8, జనవరి 2009, గురువారం

e-తెలుగుతో నా అనుబంధం : పద్మో(గీతో) పదేశం

మొదటి పుటలో నా స్వార్ద పర్వాన్ని చదివారుగా, ఇదిగో ఇప్పుడు దానికి విరుగుడు.

నాకు సమాచారాన్ని చేర వెయ్యలేదన్న ఒకే ఒక్క కారణం చేత eతెలుగుకి దూరంగా ఉంటున్న నాకు ప్రవాస యానం చేసే అవకాశం రావడం చేత కొంత కాలం మన మిత్రులందరినీ వదిలి ఉండ వలసి వచ్చింది. ఇదిగో ఈ సమయంలోనే తీగను కదిపారు నా(మన)కు తెలిసిన బ్లాగు ప్రపంచంలో వయ్యస్సు రీత్యా కురు వృద్దులు దూర్వాసుల పద్మనాభం గారు. వయస్సులో పెద్ద వారైనా చెలాకీగా వారు చేసే పనులు వారి వయస్సుని ఏ మాత్రం ప్రతి బింబించవు.

 

నాకు తెలిసి నంత వరకూ గత సంవత్సర కాలంలో పద్మనాభం గారు ఏ ఒక్క హైతెబ్లా (హైదరాబాదు తెలుగు బ్లాగర్ల) / eతెలుగు సమావేశాలకు గైరు హాజరవ్వలేదు. మూడు గంటల సమయం లో ప్రారంభం అయ్యేటటువంటి సమావేశాలకు వారు ఒక పావు గంట ముందే వచ్చేవారు. నిజమే!!! పనీ పాడు లేని రిటైర్డ్ మనిషి కదా, ఏ వేళ్ళకి కావాలంటే ఆ వేళకి వస్తారు.. అని అనుకుంటున్నారా.. పనీ పాట ఉన్నా లేక పోయినా ఠంచనుగా అనుకున్న వేళకి అనుకున్న స్థలానికి చక్కగా అనునిత్యం యధైకగా వస్తున్నారా??? లేదా?? అని ఆలోచిస్తే వారి చిత్త శుద్ది మనకు అవగతమౌతుంది. ఇది ఒక్క eతెలుగు సమావేశాలలో మాత్రమే కాదు, పుస్తక ప్రదర్శనలో eతెలుగు వారి స్టాల్ దగ్గర వారి సపోర్ట్ కూడా ఇదే రీతిలో సాగింది. ఎప్పుడూ అందరి కన్నా ముందే చేరుకునే వారు. వీలైనంత చివరి వరకూ ఉండే వారు.

 

ఇంతకు ముందు చెప్పినట్లుగా, నేను ప్రవాశంలో ఉన్నప్పుడు, మా ఇద్దరి మధ్యా eతెలుగు సమావేశాల ప్రస్తావన వచ్చింది. అంత వరకూ ఎవ్వరూ నన్ను ఈ విషయంపై కదప లేదు. ఇదిగో అడిగినదే తడవుగా నా గళంలో దాగి ఉన్న భాధ నంతా వారిముందు ఉంచేసాను.  నాకు గుర్తు ఉన్నంత వరకూ మా మధ్య జరిగిన సంభాషణ ఇదిగో ఇలా సాగింది.

 

దూర్వాశుల పద్మనాభం గారు: నమస్కారం చక్రవర్తిగారూ..

భవదీయుడు: అయ్యయో .. మీరు నాకు నమస్కారం !!! బాగాలేదండీ.. ఎలా ఉన్నారు..

దూర్వాశుల పద్మనాభం గారు: బాగానే ఉన్నాను.. మరి మీరో.. ఏమిటి ఈ మధ్య eతెలుగు సమావేశాలకు రావటం లేదు..

భవదీయుడు: మొదటిగా నేను ప్రస్తుతం USAలో ఉన్నాను.. రెండవది, అవి తెలుగు బ్లాగర్ల సమావేశాలో లేక eతెలుగు సమావేశాలో నాకు అర్దం కావడం లేవు.. eతెలుగు సమావేశాలైతే అందరికీ తెలియ జేయ్యాలి కదా.. ఏదో కొంత మందికి మాత్రమే అన్నట్లు వారేమి చేద్దాం అనుకుంటున్నారొ ఎవ్వరికి చెప్పరు.. ఎవ్వరి సలహాలు సంప్రతింపులు చెయ్యరు. మరి నన్నెట్లా పాలు పంచు కో మంటారు?

