అమెరికాలో నాకు నచ్చని మరో మూడు అంశాలు. అమెరికా అంటే ఇష్టం ప్రేమ అభిమానం తొక్క తోటకూర వంకాయ్ బెండకాయ్ గాడిద గుడ్డు గోంగూర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఈ పుటని చదవవద్దని మనవి. ఎందుకంటే ఇవి నాకు అనిపించిన నిజాలు. అవి మీకు నిష్టూరంగా మరియు వెటకారంగా అనిపిస్తాయి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న.
మొదటిది.. ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో చేస్తారు. అసలు విషయానికి వద్దాం. ఇక్కడ నీరు సంవృద్దిగా దొరుకుతుంది. అందువల్లన వీరి ప్రకృతి సంపద చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చక్కటి చెట్లు మంచి రోడ్లు. శీతాకాలం వస్తే మోకాలు ఎత్తుకు మంచు. అన్నీ బాగుంటాయి. అందువల్ల వీరు నీటిని చాలా శుద్ది చేసి వాడుకుంటారు. ఎంత శుద్ది చేసి అంటే, అచ్చంగా కుళాయి నుంచి వచ్చే నీటిని మనం యధావిధిగా త్రాగేయవచ్చన్నంతగా. నీరు ఇంత బాగా దొరుకుతున్నా, అన్ని పనులకు నీటిని వీరు వాడుతున్నా అసలైన చోట మాత్రం వీరు నీటిని వాడరు. ఎక్కడంటారా.. అదే అక్కడికే వస్తున్నా.. అది మల విశర్జన చేసి అశుద్దం అంటిన శరీరాన్ని నీటితో కడగరు సరికదా కాగితంతో తుడుచుకుని బయటకి వచ్చి, *డ్డిని నీటితో కడుక్కోరు కానీ *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు. అసలు అలాంటి చోట నీళ్ళను ఏర్పాటు చేసుకోరు. ఏమైనా అంటే కాగితంతో తుడుచుకున్నాంగా అంటారు.
అలాగే ఈ కాగితాన్ని తయారు చేసే కంపెనీలు విపరీతమైన రీసెర్చ్ చేసి మా కాగితంలో పది శాతం మాయిశ్చర్ ఉంటుంది, దీనితో కనుక మీరు తుడుచుకుంటే అది అచ్చంగా నీటితో కడిగినంత స్వఛంగా ఉంటుంది అని ప్రకటనలు చేస్తాయి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ చక్కగా నీటితోనే కడుక్కోవచ్చు కదా అంటే, అందరూ చేసింది మేము చేస్తే ఇక మా స్పెషాలిటిటీ ఏంటి? అని ఎదురు ప్రశ్నిస్తారు.
వీళ్ళలాగే వీళ్ళ పిల్లలు కూడా, నేను ఉంటున్న హోటల్లో నేను గమనించినది ఏమిటంటే.. ఉదయం నిద్ర లేవంగానే తినడానికి ఏమి ఉంది అంటూ క్రిందనున్న బ్రేక్ ఫాస్ట్ స్థలానికి వెళ్ళి ఏదో నోటికి పట్టినంత కుక్కుకుని ప్రక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. ఆడినంత సేపు ఆడి ఆ తరువాత మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తారు. మరి శారీరక శుబ్రత వంటి వాటి విషయాలేమిటంటే, గాడిద గుడ్డేం కాదు అంటూ మనల్ని వెధవల్ని చేస్తారు.
