14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

12 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

వాళ్ళకి జైసే కో తైసా అనే హిందీ సామెత అబ్బినట్టు ఉంది. దాన్ని తెలుగులో కన్నుకి కన్ను అంటారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Yes, sleeping.. Nice post.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

perfume sprays adలు ఇంకా ఘోరం

చక్రవర్తి చెప్పారు...

అఙ్ఞాత గారు,

స్పందించినందులకు నెనరులు

ఫ్రవీణ్ శర్మ గారు,

అదేనండి నేను చెప్పింది. పంటికి పన్ను అనే రీతిలో ఉంది వీరి ధోరణి.

వనజ వన మాలి గారు,
సమర్దించినందులకు నెనరులు.

చిలమకూరు విజయమోహన్ గారు,
నా కంట్లో అవి పడలేదండి. ఇదిగో ఇప్పుడు చెప్పారు కదా, దానిని గమనించే ప్రయత్నం చేస్తాను. స్పందించి వివరం తెలియజేసినందులకు నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

స్త్రీల లోదుస్తుల ప్రకటనలు కూడా అదిరిపోతున్నాయి గమనించారా ?

అజ్ఞాత చెప్పారు...

దీన్ని ఖండించడం కేవలం మహిళా సంఘాల పనే కాదేమో.

Mauli చెప్పారు...

వాలి, సుగ్రీవుల కధ లాగా ఉన్నట్లు౦ది :)

మొదటిసారి ముద్దు పెట్టుకోబడిన మహిళ మర్యాద కాపాడ్డ౦ కోస౦ ఇ౦కో ఆవిడని ముద్దు పెట్టుకొన్నాడు :)

Sri Kanth చెప్పారు...

ఇద్దరబ్బాయిలు జిమ్ములో మాట్లాదుకుంటుంటారు.. నీ గిర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది అని. ఒకతను, చెప్పే పోలికలను చూసి మరోకనికి కంగారు మొదలవుతుంది. ఆమె ఎలా ఉంటుంది అని అడుగుతుంటాడు. అడిగినవన్నీ మ్యాచ్ అవుతాయి, ఆమె చదివే కాలేజ్ గట్రా గట్రా.. చివరగా ఒకటి అడుగుతాడు, ఆ అమ్మాయి ఏ సెల్ ఫోన్ వాడుతోందని, అది కూడా మ్యాచ్ అవుతుంది. చివరగా ఆ సెల్ ఫోన్ కలరేంటని, తను వేరే కలర్ చెప్పగానే ... ఇద్దరు ఊపిరిపీల్చుకుంటారు. వారిద్దరికీ పరిచయమైన అమ్మాయులు ఒక్కరు కాదు అని.

కానీ, ఆ సెల్ ఫోన్ వాడు ఇష్టం వచ్చిన కలర్ మార్చుకునే సదుపాయం కల్పించాడు. ఆ అమ్మాయి, తన సెల్ ఫోన్ కలర్ మార్చుకుని, మూడో అబ్బాయితో తిరుగుతుంటుంది. ఆ ఇద్దరినీ మోసం చేసి. బహుషా ఇంకా కొంతమందితో తిరుగుతూ ఉండొచ్చు అనే అర్థం వస్తుంది ఆ యాడ్ లో.

ఇలాంటిదే ఇంకో యాడ్ ఉంది. నా టపాలో డిటీల్డ్ గా రాసి ఉంచాను, లంకె ఇస్తున్నాను వీలైతే మొదటి నాలుగు పేరాలు చదవండి.

<a href= "http://thenerdinsideme.blogspot.com/2011/04/blog-post_14.html>అమ్మాయిల కన్నా అబ్బాయిలే 'అందం' కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారట..!!</a>

ఇప్పుడు చెప్పండి, దీని మీద గొడవ ఎవరు చేయాలి? మహిళా సంఘాలా? పురుష సంఘాలా? లేక పౌర సమాజమా? అసలు ఇంత చిన్న చిన్న విషయాలకి ఆందోళనలు చేయడం అవసరమా? లేదు కాబట్టే, మహిళా సంఘాలు చేయట్లేదని నేననుకుంటున్నాను.

Sri Kanth చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Praveen Mandangi చెప్పారు...

ఇంకా నయం, రేప్ చేసినవాడి భార్యని రేప్ చేస్తున్నట్టు చూపించలేదు.

vijay చెప్పారు...

గొంగట్లో తింటూ అన్నంలో వెంట్రుకలొచాయంటే ఎలా?

చక్రవర్తి చెప్పారు...

విజయ్ గారు,

మఱో సామెత చెప్పారు. బాగుంది. ఇలాగే మరి కొన్ని చెబుదురు..

 
Clicky Web Analytics