దూర్వాశుల పద్మనాభం గారు: మీరన్నది నిజమే.. ఇది తెలుగు బ్లాగర్ల సమావేశమా లేక eతెలుగు సమావేశమా అనే ప్రశ్న నేను చాలా సార్లు లేవనెత్తాను.. కానీ దీనికి ప్రత్యుత్తరంగా వచ్చే సమాధానంతో మనకి పని లేదండి. eతెలుగు ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి, తెలుగు బ్లాగింగ్. అందు వలన మనమందరం eతెలుగు సభ్యులమే. అయినా eతెలుగు మనందరిదీ అని గమనించండి.

భవదీయుడు:అవుననుకోండి.. (ఇంకా నేనేదో వ్రాయ బోతుంటే..)

దూర్వాశుల పద్మనాభం గారు: అయినా వాళ్ళేమీ స్వాలాభాపేక్షతో చేస్తుంది కాదు కదా.. మనకు చేతనైంది మనం చేద్దాం. దానికి ఎవ్వరి అనుమతులు అఖరల్లేదు కదా.. అది సరే, మీరు ఎప్పుడు వస్తున్నారు? మీతో మాట్లాడే పని ఉంది.. (ఏమీలేదు.. ఉత్తిత్తినే, మాట దాట వేయ్యడానికి వారు విసిరిన బాణం నన్ను ఎక్కడో తాకి అస్సలు విషయన్ని మర్చిపోయ్యాను..)

భవదీయుడు: వచ్చే నెలలో అక్కడ ఉంటాను..

దూర్వాశుల పద్మనాభం గారు: సరే వచ్చిన తరువాత మనం కలుద్దాం

భవదీయుడు: అలాగేనండీ..

దూర్వాశుల పద్మనాభం గారు: ఏది ఏమైనా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవ్వరు ఎలాంటి పని చేసినా మనం వారికి చేయూత నిస్తే అది మరింత మెరుగ్గా సాగి పోతుంది కదా.. అలాగే eతెలుగా!! లేక హెతెబ్లానా!! అనే సందేహాలు వీడి మీరు యధా విధిగా సమావేశాలకు విచ్చేయ్యండి

భవదీయుడు: నిజమేసుమండీ..

దూర్వాశుల పద్మనాభం గారు: మీరు వచ్చిన తరువాత ఒక్క సారి కాల్ చెయ్యండి

భవదీయుడు: అలాగే సార్..

దూర్వాశుల పద్మనాభం గారు: తెలుగుకి eతెలుగు వారు చేస్తున్న సేవను కొనియాడ మని నేను చెప్పటం లేదు.. కానీ విడిపడి సాధించే దానికన్నా, కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. గొడవలు పడ్డా కలసి పని చేద్దాం.. ఏమంటారు..

భవదీయుడు:అంతే కదండీ.. (నాకు మరో మాట లేదు మరి..)

దూర్వాశుల పద్మనాభం గారు:  సరే మరి ఇంక ఉంటాను..

భవదీయుడు: అలాగేనండీ..

 

అలా సాగిన మా సంభషణ నాలో చాలా చాలా ఆలోచనలను రేకెత్తింది. ఏదో తెలియని నా మనో భావన నాకు కొంచం వింతగా.. మరి కొంచం చెత్తగా.. మరింత చేదుగా.. పలు పలు విధాలుగా అనిపించింది. ఆ తరువాత జరిగిన ఆత్మ సంగర్షణలో స్వార్థం ఓడి పరమార్ధమే గెలిచింది. ఆ తరువాత నేను డిసెంబర్ నాటి సమావేశానికి హాజరయ్యాను. అదిగో ఆ తరువాత పుస్తక ప్రదర్శనలో నావంతు కృషి నేను చేశాను.. అఫ్‍కోర్స్.. మన బ్లాగు మిత్రులెవ్వరు ఈ విషయమై ప్రస్తావించ లేదు కానీ, వారి మెప్పుకై చేసినది కాదు కదా.. కాబట్టి పెద్దగా పట్టించు కోలేదు.

మఱో పుటలో పుస్తక ప్రదర్శనలో నా అనుభూతులు, నేను గమనించిన విషయాలు సెన్సార్ చెయ్య కుండా ప్రచురించ ప్రయత్నిస్తాను. అంతవరకూ.. సెలవు,

ఇట్లు,

భవదీయుడు

5 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

మిగిలిన విషయాలకై ఎదురుచూస్తున్నాను.

శ్రీనివాస చెప్పారు...

