14, అక్టోబర్ 2010, గురువారం

నా పోర్ట్ ఫోలియోలో నష్టాల షేర్లు

ఈ మధ్య మన షేర్ మార్కెట్ భలే పరుగెడుతోంది. ఇవ్వాళ్ళ ఆల్ టైం హై చేరుకుంది. సన్సెక్స్ గరిష్టంగా 20710 వద్దకు చేరుకోగా నిఫ్టీ 6239 కు చేరుకుని రికార్డులు బద్దలు కొట్టాయి. ఇంత జరుగుతున్నా నా పోర్టు ఫోలియోలో రెండు స్టాక్స్ మాత్రం నాకు నష్టాన్ని చూపిస్తున్నాయి. వాటిల్లో మొదటిది NHPC రెండవది రిసర్గీస్ మైన్స్. వీటి ద్వారా నేను నష్ట పోయింది పెద్దగా లేదు కానీ ఎందుకో ఈ రెండు షేర్లలో పెద్దగా చలనం కనబడటం లేదు.

NHPC షేర్ ద్వారా నేను 1400/- నష్టపోతే, రిసర్గీస్ ద్వారా 2100/- రూపాయలు నష్టపోయ్యాను. మొత్తం మీద 3500/- నష్టం ఈ నాటి లెక్కల ద్వారా. ఈ రెండు షేర్స్ కొనడానికి నా దగ్గర ఉన్న జెస్టిఫికేషన్ ఏమిటంటే ఫండమెంటల్స్ బాగుండటం మాత్రమే కాకుండా మార్కెట్లో వీటి ధర నాకు అందుబాటులో ఉండటమే. నేను పెద్ద పెద్ద షేర్స్ పైన ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేను కాని చిన్న చిన్న కంపెనీలపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట.

వివరాల్లోకి వెళ్ళే ముందు షేర్స్ పై నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానో చెబితే ఈ రెండు షేర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసానో మీకు అర్దం అవుతుంది. షేర్స్ లో నేను పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి నాకు పదేళ్ళ తరువాత పనికి వచ్చే ఆదాయం అన్న ఉద్దేశ్యంతో స్వల్ప కాల వ్యవధి కాకుండా దీర్ఘకాల ప్రణాళిక అన్నమాట. అందువల్ల ప్రస్తుతం ఉన్న బుల్ మార్కెట్లో నేను లాభాలను దండుకోవటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే..

NHPC, భారతదేశం లోని మొట్ట మొదటి హైడ్రో పవర్ సృష్టించే కంపెని. ఇందులో ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానిదే. లాంగ్ రన్ లో ఆలోచిస్తే ఎప్పుడో అప్పుడు ఇది ప్రవైట్ పరం అవ్వక పోదు అప్పుడు ఇది లాభాల బాట పట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్నాను. ఇవి కొని ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతోంది. అయినా వీటి విలువ పెరగటం లేదు. అయినా ప్రస్తుతం నాకు ఈ డబ్బులు అవసరం లేదు కాబట్టి వీటి గురించి పట్టించుకోనవసరం లేదు.

రిసర్గీస్ వారి ప్రస్తుత ముఖ విలువ రూపాయి కాగా మార్కెట్ విలువ 2.35/- రూపాయలుగా ఉంది. కొంతకాలం క్రిందట వీరి షేర్ ముఖ విలువ పది రూపాయలుగా ఉన్నప్పుడు వీరి మార్కెట్ విలువ డెభైఅయిదు రూపాయలుగా ఉండేది. అప్పుడు ఈ కంపెనీ వారు షేర్ని స్ప్లిట్ చేస్తున్నారు అన్న సమాచారం మరియు ప్రతీ ఒక్క షేర్ కి బోనస్ గా రెండు షేర్స్ ఇస్తున్నారు అన్న వార్త నన్ను ఈ షేర్ని కొనేటట్టు చేసింది. అన్నట్టు గానే స్ప్లిట్ మరియు బోనస్ వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ షేర్ నష్టాలలో సాగుతోంది.

5 వ్యాఖ్యలు:

అనిర్విన్ చెప్పారు...

Thanks for sharing, Happy investing.

కొత్త పాళీ చెప్పారు...

Interesting.
స్పష్టంగా నిర్దుష్టంగా చక్కగా రాశారు. మీకు స్టాక్సు గురించి మార్కెట్ గురించి ఆసక్తి ఉంటే ఆ విషయాలు క్రమంగా రాయొచ్చు కదా. అంటే ఫలానిది కొనండి, లాంటి ప్రత్యక్ష సలహాలు కాకుండా, అసలు మొత్తమ్మీద మార్కెట్ని ఎలా చూడాలి, ఒక స్టాకుని ఎలా బేరీజువెయ్యాలి - ఇలాంటి విషయాలు తెలుగులో ఎక్కువగా ఉన్నట్టు లేదు.

చక్రవర్తి చెప్పారు...

అనిర్విస్ గారు,

పెట్టుబడులు ఆనందదాయకంగా ఉండాలి అని విష్ చేసినందులకు నెనరులు. అలాగే చేస్తానండి.

కొత్తపాళిగారు,
మీరు ఇకపై స్పందించరనుకున్నాను. నా అంచనాలను తలక్రిందులు చేస్తూ స్పందించారు. ధన్యవాదములు. మీకు తెలుసు నాకు తెలుగే సరిగ్గా రాదని, అలాంటిది ఇప్పుడిప్పుడే కొంచం జాగ్రత్తగా వ్రాయ ప్రయత్నిస్తున్నాను. అందునా మీరు ఉదహరించినటువంటి విషయాల గురించి వ్రాయాలంటే, విషయ జ్ఞానం మాత్రమే సరికాదు కాని సరళీకృతమైన భాష అలాగే చదివే వారిని ఆకట్టుకునేంత నేర్పరి తనం కావాలి. అన్నింటికీ మించి భాషపైనాకు అంత పట్టు కూడా లేదు. అయినా మీ సలహాని మర్చిపోను. ప్రయత్నిస్తాను.

Sheshu Kumar Inguva చెప్పారు...

for me 17k loss in nhpc, junk no 1 stock.

చక్రవర్తి చెప్పారు...

శేషు కుమార్ గారు,

హమ్మో !! పదిహేడు వేలా.. చూడాబోతే మీరు పెద్ద ఇన్వెస్టర్ లా ఉన్నారే.. నాకు మీ అంత ధైర్యం లేదండి. ఏమైనా మీ స్పందనని మెచ్చుకోలేకుండా ఉండలేకున్నాను.

 
Clicky Web Analytics