని వాస్తవాలూ, వెలిబుచ్చిన కొన్ని ధోరణులూ .. మీరు ఆయా వ్యక్తుల్ని తప్పు పట్టక పోయినా, ఏదో విమర్శతో చూసి వ్యాఖ్యానిస్తున్నట్టుగా ధవ్నిస్తోంది.
ఉదాహరణకి. ఒక దంపతుల పిల్లల పేర్లలో క్రైస్తవ హిందూ తత్వాలు కలిసినట్లుగా ఉన్నాయన్నారు. బానే ఉంది. పెద్దైన తరవాత వీరిని ఏమి అనాలో అని మిరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏదైనా ఎందుకు అనాలి? వారిని మానవులుగా చూస్తే పోలేదా? రెందు విభిన్న సంస్కృతుల దంపతులకు పుట్టిన పిల్లలు ఆ రెండు సంస్కృతులలోని గొప్ప విషయాలనూ రంగరించుకుని మంచి మనుషులుగా ఎదగడం దాదాపు రోజూ చూస్తుంటాము అమెరికాలో. అలాగే మొదటి దేశీయ మొగునికి విడాకులిచ్చి విజాతీయుని పెళ్ళి చేసుకున్న అమ్మాయి గురించీ, ముస్లిము అమ్మాయిని పెళ్ళి చేసుకున్న అబ్బాయి గురించీ మీ వ్యాఖ్యలు కూడా ..
మీరు మీ చుట్టూ ఉన్న ఈ కొత్త సమాజాన్ని కొంత విడ్డూరంగానూ, కొంత కుతూహలంతోనూ గమనిస్తున్నారు. అది మంచిదే. ఐతే పై పై విషయాలకి భ్రమపడక మనుషుల్నీ, స్థితిగతుల్నీ, తద్వారా సమాజాన్నీ లోతుగా అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యమని నా ఉచిత సలహా.
ఇది నిన్ననే చదివినప్పటికీ, ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యల్ని చూసాక, సరే మనం కూడా ఓ రాయి వేద్దమని దురద పుట్టింది(కొంచెం ఖాళీగా ఉన్నా).
అబ్రకదబ్ర గారూ,
నాకు మొదటి సారిది చదివినపుడు మీరు ఆరోపించినటువంటి భావాలు ఏవీ కనపడలేదండీ నాకు ఈ టపాలో. అందుకే మీ వ్యాఖ్య నాకు కొంచం ఆశ్చర్యం కలిగించింది. I thought you went a little overboard. చక్రవర్తి stated things with no feelings/opinions attached to them అని నేనిప్పటికీ భావిస్తున్నాను, although some words don't completely fit the tone of the article!.
Having said that,చక్రవర్తి గారి ఈ మాటలు jumped out at me.. "కొంపదీశి తమరు కూడా, ఇలాంటి జాబితాలోకే చేరినవారా!!! ఏమోలేండి అయ్యుడచ్చు.. ఎందుకంటే, ఉన్నదంటే ఉలుకెక్కువంట".
చక్రవర్తి గారూ, ఈ మీ మాటలు మీ చవక బారు సంస్కారాన్ని చూపించడమే కాకుండా, they are fundamentally defeating the purpose of your article.
It reveals the cheap character. ఇలాంటి జాబితా అంటే ఏంటండీ మీ ఉద్దేశం? వేరే మతం వాళ్ళనీ, వేరే దేశం వాళ్ళనీ పెళ్ళి చేసుకున్నవాళ్ళు ఏ జాబితా? అలాగే వివిధ కారణాల వల్ల ఒక రిలేషన్షిప్ లోంచి, ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళే వాళ్ళు ఏ జాబితా?
Grow up my dear..
@ఇండిపెండెంట్
నావి ఆరోపణలు కావు. వ్యాసం చదివితే నాకనిపించినది అది. 'నేను తెలుగుపిల్లనే చేసుకున్నాను, వాళ్లు ముస్లిముల్నీ, క్రైస్తవుల్నీ, విదేశీయుల్నీ చేసుకున్నారు' లాంటి మాటలు తనకు భిన్నంగా ప్రవర్తించినవాళ్ల మీద విమర్శల్లానే అనిపించాయి. ' స్వతహాగా తెలుగువాడు, అందునా హైదరాబాద్ వాస్తవ్యుడు .... ' అని స్నేహితుడిని గురించి చెప్పాక తీరిగ్గా 'అతను పరాయి దేశస్థురాలిని చేసుకున్నాడు' అంటే నాకది 'హమ్మా.. తెలుగోడివయ్యుండీ వేరే దేశప్పిల్లని చేసుకుంటావా!!' అన్నట్లనిపించింది మరి.
కొత్తపాళీగారి వ్యాఖ్య కూడా చదవండి. మరింత వివరంగా ఉంది.
@చక్రవర్తి:
నేనేమిటన్నది తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగులో ఇదే నా చివరి వ్యాఖ్య. All the best.
పెళ్ళి అనేదే (భవ)బంధం. పైగా ఇది వ్యక్తిగతం మహా అయితే కుటుంబపరమైన విషయం. దానికి సమాజాన్ని ఉద్దరించే బాధ్యతను అంటగడితే ఇలాంటి ఆలోచనలేవస్తాయి.
ఇతరుల పెళ్ళి తంతుగురించి పట్టించుకోకుండా, దాన్నిబట్టి value judgments ఏర్పరుచుకోకుండా వ్యక్తులతో సంబంధాలు కొనసాహించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ ధర్మసందేహాలు తీరుతాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి