16, ఆగస్టు 2009, ఆదివారం

మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!!

 

ఇవ్వాళ మా ఆఫీశ్ వాళ్ళం అంతా కలిసి చర్లపల్లి లోని స్పూర్తి ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్న అనాధ శరణాలయానికి వెళ్ళాం. అక్కడ దాదాపు ఓ వందకు పైగా అనాధ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఓ చిన్నపిల్ల అందరినీ ఆకట్టుకుంది. మేము అక్కడ ఉన్నంత సేపట్లో ఆ పిల్లని ఎత్తుకోని వాళ్ళు లేరు. నాకు తెలిసి ఆ పిల్ల కాలు క్రింద పెట్టలేదనుకుంటా. ఆ పిల్ల వయస్సు దాదాపు ఓ ఆరు లేదా ఏడు ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి తండ్రికి ఎయిడ్స్ వచ్చి పోయ్యాడు. పోతే పోయ్యాడు, (యదవ..) పోతూ పోతూ ఆ జబ్బుని తన భార్యకి అంట గట్టి పోయ్యాడు. వాడు పోయిన తరువాత ఆ తల్లి ఈ పిల్లని తీసుకుని ఈ శరణాలయానికి వచ్చి ఈ పిల్లని చేర్చిన ఓ రెండు నెలలకు తనూ చనువు చాలించింది. అందువల్ల ఈ పిల్లకి తన అనే వాళ్ళు ముద్దు ముచ్చట చేసే వాళ్ళు లేని తరుణంలో మేమంతా కనబడేటప్పటికి ఆనందం ధుఃఖం రెండూ ఒకేసారి వచ్చేసాయి. సరే అది వేరే కధ.


ఇక అసలు విషయానికి వస్తే.. సదురు సో కాల్డ్ దేవుడు అనేవాడుంటే.. నేను ఒకే ప్రశ్న వేయ దలచాను. అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు ఎయిడ్స్ ఆంటి ప్రాణాంతక వ్యాధుల భారిన పడి బలైతున్నారు. వీళ్ళేం పాపం చేశారని వీళ్ళకీ శిక్ష? ఒక వేళ వీళ్ళకి ఇలాంటి వ్యాధులు లేక పోయినా, ఇలా అనాధలని ఎందుకు చెయ్యాలి? ఇలా జీవితాంతం ప్రేమానుభవాలకు దూరంగా పెరగాల్సిందేనా!! ఇలా అనునిత్యం ఎంతో మంది చిన్నారులను ప్రేమానురాగాలకు దూరంగా బ్రతకమని తలరాత వ్రాసే దేవుడు నిజంగా దేవుడేనా?? ఎంతటి దుర్మార్గుడో సదురు దేవుడు!!

 

వీళ్ళని తీసి ప్రక్కన పెడదాం. దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటప్పుడు కూడా మౌనం వహిస్తున్న దేవుడు ఒక దేవుడేనా?? దేవుడనేవాడుంటే అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలుతున్నప్పుడు ఎక్కడున్నాడు? వేలకు వేల మంది జనాభా చనిపోతున్నప్పుడు ఎక్కడున్నాడు? ఇరవయ్యో శతాభ్దంలో స్మాల్ ఫాక్స్ (అమ్మోరు) అనే వ్యధి భారిన పడి అచ్చంగా ముప్పై కోట్ల మంది చనిపోయ్యారే!! అప్పుడెక్కడున్నాడు ఈ దేవుడు? 2004లో వచ్చిన సునామి 2,29,866 మంది ప్రాణాలు తీసేస్తే ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఓ!!! కమలహాసన్ తీసిన దశావతారం అనే సినిమాని చూడాల్సిందే అంటారా!! 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ద్వారా ప్రపంచం మొత్తం మీద దాదాపు యాభై లక్షల మంది చనిపోయ్యారే!! మరి వీరేందుకు పోయ్యారబ్బా!! అనునిత్యం ఎన్నో మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో సదురు దేవుడేమి చేస్తున్నాడు?

 

ఇవన్నీ ఒక ఎత్తైతే కరువు కాటకాలతో దేశానికి దేశాలే అన్నమో రామ చంద్రా అంటూ అలమటిస్తున్నాయే, మరి వారి మాటేమిటి? వారందుకు భాధ పడాలి? ఏం మాయలు మంత్రాలు వచ్చిన బాబాలు చాలామంది మన దేశం లోనే ఉన్నారుగా!! వారంతా పోయి సదురు దేశాలలో ఉండి బంగారాన్ని శృష్టించి వారి దేశంలో పేదరికం అనేది లేకుండా చెయ్యొచ్చు కదా!! ఏం? సదురు మాయలు మంత్రాలు ఆ దేశ కాల మాన పరిస్థులలో పనిచెయ్యవా !! లేక మరింకేదైనానా!!?? కంబోడియాలాంటి దేశాల గురించి ఎందుకు గానీ మన దేశాన్ని ముందు బాగు చెయ్యొచ్చు కదా.. పుష్కలంగా వానలు కురిపించొచ్చు కదా!!?? పాడి పంటలతో చల్లగా ఉండేటట్లు దీవించొచ్చు కదా..

ఇదంతా ఓ బోగస్.. మరి మీరేమంటారు?

7 కామెంట్‌లు:

teresa చెప్పారు...

ఏవిటీ ఈ మధ్య దేవుడి మీద విరుచుకు పడుతున్నారూ??
ఆ పాపనో, అలాంటి పాపనో తెచ్చి పెంచుకోవచ్చుగా!!

Kathi Mahesh Kumar చెప్పారు...

ఈ అసహనంలోంచే సమాధానం కావాలి.

ఓ బ్రమ్మీ చెప్పారు...

తెరెసా గారు,

దేవుని విషయంలో మరి కొంతకాలం నా బ్లాగుని ఫాలో అవ్వల్సిందిగా మనవి. ఇక ఆ పిల్ల విషయానికి వస్తే, ఈ మధ్య దత్తత కార్యక్రమంలో మూడు సంవత్సరాల IT రిటర్న్స్ చూపిస్తేనే నాకు ఆ పాపను సాకే సంపాదన ఉంటుంది అని ప్రభుత్వం ఓ నియమం విధించింది. అందునా నాలాంటి బ్రమ్మీ గాళ్ళకు అస్సలు ఇయ్యోద్దని అనధికార ఉత్తఱువు. అందువల్ల నా ప్రయత్నాలు వికటించాయని (సభా ) జాలం ముఖంగా తెలియ జేయడమైనది.

స్పందించి నన్ను ప్రశ్నించినందులకు ధన్యవాదములు

ఓ బ్రమ్మీ చెప్పారు...

కత్తి మహేష్ కుమార్ గారు,

స్పందించి నందులకు నెనరులు. అస్సలు సమాధానం అనేది ఉందా!! లేక అంతా ఉత్తుతినే అంటారా?

అజ్ఞాత చెప్పారు...

దేవుణ్ణి మనోచింతనకి, ఆత్మ సంతృప్తికి పరిమితం చేయాలిగానీ, ఇలా భౌతికమైన మానవ తప్పిదాలకు భాద్యుణ్ణి చేస్తారేమిటండీ... BTW ఈ chess gadget బాగుంది. నేను కూడా add చేసుకున్నా.

జ్యోతి చెప్పారు...

ఏంటి సంగతి??దేవుని మీద విరుచుకుపడుతున్నావు. అంతా మంచి జరిగితే దేవుడున్నట్టా?? తెలీకుంటే తెలుసుకోవాలి. శోధించాలి, ప్రశ్నించాలి, విమర్శించాలి గాని ఇదేంటి దూషించడం?? సమాధానం దొరికేస్తుందనే?? అలాంటప్పుడు నువ్వు యాత్రలకు ఎందుకువెళుతున్నావు? పిక్ నిక్ కోసమా??

అజ్ఞాత చెప్పారు...

అంటే ... జనాలని చావనివ్వద్దు అంటారా!!! భూమ్మీద పుట్టినవాళ్ళంతా అందరు బతికుంటే ఒక్కసారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించుకోండి!! ఇదంతా ఎకాలజి. ఒక పద్ధతి ప్రకారం జరిగే చక్రం. చావుకి రకరకాల కారణాలు.

ఇంతకీ మీరు దేవుడున్నాడా లేదా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారా.. లేక లేడు అని ప్రూవ్ చెయ్యబోతున్నారా...
ఏదైనా మంచిదే!!! మాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కానివ్వండి!!!

 
Clicky Web Analytics