"eతెలుగు సమావేశాలైతే అందరికీ తెలియ జేయ్యాలి కదా.. ఏదో కొంత మందికి మాత్రమే అన్నట్లు వారేమి చేద్దాం అనుకుంటున్నారొ ఎవ్వరికి చెప్పరు.. ఎవ్వరి సలహాలు సంప్రతింపులు చెయ్యరు. మరి నన్నెట్లా పాలు పంచు కో మంటారు?"

చక్రవర్తి గారూ, మీరు పైన చెప్పిన విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ సమావేశాలకు హాజరుకమ్మని ప్రత్యేకంగా ఎవరికీ మెయిళ్లు పంపబడవు. తెలుగుబ్లాగు గుంపులోకి (ఇప్పుడు e-telugu.org లో కూడా) ఒక మెయిల్ పంపుతారు. ఆ మెయిల్‌లోనే అన్ని వివరాలు ఉంటాయి.ఆ గుంపులో ఉన్న వాళ్లందరికీ ఈ సమావేశ వివరాల విషయం చేరుతుంది. ఒకవేళ కొందరి మద్య వ్యక్తిగత మెయిళ్ళు సాగుతున్నాయంటే అవి ప్రత్యేకంగా వారికుద్దేశించిన పనులకు (కరపత్రాలు, బ్యానర్లు, వగైరా) సంబందిచినవై ఉంటాయి.
మీరు పుస్తకప్రదర్శనలో ఎంత చలాకీగా పాల్గొన్నారో ఇక ముందు ముందు అలానే కొనసాగాలని కోరుతున్నాను :-)
సర్వదా సర్వత్రా సర్వేజనులెవరైనా e-తెలుగుకు సంబందించిన కార్యకలాపాలలో పాలుపంచుకోవాలని ఒక e-తెలుగు సభ్యుడిగా సర్వతోముఖంగా విన్నవించుకుంటున్నాను.

ఓ బ్రమ్మీ చెప్పారు...

శ్రీనివాస్ గారూ,

నా ముందు పుటలో తెలియ జేసినట్లు, e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం, 2008 మే 18 న హైదరాబాదు లో జరిగింది. లంకె http://etelugu.org/node/106. మరి ఈ సమావేశానికి సంబందించి ఎటువంటి మెయిలు ఎక్కడా లేదు. అందుకు కారణం ఆ సమావేశంలో పాలు పంచుకున్న వాళ్ళంతా దబ్బులు కట్టి సంఘ సభ్యులుగా చేరిన వారు మాత్రమే. అందువల్ల ఇలాంటి సమావేశానికి ఎవ్వరికీ సమాచారం ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు.

అవునంటారా.. కాదంటారా.. ఇలా సభ్యత్వ రుసుము అనే ప్రసక్తి ఒకటి ఉందీ అని, దానికి సంభందించిన విషయాల గురించి మన పుస్తక ప్రదర్శనలో మనం చర్చించాలని ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి మెయిల్‍లో చదువుకోలేదు. అలాగే ఒక సందర్శకునిని సభ్యునిగా చేర్చుకునే ప్రక్రియలో ఐదు వందల రూపాయలు తీసుకునే విషయాల గురించి నివేదికలో చదవడం మినహా ఎక్కడా వినలేదు. ఎందుకనీ అంటే, ఒకే ఒక్క కారణం సభ్యత్వం లేక పోవడం.

ఏది ఏమైనా, మీరు మాకు సభ్యత్వం ఇచ్చినా .. ఇవ్వక పోయినా, అంర్జాలంలో తెలుగు వ్యాపకానికి కృషి చేస్తునే ఉంటాను.. కనీసం ఇప్పుడైనా నా మాటల అర్దం అయ్యి ఉంటుందనుకుంటాను. ఆఖరుగా, ఏదైనా తప్పుగా పలికితే మన్నించండి

Shiva Bandaru చెప్పారు...

చక్రవర్తిగారూ మీరు వ్రాసే సెన్సార్ చెయ్యని విషయాల కోసం ఎదురుచూస్తాను . కొందరు బ్లాగు పాఠకులు కూడా అక్కడికి వచ్చారంట. వీలైతే వాల్ల గురుంచి కూడా వ్రాయండి

ఓ బ్రమ్మీ చెప్పారు...

శివగారూ,

నాకు గుర్తున్నంత వరకూ నేను మరచి పోకుండా తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.

ఎవ్వరినైనా మర్చి పోతే, మన్నించ గలరు.

 
Clicky Web Analytics