19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉచిత విధ్యాలయం

మొదటి రెండు పుటలు నా కలల సౌధానికి రూప కల్పన చేస్తే.. ఈ పుట ద్వారా, ఉచిత విధ్యాలయం ఎలా ఉండాలను కుంటున్నానో తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.
పేరు చెప్పినట్లుగా, ఇక్కడ పూర్తిగా ఉచితం.. విధ్య మాత్రమే కాకుండా, విధ్యార్ధనకు అవసరమైన అన్నీ ఉచితమే అని అర్దమన్నమాట. ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఉండేటటు వంటి ఒకే ఒక అర్హత, ’చదువుకోవాలి అని అనుకోవడమే’.. ఏంటీ కొత్తగా.. కొంచం అర్దం కానట్లుందా.. ఈ బడిలో చేరాలనుకునే పిల్లలకు స్వతహాగా ఆ ఆలోచన ఉండాలి అన్న మాట. ఏంటిది .. పిల్లలు స్వతహాగా అలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం రావచ్చు. కానీ పిల్లల ఆశక్తి దేనిమీద ఉందో తెలుసుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అలాగే నాకంటూ కొన్ని పరిక్షలు ఉన్నాయి. అవి సశాస్త్రీయమైనవో కాదో నాకు తెలియదు కానీ అవి నాకు ఫలితాన్నిచ్చాయి. ఆ పద్దతులను నేను పలు పిల్లలపై విశ్లేషించినప్పుడు నేను ఆశించిన ఫలితం వచ్చింది. అలాగే వారు ఆ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు.
కొంతమంది పిల్లలలో చదువంటే ఆశక్తి ఉంటుంది, మరికొంత మంది పిల్లలలో ఆటలంటే ఆశక్తి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా అలాగే అందరూ ఐన్ స్టీన్ అవ్వాలనీ ఎక్కడా వ్రాసి లేదు. కొందరు విశ్వనాద్ ఆనంద్ లాంటి వారులాగా తయ్యారయ్యితే మరికొందరు జెస్సీ ఒవెన్స్ లాగా తయ్యారు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీరందరికీ కావాలసినది అల్లా ఒక్క చేయూత మాత్రమే. అదేదో సినిమాలో చెప్పినట్టు .. ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. అవకాశం మాత్రమే కావాలి. నాకు తెలిసినంత వరకూ అదేదో తెలుగు సామెత చెప్పినట్టు, జింక చిక్కిందంటే పరుగెత్త లేక కాదు కాలం కలసి రాక .. అలా కాలం ప్రతీ ఒక్కరికీ కలసి వస్తే ప్రతీ వ్యక్తి ఓ మహర్షి అవుతాడు అని నేను నమ్ముతాను.
అవకాశం రాకే ప్రతీ వ్యక్తి పనికిరానివడౌతాడని నా నమ్మకం. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎంతమంది వచ్చిన అవకాశాలను ఒదులుకుంటున్నారో (అని వ్రాయడం కన్నా జారవిడచుకుంటున్నారో అని వ్రాయడం ఇక్కడ సమంజసంగా ఉంటుంది) నాకు తెలుసు. అలా అవకాశాలు రాక కొందరు నిర్జీవులైతే.. వచ్చిన అవకాశాలను కాలరాచి మరికొందరు నిస్తాణువులై ఏమి పట్టనట్టు మిగిలిపోతున్నారు. వీటన్నింటికీ కారణం చిన్న వయస్సులో పడాల్సిన మంచి నాట్లు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు గనక మంచి చదువు లేదా మంచి నడవడిక అలవాటైతే వారి భావితరం బాగా వర్దిల్లుతుందని నేను నమ్ముతాను.
ఇలా చిన్న వయస్సులో మంచి నడవడిక, మంచి చదువు, ఇక్కడ చదువు అంటే పుస్తకాలకు పరిమితమైనటువంటిది మాత్రమే కాదు సుమా.. కనుక మనం నేర్పగలిగితే భావితారాలకు ఎంతోకొంత మేలు చేసిన వారం అవుతామని నా అభిప్రాయం. ఇక విద్యాలయం విషయానికి వస్తే.. ఇక్కడ పూర్తిగా గురుకులం పద్దతిలో ఓ సుశిక్షుతుడైన యోధుడు ఎలా క్రమశిక్షణగా పెరుగుతాడో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ కనబడాలని నేను కలగంటున్నాను. ఈ రోజునాటికి నాకు ఉన్న ఆలోచన ఈ విధంగా సాగింది, మరి రేపటి విషయమేమిటో.. నా పాఠశాలలో నేను జరపాలనుకునే దినచర్య ఈ విధంగా ఉంటుంది. మార్పు చెందవచ్చు..
 • వేకువఝామున, సూర్యోదయానికి ముందుగా పిల్లలు నిద్రలేస్తే.. సూర్యోదయం తరువాత ఓ గంట సమయానికల్లా చక్కగా తయ్యారై బ్రేక్ ఫాస్ట్ చేసేచోటికి చేరుకుని ఓ అరగంటలో తృప్తిగా తిని ఆటలాడుకోవడానికి వెళతారన్నమాట
 • ఇలా ఆటలాడుకోవడానికి వెళే సమయం దాదాపు ఏడు గంటలవుతుంది. ఇలా ఆటలాడడానికి వెళ్ళిన పిల్లలు ఓ రెండు గంటల పాటు ఆటలాడి తొమ్మిదిన్నర కల్లా చక్కగా  వారి వారికి ఏర్పరిచిన స్థలాలోకి చేరి ఓ కడివెడు పాలు త్రాగి పది గంటలకల్లా స్నానపానాది కార్యక్రమాలు ముగించుకుంటారు.
 • పదిన్నర లేదా పదకొండు గంటలకల్లా చదువు మొదలు
 • ఒంటిగంటకు భోజనం
 • రెండుగంటకు తిరిగి చదువు మొదలు
 • నాలుగున్నరవరకూ చదువు ఆ తరువాత ఫలహారం
 • ఐదునుంచి ఏడు వరకు మళీ ఆటలు
 • ఏడునుంచి ఎనిమిది వరకూ విశ్రాంతి
 • ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య రాత్రి భోజనం
 • తొమ్మిదిన్నర నుంచి ఎవ్వరిస్టానుసారం చదువు లేదా నిద్ర
 • ..
ఎలా ఉంది నా ఆలోచన..?

