14, నవంబర్ 2009, శనివారం

బుక్ ఎగ్జిబిషన్ కమిటీ ప్రస్తావన : సలహాలు

ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

నిరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున ధన్యవాదములు. మరి  రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.

ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు నీళ్ళతో చేరుకున్న పాలేమీ పలుచనైపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.

 

మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.

మొదటి సలహా అందినది, కావున సలహా పాటించడమైనదని గమనించగలరు

12, నవంబర్ 2009, గురువారం

నేను కూడా లంచం ఇచ్చానోచ్

 

ఈ పుట చదివే వాళ్ళలో పోలీసోళ్ళు ఉన్నా (లేక) పోలీసు సానుభూతి పరులు ఉన్నా (లేక) పోలీసులకు చుట్టాలు ఉన్నా (లేక) పోలీసు అవ్వుదాం అనుకునే వాళ్ళున్నా (లేక) పోలీసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా దయచేసి మఱో బ్లాగుకి పోయి ఆ విషయాన్ని ఆనందించండి. ఇది మీ లాంటి వాళ్ళు చదివి జీర్ణించుకోలేరు. ఒక వేళ జీర్ణించుకున్నారంటే మీకు ఎంత వంట పట్టిందో చెప్పనక్కరలేదు.

ఓ మర్చిపోయ్యాను .. లంచం ఇవ్వడం తప్పు అలాగే పుచ్చుకోవడం తప్పు కాబట్టి .. పోలీసోళ్ళ భాషలో "ఖర్చుల నిమిత్తం " అని మీరు మార్చుకుని చదువుకోండి

ఇక అసలు విషయానికి వస్తా. నా పాస్ పోర్ట్ పరిమితి కాలం అయ్యిపోనది అందుకని తత్కాల్ లో కావాలని పాస్ పోర్ట్ కార్యాలయంలో దరకాస్తు చేసుకున్నాను. దరకాస్తు చేసుకోవడం ఇంత సులువైన పని అని నాకు అప్పటి వరకూ తెలియదు. మొదటిసారి అప్లై చేసుకున్నప్పుడు నా అంతట నేనే పాస్ పోర్ట్ దరకాస్తు ఫారం తెచ్చుకుని మూడువందల రూపాయల డీడీ తీసి చక్కగా తంతీ తపాళా వారి రిజిస్టర్ పోస్టు చేస్తే, ఖచ్చితంగా ముఫై రోజుల్లో పోలీసోడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని, దారి ఖర్చులకు డబ్బులడిగాడు. అప్పుడు మా పరిస్తితి అంతంత మాత్రం. అందువల్ల తెగించి వస్తే వస్తుంది లేకపోతే రాదు అన్న తెగింపుతో ఇవ్వను అని చెప్పెసాను. సరే అని వెళ్ళిన ఆ అధికారి మా నాన్నగారితో మాట్లాడాలన్నాడు. నాన్నగారు ఇంట్లో లేరు అని అప్పటికి దాటేశాను. సరే అని అప్పటి జారుకున్న సదురు పోలీసాయన, మరో పది రోజుల తరువాత మళ్ళీ వచ్చి దారి ఖర్చులకు రొక్కం అడిగాడు. అప్పుడు కూడా నాన్నగారు లేరని దాట వేస్తే అస్సలు విషయం చెప్పాడు. ఏమిటంటే, సదురు పోలీసు ఇంక్వైరీలో చెడుగా వ్రాస్తే ఇక జీవితంలో పాస్ పోర్ట్ రాదని. అప్పటికో నేను ఇవ్వకుండా ఉండటానికి చెప్పాల్సినన్ని కధలు చెప్పాను. దానితో మన పోలీసాయనకు మండింది. ఇంకే దరకాస్తు ఫారం పైన మేము ఇంటిలో లేమని వ్రాసి తిరిగి పంపేశాడు. మా దురదృష్టం ఏమిటంటె, ఆ రోజుల్లో పాస్ పోర్ట్స్ అన్నీ ఈ ఒక్క పోలీసాయనే చెయ్యాలంట. అప్పుడు కధ కాస్తా తిరిగి తిరిగి మా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దెగ్గరకు చేరుకుంది.

 

గుడిలో లింగాన్ని మ్రింగాలని ఒకడు ఆలోచిస్తుంటే ఏకంగా గుడినే మ్రింగేస్తే ఎలా ఉంటుంది అని మరొకడు ఆలోచించాడంట. ఈ పోలీసోళ్లు అంతే. ఇదిగో ఇక మన లోకల్ కానిస్టేబుల్ గారు మా ఇంటికొచ్చి నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దాంతో మా నాన్నగారికి ఒకటే ఖంగారు, నేనేమి తప్పు చేసానా అని. ఇక అక్కడితో ఆ తతంగం ఆగితే ఫరవాలేదు, మా ప్రక్కింటి వాళ్ళని కూడా అడగటం మొదెలెట్టాడు సదురు కానిస్టేబుల్. దాంతో మా పొరుగోళ్ళు కూడా కంగారు పడ్డారు, నేనేదో గొడవలో ఇరుక్కోవడం వల్లే ఈ సమాచారం అడుగుతున్నాడని. సరే అని మేము సర్దుకుని ఊరుకుని అన్నీ పద్దతి ప్రకారం జరగాలి కదా అనుకుంటూ ఉంటే, ఇవన్నీ జరిగిన తరువాత చావు కబురు చల్లంగా చెప్పాడు. మేము అర్జంటుగా పోయి ఇంతక ముందు వచ్చిన పాస్ పోర్ట్  అధికారికి తృణమో ఫలమో ఇస్తే బాగుంటుంది లేక పోతే ఫైలు ముందుకు కదలదు సరికదా ఇలాంటి వెటకారమైన పనులు మాత్రం మాకు తప్పవని. ఇంకే తప్పని సరై మా నాన్నగారికి తెలియకుండా నేనే వెళ్ళి ఓ వంద రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఛా.. ఏంటి ఆ మాట అంటారా.. అదే నండి పోలీశోళ్ళ భాషలో నా కాగితం ముందుకు వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా, అదేనండి పోస్టాఫీసుకి వెళ్ళాలి అక్కడ స్టాంపులు తీసుకోవాలి. మళ్ళీ లోకల్ పోలీసోళ్ళకి ఇన్ ఫర్ మేషన్ చేరవెయ్యాలి.. వగైరా వగైరా అన్న మాట.

 

ఇదంతా పదేళ్ళ క్రిందటి మాటైతే, ఇప్పుడు పరిస్తితి మరోలా ఉంది. పైన చెప్పినట్లుగా నేను పాస్ పోర్ట్ ని తిరిగి పొందేందుకు చేసుకున్న ఆలోచనలో మొదటి అంకం దరకాస్తు ఫారం నింపి పరిశీలన నిమిత్తం అంద జేయ్యాలి. సరే.. అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అనుకుని ఇచ్చిన సమయానికి మ్రుందే చేరుకుని కావాల్సిన పత్రాలన్నింటినీ చూపించి ఈనెల మూడవతారీఖున దరకాస్తు చేసుకున్నాను. పాస్ పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకు నాది ఒకటే అభ్యర్దన. మధ్యవర్తులను నమ్మకండి. చక్కగా మీ అంతట మీరే వెళ్ళి దరకాస్తు చేసుకోండి. ఇప్పుడు ఈ పనులన్నీ చాలా శులభతరం చేసారు. ఇక నా విషయానికి వస్తే, నా దరకాస్తు ఫారం కాస్తా పోలీస్ వెరిఫికేషన్ కోసం గత శనివారం వచ్చింది. ఇంకే మరో పోలీసు గుంటనక్క మా ఇంటికి చేరుకుంది. అడిగిన కాగితాలు చూపించాం కావలసిన నకలు పత్రాలు అంద జేసాం. ఇవన్నీ చాలవన్నట్టు, మేము అద్దెకు ఉంటునట్లుగా మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాగితం కావాలన్నాడు. అడిగినదే తడవుగా మా లీజ్ ఎగ్రిమెంట్ చూపించా. మరేదో లేదన్నాడు. అదీ చీపించా. ఇంకే మన నక్క తెలివితేటలు ఉపయోగించి మా ఎగ్రిమెంటు నోటరీ చేయించలేదు కావున చెల్లదు అంటూ అది చేసి మరునాడు ఉదయం పదిన్నరకు ఐమాక్స్ ధియేటర్ ఎదురుగా ఉన్న పాస్ పోర్ట్ సెల్ దగ్గరకు వచ్చి ఇవ్వమన్నాడు. అప్పుడు అర్దం అయ్యింది మనోడు పైసలు ఇస్తేనే గానీ వదలడు అని. కానీ అస్సలు దారి ఖర్చుల విషయం ఏమీ మాట్లాడ లేదు కదా అని ఊరుకున్నాను. మరునాడు చెప్పిన సమయానికి చక్కగా అన్ని కాగితాలు పట్టుకుని వెళితే, అప్పుడు మూల్గాడు అసలు విషయం.

 

అదిగో అప్పుడు నాకు కాలింది. ఎందుకు ఇవ్వాలి సార్ అన్నా. అదే డైలాగ్ .. పాస్ పోర్టుని లోకల్ పోస్టాఫీస్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్ కి పంపించాలిగదా అక్కడ ఖర్చు ఉంటుంది కదా .. అంటూ యదవ సోది చెప్ప బోయ్యాడు. అప్పుడు నేను అన్నాను, వీటన్ని ఖర్చుల నిమిత్తమై కదా తత్కాల్ లో ఎక్కువ పెట్టి చేయించుకునేది. ఇక మన నక్కగారికి పూనకం వచ్చి అచ్చంగా తోడేలైయ్యాడు. నా మీద ఘీంకరించడం మొదలైంది. ఇక్కడ వ్రాయలేను అసభ్య పదజాలం వీరు ఉపయోగించారు. ఇక లాభం లేదనుకుని ఖర్చుల నిమిత్తం ఎంత అవసరపడొచ్చు అంటే, ఓ రెండివ్వండి అన్నాడు. సరే రొండొందలే కదా అని రెండు వంద నోట్లు తీసి చేతిలో పెట్ట బోతే ఏదో చీడ పురుగుని చూసినట్టు చూసి, ఇది తత్కాల్ కాబట్టి మరో సున్నావేసి ఇవ్వు అన్నాడు. మరి కొంత సేపు వాగ్వివాదం. ఇదంతా ఎక్కడనుకున్నారు, అచ్చంగా పోలీసు వారి అధికారిక కార్యాలయంలో. అక్కడ మనం ఏదైనా అన్నాం అనుకోండి ఇంకే ముంది, రాజ్యం వాళ్ళది కదా బొక్కలో వేసి కుమ్ముడే!! కాదంటారా.. ఆఖరుకి ఒకటిన్నరకన్నా తగ్గితే ఊరుకునేది లేదు అని కరాఖండీగా చెప్పెశాడు.

వీళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి ఎవ్వరైనా తెలిసిన పోలీసు చేత చెప్పిస్తే వింటాడు కదా అని ప్రయత్నిస్తే, సదురు పోలీసు కుక్క కూడా ఇదే చెప్పింది. మనకు వాళ్ళతో గొడవ వద్దు కానీ అడిగింది ఇచ్చేయ్ మనకు ఎప్పుడైనా అవసరం పడితే చేస్తాడు, అని సమాధానమిచ్చింది. ఎంతైనా ఓ గూటి పక్షులే కదా వీరంతా అనుకుని అనువుగాని చోట అధికుల మనరాదని సమర్దించుకుని అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకున్నాను.

 

ఇందు మూలముగా యావన్మందికీ తెలిజ జేయునది ఏమనగా, సదురు పోలీసు జాగిలం మీ యింటికి వచ్చినప్పుడే విషయాన్ని తేల్చేసుకుంటె మీకు వారి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే మీకూ తలకాయ నొప్పి ఉండదు. ఈ స్వతంత్ర భారత దేశ యంత్రాగానికి నిధులు కరువైనాయి కనుక మన ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు పడేసినట్లుగా ఇలా ఖర్చుల నిమిత్తం బ్లాక్ మైల్ చేసి డబ్బులు దండుకునే పోలీసులోళ్ళనుంచి దూరంగా ఉండడమే మంచిదని నా అభిమానం. ఆఖరుగా మాతాత గారు చెప్పిన ఓ విషయం స్మరించుకుంటాను

దుష్టులను దూరంగా ఉంచకూడదంట, వాళ్ళకి మనం దూరంగా ఉండాలంట.

పై విధంగా, మా ఇంటికొచ్చిన రాయల్ బ్లాక్ మైలర్ బెగ్గర్ కి ఖర్చుల నిమిత్తం ఒకటిన్నర సమర్పించుకున్నానని సవినయంగా విన్నవించుకుంటున్నాను

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

నా వల్ల అవుతుందా!!

నా జీవితంలో కొన్ని కొన్ని కోరికలు తీరకుండా పోతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు కానీ తీరడానికి అనువైనవే అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి నా కుటుంబం పిల్లల్లు గురించి నేను ఈ క్రింది విధంగా చెప్పుకోవాలని కోరిక

 

నేను.. చదువు రీత్యా పోస్టు గ్రాడ్యుయేట్.. వృత్తి రీత్యా బ్రమ్మి.. ప్రవృత్తి రీత్యా నృత్యకారుణ్ణి.. వీలైతే చదరంగంలో క్రీడాకారుడిగా రిటైర్ అవ్వాలని కలలు కంటున్నవాడిని. హాపీలీ మారీడ్ టు ఏన్ ఇన్డిపెన్‍డెంట్ టెక్నికల్ కాంన్సల్టెంట్. మాకు ఓ కూతురు  మేము మరో అమ్మాయిని దత్తత తీసుకున్నాం. వీరిద్దరినీ చక్కగా చదివించాం. వీరి భవిష్యత్తు వీరి చేతుల్లో ఉంచి మేము ఈ తనువు చాలించాం

 

పైన పరిచయ కార్యక్రమం లో చాలా “నేను” దాగి ఉంది కదా.. ఏమి చేస్తాం.. స్వార్ధం... ఈ సదురు నేను నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రాలేక పోతున్నాను. ఇప్పటికే మూడింట రెండొంతుల జీవితం అయిపోయింది. ఇప్పటికైనా నేను లోంచి మేము లోకి ఎప్పటికి వస్తానో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా, ఈ కోరికలు తీరనంతగా లేవని నా అభిప్రాయం.

 

మరి మీరేమంటారు?

30, ఆగస్టు 2009, ఆదివారం

ఆశ్తికత్వమా!! నా బొందా!! ఎవ్వడా దేవుడు?

 

ఈ మధ్య ఓ సహ తెలుగు బ్లాగరు వ్రాసిన దానిని చదివిన తరువాత నాకు నవ్వాగలేదను కోండి. సోది ప్రక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తాను. అస్సలు నాస్తికత్వం అనేది ఏదైనా ఉందా అని నా అనుమానం. ఆస్తికులు అనేటోళ్ళు ఎవ్వరు? అలాగే నాస్తికులు అని వేరు చేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి? ఓ!! మర్చిపోయ్యాను. ఇక్కడ దేవుడు అనే ఓ విషయం ఉంది కదా .. అలాంటి విషయం ఉంది అని నమ్మేటోళ్ళు ఆస్తికులా .. నమ్మని వాళ్ళు నాస్తికులా .. మరి నేను నాస్తికుడినా? లేక ఆస్తికుడినా? ఈ విషయం గురించి తరువాత చర్చిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి.. తెలియక ముందు నుంచి కూడా, నాకు ఫలానాది ఇది అని చెప్పినోళ్ళు చాలా మంది. ప్రతీ ఒక్కరూ నాకు గురుతుల్యులే.

కష్టే శ్రమే ఫలి అన్న మొదటి పాఠాన్ని నేర్పిన తల్లి మొదటి గురువు. ఎలా అనుకుంటున్నారా.. అకలి వేసి ఏడిస్తే, ఆ ఏడుపుని అర్దం చేసుకుని చనుబాలను నాకు అందించి కతకడం అనే అలవాటు నేర్పిన మొదటి గురువు అమ్మ. ఈ రోజుల్లో అమ్మలు పిల్లలకు ఆ విధ్యని నేర్పించకుండా పుట్టిన వెంటనే పోత పాలు అలవాటు చేసి కష్ట పడకుండా ఎలా ఎదగచ్చో నేర్పుతున్న తల్లులు నా దృష్టిలో పిల్లలకు స్వతహాగా నేర్చుకునే అలవాటుకు అడ్డిపడి వారి ఎదుగుదలకు అడ్డుపడే అవరోధాలని అభిప్రాయం. ఆ పిల్లల పాలిట శాపాలుగా అనిపిస్తారు. ఇక్కడ పాలు రాని తల్లుల విషయం నేను ప్రస్తావించడం లేదని చదివే వారు గమనించాలి.

నేను మాటలు రాక ఏవేవో శబ్దాలు చేస్తుంటే, నా శబ్దాలలోంచి వారి వారి బంధుత్వ వరుసలు నాకు తెలియ జేస్తూ నాచేత నాన్న .. మామ.. అత్త.. తాత.. బామ్మ.. ఇంకా ఏవేవో పలికించి వారిని వారు పరిచయం చేసుకుంటూ, నీకంటూ ఈ లోకంలో నేనున్నాను అంటూ అభయమిచ్చిన నా బంధు జనం అంతా నాకు మాటలు నేర్పిన గురువులే. బడిలో పలకా బలపం పట్టుకోవడం నేర్పిన భాద్యత గల ఓ ఉధ్యోగి నాకు విధ్యా బుద్దులు నేర్పిన గురువు. ఆట పాటలతో తింగరేషాలు వేస్తుంటే, తాళగతులతో నాట్యాన్ని నేర్పిన  వాసిరెడ్డి కనకదుర్గగారు నాకు గురువు. ఈత కొట్టడంలో మెళుకువలు నేర్పి బంగారు పతకాలు చేజిక్కించుకునే నైపుణ్యాన్నిచ్చిన వెంకటేశ్వరరావ్ కోచ్  నాకు గురువు.

విధ్యాభ్యాసాన్ని ముగించి ఉద్యోగ వేటలో సహాయం చేసి బ్రతుకు బ(బం)డిలో పలు పలు పాఠాలను నేర్పిన విస్వేశ్వరుడు నాకు గురువు. ఏవిధంగా సంగమిస్తే రతి సుఖం లబిస్తుందో తెలియ జెప్పే భార్య నాకు గురువు. ఎవ్వరికి సహాయం చెయ్యాలో ఏ సమయంలో చెయ్యాలో తెలియజేసి నాకు పుణ్యాన్ని ఆర్జించి పెట్టే అన్నయ నాకు పుణ్యఫలం చేజిక్కించుకునే నైపుణ్యాన్ని నేర్పిన గురువు. షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో తెలియ జెప్పే కంపెనీలు నాకు వ్యపార పరంగా గురువులు.

ఇలా ఎందరో మరెందరో గురువులు నా దృష్టిలో దేవుళ్ళు. వీళ్ళంతా కనిపించే దేవుళ్ళు. నేను వీళ్ళనే దేవుళ్ళంటాను. మరి ఆస్తికులు ఉదహరించే సదురు దేవుడు వీళ్ళల్లో లేడే. మరి నేను ఆస్తికుడినా లేక నాస్తికుడినా?? సరే ఆస్తికుడు అనుకుందాం అనుకుంటే మరి ఆ దేవుడిని గుర్తించాలిగా ?? ఇంతకీ ఆ సదురు దేవుడేక్కడున్నాడు? రమ్మనండి నాముందుకు. రాడే!! ఎందుకొస్తాడు ఉంటేగా!!?? సరే నేను ఆస్తికుడిని కాదు నాస్తికుడిని అనుకుందాం అనుకోండి, నాకంటూ దేవుళ్ళు ఉన్నారే!! మరి నేనెలా నాస్తికుడినౌతాను??

నాకు తెలియక అడుగుతాను.. ఆస్తికుడు అంటే తెలుగులో అస్తికలు కలవాడనేగా!! (కాకపోతే సరిజేయ గలరు) మరి ఈ లెక్కలో నాస్తికుడు అంటే అస్తికలు లేని వాడనా!! అంటే ఎవ్వరిలో ఎముకలు లేవంటే వారంతా నాస్తికులా?? యదవ లాజిక్కులు తీసి తొక్కలో డైలాగ్లు వెయ్యొద్దంటారా!! సరే వెయ్యను గాక వెయ్యను. మీరే చెప్పండి. దేవుడంటే ఎవ్వరు? ఎలా ఉంటాడు? ఓ!! రాముడిలా మీస్సాలేకుండా క్లీన్ షేవ్ చేసుకుని ఉంటాడా. లేక కృష్ణుడిలా చిలిపి దొంగతనాలు చేస్తూ ఉంటాడా!! అదీ ఇదీ కాదు.. ఏమీ చేతకాని వాడిలా అందరూ తిడుతూ కొడుతూ ఉంటే.. ’పోనీలే పాపం చేస్తున్నారు, వీళ్ళందరూ సంజాయిషీ ఇచ్చేరోజు వస్తుంది’ అని అవమానాలు ఛీత్కారాలు భరించిన ఏసు ప్రభువు లాగుంటాడా!!

16, ఆగస్టు 2009, ఆదివారం

మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!!

 

ఇవ్వాళ మా ఆఫీశ్ వాళ్ళం అంతా కలిసి చర్లపల్లి లోని స్పూర్తి ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్న అనాధ శరణాలయానికి వెళ్ళాం. అక్కడ దాదాపు ఓ వందకు పైగా అనాధ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఓ చిన్నపిల్ల అందరినీ ఆకట్టుకుంది. మేము అక్కడ ఉన్నంత సేపట్లో ఆ పిల్లని ఎత్తుకోని వాళ్ళు లేరు. నాకు తెలిసి ఆ పిల్ల కాలు క్రింద పెట్టలేదనుకుంటా. ఆ పిల్ల వయస్సు దాదాపు ఓ ఆరు లేదా ఏడు ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి తండ్రికి ఎయిడ్స్ వచ్చి పోయ్యాడు. పోతే పోయ్యాడు, (యదవ..) పోతూ పోతూ ఆ జబ్బుని తన భార్యకి అంట గట్టి పోయ్యాడు. వాడు పోయిన తరువాత ఆ తల్లి ఈ పిల్లని తీసుకుని ఈ శరణాలయానికి వచ్చి ఈ పిల్లని చేర్చిన ఓ రెండు నెలలకు తనూ చనువు చాలించింది. అందువల్ల ఈ పిల్లకి తన అనే వాళ్ళు ముద్దు ముచ్చట చేసే వాళ్ళు లేని తరుణంలో మేమంతా కనబడేటప్పటికి ఆనందం ధుఃఖం రెండూ ఒకేసారి వచ్చేసాయి. సరే అది వేరే కధ.


ఇక అసలు విషయానికి వస్తే.. సదురు సో కాల్డ్ దేవుడు అనేవాడుంటే.. నేను ఒకే ప్రశ్న వేయ దలచాను. అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు ఎయిడ్స్ ఆంటి ప్రాణాంతక వ్యాధుల భారిన పడి బలైతున్నారు. వీళ్ళేం పాపం చేశారని వీళ్ళకీ శిక్ష? ఒక వేళ వీళ్ళకి ఇలాంటి వ్యాధులు లేక పోయినా, ఇలా అనాధలని ఎందుకు చెయ్యాలి? ఇలా జీవితాంతం ప్రేమానుభవాలకు దూరంగా పెరగాల్సిందేనా!! ఇలా అనునిత్యం ఎంతో మంది చిన్నారులను ప్రేమానురాగాలకు దూరంగా బ్రతకమని తలరాత వ్రాసే దేవుడు నిజంగా దేవుడేనా?? ఎంతటి దుర్మార్గుడో సదురు దేవుడు!!

 

వీళ్ళని తీసి ప్రక్కన పెడదాం. దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటప్పుడు కూడా మౌనం వహిస్తున్న దేవుడు ఒక దేవుడేనా?? దేవుడనేవాడుంటే అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలుతున్నప్పుడు ఎక్కడున్నాడు? వేలకు వేల మంది జనాభా చనిపోతున్నప్పుడు ఎక్కడున్నాడు? ఇరవయ్యో శతాభ్దంలో స్మాల్ ఫాక్స్ (అమ్మోరు) అనే వ్యధి భారిన పడి అచ్చంగా ముప్పై కోట్ల మంది చనిపోయ్యారే!! అప్పుడెక్కడున్నాడు ఈ దేవుడు? 2004లో వచ్చిన సునామి 2,29,866 మంది ప్రాణాలు తీసేస్తే ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఓ!!! కమలహాసన్ తీసిన దశావతారం అనే సినిమాని చూడాల్సిందే అంటారా!! 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ద్వారా ప్రపంచం మొత్తం మీద దాదాపు యాభై లక్షల మంది చనిపోయ్యారే!! మరి వీరేందుకు పోయ్యారబ్బా!! అనునిత్యం ఎన్నో మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో సదురు దేవుడేమి చేస్తున్నాడు?

 

ఇవన్నీ ఒక ఎత్తైతే కరువు కాటకాలతో దేశానికి దేశాలే అన్నమో రామ చంద్రా అంటూ అలమటిస్తున్నాయే, మరి వారి మాటేమిటి? వారందుకు భాధ పడాలి? ఏం మాయలు మంత్రాలు వచ్చిన బాబాలు చాలామంది మన దేశం లోనే ఉన్నారుగా!! వారంతా పోయి సదురు దేశాలలో ఉండి బంగారాన్ని శృష్టించి వారి దేశంలో పేదరికం అనేది లేకుండా చెయ్యొచ్చు కదా!! ఏం? సదురు మాయలు మంత్రాలు ఆ దేశ కాల మాన పరిస్థులలో పనిచెయ్యవా !! లేక మరింకేదైనానా!!?? కంబోడియాలాంటి దేశాల గురించి ఎందుకు గానీ మన దేశాన్ని ముందు బాగు చెయ్యొచ్చు కదా.. పుష్కలంగా వానలు కురిపించొచ్చు కదా!!?? పాడి పంటలతో చల్లగా ఉండేటట్లు దీవించొచ్చు కదా..

ఇదంతా ఓ బోగస్.. మరి మీరేమంటారు?

9, ఆగస్టు 2009, ఆదివారం

దేవుడా !! తొక్కా !! ఎవ్వడాడు ? ఎక్కడుంటాడు?

 

మొన్నామధ్య మన దుర్గేశ్వరగారు మాటల మధ్యలో దేవుడి గురించి మన పెద్దలు మనకు నేర్పిన దాని గురించి వ్రాయమన్నారు. గాడిద గుడ్డుంది వ్రాయడానికి. మా అయ్య నాకేం చెప్పలేదు. పోని వాళ్ళ అయ్య ఏమైనా చెప్పాడా అంటే, ఆయన ఏమీ సెప్పకుండానే పోయాడు. ఏదో మా తాత తాత మాత్రం మా ఊళ్ళో గుడి కట్టించిండంట!! ఎవడికి తెలుసు నిజంగా ఆయనే కట్టించాడో లేక మరెవరైనా కట్టించి ఈయన పేరెట్టారో!! ఆళ్ళ పేరు పెట్టుకుంటే ప్రాచుర్యం రాదనేమో, మా తాత తాత పేరెట్టారు. ఏదైతే ఏంది మా ఇంటి పేరున ఓ గుడి వెలిసింది. అది మాత్రం వ్రాయగలను.

ఇక అసలు విషయానికి వస్తే.. సాంప్రదాయాల గురించి మాకు (నేను + మా అన్నయ లకు) పెద్దోళ్ళు ఏమీ చెప్పింది లేదు. ఎందుకంటారా.. మానాన్న గారు రైల్వే మైల్ సర్వీస్ లో చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎక్కువ కాలం రైల్లో ప్రయాణం చేయ్యాల్సొచ్చేది. అందువల్లన మాకు దూరంగా ఉండే వారు, మేము ఎప్పుడూ అమ్మ కూచిలమే. అందువల్ల మాకు నాన్నగారితో పెద్ద ఎటాచ్ మెంట్ లేదు. ఏదో మేము పెరిగి పెద్దైన తరువాత ఆయన రిటైర్ మెంట్ దగ్గరకొచ్చినప్పటికి విజయవాడ స్టేషన్ లోని 6వ ఫ్లాట్ ఫారమ్ పైన కల ఆఫీస్ కి వచ్చిన తరివాత మాకూ కొద్దో గొప్పో లోక ఙ్ఞానం తెలిసే వయసొచ్చాక, ఆయనతో లోకభిరామాయణం పిచ్చాపాటి వెయ్యడం తప్పితే మనకు ఆయన నేర్పిన సాంప్రదాయం ఏమీ లేదు.

అందువల్ల మనకా విషయాలలో పెద్దగా అవగాహన ఏమీలేదు. ఇక దేవుడి గురించి నన్నడిగితే నేనేమి చెబుతాను. తొక్కలోది, నాకేం తెలుసని ఈయన నన్ను వ్రాయమంటాడు అని మనసులో అనుకుని. సరిలేండి అలాగే వ్రాస్తా అన్నాను. ఇక మొదలు పెడదాం. ఏంటి మొదలు పెట్ట్టేది. ఇప్పటి వరకూ ఒక్క పది నిమిషాలలో వ్రాసేసాను. ఇదిగో ఇక్కడే గొంతులో వెలక్కాయ పడింది... ఓ ఇక్కడ చెప్పడానికి గొంతు అవసరం లేదు కదా .. మరి ఏమని ఉదహరించాలబ్బా!! ఆ.. చేతికి సంకెళ్ళేసినట్లైంది. చుద్దాం ఎప్పటికి పూర్తవుతుందో. ఈ విషయం పై వ్రాయమని చెప్పి నాకు మంచి శిక్ష వేశారనిపిస్తోంది. నాయాల్ది, నాకు గాని టైమొస్తేనా.. <<డాష్.. డాష్ ..>>. ఏదో పెద్దాయన కదా కొంచం సెన్సార్

దేవుడు ..!!?? ఇంతకీ ఈడెవడు? అదేదో సినిమాలో తోటమాలి పేరు దేవుడు అన్నట్లు గుర్తు. ఆడేనా ఈడంటే!!?? కాదేమో!! ఆడు మడిసే కదా.. మరి ఈడెవ్వడు?? మా వాచ్ మెన్ ఈరిగాడెని అడిగా, ’దేవుడంటే ఎవ్వడని?’.. ’అయ్యా !! నాకేటి తెలుస్తాది? నామటుకు నాకు రాములోరే దేవు’డన్నాడు. తొక్కలోది ఈ సదురు రాములోరేంటి.. దేవుడేంటి.. సదురు మగాడు భార్యను అనుమానించినట్లుగా ఈయన కూడా సితమ్మోరిని అనుమానించి అడవిలో వదిలేయ్యమని తమ్ముడిని పురమాయించలేదా!! ఇంతగా మనిషి లక్షణాలు పుక్ష్కలంగా ఉన్న ఈయన దేవుడెలాగయ్యాడు? ద సోకాల్డ్ రాములోరు కూడా ఓ అమ్మకి అయ్యకే పుట్టినోడే కదా!! అని అనుకుంటుంటుండగా, చిన్ననాటి స్నేహితుడు రాబర్ట్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ’క్రైస్తవులకు దేవుడైన యేసయ్య ఓ కన్యకు జన్మిం’చాడని. అంటే యేసయ్యకు నాన్నెవ్వరో తెలియదన్నమాట. ఆవిడ వయస్సులో ఉన్నప్పుడు కాలి జారుంటుంది దాన్ని కవరింగ్ చేసుకునే ప్రయత్నమే ఈయన జననం అని మనం ఎందుకు అనుకోకుడదు. ఏది ఏమైనా ఈయన కూడా ఓ అమ్మకే పుట్టినోడేగా .. మరి ఈయన దేవుడెట్లా అయ్యాడు? ఓ మాజిక్ లు గట్రా చేసేటోడంట కదా .. అందుకనా ఈయన్ని దేవుడన్నది. ఇలాంటి మాజిక్కులు జిమ్మిక్కులు ఈ రోజుల్లో రోడ్డుకొకడు చేస్తున్నాడు. అంతెందుకు మన పుటపర్తిలోని బాబా చెయ్యటంలేదా.. ఆయన డూప్ చిన్న సాయి బాబా చెయటం లేదా..

దేవుడు అనే వ్యక్తికి ఉండాల్సిన ప్రధమ క్వాలిఫికేషన్ ఇలా మాయలు మంత్రాలు అంటూ మాజిక్ చెయ్యడమే అయితే, మన డేవిడ్ బ్లైన్ కూడా దేవుడే. ఇలా అయితే రోడ్డు ప్రక్కన మాజిక్ చేసే ప్రతి యదవ నాయాల దేవుడే మరి. రేప్ చేసే ప్రతి యదవ నాయాల నా దృష్టిలో ఓ దేవుడే. ఈడే నయం సూన్యంలోంచి ఓ బిడ్డకు జన్మనిస్తున్నాడు. అంతే గాని ఎవ్వడో చెసిన లింగాన్ని మ్రింగి అది నా కడుపులో తయ్యారయ్యింది అని చెప్పి జనాల్ని మభ్య పెట్టడం లేదు. చక్కగా రైట్ రాయల్ గా రేప్ సేసింది నేనే అంటూ గర్వంగా తిరుగుతున్నాడు. ఎవ్వడో సేసిన పనికి క్రెడిట్స్ కొట్టేసే దొంగ బాబాలకన్నా తన కష్టమేదో తాను పడి, మొకాళ్ళు అరిగేలా కష్టపడి వద్దని గొంతు సించుకుని అరుస్తూ అసలు కార్యానికి శత విధాలుగా అడ్డుపడ్డా మగాడిగా గెలిసి పని కానించి ఓ బిడ్డని కనే అవకాశాన్ని ఇచ్చి ఓ పెద్ద మాజిక్ చేసేటోళ్ళే దేవుళ్ళు అని నా అభిప్రాయం.

మరి మీరేమంటారు .. సదురు తొక్కలో దేవుడి గురించి? ఏంటి దేవుడ్ని ఇలా అమర్యాదగా సంభోదిస్తున్నాను అని అనుకుంటున్నారా .. గాడిదగుడ్డు.. ఆడే గనక ఉంటే.. రమ్మనండి నాయాల్ది .. కొడుకుని సింత బర్రె బట్టుకుని ఉతికిన చోట ఉతకుండా ఉతుక్కుంటూ ఊరంతా దౌడాయిస్తా. నాకు గనక తిక్కరేగిందంటే ఆడ్ని అలాగే ఆడ్ని ఎనకేసుకొచ్చేటోడెవ్వడైనా .. సచ్చిండ్రే నా సేతుల్లో.

3, ఆగస్టు 2009, సోమవారం

40 సంవత్సరాల క్రిందనే చంద్రుని మీద మానవుని పాదం మోపాడు – గాడిద గుడ్డేంకాదు

భారతదేశంలో, ఆ రోజు కాలెండర్లో 1969 వ సంవత్సరం జులై నెల 20 చూపిస్తోంది. అలాగే సరిగ్గా అదే రోజు అమెరికా చెరిత్రలో ఓ నాటకానికి తెరదించే ప్రయత్నం మొదలైంది. ఆనాటి యావత్ అమెరికా ప్రజలనే కాకుండా ప్రపంచ జనాభానే మభ్య పెట్టి ఆకాశానికి నిచ్చెనను వేసి చంద్రునిపై అమెరికా అంతరిక్ష వ్యామగోములైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మరియు బజ్ అల్ డ్రిన్ పాదం మోపిన (అబద్దపు) నాటకాన్ని అత్యంత రసవత్తరంగా నాసా రచించడమే కాకుండా రెండున్నర గంటలు ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల ద్వారా ఆనాటి జనాభా చెవులలో క్యాబేజీ అంత పూలు పెట్టి మరీ చూపించే సాహసం చేసిందంటే, అది విని పుస్తక పుటల ద్వారా చదువుకుని వారు చెప్పిందే వేదంగా తలచి తప్పుడు సమాచారాన్ని జీర్ణించుకో .. అంటే నేనేమన్నా టాటా డుకొమో వాడటం లేదనుకుంటున్నారా..


అలనాడు సర్ ఐజక్ న్యూటన్ ప్రశ్నించినట్లు, ఆపిల్ క్రిందకే ఎందుకు పడాలి? తరహాలో నేను వీరి భూటకపు ప్రయాణ కార్యక్రమాన్ని వితండంగా .. ఈళ్ళు నిజ్జంగానే ఆడకి పోయ్యారా లేక ఇదంతా హాలీఉడ్ స్టూడియోలో తీసిన సినిమానా అని అనను .. కానీ ఈళ్ళు ఎళ్ళింది మాత్రం చెంద్రునిమీదకు కాదు కానీ ఈళ్ళు ఏళ్ళింది భుధ గ్రహం మీదికి అంటాను, కాదంటారా!! ఎక్కడికెళ్ళరో అనేది ఋజువు జేసుకునే భాద్యత ఆళ్ళదే గందా!! ఎలా అంటారా, మన భారతదేశం చట్టం ప్రకారం నిందారోపణ జేయబడ్డవానిదే నిరూపించుకునే భాద్యత. అంతవరకూ వానిని ముద్దాయి అంటారు. అలాంటి ముద్దాయిపై పడ్డ అపవాదుని తొలగించుకుంటూ నిర్ధోషిగా విడుదలవ్వాలంటే మరి ఎవ్వరు చెయ్యాలా!! మన నాసాఓళ్ళే చెయ్యాల.. గేటంటరు? ఇక అసలు ఇషయాని కొస్తే, మనోళ్ళు అస్సలు చంద్రునిపైకి పోలే.. అని సానామంది గోటికాడ నక్కలా కూస్తానే ఉన్నారు. వాటిల్లో కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు (తేలికగా ఉండేవి మాత్రమే) మీకోసం ఇక్కడ ఇలా.. ఇక్కడ ప్రస్తావించని చాలా (ఎన్నో) ప్రశ్నలకు సమాధానాలే లేవు. అయితె..ఈ క్రింది ప్రశ్నలు జవాబులేవి?


1) ఆ రోజు టెలీకాస్ట్ అయిన ప్రసారంలో చంద్రుని ఆకాశంలో ఉండాల్సిన నక్షిత్రాలు ఏమయ్యాయి? ఏం చంద్రుని ఆకాశం భూమి ఆకాశం ఒక్కటి కాదా!!


