26, జులై 2010, సోమవారం

అమెరికాలోని జీవన విధానం – నా పాయింట్స్ : మొదటి పుట

అక్కడెక్కడో బ్లాగుల్లో అమెరికా జీవన విధానం గురించి చర్చ జరుగుతుంటే, నేను కూడా పాలు పంచుకుంటే ఏమి పోతుందిలే అని పూనుకున్నాను అనుకోకండి.. ఏదో ఇక్కడ (అంటే అమెరికాలో) ఉన్నా కదా అందుకే ఇలా. అయినా ఇక్కడి జీవన విధానం ఎప్పుడో ఒక సారి వచ్చి పోయే నాలాంటి వాడికి ఎలా తెలుస్తుంది!!?? ఏదో కోతలు తప్ప.. అందుకని సీరియస్ గా ఆలోచించకుండా .. ముందుకి సాగిపొండి..

  1. ఇక్కడ పిల్లల బాల్యం నుంచే ఆధారపడకుండా బ్రతికేటట్టు తల్లి తండ్రులు నేర్పిస్తారు. ఇక్కడ ఆధార పడటం అనే విషయంపై ఇంతకు ముందు వ్రాసాను, ఓ లుక్కేయ్యండి.
  2. పిల్లల్లో స్వతంత్ర భావాలకు నాంది పలుకుతున్నాం అనే ముసుగులో వీరు భాద్యతను నెత్తి కెక్కించుకోవటం లేదని నా అభిప్రాయం. పిల్లలను చిన్నప్పటినుంచే వేరే గదిలో నిద్ర పోయేటట్టు నేర్పిస్తారు. అలా వారు వారి గదులను వారి అభిరుచి మేఱకు తీర్చిదిద్దుకోవచ్చు అన్న మాట. మరి బెడ్ టైమ్ స్టోరీస్ విషయమేమిటో..
  3. దేవుడు దయ్యం, నీతి నియమం, మంచి చెడు, స్థితి గతి.. వగైరా వగైరా వంటి విషయాలను తల్లి తండ్రులు పాటించరు అలాగే పిల్లలకు నేర్పించరు. ఏమైనా అంటే, అది వాళ్ళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలనిపిస్తే వాళ్ళే నేర్చుకుంటారు లేదా జులాయి వెధవల్లా పోతారు అని వీరి ఉద్దేశ్యం.
  4. పిల్లల బడిలో తల్లికూడా కూర్చుంటుంది కానీ అది నామ మాత్రం మాత్రమే.. మేమే అన్ని నేర్పిస్తే ఇక ఉపాద్యాయులుగా మిమ్మల్నెందుకు పెట్టుకున్నారు అని అంటారు.. మరి కొందరైతే ఇంకొంచం ముందుకెళ్ళి, చక్కగా “హోమ్ స్కూలింగ్” అని చెప్పి పిల్లల్ని వారి వయసు ఉన్నవారితో దూరంగా, సామూహికంగా కలసి మెలసి చదువుకోవలసిన సమయ్యాన్ని ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసేస్తున్నారు.

 

ఈసారికి ఇక్కడితో ఆపేస్తున్నాను, మరింకెన్ని వస్తాయో..

12 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

అయ్యా మీరు ఎన్ని అమెరికను కుటుంబాల్ని పరిశీలించి ఇటువంటి మహత్తరమైన నిశ్చయాలకి వచ్చారు?

శరత్ కాలమ్ చెప్పారు...

మీ ఆబ్జర్వేషన్స్ అన్నీ వాస్తవ దూరంగా, హాస్యాస్పదంగా వున్నాయి. ఎంత తక్కువ కాలం యు ఎస్ లో వున్నా మరీ ఇలాంటి అంచనాలకొచ్చారా?! అమాయకులు అయితే నిజమే అని నమ్మేస్తారు.

Malakpet Rowdy చెప్పారు...

I agree with #2 in case of a few families but not on the other points.


************************


కొత్త పాళీ అన్నారు...
అయ్యా మీరు ఎన్ని అమెరికను కుటుంబాల్ని పరిశీలించి ఇటువంటి మహత్తరమైన నిశ్చయాలకి వచ్చారు?
____________________________________

May be the same number of Indian families you have observed before talking about Indian "BS" :))

Probably what he feels about the US culture is in sync with what you feel about the Indian one - Touche!

అజ్ఞాత చెప్పారు...

What he posted is not entirely wrong. Also at the same time it doesn't give complete picture. Some parents do read stories for their kids during night, but not always.

For both Kottapali and Sarath, if what he is telling is not right, can u explain why you never see any mom who feed her baby just like any indian mom would do if the baby is not eating properly?

In US Parents just put food on plates and ask the kids to eat, but they won't spoon feed from atleast 8-9 months.

శ్రీ చెప్పారు...