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది సార్ ..

చదువు కోవడానికి అర్హతను మారిస్తే బాగుంటుంది ..

ఇష్టం వెంటనే కలుగదు .. దిగితే గాని లోతు తెలియనట్టు ..

మొదట చదువు కోవడం వలన లాభాలు ఏమిటో తెలుసుకొనేలా చేసి, కొంత టైం ఇచ్చి, మీరు నిర్వహించాలనుకున్న టెస్ట్ పెట్టండి.

snkr చెప్పారు...

ఉచిత భోజనము, ఫలహారము ఇచ్చే ఏ స్కూల్ ఐనా నాకు ఎందుకో తెగ నచ్చుతుంది. నాకు మీ స్కూల్ లో చేరి నాకు రాని ఓనమాలు( జ్యోతిష్కుడు చెప్పాడులేండి) నేరుచుకోవాలనుంది. మీ స్కూల్ ఎక్కడుందో చెబుతారా? :))

అజ్ఞాత చెప్పారు...

మీ స్కూల్లో ఉచిత భోజనం ఎలా ఉన్నా, మాంఛి తెలుగు టీచర్ని పెట్టాలి.

విధ్యాలయం ఏమిటండీ విధ్యాలయం?

ఆశక్తి( ఏ శక్తి?)

సుశిక్షుతుడు-సుశిక్షితుడు

Rao S Lakkaraju చెప్పారు...

మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వీలుని/అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు చేసి ఆచరణ చేయవచ్చు. చిన్న చిన్న సంగతులు పట్టించు కుంటే పెద్ద పనులు చెయ్యలేము. గుడ్ లక్.

 
Clicky Web Analytics