నా జవాబు) భహుసా ఈ సినిమా డైరెక్టరు గారికి మన విఠలా చార్యుడు గారు పరిచయం లేరెమో.. అంతే కాకుండా ఈ డైరెక్టరు గారికి డిస్కో లైట్ల గురంచి తెలియదేమో!! దీనికి సమర్దనగా ఉన్న వివరణ ఏమిటంటే, ఆరోజున వ్యామగోములు వాడిన కెమెరా ఎక్కడో ఉన్న నక్షిత్రాలను జూమ్ చేసి చూపలేకపోయింది కనుక తప్పు వీళ్ళు తీసుకెళ్ళిన కెమెరాదైతే మొత్తం వ్యవహారమే భూటకం అనటం ఏమాత్రం భావ్యం? అందుకని యదవ నాటకాలాడకుండా సెప్పింది ఇని ఊరుకో!! అంతే గానీ అదిలేదు ఇది లేదు అన్నావ్వంటే ఒంగో బెట్టి పాలు ఇతుకుతా బిడ్డా!!


2) Apollo 11 అనేది వీరి అంతరిక్ష నౌక పేరు. ఈ నౌక చంద్రునిపై దిగేటప్పుడు కొన్ని వీడియోలను తీసింది. వాటిల్నే మన అమెరికా ప్రభుత్వం భద్ర పఱచింది. కానీ విచిత్రం ఏమిటంటే భద్రతా కర్మాగారం లోంచి వీటిల్నిఎవ్వరో దొంగలించారు. అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం యొక్క వీడియొలు పోయాయంటే, దొంగిలించిన వారికి ఒఱిగేదేమిటి? దొంగిలించిన వారు ఏ ఉద్దేశ్యంతో దొంగ తనం చేసారంటారు? అస్సలీ దొంగతనం వెనకాల ఎవ్వరికీ అసలైన ప్రయోజనం? మొత్తం 700 టేపుల్లో 698 టేపులు ఎత్తుకు పోయ్యారంట!! ఓ రెండు మాత్రం వదిలేసారంటే.. దాని వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది?


నా జవాబు) ఏముంది, సింపుల్.. సాక్ష్యాలు పోయ్యాయంటే ఒక్క మాటతో అబద్దాన్ని ఱుజువు చెయ్యాల్సిన అవసరం ఉండదుగా !! ఓ!! చెప్పడం మరిచాను, పోయ్యాయనుకున్న 698 వీడియోలలో ఓ వంద వరకూ దొరికాయంట. ఎక్కడనుకున్నారు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ అనే నగరంలోని కర్టైన్ అనే యూనివర్సిటీలోని ఫిజిక్స్ పాఠాలు చెప్పే ఓ పెద్ద సెమినార్ హాల్ యొక్క కుర్చీల సీట్ల క్రింద!! ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయ్యాలి. ఈ సెమినార్ హాల్ చాలా కాలంగా మూత పడి ఉందంట. అయినా నాకు అర్దం కాక అడుగుతాను అస్సలీ సెమినార్ హాల్ ని ఎందుకు మూసేసినట్లు? ష్.. ఇక్కడ మీరు ప్రశ్నలు అడగకూడదు.


3) ఈ తతంగంలో మనుష్యులే కాకుండా వారికి తోడుగా కొన్ని రవాణా వాహనాలు అక్కడ వీరికోసం అమర్చబడ్డాయి. నిజమే అనుకుందాం. మనుష్యులు నడిచినప్పుడు పాదాల గుర్తులు మాత్రం అచ్చులుగా పడతాయా!! మరి అక్కడ ఉపయోగించిన బ్యాటరీ కార్లు వాటి చక్రాలు వాటి గమనాన్ని ఉద్దేశ్శించే విధంగా ఎలాంటి గుర్తులు మిగల్చ లేదంటే ఏమనుకోవాలి? నమ్మకం కుదరటం లేదు కదా .. ప్రక్కనే ఉన్న చిత్రంలో ఉన్న వెహికిల్ చక్రాల మధ్యలో చూడండి ఏమైనా గుర్తులు కనబడుతున్నాయా??


4) ఆ రోజుల్లో ఉన్నటువంటి శాంకేతిక పరిఙ్ఞానంతో అంతరిక్షంలోకి వెళ్ళి, చెంద్రునిపై దిగి, తిరిగి రావడానికి ఉన్నటు వంటి అవకాశం 0.0017%, అంటే ఇది virtually impossible. అటువంటిది నాసా ఐదు సంవత్సరాల వ్యవధిలో దాదాపు డజన్ మంది వ్యామగోముల్ని అంతరిక్షంలోకి పంపించడం చేసిందంటే, నలభై సంవత్సరాల తరువాత టెక్నాలజీ ఇంతగా అభివృధి చెందిన సమయంలో ఒక్క సారి కూడా అటువంటి ప్రయత్నం చెయ్యకుండా, ఎప్పుడో మా తాతలు నేతులు నాకారు ఇప్పుడు మీరు మా మీసాలు వాసన చూడండి అంటే ఎలా నమ్మాలి?


ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.. మరి చదివే తమరేమంటారు?


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

25, జులై 2009, శనివారం

నన్నయ్య ఆది కవి - నేనొప్పుకోను !!

తెలుగు మాట్లాడేనేను నన్నయ్యను ఆది కవిగా ఒప్పుకోను. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నన్నయ్యను ఆది కవిగా నిర్ణయించి నా మనోః భావాలను దెబ్బదీసినది. ఇందుకు అసమ్మతిగా నేను న్యాయస్థానంలో ప్రజా వాఙ్మయాన్ని (సరిఅయినదో కాదో .. ఆంగ్లంలో చెప్పాలంటే, Public Litigation Interest) వేయ తలంచాను. ఖబడ్ దార్ !! అందరూ ఇక కాచుకోండి. చిన్నప్పుడు నాకు విధ్యా భుద్దులు నేర్పిన గురువులారా!! సిద్దం కండి.. చెరసాలలో ఊచలు లెక్క పెట్టడానికి. అబద్దపు విధ్యను భోదిస్తారా!! హన్నన్నా .. ఎంత కండ కావరము .. వీరికి తోడు మన అన్న తారక రామారావు గారు నన్నయ్యకు టాంక్ బండ మీద విగ్రహం కూడా కట్టిస్తారా!! చూస్తా అది ఎంత వరకూ నిలుస్తుందో, కట్టించిన ప్రభుత్వమే దిగి వచ్చి తమ తప్పు ఒప్పుకుని ఆ విగ్రహం తీసేటంత వరకూ పోరాడుతాను.


భళా !! ఏమి ఈ వైపరీత్యం .. ఎందుకీ పక్షపాతం.. నాకు తెలిసి నన్నయ్య వీళ్ళందరికీ లంచం ఇచ్చుంటాడు. కమాన్ నన్నయ్య.. కమాన్ .. ఏదీ నాకు లంచం ఇచ్చి చూడు. నిన్ను తీసుకెళ్ళి బొక్కలో పెట్టిస్తా.. అలాగే ఒరేయ్ తొక్కలో తెలుగోళ్ళలారా .. సభా ముఖంగా మీ అందరికీ ఇదిగో ఇదే నా హెచ్చరిక.. మర్యాదగా అందరూ కలసి ముక్త ఖంఠంతో నా మాటని ఒప్పుకున్నారా, సరి, పోనీలే యదవలు తెలియక తప్పు చేసారని క్షమించి ఒదిలేస్తాను. కాదని మొండికేశారా.. అంతే మరి .. ఇకపై మాటలుండవు.. ఓన్లీ చేతలే..


ఏమిటిది వీడికేమైందనుకుంటున్నారా !! ఏమీ కాలేదు .. నా ఈ పుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇవిగో వాటిల్లో మచ్చుకు కొని..


మొదటిది ) కాళ్ళకూరు నారాయణరావు గారన్న్ట్లట్లు పూజ్య పాదుడనే తెలుగు కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడంట. ఎప్పుడనుకుంటున్నారు క్రీ.పూ. 28వ సంవత్సరంలో అనుకుంటా. అందుమూలంగా నన్నయ్య కన్నా దాదాపు 1000 సంవత్సరాలకు ముందే ఈయన గురించి జనాలకు తెలుసు, ఆఫ్ కోర్స్ ఈయన కన్నడంలో రచించాడు అనేది ఓ నిజం అనుకోండి, అన్నంత మాత్రాన తెలుగులో రచించ లేదంటారా!!


రెండవది ) అంతెందుకండి, మాకు విధ్యా భుద్దులు చెప్పిన గురువులే చెప్పారు, గాధా సప్తశతి అనేదేదో కావ్యం ఉందంట. దానిని రచించిన వారిలో తెలుగోళ్ళు ఉన్నారంట. మరి ఆ తెలుగోళ్ళు ఈ కావ్యం కాకుండా ఏమీ పీకలేదా!! (అన్నమయ్య సినిమాలో తనికెళ్ళ భరణి అన్నమయ్యకు చెప్పిన డైలాగ్ .. "రాజుగారిమీద కవిత్వం చెప్పవయ్యా అంటే.. చక్కగా, నువ్వది పీకావో, నువ్విది పీకావో .." అన్న వైనంలో ఈ డైలాగ్) ఏదో ఒకటి పీకే ఉంటారు .. మరి అలాంటప్పుడు మన నన్నయ్యను ఆది కవి అని ఎలా అన గలుగుతున్నారు !! కమాన్ .. ఐఆమ్ హర్ట్.. ఐ వాన్ట్ టి స్పీక్ టు పెద్దారెడ్డి నౌ


మూడవది ) తెలుగు కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లుకు ధీటుగా కన్నడ భాషకూ మరో కవిత్రయం ఉంది. గౌరవనీయులైన నాగయ్య గారు ప్రస్తావించినట్లుగా, కన్నడ కవిత్రయం (పంపడు, రన్నడు, పొన్నడు) లోని పద్మ కవి (క్రీ.శ.950 నాటి సర్వ దేవుడు) తెలుగు దేశంలోనే పుట్టినా కన్నడ రచనలు చేసినారని , మొదట్లో వారు తెలుగు రచనలు చేసి ఉంటారని, కొందరు పండితుల అభిప్రాయం. మరి అట్లాంటప్పుడు మన పంపడు కూడా తెలుగోడేగా .. ఏంది కాదంటారా.. మరి ఈయన ఏమీ ఈ(పీ)కలేదంటారా!!


ఇవ్వన్నీ మనకొద్దు భాయ్ .. ఇప్పుడు సచ్చిన ఈళ్ళందర్నీ ఈడకు రప్పియాలే.. మన ప్రభుత్వ నిరంశ ధోరణి పై కోర్ట్ల కేసేయ్యాలా !! అప్పుడు గాని నాకు నిద్ర రాదు !!


చదివే మీరే ఏమంటారు?

ఈ పుట చదివిన తరువాత మీ అభిప్రాయాన్ని నిస్కర్షగా తెలియ జేయగలరు ..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

12, జూన్ 2009, శుక్రవారం

నేను తప్పు చేస్తా..

ఇవాళ్ళ ఉదయం ఆఫీస్ యాహోలో లాగిన్ అవ్వగానే నా కళ్ళను ఓ వార్త కట్టేసింది. యాహో మెసెంజర్ లో లాగిన్ అవ్వగానే యాహో వారి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దానిలో Top Stories అనేది ఎప్పుడూ హైలైట్ అయ్యి ఓ మూడు లింకులు లేటెస్ట్ వార్తలను చూపిస్తుంటాయి. అలాంటివి నేను జనరల్ గా పట్టించు కోను. కాని ఇవ్వాళ్ళ నా దృష్టికి మైక్రోసాఫ్ట్ వాళ్ళపై అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రం వేసిన కోర్ట్ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోయి ఓ వంద మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది అన్న వార్త నన్ను ఆ లింకుని క్లిక్ చేసేటట్టు చేసింది. స్వతహాగా మైక్రోసాఫ్ట్ అంటే ప్రేమ, అభిమానం, గౌరవం, తొక్క, తోటకూర, గోంగూర, బెండకాయ, దొండకాయ, కాకరకాయ, వగైరా వగైరా మెండుగా ఉన్నవాడినేమో, కించిత్ ఆశక్తితో ఆ వార్తను మొత్తం చదివాను.

ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటున్నారా.. అస్సలు కధ ఇది కాదు. ఇదిగో ఆ కధంతా చదివిన తరువాత ఆఖరున మరో లింకు నాకళ్ళను ఆకట్టుకుంది. ఆ ఆకట్టుకోవడం వెనకాల ఆశక్తి లేక పోయినా ఇంకేదో తెలియని భావన ఆ వార్తని చదివేటట్టు చేసింది. ఇంతకీఆ  విషయం ఏమిటంటే..

సన్ని ఖన్నా అనే ఓ పత్రికా విలేఖరి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునే ముందు ఓ చిన్న ఉత్తరం వ్రాసి మరీ పోయాడు. అందులో తనను ఓ లోకల్ MLA వేధిస్తున్నాడని అందువల్లనే తాను ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నానని వ్రాసి ఉన్నందువల్ల పోలీసులు సదురు MLAపై కేసు నమోదు చేసారు అన్నది ఆ వార్త సారాంశం. మొన్నామధ్య సుప్రీం కోర్ట్ ఇలాంటి ఆత్మహత్యా లేఖలు చెల్లవని.. ఇక ముందు ఇలాంటివి ఎన్కరేజ్, అంటే ప్రోత్సాహించకుండా ఉండే విధంగా ఓ శాసనాన్ని జారీ చేసిందని చదివిన తరువాత ఏ విధంగా పోలీసోళ్ళు మన MLA మహాసయుడిని బొక్కలొ వేసారా అన్న కుతూహలంతో చదవడం జరిగింది. ఈ కధ ఈ విధంగానే సాగితే నేను ఈ పుటని ప్రచురించక పోదునేమో!!! కానీ అసలు విషయమేమిటంటే.. చచ్చేటోడు ఎలాగో చచ్చాడు, వాడి గురించి వార్త వ్రాయనక్కర్లేదు. కానీ హింసా మార్గాన పోతున్న రాజకీయ నాయకుడు ఊచలు లెక్క పెట్టేటట్టు జరిగింది అన్నందువల్ల వార్తగా వ్రాయడంలో తప్పులేదు.

కానీ చచ్చినోడు ఏమి తిని చచ్చాడు అన్న విషయాన్ని కూడ ప్రచురించి, ఫలానాది తింటే నువ్వు పోతావ్ అన్న విషయాన్ని చెప్పకుండానే చెబుతున్నారు. ఇదిగో ఇక్కడ నాకు కాలింది. బర్నాల్ రాసుకున్నా ఆ మంట వేడి ఉపశమనాన్ని ఇవ్వలేదు. ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచితే బాగుంటుంది అంతే కానీ ఇలా పది మందికీ తెలిసే విధంగా ప్రచురించడం ఎంత వరకూ సబబు. అందునా యాహో లాంటి ఎక్కువ ప్రాచుర్యం ఉన్న వెబ్ సైట్లలో ఇలా ప్రచురించడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాట్లిల్ని వ్రాసే వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచరో అర్దం కాదు. ఇది చదివి మఱొకరు ఆ మందు కొని ప్రయత్నించరని నమ్మకమేమిటి?

ఇలాంటి వాటిల్ని మనం ఏవిధంగా తొలగించేటట్లు చెయ్యవచ్చు?? నేను సదురు వెబ్ మాస్టర్ కి లేఖ వ్రాసాను. మీరు గూడా వీలైతే తొలగించ మని లేఖ వ్రాయ మనవి. ఏమంటారు?

9, మే 2009, శనివారం

పండంటి బ్లాగింగ్ కి పది సూత్రాలు : నా రికమెండేషన్స్

క్రిందటి పుటలో ఉపోధ్ఘాతం చదివి ఉంటారని తలుస్తాను. లేకపోతే ఓ లుక్కేసుకోండి. ఇక అసలు కధలోకి వద్దాం. ఇక్కడ నేను చెప్పే లేదా ప్రస్తావించే విషయాలు ఆరోగ్య కరమైన మరియూ వివ్వాదస్పద రహితమైన బ్లాగింగ్ కోసం అని మాత్రమె. అందువల్ల నేనెవర్రినీ ఉద్దేశించి వ్రాస్తున్నానని తలంప వలదు.

క్రిందటి పుటలో శరత్ గారు స్పందించినట్లు పది సూత్రాలే ఉండాలా!!! ఏం 12 ఎందుకు ఉండకూడదు!! అస్సలు ఇన్నే ఉండాలి అని ఎవ్వరు చెప్పారు..?? నేనేమన్నాపెద్ద పుడింగా!! నిన్నో మొన్నో వచ్చా.. త్రిప్పి త్రిప్పి తిరగేసి చూస్తే ఓ వంద పుటలు వ్రాసాడో లేదో  ఇంతలో ఏవో ఙ్ఞాన భోధలా…ఆ!! అనుకుంటున్నారా.. ఏదైనా మొదలు పెట్టే మ్రుందుగా అందరూ అర్దం చేసుకోవాల్సిన విషయమేమిటంటే … ఆంగ్లంలో చెప్పినట్లుగా .. Birds of same feather walk together.. అట్లా మన ఆలోచనలకి దగ్గరి దగ్గరగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ మన వాళ్ళే అంటూ, అనుకుంటూ మనకు తెలియకుండానే గుంపులు కట్టేసుకుంటాం. అట్లా.. గ్రూప్ లు తెలియకుండానే ఏర్పడి పోతూ ఉంటాయి. నా ప్రమేయం లేకుండా నేను ఏదో ఒక గుంపులో సభ్యుడనవుతాను.

తెలుగు మైక్రో బ్లాగింగ్ సౌకర్యమైన కువకువలులో మొన్నామధ్య చెప్పినట్లుగా..

<<మనం ఎదైనా choice చేసుకున్నాం అనుకోండి, మనతో ప్రమేయం లేకుండా మన mind ఆ choice ని సమర్దించే ప్రయత్నంలో సకల మార్గాలను కనుగొంటుంది>>..

మనల్ని మనం సమర్ధించుకుంటూ మన గుంపులో గుర్తింపు కోసం కాక పోయినా మన ఆలోచన <<ఆదిపత్య>> పోరు చేయ ప్రారంభిస్తాము. ఇలాంటి స్వాభావం మంచిదా చెడ్డదా అని నేను తర్కించను.  కానీ వివాదాలకు దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో బ్లాగింగ్ చెయ్యాలనుకునే వాళ్ళకి కొన్ని సూచనలు ఇద్దాం అని నేను చేసే ఈ ప్రయత్నంలో ఏవైనా అపసృతులు దొర్లితే మీ అనుభవంతో మీరు నేర్చుకున్న గుణ పాఠాలను మాతో పంచుకోండి. నా సలహాలు సూచనలు ఆలోచనలు ఇలా ఉన్నాయి ..

౧) ఏంత కాదు ముఖ్యం కానీ ఏమిటి అన్నది

ఎంత వ్రాసాము అనేది ముఖ్యం కాదు .. కానీ ఏమి వ్రాసాము అనేదు ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. ఆంగ్లంలో చెప్పాలంటే, Quantity కాదు ముఖ్యం కానీ Quality ముఖ్యం. చెత్త వ్రాతలు పుంఖాలు పుంఖాలు గా ఎంత వ్రాసినా అది ఎవ్వరికీ లాభం లేదు, ఏదో లెక్కకు ఇన్ని వ్రాసాను అన్న ఆత్మ తృప్తి తప్ప. కాబట్టి ఏదైనా ప్రచురించేటప్పుడు దానిలో ఎంత Quality ఉన్నదో అని ఆత్మ విమర్శ చేసుకోండి .. << ఇంత సుత్తి అవసరమా..??>>

౨) ఆద్యంతం ఒక్కటే ఆలోచనగా ..