కోతలు బాగా కోసారు

ఓ బ్రమ్మీ చెప్పారు...

కొత్త పాళీ గారు,
నేను మొదటనే చెప్పానండి.. ఎప్పుడో ఒక సారి వచ్చి పోయేనాకు ఇక్కడి విషయాలు మరియు వీరి జీవన విధానం నాకు ఎలా తెలుస్తుంది .. ఏదో కోతలు తప్ప అని. అది కాకపోయినా కొన్నింటిని మాత్రం చాలా దగ్గరగా చూసిన తరువాతే వ్రాసాను. వాటిల్లో ఒకటి పిల్లలకు వేరే పడక గదులు ఉండటం అనే విషయం అబద్దం కాదని ఒప్పుకుంటారనుకుంటాను. మా ఇంట్లోనూ డబుల్ బెడ్ ఉన్నా మా అన్నయ కూతురు మా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా మా ప్రక్కనే పడుకుంటుంది. అంటే అది ఇంకా పెద్దమనిషి కాలేదనుకోండి, అంత వరకూ అది చిన్న పిల్లే అని మా అభిప్రాయం. అది చక్కగా గుండెల మీద నిద్రపోతుంటే.. అహా.. ఏమి సంతృప్తి!! ఏమోనండి, నేను ఓ వెఱి వెధవను .. నాకు ఇలాంటి తృప్తి చాలు. ఏది ఏమైనా మీరు స్పందించారు అంతే సంతోషం అందుకు నెనరులు..

శరత్ గారు,
అన్నీ సత్యదూరాలనుకుంటున్నారా.. కొన్ని మాత్రం నాకు నిజమనిపించాయి. స్పందించారు అందుకు సంతోషం మీకు నెనరులు

మలక్ పేట రౌడీ గారు,
కొంతలో కొంత నా మనోభావాన్ని అర్దం చేసుకునే మాటలన్నారు. సంతోషం.. ఓ భారతీయుడు అమెరికా జీవనాన్ని ఇలాగే చూస్తాడేమో.. స్పందించినందులకు నెనరులు

అజ్ఞాత గారు,
నిజమే చెప్పారు. నా భార్యకు పెళ్ళి అయిన తరువాత కూడా వాళ్ళ అమ్మమ గోరు ముద్దలు తినిపించేది. మహాత్మురాలు కాలంచేశారు, కానీ ఉన్నన్ని రోజులు ఎన్ని మంచి మాటలు చెప్పెవారో.. ఇక్కడి జీవన విధానంలో అలాటి ఆప్యాయతలు లేవేమో .. ఏదైనా స్పందించారు.. నెనరులు

శ్రీనివాస్ మరియు శ్రీ గార్లకు
స్పందించినందులకు నెనరులు

అజ్ఞాత చెప్పారు...

నీ అజ్ఞానానికి హద్దు లేకుండా ఉంది నాయనా! బ్లాగులో ఏమి రాయాలో ఏమి రాయకూడదో కూడా తెలుస్తున్నట్టు లేదు. మా అన్న కూతురు అంటే చాలుగా, అది "పెద్ద మనిషి కాలేదు కాబట్టి" గుండెల మీద బజ్జోపెట్టుకుంటున్నా..అని రాయడం ఏమిటి ప్రభో! రాసేటపుడు కాస్త స్పృహ ఉండాలి. .

ranjani చెప్పారు...

^!^ అజ్ఞాత

అజ్ఞానమో మరొకటో
అసత్య ప్రచారాలు చేయనంత వరకు ,
ఇతరులని దూషించనంతవరకు -
ఎవరి బ్లాగు వ్రాతలు వారి ఇష్టం.

అజ్ఞాత చెప్పారు...

I second second Agnaata.

Ranjani - i don't think you are a girl, if you were you can feel how awkward it is.

I always seem to find something or the other in this blog. Before it gets to me or Kamal, bye (hopefully never to return).

-6th agnaata.

ranjani చెప్పారు...

^^ తమరి ఊహ తప్పే సుమా!
వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని బట్టి పురుషులా, స్త్రీలా
అని కనుక్కునే పద్ధతి ఉంటే బాగానే ఉంటుంది. ఆ
అవసరమూ ఉంది మాకు..

అజ్ఞాత చెప్పారు...

Tho' I do respect individuals' opinions about anything, I'm unable to refrain from commenting on this blog & content.

This blog's content is biased, immature & not worth returning- I wish the Blogger would be more responsible going forward. Good Luck!

- A Visitor from the land-what-this blog-is-about. (I refrained from using Telugu- as I fear that I would cross my vocabulary limits).

అజ్ఞాత చెప్పారు...

Amiable post and this fill someone in on helped me alot in my college assignement. Say thank you you on your information.

 
Clicky Web Analytics