2, జనవరి 2009, శుక్రవారం

e-తెలుగు తో నా అనుబంధం : స్వార్ద పర్వం

మొదటి పుటలో నా ఉపోధాతం చదివారు కదా.. ఇక తరువాతి కాలానికి వస్తే, నేను మొదటి సారిగా e-తెలుగు సమావేశాలను క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి (అనగా 2008 Feb) లో గమనించడం జరిగింది. అదిగో అప్పటి నుంచి తదుపరి (మార్చి) సమావేశానికి వెళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకునాను. నా దురదృష్టమో ఏమో, ఖశ్చితంగా మార్చి సమావేశం రోజే కడుపులో గుడ గుడ.. దానికి తోడు గొంతులోంచి వాక్ .. వాక్.. అన్నీ కలిసి నన్ను కాస్తా మార్చి సమావేశాలకు హాజరు అవ్వకుండా చేసాయి. దీనికి సంబందించిన నా వ్యాఖ్యలు మార్చినెల నివేదికలో చూడవచ్చు. అలాగ మార్చిదాటి ఏప్రిల్ నెల వచ్చింది. ఈలోగా, నా అర్దాంగి కొంచం ఉత్సాహం చూపించడంతో ఆమెను కూడా తీసుకుని ఏప్రిల్ నెల సమావేశాలకు హాజరయ్యాను.

ఆరంభ శూరత్వం. ఇక్కడ మీరందరూ తెలుసు కోవలసిన మరో విషయమేమిటంటే, ఈ సమావేశాలన్నీ హెత్లాబా సమావేశాలుగా మొదలైయ్యి e-తెలుగు సమావేశాలుగా పరిణితి చెందాయన్న మాట. నాకు మొదటి నుంచి ఈ సమావెశాలన్నీ హైదరాబద్ తెలుగు బ్లాగర్ల సమావేశాలుగా మాత్రమే పరిచయం.  అదిగో అదే ఉద్దేశ్యంతో మే నెల సమావేశానికి నాంది నేను పలికాను. అదిగో అప్పుడే పరిచయ్యమయ్యారు దూర్వాసుల పద్మనాభం గారు. "ఒరేయ్ కుఱ్ఱకుంకా! (ఇలా ఆ మహానుభావులు పలుకరు .. కానీ ఏదో కొంచం రుచిగా ఉంటుందని, సొంత పైత్యం వాడాను..)  ఇది బ్లాగర్ల సమావేశం కాదు.. e-తెలుగు సమావేశం.." అంటూ మొటికాయ వేశారు. ఈ విషయాలు ఆ లంకెలొ చూడవచ్చు. అదిగో అలా రెండవ సమావేశానికి సతి లేకుండా పతి మాత్రమే హాజరు. అప్పుడు కూడా e-తెలుగు సభ్యులు ఎవ్వరూ నాలో ఉన్న ఉత్సాహానికి ఎటువంటి స్పందనా చూపలేదు. నాలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటారో కదా. నాకైతే ఇలాంటి సంఘం కొత్త, కానీ ఈ సంఘానికి నాలాంటి వాళ్ళు అను నిత్యం తారస పడుతూనే ఉంటారు.

ఇదిగో ఇలాంటి భావనతోనే, e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం, 2008 మే 18 న హైదరాబాదు, వెంగళరావు నగర్ లోని సి.బి.రావు గారి ఇంటిలో జరిగింది. ఈ విషయం చదివిన తరువాత, నేను అనే వ్యక్తిని తెలిసిన వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించక పోగా కనీసం ’ఇదిగో ఇలా ఇక్కడ కలుస్తున్నాం..’ అని కబురు కూడా చెప్పలేదే అన్న భావన నన్ను e-తెలుగు సమావేశాలకు దూరంగా ఉంచాయి. అలాగే ఇక్కడ నేనొక విషయాన్ని నిస్పక్షపాతంగా వ్రాయాలి. అదేమిటంటే..

నాకు ప్రాముఖ్యం లేని చోటుకు (లేదా) నాకు ప్రాముఖ్యం ఇవ్వని వాళ్ళకు  నేను ప్రాముఖ్యం ఇవ్వను

అని తలచేవాడిని. కానీ నా ఆలోచనా విధానం మారాలని తెలిసే చేసిన విధానం బెట్టిదననినా.. మరో పుటకై ఎదుఱు చూడవలే..

అంతవరకూ.. సెలవు,

ఇట్లు,

భవదియుడు

2 కామెంట్‌లు:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

ఒక చిన్న సవరణ. దానిని e-తెలుగు సర్వసభ్య సమావేశం ఎందుకన్నారో కాని నిజానికి అది "e-తెలుగు కార్యవర్గ సమావేశం" మే నెల సర్వసభ్య సమావేశం 11నే జరిగింది. ఈ సమావేశం 18న జరిగింది.గననించ గలరు.
పోతే e-తెలుగు ఏ ఒక్కరిదీ కాదు. మనందరిదీ. ఇది మీరే కాదు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

ఓ బ్రమ్మీ చెప్పారు...

గురువుగారూ .. ఈ విషయాన్ని నేను eతెలుగు లంకె నుంచి యధా వధిగా పట్టు కొచ్చాను.

నిజమే!! నేను ఒప్పుకుంటాను.. eతెలుగు ఏ ఒక్కరిదీ కాదు, మన అందరిదీ ..

 
Clicky Web Analytics