5, జులై 2010, సోమవారం

కామెంట్స్ మాడరేషన్ తీసేసాను

నాకు ఉన్న రెండు బ్లాగులలో ప్రస్తుత బ్లాగుకి కామెంట్స్ మొడరేషన్ తీసేసాను. ఇకపై ఇక్కడ ప్రచురించే అన్ని పుటలకు స్పందించే వారు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెయ్యడం వెనకాల కొన్ని ముఖ్యాంశాలు.

ఒకటి) అందరికీ తెలుస్తుంది నాపై స్పందించే వారి భావనలేమిటో..

రెండు) పారదర్శకత..

మూడు) నిస్సంకోచంగా .. నిర్బయంగా.. నిష్కర్షగా అనానిమస్ వారు కూడా స్పందించొచ్చు..

ఇలా చెయ్యడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే మరికొన్ని నష్టాలు ఉన్నాయి. కాలం నాకు అన్నింటిని నేర్పుతుందని అలోచిస్తూ, ఇదిగో ఇలా మొదలు పెట్టేస్తున్నాను.

బైదవే.. ప్రస్తుతం నేను వమెరికాలో ఉన్నాను కదా.. ఈరోజు అమెరికన్స్ జరుపునే స్వాతంత్ర దినోత్సవం. హాపీ ఇండిపెండెన్స్ డే టు అమెరికా

7 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

-:)

అజ్ఞాత చెప్పారు...

అసలు నీ బ్లాగే తీసేస్తే బావుంటుందేమో...

చక్రవర్తి చెప్పారు...

అజ్ఞాత గారు,

నా బ్లాగు మూసేయ్యమంటారా.. అంత తప్పు నేనేంచేసానబ్బా..

ఏమైనా స్పందించారు అదే పదివేలు..

అజ్ఞాత చెప్పారు...

నీ బ్లాగు మొత్తం చదివిన తరువాత నాకేమనిపిస్తొందంటే నువ్వు ఆరుద్ర నక్షత్ర జాతకుడివి అని. ఈ జాతకులు తాము పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అంటారు. ముందు ఆత్మ విమర్శ చేసుకోవడం నేర్చు కుంటే ముందు నీ తప్పులు తెలుస్తాయి

చక్రవర్తి చెప్పారు...

రెండొవ అజ్ఞాత గారు,

భలే కరస్టుగా చెప్పారండీ నా జన్మ నక్షత్రం విషయంలో. మీరు భలే సుమండి. ఇక కుందేలు కాళ్ళు విషయానికి వస్తే .. నేను కుందేళ్ళను పట్టను కాబట్టి వాటి కాళ్ళ విషయం గురించి నాకు తెలియదు. ఇక పంతం విషయానికొస్తే.. అప్పుడప్పుడు తప్పదు.. అలా అని ఎప్పుడూ కాదు సుమా.. కొన్ని కొన్ని సారు స్పందించే వారి సూచనల మేర మార్పులు చేర్పులు చేస్తున్నానని నా అభిప్రాయం. అందువల్ల పట్టువిడుపులు రెండూ ఉన్నాయని నేననుకుంటున్నాను. ఏది ఏమైన స్పందించినందులకు నెనరులు. ఇలాగే స్పందిస్తూ ఉండ మని మనవి. ఏమో.. నేను న్జేర్చుకోవాల్సిన విషయాన్ని మీరు చెప్పొచ్చునేమో..

అజ్ఞాత చెప్పారు...

దీనినే అంటారు నాయన! తాను పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అంటే. నాకెందుకొ అనిపిస్తొంది "అందరు ఉండి కూడ ఒంటరిగా బ్రతుకుతున్నావని", నీ బ్లాగులొ చదివాను "మనం తక్కువ ఆధారపడి, ఆధారపడడానికి అవకాశం ఇవ్వాలని" ముందు నువ్వు ఆ పని చేసి తరువాత బ్లాగులొ పొస్ట్ చెయ్యి

నీ శ్రేయోభిలాషి

darinapoyya చెప్పారు...

Hi after reading your blog,
i don't know why, but i got a feeling that your knowledge levels are far away from the common public but at the same to i feel you need to question yourself in your each and every walk of life

 
Clicky Web Analytics