30, జూన్ 2010, బుధవారం

తెలుగు లోని పదాలను హత్య చెయ్యకండి

గౌరవనీయులైన ఈనాడు ఎడిటర్ గారికి,

నమస్కారములతో పరదేశం నుంచి ఓ సదురు తెలుగు వాడు వ్రాయునది. మీ వెబ్ సైటునకు చాలా పాప్యులారిటి ఉంది. ఎక్కువమంది మీ సైటుని దర్శిస్తూ ఉంటారు. అలాంటి మీరు అందరికీ మార్గ దర్శకులుగా ఉండాల్సింది పోయి మీరే తెలుగులోని శ్రేష్టమైన పదాలకి తెగులు పట్టించేస్తే.. తెలుగు భాషపైన మమకారం కలిగిన ఓ తెలుగు అభిమానిగా ఉండపట్టలేక మీకు ఉత్తరం వ్రాస్తున్నాను.

నిజ్జంగా మీరు తెలుగు వారేనా అని నాకు ఓ అనుమానం.. లేదా పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చి ఉద్యోగాలు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులలాగా మీరు పరాయి భాష వారా!! లేక మీరు ఒఠి పేరుకు మాత్రమే ఎడిటర్ గారా అని నాకు చాలా అనుమానం.

ఇంకా ఎక్కువ వ్రాస్తే మిమ్ములను ధూషిస్తానేమో అని నాకు ఓ మూల శంకగా ఉంది. అసలు విషయాన్ని ఒక్క ముక్కలో వివరిస్తాను. ఇవ్వాల్టి ఆన్ లైన్ పేపర్లో, “వూరికో అద్దె” అంటూ ఓ ఆర్టికల్ వ్రాసారు. ఇలా చక్కగా ఉండాల్సిన “ఊరు” అనే పదం మీలాంటి వాళ్ళ వల్ల బ్రష్టు పట్టి వంకరై “వూరు” గా మారి దాని అసలు రూపాన్ని పోగొట్టుకుంటోంది.

భాషకు మీలాంటి వాళ్ళు ఎంత తెగులు పట్టించేస్తున్నారో ఒక్క సారి ఆలోచించండి. దయచేసి మీలాంటి వాళ్ళవల్ల కలిగే నష్టం ఎంత ఉందో గమనించండి. వూరు అనేపదం సరిఅయినది కాదు ఊరు అనేదే అసలు పదం అని ప్రక్కనున్న మరో తెలుగు వానికి చెబితే, ఈనాడే వేదం అన్నట్లుగా వాడు నాకు మీ సైట్ చూపించి, “అంటే నీ ఉద్దేశ్యంలో ఈనాడు వాడు తప్పు చేశాడంటావా.. “ అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు.

కాబట్టి వేడుకునేదేమిటంటే, మీరు తెలుగు భాషకి సేవ చెయ్యకపోయినా ఫరవాలేదు అంతే కాని హత్య చేసి సమాధి కట్టి.. మా పత్రిక ద్వారా తెలుగు భాషని వికృతి చేసి  తెగులు భాష చేసామని చంకలు కొట్టుకుంటానంటే మౌనంగా మీ పత్రికను త్యజించడం తప్పితే ఇంకేం చెయ్యలేను.

 

ఆ ఆవేదనను మన్నిస్తారని ఆశిస్తాను.

11 వ్యాఖ్యలు:

Vamsi M Maganti చెప్పారు...

ఏకటం బానే "వు"న్నది. మరి ఏకేముందు కొంచెం మనం వ్రాసిందేమిటో కూడా చూసుకోవాలిగా!

"సదురు" మీద "ఒఠి" పెట్టి "ధూషిస్తే" అసలు "ఉద్దేశ్యం" ఆవేదన కలిగించటమనే !!

Sandeep చెప్పారు...

తెలుగు ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కొంతవరకు కారణం ఈనాడే. వారు ఏనాడో "ఋ", "అలు" లను భక్షించేశారు. ఋతుపవనాలని రుతుపవనాలుగా, ఋణాలను రుణాలుగా మార్చేశారు.

చక్రవర్తి చెప్పారు...

