14, ఏప్రిల్ 2011, గురువారం

పుణ్యభూమిపై జరుగుతున్న దాడి – మహానుభావుల భావన

కొంతకాలం క్రిందట పుణ్యభూమి అనే గుంపునందు ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరు వ్యక్తులు నా భావాలకు వ్యతిరేకంగా స్పందించారు. వారిలో మొదటి వారు ఓ పేరు మోసిన తెలుగు బ్లాగర్ గారైతే, పరదేశి గారు మరొకరు. వీరి భావనలలోని ఆంతర్యం మరో మహానుభావునితో పోలి ఉందని ఈ మధ్య నాకు అర్దం అయ్యింది. వీరందరి ఆలోచనలలో చాలాచక్కటి పోలికే కాక భారతీయత యందు వీరందరికీ చాలా దగ్గరి సంబంధం కనబడుతోంది. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవ్వరంటే, గౌరవనీయులైన గరిక పాటి నరశింహా రావు గారు.
ప్రతీరోజు భక్తి టీవిలో గరికపాటి వారు రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నారు. మధ్య మధ్యలో వీరు పిట్టకధలుగా రామాయణం నుంచి తొలగి మన సంసృతికి పడుతున్న దుర్ఘతి గురించి వీరు పడుతున్న ఆవేదన పడుతూ చేసే వ్యాఖ్యానాలు పైన ఉదహరించిన వారి భావనలతో నూటికి నూరు శాతం సరిపోతుంది.  ఒక్కొసారి ఈ చర్చలో జరిగిన విషయాన్ని చదువుతుంటే, గరికపాటి వారి వ్యాఖ్యానం వింటుంటే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానే ఇది ఓ సరి అయిన సమయం, ముష్కరులపై మనం కూడా దాడి చెయ్యాలి. ఈ విషయం తెలియడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ వీరిని నేను అపార్దం చేసుకోలేదని బ్లాగు పూర్వకంగా వినతి. ఇక దాడి విషయానికి వస్తే, వివాదాలకి దూరంగా ఉంటూ వచ్చిన నాకు వివాదస్పదమైన చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి అనవసర దాడిని తిరిగి త్రిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యడానికి కొంచం ధైర్యం కావాలి. మన సంసృతిపై సరి అయిన అవగాహన వస్తే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది. అలాగే చొరవ వస్తుందని నమ్ముతూ సంసృతిని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
అన్యమనస్కంగా ఆ ఇద్దరి పేర్లను ఇంతకు ముందు ప్రస్తావించినందులకు వారి అభిమతం దెబ్బదిన్నట్లైతే, మన్నించ ప్రార్ధన.

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

You don't have to publish the names of people who are part of private & closed group like Punyabhoomi.

You can change names to put forward your point to protect the identity of those people.

చక్రవర్తి చెప్పారు...

అఙ్ఞాత గారు,

మీ ఆలోచన సమంజసంగా ఉంది. వెంటనే పేర్లు మారుస్తాను. స్పందించినందులకు నెనరులు. ఇకపై కూడా ఇలాగే స్పందిస్తూ ఉండమనవి.

అజ్ఞాత చెప్పారు...

ఏందిరోయ్.. ఎగతాళిగా ఉందేంటి. తొక్కలో గాళ్ళకు నీ సపోర్టా.. ఆళ్ళనీ నిన్ను ముగ్గుర్ని కలికి ఏకామనుకో..

 
Clicky Web Analytics