ప్రచురించే పుట ఆది నుంచి అంతం వరకూ ఒక్కటే ఆలోచనగా సాగించండి. బండి గాడి తప్పి ప్రక్క దారులు త్రొక్కకుండా చూసుకోండి. ఆంగ్లంలో చెప్పాలంటే, stay on topic every time and all times

౩) ఆస్వాదించండి .. ఆనందించండి..

మీరు వ్రాసే ప్రతీ పుటని మ్రుందుగా మీరు ఆశ్వాదించండి. హాయిగా నవ్వుకునే విధంగా ఉందని మీకు అనిపిస్తేనే ప్రచురించండి. అంతే కానీ నవ్వులుపాలుకాకండి. మీ పుట ద్వారా హాస్యం జనించక పోయినా పరవాలేదు కానీ అపహాస్యం ఉత్పన్నం అవ్వకుండా జాగ్రత్త పడండి

౪) చర్య – ప్రతి చర్య(గా బ్లాగకండి) లకు దూరంగా ఉండండి

అంటే, ఎవ్వరైనా సహ బ్లాగర్లు ఏదైనా పుట ప్రచురించారనుకోండి, ఆ విషయంపై మీస్పందనలను వారి పుటలో తెలియ జేయండి. అవి అక్కడ ప్రచురణకు నోచుకోలేదనుకోండి, ఆ చర్యకు ప్రతి చర్యగా మీ బ్లాగులో మరొ పుటను ప్రచురించారనుకోండి అది ప్రశ్చన్న యుధ్ధానికి  దారి తీస్తుంది. ఇలా మీ బ్లాగుని వివరణ(ల) పూటల పరంపరలతో నింపేయ్యకండి. మీరెవ్వరికీ జవాబుదారులు కాదు. మీకు మీరే రాజూ మంత్రి. మీ బ్లాగే మీ రాజ్యం. అది శత్రు దుర్భేధ్యం. ఆంగ్లంలో చెప్పాలంటే Reactive గా ఉండకండి, ProActive గా ఉండండి. ఈ విషయాం మీద పుంఖాను పుంఖాలుగా వ్రాయవచ్చు కానీ ఇక్కడ ముగిస్తాను. ఇంకా వివరంగా చర్చించాలంటే మనం మనం విడిగా వేరే ఎక్కడైనా ..

౫) ఆఖరుగా.. వివాదభరితమైన ప్రచురణలకు దూరంగా ఉండండి..

అంటే, అలాంటి ప్రచురణలు చెయ్య వద్దు అనికాదు, కానీ ప్రచురించేటప్పుడు కొంచం ధైర్యాన్ని కూడ దీసుకుని ప్రచురించండి. అందరూ ఒకేలాగా ఉండరు అలాగే ఒకె లాగా ఆలోచించరు, అందుకని మన మనః శాంతిని కొల్లగొట్టే వారు చేసే సకల ప్రయత్నాలను గంగ పాలు చేసేయ్యండి. అంతే కానీ మీ ప్రపంచాన్ని దూరం చేసుకోకండి.

ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ముగిస్తాను. మీ స్పందనలకై ఎదుఱు చూస్తూంటాను

19, ఏప్రిల్ 2009, ఆదివారం

పండంటి బ్లాగింగ్ కి పది సూత్రాలు : ఉపోద్ఘాతం

ఈ మధ్య తెలుగు బ్లాగులలో జరుగుతున్న (అనే కన్నా..) బ్లాగుతున్న క్రమం చూసిన తరువాత, అందరికీ ఇవే నా వినపాలు. అరోగ్యకరమైన వాతావరణం లోంచి వచ్చిన నాకు ఈ మద్య స్వదేశీయులే ముష్కరుల ముసుగులో చేస్తున్న దాడులను తలపే విధంగా.. కొంత మంది మనలో వాళ్ళే ముసుగులు వేసుకుని మారు పేర్లతో ఇతరులము అనేటట్లు ఫీలింగ్ ఇచ్చి ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుంటే.. అదిగో వాళ్ళు మమ్మల్నే అంటున్నారు అని తలచి తలచి గోకి గోకి గోరంతలును కొండంతలుగా చేసి చూసి భాధ పడేవారికి ఇది ఒక సున్నితమైన మొట్టికాయ. అదేదో పాత సామెత చెప్పినట్లు.. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.. ప్రక్కలో బల్లెంలా మన మధ్యనే మెసుగుతూ దేశానికె వెన్నుపోటు పొడిచే దేశద్రోహిలా మనకీ వెన్నుపోటు పొడిచే పిరికి పందలను ఎదుర్కోవాలనుకునే వారికి ఇది ఒక హితవు.

 

ఏదైనా వ్రాసే మ్రుందు నాలో కొంత అలజడి రేగుతుంది.  దానిని అంతర్మధనం అని మనం అనుకోవచ్చు. అలాంటి అంతర్మధనం లోని కొన్ని ముఖ్యాంశాలు..

  1. అసలు మనం ఎందుకు బ్లాగాలి?
  2. ఎవ్వరి కోసం బ్లాగాలి?
  3. ఏ విషయాన్ని బ్లాగాలి?
  4. బ్లాగడం ద్వారా మనం ఆసించేది ఏమిటి?
  5. ఏదైనా ప్రచురించినప్పుడు వచ్చే స్పందనలను ఏవిధంగా ఎదుర్కొనాలి?
  6. స్పందనకు ప్రతి స్పందన ఎలా ఉండాలి?
  7. స్పందించే వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి?
  8. ..
  9. ..

ఇలా పలు పలు ప్రశ్నల నా బుఱని తొలచి తొలచి మేఘ మధనంలా మరో పాల సంద్రం మధనం చేసినట్లుగా చిలికి చిలికి తీసిన కొన్ని సూత్రాలు మీతో పంచుకునే ముందు..

క్లుప్తంగానో .. కూలంకుషంగానో.. విడివిడిగానో.. వివరంగానో.. సంష్కిప్తం గానో .. సశేషంగానో .. ఏదో విధంగా ఈ పుట చదివే చదువరులు ఏమనుకుంటున్నారో తెలుసు కోవాలనుకుంటున్నాను.

నువ్వేదో పెద్ద పొడిచేస్తావని మేమొస్తే, మమ్మల్ని ఇలా ప్రశ్నించడం అసందర్బం .. అఘాతుకం.. అహేతుకం.. అంటూ చిందులెయ్యకండి. నేను చెప్పాలనుకున్నది ఎలాగో చెప్పక మానను. నేను చెప్పాలనుకున్న పుట ఇప్పుడు చక్కగా అంగరంగ వైభవాలతో అని అనను కానీ చక్కగా రూపుదిద్దుకుని మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉంది.

అది మిమ్ములను అలరించే ముందుగా మీ అలోచనలలో ఏముందో చెబుతారేమో అని ముందుగా మీ అభిప్రాయ సేకరణ అన్నమాట.

ఏమంటారు!!??

25, మార్చి 2009, బుధవారం

ఒక్క మగాడు – ఈడికి ఈడే సాచ్చి : – An introspect

క్రిందటి పుట లో చెప్పినట్లుగా నేను సదురు మగాడి గారిని యాదృశ్చికంగా కలవడం జరిగింది. అలా వారితో కలిసి ఛాయ్ త్రాగే అవకాశం వీరు నాకు కలిగించారు. ఇక అసలు విషయం లోకి వద్దాం. సీన్లో నేను సదురు మగాడు ఎట్ ఛాయ్ సెంటర్..

మగాడు : ఏయ్ చిచ్చా!! దో ఛాయ్, చార్ సమోసా ఔర్ ఆఠ్ బిస్కూట్  లావ్ రే.. బిస్కూట్ పెహలా.. అదిసరే గానీ అడకటం మరిచినా .. నువ్వు ఛాయ్ తాగుతావు గందా!!??

నేను : ఆర్రేరే.. చాయ్ దేముంది.. త్రాగుతా..

మగాడు : గది సరేగానీ.. ఏందీ ఈ మధ్య అమ్మాయిల గురుంచి .. ఏదేదో కూస్తున్నావంట

నేను : అవునండి.. మహిళాల్లో.. (మధ్యలో దూరుకుని..)

మగాడు : నువ్వెవ్వరి గురించి రాస్తే నాకేంటి గానీ..

నేను : దాని వలన మీ అక్క గానీ చెల్లి గానీ భాధ పడ్డారా!!

మగాడు :  హా!! హా!! మనకు చెల్లి గిల్లి .. గసుంటోళ్ళు ఎవ్వరు లేర్.. పురిట్లోనే పిల్ల పుడతాందని తెలిసి మా అయ్య అప్పుడే తీసించేసిండు. మనం బిందాజ్.. దోస్తానలతో మంచిగా ఎంజాయ్ చెయ్యటమే..

నేను : నిజమా!! (ఆశ్చర్యపోవడం నా వంతైంది)

మగాడు : గది సరేగానీ.. ఏందీ గెప్పుడు చూసినా అమ్మాయిల గురించి పీకుడేనా.. మన మొగోళ్ళ గురించి కొంచం కూడా కూసుడు లేదా..

నేను : సరైన మగాడు దొరకలేదండి. దొరకగానే ఆ పనిమీదే ఉంటాను..

మగాడు : ఆడెవడో దొరకడం లేదే అని ముడుసుకుని కూచ్చోకపోతే.. నేను లే.. నన్ను సేసుకో..

నేను : ఏంటి చేసుకునేది?

మగాడు : గదే బై.. తుంటర్వూ..

నేను : ఓ.. అలా వచ్చారా.. సరే.. మీతోనే మొదలు పెడతాను

మగాడు : గది గిప్పుడు నచ్చినావ్ నాకు .. మర్ద్ హోతో మేరే జైసా..

..

ఇంతలో సమోసా వచ్చింది.. అవి తింటూ, నేను నా పనిలో పడ్డాను..

..

నేను : మరి ఇక అసలు విషయానికి వద్దాం. మీరు నా ఇండాలు గురించి చదివారా!!

మగాడు : లేదు బై.. గానీ, మనకున్న కొద్ది మంది దోస్తానాలోని ఓ పోరి సదివిందంట.. తెగ నవ్వుకుని, నీ గురించి సెబుతాంటే ఇని, నీకు సానా కిలాసు పీకాలని గిట్లొచ్చినా..

నేను : నాకా !! క్లాసా!! ఎందుకంటారు??

మగాడు : బై.. నీకు తెల్వదనుకుంటా.. అమ్మాయిలు చానా మంచోళ్ళు. ఆళంత మెత్తని మనసున్న మనుషులు నీకెక్కడ కనబడరు. నువ్వన్నట్లు ఆళ్ళని పడేయ్యాలంటే ఆళ్ళు చేశే ఏషాలు కాదు, మనం మగాళ్ళు చేసే పనులే..

నేను : అంటే.. నాకు అర్దం కాలేదు.. అబ్బాయిలు వాళ్ళ వెంట పడేది వాళ్ళ ఎక్స్ ‍పోజింగ్ వల్ల కాదంటారా..

మగాడు : ఖచ్చితంగా.. ఆళ్ళు ఒక్కడితో డిసైడ్ అయ్యారంటే, ఎంత మంది ఆళ్ళ చుట్టూ తిరిగినా ఏదో టైమ్ పాస్ అనుకుంటారే తప్పితే.. మిగిలిన ఇషియాలలో సానా స్టిట్టు. గానీ మనదేముంది, ఇప్పుడు ఇది.. కాసేపైన తరువాత మరొక్కత్తి.. ఆ తరువాత ఇకొక్కతి. ఇలా ఎంత మంది కావాలంటే అంత మంది .. మనల్ని ఆడిగేదెవరు చెప్పు..

నేను : అంటే అర్దం కాలేదు .. కొంచం వివరంగా చెబుతారా..

మగాడు : అలా అడిగావ్ బాగుంది. సరిత్రలో ఒక్క ఆడదానికి మాత్రమే కట్టుబడ్డ మగాడికి పట్టిన గతి ఏంటో తెలుసునా..

నేను : లేదండి..

మగాడు : పోని అట్లాంటి మగాళ్ళు ఎవ్వరో చెప్పగలవా..

నేను : అంటే.. పురాణాలలో ఒక శ్రీరాముడు.. చరిత్రలో ఒక్కరేమిటి చాలా మంది ఉన్నారు..

మగాడు : ఈళ్ళందరూ అస్సలు నిజంగా ఉన్నారో లేదో తెల్వదు గానీ.. నాకు తెలిసినంత వరకూ ఓ మజ్నూను చూడు.. అలాగే ఓ దేవదాసుని చూడు.. ఇలాంటి వాళ్ళ గతి ఏమైంది? పోరీలేమో మాంచిగా పెళ్లిళ్ళు సేసుకుని కాపురాలు సాగించటంలే.. గానీ ఆళ్ళు పెళ్ళిళ్ళు సేసుకున్న తరువాత గీ పోరగాళ్ళని పిలిసి మంచిగా రెండు ముక్కలు సెప్పి.. అరే బై ఇకమీద నువ్వు నేను దోస్తానా చేద్దాం అంటే.. ఇనక రోడ్డెక్కి గోల సేసేది ఎవ్వరు?  

నేను : ఆ!!! (ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందా..)

..

ఇంతలో ఛాయ్ వచ్చింది.. ఒక్కో బెస్కెట్ వేడి వేడి ఛాయ్ లో ముంచుకుని తాగుతుంటే.. ఆహా.. అనిపించింది.. ఇంత కాలం ఈ రుచిని ఎలా మిస్ అయ్యానా అనిపించింది..

..

మగాడు : పాపం.. ఆళ్లు ఏ పరిస్తితులలో అట్లా సేసిండ్రో అని ఎవ్వుడైనా ఆలోసిస్తుండ్రా.. గంతెందుకు బై.. మాగాడైతే ఎంత మంది పెళ్ళాలనైనా ఉంచుకోవచ్చా.. కానీ ఆడది మాత్రం ఒక్కడికే పరిమితం అవ్వాలా.. ఇలా సెప్పింది ఎవ్వర్? మనం మగాళ్ళం కాదా.. పాపం ఆళ్ళు కూడ పానీపురి కట్లెట్ తింటాండారు కదా..

నేను : పానీపురి కట్లెట్ !!! ???

మగాడు : అదే.. ఉప్పు కారం అని నా ఉద్దేశ్యం. ఆళ్ళకీ కొద్దో గొప్పో కోర్కెలు ఉంటాయి గందా.. మరి ఆటిల్ని గురించి ఎవ్వుడైనా పట్టించుకుంటుండా.. లేదే..

నేను : అవుననుకోడ్రి.. ఛా.. ఏందిది.. నేనుకూడా మీలాగే మాట్లాడుతున్నాను..

మగాడు : హా.. హా..

నేను : అంటే తప్పంతా మగాళ్ళదే అంటారా..

మగాడు : గిక్కడ తప్పొప్పులగురించి మనకు అనవసరం బై.. నేను సెప్పొచ్చేది ఏంటంటే.. అమ్మాయిలు సానా మంచోళ్ళు ఆళ్ళ గురించి తప్పుగా రాయ మాక. ఆళ్ళంత అమాయకమైనోళ్ళు మనకు దొరకరు. అమ్మాయిల బాచ్ అంతా అంతే.. శివయ్యని అంటారే.. అదేందది..

నేను : భోళా శంకరుడు అని..

మగాడు : అదే.. అచ్చంగా ఈళ్ళు అంతే.. వఠ్టి భోళ్ళా మనుషులు.. ఈళ్ళ గురించి నీకు తెల్వదు బై.. నువ్వెప్పుడైనా ఏదైనా పోరిని పటాయించి నావా..

నేను : అబ్బే లేదండి..

మగాడు : ఒక వేళ్ళ పటాయించి నావనుకో.. ఎలా పటాయిస్తావ్..

నేను : నేనెప్పుడూ పటాయించలేదే..

మగాడు : ఓ చిట్కా సెబుతా ఇనుకో.. ఆళ్ళని పొగుడుతూ ఓ నాలుగు లైన్ల కవిత్వం రాయి అంతే.. పోరి ఖలాస్.. ఖుష్ అయ్యి నీ ఒల్లో వాలిపోద్ది

నేను : నాకా .. కవిత్వమా.. రాదే..

మగాడు : వచ్చేదేముంది.. అదేదో సినిమాలో నాగార్జున కస్టాలు పడతాడే.. రాజు గారిని నువ్వది పీకావో.. నువ్విది పీకావో అని కవిత్వం సెప్పలేదని.. ఆలెక్కలో నువ్వు కూడా ప్రయత్నం సెయ్యి..

నేను : అంటే కవిత్వం లో కూడా పీకడం చెయ్యాలా..

మగాడు : ఓ పది పదాలు సెబుతా ఇనుకో.. అందం సెంద్రుడు.. కోపం సూరీడు.. నవ్వు ఎన్నెల.. దూరం ఇరహం.. పువ్వులు సరసం.. ఇలాంటి వాటిల్ని వాడేస్తూ ఎదో ఒకట్ రాసేయ్.. గంతే నిన్ను గుడ్డిగా నమ్మేస్తది.. అంతే.. నీ పని గట్లా ముగించుకో ఆ తరువాత పిలేటు పిరాయించేయ్..

నేను : పాపం కదండీ..

మగాడు : కొంత కాలం ఏడుస్తారు.. ఆ తరువాత కాలం మనల్ని మర్చి పోయేట్టట్టు సేస్తాది. ఆళ్ళకు బొత్తిగా లోకం తెల్వదు బై.. ఎవ్వురైనా గింత మంచిగా మాటాడారో గంతే.. ఆళ్ళు మనోళ్ళనుకుంటార్.. ఎవ్వుడు మంఛోడో.. ఎవ్వడు దొంగ నాయాలో ఈళ్ళకి తెల్వదు. అంతెందుకు బీహార్ లో మొన్నామధ్య చదువులు సెప్పే ప్రొఫెసరు సారు లేడు .. గదే బై.. మతుక్ నాద్ చౌదరి.. గాడు సూడు.. మంచిగా పెళ్ళి సేసుకుండు.. ఇద్దరు పిల్లల్ని కనిండు.. సాలేగాడు .. గీ వయసులో మరో పోరిని పటాయించినాడు. మరి ఆ పిల్ల తెలిసి తెలిసి గీ ముసలోడ్ని ఎలా సేసుకుందంటావ్? అన్నీ మాయ మాటలు బై..

నేను : అవుననుకోండి..

మగాడు : అనుకో.. గినికో .. అది తీసి పక్కల బెట్టు.. గీరోజుల్లో పెళ్ళైన ఆడోల్లు ఎంత మంది ఉద్యోగాలు గట్రా సేత్తాండ్రు.. గాళ్ళు మాత్రం పొద్దుగాల్నే లేవాల్నా.. మొగుడుకి నాస్తా సేసి పెట్టాల్నా.. ఉన్నదేదో కూతంత తినేసి పొలో మంటూ ఉద్యోగానికి పోవాలా .. మళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత.. ఇంటెడు చాకిరీ చెయ్యాల్నా వద్దా.. పోనీలే చేదోడుగా ఉంటాదని పని పిల్లని పెట్టుకుందనుకో మన మగాళ్లం ఎట్టా రియాక్ట్ అవుతాం..

నేను : ..

మగాడు : బోడి అఫీస్ లో పొడిచేసిందేంటంట.. ఇంట్లో పనిపిల్లని పెట్టుకున్నావ్.. దానికి జీతం దండగ..

నేను : ..

మగాడు : అదంతా వద్దు బై.. ఏనాడైనా మన మగాళ్ళు.. నాజీతం ఇంత.. నేను ఈ జీతంతో ఫలానా ఫలానా పనులు చేస్తున్నా అని పెళ్ళాలకి సెబుతారా.. పైగా .. సంపాదీంచే పెళ్ళాం ఉంటే.. దాని జీతం కూడా నాకే కావాలంటాడు..

నేను : ..

మగాడు : ఉల్టా.. ఏదైనా కొనుక్కోవాలంటే పర్మీషన్ లేందే ఊరుకోమాయే.. మరి ఇంతగా ఇంసిత్తున్నమే.. ఏనాడైనా .. ఒరేయ్ నాయాల్ది.. అని మనల్ని తిట్టిండ్రా.. లేదే.. ఆడెవడో సెప్పినాట్లు.. ఆడది అమ్మోరు ఆవు అన్నీ ఒకే రకానికి సెందినోళ్ళు.. గడ్డి లాంటి పనికి రాని వాటిల్ని కూడా తిని పాలల్లాంటి పనికొచ్చే పౌష్టికరమైన వి మనకు ఇస్తారు.. కాస్తంత తెలుసుకో..

నేను : అవునండి..

మగాడు : గది సరే గానీ .. గీ విషయాలన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కి గిట్టా తెలియజేయ మాక.. నా పని కొల్లేరౌతాది..

నేను : అలాగే

మగాడు : మరి నేను ఉంటాను.. నా నాలుగో పోరిని కలిసే వేళ్ళైంది..

నేను : నాలుగో పోరి అంటున్నారు.. ఎంత మంది ఉన్నారే..

మగాడు : దాదాపు ఓ డజన్ టచ్ లో ఉన్నారు.. ముగ్గురితో టిపినీలు అయ్యాయి.. ఓ పోరి దాదాపు లంచ్ కి రెడీ.. ఇక టైమ్ అండ్ ప్లేస్ కోసం సూత్తున్నా..

నేను : ఇంత మందిని ఎలా ..

మగాడు : ఏముంది.. ఇందాక సెప్పినట్లు .. ఏ పోరి దగ్గరకు పోయినా ఒక్కాటే మాట.. నువ్వొక్కత్తివే నా లైఫ్ లో .. అంతే గదే నిజమ్ అనుకుంటారు .. మనకి మాత్రం పని గడవాల్న .. సరేగానీ ఇక ఉంటా, అవతల్న నా కోసం అక్కడ పోరి వెయిటింగ్.. ఒరే చిచ్చా.. సార్ దగ్గర పైసల్ తీసుకొ భే..

నేను : హా!!!!


ఈ పుట ఏదో హాస్యాస్పదంగా ఉంటుందని మాత్రమే మొదలు పెట్టాను.. అంతే గానీ ఎవ్వరినీ ఉద్దేశ్సించి కాదని నా మనవి

23, మార్చి 2009, సోమవారం

ఒక్క మగాడు – ఈడికి ఈడే సాచ్చి : An introduction

మొన్నా మధ్య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సదురు మహిళను తుంటర్వూ చేసిన తరువాత పెట్టిన ఇండాలు, అలా చాలా కాలంగా మాఇంట్లోనే ఉంటే, ఏమీ తోచక వాటిల్ని దగ్గరలో ఉన్న కాలువలో కలపడానికి బయలుదేరాను. అదిగో అప్పుడే వచ్చింది తళ్ళుక్కుమని ఓ ఆలోచన.

కాలువ నుంచి తిరిగి వస్తూ ఎలా మొదలు పెడదామా అనుకుంటూ వెళ్ళుతున్నంతలో.. ఓ ద్విచక్ర వాహనం దుమ్ములేపు కుంటూ వచ్చి నా ముందు ఆగింది.

దానిమీద ..

తైల సంస్కారం లేని చింపిరి జుట్టు.. చెవులకు లోలాకులు.. మూతిమీద మీసాలులేవు కాని పెదవి క్రింద ఓ అంగుళం వెడల్పులో గడ్డం.. ముంజేతికి రంగు రంగుల తాళ్ళు.. బ్రొటన వ్రేలికి సత్తు ఉంగరం.. పూలపూల చొక్కా.. బుడబుక్కలోడు వేసుకునేటటు వంటి అతుకుల బొంత లాంటి గోనెపట్టాని తలపించే జీన్సు పాంటు..

అబ్బా!!! ఈ ఆకారానికి వర్ణించడానికి మాటలు చాలటం లేదంటే నమ్మండి. ఇలా ఆలోచనలో తడబడి నిశ్చేష్టుడనై నిల్చొని ఉంటే.. ఆఆకారం నన్ను అడుగుతోంది..

హెల్లో!!! ఇక్కడ భవదీయుడు అని బ్లాగులు గీకుతాడంట ఎరుకనా..

ఈ మాటలకు ఒక్క సారి మూర్చ వచ్చినంత పనైంది. అంతలో తేరుకుని.. హతవిధీ, వీడేమిటి.. ఈ గీకుడేమిటి అని మనసులో అనుకుంటూ..

నేనేనండి.. ఆ భవదీయుడను.. మరి మీరు? అన్నాను

ఆ ఆకారం ఫక్కున నవ్వి..

గదేంది బై.. గాడెవడో బవదీయుడంటే.. ఛే ఫూట్ ఉంటాడు.. గింతింత మీసాలతో, ఫైల్ వాన్ లెక్క ఏ ఎయిట్ పాక్కో టెన్ పాక్క్ లతో తురుప్ ఖాన్ లెక్కన ఉంటాడనుకుంటుంటే.. గిదేంది లొట్టిపిట్ట లెక్కన గింతున్నావు?? పేరేంటన్నావ్?

.. నన్ను .. (ఏదో అనబోతూ ఉంటే.. మధ్యలో కలిపించుకుని.. )

నువెట్టుంటే నాకేంది గానీ.. నేనెవురంటివి గందా.. నన్ను మొగాడంటార్లే.. పద, కనబడతాందే ఆ ఛాయ్ దుకాణంలో కెల్లి కొంచం పిచ్చా పాటి ఏసుకుందారి.

గత్యంతరం లేక.. ఇది కూడా మనకి ఏదో విధంగా పనికివ్స్తుందిలే అనుకుంటూ మగాడు అని పిలిపించు కునే ఆకారం వెనకాలే వెళ్ళాను. అక్కడ జరిగిన సంభాషణను మరో పుటలో వివరంగా.. అంత వరకు మా సంభాషణ ఎలా సాగి ఉంటుందో ఊహించి స్పందించ గలరు

9, మార్చి 2009, సోమవారం

మహిళా దినం - ఇండాలు


ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్బంగా, ఓ వింత పేరడి చేసే ప్రయత్నంలో ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదని గమనించగలరు. ఇది ఒక తుంటర్వూ మాత్రమే అని బ్లాగు పూర్వకంగా తెలియ జేసుకుంటున్నాను.


మహిళా దినోత్సం సందర్బంగా ఓ సాధారణ మహిళని తుంటర్వూ చేస్తే ఎలా ఉంటుందని అనిపించి, ఆంద్ర ప్రదేశ్ లోని ఓ సాధరణ గృహిణిని కలిసాను. ఆవిడతో సాగిన తుంటర్వూ లోని కొన్ని ముఖ్యాంసాలు..

నేను : నమస్కారం.. మహిళ గారూ..

మహిళ : నమస్కారం భవదీయుడు గారూ.. అలా నిలబడ్డారే, కూర్చోండి ఇప్పుడే వస్తాను. లోపల డిక్కు డిక్కు టీవీ వారు నిర్వహిస్తున్న డొక్కు డొక్కు వంట అనే కార్యక్రమం వస్తోంది. అయ్యిన తరువాత వస్తాను

నేను : మరి ఇప్పుడు ..

మహిళ : ఆ అర్దం అయ్యింది, అక్కడ బ్రేక్.. ప్రకటనలు వస్తున్నాయి..

నేను : కాస్త మంచి నీళ్ళు ఇస్తారా!!

మహిళ : ఆ.. తరువాత బ్రేక్‍లో ఇస్తాను (హా!! మూర్ఛ వచ్చినంత పనైంది నాకు..)

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇవిగోండి.. మంచి నీళ్ళు

నేను : మంచిదండి. అదిసరే కానీయండి, ఇవ్వాళ్ళ మహిళా దినోత్సవం కదాండి.. (ఇంకా అనబోయ్యేంతలో..)

మహిళ : అయితే ఏమిటండి.. ఎవ్వరికి కావాలండి ఈ దినాలు?? ఇండాలు??

నేను : ఇండాలా!! అవేంటండి?

మహిళ : తద్దినం నాడు పెట్టేది పిండాలైతే, ఇలాంటి దినాల నాడు పెట్టేది ఇండం

నేను : అర్దం కాలేదండి కొంచం వివరించ గలరా..

మహిళ : అలాగే.. తద్దినం లోంచి ’తద్’ తీశేసారనుకోండి అది దినం అవుతుంది, అలాగే పిండం లోంచి ప తీసేయ్యండి.. అంతే.. అదే ఇండం

నేను : బాగుందండి, ఇక అసలు విషయానికి వద్దాం.

మహిళ : ఆ.. అదిగో బ్రేక్ అయినట్లుంది.. ఇప్పుడే వస్తాను..

నేను : !!!

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : హా.. ఇప్పుడు చెప్పండి..

నేను : మరి ప్రపంచం మొత్తం ఈ రోజున ఏవేవో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా!! మరి మీరు ఈ దినాన్ని ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు?

మహిళ : నాకు తెలియక అడుగుతాను, ఒక్క మాట సూటిగా సమాధానం చెప్పండి.. అస్సలు, స్త్రీలకంటూ ఒక రోజు కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్పండి?

నేను : అది కాదండి!! ఇది ఎప్పటినుంచో వస్తున్న అలవాటు కదా అని, ఏదో అడగ బోయ్యాను..

మహిళ : మహిళలకు ఒక రోజు అంటూ సంవత్సరం మొత్తం కాదని చప్పకనే చెప్పినట్లు చెబుతున్నారే..

నేను : అంటే, మీరు అపార్దం చేసుకుంటున్నారండి..

మహిళ : అపార్దం కాకపోతే మరి ఏమిటిది.. సంవత్సరానికి ఒక్క సారే నిర్వహించే తద్దినంలా, ఈ మహిళా దినం ఏమిటి?

నేను : అది .. సంవత్సరం లో ఒక్కసారే వచ్చే, ఒక పుట్టిన రోజు లాంటిది.. ఓ పెళ్ళి రోజు లాంటిది.. ఇంకా ఇలాంటి వాటిల్లాగానే ఇది కూడా..

మహిళ : మరి ఈ దినాన్ని .. మహిళా రోజు అనవచ్చు కదా..

నేను : అనవచ్చు ..

మహిళ : ఇప్పుడే వస్తా.. అక్కడ ప్రకటనలు అయినట్లున్నాయి

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇందాకేదో చెబుతున్నారు..

నేను : అదండీ.. మీతో వాదిస్తున్నాననుకోకండి.. మీరి అలా ఆలోచించకుండా.. ఆగస్టు 15ని స్వాతంత్ర దినం అని.. అలాగే గణతంత్ర దినం.. ఇలా మరిన్ని ఉన్నాయి కదా.. వాటిల్ని మనం వక్ర దృష్టితో చూడడం దేనికి.. చక్కగా మంచిగా చూడవచ్చుకదా..

మహిళ : నిజమే అనుకోండి. నేను ఇండాక అడిగినట్లు.. ఇలాంటి దినం కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్ప గలరా!!

నేను : లేదండి..

మహిళ : నన్ను చెప్ప మంటారా.. ఇది కూడా మరో మగాడే సృష్టించి ఉండాడని నా గట్టి నమ్మకం

నేను : అయ్యుండ వచ్చు. ఏది ఏమైనా మహిళలకూ ఒక దినాన్ని కేటాయించడం ఎంతైనా మంచిదే కదా. ఈ విధంగా నైనా మహిళలకు ఒకరకమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది.. దాని ఆవశ్యకత ఎంత ఉందో అందరికీ తెలుస్తుంది.. (ఆవేశంగా ఇంకా అనబోయ్యేటంతలో..)

మహిళ : హల్లో భవదీయుడు గారూ.. ఒక్క నిమిషం .. మీరు నేల మీద ఉన్నారు.. ఆ విషయం మర్చి పోకండి. మీరు ఏ స్టేజీ ఎక్కి ప్రసంగం చెయ్యటం లేదు.. కాసిన్ని మంచి నీళ్ళు త్రాగండి

నేను : ..!!

మహిళ : అయినా మాకేం.. తక్కువందనీ మీరు అంత ఇదై పోతున్నారు. చక్కగా తిండి పెట్టడానికి మొగుడున్నాడు, చెత్తో బొత్తో .. మన టీవీలలో సెంటిమెంటు సీరియళ్ళకు కొదవ లేదు. పండగలో పబ్బాలో వచ్చాయంటే .. వచ్చే పోయ్యే చుట్టాలతో బాతాకాణీ కొట్టడానికే సమయం చాలటం లేదు

నేను : మరి ఆర్దిక స్వాతంత్ర్యం కావాలి కదా..

మహిళ : ఎవ్వరికి కావాలి?? మాకా!!! ఎందుకు? మాదగ్గర డబ్బులున్నాయి అనుకోండి, ఉన్నంత లోనే సర్దు కోవాలి. ఆ డబ్బులే లేవనుకోండి, నచ్చింది కొని పెట్ట లేదని కట్టుకున్న వాడిని చక్కగా పలు విధాలుగా రాచి రంపాన పెట్టేయ్యచ్చు. ఒకవేళ అడగంగానే కొని పెట్టారనుకోండి.. ఇంకేం పండగే, అడిగినప్పుడల్లా కొని పెడుతూనే ఉంటాడు అనుకోండి అంతకన్నా కావాల్సిందేముంది?

నేను : మరి మీ వ్యక్తిత్వం..

మహిళ : ఇంకే వ్యక్తిత్వం వికాశం.. అదేదో సామెత చెప్పినట్లు. అబ్బాయి సార్దకుడు అయ్యాడని ఎప్పుడు చెబుతామో చెప్ప గలరా..

నేను : .. అన్ని అవసరాలకు సరిపడేంత సంపాదించే చక్కని ఉద్యోగం ఉండి .. సుగుణవంతుడై..

మహిళ : అంతే కాకుండా.. స్తోమత కలిగిన కుటుంబం నుంచి ఆస్తిపాస్తులు గురించి మర్చి పోకండి..

నేను : హా!!

మహిళ : అలాగే ఓ అమ్మాయి సార్దకురాలు ఎప్పుడవుతుందో తెలుసా..

నేను : .. (ఇంకా ఆశ్చర్యం లోనే..)

మహిళ : పైన చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకున్నప్పుడు. అదే వ్యక్తిత్వం.

నేను : మరి మీకంటూ రుచులు .. అభి రుచులు..

మహిళ : అందుకేగా.. ఈ వంటా వార్పు… చక్కగా మాకు నచ్చినది చేసుకుంటాం.. ఆ రోజు నచ్చలేదనుకోండి.. చక్కగా బయట నుంచి తెప్పించుకుంటాం..

నేను : మరి మీ వారు ఒప్పుకుంటారా..

మహిళ : వారు ఒప్పుకునేది ఏముంది.. నాబొంద!! చేసిన వంటలో కొంచం ఉప్పు ఎక్కువ వేశాం అనుకోండి.. ఉప్పు ఎక్కువైందని ఓ నాలుగు కేకలేసి, వారే తెప్పిస్తారు. మొగుడు అనే మూర్ఖుడు ఉన్నది ఎందుకనుకున్నారు? ఉండండి.. అదిగో ప్రకటనలు అయ్యినట్లున్నాయి.. ఇప్పుడే వస్తాను..

..

.. కొంత సేపయ్యాక ..

నేను : మీరంటే పెళ్ళైన వాళ్ళు.. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ అభిప్రాయం ఏమిటో!!

మహిళ : అవునండీ.. నేనూ చూస్తున్నాను. పాపం.. అవన్నీ స్వయంకృతాపరాధాలు.. ఇలాంటి అత్యాచారాలు చేసే అబ్బాయిలను ఎలా గుర్తించాలి వాళ్ళనుండి ఎలా తప్పించు కోవాలి అనే విషయాలను ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాలి. ఆ పధాంలో ఇవ్వాళ సాక్షి ఆదివారం స్పెషల్ లో మన హైదరాబాద్ అమ్మాయి సానియా మిర్జా ఇంటర్వూని ప్రతీ అమ్మాయి చదవాలి. అందులో ఓ నూతన సంవత్సరం నాడు సానియాకు జరిగిన సంఘటన లో ప్రతీ అమ్మాయికి ఓ మంచి చిట్కా దాగి ఉంది.

నేను : అదేమిటో మీ మాటల్లో చెప్పగలరా..

మహిళ : ముందుగా ప్రతీ అమ్మాయి గుర్తు పెట్టుకోవల్సినది.. అమ్మాయి స్నేహితుల సంఖ్య కన్నా స్నేహితులు అనిపించుకునే అబ్బాయిల సంఖ్యే ఎక్కువ ఉండేటట్లు ఛూసుకోవాలి. చొంగ కార్చుకునే అబ్బాయిలే వాళ్ళ పాలిట వరం .. వారే వీరికి రక్ష. అప్పుడప్పుడు వీళ్ళ కళ్ళకు విందు కలిగించేలా, జెబ్బలు లేని జాకెట్లో లేక టీషర్ట్ ‍లో వేసుకుంటే చాలు.. అలాగే పొట్ట కనిపించే పొట్టి కుర్తాలో.. పిఱలు కనిపించేలా లోహిప్ జీన్సో వేసుకుంటే చాలు.. బెల్లం చుట్టూ ఈగల్లాగ చచ్చినట్లు మనచుట్టూ తిరుగుతూ మన బాడీకి జీతం లేని వాచ్ మెన్స్‍ గా ఉండి పెడతారు.

నేను : మరి పెళ్ళి విషయానికి వస్తే..

మహిళ : దానికి కొత్తగా వచ్చేదేముంది!! ఇందాక చెప్పినట్లు, ఆనీ ఉన్న ఓ బకరా గాడిని మన పెద్దలు ఎలాగో మనకు కట్ట బెడతారుగా.. ఒకవేళ మన పెద్ద వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ చప్పగా ఉన్నాయనుకోండి, మన చిరంజీవి గారి చిన్న కూతురు చేసినట్లు.. ఎవ్వడో ఒకడు గుడ్డిగా ప్రేమ దోమ అనకపోడు.. వాడితో ఎంచక్కా కొన్ని సంవత్సరాలు గడిపేయ్యవచ్చు. ఆ తరువాత నచ్చలేదనుకోండి, పుట్టిల్లు ఎలాగో ఉండనే ఉందిగా.. మన ప్రమోద్ మహాజన్ కొడుకు రాహుల్ మహాజెన్ భార్య స్వేత మనకి ఇలాంటి వాటిల్లో ఆదర్శం

నేను : మరి ఆ తరువాత భవిష్యత్తు??

మహిళ : ఏముంది మన హీరోయిన్ గౌతమీ చేసినట్లు, ఇద్దరు పెళ్ళాలను వదిలెసిన రెండో పెళ్ళి వాడైన కమల్ హాసన్ లాంటి వాడు దొరక్క పోడు.. వాడి వల్ల గౌతమీ ఈ మధ్య తల్లి కాబోతోందని పుకారు.. అలా ఏదో ఒక అక్రమ సంబందం సక్రమం కాకపోదు. ఇలాంటి వాటిల్లో మన రేణుకా దేశాయ్ ని చూడండి. చక్కగా కలసి కాపురం చేసుకుని పిల్లల్ని కని వాళ్ళ పేరు మీద శుభలేఖలు కొట్టించేయ్యచ్చు. ఇంత స్వాతంత్ర్యంగా మేము బ్రతికేస్తుంటే.. మాకేదో పెద్ద నష్టం జరిగి పోతున్నట్లు ఏదేదో వాగేస్తున్నారే..

