30, ఆగస్టు 2009, ఆదివారం

ఆశ్తికత్వమా!! నా బొందా!! ఎవ్వడా దేవుడు?

 

ఈ మధ్య ఓ సహ తెలుగు బ్లాగరు వ్రాసిన దానిని చదివిన తరువాత నాకు నవ్వాగలేదను కోండి. సోది ప్రక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తాను. అస్సలు నాస్తికత్వం అనేది ఏదైనా ఉందా అని నా అనుమానం. ఆస్తికులు అనేటోళ్ళు ఎవ్వరు? అలాగే నాస్తికులు అని వేరు చేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి? ఓ!! మర్చిపోయ్యాను. ఇక్కడ దేవుడు అనే ఓ విషయం ఉంది కదా .. అలాంటి విషయం ఉంది అని నమ్మేటోళ్ళు ఆస్తికులా .. నమ్మని వాళ్ళు నాస్తికులా .. మరి నేను నాస్తికుడినా? లేక ఆస్తికుడినా? ఈ విషయం గురించి తరువాత చర్చిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి.. తెలియక ముందు నుంచి కూడా, నాకు ఫలానాది ఇది అని చెప్పినోళ్ళు చాలా మంది. ప్రతీ ఒక్కరూ నాకు గురుతుల్యులే.

కష్టే శ్రమే ఫలి అన్న మొదటి పాఠాన్ని నేర్పిన తల్లి మొదటి గురువు. ఎలా అనుకుంటున్నారా.. అకలి వేసి ఏడిస్తే, ఆ ఏడుపుని అర్దం చేసుకుని చనుబాలను నాకు అందించి కతకడం అనే అలవాటు నేర్పిన మొదటి గురువు అమ్మ. ఈ రోజుల్లో అమ్మలు పిల్లలకు ఆ విధ్యని నేర్పించకుండా పుట్టిన వెంటనే పోత పాలు అలవాటు చేసి కష్ట పడకుండా ఎలా ఎదగచ్చో నేర్పుతున్న తల్లులు నా దృష్టిలో పిల్లలకు స్వతహాగా నేర్చుకునే అలవాటుకు అడ్డిపడి వారి ఎదుగుదలకు అడ్డుపడే అవరోధాలని అభిప్రాయం. ఆ పిల్లల పాలిట శాపాలుగా అనిపిస్తారు. ఇక్కడ పాలు రాని తల్లుల విషయం నేను ప్రస్తావించడం లేదని చదివే వారు గమనించాలి.

నేను మాటలు రాక ఏవేవో శబ్దాలు చేస్తుంటే, నా శబ్దాలలోంచి వారి వారి బంధుత్వ వరుసలు నాకు తెలియ జేస్తూ నాచేత నాన్న .. మామ.. అత్త.. తాత.. బామ్మ.. ఇంకా ఏవేవో పలికించి వారిని వారు పరిచయం చేసుకుంటూ, నీకంటూ ఈ లోకంలో నేనున్నాను అంటూ అభయమిచ్చిన నా బంధు జనం అంతా నాకు మాటలు నేర్పిన గురువులే. బడిలో పలకా బలపం పట్టుకోవడం నేర్పిన భాద్యత గల ఓ ఉధ్యోగి నాకు విధ్యా బుద్దులు నేర్పిన గురువు. ఆట పాటలతో తింగరేషాలు వేస్తుంటే, తాళగతులతో నాట్యాన్ని నేర్పిన  వాసిరెడ్డి కనకదుర్గగారు నాకు గురువు. ఈత కొట్టడంలో మెళుకువలు నేర్పి బంగారు పతకాలు చేజిక్కించుకునే నైపుణ్యాన్నిచ్చిన వెంకటేశ్వరరావ్ కోచ్  నాకు గురువు.

విధ్యాభ్యాసాన్ని ముగించి ఉద్యోగ వేటలో సహాయం చేసి బ్రతుకు బ(బం)డిలో పలు పలు పాఠాలను నేర్పిన విస్వేశ్వరుడు నాకు గురువు. ఏవిధంగా సంగమిస్తే రతి సుఖం లబిస్తుందో తెలియ జెప్పే భార్య నాకు గురువు. ఎవ్వరికి సహాయం చెయ్యాలో ఏ సమయంలో చెయ్యాలో తెలియజేసి నాకు పుణ్యాన్ని ఆర్జించి పెట్టే అన్నయ నాకు పుణ్యఫలం చేజిక్కించుకునే నైపుణ్యాన్ని నేర్పిన గురువు. షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో తెలియ జెప్పే కంపెనీలు నాకు వ్యపార పరంగా గురువులు.

