22, మే 2008, గురువారం

బత్తీ బంద్.. ఎందుకు చెయ్యాలా?? నేను చెయ్య..

ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ విషయమై చాలా మంది చాలా విధాలుగా ప్రచారాలు చేస్తుంటే.. నా వంతు కర్తవ్యంగా నాకు తెలిసిన నాకు పరిచయమున్న వారికి ఈ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నించా. ఆ ప్రయత్నంలో నాకు ఎదురైన అనుభావల సంపుటి ఈ పుటకి మూల కధ.


పాత్రలు పాత్రధారులు : అస్మదీయుడు ఎలాగో ఉంటాకాబట్టి ప్రతీ సారి నేను ఉన్నానని కొత్తగా చెప్పనక్కరలేదు.

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఒక సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: నేనెందుకు ఒక గంట ఆర్పాలండీ. అదేదో బిల్లులు కట్టేవారు ఆపితే ఎదో పొదుపు క్రింద బిల్లు తగ్గుతుంది
అస్మదీయుడు: మరి మీకు కూడా ప్రొడక్షన్ తలకాయ నొప్పి తగ్గుతుంది కదా
విపఉ: ప్రొడక్షనా .. గాడిద గుడ్డా.. నేనెక్కడ చేస్తున్నా.. ఎదో వర్షాలు పడుతున్నాయి .. అక్కడెక్కడో మా వాళ్ళు కష్ట పడ్డట్టు చెబుతున్నారే.. నీళ్ళుంటే దానంతట అదే ప్రొడ్యూస్ అవుతుంది
అస్మదీయుడు: ఒకవేళ నీళ్ళు లేకపోతే ప్రభుత్వం మిమ్మల్నే కదా దుమ్మెత్తి పోసేది?
విపఉ:ఎవ్వడు పట్టించు కుంటాడు చెప్పండి..
అస్మదీయుడు:మరి విధ్యుత్ తక్కువైంది అని ప్రభుత్వం మిమీద మండి పడితెనో..
విపఉ: ఏముంది .. తక్కువైంది అనేస్తాం.. ప్రక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటే సరి..
అస్మదీయుడు:మరి అప్పుడు ప్రభుత్వం మీకు కేటాయించిన అర్దిక బడ్జట్‍లో సొమ్ములు లేకపోతేనో..
విపఉ: ఏముంది, ప్రభుత్వమే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తీసిస్తుంది
అస్మదీయుడు: మరి దానికెక్కడినుంచి వస్తుంది..?
విపఉ: ఇంకెక్కడి నుంచి .. బిల్లులు కట్టే వాళ్ళనుంచి .. అంతే గానీ నానుంచి కాదుగా.. అయినా మీ పిచ్చి గానీయ్యండీ దీనిలో మనకి ఒరిగేదేముంది.. గంట బొక్క తప్ప

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న మరో సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: చూడండీ మీరు వాడుకున్నా వాడుకోక పోయినా పెద్ద ఫరక్ పడదు సార్
అస్మదీయుడు: ఎలా అంటారు?
విపఉ: ఇప్పుడు మీరు వాడినా వాడక పోయినా మీ 3 phase కనక్షనుకు మీరు కడుతున్న బిల్లు ద్వారా మీకు అవుతున్న బిల్లు మొత్తం దాదాపు రెండు వందల యాభై రూపాయలవుతుంది
అస్మదీయుడు: అంటే దాదాపుగా వాడినా వాడకపోయినా నేనూ అంతే కట్టాలంటారా..
విపఉ: కదా.. అందుకని నేను చెప్పేదేమిటంటే.. బత్తీ బంద్ .. ప్రిజ్జు బంద్ .. అంటూ గోల చెయ్యకుండా ..
అస్మదీయుడు: మరి మనకే ఉపయోగ పడుతుందంటున్నారు కదా..
విపఉ: ఎవ్వరది అనేది.. మా డిపార్టుమెంటు వాళ్ళు చెప్పి కొన్ని గంటలు .. చెప్పకుండా కొన్ని గంటలు కోత విధించడం లేదా..
అస్మదీయుడు: ఇది అసమంజసం కదా..
విపఉ: మీరు ఎంత చెప్పండి, ఓ గంట బత్తీ బంద్ జేసి ఏమి జెయ్యాలంటా..
అస్మదీయుడు: చక్కగా మీ కుటుంబ సభ్యులంతా ఒక్క చోట జేరి ఏదైనా చెయ్యవచ్చుగదా..
విపఉ: అదేగదా నేను జెబుతుండా.. ఓ గంట బత్తీ బంద్ జేస్తే ఏమొస్తదీ .. బొచ్చు ఓ గొంట సీరియల్ బొక్క.. మళ్ళీ ఈ రోజేమైందో అని రేపటి వరకూ ఎదురు జూడాల..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: నాకెందుకు చెబుతున్నారు .. నేనేమైనా తేరగా దొరికానా.. అప్పుడే కదా చక్కగా వంట వండుకునేది.. అలాంటప్పుడు బత్తీ బంద్ అంటే ఎలా?
అస్మదీయుడు: ఆ ఒక్క రోజు వంటేదో ముందుగా చేసుకోవచ్చుగా..
గృహిణి: మా ఆయన వంట వేడిగా లేకపోతే తినరు.. తరువాత నేనే తినాలి.. మరునాడు కూడా చద్దన్నం ఎవ్వరు తింటారు?
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: ఏమిటండి అదికాదు.. ఇది కాదంటారు.. చద్దన్నం మీరు తింటారా.. మా ఆయన సంగతి మీకు తెలియదు..
అస్మదీయుడు: ఇది మీ ఇద్దరి మధ్య జరిగే విషయం కాదు.. అందరికీ సంభందించిన ..
గృహిణి: మా ఆయన నన్ను తిడుతూ ఉంటే.. మీరు చెప్పే ఈ అందరూ వస్తారా.. ఆయన చేత చీవాట్లు ఎవ్వరు తింటారు? పోనీ ఎవ్వరో ఎందుకు నువ్వు తింటావా..
అస్మదీయుడు: అది కాదండి .. (ఎదో చెప్పబోయేటంతలో..)
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. మీ మగాళ్ళంతా ఇంతే... ఒక్కడొచ్చి బత్తీ బంద్ అంటాడు.. మరొకడొచ్చి ఎందుకు బంద్ జేసావ్ అంటూ నా తాటవలుస్తాడు.. నీకు పుణ్య ముంటాది.. మరేదన్నా జెప్పు బిడ్డా..
అస్మదీయుడు: ఇంకే చెబ్తా..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: దానివల్ల వచ్చే ఉపయోగమేమిటి?
అస్మదీయుడు: (హమ్మయ్య.. చాలా కాలంగా ఎవ్వరూ అడగని ప్రశ్న అడిగింది అనుకుంటూ మొదలు పెట్టా..) భూగోళం చుట్టూ..
గృహిణి: భూగోళం చుట్టూ సరేగానీ.. నాకు ఏవిధంగా ఉపయోగమో చెప్పు బాసూ
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: నేను అనేది అదే.. అదికాదు.. ఇది కాదనకుండా .. అస్సలు విషయానికిరా..
అస్మదీయుడు: అంటే.. ఇలా ఒక గంట సేపు బత్తీ బంద్ జేస్తే మన వాతావరణానికి ..
గృహిణి: మళ్ళీ వాతావరణం గీతావరణం అంటావు .. మన గురించి చెప్పు బాసూ..
అస్మదీయుడు: (ఎదో చెప్పబోయేటంతలో..) ..
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. దాని వల్ల లాభం లేదు గానీ .. దానివల్ల జరిగే నష్టాలే చాలా ఉన్నాయి .. నీకు తెల్సా..
అస్మదీయుడు: నష్టాలా..
గృహిణి: అవును బాసూ..
అస్మదీయుడు: ఏమిటో..
గృహిణి: నేను చేసుకునే వంటలూ అవీ బాగా కుదిరినా .. లేక మిగిలిపోయినా చక్కగా తీసుకెళ్ళి ప్రిజ్‍లో పెట్టేస్తా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అలాగే వారానికి సరిపోయే కూరగాయలన్నీ ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అట్లాంటిది.. ఓ గంట బత్తీ బంద్ అంటే.. ప్రిజ్‍లో పెట్టిన కూరగాయలన్నీ కుళ్ళిపోవా.. నిన్న వండిన పులుసు పరిస్థితేమిటి?
అస్మదీయుడు: ఆ..
గృహిణి: అవన్నీ చెడిపోతే మళ్ళీ తెచ్చుకోవాలా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇవి కాకుండా.. పాలు కూడా ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇన్ని వస్థువులు చెడిపోతా ఉంటే.. బత్తీ బంద్ చెయ్యమంటావా.. నీకు కావాలంటే మీ ఇంట్లో జేసుకో .. అంతే గానీ ఊరికే ఇలాంటి సలహాలు ఇవ్వమాక...
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: వ్యాపారి

వ్యాపారి: దానివల్ల మా కస్టమర్లు ఆ గంట సేపు రావడం మానేస్తారు ..
అస్మదీయుడు: అదికాదండీ..
వ్యాపారి: చూడు నాయనా నీ సలహా వల్ల నాకు లాభం రాక పోయినా ఫరవాలేదు గానీ ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టమాకు .. నీకో దణ్ణం .. (ఇంక ఇక్కడినుంచి ఫో.. అని చెప్పకనే చెప్పాడు
అస్మదీయుడు: అదికాదండీ.. (ఇంకా ఎదో చెప్పి ఒప్పిద్దాం అనే ప్రయత్నంగా..)
వ్యాపారి: ఏమయ్యా.. ఆ గంట బిజినస్ వల్ల వచ్చే నష్టం నువ్వు భరిస్తావా..
అస్మదీయుడు: మరండీ..
వ్యాపారి: పనిచూసుకో ..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: తెలుగు దేశం కార్యకర్త - తెదేకా

తెదేకా: ఒక గంట ఎందుకు సారు.. మొన్న మా బాబు గారు చెప్పినట్లు..
అస్మదీయుడు: బాబుగారు ఈ విషయం గురించి చెప్పారా.. ఎమన్నారబా..
తెదేకా: అబ్బే .. బాబుగారు ఈ విషయంపై ఏమీ చెప్పలా.. రైతన్నలను తీసుకున్న బాకీల్లో దేనికీ తిరిగి కట్టద్దొన్నారుగా..
అస్మదీయుడు: అయితే..
తెదేకా: వారేమో తీసుకున్న రుణాలు కట్టొద్దన్నారుగా.. అలాగే... ఇది కూడా.. పూర్తిగా ఎగ్గొట్టేస్తే పోలా..
అస్మదీయుడు: అప్పుడు అసలుకే ఎసరొస్తుందిగా.. ఉన్న కరంటు కనక్షను పీకేస్తుంది కదా ప్రభుత్వం..
తెదేకా: దొంగ కనక్షన్ ఉండనే ఉందిగా..
అస్మదీయుడు: ప్రభుత్వం మీ మీద దొంగ కనక్షన్ కేసులు పెడితే..
తెదేకా: అప్పుడు మా బాబుగారున్నారుగా... తిరిగి.. ప్రభుత్వం పైనే కేసులు వెస్తారుగా..
అస్మదీయుడు: ఎలా..
తెదేకా: అధికార ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రతి పక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారని...
అస్మదీయుడు: (ఏమిటిది .. ఎక్కడ మొదలైంది .. ఎటు పోతోంది .. అని తలస్తూ .. ఇంక లాభంలేదని విరమించుకున్నా..) ..

----------------
ముఖ్యపాత్రధారి: కాంగ్రెశ్ కార్యకర్త - కాకా

కాకా: ఏం మాట్లాడుతున్నావు? నీకే మైనా అర్దం అవుతోందా..
అస్మదీయుడు: ఏం బాబూ.. ఎదో ప్రపంచం అంతా..
కాకా: ప్రపంచం అంటావు.. బొత్తిగా నీకు లోక ఙ్ఞానం లేకుండా పోతోంది
అస్మదీయుడు: నాకా..
కాకా: నీకు కాక పోతే .. నాకా మరి..
అస్మదీయుడు: ఏందుకంటారు..
కాకా: మరేమో మా పెద్దాయన చక్కగా ఉచితంగా ఇస్తా ఉంటే.. నువ్వేంది.. ప్రతి పక్షం వాళ్ళు చెప్పినట్లు .. వాగుతున్నావు..
అస్మదీయుడు: అదికాదు.. (ఎదో అనబోతుంటే..)
కాకా: ఏందీ ప్రతి పక్షం వాళ్ళదగ్గర ఎదైనా తీసుకున్నావా..
అస్మదీయుడు: నేనా ..
కాకా: ఫరవాలేదులే.. ఎంత తీసుకున్నావో చెప్పు .. నాకు ఎంతిస్తావో చెప్పు.. దీని గురించి నేనెవ్వరికీ చెప్పను..
అస్మదీయుడు: ..
కాకా: పెద్దాయనతో నేను మాట్లాడతా.. నువ్వెమీ వర్రీ గాకు..
అస్మదీయుడు: మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్దం కావటంలేదండి..
కాకా: ఒరేయి .. వీడ్నెవడురా లోపలికి పంపించింది..
అస్మదీయుడు: ..

----------------

ఇలా చాలా చాలా అనుభవాలు .. ఎన్నెని చెప్పను నా వెతలు .. సూక్ష్మంగా అందరూ బత్తీ బంద్‍కి వ్యతిరేకులే కానీ .. మన వంతు కర్తవ్యంగా ఎదో ఒకటి చెద్దాం అని అనుకోని పరిస్థితి చూస్తుంటే..

రాజుగారి పెళ్ళికి నావంతు భాగంగా గిన్నెడు నీళ్ళైతే ఎం పోతుందిలే..

అని అందరూ అనుకున్న వైనం గుర్తుకు వస్తోంది. చదివే చదవరులూ మరి మీరు వచ్చేనెల 15వ తారీఖున బత్తీ బంద్ పాటిస్తున్నారా..

మీ విలువైన స్పందనలకై ఎదురుచూస్తున్న

భవదీయుడు.

-------------------------------------------
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ! వినురవేమ!

7 కామెంట్‌లు:

vijju చెప్పారు...

మొన్న బత్తి బంద్ చేసినప్పుడు నేను రూంలో లేను కాకపోతే మా ఇంటి ఒనర్ వాళ్ళు చేసారంట... నాకు కొంచెం సంతోషంగా వుంది... ఈ సారి మా ఇంట్లో వాళ్ళని చేయమని చెప్తాను.
నాకు తెలిసి మన హైదరాబాదులో 20% కూడ చేసి వుండరు. ఇది ఇప్పుడే కద మెదలు ఐంది. కాబట్టి కొంత కాలం వేచి చూడాలి. ఈ టీవి వాళ్ళూ ముఖ్యంగా న్యూస్ చానెల్ వాళ్ళూ చెత్త చెత్త వాటి మీది బాగ concentrate చేస్తారు కాని ఇలాంటి వాటి మీద రోజు ఒక మంచి ప్రొగ్రాం వేస్తే ప్రజలలో ఒక 10 to 20% ఐన మార్పు రావచ్చు.

Rajendra Devarapalli చెప్పారు...

బత్తీబంద్ కావచ్చు,సేవ్ ది వేల్స్ కావచ్చు ఎలాంటి పర్యావరణ ఉద్యమాలకైనా ప్రజల భాగస్వామ్యం.మద్దత్తు తప్పని సరి.అందరికీ సదరు కార్యక్రమ ఉద్దేశ్యాలు రేఖామాత్రంగా నయినాతెలియాలంటే బత్తీబంద్ లాంటి కార్యక్రమాలు కొంతమేరకు దోహదం చేస్తాయి.సమస్యతీవ్రతను ఉపరితలం మీదకు తోడ్కొని వచ్చేందుకు సింబాలిక్ గా ఉపకరిస్తాయి.
దశాబ్దాల తరబడి బిలియన్ల కొద్దీఖర్చుతో జరుగుతున్న ఎయిడ్స్ ప్రచారం గురించే ఇంకా ప్రజా బాహుళ్యంలో లెక్కలేనన్ని అపోహలున్నాయి,ఇటీవల ప్రారంభమయిన బత్తీబంద్ గూర్చి ఆమాత్రం అనుమానాలు జనాల్లో ఉండటం సహజమే.ఎన్నికల్లో ఓటింగ్ దగ్గర్నుంచీ ఎందులోనూ నూటికి నూరు శాతం జనాభా పాలుపంచుకోరు,కానీ వీలయినంతమందికి సందేశాన్ని చేరవేయటమే పర్యావరణ అవగాహన కార్యకర్తల ప్రధానధ్యేయం.చక్రవర్తి గారు మీరు ఎదుర్కొన్న అనుమానాలను ఎలా నివృత్తి చేసారో/చేస్తారో తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

A very good article. Though it seems hilarious, it is a fact. People are like that only. But we have people who are interested to support. The shop owner showed keen interest on this concept. He is interested to sell in candle light.

Coming to the answers for the questions, I will share in detail in a day or two. This is just a quick comment.

-- Prasanthi.

durgeswara చెప్పారు...

chaalaa saradaagaa anukunnadi saadhimchaaTiki prayatnam baagumdi

అజ్ఞాత చెప్పారు...

Hello. And Bye.

అజ్ఞాత చెప్పారు...

Hi there,I enjoy reading through your article post, I wanted to write a little comment to support you and wish you a good continuation. All the best for all your blogging efforts.

Praveen Mandangi చెప్పారు...

వేసవిలో కరెంట్ పోయి కూలర్ తిరగకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి.

 
Clicky Web Analytics