నేను : అంటే మీ ఉద్దేశ్యంలో మహిళా దినోత్సవం అక్కరలేదంటారా..

మహిళ : వద్దని అనను కానీ మరీ ఒక్కరోజే పెట్టే బదులు సంవత్సరంలో కనీసం ఓ ఆరు నెలలు మాకంటూ కేటాయిస్తే బాగుంటుంది అంటాను..

నేను : ఇచ్చాం.. అనుకోండి.. ఏమి చేస్తారు?

మహిళ : నేను చేసేది ఏముంది.. అస్సలు.. మహిళా దినం అనేది ఒకటి కావాలి అనే మహిళలను అడగండి వాళ్ళు చెబుతారు

నేను : కనుక చదివే చదువరులందరికీ ఒక విన్నపం. మహిళా దినం అనేది ఒకటి కావాలా?? దాని ఆవశ్యకత ఏమిటో? అలాంటి దినం వల్ల మీరు సాధించేది ఏమిటో? అలాంటి రోజుని ఒక పండుగగా ఎందుకు చేసుకోవాలో సదురు మహిళకు తెలియ జేస్తారని మనవి

మహిళ : ఏంటీ మీ బ్లాగుని మహిళలు కూడా చదువుతారా!!

నేను : అవునండి

మహిళ : చూద్దాం!!! మీ మహిళా బ్లాగర్లు ఏమి చెబుతారో..

నేను : అంతైనా.. అదేదో పాటలో చెప్పినట్లుగా.. ఆడాళ్ళూ!!! మీకు జోహార్లు..

మహిళ : ఏయ్!! ఏంటి!! అప్పుడే మమ్మల్ని ఫోటోలో పెట్టి గోడ కెక్కించేస్తున్నారు

నేను : నేనా..

మహిళ : కాదా మరి .. జోహార్లు ఎవ్వరికి చెబుతారు!!


ఈ పుటని హాస్యస్పదంగా తీసుకుంటారని ఆశిస్తాను.

7, మార్చి 2009, శనివారం

మంత్రాలయం : యాత్రా విషేశాలు


మా మంత్రాలయ మొదటి భాగం విషేశాలు చదివారు కదా.. ఇదిగో ఇప్పుడు మరికొన్ని. శనివారం రాత్రి అలా మంత్రాలయం రైల్వే స్టేషన్‍లోని విశ్రాంతి గదిలో (రిటైరింగ్ రూమ్) బస. అక్కడ ఆది వారం తెల్లవారింది. అదిగో అప్పుడు మెల్లగా మగతగా గుర్తుకు వచ్చింది రాత్రి ఎవ్వరో వచ్చారు, ఏదో అడిగారు, దానికి నేను ఉదయం ఏడు గంటలకల్లా తయారయి ఉంటానని చెప్పినట్లు. సరిగ్గా అప్పుడు చేతికి ఉన్న వాచీ చూద్దును కదా తెల్లావారి బారెడు ప్రొద్దెక్కి చక్కగా ఆరు గంటల ఇరవై నిమిషాలైంది. వామ్మో!! రాత్రి వచ్చిన వాళ్ళు ఠంచనుగా ఏడు గంటలకు వచ్చేస్తారు అనుకుంటూ.. గబగబా స్నాన పాన ఇత్యాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఖశ్చితంగా ఏడు గంటలకు సిధ్ధమై బాల్కనీ లోకి వచ్చి నుంచున్నాను. ఏదీ ఎవ్వరూ కనబడరే!!! అనుకుంటూ మెల్లగా క్రిందికి వెళ్ళి ఓ ఛాయ్ కొట్టి వస్తానని శ్రీమతికి చెప్పి బయలు దేరాను. మీకు తెలియని దేముంది, ఆడాళ్ళు తయ్యారవ్వటం అంటే మాటలా!! అధమ పక్షం ఓ గంటకు తక్కువ కాకుండా ఉంటుందా అనుకుంటూ క్రిందకు వెళ్ళి ఓ ఛాయ్ త్రాగి వచ్చాను. అక్కడ కాఫీ అడిగితే, బడ్డీ కొట్టు వాడు కొంచం వింతగా చూశాడు, నేనేదో ఇతర గ్రహం నుంచి వచ్చి అడగ కూడనిది ఏదో అడిగినట్లు కూడనిది అడిగినట్లు. ఇంతలో ట్రంగ్.. ట్రంగ్.. అంటూ నా ఫోన్ మ్రోగింది. ఎవ్వరా!! అనుకుంటూ.. ఆన్సర్ చేసాను. అటు వైపు నుంచి, ’సార్ .. వచ్చేస్తున్నానండి.. సత్యసార్ చెప్పారు’ అంటుంటే, నోట మాట రాక, ’సరే నండి .. ఇక్కడే ఎదురు చూస్తున్నా ..’ అని ఫోన్ పెట్టేశా.

ఇక్కడ మరో విషయం చెప్పాలి, ఇందాక చెప్పినట్లు ఇంతులు తయారవ్వడానికి గంట కావాలన్నానా. అందుకు విరుధంగా ఇరవై ఐదు నిమిషాల కల్లా నా శ్రీమతి తయారై గిన్నిసు బుక్కు రికార్డు బద్దల కొట్టిందనుకోండి. ఇలా ఏడు ఇరవై ఐదు అవుతుండగా మరో పెద్దాయన వచ్చి మమ్మల్ని కలిసారు. మాటల్లో వారిపేరు రాఘవేంద్ర అని అర్దం అయ్యింది. (వారి అసలు పేరు ప్రచురించటానికి అనుమతి లేక ఇలా..). చాలా మర్యాదస్తులు. ఎంత మర్యాదస్తులంటే, ముందుగా వీరిని మర్యాద రామన్న అని పరిచయం చేద్దాం అనుకునేంత. కానీ రాఘ వేంద్ర అని అంటే బాగుంటుందనిపించి అలా మార్చేసాను. మొదటి భాగంలో సత్యన్నారాయణ శర్మ గారు చెప్పిన కొన్ని మాటలు ఒక్క సారి నెమరు వేసు కుందాం..

..విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు ..

అది సంగతి, సత్యన్నారాయణ శర్మ గారు చెప్పినట్లుగా, ఈ రాఘవేంద్ర గారే ఆ సదురు వ్యక్తి అన్నమాట. రాత్రి వచ్చిన ఫ్రకాశ్ గారిని ఈయనే పురమాయించి ఉంటారని అప్పుడు అర్దం అయ్యింది. సదురు రాఘవేంద్ర గారితో పిచ్చాపాటీ వేసుకుంటూ చిన్నగా స్టేషన్ బయటకు వచ్చి అక్కడి ప్రకృతిని ఆశ్వాదిస్తూ అక్కడే పచార్లు కొడుతూ ఉన్నంతలో, రాఘవేంద్ర గారు మన ప్రకాశ్ కోసం ఫోన్‍లో ప్రయత్నిస్తున్నారు. మన ప్రకాశ్ ఏమో స్పందించడం లేదు. అలా అక్కడే ఎనిమిది గంటలైంది. మేము మనసులో పడే ఇబ్బందిని తొలగించాలనే ప్రయత్నంలో చక్కటి కాఫీ ఒకటి పోయించి కొంచం చల్లార్చారు. పదే, పదే చేసిన ప్రయత్నాలలో ఒకటి కలిసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే, ప్రకాశ్ గారి తండ్రి గారికి ఆ రోజు ఉదయమే శుస్తి చేసిందని. అందువల్ల తండ్రిగారికి సపర్యలు చేసే నిమిత్తమై ప్రకాశ్ గారు ఇఱుక్కు పోయ్యారని. హతవిధీ!! ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నంతలో,

“ఇక్కడే, ప్రక్కనే మంత్రాలయ దేవస్థానం వారి ఆశ్రమం ఉంది అది చూసి వద్దాం పదండి .." అని రాఘవేంద్ర గారు అనడంతో అటు బయలు దేరాము. అలా అక్కడికి ప్రక్కనే ఉన్న ఆశ్రమం చూసుకుని అక్కడ మరో గంటన్నర గడిపిన పిదప మన ప్రకాశ్ గారు ఆటోతో సహా వచ్చారు. చక్కగా ఆటో ఎక్కి మంత్రాలయం వైపు బయలు దేరాము.



మెల్లిగా ఓ అరగంట ప్రయాణం చేసిన పిదప మంత్రాలయం ఆలయం చేరుకోవడం ఆటో నడిపే వ్యక్తి చక్కగా మమ్ములను గుడి ద్వారం దగ్గరకి చేర్చడం అన్నీ అనుకోని విధంగా జరిగి పోయ్యాయి.సరి అని కాళ్ళకున్న చెప్పులు కాస్తా ఆటోలో వదిలి చేతిలో ఉన్న కెమెరా శ్రీమతి చేతి సంచిలో ఉంచి అడుగులో ఆడుగు వేసుకుంటూ మ్రెల్లిగా గుడిలోపలికి చేరుకున్నాం. అదిగో అప్పుడు తెలియలేదు మాకు అక్కడి గర్బ గుడిలోకి మేము వెళ్ళి వస్తామని.

లోపలికి వెళుతూ .. అచంగా పుష్కరం క్రిందట విచ్చేసినప్పటి నా అనుభవాలను ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా నా శ్రీమతితో పంచుకుంటున్నాను. క్రిందటి పుటలో దీప్తిధార చీమకుర్తి భాస్కర రావుగారు స్పందించినట్లుగా.. నా జీవితంలో మొట్ట మొదటి సారిగా మ్రొక్కులు ఎంత వెరైటీగా ఉంటాయో ఈ దేవాలయం లోనే చూసాను. అలాగే మ్రొక్కులు తీర్చే క్రమంలో భక్తులకు ఎన్నెన్ని గాయాలౌతాయో ప్రత్యేకంగా ఈ కళ్ళతో వీక్షించాను. అలా ఆ రోజు నేను మాత్రమే కాకుండా నా భార్య కూడా సాక్ష్యం పలికింది. ఎవ్వరికి అనుకుంటున్నారా.. మ్రొక్కులు తీర్చుకునే వాళ్ళకి.

లోపలకి వెళ్ళిన తరువాత ప్రకాశ్ అడగనే అడిగారు, పంచ కండువా తెచ్చుకోలేదా అని. ఒక్క శ్రీశైలం మరియూ కాళకస్తి గుళ్ళలోనే ఇలా పంచ కండువాతో మాత్రమే రానిస్తారని తెలుసు కానీ ఇక్కడ కూడ అలాగే వెళ్ళాలని తెలియనందుకు కొంచం సిగ్గు పడ్డాను. నా సంకట స్థితిని గమనించిన మన ప్రకాశ్ అక్కడే ఉన్న పంతులు గారి దగ్గరకు తీసికు వెళ్ళి కండువా ఒకటి దానమిప్పించారు. ఇక పంచె విషయాన్నికి వస్తే తన కండువాని నాకు చేబదులిచ్చి లుంగీగా కట్టుకోమన్నారు. అదిగో అలా చొక్కా పాంట్ పోయి పంచా కండువా వచ్చాయి. అలా ఆహార్యం మార్చి వీఐపీ ద్వారం గుండా ఒకసారి దర్శనం చేసుకుని, మరోసారి గర్బ గుడిలోకి ప్రవేసించే అవకాశం ఏ జన్మ పుణ్యమో కదా అనుకుంటూ ఈ పుటని ఇక్కడితో ముగింపు పలుకుతాను. మరో పుటలో మరిన్ని వివరాలు.

అంత వరకూ సెలవా మరి.

ఇట్లు భవదీయుడు

1, మార్చి 2009, ఆదివారం

బ్లాక్ – ద కలర్ ఆఫ్ మ్యూసిక్

ETV వారు నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలలో శీర్షికలో తెలియజేసిన పేరు మీద ఒక కార్యక్రమం ప్రతీ శని వారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమౌతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, పాడే వాళ్ళంతా అంధులే. ఆఖరికి వీరిని మరియు వీరి ప్రతిభా పాఠవాలని బేరీజు వేసే న్యాయ నిర్ణేతలలో ఒక్కరు కూడా అంధులే అంటే నమ్ముతారా. ఇక అసలు విషయానికి వస్తాను.

ఈ కార్యక్రమానికి ఝాన్సి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటే, సినీ నటి లయ మరియు సినీ గేయ రచయత అనంత్ శ్రీరామ్ మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మూడో న్యాయనిర్ణేత మురళీ కృష్ణ గారు ఎవ్వరో నాకు అంతగా తెలియదు, కావున వారి గురించి ప్రస్తావించడం భావ్యం కాదు. ఈ పుట ప్రచురించడనికి ప్రేరేపణ మన హీరోయిన్ లయ గారు. ఈవిడ చేసే కామెంట్లే నన్ను ఈ పుట వ్రాయడానికి ప్రేరేపించాయంటే నమ్ముతారా.. అలాగే వీటికి తోడుగా క్రిందటి వారం కార్యక్రమంలో నిష్క్రమించిన తేజాలక్ష్మి అనే అమ్మాయి మాట్లాడిన తుది పదాలు నన్ను లోలోపల్నుంచి .. (అంటే గుండె లోతుల్లోంచి అన్న మాట..).. .. .. .. .. .. .. .. … .. .. ఏమి వ్రాయాలో మాటలు రావటం లేదు. ఎక్కువ సుత్తి వెయ్యకుండా .. ఆమె మాటలు యధా విధిగా…

ఝాన్సి : తేజా లక్ష్మి.. మరి ఈ ఎపిసోడ్ నుంచి నువ్వు ఎలిమినేట్ అయ్యవు. ఇక్కడితో నీ ఈ ప్రయాణం ఆగి పోతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు!!!???

(ఏమిటిది అడగడం??? ఎంత సీనియర్ యాంకర్ అయితే మాత్రం ఓడిపోయిన వాళ్ళని అడిగే ప్రశ్నేనా ఇది?? ఏదో కప్పు గెలిచావు అన్న లెక్కలో ఓడిపోయ్యావు ఎలా ఫీలవుతున్నావు అని అడుగుతావా అనిపించింది. అందునా మామూలుగా ఉండే వాళ్ళను ఏదైనా కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు అడిగితే వారు ఎంత భాద పడుతూ కంట నీళ్ళు పెట్టు కుంటారో చాలా కార్యక్రమాలలో చూస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి అందునా చూపు లేని ఈ పిల్ల ఎలా స్పందిస్తుందా అని భాద పడుతూ.. దేవుడా !!! ఈ పిల్లని ఏడ్పించకు అని మనసులో మ్రొక్కుకుంటుంటే.. ఈ అమ్మాయి స్పందన ఈ క్రింది చిధంగా ఉంది)

తేజా లక్ష్మి: గెలుపుని ఎంతగా ఆస్వాదించానో ఓటమినీ అంత ఆస్వాదిస్తున్నాను. రెండింటిల్లో పెద్ద తేడా ఏమీ లేదు..

ఇలాంటి స్పందన విన్నందుకు నాకు ఎగ్గిరి గెంతెయ్యాలనిపించింది. ఎంతో పరిపక్వం చెందిన వ్యక్తిత్వం నాకు ఆ మాటల్లో కనబడింది. ఇలాంటి కార్యక్రమాలనుంచి వైదొలుగుతున్న వారు తప్పని సరిగా కంట తడి పెట్టుకోవడం మనకు సర్వ సాధారణంగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది, అంధు రాలైన తేజా లక్ష్మి కొంచం కూడా తొణకకుండా, బెదర కుండా, ఎంతో గొప్ప మనసుతో ఎటువంటి భాధ కనబడ నీయ్యక ఇచ్చిన సమాధానం నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది.

ఇక మన హీరోయిన్ లయ గారి విషయానికి వస్తే, ఈ పుట వ్రాసే సమయానికి జరిగిన కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తనలో కొంచం పరిపక్వం కనబడుతోంది. అంతకు ముందు ఎపిసోడ్‍లలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తన చాలా అసందర్బంగా సాగింది. ఎలా అంటారా!! కళ్ళు లేని లోకాన్ని ఒక్క సారి ఆలోచించ కోండి. అలాగే హావ భావాలకు ప్రధానం కళ్ళు. అట్లాంటి కళ్ళతో మనం తెలియకుండా ఎన్నో విషయాలను ఎదుటివారికి తెలియ జేస్తుంటాము. కధాకళి నాట్యానికి ప్రాణం ఈ కళ్ళు మరియు వాటితో పలికించే అనేక భావాలు. కళ్ళు ఉన్న మనకే ఒక్కొక్క సారి ఎదుటి వారిని అనుకరించడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది కళ్ళతో చూడకుండా ఎదుటి వారిని అనుకరించాలంటే అందునా ఎదుటివారి మాటల్ని మాత్రమే వింటూ యధావిధంగా పాడాలి అన్నది ఎంత వరకూ సుళువో ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.

ఇంత కష్ట తరమైన కళలో వీరి వంతు కృషి వీరు చేస్తూ చాతనైనంత బాగా పాడాలనే ప్రయత్నం చేస్తుంటే, మన హీ(జీ)రోయిన్ లయ గారు అందరు గాయకులకు ఒకటే స్టాండర్డ్ కామెంట్.. ఏమిటంటే.. మీరు పాడిన పాటలోని ఫీలింగ్ మిస్ అయ్యినట్లు ఉంది. మీరు కొంచం బాగా పాడొచ్చు. ఎక్స్ ప్రషన్ ఇంకా ఉంటే బాగుంటుంది.ఎక్స్ ప్రషన్ విషయంలో కొంచం ఎక్కువ శ్రద్ద తీసుకోండి

ఇట్లా ఈవిడ గారి స్పందనలు సాగుతింటే.. నామనసులో ఈ క్రింది విధంగా అనిపించింది.

తొక్కలో ఎక్స్ ప్రషన్.. అస్సలు చూపే లేని వారికి ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? ఒక వేళ తెలిసిందనుకుందాం, కళ్ళు లేని వారికి సదురు పాటను పాడిన వారి ఎక్స్ ప్రషన్ ఎలా కనబడుతుంది? నవ రసాలలోని హాస్యం మరియు విషాదం తప్ప మరేమీ తెలియని అంధులకు మిగిలిన రసాలను ఎలా అర్దం చేసుకుంటారు? ఒక వేళ అర్దం చేసుకున్నా వాటిల్ని ఇలా వ్యక్తం చేయ్యాలని ఎలా తెలుస్తుంది? ఈవిడగారు నటించేటపుడు ప్రతీ షాటు ఎన్ని సారు రీటేక్‍లు చేసేదో ఈవిడగారు మర్చి పోయినట్లున్నారు. న్యాయనిర్ణేతగా వచ్చేటప్పటికి ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలియకుండా.. ఆ స్థానానికి తగ్గ హుందాతనంతో ప్రవర్తించ కుండా ఇలాంటి కామెంట్లు చేస్తే.. పాడాలనే హుషారు ఉన్న గాయకులకు సదురు ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో తెలియక నిరుత్సాహ పడిపోరా? ఈ విషయం మన హీ(జీ)రోయిన్ గారికి ఎలా తెలుస్తుంది?