ఇలా ఎందరో మరెందరో గురువులు నా దృష్టిలో దేవుళ్ళు. వీళ్ళంతా కనిపించే దేవుళ్ళు. నేను వీళ్ళనే దేవుళ్ళంటాను. మరి ఆస్తికులు ఉదహరించే సదురు దేవుడు వీళ్ళల్లో లేడే. మరి నేను ఆస్తికుడినా లేక నాస్తికుడినా?? సరే ఆస్తికుడు అనుకుందాం అనుకుంటే మరి ఆ దేవుడిని గుర్తించాలిగా ?? ఇంతకీ ఆ సదురు దేవుడేక్కడున్నాడు? రమ్మనండి నాముందుకు. రాడే!! ఎందుకొస్తాడు ఉంటేగా!!?? సరే నేను ఆస్తికుడిని కాదు నాస్తికుడిని అనుకుందాం అనుకోండి, నాకంటూ దేవుళ్ళు ఉన్నారే!! మరి నేనెలా నాస్తికుడినౌతాను??

నాకు తెలియక అడుగుతాను.. ఆస్తికుడు అంటే తెలుగులో అస్తికలు కలవాడనేగా!! (కాకపోతే సరిజేయ గలరు) మరి ఈ లెక్కలో నాస్తికుడు అంటే అస్తికలు లేని వాడనా!! అంటే ఎవ్వరిలో ఎముకలు లేవంటే వారంతా నాస్తికులా?? యదవ లాజిక్కులు తీసి తొక్కలో డైలాగ్లు వెయ్యొద్దంటారా!! సరే వెయ్యను గాక వెయ్యను. మీరే చెప్పండి. దేవుడంటే ఎవ్వరు? ఎలా ఉంటాడు? ఓ!! రాముడిలా మీస్సాలేకుండా క్లీన్ షేవ్ చేసుకుని ఉంటాడా. లేక కృష్ణుడిలా చిలిపి దొంగతనాలు చేస్తూ ఉంటాడా!! అదీ ఇదీ కాదు.. ఏమీ చేతకాని వాడిలా అందరూ తిడుతూ కొడుతూ ఉంటే.. ’పోనీలే పాపం చేస్తున్నారు, వీళ్ళందరూ సంజాయిషీ ఇచ్చేరోజు వస్తుంది’ అని అవమానాలు ఛీత్కారాలు భరించిన ఏసు ప్రభువు లాగుంటాడా!!

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఫైనల్ గా మీ దేవుళ్ళను కనుగొన్నారు. బాగుంది !

Unknown చెప్పారు...

matru devobhava ante modati devudu mee talli.
Pitru devobhava ante mee tandri,
acharya devo bhava ante meeku chaduvu cheppina guruvu.
atidhi devo bhava - your guest.
Alane devudu anni chotla andari lonu vuntadu.
Ramudi ni devuni ga enduku bhavinchalante, ayana devatwanni choopinchadu. Manishi evaraina devatwanni choopiste vaallu devulavutaru.

I don't about other religions. But in Hinduim, a Man can become Deva by his doings.

If I do all good to some 100 people then I will be a good.

Even Rama is not a god to Ravana and Ravana's Followers. He is god only to his followers. Similarly any god is not god to every body.

I hope you understand now who is a god.

ఓ బ్రమ్మీ చెప్పారు...

హరనాద్ గారూ స్పందించినందులకు నెనరులు

ఇంద్రేశ్ గారూ,

ముందుమాట, నాకు తెలుగుని తెలుగులో చదవటమే ఇష్టం. అలాంటి తెలుగుని ఆంగ్లంలో చదవటం అంటే భహు కష్టం కావున నేను మీ స్పందనను చదవలేదు / చదవలేను. కావున ఇక ముందు ఏమైన స్పందించాలనిపిస్తే చక్కగా లేఖిని కి వెళ్ళి తెలుగులో వ్రాయ ప్రార్ధన.

ఆసాంతం చదివి స్పందించినందులకు నెనరులు. కానీ నా ఈ ప్రచురణ దైవత్వం గురించి కాదు కానీ మన మధ్య ఉన్నటు వంటి దేవుళ్ళు గురించి అలాగే మన మధ్య లేని దేవుళ్ళ గురించి అని గమనించ గలరు.

శరత్ కాలమ్ చెప్పారు...

ఆస్తికులు = ఆస్తి వున్నవారు
నాస్తికులు = న ఆస్తి = ఆస్తి లేనివారు

budugu చెప్పారు...