ఇక రెండవ విషయానికి వస్తే అది.. పెళ్ళి .. ఇక్కడ నేను కలిసిన ప్రతీ అమెరికన్ని కదిపితే, మగాడైతే ఇలా అంటూ ఉంటాడు.. "నా మొదటి పెళ్ళాం .. ఇప్పుడున్న పెళ్ళాం.. రేపు కనుక విడిపోతే మరో పెళ్ళాం .." ఇలా అనే వాడికి ముడ్డి క్రిందకి యాభై ఏళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు కూడా వీడికి కొత్త పెళ్ళాం కావల్సివస్తే, అమ్మాయిల పని మరోలా ఉంటుంది. నా మొదటి బాయ్ ఫ్రండ్ నా రెండో పెళ్ళికి వచ్చి త్రాగి తందనాలాడి తతంగం చేస్తే నా మొదటి మొగుడు వీడ్ని పట్టుకుని చితకొట్టాడు.. అంటారు. ఇవన్నీ ఏదో ఉత్తుత్తి వ్రాతలు అని మీరనుకుంటే ఈ మధ్య ఓ మాస్ మైల్ నాకు భలే నవ్వు తెప్పించింది. అదేదో పాత కమల హాసన్ సినిమాలో ఉన్నట్టుంది. ఆ మైల్ లోని సారంశం. వీలైనంత విపులంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.. ఒక వేళ అర్దం కాకపోతే వదిలేయ్యండి. స్టోరి ఇలా సాగుతుంది
నేనెవ్వరు? మీకు తెలిస్తే చెప్పండి. . . . ఈ మధ్యకాలంలో నేనో విదవరాలితో కలసి సహజీవనం కానిస్తూ ఓ బిడ్డను కనే ఆలోచనలో ఉండగా ఆ విదవరాలి పెద్దమ్మాయి ఎవ్వరినో ఇష్ట పడి ఆపై కష్టపడి ఓ పిల్లని కన్న తరుణంలో ఆ పుట్టిన బిడ్డ శాక్షిగా పెళ్ళి చేసుకుంటున్నాను మీరు రావాలి అని మా ఇద్దరికి వెడ్డింగ్ కార్డ్ పంపింది. తీరా వెళ్ళి చూస్తె ఆ పెళ్ళి కొడుకెవ్వరో కాదు నాకు జన్మనిచ్చిన బయలాజిలక్ తండ్రి. అంటే నా తండ్రికి నేను ఇప్పుడు మామగారినన్నమాట మా నాన్నకు పుట్టిన ఆ బిడ్డకి నేను తాతనా లేక అన్ననా.. నా నాన్న నాకు అల్లుడా లేక నేను డేటింగ్ చేసే విధవరాలి కూతురు భర్తగా నా పెళ్ళాం కూతురు మొగుడైతే నాకు అల్లుడౌతాడు కదా .. అలా అల్లుడా లేక ..
ఇలా సాగుతుంది వావి వరుస లేని వీరి వృత్తాంతం. ఈ మధ్య ఇక్కడ జరిగే చెర్చి పెళ్ళిళ్ళలో అక్కడి ఫాదర్ ఈ విధంగా అడగటం మొదలు పెట్టారు..
ఫాదర్ అమ్మాయితో : ఏమ్మా!! జాన్ అనే ఈ అబ్బాయితో నీకు నచ్చినంత కాలం నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈయన ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అమ్మాయి : అవును..
ఫాదర్ అబ్బాయితో : ఏరా!! జాకీ అనే ఈ అమ్మాయితో నీకు నచ్చినంత కాలం / నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈమె ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అబ్బాయి : అలాగే కానీయ్యండి
వీళ్ళిద్దరు చెర్చి బయట ఇలా ఈ ఎగ్రిమెంట్ కి వచ్చి ఉంటారు. నాకు నీకు పిల్లలు కలిగితే మొదటి ఐదేళ్ళు నేను పెంచుతానని అమ్మాయి ఒప్పుకుంటే మరో ఐదేళ్ళు అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ తరువాత పుట్టిన పిల్లలకు యుక్త వయసొచ్చింది కాబట్టి వాడి సంపాదన వీళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి అచ్చోసిన ఆంబోతులా వదిలేద్దాం. ఆ తరువాత మనమిద్దరం మరొకళ్ళని తగులుకుందాం .. వాకే!! అని ఒక ఎగ్రిమెంట్కి వచ్చుంటారు.