ముగించే ముందుగా మఱో విషయం. ఇక్కడ పాడే వారిలో కొంత మంది పాట పాడుతూ హుషారుగా పాటలో ఎంతగా లీనమై పోతున్నారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఝాన్సీ వీరిని తీసుకు వచ్చి కెమెరా ముందు నిలబెడితే, పాటలో లీనమై పోయి పాడుతు పాడుతూ వీరు మఱో ప్రక్కకి తిరిగిపోతూ ఉంటుంటే ప్రక్కనే న్రుంచున్న ఝాన్సీ వీరిని మళ్ళీ కెమెరా వైపుకు త్రిప్పాల్సి వస్తోందంటేనే అర్దం అవుతోంది వీరు ఈ పాటలను ఎంతగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పాడుతున్నారో. ఈ చిన్ని విషయం మన లయగారికి అర్దం అయినట్లు లేదు. ఇంతక ముందు ఈవిడ గారి మీద ఉన్న గౌరవం కాస్తా ఇట్లాంటి స్పందనలతో తుడిచి పెట్టుకు పోయింది.

ఏది ఏమైనా మీకు వీలైతే తప్పని సరిగా మీరు చూడదగ్గ కార్యక్రమం. మీరు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగిందా.. మరి మీస్పందనలు ఏమిటో నాతో పంచుకుంటారా?

అంత వరకూ సెలవు,
ఇట్లు,
భవదీయుడు

26, ఫిబ్రవరి 2009, గురువారం

మంత్రాలయం వెళ్ళివచ్చాము – విషేశాలు : మొదటి భాగం


ఈ పుట వెనుక చాలా కధ ఉంది, కానీ అది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ పస్తుతమైనది ఏమిటంటే, ఆలోచనా తరంగాలుగా బ్లాగుతున్న మరో తెలుగు బ్లాగరు, తెలుగు యోగి, శ్రీ సత్యన్నారాయణ శర్మగారు మరియు వారి స్నేహాతత్పరత.

వీరి బ్లాగులో ’ఎస్ జానకి గారితో ప్రయాణం’ అన్న పుటలో వీరు మంత్రాలయం నుంచి గుంతకల్లు వరకూ ప్రయానిస్తుంటే అనుకోకుండా ఎస్ జానకి గారు అందులో ఉన్నట్లు, వీరు వెళ్ళి జానకి గారితో కొద్ది సేపు మాట్లాడినట్లు వారి మధుర క్షణాలను గుర్తుకు తెచ్చు కున్నారు. ఇది చదివిన తరువాత మంత్రాలయం వెళ్ళే విషయంలో వీరిని సంప్రదించాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వీరిని సంప్రదించేప్రయత్నంలో పడ్డాను. వీరికి ఫోన్ చేసి, అయ్యా నేను మంత్రాలయం వెళ్ళాలి అనుకుంటున్నాను, కొంచం వివరాలు తెలియ జేయ గలరా అని అడిగాను. అంతే అన్నదే తడవుగా, మీకు ఈ విషయాలు నేను చెబితే అర్దం కావు కానీ, ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారో చెప్పండి మిగతావి నేను చూసుకుంటాను అన్నారు. అంటూనే.. మీరు మంత్రాలయం వచ్చేటప్పటికి అర్దరాత్రి అవుతుంది, అందుకని మీ కోసం అక్కడ ఒక రిటైరింగ్ రూమ్ అట్టి పెడతాను. మంత్రాలయం లొ దిగగానే నేరుగా బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళండి. అక్కడ డ్యూటీలో ఉండే టీటీ కి మీపేరు చెప్పండి, ఆయన మీకు ఆ రూమ్ ఇస్తారు. చక్కగా ఉదయం వరకూ విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు. ఏమిటో ఇలా అన్నారు అని మనసులో ఉన్నా భారం దేవుని మీద వేసి బయలు దేరాను.

హైదరాబాదు నుంచి రాయగడ ఎక్సుప్రస్ మంత్రాలయం మీదుగా వెళ్ళుతుందని తెలిసి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నాను. చక్కగా శని వారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బేగం పేట రైల్వే స్టేషన్ నుంచి మా ప్రయాణం మొదలైంది. రాత్రికి ప్రయాణం మధ్యలొ తినడానికి ఏమైనా దొరుకుతాయో లేదో అని ఓ టిఫిన్ బాక్స్ నిండా పులిహోర చేసుకుని బయలు దేరాము. అలా నిదానంగా ప్రశాంతంగా మొదలైన మా ప్రయాణం ఆద్యంతం ఇలాగే సాఫీగా చక్కగా సాగి పోనుందని మాకు అప్పడు తెలియలేదు.

మంత్రాలయం చేరుకునేటప్పటికి అర్ద రాత్రి అవుతుందని టీటీ చెప్పగానే నిద్రని ఆపుకుని మెలుకువగా ఉండి వచ్చే పోయ్యే స్టేషన్ పేర్లను మననం చేసుకుంటూ కాలం గడిపేయ్యడం మొదలు పెట్టాను. మా దురదృష్టవశాత్తు ఆరోజు రాయగడ ఎక్సుప్రస్ ఓ గంట ఆలస్యంగా నడుస్తోంది. అలా మేము సమయాన్ని లెక్కపెడుతూ సాగిస్తున్న మా ప్రయాణంలోని మొదటి మజిలీ రానే వచ్చింది. అప్పటికి మధ్య రాత్రి దాటి గంటన్నరైంది. సత్యన్నారాయణ శర్మ గారు మాతో చెప్పినట్లుగా మంత్రాలయం లో దిగగానే నేరుగా టీటీ దగ్గరకు వెళ్ళగానే చక్కగా మాకోసం బుక్ చేసిన రూమ్ తాళాలు ఇచ్చారు. అక్కడి రిజిస్టరులో మా చిరునామా వ్రాసి, అద్దె క్రింద ఓ వంద రూపాయలు జమ చేసి మెల్లగా మా గదికి చేరుకుని నిద్రకి ఉపక్రమించె సమయం లో ఎవ్వరో తలుపు తట్టారు. ఈ సమయంలో ఎవ్వరై ఉంటారా అని అనుకుంటూ, తలుపు తెరిచాను.

ఎదురుగా ఓ పెద్దాయన, “నాపేరు ప్రకాష్.. మీరు రేపు గుడికి ఎన్ని గంటలకు వెళతారు?” అని ప్రశ్నిస్తూ కనబడ్డారు. నిద్ర మత్తులో ఉన్నానేమో, ముందు కొద్ది సేపు ఏమీ అర్దం కాలేదు. మెల్లగా తేరుకుని,

“ఏడు గంటలకల్లా మేము సిద్దంగా ఉంటాము. ఆ తరువాత ఆలోచిద్దాం తదుపరి కార్యక్రమం” అనగానే,

“సరేనండి. ఉదయం కలుస్తాను.. ఉంటాను..” అంటూ సెలవు తీసుకున్నారు, సదురు ఫ్రకాష్.

అలా ఆ రాత్రి అక్కడ విశ్రాంతి. మరునాటి విషయాలు మరో పుటలో.

19, ఫిబ్రవరి 2009, గురువారం

పిల్లలూ! మీకో లేఖ..

మీరు రోజులు పసిగొడ్డుగా ఉన్నప్పుడు,

తెరిచీ తెరవని అరమోడ్పు కళ్ళతో (మమ్మల్ని) చూస్తుంటే, అన్నీ మరచిపోయే ఓ తల్లి వ్రాసే లేఖ..

మీకు నెలలు నిండుతూ మొదటి సంవత్సరం పుట్టిన రోజునాడు మీరు ఏవేవో శభ్దాలు చేస్తూ ఉంటే, మురిసిపోయే ప్రతి తండ్రీ వ్రాసే లేఖ..

మీకు నామకరణం చేసి, మా పేరును మీకు ఆపాదించినందుకు.. అలాగే మా స్వార్దాన్ని మీ ద్వారా చూపించుకున్నందుకు, మమ్మల్ని శిక్షించకండి..

మీకు ఎలా అక్షరాభ్యాసం చెయ్యాలి.. ఏ  చదువు చదివించాలి.. ఏ పాఠశాలైతే భవిష్యత్తు చదువుకు బాగుంటుంది.. వంటివి  కూడా మేమే నిర్ణయించి, చదివే బడిని కూడా మేమే ఏకపక్షంగా నిర్ణయించి నందులకు, మమ్ములను ఈ వృధాశ్రమంలో ఏకాకులను చేసి శిక్షించకండి..

మీరు కష్టపడి పరుగెత్తి పరుగు పందెంలో బహుమతులు తెస్తే, అది చూసి మురిసి పోయి, “నా బిడ్డ..” అంటూ అక్కడ కూడా ఆ గొప్పదనాన్ని మాది అని, మీ శ్రమను కొట్టేసిన మమ్ములను ఈ కడపటి పయనంలో ఒంటరిని చేసి ఇక ఇప్పుడు మీరు పరుగెత్తండి చూద్దాం అని శిక్షించకండి..

పాఠశాల చదువులు పూర్తై కళాశాల చదువుల విషయానికి వచ్చినప్పుడు, “అమ్మా నాకు లెక్కలు అర్దం కావటం లేదు.. నాన్నా నేను సైన్సు తీసుకోను..” అన్నా వినకుండా, మిమ్ములను మంచి చదువు చదివించాలన్న తాపత్రయంలో, ఇప్పుడు మీకు కాసులు కురిపించే చదువులను మీ చేత అతి కష్టం మీద (మా బలవంతం మీద మీకు) రుబ్బించినందులకు, మమ్ములను ఈ ఙ్ఞాపకాల బడిలో పాత శ్మృతులను నెమరు వేయ్యమంటూ శిక్షించకండి..

కళాశాల చదువులు పూర్తై విశ్వవిధ్యాలయాలలో విధ్యనభ్యశించే విషయంలో పరదేశానికి వెళతానన్నప్పుడు, మాకు దూరంగా వెళ్ళిపోతావా అన్న మాభయం.. మాకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి అన్న మా స్వార్దం మీకు కనబడనీయ్యకుండా, ఆర్దికంగా కొంచం కష్టమైన పని అయినా సంతోషంతో పరదేశానికి పంపించిన మమ్ములను ఆర్ధికంగా అన్నీ ఇస్థున్నాంగా అంటూ శిక్షించకండి..

మాకు నచ్చే పిల్లని లేదా పిల్లాడిని చేసుకుంటారు అని అనుకునేంతలో, “అమ్మా!! ఇదిగో మీ కోడలు..” అనో.. “నాన్నా!! నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను..” అంటూ మన కుటుంబ సంస్కృతి ఏమిటో తెలియని వాళ్ళని తెచ్చినప్పుడు మేము కించిత్తు భాధ పడ్డ మాట నిజమే అయినా మీ జీవితానికి మేమెప్పుడూ అడ్డు కాదే, మాతో ఒక్క సారి సంప్రతిందించి ఉంటే బాగుంటుంది కదా అని మేము భాధ పడ్డాము అని చెప్పినందుకా మా కీ శిక్ష..

ఏది ఏమైనా.. ఒక్క మాట.. ఒక్క విన్నపం.. ఒక్క వేడుక..

జీవితం చాలా పెద్ద ప్రయాణం. చివ్వరి దాకా మనం ఇరువురం కలసి ప్రయాణించలేం.. కానీ, ఈ పెద్ద ప్రయాణంలో..

మాకు వయస్సు ఉన్నప్పుడు మీకు మేము చేయూత.. మాకు వయస్సు ఉడిగినప్పుడు మీరు మాకు చేయూత..

కనీసం రోడ్డు దాటేటప్పుడైనా మా చేయ్యి పట్టుకోండి.. ఈ కట్టేను మోసేందుకు మాత్రమే కాదు మీరు మాకు కావల్సింది.. ఈ కట్టే తుళ్ళి తూలి పడకుండా నిలిపేందుకు మీ ఆసరా కావాలి.

తల వాల్చి కన్ను మూయ్యడానికి మీ భుజం కావాలి..

కన్ను తెరిస్తే పలకరించడానికి మీరు కావాలి..

కావాలి.. మీరు కావాలి.. తిట్టేందుకైనా.. కొట్టేందుకైనా.. పెట్టేందుకైనా.. పెట్టించేందుకైనా.. మీరే కావాలి..

వస్తారు కదూ..

రెండు + రెండు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం..

9, ఫిబ్రవరి 2009, సోమవారం

మా ఊరు వెళుతున్నానోచ్

వచ్చే వారాంతంలో నేను మా ఊరు వెళుతున్నాను. మా ఊరు అంటే, నేను పుట్టి పెరిగిన ఊరు కాదు కానీ, మా పూర్వీకులు ఉన్న ఊరు అన్నమాట. నిజానికి మా ముందు తరం లోని మా నాన్నగారు అక్కడ పుట్టలేదు, కానీ మా తాతగారు కాలం చేసేంత వరకూ అక్కడే గడిపారు. అక్కడే కాలం చేసారు. అక్కడే కరణంగా పనిచేసారు.

ఏదో ఆనందం... ఎందుకో తెలియదు.. కానీ ఆనందం. అక్కడ నేను పుట్టలేదు, పోనీ అక్కడ పెరిగానా!! అంటే, అదీ కాదు. ప్రతీ సంవత్సరం సెలవులకు అక్కడకు వెళ్ళే అలవాటు ఉందా అంటే, అదీలేదు. ఏదో పండగకో పబ్బానికో వెళ్ళినట్లు చూచాయగా ఒకటో రెండో అనుభవాలు లీలగా గుర్తుకు వస్తున్నాయి. అయినా ఎందుకీ ఆనందం? మా చిన్నాన్న ఒక్కడే అక్కడ ఉంటున్నాడు. చిన్నాన్నా మరియు పిన్నీ తప్ప అక్కడ మరెవ్వరూ ఉండటం లేదు. మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, వరసకు తమ్ముడు కూడా ఇక్కడే, అంటే హైదరాబాద్‍ లోనే ఉద్యోగం చేసుకుంటున్నాడు. వీడికి ఒడుగు చేస్తున్నారంటూ పిన్ని ఫోన్ చేసి చెప్పిన తరువాత వెంటనే రైల్ రిజర్వేషన్ చేయించాను. మాకంటూ అక్కడ అస్తిపాస్తులు ఏమీ లేవు.. కానీ ఎందుకీ ఎదురు చూపులు??

అక్కడి మట్టితో ఎటువంటి అనుబందం లేదే.. కానీ ఎందుకీ ఎదురు చూపులు?? ఎప్పుడో కాడి కట్టుకుని నీళ్ళు మోసినందుకా!!! లేక వేరుశనగ చేలోకి వెళ్ళి దొంగతనంగా వేరిశనగ కాయల మొక్కలు పీకి కాల్చుకుని తిన్నందుకా!!! లేకపోతే పెరడులో కాచిన పుచ్చకాయలను కోసుకు రమ్మన్నప్పుడు, కోసిన పుచ్చకాయను మొయ్యలేక మీదవేసుకుని చతికిలపడ్డ వైనం మరోసారి గుర్తుకు తెచ్చుకునేందుకా!! నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. మా వూళ్ళో ఎవ్వరూ వాటి గురించి పట్టించుకోరు. ఎందుకంటే, ఎవ్వరి పెరడు చూసినా తప్పకుండా కనబడుతూనే ఉంటాయి. ఎన్ని సార్లు గంపలు గంపలు సీతాఫలాలు బ్రేక్ ఫాస్ట్‍గా లాగించామో గుర్తు తెచ్చుకునేందుకా!! ఎండాకాలంలో లేత లేత ముంజికాయలను బ్రొటన వ్రేలితో జుర్రుకుని తిన్న పొలం గట్ల వెంబడి పరుగు తీసేటందుకా!! పండిపోయిన తాటి ముంజి కాయలను కాల్చి రశం తీసుకుని మామిడి చెట్టు కొమ్మల మీద కోతీ కొమ్మచ్చి ఆట ఆడిన రోజులను మర్చిపోకుండా పదిలంగా పదికాలాల పాటు భద్ర పరచుకునేందులకు.. వెళ్ళుతున్నా.. వెళ్ళుతున్నా.. మా ఊరు వెళ్ళుతున్నా..

ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా.. ఏలూరు దగ్గరున్న దెందులూరు మండలం పరిధి లోని చల్ల చింతల పూడి.   ఈ పర్యటన తరువాత వికీ పీడియాలో మరిన్ని వివరాలు పొందు పరుస్తాను.

2, ఫిబ్రవరి 2009, సోమవారం

మరికొన్ని SMSలు

వీటిల్లో కొన్ని చాలా నచ్చినాయి, వీటిల్ని తొలగిస్తుంటే, గుండె పిండేసిందనుకోండి. వీటన్నింట్లో మీకు నచ్చినది ఏదో.. ఒక చిన్న పరీక్ష అనుకోండి..

**************************************************

Every tear is a sign of brokenness..

Every Silence is a sign of Loneliness..

Every Smile is a sing of Kindness..

And Every SMS is a sign of remembrances .. 

**************************************************

Accidents do happen when ..

i slip..

i trip..

i stumble..

i fall ..

and usually i don’t care at all …… but, now i don't know

what to do .. i slipped and fell in love with you..

**************************************************

As i lie awake in my bed..

all sorts of thoughts run through

my head .. like why do i miss you as much

as i do .. then i realise it is because ..

you are YOU…

**************************************************

Life ends when you stop dreaming..

Hope ends when you stop believing ..

Love ends when you stop caring..

So, dream hope and love makes life beautiful..

**************************************************

Hello.. is any one reading this..

We are from Friendship land..

Specialists in repairing

broken bonds..

bonds which are not in use..

or restructure the outdated relations..

100% guaranteed ..
Feelings..

Emotions..

Love.. are free with the service..

Hello.. Reply is a must..

For any offer acceptance and rejection should be

intimated to the department of Friendship..

**************************************************

One question ..

Do you like reading my SMS??

One Query ..

Do you feel reading them !!??

One Doubt..

Don't you get a thought to reply a small thought ..

One Clarification..

Am i looking like a fool to wait for your SMS.. (నన్ను చూస్తే పాపం అనిపించడం లేదూ..!!)

One Order ..

Do it now.. what ever is there in your mind

**************************************************

ALONE means..

All the time i think of U..

Lonely I'm with out U..

On my mind its only U..

Never i’ll forget U

Everyday i miss you..

thus, Alone always..

**************************************************

People fall in love not knowing ..

why or how its so special that,

it doesn’t require much answers..

you just love no matter how stupid you are ..

**************************************************

Last night, while thinking of you, a tear rolled out..

I asked .. why are you out..

Tear told.. there is someone in your eyes..

now there is no place for me, then what do i do?

**************************************************

When you love someone it is like reaching for the star..

i know that i can’t reach the star.. but i keep trying…

because one day may be the start might fall for me..

and for my efforts.. nothing is more than my true effort..

**************************************************

Love will love you when the love loves, so love the love

till the love says, love you more..

and love will feel proud of love when love is true..

**************************************************

A words says .. Love U..

A smile says.. Like U..

A ring says.. Remember U..

but my SMS says, Miss U..

**************************************************

Being missed by some one is thrilling.. but to miss someone is…

.

.

.

.

.

.

.

Painful..

**************************************************

Love can be expressed in may ways…

One way i know is to send it across the distance to the person

who is reading this..

**************************************************

Tears can sometimes be more special than smiles..

for smiles can be given to anyone..

but tears are only shed for the people we love..

**************************************************

I wish a wish for you.. it is a wish i wish for a few.. the wish i wish for you is that all your wishes comes true so keep wishing as my best wishes are for you.. all the best ..

**************************************************

Our life is made of what we do..

it is not made by what we know.. or .. what we feel ..

it is only when the knowing and the feeling

translate into doing.. that’s the beauty of life..