అస్తికుడు అంటే అస్తికలు కలవాడా.. lol చాలా చిన్నప్పుడు నన్ను బడికి పంపేముందు అమ్మ పుస్తకం కొనిచ్చి మొదటి పాఠం టైటిల్ "పలుకులమ్మ" చూసి, పలుకులమ్మ అంటే ఎవర్రా అని అడిగింది. నేను శుభ్రంగా "పలుకులు తినే అమ్మ" అని చెప్పా. వాళ్ళు గొల్లున నవ్వితే "పలుకులు అమ్మే అమ్మనా?" అడిగా.. అది గుర్తొచ్చింది మీ నిర్వచనం చూసి. no offense.

అస్తికులు అన్న పద వ్యుత్పత్తి "అస్తిత్వాన్ని (existenceని) నమ్మేవారు" అన్న నిర్వచనంలోంచి వచ్చింది. దీని మీదే మరో చిన్న పన్. "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న నానుడి వినే ఉంటారు. కృషి ఉన్న చోట దుర్భిక్షానికి తావు లేదు అని. దీన్నే మరో విధంగా విర్చి.. "కృషితోనా? ఆస్తి దుర్బిక్షం" అని చదివేవాడు మా స్నేహితుడు.

అజ్ఞాత చెప్పారు...

Indresh, Very well said.

ఓ బ్రమ్మీ చెప్పారు...

శరత్ గారు,

స్పందించినందులకు నెనరులు. బాగుంది మీ మరో నిర్వచనం

బుడుగు గారు,

బాగుందండీ మీ పలుకులమ్మ విషయం. అనుకున్నా, ఎవ్వరో ఒక్కరు ఈ విషయాన్ని లేవదీస్తారని. నిజమే అస్తిత్వం అనేది ’ఉన్న’దాన్ని గుర్తించేవారు అన్న విషయం దేని అస్తిత్వం అనేది ఇక్కడ నా ప్రశ్న. అదేదో శ్లోకంలో చెప్పినట్లుగా, యత్ భావం తత్ భవతి:, నా భావనలో వీళ్ళే దేవుళ్ళు కాబట్టి నేను దేవుళ్ళు ఉన్నారంటాను. నా అభిమతం ఏమిటో అర్దం అయ్యిందనుకుంటాను. ఏది ఏమైనా స్పందించి నందులకు నెనరులు.

Jagadeesh Reddy చెప్పారు...

మీ ప్రశ్నకి సమాధానం మీ టపాలోనే వుంది. మన మంచిని కోరే ప్రతి ఒక్కరూ, మన అభివృద్దిని కోరుకునే ప్రతీ అంశము, మనం బ్రతకడానికి వుపయోగపడే ప్రతీ పదార్దంలోనూ దేవుడిని చూడమన్నారు పెద్దలు. పోతన భాగవతంలో ఇదే చెప్పాడు. "ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదకి చూసిన అందందే గలడు". అంతే గాని మీరనుకుంటున్నట్లు, కొన్ని "పవిత్ర గ్రంధాలలో" చెప్పినట్లు దేవుడు పరలోకంలో బంగారు సింహాసనం మీద కూర్చుని వుండడు.

ఇక మీరనుకుంటున్న ఎముకలకి వాడవలసిన మాట అస్తి కాదు.. "అస్థి" అస్తి అంటే అస్తిత్వం existence, అస్థి అంటే ఎముకలు.

పెదరాయ్డు చెప్పారు...

మీరు ఉదహరి౦చినట్లు, వాళ్ళ౦తా దేవుళ్ళే. వాళ్ళలో దేవుణ్ణి గుర్తి౦చిన మీరూ దేవుడే(దేవుళ్ళకే దేవుళ్ళు కనపడతారు :) )

మన సిద్దా౦తాల ప్రకార౦ కూడా, మన చుట్టూ ఉన్న పరిస్థితులనే దేవుడిగా చూపి౦చారు. ఉదాహరణకు వరుణుడు, గ౦గమ్మ,...etc. ఇవి తేలికగా అర్థమయ్యె ఉదాహరణలే. ప్రతి దేవుడూ/దేవతా కారణ జన్ములే. ప్రకృతి లొని మ౦చికి దేవుడి రూపమిస్తే, చెడుకి రాక్షసుల రూపమిచ్చారు. ఇది కూడా నాకు అసహజ౦గానో, నిర్హేతువుగానో అనిపి౦చట౦లేదు.

మ౦చితన౦, పరోపకార౦, దానగుణ౦, వినమ్రత, మర్యాద, మన్ననలు విశేషణాలుగా వున్న వ్యక్తులకు/స౦దర్బాలకు దేవుడి రూపమిస్తే, దురహ౦కార౦, నిర్లక్ష్య౦, పరపీడన, దుర్మార్గాలు వ౦టి విశేషణాలకు రాక్షసరూప మిచ్చారు. ఇవన్నీ క౦టికి కనపడవు కాని అస్తిత్వ౦లో ఉన్నాయి. కనపడన౦త మాత్రాన అవి లేవనడ౦ కేవల౦ హేతువాదమే/నాస్తిక వాదమే. కనిపి౦చని తత్వాన్ని అర్థ౦ చేసుకుని ఆచరి౦చటమే అస్తిత్వ౦ లేక ఆస్తికవాద౦.