మాగంటి వంశి గారు,

ఒక్క సారి మీరు నా పాట టపాలు చదవమనవి. అందులో ఒక చోట, ఇలా వ్రాసుకున్నట్లు గుర్తు..
".. తప్పుల్లేకుండా అచ్చం అర ఠావు తెలుగు వ్రాయలేని నేను .. "

అందువల్ల నాకు తెలుగు అంతగా రాదు కానీ ఇప్పుడిప్పుడే మెఱుగు పడుతోందని నా అభిప్రాయం. కాబట్టి నిస్కర్షగా ఉన్న తప్పులను సరిదిద్దమనవి.

ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు..


సందీప్ గారు,
నిజమేనండి ఒక్కొక్క సారి కడుపు రగిలి పోతుంది. కానీ ఏమి చెయ్యలేం. వెధవలకి చదువురాని వాళ్ళ యాశ భాష వ్రాయడం అలవాటైయ్యి అచ్చ తెలుగుకి తెగులు పట్టించేస్తున్నారు. వీళ్ళకి వ్యాపారమే కనబడుతుంది కాని తెలుగు భాష కనబడదు..

స్పందించినందులకు నెనరులు

critic చెప్పారు...

చక్రవర్తి గారూ!

మీ ఆవేశమూ..మీరూ.. మరీనండీ! మీ
ఘాటు శీర్షిక చూసి, మన భాషకు ఎంత ఘోరం
జరిగిపోతోందో అనుకుంటూ తీరా చదివితే ‘
వడ్ల గింజలో బియ్యపు గింజ’.

‘ఊరు’ అన్నమాటలో ఒక అక్షరాన్ని హల్లుతో
రాసినందుకే ‘తెలుగు పదాల
హత్య’జరిగిపోతోందా? ‘శ్రేష్ఠమైన’పదాలకు
తెగులు పట్టేస్తుందా?

మాగంటి వంశీ గారు ఎత్తిచూపినా మీ టపాలోని
భాషా దోషాలను సవరించుకోలేదే? పైగా మీ
సమాధానంలో పాత టపాల బదులు ‘పాట
టపాలు’అనే పొరపాటు! ‘తప్పుల్లేకుండా
అచ్చం అరఠావు తెలుగు వ్రాయలేను’ అని
మీరే రాసుకున్నారే.. అలాంటపుడు
ఒక దినపత్రికలో ఒక్క అక్షరం పొరపాటుగా
వచ్చినంతమాత్రానే ‘వికృతి’,‘హత్య’‘సమాధి’ అంటూ అతిగా
స్పందించాలంటారా?

మీ బ్లాగులో ఉన్న about me లో ఎన్ని అక్షర
దోషాలున్నాయో ఎప్పుడైనా చూసుకున్నారా?
(‘అభిప్రాయలు’, ‘పరిస్తితులు’)
అసలు భవదీయుడు లోగో కిందే ‘అలోచనలు’
అనే దోషం ఉంది, గమనించారా?

ఇంతా చేసి, ఈనాడు నెట్ ఎడిషన్ లింక్ క్లిక్
చేస్తే చక్కగా ‘ఊరు’ అనే ఉంది. దాని
సంగతి ప్రస్తావించలేదే మీరు? ప్రింట్ ఎడిషన్లో
కూడా ‘ఊరు’ అని సరిగానే వచ్చింది!

JB - జేబి చెప్పారు...

ఛార్లెస్ బ్రౌన్ గారి అ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ పుస్తకం ప్రకారమైతే ఋకారానికి రుకారం, ఉకారానికి వుకారం 19వ శతాబ్దములో వాడుకలో మరియు పద్యములలో ఉపయోగంలోనున్నవే.

గమనిక 1: ఈ వ్యాఖ్య ఈనాడు వారిని సమర్ధిస్తూ కాదు. ఈ రోజుల్లో అన్ని పత్రికలు, ఛానెళ్ళు అలాగే ఉన్నాయి.
గమనిక 2: పైన నేను ఉటంకించిన బ్రౌనుగారి పుస్తకం మొత్తం నేను చాలా రోజుల క్రితమే, తెలుగులో బ్లాగులు రాయడం మొదలుపెట్టినప్పుడు చదివా. మీ బ్లాగులో రంధ్రాన్వేషన చేయుటకు నెట్లో వెతికినది కాదు.

kiranpriya చెప్పారు...

తెలుగులోని పదాలు....అనక్కర్లేదు గా! "తెలుగు పదాలు" అంటే చాలు! అసలు "తెలుగుని"అంటే ఇంకా మేలు.

"తెలుగును వికృతి చేయడం" అంటే?ఈ ప్రయోగం ఎక్కడా వినలేదే?

"చేసామని "కాదు..."చేశామని"!

అన్నట్లు వంశీ గారికిచ్చిన సమాధానంలో.."పాట టపాలు" అన్నారు..మీ ఉద్దేశం "పాత టపాలు" అనా?

తప్పులు లేకుండా ఒక్క అరఠావు లేకుండా రాయలేని వారు ఇంకొకళ్ళని ఏకొచ్చా?

ఈనాడు వల్ల తెలుగు "బ్రష్టు" పట్టడం సంగతి మాటుంచి మీ తెలుగుని కాస్త సంస్కరించండి.

ఈనాడు ఎడిటర్ స్వచ్ఛమైన తెలుగోడే! మీ గురించే సందేహంగా ఉంది.

KAMAL చెప్పారు...

ఈనాడు online పేపర్ లో మీకు ''ఊ ''అనే పదం ఎక్కడ కనిపించదు ఎందుకంటే అది వారి సాఫ్ట్వేర్ లో ''బగ్గు'' అది వాళ్ళు ఇప్పటికి solve చెయ్యలేకపోతున్నారు. మన మిత్రులు ఈ విషయమై ఈనాడుకు మెయిల్స్ కూడా పంపారు.

చక్రవర్తి చెప్పారు...

క్రిటిక్ గారు,

కడెవడు పాలు విరిగాలంటే చిటికెడు ఉప్పు చాలని నా అభిప్రాయం.. అలగే నిలువెత్తు చెట్టునైనా చంపేయ్యాలంటే ఉప్పు చాలని కూడా అనుకుంటాను. అంతెందుకు ఎంతటి భారీ కాయమైనా చిన్న కాన్సర్ కణం వల్లే మరణించేదని వైద్య శాస్త్రం చెబుతోందే.. అలాంటి చిన్న తప్పే కదా అని ఊరుకుంటే, మన భాష ఏమైనా ఫరవాలేదంటారా.. ఇప్పటికే వ్రాయడం కాస్తా పరమ ఛండాలంగా రాయడమైపోయింది, ఏదో జోగి జోగి రాసుకున్నట్టు.. శ్రేష్టంగా ఉన్న కొన్ని పదాలకు యాస అంటగట్టి విద్య నేర్చిన మనమే భాషకు అన్యాయం చేస్తుంటే, హు.. దానికి తెగులు పట్టట్లేదంటారా!! బాగుందండి మీ వరస..

మాగంటి వారు తప్పులున్నట్లు చెప్పడం మాత్రమే సరి కాదు.. ఆ తప్పులు సరిదిద్దుతూ ఒప్పులు కూడా (శూ)సూచించాలి. ఆ పని వారు చెయ్యలేదు అందుకని నేను సవరించలేదు. మీకు తెలిస్తే మీరు తెలియ జేయండి అప్పుడు మారుస్తాను.

ఇప్పుడు కూడా మీరు అదే తప్పు చేస్తున్నారు. అదిగో అక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది అంటున్నారే కానీ.. ఒరేయ్ వెధవాయ్.. ఆలోచనలు కాదురా అది డాష్ డాష్ అవుతుంది అని వ్రాయటం లేదు. దాని సరిఅయిన పదం ఏమిటో మందు తెలియ జేయండి.

ఏది ఏమైనా స్పదించినందులకు నెనరులు

critic చెప్పారు...

చక్రవర్తి గారూ!