**************************************************

FRIENDSHIP is not a DGREE..

.

.

.

.

.

to start and finish with in 2 or 3 years..

.

.

.

.

.

it is a life time course.. not just to study.. but also to

feel, fight, love and live

**************************************************

Look at sun.. you see time..

Look at your heart.. you see responsibility ..

Look at your profession.. you see lots of work ..

Look at your mobile.. you see who is thinking ..

none other than me !!! :-)

**************************************************

Stay an hour in my heart..

a minute in my mind..

or a second in my soul.. then you will know how i feel..

and the pain in missing a friend like you..

**************************************************

I asked the moving cloud, about you..

it shouted back and said, sorry this is not fair..

I asked a rising sun, about you..

it turned red and gave me a strange look..

I asked a cool breeze, about you..

its showed its power and said, how dare are you..

I asked a glooming flower, about you..

it smiled and said, no one will answer you..

with a shock i asked why.. it said,

You Fool!!, we all love him a lot..

then i thought in my mind, what about me..

every one shouted ..

Don’t compete with us..

**************************************************

31, జనవరి 2009, శనివారం

అంతర్మధనం – మలి భాగం

ఈ అంతర్మధనం వెనకాల కారణాన్ని మొదటి భాగంలో చదివారు కదా, ఇప్పుడు మలి భాగానికి వస్తాను. ఈ పుట నేను రెండవ సారి వ్రాస్తున్నాను. మొదటి సారి అంతా వ్రాసి చక్కగా ప్రచురించే వేళకి నా కలన యంత్రం కాస్తా భీష్మించుకు కూర్చుంది. తప్పక రీబూట్ చేసి మళ్ళి మొదలు పెట్టాను. ఈసారి మొదటి సారి వివరించినంతగా కాకపోయినా కొంచం సహనంతో అన్ని విషయాలు ఏకరువు పెట్టడానికి ప్రయత్నిస్తాను.

అస్సలు విషయంలోకి వెళ్ళే ముందు ఒక ఉపోద్ఘాతం. మా తాతయ్యగారు, శ్రీ దామరాజు వెంకట రామ సూరి గారు, కాలం చేసే ముందు కొంత కాలం మా దగ్గర ఉన్నారు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వారు చెప్పిన ఓ కధ ఈ పుటకి మూలం. ఆ కధని నేను ఎప్పుడూ మర్చి పోలేను ..

ప్రతి మనిషి తన గమ్య స్థానాన్ని వెతుక్కుంటూ సాగే పయనంలో తనకు తెలిసిన లెదా తెలుసుకున్న దారులలో శ్రేష్టమైన దానిని యెంచుకుని (ఎన్నుకుని అని వ్రాసాను, ఈ పదం ఇక్కడ బాగుందా!!) తన ప్రయాణం ఆరంభం చేస్తారు. అట్లా పయనించే పయనంలో తనకు చేదోడు వాదోడుగా ఉండడానికి, హితులు.. సన్నిహితులు.. స్నేహితులు.. భందువులు.. ఇలా ఎందరో మరెందరినో కలుపుకుని పయనిస్తూ ఉంటారు.

అలాంటి పయనంలో తనకు శత్రువులు ఎదురైతే, అది తన తప్పుగా అర్దం చేసుకోవాలి. కానీ అదే పయనంలో తనకు తోడుగా పయనిస్తున్న మిత్రులు ఒక్కొరొక్కరుగా తొలగిపోతూ ఉంటే, అది తాను ఎంచుకున్న దారి తప్పుగా అర్దం చేసుకోవాలి. మన శ్రేయస్సు కోరే వారిని బలి ఇచ్చి సాగించే పయనంలో ఒక్కొక్కరూ తొలగి పోతూ ఉంటే, అలాంటి పయనంలో ఆఖరుగా మిగిలేది ఒంటరి తనమే. అలాంటి పయనం కన్నా శుఖః దుఖాఃలయందు మనతో పాటు కలసి పయనించే తోడు అవసరం అని ప్రతి వ్యక్తి గమనించాలి. అలాంటి సహచరుల కోసం అవసరమైతే మనం పయనించే గమనాన్ని లేదా మనం జీవించే పంధాన్ని మార్చుకోవాలి.

ఇది చాలా పెద్ద కధ, కానీ క్లుప్తంగా పైన చెప్పినట్లన్నమాట. అందువల్ల చెప్పొచ్చినదేమిటంటే, నా పంధా కనుక నాకు శత్రువులను తెచ్చిపెట్టినా ఫరవాలేదు కానీ, ఉన్న మిత్రులను కోల్పోయేటట్లుంటే, ఆలోచించ వలసిన .. కాదు కాదు, మార్చుకో్వలసిన సమయం ఆశన్నమైందన్నమాట. అందుకని ఒక్కొక్క పుటని ఒక్కొక్కరికి కేటాయించేదుకు బదులుగా .. అందరికీ ఒక్క సారే జేజేలు కొట్టేస్తే పోలా అని తోచింది. అదిగో అలా తోచినదే తడవుగా ఇలా..

***************************************************************************

తాడేపల్లి గారు : వీరి గురించి నేను చెప్పేటంతటి వాడినా!! వీరు ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. మరి పుస్తక ప్రదర్శన శాలలో ఊరుకుంటారా.. వీరి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే..

దాట్ల శ్రీనివాస రాజు గారు: వయస్సులో నాకన్నా చిన్న వారైనా, ఎప్పుడూ చిరునవ్వుతో ఏది అడిగినా సహనంతో చక్కగా వచ్చే పోయ్యే వారందరికీ ఏదో తనకు తోచినది చేర వెయ్యాలి అన్న తపన నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది..

నల్లమోతు శ్రీధర్ గారు: వీరికి దేవుడు ఓర్పు అనే పదాన్ని లెదా పదార్దాన్ని ఎంత మోతాదులో ఇచ్చాడో అని ఎన్ని సార్లు నన్ను నేను ప్రశ్నించు కున్నానో నాకే తెలియదు. వీరికి ఇంత ఓర్పు ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్దం కాలెదు

నమ్మల నాగ మురళీధర్ : వీరు వచ్చినన్ని రోజులూ వీరితో పాటుగా వీరి కలన యంత్రం చక్కగా పాలు పంచుకుంది. వీరికి ధన్యవాదాలు చెప్పాలో లేక వీరి కలనయంత్రానికి చెప్పాలో అర్దం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. వీరి కలనయంత్రం చాలా బాగా ఉపయోగ పడిందంటే అతిసయోక్తి కాదు్

కశ్యప్ గారు : అడగంగానే పుల్లైస్ కొనిచ్చిన వీరిని ముందుగా ప్రస్తావిస్తే ఏదో స్వార్దం అనుకుంటారని తలుస్తూ.. తటపటాయిస్తూ.. ఏది ఏమైనా వీరిని మర్చి పోకూడదని ఇక్కడ. ఎంత చలాకీగా పాలు పంచు కున్నారంటే, వీరిని చూస్తే దీపావళి సీమటపాసు కాయ గుర్తుకు వస్తుంది

జీవితంలో కొత్తకోణంతో మన ముందున్న శ్రీనివాస్ గారు : ఎంత వినయస్తులో .. నేను చెప్పేకన్నా మీరు మాట్లాడి చూస్తే తెలుస్తుంది. ఇంత నిదానం మనిశిని నేను ఇంతక ముందు చూడలేదంటే నమ్ముతారా..

చావా కిరణ్ గారు : అడగంగానే నేనున్నాను అనే రీతిలో ఎక్కడున్నా ఎప్పుడైనా పిలవంగానే వాలేస్తారు. కావలంటే ఒక్క సారి మీరు ప్రయత్నించి చూడండి

సనాతన భారతిగా బ్లాగుతున్న సతీశ్ : లేటుగా వచ్చినా లేటెశ్టుగా వచ్చా .. అన్న నానుడి వీరికి చక్కగా సరిపోతుందేమో వీరు అంతగా పాలు పంచుకోక పోయినా, ఎవ్వరెవరు ఏమేమి చేస్తున్నారు అని గమనిస్తూ, ఎవ్వరికైనా ఏదైనా సహాయం కావలంటే సహాయం చెయ్యడానికి సంశయించని వీరి వ్యక్తిత్వానికి జేజేలు కొట్టాలనిపించింది

చాలా మంది పేర్లు నాకు గుర్తుకు రావటం లేదు, కావున మీరు నాకు గుర్తులేరనుకోవద్దు, ఒక్క సారి స్పందించ గలరు. మీ ముఖ చిత్రం చూస్తే తప్పక గుర్తు పడతాను. కావున నన్ను క్షమించి, ఇక్కడ ఒక్కసారి స్పందించండి.

ఇక మహిళా బ్లాగర్ల విషయానికి వస్తే.. మొట్ట మొదటగా ఒక్కరు నేను ప్రస్తావించకుండ ఉండలేను ..

రమణి గారు : కాలేజీకి వెళ్ళే కూతురు ప్రక్కనే ఉన్నా, నేను గమనించ లేక పోయ్యాను. అంటే ఇకడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే.. వీరు వయ్యస్సులో పెద్దవారైనా అంత గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా, అందరితో చనువుగా మెలిగిన తీరు చూస్తుంటే, అబ్బుర పడ్డాను.

పప్పు అరుణ గారు : వీరిని చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. అదేదో పాత సినిమాలో ఉమ్మడి కుటుంబంలో సావిత్రి గారిలా, మరో సినిమాలో ఇంటికి పెద్దక్క అయిన జయప్రద గారిలా, మరో సినిమాలో సౌందర్య లాగా చలాకీగా తిరిగే వారు

ఙ్ఞాన ప్రసూనాంబ గారు : వీరు చేసిన పూర్ణాలు ఇంకా నా శృతి పధంలోంచి జారుకోలేదంటే నమ్మండి. మేము తింటామని తలచి కష్టపడి ఇంటి నుంచి చేసి తీసుకు వచ్చారంటే, వీరి ఆప్యాయతను ఏ శిఖరానితో పోల్చాలో నాకు అర్దం కావటం లేదు. వీరు చేసిన పూర్ణాలకు ముక్తాయింపు నేను, నాకు తోడుగా పైన ఉదహరించిన రమణిగారు వీరికి సరి సమానంగా మరో బ్లాగరు సుజాత గారు పోటీ పడి మరీ ఆ డబ్బను ఖాళీ చేసామనుకోండి. బ్లాగు ముఖంగా వీరికి మరోసారి భన్యవాదములు అలాగే మరో విన్నపము.. మనం ఇంకొక సారి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు? అదేనండీ కలవడానికి వచ్చినప్పుడు మీరెలాగో ఒట్టి చేతులతో రారు కదా.. చక్కగా వచ్చేటప్పుడు ఆ పూర్ణాలేవో చేసి తెస్తారు కదా.. వాటి గురించి మనం అప్పుడు చర్చించు కుందాం. ఏమంటారు.. ఏమి అనకండి, ఎప్పుడు కలుస్తున్నామో నాకు ఒక్కడికే మైల్ చెయ్యండి, లోకానికి తెలిసందనుకోండి నా వాటా పూర్ణాలు కొట్టేస్తారు. (ఇక్కడ వ్రాసిన వాళ్ళందరిలో వీరి గురించే ఎక్కువ ప్రస్తావించడం వెనుక పూర్ణాలే కారణం కాదని గమనించాలి)

శిరీష గారు : వీరు ఓ పెద్ద కంపెనీలో మంచి పొజీషన్ లో ఉన్నా అందరితో చాలా కలివిడిగా తిరిగిన తీరు చూస్తుంటే, ముచ్చట వేసింది. నేను చాలా కొద్ది మహిళా బ్లాగర్లతో మాట్లాడాను, అలాంట్ వాళ్ళలో ఎక్కువ సేపు వీరితోనే మాట్లాడానంటే మీరు నమ్మాలి

పూర్ణిమ గారు : వయస్సులో నాకన్నా చిన్నవారైనా (ఇలాంటి పద ప్రయోగం చెయ్యడం అసభ్యం అనుకుంటే, క్షమించాలి) వీరితో అస్సలు మాట్లాడలేదు కానీ వీరు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా వీరి భావనలు, వీరి ఆలోచనలు నా ప్రమేయం లేకుండనే నా చెవిన పడ్డాయి. కొన్ని విషయాలలో వీరిది చాలా స్పష్టమైన భావన, ఖశ్చితమైన ఆలోచనా సరళి, వీరి పరి పక్వాన్ని తెలియ జేసింది. ఇంకా ఎక్కువ వ్రాస్తే, అర్దం చేసుకునే కన్నా అపార్దానికి అవకాశం ఉంది.

సుజాత గారు : ముందు చెప్పినట్లుగా, వీరు నాకు పోటీకి వచ్చారు. అదేనండీ, పైన ప్రస్తావించిన పూర్ణాల విషయం గుర్తు ఉండే ఉంటుంది. కొంచం కుళ్ళొచ్చింది, కానీ అక్కడ స్థానబలం వారి వైపే ఉంది. వీరితో మాట్లాడుతుంటే, ఎటువంటి inhibition లేకుండా మాట్లాడేశానంటీ అని నామీద నాకే ఆశ్చర్యం వేసింది. అడగంగానే వెళ్ళి మిర్చి బజ్జీలు తెచ్చిచ్చారు. కానీ నా వరకూ రాలేదు. పైన ఉదహరించిన అరుణగారు మళ్ళి వెళ్ళి తీసుకు వచ్చి, మిస్సయిన వాళ్ళకోసం దాచి మరీ పంచారు.

వలబోజు జ్యోతి గారు : వీరిని రెండుసార్లు కలిసాను, కలసిన రెండు సార్లు, చక్కగా వారి ఇద్దరు సంతానంతో వచ్చారు. వారి పుత్రికా పుత్రులు వారిలాగే చాలా కలివిడిగా కలసి మెలసి పోయ్యారు. ఆ!! మరో విషయం మర్చి పోయ్యాను. అదేనండీ, సున్నుండలు.. ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ బాగున్నాయి. వీరు ఉత్తచేతులతో రావడం నేనెప్పుడూ చూడలేదు. ఏమిటో ఇలాంటి వాళ్ళను చూస్తే, కొంచం గర్వంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉన్నాను అని

ఆఖరుగా కాకపోయినా చివ్వరలో, వరూధిని గారు : వీరిని కలవక ముందు వరకూ వీరికి కొంచం గాంభీర్యం పాళ్ళు ఎక్కువ అని అనుకునే వాడిని. వీరిని కలిసిన తరువాత నేను చదివిన వారేష్ బ్లాగు చీరిదేనా అనిపించింది. అచ్చంగా చెప్పాలంటే, down to earth, అనుకోండి. తెలుగులో ఇలాంటి వారిని ఏమంటారో అర్దం కాలేక పోవడమే ఈ పుట ఇంత ఆలస్యంగా ప్రచురించడానికి కారణం. నేను అతి తక్కువగా మాట్లాడిన మహిళా బ్లాగర్లలో వీరిదే అగ్రస్థానం.

--------

ముగించే ముందు మరొక విన్నపం, రాజుగారి రెండవ భార్య బాగుంది అంటే.. పెద్ద భార్య బాగాలేదా అన్నాడట వెనుకటికి ఒకడు.. అలా ఒకళ్ళ గురించి వ్రాస్తే, మరొకరికి ఈ గొప్పతనం లేదా అని మాత్రం చచ్చు ప్రశ్నలు వేయకండి. అలాంటి చొప్పదంటు స్పందనలను తొలగించే హక్కు నాకు ఉందని మరచి పోవద్దు

ఇక నా అభిప్రాయం ఇంతటితో ముగింపునకు వచ్చింది. మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను,

ఇట్లు,

భవదీయుడు

30, జనవరి 2009, శుక్రవారం

నేను డిలీట్ చెయ్యకుండా ఉంచిన మరికొన్ని SMSలు

ఈ SMS లు కాదు కానీ, చదివేకొద్దీ నవ్వొస్తోంది అలాగే, డిలీట్ చేసేటప్పుడు భాధ వస్తోంది. కానీ ఏమి చేస్తాను, ఫోన్ లో అన్నీ పట్టే ప్లేస్ లేదే.. సరే.. మరికొన్ని డిలీట్ చేసేస్తున్నాను.

----------------------

see outside the window

Sun is waiting for you..
Flowers smiling for you..
Birds are singing for you ..

and some one is waiting for you..

----------------------

My Eyes are waiting to see you..
My Ears are waiting to hear you ..
My Mobile is waiting for your SMS..
My heart is waiting to say .. miss you..

-----------------------
There are 2 types of enjoyment in life ..
One is being with friend.. and the other is ..
being with the memories of friend..
i miss my friend but not the memories
-----------------------
ना कोयि पल सुभह है!!

ना कोयि पल शाम है!!

ना कोयि पल रात है!!

हर पल .. हर लम्हॆ आप्कॆ नाम है!!

ये सिर्फ़ ऎक SMS ना सम्झ्लॆना

ये हमारि तरफ़्सॆ आप्को missing you क पैघाम है!!

-----------------------
వెన్నెల కోసం మల్లియలా..

చంద్రుని కోసం కలువలా..

మేఘం కోసం నెమలిలా..

తేనీటి కోసం తుమ్మెదలా..

ఆమని కోసం కోయిలలా..

సూరీడు కోసం కలువలా..

నా కళ్ళెప్పుడూ నీ SMS కోసం ఎదురు చూస్తూ ఉంటాయి… ఒక్క SMS చెయ్యవూ!!

-----------------------
soend life with someone whom you love.. for a life time they will remain as wonderful and marvellous..
But a few moments spend with some one who loves you.. will be more than life..
because to love someone isn't great.. but to be loved by someone is ultimate
------------------------
Leave something for someone .. but dont leave someone for something. Because in life some thing will leave you, but not someone will always be with you to love you as you are ..
------------------------
One man asked god, what's love?
God said, go to the garden and get me the most beautiful flower. The man went out and returned with empty handed and told that i had found most beautiful flower but i kept walking in the hope of a better1 than i realised that i had ignored the best one. i went back, but couldnot find it there..
god said, this is love.. it never be defined, but one has to feel it.
love never claims, but it ever gives...
------------------------
కలల లోకంలో విహరించే నీవు..

కళ్ళు తెరిచి చూడు..

ఉదయించే సూరీడు..

చిగురించే పువ్వులు..

పులకరించే నీళ్ళు..

మధురమైన కాఫీ..

అన్నింటినీ కలగలిపిన నా SMS ..

వేచి ఉన్నాయి నీకోసం .. నీకు శుభోదయం చెప్పాలని ..

------------------------
Alphabet 'O' stands for Oppertunity..
which is absent in Yesterday,
but available once in Today, thrice in tomorrow..
------------------------
Easy to get someone who will love you..
Easy to get someone who will like you..
Easy to get someone who take care of you..
But rate to get someone who will understand you..
------------------------
Meeting you was a fate..
Keeping in touch with you was a choice..
but falling in love with you was completly out of my control ..
oo my dear, where have you been all these days..
.
.
.
.
iphone is releasing on 1st Feb
------------------------
Few Relations In Earth Never Die..
now take the first letter of eacy word from previous line.. and see what do you get from me is that..
------------------------
When i see you .. i'm fine!!!
When i talk to yo .. i feel connected!!
When you sigh .. i feel happy !!
when you are low.. i'm worried !!
Finally when you are away.. i feel am low..
Becuase it is a part of my life.. Nokia - connecting people
-------------------------

ఎలా ఉన్నాయి?

 
Clicky Web Analytics