30, డిసెంబర్ 2010, గురువారం

మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి

బ్లాగుని ఒక PDFగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. ఒక వేళ రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటారా, ఉదాహరణకి, మీరు వ్రాసిన బ్లాగు పోస్టులన్నీ మీరు భద్రప్రఱచుకోవాలనుకున్నారనుకోండి, ఎమి చేస్తారు? ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇలాంటి వారి ఆలోచనల నుంచి ఉద్బవించినదే ఓ అవకాశం. ఇలా చెయ్యాలనుకున్నవారి నిమిత్తం ఒక అప్లికేశన్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించి, మొదలు పెట్టాను. క్రిందటి సంవత్సరమే దీనిని మొదలు పెట్టినా, పెద్దగా పురోగతి సాధించలేక పోయ్యాను. దానికి పలు ఆటంకాలు మఱియు అవరోధాలు. వీటన్నింటినీ అధిగమించి ఎలాగైతే ఓ ఉపకరణాన్ని తయ్యారు చేసాను. ఇక అంతా అయ్యింది అని సంబరపడే వేళలో మరి కొన్ని విఘాతాలు. వాటినీ అధిగమిస్తాను అన్న మనోధైర్యం నాకు ఉంది అలాగే అధిగమించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానమూ ఉంది. కాకపోతే నా చేతిలో లేని ఓ విషయమే ఇక్కడ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది.

ఈ ఉపకరణం సృష్టించే ప్రయత్నంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. వాటిలో చాలా మటుకు సాంకేతిక పరమైనవి అయితే, ఒకటి బ్లాగు పరమైనటువంటిది. అది నలుగురితో పంచుకుంటే, అందరికీ తెలుస్తుందని ఇలా నా బ్లాగులో పెడుతున్నాను. తెలిసిన వారు ఒగ్గేయ్యండి, తెలియని వారు ప్రయత్నించండి. ఎందుకంటే, RSS కనుక ఎనేబుల్ చేస్తే మీ బ్లాగుని చదవాలనుకునే వారికి మీరు మఱో సౌలభ్యం కలిగించిన వారౌతారు. లేదనుకోండి చదవాలని ఆసక్తి ఉన్నవారు, తప్పని సరిగా మీ బ్లాగుని సందర్శించాల్సిందే. అంతే కాకుండా, నా ఉపకరణం ద్వారా మీ బ్లాగుని PDF చేసుకోవాలనుకుంటే, RSSని ఎనేబుల్ చెయ్యండి. చేసి, నాకో లేఖ వ్రాస్తే, మీ బ్లాగుని నా ఉపకరణం చదవగలుగుతుందో లేదో చూసి చెప్పగలను. నా ఈ ఉపకరణం యొక్క మొదటి మెట్టు RSS ద్వారా మీ బ్లాగుని చదివి ఆ తరువాత PDFని తయారు చెయ్యడం. ఇది సాధించిన తరువాత RSS లేకపోయినా చదవగలిగేటట్టు తయారు చేస్తాను.

ముందుగా మీ బ్లాగులో RSS ఎనేబుల్ చెయ్యబడి ఉందో లేదో చూసుకోండి లేదా ఈ క్రింద చూపిన చిత్రంలో హైలేట్ చెయ్యబడ్డ లంకెలను వరుసక్రమంలో ప్రయత్నించండి. ఈ క్రింద ఇచ్చేవి బ్లాగర్ వారి సెట్టింగ్స్ మాత్రమే, వర్డ్ ప్రస్ వారి సెట్టింగ్స్ మరో విధంగా ఉండవచ్చు. గమనించగలరు.

image

మీ బ్లాగు సెట్టింగ్స్ మార్చేటప్పుడు ఒక్క సారి “Advanced Mode” వెళ్ళి చూడండి. అక్కడ మీకు మరి కొన్ని సౌలబ్యాలు కనబడతాయి. దాని తెరపట్టుని ఇక్కడ మీకు అందిస్తున్నాను.

image

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ఒక్క బ్లాగు పోస్టులు మాత్రమే కాకుండా, పోస్టు స్పందనలు కూడా మీరు నియంత్రించవచ్చు. ఇలా నియంత్రించేటప్పుడు ప్రతీ పోస్టుకీ స్పందనలు విడివిడిగా ఇవ్వవచ్చు లేదా అన్ని స్పందనలను కలగలిపి ఒక ఫీడ్ మాదిరిగా ఇవ్వవచ్చు. అంతే కాకుండా, ఇవేమీకాకుండా, ఫీడ్ బర్నర్ ద్వారా మీ బ్లాగుకి ఒక లంకె ఏర్పరుచుకునే అవకాశమూ ఇక్కడ ఉంది. నా సలహా ఏమిటంటే, మీకు పైన చూపిన తెరపట్టులో అన్ని సౌలభ్యాలకు నేను “Full” అని ఉంచాను కావున నాకు ఫీడ్ బర్నర్ వారి అవసరం లేదు. మీరు కనుక మీ బ్లాగు సెట్టింగ్స్‍ పైన చెప్పినట్లు లేనట్లైతే మఱోసారి మీ బ్లాగు సెట్టింగ్స్ అన్నింటినీ ఒక్కసారి సరి చూసుకోండి లేదా నాకు ఒక విధ్యుల్లేఖ వ్రాయండి, స్పందిస్తాను.

అంతవరకూ నేను నా ఉపకరణం తయ్యారు చేసే పనిలో ఉంటాను. మీరు స్పందించే పనిలో ఉండండి.

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముక్తి అనగానేమి?

ఈ మధ్య నేను తెలుగు నిఘంటువులో పాలుపంచుకుంటూ తెలుగు పదాలను యూనికోడ్ ద్వారా వ్రాస్తున్నప్పుడు కలిగింది ఈ ప్రశ్న. ఓ సత్‍సంగంలో ఈ విషయమై చర్చ మొదలు పెట్టగా పలు పలు సమాధానాలు మరియు వివరణలు వచ్చాయి. వాటన్నింటిని క్రోఢీకరించి ఓ చోట ఉంచితే బాగుంటుంది అన్న ఆలోచన రూపమే ఈ పోస్టు.

ముక్తి గురించిన వివరాలు చదివే మీకు తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిన వివరాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అసందర్బం అనిపిస్తే మన్నించండి.


ముక్తి అనేది రెండు స్థితులలో ఉంటుంది అని, “లేవండి మేల్కొనండి” అనే బ్లాగు రచయతైన సురేష్ బాబుగారు ఈ క్రింది విధంగా స్పందించారు.

1.జీవన్ముక్తి, అంటే జీవించి ఉండగానె పరమాత్మలో లేక ఆత్మానందం లొ నిమగ్నమై ఉండడం.
2.విదేహముక్తి, అంటే మరణించిన తర్వాత ముక్తి పొందడం.


చర్చలో పాల్గొంటూ, “వాగ్విలాసము” అని బ్లాగుతున్న ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు తన అభిప్రాయాన్ని వారిమాటలలో..

చతుర్విధ ముక్తములు అనేవి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఇవి ముక్తిభేదాలు కావనుకుంటా! తన్మార్గంలో వివిధస్థాయీభేదాలు అనుకుంటాను.

సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో೭స్మ్యహమ్

అని శివానందలహరిలో ఆదిశంకరులు స్తోత్రం చేస్తారు.

· నిరంతరసంకీర్తనం గుణగానం వలన సారూప్యం (ఆ గుణాలు అలవడటం) సిద్ధిస్తుంది.

· శివభక్తులతో నిత్యసాంగత్యం వలన సామీప్యం (దగ్గఱితనం) సిద్ధిస్తుంది.

· సమస్త చరాచరజగత్తునందూ శివునినే చూడటం వలన సాలోక్యం (కైలాసవాసం) సిద్ధిస్తుంది.

