ఆగస్టు 2006 లో నాకు వివాహమయింది. అంటే దాదాపు రెండేళ్ళవస్తోంది. ఇంత కాలమవుతున్నా.. సంతాన యోగం ప్రాప్తిస్తుందో లేదో అన్న ఆలోచన ఒక వైపు శీతాకాలం పుండులా భాధిస్తున్నా, పదిహేనేళ్ళుగా పురిటి నెప్పులు పడుతూ మరికొన్ని ఏళ్ళ తరువాత రూపం దాల్చబోయే నా ఆలోచన, ఎంతో మంది బాలల బవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందనే మందు నా భాధకి ఉపశమనంలా పనిచేస్తోంది. ఏది ఏమైనా ఈ మాటల ద్వారా ఎదో చూచాయగా మీకు అర్దమయే ఉంటుదని అనుకుంటాను. లేదా..
నేను రిటైర్ అయ్యిన తరువాత చక్కగా ఒక విధ్యాలయం నిర్మించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక విధ్యాలయం అనేకన్నా రెండు రకాల విధ్యాలయాలు అంటే బాగుంటుందేమో.. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్య మేమిటంటే.. ఉచిత మరియు ఉన్నత విధ్యని చిట్టి చిన్నారులకు ఆదిలోనే అందించాలనేది వీటి ఆశయం.. ఛ.. వీటి ఆశయమేమిటి.. నా ఆశయం. పెద్దగా కాకపోయినా.. కనీసం ఒక చిన్న తరగతిలో పది మంది బాలలకైనా ఉచితంగా.. ఒకటో తరగతి నుంచి ఎంత వరకూ వీలైతే అంత వరకూ స్వయంగా విధ్యాభ్యాసం చేయాలనేది ఒక ఆలోచనైతే.. ప్రతీ చిన్నారికీ చిన్న నాటినుంచే ఉన్నతంగా పెంచుతూ .. వారి వ్యక్తిత్వాన్ని పెంపోందించే విధంగా విధ్యాభ్యాశం జరగాలనేది మరో ఆలోచన.
ఇప్పుడు వీటి రెండింటి గురుంచి కొంచం విపులంగా ..
మెదటిది - ఉచిత విధ్య:
ఇక్కడ చేరే ప్రతీ విధ్యార్ది తల్లి తండ్రులు వారి వారి బిడ్డలను చదివించే స్తోమత లేని వారు. మరో విధంగా చెప్పాలంటే, బాల కార్మికులు. చదవాల్సిన వయస్సులో సంపాదిస్తూ వారి వారి తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేటి వారు. వీరిలో అనాధలు కూడా ఉండవచ్చు. కానీ వారిలో చదవాలి అనేటటువంటి కోరిక బలంగా ఉండాలి. వారు వీరు అని కాకుండా.. ఎవ్వరిలోనైనా చదువుకోవాలనే తపన ఒక దావానలంలా అనుక్షణం వెలుగుతూ ఉంటే, వారికి నా ఈ చిన్న చేయూత వారిచేత అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుందని నమ్ముతాను.
రెండవది - ఉన్నత విధ్య:
ఇక్కడ చేరే ప్రతీ విధ్యార్ది తల్లి తండ్రులు వారి వారి బిడ్డలను చదివించే స్తోమత ఉన్నవారు. అంతే కాకుండా, వారి పిల్లల్ని వారి భవిష్యత్తుకై కలలు కనే వాళ్ళు వాటిని సాకారం చేసుకునే ప్రయత్నంలో నావంతు కృషి అగ్నికి ఆజ్యం పోసినట్లు అవ్వాలని నా ఆకాంక్ష. ఆంగ్లంలో చెప్పే ఒక నానుడి ఇక్కడ ప్రస్తావించాలి. Cheep and Best never go together. అందువల్ల, ఉన్నత ఆశయాలు సాధించాలనుకునే వారు, చాలా కష్ట పడాల్సి ఉంటుంది. ఇక్కడ కష్టం ఒక్క పిల్లలు మాత్రమే కాదు, వారి వారి తల్లి తండ్రులు కూడా. అప్పుడే మనం సమిష్టిగా అనుకున్నది సాధించగలం అన్ని నా అభిప్రాయం. ఇక్కడ చదువు ఒక్కటే కాకుండా, ఎదుగుతున్న పసి హృదయాలకు అనుగుణంగా వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా extra curricular activities కూడా సమాంతరంగా సాగుతుంటాయి. అమీర్ ఖాన్ తీసిన ఆఖరి సినిమా.. తారే జమీన్ పర్ లో చూపించినట్లుగా .. పిల్లలను వివిధ కళల వైపు ప్రోత్సహించ వచ్చు.. వివిధ ఆటలలో ప్రావిణ్యం పొందేటట్లు ప్రోత్సహించవచ్చు.
క్రిందటి పుట పూర్తిగా ఉపోధ్ఘాతమయితే.. ఈ పుటలో నాంది పలికాను. తదుపరి పుటలో మొదటి విధ్యాలయం గురించి.. అంత వరకూ..
ఇట్లు,
భవధీయుడు
4 కామెంట్‌లు:
శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మీకు ఆశయ సిద్ధి లభించాలని సర్వేశ్వరుడుకి మా ప్రార్ధన.
చిన్నమయ్యగారూ,
మీ లాంటి పెద్ద వారి దీవెనలు, పరమశివుని ఆశీర్వాదం ఉండాలే కానీ.. సుపుత్రుడైనా.. సుపుత్రికైనా కలగకపోతుందా అన్న ఆశతోనే బ్రతికేస్తున్నా.
పుణ్యం కొద్ది పిల్లలు.. దానం కొద్ది మొగుడు అంటారే.. క్రిందటి జన్మలో అస్సలు పుణ్యం చేసినట్లు లేను, కనీసం కలికాలంలో ఉన్నాం కదా.. ఈ కాలంలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించాలని ఎవ్వరో ఒక పెద్దాయన చెప్పినప్పటి నుంచి నేను చేసిన ఎదైనా మంచి కార్యం ఫలించక పోతుందా అని ఎదురుచూస్తూ రోజులు గడిపేస్తున్నా..
ఏది ఏమైనా ఈశ్వరాఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా.. అలాగే, ఆ గరళ కంఠుడికి మామీద ఎప్పటికైనా కరుణ కలగక పోదు .. చూద్దాం
చాలా మంచి ఆలోచనలు. పక్క ఇంటివాణ్ణి పట్టించుకోని ఈ రోజుల్లో మనది కాని బిడ్డలకి చదువు చెప్పాలనేది గొప్పే. అభినందనలు.
రెండు సూచనలు.
1. Waldorf/Steiner schools గురించి కనుక్కోండి. హైదరాబాదులో ప్రాథమిక స్థాయిలో ఒక బడి ఉంది. వారి వీలుని బట్టి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే ఋషి వేలీ, ఆరోవిల్ లాంటి బడులు కూడా. వీరందరూ ఒక సంకీర్ణ విద్యా బోధన మీద చాలాకాలంగా పని చేసి కొన్ని పద్ధతుల్ని అభివృద్ధి చేసిన వారు.
2.మీరెంచుకున్న ధ్యేయాన్ని గురించి అణువణువులో తపన చెందాలి. ఇది తప్పక సాధించాలి అని బలంగా కోరుకోవాలి. ఎందుకు అంటున్నాను అంటే .. ఇటువంటి పనులు చేపట్టినప్పుడు .. నేనేదో ఉద్ధరిస్తున్నాను, చాలా గొప్ప పని చేస్తున్నాను .. అనుకుని చేస్తే అవెప్పుడూ సత్ఫలితాలని ఇవ్వవు. ఇదే నా జీవిత ధ్యేయం అన్నట్టు చేస్తేనే ఫలిస్తాయి.
శంకరగిరి గారు,
మీ రెండు సూచనలను నేను రెండు సూచనలుగా కాకుండా, మొదటిదానిని సూచనగా అంగీకరిస్తూ రెండవదానిని హెచ్చరికగా భావిస్తాను.
నాలోని ఆ burning fireని కలకాలం అలాగే ఉండేలా ప్రయత్నిస్తాను. తప్పక సాధిస్తాను అనే నమ్మకం నాలో ఉంది, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తున్నాను. ఆపై కాలం / వయస్సు / పరిస్తితులు / మనుష్యులు / వివిధమైనవి అనుకూలించడంపై నా ప్రయత్న ఫలం ఆధార పడి ఉంటుంది
అంత వరకూ నా ఆలోచనను విడవకుండా పోరాడుతూనే ఉంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి