19, ఫిబ్రవరి 2009, గురువారం

పిల్లలూ! మీకో లేఖ..

మీరు రోజులు పసిగొడ్డుగా ఉన్నప్పుడు,

తెరిచీ తెరవని అరమోడ్పు కళ్ళతో (మమ్మల్ని) చూస్తుంటే, అన్నీ మరచిపోయే ఓ తల్లి వ్రాసే లేఖ..

మీకు నెలలు నిండుతూ మొదటి సంవత్సరం పుట్టిన రోజునాడు మీరు ఏవేవో శభ్దాలు చేస్తూ ఉంటే, మురిసిపోయే ప్రతి తండ్రీ వ్రాసే లేఖ..

మీకు నామకరణం చేసి, మా పేరును మీకు ఆపాదించినందుకు.. అలాగే మా స్వార్దాన్ని మీ ద్వారా చూపించుకున్నందుకు, మమ్మల్ని శిక్షించకండి..

మీకు ఎలా అక్షరాభ్యాసం చెయ్యాలి.. ఏ  చదువు చదివించాలి.. ఏ పాఠశాలైతే భవిష్యత్తు చదువుకు బాగుంటుంది.. వంటివి  కూడా మేమే నిర్ణయించి, చదివే బడిని కూడా మేమే ఏకపక్షంగా నిర్ణయించి నందులకు, మమ్ములను ఈ వృధాశ్రమంలో ఏకాకులను చేసి శిక్షించకండి..

మీరు కష్టపడి పరుగెత్తి పరుగు పందెంలో బహుమతులు తెస్తే, అది చూసి మురిసి పోయి, “నా బిడ్డ..” అంటూ అక్కడ కూడా ఆ గొప్పదనాన్ని మాది అని, మీ శ్రమను కొట్టేసిన మమ్ములను ఈ కడపటి పయనంలో ఒంటరిని చేసి ఇక ఇప్పుడు మీరు పరుగెత్తండి చూద్దాం అని శిక్షించకండి..

పాఠశాల చదువులు పూర్తై కళాశాల చదువుల విషయానికి వచ్చినప్పుడు, “అమ్మా నాకు లెక్కలు అర్దం కావటం లేదు.. నాన్నా నేను సైన్సు తీసుకోను..” అన్నా వినకుండా, మిమ్ములను మంచి చదువు చదివించాలన్న తాపత్రయంలో, ఇప్పుడు మీకు కాసులు కురిపించే చదువులను మీ చేత అతి కష్టం మీద (మా బలవంతం మీద మీకు) రుబ్బించినందులకు, మమ్ములను ఈ ఙ్ఞాపకాల బడిలో పాత శ్మృతులను నెమరు వేయ్యమంటూ శిక్షించకండి..

కళాశాల చదువులు పూర్తై విశ్వవిధ్యాలయాలలో విధ్యనభ్యశించే విషయంలో పరదేశానికి వెళతానన్నప్పుడు, మాకు దూరంగా వెళ్ళిపోతావా అన్న మాభయం.. మాకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి అన్న మా స్వార్దం మీకు కనబడనీయ్యకుండా, ఆర్దికంగా కొంచం కష్టమైన పని అయినా సంతోషంతో పరదేశానికి పంపించిన మమ్ములను ఆర్ధికంగా అన్నీ ఇస్థున్నాంగా అంటూ శిక్షించకండి..

మాకు నచ్చే పిల్లని లేదా పిల్లాడిని చేసుకుంటారు అని అనుకునేంతలో, “అమ్మా!! ఇదిగో మీ కోడలు..” అనో.. “నాన్నా!! నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను..” అంటూ మన కుటుంబ సంస్కృతి ఏమిటో తెలియని వాళ్ళని తెచ్చినప్పుడు మేము కించిత్తు భాధ పడ్డ మాట నిజమే అయినా మీ జీవితానికి మేమెప్పుడూ అడ్డు కాదే, మాతో ఒక్క సారి సంప్రతిందించి ఉంటే బాగుంటుంది కదా అని మేము భాధ పడ్డాము అని చెప్పినందుకా మా కీ శిక్ష..

ఏది ఏమైనా.. ఒక్క మాట.. ఒక్క విన్నపం.. ఒక్క వేడుక..

జీవితం చాలా పెద్ద ప్రయాణం. చివ్వరి దాకా మనం ఇరువురం కలసి ప్రయాణించలేం.. కానీ, ఈ పెద్ద ప్రయాణంలో..

మాకు వయస్సు ఉన్నప్పుడు మీకు మేము చేయూత.. మాకు వయస్సు ఉడిగినప్పుడు మీరు మాకు చేయూత..

కనీసం రోడ్డు దాటేటప్పుడైనా మా చేయ్యి పట్టుకోండి.. ఈ కట్టేను మోసేందుకు మాత్రమే కాదు మీరు మాకు కావల్సింది.. ఈ కట్టే తుళ్ళి తూలి పడకుండా నిలిపేందుకు మీ ఆసరా కావాలి.

తల వాల్చి కన్ను మూయ్యడానికి మీ భుజం కావాలి..

కన్ను తెరిస్తే పలకరించడానికి మీరు కావాలి..

కావాలి.. మీరు కావాలి.. తిట్టేందుకైనా.. కొట్టేందుకైనా.. పెట్టేందుకైనా.. పెట్టించేందుకైనా.. మీరే కావాలి..

వస్తారు కదూ..

రెండు + రెండు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం..

2 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

చాలా బాగుంది. అమ్మా నాన్న ఏమి చేసినా నా మంచికే అని బలం గా నమ్మేదాన్ని ఒక్కోసారి నేను కూడా వాళ్ళ అతి ప్రేమ తట్టుకోలేక బాధపడ్డాను. పెద్దవాళ్ళవుతున్న కొద్దీ మనమీద ఆధారపడుతున్నారు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, ఇన్నాళ్ళ వాళ్ళ పాత అలవాట్లని మన స్పీడు కు తగ్గట్టుగా మార్చుకోలేక కష్టపడుతూ వుంటారు. అమ్మా నాన్నలతో డీల్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా వాళ్ళు సున్నిత మనస్కులైతే చాలా దిగులు పడతారు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

అక్షర లక్షలు...

 
Clicky Web Analytics