· తదనంతరం సాయుజ్యం (స్వామిలో ఐక్యమవ్వటం) సిద్ధిస్తుంది


చర్చలో ఆఖరున పాల్గొన్న లీలామోహనం బ్లాగరి చిలమకూరు విజయ మోహన్ గారు ఈ క్రింది విధంగా వారి అభిప్రాయాన్ని తెలియ జేసారు.

మోక్షము,కైవల్యం,సాలోక్యం,సారూప్యం,సామీప్యం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మోక్షమంటే విడుదల అని అర్థము. కర్మబంధమునుండి పూర్తిగా విడుదల పొందడాన్ని మోక్షమని రూఢిగ అంటారు. అలా కర్మబంధం తొలిగాక, రెండు స్థితులుంటాయి.

జీవుడు అర్చిరాది మార్గం ద్వారా విరజానదిని దాటడందాక అంతా సమానమే. విరజానది దాటాక కేవలం ఆత్మానుభవమే కోరి తృప్తిచెంది, అలా ఉపాసన చేసినవారు ఆ పరమపదంలోనే ఓమూలనుండే చోటుకు చేరి కేవలునిగానే మిగిలిపోతాడు. దానిని కైవల్యం అంటారు. అదీ మోక్షమే.

కర్మలన్నీ నశించాయి అర్చిరాదిగుండా విరజానది దాటి వచ్చాడు కనుక ఇక తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశించడు. భగవదనుభవాన్ని కోరలేదు కనుక దాన్ని పొందడు, తిరిగి వెళ్ళడు. స్వాత్మసాక్షాత్కారం పొంది, ఆత్మానుభూతిలో తేలియాడుతుంటాడు.అది నిత్య స్థితి.

అదికాక, భగవత్సేవనే మోక్షమని ఉపాసించిన వాడు, విరజానది దాటగానే అమానవ అనే స్పర్శతో పంచోపనిషణ్మయ దివ్యదేహం ఏర్పడుతుంది. అది చాలా రకాలుగ అలంకృతమై, ప్రేమ పూర్ణమై భగవదనుభవార్హమై గరుడుని తోడ్పాటుతో పరమాత్మ సన్నిధికి చేరి స్వామిసేవలో ఉంటాడు.వీటిల్లో ఆలోకంలోకి, విరజానది దాటగానే, ప్రవేశిస్తాడే ఈ జీవుడు, ఆ స్థితిని సాలోక్యం. భగవంతునితో సమానంగా ఒకే లోకంలో ఉండడం.

ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి, అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది.

క్రమంగా భగవన్మండపము ప్రవేశించి భగవంతుని దరికి చేరు సమయం- సామీప్యం అంటారు.

అతడి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణ దివ్యదంపతుల గోష్ఠిలో ఉండి, అతడి గుణాలను పొంది నిత్యకైంకర్యాన్ని చేపట్టడం సాయుజ్యం అంటారు .

ఇందులో ముక్తులు అందరూనూ, గరుడాది పెద్దలందరినీ నిత్యులని వ్యవహరిస్తుంటారు.ఈ వెళ్ళిన వీడు ముక్త గోష్ఠిలో చేరతాడు.

23, నవంబర్ 2010, మంగళవారం

భవదీయుడు అంటే..

అనే గూగుల్ గుంపులో ‘’ అనే పదం యొక్క అర్దంపై ఓ చక్కని చర్చ జరిగింది. ఆ చర్చలో గౌరవనీయులైన Dr. R. P. Sarma గారు ఇచ్చిన వివరం బహు విపులంగా ఉండటంతో దానిని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


మొదటగా పవిరాల అచ్యుత్ ప్రసాద్ గారు ఈ ప్రశ్నని అడిగి ఈ క్రింది విధంగా వివరించారు

భవదీయుడు = భవత్ + విధేయుడు = your's obidiently

ఇక్కడ "భవదీయుడు" ని విడదీసిన విధానము మరియు "భవత్ = your's" రెండూ కూడా crude guesses మాత్రమే


ఇందుకు స్పందిస్తూ టెకుముళ్ళ వెంకటప్పయ్య గారు ఈ క్రింది విధంగా వివరిస్తూ తెలుగులోని ప్రధమా విభక్తి ప్రస్తావన తెచ్చారు

భవత్ అంటె నీవు, మీరు, జరుగుచున్న కాలం అని అర్ధము. అదే భవదీయ అంటే  నీది అని అర్ధం

ఐతే తెలుగు లో ("డు, ము, వు, లు") ప్రధమా విభక్తి చేయడంతో భవదీయుడు అయింది.  అంటే....  మీ యొక్క అని మాత్రమే, విధేయుడు అని అర్ధము తీసుకోరాదు అని నా అభిప్రాయం


నేదునూరి రాజేశ్వరి గారు తెలుగులో భవదీయుడు అన్న పదానికి అర్ధం దొరకలేదు కానీ

భవము =పుట్టుక,సంసారము,ప్రాప్తి,శుభము ,సత్తా అని

భవత్ =కలుగుచున్న,పుట్టుచున్నఅనీ,

భవదీయము =మీది ,అనీ,విధేయము = సాసింప తగినది , విహిత కార్యము అనీ

విధేయుడు = సేవకుడు  చెప్పినట్లు వినువాడు అనీ

ఇలా అర్ధాలు ఉన్నాయి అని వివరించారు.


వీరిని సమర్దిస్తూ సుధాకర్ గారు సంసృతంలో భవదీయుడు అని చదివినట్టు ఉంది అని ప్రస్తావించగా, Dr. R. P. Sarma గారు ఈ క్రింది విధంగా వివరించారు. వారి పాఠ్యాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


ఆసక్తికరమైన చర్చ జరిగింది. మొదటే టేకుమళ్ళవారు సరిగానే వివరించారు. భవదీయుడు పదం తెలుగు నిఘంటువుల్లో దొరకకుంటే దొరకక పోవచ్చుగాక. ఎందుకంటే - మనం వినే ఇటువంటి  సంస్కృతపదాలు చూడండి. దేశీయ పదజాలం, రాష్టీయ అసమానతలు, మానవీయ సంబంధాలు, జతీయ సంపద మొదలైనవి. (స్పష్టత కోసం వేరేపదాలతో సమసించిన పదాలను ఇచ్చాను.) వీటిని దేశ+ఈయ; రాష్ట్ర+ఈయ; మానవ+ఈయ; జాతి+ఈయ అనే విధంగా విభజించాలి. ఇందులో మొదటిది పదం(ప్రకృతి).రెండవది ప్రత్యయం. ‘ఈయ’ అనేప్రత్యయానికి పై ఉదాహరణలవల్ల ‘సంబంధించిన’ అనే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి

 

భవదీయ = భవత్+ ఈయ  అని విభజించాలి.


ఇందులో భవత్ అనేది టేకుమళ్ళవారు చెప్పినట్టు ...‘తమరు’ అనే అర్థం ఇచ్చే శబ్దం. దాన్ని భవచ్ఛబ్దం అంటారు. దీనికి సంస్కృతంలో మూడులింగాల్లోనూ రూపాలున్నాయి.


పుం.      భవాన్      భవన్తౌ      భవన్త:  .........
స్త్రీ .        భవతీ       భవత్యౌ     భవత్య:  ........
నపుం.    భవత్       భవతీ       భవంతీ ........


కాబట్టి - భవత్+ఈయ > భవదీయ= తమరి (Yours)...


ఇక నిఘంటువుల్లో సాధారణంగా మూలపదం మాత్రమే ఇస్తుంటారు. దాని మీద ప్రత్యయాలు చేరగా ఏర్పడే కృత్తద్ధిత పదాలు అన్నీ ఇయ్యకపోవచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ఇందుకు కొంత మినహాయింపు.

ఇంకా భవ శబ్దానికి 1.పుట్టుక 2. సంసారం మొ. అర్థాలూ ఉన్నాయి.

భవత్ శబ్దానికి ‘జరుగుచున్న కాలం’ అనే అర్థం లేకపోయి ఉండవచ్చని గెడ్డపువారు అభిప్రాయపడినారు. కాని, జరుగుచున్న/జరగబోయే/జరిగిన అనే అర్థాల్లో ఉంది. సంస్కృతంలో ‘భూ’ ధాతువు(క్రియ) ఉంది. దానికి ‘సత్తాయాం’ అని అర్థం.

సత్తా అంటే ‘స్థితి’(Status).

మనం వాడే ‘భూత,భవిష్యత్’ పదాలు ఆ ధాతువునుండి పుట్టినవే.వర్తమాన అనే పదమొక్కటి ‘వృతూ వర్తనే’ అనే వేరొక ధాతువునుండి పుట్టినది.

ఇక ‘అస్మదీయ’ అనే పదం విషయానికి వస్తే.. అస్మద్ శబ్దం (అహం=నేను అనేది ఈ శబ్దరూపమే)పై ఈయ చేరిన రూపం

6, నవంబర్ 2010, శనివారం

భాగ్యనగరంలో బ్లాగు ప్రమదలు

భాగ్యనగరంలోని బ్లాగు ప్రమదలన్నీ ఈ రోజు అక్కడేక్కడో కలుసుకుని ఏదేదో చర్చించుకున్నారు. ఈ విషయం నాకెలా తెలిసింది అని అడుగుతున్నారా!! మరేం లేదండి. ఇవ్వాళ ప్రొద్దునే నా భార్య ఓ చిన్న గిన్నెలో గుప్పెడు బియ్యం ఉడకేసి వాటికి జతగా ఓ నాలుగు బెండకాయల్ని వేయించి అక్కడ పెట్టి నేను బయటకు వెడుతున్నా, నాకు బండి కావాలి అని అడిగింది. ఏంటబ్బా తనకి ఇంత అవసరం అని మనసులో అనుకుని, సరే గాని ఎక్కడికి వేళుతున్నావ్ అని అడిగా. అదిగో అప్పుడు పేలింది మొదటి తూటా.

ఏం? మీకు చెప్పాలా.. మా ఆడోళ్ళంతా ఓ చోట చేరి మా కష్ట సుఖాలు పంచుకోకూడదా.. అన్నీ మీకు చెప్పే చెయ్యాలా..

ఆ సౌండ్ కొంచం తేడాగా ఉంటే, శాంత తల్లీ మనం ఈ విషయమై మళ్ళీ చర్చించుకుందాం అని అప్పటికి దాటేశాను. కానీ నాకు కూడా బండి కావాల్సి వచ్చినందున, నేను దింపుతాలే అని ఓ స్టిల్ ఇచ్చా. మాటైతే ఇచ్చాను కానీ ఏమి జరుగుతోందా అన్న ఆలోచన బ్యాక్‍గ్రౌండ్ లో తిరుగుతోంది. ఆ ఆలోచన అలా తిరుగుతూ ఉండగా మెల్లిగా బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకు వద్దాం అని బయలు దేరాం. రెండో తూటా పేలే ముందు కొంచం గింగిరాలతో ఫ్లాష్ బ్యాక్..

మాకు పెళ్ళి కాక ముందు వరకూ నా భార్యది చాలా చిన్న ప్రపంచం అని చెప్పవచ్చు. అందరి ఆడపిల్లలలాగా చాలా  గారాబంగా పెరిగింది, చదువుకున్నంత సేపు ఇల్లు కాలేజీ తప్ప మరో ప్రపంచం ఎరగదు. విజయవాడలో వాళ్ళ ఇల్లు ఉన్న ఏరియా, దుర్గాపురం మరియు గాంధీనగర్ లోని శాతావాహన కాలేజీ వైపు తప్ప మరో ప్రదేశం తెలియదు. ఈ రెండు కాకుండ, ఏలూర్ రోడ్డులో విజయటాకీస్ నుంచి కాంగ్రెశ్ ఆఫీస్ రోడ్డు వరకు కొంచం తెలుసు. అంతకు మించి ఏమి తెలియవు. ఓ డొక్కి సైకిల్ తొక్కుకుంటూ బొంగరం తిరిగినట్టు దుర్గాపురంలో ఉన్న వాళ్ళ స్నేహితుల ఇళ్ళకు మాత్రం వెళ్ళి వచ్చేది.

పెళ్ళికి ముందు మా అత్తగారు నాభార్య గురించి ఓ డైలగ్ కొట్టారు. మీరు కొంచం దారి చూపించండి ఇకపై తాను అల్లుకు పోతుందని. సరే ఏదో అన్నారు కదా అని అప్పట్లో మా అమ్మ వాడే లూనా నేర్పించాను. ఫరవాలేదు ఒక్క సారి నేర్పగానే పట్టేసింది. సైకిల్ తొక్కడం ద్వారా వచ్చిన బాలెన్స్ చెయ్యడం ఉపయోగ పడింది. ఎలాగో వచ్చు అనిపించిన తరువాత తనకి అంటూ ఓ బండి ఉంటుంది కదా అని హోండా వాడి ఏవియేటర్ కొనిచ్చా. ఆ తరువాత మేము ఎక్కడికి వెళ్ళినా తననే డ్రైవ్ చెయ్యమంటాను. ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే అంత ఎక్కువ అలవాటౌతుందని దాని వెనకాల ఆంతర్యం. మొదట్లో తాను కొంచం భయపడినా, పోను పోను నేర్చుకుంది. మొత్తం మీద హైదరాబాద్ అంతా కాకపోయినా దాదాపు ప్రధాన ప్రదేశాలన్నీ తనకి తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే, విజయవాడ కన్నా హైదరాబాదే ఎక్కువ తెలుసు అని చెప్పొచ్చు.

మా పెళ్ళి కాకముందు నాకు ఓ ఆలోచన ఉండేది, భార్యగా వచ్చే నా అర్ధాంగికి నేను మాత్రమే ప్రపంచం కావాలి అనుకోకుండా, తనకి అంటూ ఓ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా, తనది అంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి అనుకునే వాడిని. అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు. అదిగో అలాంటి ఘటనే ఈ నాటి ఈ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇవ్వాళ అక్కడ చేరే ప్రమదలలో ఒక్కరు కూడా నా భార్యకి చుట్టరికం ఉన్న వాళ్ళు కాదు. అక్కడి వారు ఇటు నావైపు భందువులు కారు అటు తనవైపు చుట్టరికం ఉన్న వారు కాదు. బ్లాగు పెట్టి తనకు నచ్చిన సోది వ్రాసుకుంటూ మిత్రులైన తోటి బ్లాగర్లతో కలసి ఓ ఫుల్ నూన్ ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యింది అంటే, ఆ ప్రపంచంలో నేను లేను కానీ ఆ బ్లాగు పెట్టడానికిన్ నేనే కారణం అనేది నాకు ఆనందానిస్తోంది.

ఇక రెండో తూటా విషయానికి వద్దాం, ముందుగా ఎర్రగడ్డ రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చాం. అప్పుడు కూడా నా భార్యే డ్రైవర్. వెళ్ళాం, వచ్చాం. బాగానే జరిగింది. అప్పుడు కూడా నేను వెనకాలే కూర్చున్నా. ఇంతకాలం నేను వెనకాలే కూర్చున్నా లేని అనుభూతి ఇదిగో ఇప్పుడు ప్రమదలందరినీ కలిసేందుకు వెళుతుంటే కలిగింది. అదే భయం. ఎందుకంటారా, ఎప్పుడూ లేని హుషారు ఒక్కసారిగా కనబడింది. బండి నడుపుతుంటే, అది కాస్తా ఏ మాత్రం స్పీడ్ తగ్గదే. నా పై ప్రాణాలు పైనే పోయ్యాయి అంటే అది అతిశయోక్తి కాదు. ఎలాగో గుండె చిక్కబట్టుకుని వెనకాల కూర్చున్నా. కూర్చున్నా అన్న మాటే గాని వెనకనుంచి ఒకటే సణుగుడు. ఒక టైంలో తనకి విసుగు పుట్టి ఇంకెక్కువ మాట్లాడావో ఇక్కడే దింపేస్తా అని అల్టిమేటం ఇచ్చింది. దాంతో ఇక మనం సైలెంట్. అలా రెండో తూటా ఓ పావుగంట సతాయించగానే వీళ్ళు కలుసుకోవాల్సిన ప్రదేశం వచ్చింది. బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయట పడగానే చూడాలి నా మొఖంలోని రిలాక్స్, వర్ణనాతీతం.

అలా బ్లాగు ప్రమదల సమావేశం ఈ నాడు నాకు రెండు హార్ట్ ఎటాక్స్ ఇచ్చింది. మనకేమైనా వివరాలు లీకైతే, మీకు మరో పుటలో చెబుతా, అంత వరకూ అంతా ఉష్.. గప్ చుప్..

4, నవంబర్ 2010, గురువారం

ఇవి మీకు తెలుసా!!

ఈ మధ్య మా కంపెనీ వారు ఏవైనా ఆర్టికల్స్ పంపండి వాటిని మంత్లీ మెగజైన్‍లో మీ పేరుమీద వేస్తాం అంటే, అమేజింగ్ డివైకేస్ అనే శీర్షికన ఈ క్రింద చెప్పిన విధంగా ఓ ఆర్టికల్ వ్రాసి పంపాను. అందులో జావా గురించిన విషయం ఉండటం వల్ల వారు ప్రచురించ లేదు. అది వేరే సంగతి, ఇంతకీ ఈ విషయాలు మీకేమైనా తెలుసా!!
****
మొదటి ఆశ్చర్యకరమైన విషయం
ప్రతీ పద్నాలుగు రోజులకి ఓ భాష చనిపోతోంది అంటే మీరు నమ్ముతారా!!?? 2100 నాటికి ఏడువేలకు పైగా భాషలు అంతరించిపోతాయి, వీటిల్లో చాలా వాటిని ఇప్పటికీ రికార్డ్ చెయ్యబడలేదు. ఇవన్నీ మానవుల సంస్కృతికి మరియు జ్ఞానానికి నిధులు. మానవుల చరిత్రకు ఇవి సాక్షాలు. ప్రకృతి పరంగా మానవుని మేధస్సుకి ఇవి తార్కాణాలు. ఇంకా చదవాలనుకుంటే http://bit.ly/LangDie
రెండవ ఆశ్చర్యకరమైన విషయం
జావా వర్చ్యువల్ మెషీన్ లో చాలా లోపాలున్నాయి, ఇది డాట్‍నెట్ వర్ట్చ్యువల్ మెషీన్ కన్నా చాలా లోపభూయిష్టమైనది అంటే మీరు నమ్ముతారా!! అమెరికాలోని వర్జీనియా యూనివర్శిటి వారి కంప్యూటర్ విభాంగం వారు పరిశోధించి వివరాలను ఓక శ్వేత పత్రంగా వెలువరించారు.  దాని మరిన్ని వివరాలకై http://bit.ly/JavaVMLeak
మూడవ ఆశ్చర్యకరమైన విషయం
అమెరికా వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.. దేనికంటారా? అదేనండి పెట్టుబడి పెట్టడానికి. వారి వద్ద ఎంత ధనం నికరంగా మూలుగుతోందో మీకు తెలుసా? వీరి ఆర్ధిక చరిత్రలో ఈ సంవత్సరంలో అత్యధికంగా, దాదాపు 837 బిలియన్ డాలర్ల అంటే మీరు నమ్ముతారా. ఇంత డబ్బు పెట్టుకునీ వారు జనాలకు ఉపాధి కలిగించడం లేదు, ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇదిగో  http://usat.ly/US837B
నాల్గొవ ఆశ్చర్యకరమైన విషయం
మీరు కాలేజీ బంక్ కొట్టి ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నారా, అలాగే చదువు ఎగ్గొట్టి మంచి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా!! ఇదిగో యహూ వాడు మీకోసం ఓ ఏడు విధాల ద్వారా బాగా డబ్బు సంపాదించే వివరాలను అందిస్తున్నాడు. మరిన్ని వివరాలకై http://bit.ly/SkipCol
ఐదొవ ఆశ్చర్యకరమైన విషయం
Mayfly అనే కీటకం దాదాపు 30 నిమిషాల నుంచి అత్యధికంగా ఓ రోజు వరకూ మాత్రమే జీవిస్తుంది అంటే మీరు నమ్ముతారా. అత్యల్ప జీవితకాలం బ్రతికే జీవులగురించి చదవండి, http://bit.ly/ShortLive
****
వీటిల్లో మూడు నాల్గొవ అంశాల గురించి నేను బ్లాగాను, మీలో కొందరు ఆ విషయమై స్పందించారు. అవి కాకుండా మిగిలిన విషయాల గురించి స్పందించమనవి. ఒకవేళ మీరుగాని 3 & 4 విషయాల గురించి ఇప్పుడే చదువుతున్నట్లైతే ఆ విషయాలపై కూడా స్పందించ వచ్చు.

3, నవంబర్ 2010, బుధవారం

అవినీతి రహిత సమాజం కలుగుతుందా!!

ఈ మధ్య బిఎస్‍ఎన్‍ఎల్ వాడు ఒక ఎస్‍ఎమ్‍ఎస్ పంపించాడు. అవినీతి రహిత సమాజం కోసం కేంద్రప్రభుత్వం ఒక కమీషన్ ఏర్పరిచింది, దానియందు మీరు కంప్లైంట్ చెయ్యవచ్చు. దాని వివరాలకై http://www.cvc.nic.in సంప్రదించండి లేదా 011-24651000 కు కాల్ చెయ్యండి వివరాలు తెలుసుకోండి అని ఆ ఎస్‍ఎమ్‍ఎస్ తాత్పర్యం.

ఇది చదివిన తరువాత నాకు కలిగిన మొదటి సందేహం అవినీతి రహిత సమాజం వీలౌతుందా? ఒక వేళ వీలు చేద్దాం అని అనుకుంటే, మన రాజకీయ నాయకులు వీలు కలిగించడం మాట అటుంచి, అలా ఆలోచించే వాళ్ళని ఏరి పారేస్తారుగా!! మరి అలాంటప్పుడు అలా ఆలోచించేదెవ్వరు? ఒక వేళ నాలాంటి వాడు ఏదో ఉద్దరిద్దాం కదా అని నడుము కట్టుకుంటే, ఎగతాళి చేసే వారే కానీ కలిసి ముందుకు సాగుదాం అని ఎంతమంది ముందుకు వస్తారు. ఇకవేళ ఎవ్వరో కొందరు ముందుకు వచ్చినా ఇలా వచ్చిన అందరూ ఒకే తాటిపై నడిచేదెప్పుడు? అందరూ కాకపోయినా కొందరైనా చేతోడుగా ముందుకు సాగితే, మిగిలిన కొందరు వారికి పెద్ద పీట ఇవ్వలేదన్న కోపంతో వీరిని వెనక్కు లాగుతూ ముందుకు పోకుండా అడ్డుకుంటూ ఉంటే, అవినీతి ఎప్పటికి నశించేది? ఇలా ప్రశ్నిస్తూ కూర్చోకుండా, నలుగురిని పోగేసుకుని పోదాం అనే ఉద్దేశ్యంతో, నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ చేరవేస్తున్నాను.

మీరు కూడా మీకు తెలిసిన వారికి ఈ సమాచారాన్ని తెలియ జేయండి.

26, అక్టోబర్ 2010, మంగళవారం

అమెరికా ప్రయాణ ఫలితాలు

నేను అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళి వచ్చాను. రెండు సార్లు రెండు వైవిధ్యభరితమైన అనుభవాలను మిగుల్చింది. వీటిల్ని ఎప్పటి నుంచో వ్రాయాలనుకుంటున్నాను, కుదరటం లేదు. ఇవ్వాళ మొదలు పెట్టాను, చూద్దాం ఎన్ని రోజుల్లో ముగిస్తానో..

మొదటి సారి

రెండొవ సారి

౧) అమెరికా ఆర్ధిక మాంధ్యం మొదలైంది ౧) ఆర్ధిక మాంధ్యం నుంచి బయట పడ్డట్టు వార్తలు వచ్చాయ్
౨) ఆరు నెలలు అనుకున్న ప్రయాణం ఎనిమిది వారాలలో ముగిసింది ౨) రెండు వారాలు అనుకున్న ప్రయాణం పదమూడు వారాలు సాగింది
౩) మొదటి వారంలో దిగిన హోటల్ నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారాల్సి వచ్చింది ౩) దిగిన చోటే చివ్వరి దాకా ఉన్నాను
౪) హోటల్ పనిమనుష్యులు నా డబ్బుని దొంగిలించారు ౪) హోటల్ వాళ్ళు ఒక్క పెన్నీ కూడా ముట్టుకోలేదు
౫) ఓ రోజు తెల్లవారుఝామున పోలీసు వాళ్ళు నిద్రని పాడు చేసి పోలీస్ స్టేషన్ కి పట్టు కేళ్ళారు. కారణం ఏమిటంటే, నేనుంటున్న ఇంటిలో ఇంతకు మునుపు ఓ దొంగ వెధవ ఉండే వాడంట, వాడి పేరున అరస్ట్ వారెంట్ ఉండటం వల్ల అది నేననుకుని పట్టుకు పోయ్యారు. కాదని ఎంత చెప్పినా వినలేదు ౪) ఈ సారి పోలీసోళ్ళ గొడవే లేదసలు.
౬) ఎడారిలో ఒయసిస్సులా కల్పన అక్క ౬) లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నల్ లా వెరైజన్లో పనిచేసిన సహ ఉద్యోగి హరనాద్ గారు మరియు వారి ఫామిలి
౭) ఆస్టిన్ తప్పమరే ఊరు చూడలేదు ౭) వెళ్ళింది రెడ్డింగ్ అనే పల్లెటూరికి, కానీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ మొదలుకుని, ఫిలడెల్‍ఫియాలోని పలు పట్టణాలు తిరిగాను. న్యూజెర్సీ లోని సోమర్ సెట్ ప్రాంతలో ఉన్న హరనాద్ వారింటికి, మరియు వారికి దగ్గరలోని మరికొన్ని ప్రాంతాలు. వాషింగ్‍టన్ డీసీ, మేరీలాండ్, వర్జీనియా, న్యూజెర్సి సిటీతో కలుపుకుని విహారం బాగానే చేసాను
౮) కల్పన అక్క వాళ్ళు తప్ప మరెవ్వరితో కలవలేకపోయ్యాను ౮) ముఖ పరిచయంలేని చాలా మంది మెక్సికన్స్ తో కలసి ఎన్నో సాహసయాత్రలు చేసాను అలాగే వారి గెట్ తుగెదర్స్ కి అటెండ్ అయ్యాను
౯) క్లైంట్ చాలా బాగా చూసుకున్నాడు ౯) క్లైంట్ బాగా చూసుకోలేదు అని చెప్పలేను కానీ బాగా చూసుకున్నాడు అని మాత్రం చెప్పలేను.
౧౦) అహారం మరియు చిరు తిండి విషయాలలో ఇక్కడ ఎలాంటి కొరత లేకపోయింది ౧౦) అహారం విషయం ప్రక్కన పెడితే, మంచినీళ్ళుకూడా కొనుక్కోవలసి వచ్చింది
౧౧) క్లైంట్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చాడు. తాగడానికి కూల్ డ్రింక్స్, తినడానికి రకరకాలైన తిను బండారలతో బాటుగా, ప్రతీ రోజు రకరకాలైన స్నాక్ ఇచ్చేవారు ౧౧) ఉచితమా!! అంటే ఏమిటి?
౧౨) క్లైంట్ దగ్గర పనిచేసే వారందరి కోసం వారాంతంలో ఇంటికి పట్టుకెళ్ళేందుకు కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉండేటట్టుగా ఆర్డర్ చేసే వారు ౧౨) హూ!! What language am I using and what is the grammar of the language?
౧౩) అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న వైనంలా, నేను వెళ్ళిన కార్యక్రమం పతాకస్థాయికి చేరుకునేటప్పటికి క్లైంట్ వాళ్ళని మరో కంపెనీ కొనేసి మానోట్లో మట్టి కొట్టింది ౧౩) వెళ్ళింది ఒక పని పై అయితే, నా పని తీరు నచ్చి మరో రేండు పనులు చేయించుకుని, రెండు కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా ఓ చిన్న ప్రాజెక్టుని ఇండియాకి పార్శిల్ చేసారు
౧౪) నాలుగు రాళ్ళు వెనకేసుకోవాల్సిన నేను ఉన్నది పోగొట్టుకుని, ఉంచుకున్నదాని పోగొట్టు కోవాల్సి వచ్చింది. అంటే ఇండియాలో ఉన్న ఉద్యోగం కూడా పోయింది ౧౪) నాలుగు వెనకేసుకుందాం అనుకుంటే, రోజుకి పది డాలర్ల బోనస్ గా క్లైంట్ ఇచ్చాడు. అలా నాలుగు కాస్తా ఐదు అయ్యింది. లాభదాయకమే
౧౫) భోజన పరంగా ఇబ్బంది కలగలేదు. వీకెండ్స్ లో కల్పనక్క వాళ్ళింట్లో చక్కగా భోజనం అలాగే ఓ రెండు కూరలు వండుకుని తెచ్చుకునే వాడిని. అలా సోమ మంగళ వారాలు గడిపేస్తే, భుధ గురువారాలకు ఏదో చేసుకుని తినేసే వాడిని. ఇక శుక్రవారం నాటికి మళ్ళీ అక్కావాళ్ళింటికి చెరుకునేవాడిని.. ౧౫) ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బంది అయ్యింది. మొత్తం మీద ఇబ్బంది కరంగానే సాగింది
౧౬) తిరుగు ప్రయాణం అసహనంగా గడిచింది ౧౬) తిరుగు ప్రయాణం బాగా జరిగినా, రెడ్డింగ్ చేరుకునే టప్పుడు పలు చికాకులు, అలాగే ఇరవై నిమిషాల విమాన ప్రయాణానికి ఎనిమిది గంటలు వేచి చూడవలసి వచ్చింది
౧౭) వచ్చేటప్పుడు ఇంట్లో వారికోసం తెచ్చిన సామానులలో ఓ పెద్ద బ్యాగ్ ఆమ్‍స్టర్ డామ్ ఏయిర్‍పోర్ట్ లో తప్పిపోయింది. దానికి ఎటువంటి రికవరీ అందలేదు ౧౭) ఈ సారి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు కుమ్మేసారు
౧౮) క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు ఓ ఐదు నెలల పాటు అనవసరమైన పేమెంట్స్ చెయ్యాల్సి వచ్చింది ౧౮) క్రెడిట్ కార్డ్స్ వారికి ముందుగా తెలియ జేసినా, అవి పని చెయ్యలేదు
౧౯) బంధు మిత్రులను ఎవ్వరినీ కలవలేదు ౧౯) మా పెద్దనాన్నగారి పిల్లల్ని వారి పిల్లల్ని కలిసాను
౨౦) మొత్తంగా చెప్పాలి అంటే, ఆదాయం ౩ ఖర్చు ఏడు ౨౦) అదాయం ఆరు ఖర్చు నాలుగు

14, అక్టోబర్ 2010, గురువారం

నా పోర్ట్ ఫోలియోలో నష్టాల షేర్లు

ఈ మధ్య మన షేర్ మార్కెట్ భలే పరుగెడుతోంది. ఇవ్వాళ్ళ ఆల్ టైం హై చేరుకుంది. సన్సెక్స్ గరిష్టంగా 20710 వద్దకు చేరుకోగా నిఫ్టీ 6239 కు చేరుకుని రికార్డులు బద్దలు కొట్టాయి. ఇంత జరుగుతున్నా నా పోర్టు ఫోలియోలో రెండు స్టాక్స్ మాత్రం నాకు నష్టాన్ని చూపిస్తున్నాయి. వాటిల్లో మొదటిది NHPC రెండవది రిసర్గీస్ మైన్స్. వీటి ద్వారా నేను నష్ట పోయింది పెద్దగా లేదు కానీ ఎందుకో ఈ రెండు షేర్లలో పెద్దగా చలనం కనబడటం లేదు.

NHPC షేర్ ద్వారా నేను 1400/- నష్టపోతే, రిసర్గీస్ ద్వారా 2100/- రూపాయలు నష్టపోయ్యాను. మొత్తం మీద 3500/- నష్టం ఈ నాటి లెక్కల ద్వారా. ఈ రెండు షేర్స్ కొనడానికి నా దగ్గర ఉన్న జెస్టిఫికేషన్ ఏమిటంటే ఫండమెంటల్స్ బాగుండటం మాత్రమే కాకుండా మార్కెట్లో వీటి ధర నాకు అందుబాటులో ఉండటమే. నేను పెద్ద పెద్ద షేర్స్ పైన ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేను కాని చిన్న చిన్న కంపెనీలపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట.

వివరాల్లోకి వెళ్ళే ముందు షేర్స్ పై నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానో చెబితే ఈ రెండు షేర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసానో మీకు అర్దం అవుతుంది. షేర్స్ లో నేను పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి నాకు పదేళ్ళ తరువాత పనికి వచ్చే ఆదాయం అన్న ఉద్దేశ్యంతో స్వల్ప కాల వ్యవధి కాకుండా దీర్ఘకాల ప్రణాళిక అన్నమాట. అందువల్ల ప్రస్తుతం ఉన్న బుల్ మార్కెట్లో నేను లాభాలను దండుకోవటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే..

NHPC, భారతదేశం లోని మొట్ట మొదటి హైడ్రో పవర్ సృష్టించే కంపెని. ఇందులో ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానిదే. లాంగ్ రన్ లో ఆలోచిస్తే ఎప్పుడో అప్పుడు ఇది ప్రవైట్ పరం అవ్వక పోదు అప్పుడు ఇది లాభాల బాట పట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్నాను. ఇవి కొని ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతోంది. అయినా వీటి విలువ పెరగటం లేదు. అయినా ప్రస్తుతం నాకు ఈ డబ్బులు అవసరం లేదు కాబట్టి వీటి గురించి పట్టించుకోనవసరం లేదు.

రిసర్గీస్ వారి ప్రస్తుత ముఖ విలువ రూపాయి కాగా మార్కెట్ విలువ 2.35/- రూపాయలుగా ఉంది. కొంతకాలం క్రిందట వీరి షేర్ ముఖ విలువ పది రూపాయలుగా ఉన్నప్పుడు వీరి మార్కెట్ విలువ డెభైఅయిదు రూపాయలుగా ఉండేది. అప్పుడు ఈ కంపెనీ వారు షేర్ని స్ప్లిట్ చేస్తున్నారు అన్న సమాచారం మరియు ప్రతీ ఒక్క షేర్ కి బోనస్ గా రెండు షేర్స్ ఇస్తున్నారు అన్న వార్త నన్ను ఈ షేర్ని కొనేటట్టు చేసింది. అన్నట్టు గానే స్ప్లిట్ మరియు బోనస్ వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ షేర్ నష్టాలలో సాగుతోంది.

23, సెప్టెంబర్ 2010, గురువారం

టాలెంట్ ఎక్కడో లేదు – మనం గుర్తించడంలోనే ఉంది

ఈ పోస్టు వ్రాయడానికి ముందు పైన చూపిన వీడియోని హరనాద్ గారు వారి బ్లాగులో ఉంచారు. నేను స్వతహాగా వీడియోలను చూడను. కానీ ఈ పోస్టు చూడటానికి ఒకటే కారణం ఆ పాట. మర్యాద రామన్న సినిమాలో నాకు నచ్చిన అంశాలలో ఈ పాట ఒకటి. అదేదో సినిమాలో మహేష్ బాబు ఎంట్రన్స్ కూరగాయల బండిపై చిత్రీకరించారు. ఆ స్టైల్లో తీసినదీ పాట.

మర్యాద రామన్న సినిమాపై నా రివ్యూ మరొ సారి వ్రాస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ కుర్ర గాంగ్ కూడా యమ చేసారు. బాగుంది వీరి క్రియేటివిటి. అన్నింటికన్నా నాకు నచ్చిన అంశం ఏమిటంటే.. ఈ పాట మధ్యలో ఒక్కసారిగా మన హీరోలు అమెరికా నుంచి ఆంద్రాలోని మురికి వాడలో కనిపించడం.  అలాగే మరి కొన్ని సీన్లు. హాలీవుడ్ తీరులో తల్లక్రిందులుగా కొన్ని కొన్ని సీన్లను చిత్రీకరించడం సాంకేతుకంగా పెద్ద కఠినమైన పని కాకపోయినా, క్రియాత్మకతని దృష్టిలో ఉంచుకుంటే.. తలక్రిందులు అనే పదానికి ఈ విడియోలో బాగా కుదిరింది అని నా అభిప్రాయం.

ఈ మధ్య నాకు ఎదురైన కొంత మంది యువకులలో ఒకరిద్దరు వారి వారి భవిష్యత్ ప్రణాళికల పరంగా ఏమి అవుతావు అని అడిగితే సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పడం కొంచం విశ్మయానికి గురి చేసినా, ఇలాంటి వాళ్ళని చూస్తే వీరి ఆలోచనలు నిజమే అనిపిస్తుంది. అవును ఒక విషయాన్ని ప్రజెంట్ చెయ్యడానికి అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్స్ మాత్రమే అవ్వాల్సిన పనిలేదు. క్రొత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోగల అవగాహన ఉంటే చాలు అని నా అభిప్రాయం. ఇదిగో ఇలా.. వీరు నా స్టేట్‍మెంట్‍కి సాక్షాలు. వీరిలో ఏదో తెలియని ఫైర్ ఉంది. వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కనుక దీనిని చూస్తే వీళ్ళని పైకిరాకుండా తొక్కేస్తారు. ఈ విడియోలో నాకు మంచి డాన్స్ కనబడింది.. అలాగే వైవిధ్యమైన డైరెక్షన్ కనబడింది.. మరికొంత హ్యూమర్.. మొత్తానికి హాస్యభరితంగా పాటకు తగ్గట్టుగా ఉంది.

ఆ విధంగా టాలెంట్ అనేది ఎవ్వరో గుర్తించ వలసిన అవసరం లేదు, మనకి మనం ముందుగా తెలుసుకుంటే అంతే చాలు. వీరు గుర్తించి ప్రజెంట్ చేసారు. మన ప్రతిభని ముందుగా మనం తెలుసుకుంటే అందులోంచి క్రొత్తగా ఏదో ఒకటి ఉద్బవిస్తుంది. అలా ఉద్బవించినదే మనకి గుర్తింపుని తెస్తుంది. అంతే గాని మన టాలెంట్ ఎదుటివారు గుర్తించాలి అని మనం ఏదో ఒకటి చెయ్యకూడదు అని నేను నమ్ముతాను. ఏదో ఒకటి చెయ్య్ండి .. కానీ ఆ చేసేది క్రొత్తగా మీ స్వంత ఆలోచనతో మీదైన ఒక శైలిలో చెయ్యండి. అప్పుడు నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు. అదేదో ఆంగ్లంలో చెప్పినట్టు సెల్ఫ్ రియలైజేషన్ అన్నింటికన్నా ముందుండాలి అన్నట్టు, ముందుగా మీరు మీ టాలెంట్ ఏమిటో తెలుసుకోండి.

ఈ సందర్బంగా నాకు 7G బృందావన్ కాలని సినిమాలోని హీరో హీరోయిన్ గుర్తుకు వస్తారు. ప్రతీ వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అసలు సమస్య అంతా దానిని తెలుసు కోవడంలోనే ఉంది. దానిని తెలుసుకో గలిగితే, ఇక మనకి అడ్డు లేదు అని నేనంటాను. మరి మీరేమంటారు.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉచిత విధ్యాలయం

మొదటి రెండు పుటలు నా కలల సౌధానికి రూప కల్పన చేస్తే.. ఈ పుట ద్వారా, ఉచిత విధ్యాలయం ఎలా ఉండాలను కుంటున్నానో తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.
పేరు చెప్పినట్లుగా, ఇక్కడ పూర్తిగా ఉచితం.. విధ్య మాత్రమే కాకుండా, విధ్యార్ధనకు అవసరమైన అన్నీ ఉచితమే అని అర్దమన్నమాట. ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఉండేటటు వంటి ఒకే ఒక అర్హత, ’చదువుకోవాలి అని అనుకోవడమే’.. ఏంటీ కొత్తగా.. కొంచం అర్దం కానట్లుందా.. ఈ బడిలో చేరాలనుకునే పిల్లలకు స్వతహాగా ఆ ఆలోచన ఉండాలి అన్న మాట. ఏంటిది .. పిల్లలు స్వతహాగా అలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం రావచ్చు. కానీ పిల్లల ఆశక్తి దేనిమీద ఉందో తెలుసుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అలాగే నాకంటూ కొన్ని పరిక్షలు ఉన్నాయి. అవి సశాస్త్రీయమైనవో కాదో నాకు తెలియదు కానీ అవి నాకు ఫలితాన్నిచ్చాయి. ఆ పద్దతులను నేను పలు పిల్లలపై విశ్లేషించినప్పుడు నేను ఆశించిన ఫలితం వచ్చింది. అలాగే వారు ఆ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు.
కొంతమంది పిల్లలలో చదువంటే ఆశక్తి ఉంటుంది, మరికొంత మంది పిల్లలలో ఆటలంటే ఆశక్తి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా అలాగే అందరూ ఐన్ స్టీన్ అవ్వాలనీ ఎక్కడా వ్రాసి లేదు. కొందరు విశ్వనాద్ ఆనంద్ లాంటి వారులాగా తయ్యారయ్యితే మరికొందరు జెస్సీ ఒవెన్స్ లాగా తయ్యారు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీరందరికీ కావాలసినది అల్లా ఒక్క చేయూత మాత్రమే. అదేదో సినిమాలో చెప్పినట్టు .. ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. అవకాశం మాత్రమే కావాలి. నాకు తెలిసినంత వరకూ అదేదో తెలుగు సామెత చెప్పినట్టు, జింక చిక్కిందంటే పరుగెత్త లేక కాదు కాలం కలసి రాక .. అలా కాలం ప్రతీ ఒక్కరికీ కలసి వస్తే ప్రతీ వ్యక్తి ఓ మహర్షి అవుతాడు అని నేను నమ్ముతాను.
అవకాశం రాకే ప్రతీ వ్యక్తి పనికిరానివడౌతాడని నా నమ్మకం. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎంతమంది వచ్చిన అవకాశాలను ఒదులుకుంటున్నారో (అని వ్రాయడం కన్నా జారవిడచుకుంటున్నారో అని వ్రాయడం ఇక్కడ సమంజసంగా ఉంటుంది) నాకు తెలుసు. అలా అవకాశాలు రాక కొందరు నిర్జీవులైతే.. వచ్చిన అవకాశాలను కాలరాచి మరికొందరు నిస్తాణువులై ఏమి పట్టనట్టు మిగిలిపోతున్నారు. వీటన్నింటికీ కారణం చిన్న వయస్సులో పడాల్సిన మంచి నాట్లు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు గనక మంచి చదువు లేదా మంచి నడవడిక అలవాటైతే వారి భావితరం బాగా వర్దిల్లుతుందని నేను నమ్ముతాను.
ఇలా చిన్న వయస్సులో మంచి నడవడిక, మంచి చదువు, ఇక్కడ చదువు అంటే పుస్తకాలకు పరిమితమైనటువంటిది మాత్రమే కాదు సుమా.. కనుక మనం నేర్పగలిగితే భావితారాలకు ఎంతోకొంత మేలు చేసిన వారం అవుతామని నా అభిప్రాయం. ఇక విద్యాలయం విషయానికి వస్తే.. ఇక్కడ పూర్తిగా గురుకులం పద్దతిలో ఓ సుశిక్షుతుడైన యోధుడు ఎలా క్రమశిక్షణగా పెరుగుతాడో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ కనబడాలని నేను కలగంటున్నాను. ఈ రోజునాటికి నాకు ఉన్న ఆలోచన ఈ విధంగా సాగింది, మరి రేపటి విషయమేమిటో.. నా పాఠశాలలో నేను జరపాలనుకునే దినచర్య ఈ విధంగా ఉంటుంది. మార్పు చెందవచ్చు..
  • వేకువఝామున, సూర్యోదయానికి ముందుగా పిల్లలు నిద్రలేస్తే.. సూర్యోదయం తరువాత ఓ గంట సమయానికల్లా చక్కగా తయ్యారై బ్రేక్ ఫాస్ట్ చేసేచోటికి చేరుకుని ఓ అరగంటలో తృప్తిగా తిని ఆటలాడుకోవడానికి వెళతారన్నమాట
  • ఇలా ఆటలాడుకోవడానికి వెళే సమయం దాదాపు ఏడు గంటలవుతుంది. ఇలా ఆటలాడడానికి వెళ్ళిన పిల్లలు ఓ రెండు గంటల పాటు ఆటలాడి తొమ్మిదిన్నర కల్లా చక్కగా  వారి వారికి ఏర్పరిచిన స్థలాలోకి చేరి ఓ కడివెడు పాలు త్రాగి పది గంటలకల్లా స్నానపానాది కార్యక్రమాలు ముగించుకుంటారు.
  • పదిన్నర లేదా పదకొండు గంటలకల్లా చదువు మొదలు
  • ఒంటిగంటకు భోజనం
  • రెండుగంటకు తిరిగి చదువు మొదలు
  • నాలుగున్నరవరకూ చదువు ఆ తరువాత ఫలహారం
  • ఐదునుంచి ఏడు వరకు మళీ ఆటలు
  • ఏడునుంచి ఎనిమిది వరకూ విశ్రాంతి
  • ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య రాత్రి భోజనం
  • తొమ్మిదిన్నర నుంచి ఎవ్వరిస్టానుసారం చదువు లేదా నిద్ర
  • ..
ఎలా ఉంది నా ఆలోచన..?

26, ఆగస్టు 2010, గురువారం

అమెరికాలో నాకు నచ్చిన అంశాలు

AMERICA

ఎప్పుడూ అమెరికాని ఆడిపోసుకుంటున్నననే అనుకుంటునారుగా, అదేంలేదు. ఇదిగో ఇక్కడ అమెరికాని మరో కోణంలోంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ నాణానికి రెండు వైపులుంటాయి, ఇంతకాలం ఒకవైపు చదివిన మీకు ఇప్పుడు మరో వైపు చూపడానికే ఈ ప్రయత్నం.

