17, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం – విలువ ఎంత?

దైవంపై పలు ఆలోచనల తరువాత, లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే ఈ పుట. దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది. ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన.

నిజానికి ఎలక్ట్రాన్ అనేది ఉందని ఎవ్వరు చూసారు? భూమి గుండ్రంగానే కాక ఎలిప్టికల్ ఆకారంలో ఉందని ఎవ్వరు చూసారు?  గురుర్వాకర్షణ శక్తి గురించి చేసిన ప్రతిపాదనను మనం ఎలా నమ్మాలి? ఇంకా వగైరా వగైరా.. ఇవన్నీ చార్వాకుల ఆలోచనలు. ఇంతకీ ఈ చార్వాకులెవ్వరు? వారి సిద్దాంతం ఏమిటి? అని ఆలోచిస్తే .. ముందుగా చార్వాక సిద్దాంతం బయట పడుతుంది. ఆ తరువాత వీరి నేచర్ అర్దం అవుతుంది.

ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము. ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి. అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది. ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే, చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే, చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి. ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే, అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట.

ఇలాంటి చార్వాకులే కొన్ని సార్లు మనకి మేలు చేస్తుంటారు, కానీ చాలా సార్లు (అంటే దాదాపుగా అన్ని సార్లు) మనకు నష్టాన్నే కలిగిస్తారు. ఉదాహరణకి నన్నయ్య గారిని మన ప్రభుత్వం ఆది కవి అని గౌరవిస్తే, అసలు నన్నయ్య అనే వాడు లేడు అందువల్ల ఇలాంటి ఆలోచన వ్యర్దం అని వాదించే వారు. అదిగో అలాంటి ఆలోచనే ఖచ్చితంగా “దేవుడు లేడనే” వాదన. “దేవుడనే వాడు నిజ్జంగా ఉంటే కనబడమనిండి చూద్దాం!!” అని వితండంగా వాదించేవారు. క్రిందటి పుటలో Physics / Geology / Education / వంటి వాటి గురించి సున్నితంగా సృజించాను. ఇప్పుడు Mathematics పరంగా లెక్కలేసే ప్రయత్నం చేస్తాను.

మనం ఎప్పుడైనా లెక్కలలో ఏదైనా తెలియనప్పుడు దానిని X (ఎక్స్) అనుకుంటాం. అలాగే ఈ దైవాన్ని ప్రస్తుతానికి X అనుకుందాం. అలాగే ప్రతీ మనిషికీ ఓ విలువ ఉంటుంది. ఈ విలువ వారు చేసే పనిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి మనచేత ఉద్యోగం చేయించుకునే వ్యవస్థ మన విలువను లెక్కగట్టి నెలకు ఇంత ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఆ విలువను Y అనుకుందాం. ఇప్పుడు నాకు అక్కడ చేసే పనిలో దైవం తోడైయాడనుకుందాం అప్పుడు నా విలువ ఏమిటంటే

నా విలువ =  X (దైవం విలువ) + Y (నాకు ప్రపంచం కట్టిన విలువ)

ఆ విధంగా నావిలువ Z అనుకుందాం. Mathematics సూత్రాల ప్రకారం  Z = X + Y

ఇప్పుడు దైవం లేదనుకుందాం. దైవమే లేదనుకుంటే, దైవానికి విలువకూడా లేనట్టే కదా, అందువలన Z = Zero + Y, కాబట్టి

Z = Y

కానీ ఒక్క సారి ఇలా ఆలోచించండి. దైవం ఉండటం వల్ల దైవానికి ఓ విలువ ఉంటుంది కదా, అందువల్లన Z = SomeValue + Y, కాబట్టి

Z ≠ Y

నేను పాజిటివ్‍గా ఆలోచించే వాడిని కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ప్రతిపాదనలోని SomeValue అనేది తప్పనిసరిగా అది సున్నాకన్నా ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. ఆ విధంగా SomeValue అనేది అధమ పక్షంలో 1 అయినా

Z = 1 + Y

నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను. ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి, ఒక సూటి ప్రశ్న. నిజ్జంగా దేవుడు లేడనుకుంటే, నాకు పోయిన నష్టం ఏమీ లేదు. అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా?

3 కామెంట్‌లు:

Mauli చెప్పారు...

హ్మ్.. ఊహి౦చని ఆలోచన. సరే మీరు చెప్పిన మాథ్స్ ఫార్ములా నే తీసికొ౦దాము.

దైవ౦ విలువ ఎ౦త అన్నది మీరు మీకు గా నిర్ధారి౦చకు౦డా మ౦చి పని చేశారు. ఇక ఆ సమయానికి దైవ౦ విలువ ఆ మాట్లాడుతున్న వ్యక్తి ని బట్టి స౦దర్బాన్ని బట్టి కూడా అనుకోవచ్చు అ౦టారా.

ఈ మార్గ౦ లో, ఏ వ్యక్తి తానొక్కడు గా , తనకు మాత్రమె స౦బ౦ధి౦చిన ఆలోచన తో దైవానికి విలువ ఇవ్వలేడు.ఇ౦కొక ప్ర్రాణి గురి౦చి తన ఆలోచన ను పరిగణి౦చి లెక్క లోనికి తీసికోవాలి.

ఉదా: మదర్ థెరిసా కు ఆమె కు తోడ్పడిన వారి మధ్య దైవ౦ విలువ ఎక్కువ గా ఉ౦టు౦ది. అలాగని స౦ఘ సేవ ని మాత్రమే అత్య౦త పెద్ద కారక౦ తీసికోవాలని కాదు. కాని దైవ౦ విలువ , కనిపి౦చే ప్రయోజనాన్ని బట్టి కదా ఉ౦డాల్సినది. చూడగలమా అన్నది అర్ధ౦ చేసికొనే దాన్ని బట్టి ఉ౦టు౦ది

ఓ బ్రమ్మీ చెప్పారు...

మౌళి గారు,

ఎవ్వరు ఎలా ఏవిధంగా ఎవ్వరిని ప్రాతిపధికన తీసుకుని విలువ ఇచ్చినా పాజిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళకి అది పాజిటివ్ విలువగానే కనబడుతుంది. ఆ విలువ ఎంత అనేది ప్రతి వ్యక్తిగతం. ఆ విషయాన్ని నేను స్పృజించను.
మున్ముందుగా స్పందించినందులకు నెనరులు. ఇకపై కూడా ఇలాగే స్పందిస్తూ ఉండమనవి.

Mauli చెప్పారు...

http://telugu.greatandhra.com/mbs/april2011/satya_part3.php

దైవ౦ గురి౦చి ఇలా౦టి చర్చ

 
Clicky Web Analytics