భాషలో దోషాలు దొర్లటం ఎవరికైనా జరుగుతుంది. పొరపాట్లు ఎవరైనా చేస్తారు. కానీ విమర్శ అనేది విషయ తీవ్రతను బట్టి ఉండాలి. పైగా ఓ పక్క తప్పుల తడకలు రాస్తూ ఎదుటివాళ్ళను అదీ- అతి స్వల్పమైన అక్షర దోషానికి ఘాటుగా దూషించటానికి (‘వెధవలకి’ అనే కామెంట్ మీదే ) అర్హత ఉంటుందా? నాదైనా, ఇక్కడ ఇతర వ్యాఖ్యాతలదైనా ఇదే పాయింటు.

సరే,మీకు అర్థమయ్యేలాగా మీ టపాలో, వ్యాఖ్యానంలో ఉన్న భాషాదోషాలూ, అక్షర దోషాలూ రాస్తాను. సవరించుకోండి!


మీ టపాలో దోషాల గురించి ఒక్కొక్కరూ ప్రస్తావించినవి. (మొదటిది తప్పు రూపం- రెండోది సరైన రూపం)

వంశీ గారు:

1. సదురు- సదరు
2. ఒఠి - వట్టి/ఒట్టి
3. ధూషిస్తానేమో - దూషిస్తానేమో
4. ఉద్దేశ్యం- ఉద్దేశం


నేను:

5.శ్రేష్టమైన- శ్రేష్ఠమైన
6.అభిప్రాయలు- అభిప్రాయాలు
7. పరిస్తితులు- పరిస్థితులు
8.అలోచనలు- ఆలోచనలు

కిరణ్ ప్రియ గారు:

9.చేసామని- చేశామని
10.బ్రష్టు- భ్రష్టు

ఇంకా...

11. వ్రాసారు- వ్రాశారు

వంశీ గారికీ, సందీప్ గారికీ మీరిచ్చిన సమాధానంలో:

12.నిస్కర్ష- నిష్కర్ష.
13.యాశ - యాస

నాకిచ్చిన సమాధానంలో:

14. కడెవడు- కడివెడు
15. చంపేయ్యాలంటే- చంపెయ్యాలంటే
16. మందు- ముందు
17. స్పదించినందులకు- స్పందించినందుకు

అదండీ సంగతి. మీ చిన్న టపాలో ఎన్నేసి దోషాలున్నాయో సరిచూసుకోండి.. సరిచేసుకోండి! మీకు శుభాకాంక్షలు!

KK చెప్పారు...

KAMAL గారు చెప్పింది కరెక్టు. అది నేనెప్పుడో (చాలా సంవత్సరాల క్రితం) గమనించాను. ఈనాడు ఆన్‌లైన్ ఎడిషన్‌కి "ఊ" పలకడం రాదు.

చక్రవర్తి చెప్పారు...

సదరు క్రిటిక్ గారు,

చాలండి .. మీరు ఇలాగే నన్ను నిష్కర్షగా విమర్శింస్తూ ఉండండి. చెప్పే వాడు లేకనే మా లాంటి వాళ్ళు ఇలా తయ్యారయ్యారని నా అభిప్రాయం. కాక పోతే ఒక్క ఒఠి అనే పదం విషయంలోనే ఎందుకో మీతో అంగీకరించాలనిపించటం లేదు.. మేమంతా ఒఠి వెధవాయలము .. అని చిన్నప్పుడు మా మాస్టారు మా చేత ఇంపోజిషన్ వ్రాయించినట్టు గుర్తు.

వెధవలు అని దూషించడం అసందర్బమైనా కోపంలో అలా వచ్చేసింది, మార్చుకుంటాను. చూద్దాం మీ సవరణలు నాలో ఎంతకాలం సజీవంగా ఉంటాయో..

కానీ నేనే ఇంత అపరివక్వంగా వ్రాస్తుంటే, స్థిత ప్రజ్ఞ కలిగిన ఈనాడు యాజమాన్యం మరియు జర్నలిస్టులకేం వచ్చింది అలా తెలుగుని వంకర చేసి వ్రాస్తారు.. దానికి తోడు మీలాంటి భాషపై పట్టు కలిగి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు కూడా తెలుగుకి ద్రోహం చేస్తున్నారనే నా అభిప్రాయం.

 
Clicky Web Analytics