ఇక్కడ నేను వ్రాసేవన్నీ ఉత్తుత్తి వ్రాతలనుకునేవారు ఎప్పుడైనా ఒక నేటివ్ అమెరికన్ వ్యక్తిగత జీవితం ఏమిటో అడగండి అప్పుడు బయట పడుతుంది అస్సలు విషయం. ఇక్కడ ఓ పదేళ్ళు కలసి కాపురం చేసాము అన్నామంటే అదో గొప్ప విషయం అలాగే ఓ వింత విషయం కూడా.. ఇదే సంస్కృతి ఇప్పుడు మన దేశానికి దిగుమతి అయ్యి మన జీవనంలో ఓ చీడపురుగౌతోంది. ఆ విషయం గురించి మరో సారి.
ఇక ఈ పుటకి ఆఖరి పాయింట్.. అప్పాయింట్ మెంట్స్.. ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలోని ఓ ఉద్యోగి తండ్రి మరణించిన విషయాన్ని నాతో చర్చిస్తూ ఇలా అన్నాడు..
.. మానాన్న ఫలాన రోజు ఉదయం పది గంటలకు హృదయ స్పందన ఆగిపోవడం వల్ల హాస్పిటల్లో కాలం చేసారు, ఆరోజు మాకు లంచ్ ఎప్పాయింట్ మెంట్ ఉంది కదా అని నేను అక్కడకు చేరుకుంటే ఇంట్లో ఎవ్వరూ లేరే!! కనీసం నాకు చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళుతున్నారు అని. విషయం ఏమిటో అని తెలుసుకుందాం అని మా చెల్లెలికి ఫోన్ చేస్తే చావు కబురు చల్లగా అప్పుడు చెప్పింది ..
పైన వ్రాసిన పేరా ద్వారా చదివే వాళ్ళకు ఏమి అర్దం అయ్యిందో గాని నాకు మాత్రం ఓ విషయం అర్దం అయ్యింది. తండ్రితో కలసి భోజనం చెయ్యాలంటే కొడుకులకు అప్పాయింట్‍మెంట్ కావాలని. ఇలాగయితే ఈ క్రింద చెప్పబోయే మాటలు నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టదేమో!!
ప్రియమైన పెళ్ళానికి ఓ అమెరికన్ మొగుడు వ్రాయునది,
వచ్చే శనివారం సాయంత్రం ఏడు గంటలకు హిల్టన్ హోటల్లో మన ఇద్దరికి డిన్నర్ ఎరేంజ్ చేస్తున్నాను. ఓ గంటకి నాలుగు వందల డాలర్లు. ఇందులో రెండు వందల యాభై డాలర్లు నేను పెట్టుకుంటా మిగిలిన నూట యాభై డాలర్లు నువ్వు పెట్టుకోవలసి వస్తుంది. మనకు కేటాయించిన గంటలో ఓ అరగంట భోజనం చేస్తూ ఈ క్రింద వ్రాసిన లిస్టులోని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం మిగిలిన అరగంట సంసారం చేద్దాం. ఇందుకు నీకు ఇష్టమైతే ఈ మీటింగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి లేక పోతే కాన్సిల్ కానీ / క్రొత్త ప్రపోజల్‍ని పంపించు.
మనం మాట్లాడుకోవాలని నాకు అనిపించిన విషయాల లిస్ట్
౧) మనకు పిల్లలు పుడితే ఎవ్వరెంతకాలం సాకాలి, సాకినందుకు ఎవ్వరు ఎవ్వరికి ఎంత ఇవ్వాలి
౨) ఎవ్వరెవ్వరికి ఏ ఏ కార్లు ఉన్నాయి, వాటిని ఎవ్వరు తయ్యారు చేసారు, వాటి ఇన్‍స్యూరెన్స్ ఎంత
౩) సంవత్సరాంతంలో వచ్చే వెకేషన్ ఎక్కడ జరుపుకోవాలి మరియు ఎంత ఖర్చు పెట్టాలి
ఇవి కాకుండా నీకేమైన ఉంటే ముందుగా నాకు తెలియ జేయి, నేను కొంచం ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాను.
ఇక ఉంటాను
లవ్యా
ఇక మీ టైం మొదలైంది.. దేనికంటారా, స్పందనలకు.. ఆఖరుగా మరో విషయం మర్చిపోయ్యాను. ఇవ్వాళ 13th అందునా శుక్రవారం.. దీని వెనకాల మరో ఇస్టోరి.. అప్పటిదాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను.