12, జూన్ 2011, ఆదివారం

బొత్స సత్యన్నారాయణ – నా అభిప్రాయం

బొత్స సత్యన్నారయణ గారి గురించి క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. కాకపోతే, ఒక్క సారి వారి గతాన్ని అవలోకించుకుంటే, కొన్ని పచ్చి నిజాలు నాకు మింగుడు పడని పచ్చి వెలక్కాయలు అవుతాయి. ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా ఓ అభిప్రాయం ఉంది, కాకపోతే అది ఒక రాజకీయ పార్టీగా కాక రాజకీయ వ్యాపార వ్యవస్థగా ఓ మంచి వ్యాపార దృక్పధం కలిగిన సంస్థగా లాభాలను ఆర్జించే దిశలో సాగి అభివృద్ది చెందుతున్న లంచాల పార్టీగా నాకు అనిపిస్తోంది.

ఈ అభిప్రాయం వెనకాల కొన్ని (నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే) వివరాలు. మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని. కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి. ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ .. డాష్.. వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు, ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం. కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు.

ఇక వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలిందంటూ, వేరే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, స్వతంత్ర పార్టీగా ఎదిగిన ప్రజా రాజ్యం పార్టీ, సదరు ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత, ప్రస్తుతం అవినీతి / లంచ గొండితనం / వగైరా వగైరా లేవు కాబట్టి, ప్రరాపా అవసరం లేదు, చక్కగా కాంగేస్ పార్టీలో కలసి పోతాం అన్న వివరం నాకు మింగుడు పడటం లేదు. దీని వెనుక మాకేమీ ధనలాభం జరగలేదు అని ప్రరాపా వారు అంటే, నిరూపించడానికి నావద్ద సాక్ష్యాలు లేవు. కానీ అదంతా ఒఠి హంబక్, అంటూ నమ్మెయ్యమంటే కొంచం కష్టం మరి.

రారె గారు, రాజశేఖర్ రెడ్డి గారు అని ఇకపై చదువుకోమనవి. రారెగారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వాగెన్ స్కాం ద్వారా తన పదవిని కోల్పోయిన ప్రస్తుత బొస గారు, (బొత్స సత్యన్నారాయణ గారు), ఆంద్రప్రదేశ్ కాంగ్రేశ్ పార్టీకి అధ్యక్ష్యులు అయ్యారు. అప్పటి స్కాం కనుక ప్రతి పక్షం వారు పట్టించుకోకుంటే, మఱో కర్మాగారం ఆంద్ర ప్రదేశ్ కు వచ్చేది. అదేనండి కార్ల తయారి కర్మాగారం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరికేది. సరే, అది అంతా గతం, అదే గనుక జరిగి ఉంటే, బొస గారు చక్కగా ఆ సంస్థ పనులలో బిజీగా ఉండి ఇలా అయ్యేవారు కాదేమో. ఇలా జరిగినందులకు బొసగారు అప్పటి ప్రతి పక్ష నాయకుడైన నాచనా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలా ఋణ పడి ఉంటారు. ఉండాలి కూడా.

నాచానా గారు పట్టు పట్టి బొసగారిని పంచాయితీ రాజ్ వ్యవస్థనుంచి తప్పించ కుంటే, బొసగారిలో కసి పెరిగేది కాదు. అలా బొసగారిలో కసి పెంచి వారి కుటుంబం నుంచి ఏకంగా నలుగురు వ్యక్తులను ఎమ్ ఎల్ ఎ లుగా చేసేటట్టు చేసిన నాచానా గారికి బొసగారు ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక్కరు ఎన్నికల్లో గెలవడమే చాలా కష్టమైన సందర్బాలుండగా, ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి పార్టీ టికెట్టులు తెచ్చుకుని, ఆ నలుగురిని గెలిపించే భాద్యత బుజాల మీదకు వేసుకున్న బొసగారు సామాన్యుడు కాదని మనం గమనించాలి. నిజమే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నికల్లో పార్టీ సీటు రావడం గొప్ప కాదు, కానీ ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందంటే, ఆ కుటుంబం అయితే ప్రజా సేవలో నిరతిశయమైన కృషి చేసుండాలి లేదా మరింకేమైనా చేసి ఉండాలి. బొసాగారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించిన నలుగురు వ్యక్తుల గురించి ప్రజలకు అంతగా కాదు కద కొంతగా కూడా తెలియదనే చెప్పుకోవాలి. ఇక్కడ నా మట్టి బుర్రకు సమాధానం లభించని కొన్ని ప్రశనలు.

  • కొంతగా కూడా తెలియని ఈ నలుగురికి కాంగ్రెస్ టికెట్టు ఏ బేసిస్ మీద ఇచ్చిందబ్బా?
  • ఇలా టికెట్టు కొట్టేసిన నలుగురు ఏ విధంగా గెలిచారబ్బా?
  • గెలిచిన ఈ నలుగురి వెనుక బొసగారి సపోర్ట్ లేదంటే నా మది ఎందుకు అంగీకరించటం లేదబ్బా?
  • .. ఇంకా

రారేగారి హయాములో వోక్స్ వాగన్ స్కాంలోనుంచి క్లీన్ గా బయట పడి, తన ప్రతాపమేమిటో నాచానా గారికి అలాగే కాంగ్రేశ్ పార్టీలో అందరికీ షాకులు ఇస్తున్న బొసాగారిని అభినందించ కుండా ఉండలేను. ఏది ఏమైనా వీరు మాత్రం చాలా యునీక్, అంటే ఓ స్పెషల్ ఐటం అన్న మాట. దేవుడు వీరిని ఎలా చేశాడో కానీ చాలా స్పెషల్ గా తయారు చేసారు. కాకపోతే వీరి అభివృద్ది అంతా ప్రజా సేవ వల్లే జరిగింది అంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. వీరు చేసిన ప్రజా సేవ ఏమిటో నాకు అర్దం కావటం లేదు. ఒక్కసారి వీరి నియోజక వర్గం అయిన విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ది పనులేమిటో చూసి వస్తా. అంత వరకూ బొసాగారు, మీరు ఇక విజృంబించేయ్యండి. ఆల్ ద బెస్ట్

11 కామెంట్‌లు:

Ramana చెప్పారు...

బాగుంది మీ వ్యాసం. వీలుంటే నా బ్లాగ్ సూడండి

http://pachchinijaalu.blogspot.com/

చక్రవర్తి చెప్పారు...

రమణ గారు,

నిజాలు వ్రాయడానికి కొంచం ధైర్యం కావాలి. మీలో ఆ ధైర్యం కనబడంటం లేదు, ముసుగు వీరుడిలా మీరు వ్రాస్తున్న వైనం మెచ్చుకొకుండా ఉండలేను కానీ, ముసుగు తీసేసి వ్రాస్తే బాగుంటుందని మనవి.
స్పందించిప్రొత్సాహించినందులకు నెనరులు.

Ramana చెప్పారు...

అరె నా పేరు రమణారెడ్డి కడపజిల్లా జమ్మలమడుగు దగ్గర పల్లె మాది డిగ్రీ డిస్కంటిన్యూ సేసి వ్యవసాయం జేస్చనా ఇంగేమి కావాల సెప్పబ్బా నా వివరాలు? ముసుగెక్కడ సెప్పు

చక్రవర్తి చెప్పారు...

రమణ గారు,

lol .. భలే చెప్పారు. కవరింగ్ బాగుంది. కాకపోతే, అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలంటారు. మీరు చెప్పేది నమ్మబుద్ది కావటం లేదు. ఏమైనా, స్పందించి వివరం తెలియ జేసినందులకు నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

@ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది...
ఇప్పుడు కూడా కాంగీయులు తక్కువ సేవ ఎమీ చేయడము లేదు...కాక పోతే ప్రతీ సేవకీ ముడుపులు చెల్లించాలి...మీరు ఏసీబీ కి పట్టుబడ్డా కూడా వారు తమ సేవలతో మిమ్మల్ని ఒడ్డున పడేయగలరు.... ఎలాంటి కేసులు లేకుండా చేయగలరు...

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పావు, చెక్కురవర్తీ. జీతే రహో.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

సెక్రవర్తి బావ్ మా బాగా సెప్పినావయ్యా మా బొస బావ్ గురించి... మా వోడు మఱిసెట్టు నెక్క ఊడలు దిగబారించేసినాడు మా జిల్లాలో.. మరొకడెవుడూ జిల్లాలో అడుగుపెట్టనీకుండా తన సామ్రాజ్యం ఇస్తరించేసినాడంటే నమ్ము.. ఇంకొకడెవుడు బ్రాందీ, సారా వేపారానికి రానీయక ఓల్ సేల్ మొత్తం సిండికేట్ తనసేతుల్లోనే.. జిల్లా కేంద్రంలో పెబుత్వ జాగాలల్లో తన మల్టిప్లెక్స్ లు కట్టించేత్తున్నాడు బావ్..ఎప్పుడైనా మా ఇజీనగరం వొత్తే బస్సుల కాంప్లెక్సుకాడాగి ఒకమారు ఎదురుగుండా సూడండయా బావ్.. అక్కడ వున్న పెభుత్వ జాగా మొత్తం లీజుకు తీసుకున్న అంబికా కంపెనీ వోడ్ని బయపెట్టి ఈయన గారు దొబ్బేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టేత్తున్నాడు. అలాగే మరి ఆ సుట్టుపక్కలెక్కడా జాగాలు మిగలనీయలేదు.. అటు గోదారమ్మ జిల్లాల్లో కూడా పాగా ఏసీనాడని ఇనికిడి..ఒకపాలి మీరొచ్చి సూసి ఈ వట (విష) వృక్షం కింద గానోదయం పొంద ఇన్నపం..

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఇక్కడ వ్యాఖ్య రాస్తూ నాకొచ్చిన ఆలోచన నా సామాన్యుడు బ్లాగులో పొడిగించా..చదవగలరు..http://saamaanyudu.wordpress.com/2011/06/13/%E0%B0%B5%E0%B1%8A%E0%B0%9F-%E0%B0%B5%E0%B1%83%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%82/

చక్రవర్తి చెప్పారు...

kvsv గారు,

స్పందించి వివరాన్ని విశదీకరించినందులకు నెనరులు.

అఙ్ఞాత గారు,

మీ అభిమానానికి ధన్యవాదాలు.

కేక్యూబ్ వర్మ గారు,
మీ యాస కొంచం కొత్తగా మింగుడు పడకుండా ఉంది. సరే, స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.

vijay చెప్పారు...

ఇంకా ఏ కాలం లో ఉన్నారండీ మీరు. రాజకీయాలంటే ఇలా.....ఇలా.....ఇలా..... అంటున్నారు(వ్రాస్తున్నారు).
లెక్కల్లో సూత్రాలున్నట్లు.రాజకీయాలలో కూడా సూత్రాలు ఉన్నాయి. మచ్చుకు ఒకటి.
"మీ ఇంటికొస్తే ఏమిస్తావు. మాఇంటికొస్తే ఏం తెస్తావు."

చక్రవర్తి చెప్పారు...

విజయ్ గారు,

నిజమేనండి. అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి.

 
Clicky Web Analytics