వీటికి రూపమిచ్చి౦ది మానవులే, ఎవరో అన్నారు మనిషి దేవుణ్ణి సృష్టి౦చాడు కాబట్టే అతనికి మనిషి రూపమిచ్చాడని, అ౦దులో తప్పేము౦ది. దేవుడు సర్వా౦తర్యామి అన్న స౦దేశమే మానవాళికి పరమ మ౦త్ర౦. ఇది అర్థ౦ చేసుకున్న రోజు మీరు ’తొక్కలో’ కూడా దేవుణ్ణి దర్శి౦చగలరు. ఇది అర్థ౦కాన౦త వరకూ ఈ జన్మలోనే కాదు, చచ్చినా ఆ దేవుడు కనపడడు, కనపడలేడు.

ఇప్పుడు చెప్ప౦డి...

దేవుడున్నాడా? మీరు ఆస్తికులా? నాస్తికులా?

ఓ బ్రమ్మీ చెప్పారు...

జగదీష్ గారు,

స్పందించినందులకు నెనరులు. బుడుగు గారికి నేను స్పందించిన తీరు మరియు అందులోని సారాంశాన్ని ఒక్కసారి నా దృక్పధంనుంచి గమనించండి. ఇతిమిద్దంగా నేను ఇదే అంటున్నాను.

పెద్దరాయుడు గారు,

స్పందించినందులకు నెనరులు. ఒక్కసారి నా ముందటి స్పందనలు చదవమని మనవి. అన్యమనస్కంగా నేను చెప్పేది అదే. దర్శించే చూపులోనే దాగి ఉంది అందమంతా అన్నాడంట వెనుకటికి ఒకడు. అలాగే నీలోనే దేవుడు దాగి ఉంటే లేనిదానికోసం వెతుకులాట ఎందుకు అంటాను నేను. ఇది నా అభిప్రాయం. తప్పుగా అనిపించలేదని తలుస్తాను. ఏమంటారు?

పెదరాయ్డు చెప్పారు...

చిన్న సవరణ:
"నీలోనే దేవుడు దాగి ఉంటే లేనిదానికోసం వెతుకులాట ఎందుకు..."
దేవుడు మనలో మాత్రమే దాగి లేడు. దేవుడు సర్వా౦తర్యామి. నిత్యాన్వేషణ ఆతని భిన్న కోణాలను అవగత౦ చేసుకోవడానికి ఒక మార్గ౦.

గత౦లో మీరన్నట్లు, దేవుడే వు౦టే ఇన్ని అనర్థాలు ఎ౦దుకు అన్నది శోధి౦చ౦డి.

Unknown చెప్పారు...

naayanaa chakravarti, nee abhipraayaalu mariyu janula samaadhaanaalu cadivina taruvaata idi vraayakunDa unDa leaka poetunnaanu. neanu nee blaagu mottam chadivina taruvaata naaku nee nakshatram bahuSa aarudra ani anukunTunnaanu. sari ayinacho munduku velhLamani leanicho, intaTito apeayyamani naa praarthana.

ippaTidaaka nuvvu cheppinavanni naaNaaniki oka vaipu ayatea mari renDO vaipu eamiTi ?

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

ఇదేవిషయంపై నేను రాసినటపాలు కూడా మీరో సారి చదవండి.


http://rajasekharunivijay.blogspot.com/2009/10/blog-post.html

http://rajasekharunivijay.blogspot.com/2009/10/blog-post_23.html

Mauli చెప్పారు...

మీరు 'దేవుడు ' అన్న పదానికి ఇదీ అని ఒక అర్ధ౦ ఏర్పరచుకొని, మళ్ళీ అ౦దులో౦చి ఇతరుల నమ్మకాలని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి నమ్మకాలు వేరయినపుడు మీ ప్రశ్నలకు వారి దగ్గర సమాధాన౦ ఉ౦టు౦దా.

'స్థ',కాని 'అస్తి ' (స్పెల్లి౦గ్ తప్పేమో) అ౦టే ఉ౦డుట.

వున్నాడన్న వారు అస్తి (స్థి?), ఇక లేరనుకొనేవారు 'నా'స్తి అనుకోకతప్పదు కదా. నాస్తి అనుకొనేవారికి మీలాగే అస్తి :).కాని మీరు ఒప్పుకోరు .(సరదాగా)

 
Clicky Web Analytics