అన్నింటికన్నా మొదటిది వీరి నవ్వు మొహం. మనం ఎవ్వరమో తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం వారిని చూసాము అన్న విషయం వారు గమనించగానే నవ్వుతూ .. ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఇలా ప్రశన్న వదనంతో పలకరించడం వీరికి చిన్నప్పటి నుంచి నేర్పి ఉంటారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, స్మైల్ కాస్ట్స్ నథింగ్, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా మొహం ఎప్పుడో కాని స్మైలీగా కనబడదు. అలాగని చికాకు వదనంతో కూడా ఉండను. అక్కడే వచ్చింది చిక్కంతా, ఆ పెట్టే మొహం ఏదో నవ్వు మొహం కాకపోయినా చిరు దరహాసమో లేక మందహాసమో నీ మొహంలోకి తెచ్చుకోవేరా వెధవా అని నా అంతరాత్మ తెగ ఘోషిస్తూ ఉంటుంది. అయినా మొహాన్ని కొంచం ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా!!

ఇక రెండొవది. వీరి సహజ వనరుల నిధి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అలాగే పచ్చని గడ్డి. అంటే నేను ప్రస్తుతం ఎండాకాలం మరియు వానాకాలం మధ్యలో ఉన్నాను కదా అలాగే ఉంటుంది. వీళ్ళ శీతాకాలంలో ఇక్కడ ఎక్కడ చూసినా మంచే కనబడుతుందంట. నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఊరిలో ఉన్న చెట్లను ఆ ఊరి ప్రభుత్వం చూస్కుకుంటే, ఇంటి బయట ఉన్న విశాలమైన ప్రదేశంలో ఇష్టమున్న వాళ్ళు వారి అభీష్టం మేరకు చెట్లను పెంచితే, లేని వాళ్ళు కనీసం గడ్డిని క్రమబద్దంగా పెంచుతారు. ఆ విధంగా పచ్చదనం అన్ని చోట్ల కనబడుతుంది. ఇక పై చెప్పిన రెండు చోట్లకాక అడవిలో పెరిగే చెట్లను కూడా వీరు చాలా శ్రద్దగా చూసుకుంటారు, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న అడవులు కాలుతుంటాయి కూడా. అలా అడవులు కాలుతూ ఉండే సమయంలో ఆ మంటలర్పడం కూడా ఓ నేర్పే. దానికి కూడా, అంటే అడవులు ఆర్పడానికి ఉండే సిబ్బంది కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు అంతే కాకుండా అది ఒక కెరీర్ అంటే నమ్ముతారా!! ఇక్కడ అనవసరమైనా మఱో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చాలా రాష్ట్రాలలో ఫైర్ మెన్స్ అంతా జీతాలు లేకుండా పనిచేసే సంఘ శేవకులు అంటే నమ్ముతారా!! అంటే వీళ్ళకు ఎంతో కొంత మొత్తం జీత భత్యాలు ఉంటాయి కానీ ఇక్కడి ఫైర్ మెన్ మాత్రం జీత భత్యాల కోశం మాత్రం పని చెయ్యరు అన్నది నేను విన్నది. ఇది నిజమైతే వీరెంత నిశ్వార్ధ పరులో కదా..

ఇక మూడవది వీరి డ్రైవింగ్ విధానం. చాలా మంది అంటే నూటికి తొంబై శాతం మంది డ్రైవింగ్ పద్దతులను చూచా తప్పకుండా పాటిస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవ్వరూ వస్తున్నట్టు కనబడకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా, ఆగుము అన్న సంజ్ఞ కనబడగానే కారుని అచ్చంగా ఆపి మరీ వెళతారు అనేది ఒక చిన్న ఉదాహరణ. ఎటొచ్చీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ నగరంలో మాత్రం అలా కాలేదు. అక్కడ మరో విధంగా ఉంది. అది అచ్చం మన హైదరాబాద్ లాగా అనిపించింది. ఇలా అనిపించడం వెనకాల ఒకటే కారణం అక్కడ ఎక్కువ మంది జనాభా ఉండటమే. అలాగే రోడ్డు మీద నడిచేవాళ్ళు కనుక కనబడితే తప్పని సరిగ్గా నడిచి వెళ్ళే వాళ్ళకే వీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. రోడ్డు దాటేటప్పుడు అడ్డదిడ్డంగా దాటినా వీరేమి అనరు, ఎటొచ్చి బండి ఆగగల వేగంలో వెళుతూ ఉంటే తప్పని సరిగా ఆపేసి నడిచి వెళ్ళే వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఒక వేళ బండి కనుక ఆపలేని వేగంతో వెళుతోందనుకోండి.. నడిచి వెళ్ళే వాళ్ళను ఎవ్వరూ ఆదుకోలేరు. వీరికి అవకాశం ఉన్నంత వరకూ నడిచి వెళ్ళే వాళ్ళకు దారినిచ్చిన తరువాతే వీరి ప్రయాణం సాగుతుంది. చాలా తక్కువగా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అన్నంత మాత్రాన అవ్వవు అని కాదు కాకపోతే వీటి తీవ్రత చాకా తక్కువ అని నా ఉద్దేశ్యం. చాలా మటుకు ఇన్స్యూరెన్స్ ఉండటం మూలాన ఎవ్వరికి ఇది ఇబ్బంది కాదు, ఇన్స్యూరెన్స్ లేకపోతే ..

మరో పుటలో మరికొన్ని నచ్చిన అంశాలతో .. వీటిపై మీ స్పందనలను మాత్రం మరువవద్దు..

15, ఆగస్టు 2010, ఆదివారం

మీ జీవతం ప్రాముఖ్యతల సమాధానాలు

ఇంతకు మ్రుందు చెప్పినట్టుగా ఇది ఒక మాస్ మైల్ లోని అంశానికి సంబందించినది. కాబట్టి దీనిని నేను కనుగొన్నానని మీరు అనుకోవద్దు. ఒక వేళ ఇక్కడ ప్రస్థావించిన విషయాలు ఏమైనా మీ మనోఃభావాలను దెబ్బదీసేవిగా ఉంటే, ఈ ప్రశ్నలను అస్సలు పట్టించుకోవద్దని ప్రార్దన. ఈ ప్రశ్నల ద్వారా నాకు కొన్ని నిజాలు తెలిసాయి అన్నంత మాత్రాన అవి మీకు కూడా వర్తిస్తుందన్న గ్యారెంటీ లేదు కావున ఈ ప్రశ్నలను ఏ మాత్రం కేర్ చెయ్యవద్దని మనవి.

మొదటి ప్రశ్న: ఇక్కడ కొన్ని జంతువులను ఇచ్చి వాటిని మీకు నచ్చిన వరుసక్రమంలో పెట్టమన్నాను. అవి మీ ప్రాముఖ్యతలు వరుస క్రమం అని అన్వయించుకోండి

ఆవు మీ కెరీర్
టైగర్ మీ ప్రైడ్
గొఱె ప్రేమకి చిహ్నం
గుఱం ఫామిలీకి ప్రతిరూపం
పంది ని డబ్బుతో పోల్చవచ్చు

 

రెండవ ప్రశ్నకు : ముందుగా మిమ్మల్ని కొన్ని జంతువులను డిస్క్రైబ్ చెయ్యమన్నాను. వాటి డిస్క్రిప్షన్స్ ఇప్పుడు చూద్దాం

మొదటగా కుక్కని మీరు ఏదైతే డిస్క్రైబ్ చేసారో ఆ చేసినది మీ వ్యక్తిత్వానికి ఇంప్లై అవుతుంది

పిల్లిని డిస్క్రైబ్ చేసినది మీ పార్టనర్‍కి ఇంప్లై అవుతుంది

ఎలుకకు మీరిచ్చిన డిస్క్రిప్‍షన్ మీ శత్రువులకు అర్దం పడితే

కాఫీకి ఇచ్చినది సెక్స్ పై మీ ఇంట్రప్‍టేషన్

ఆఖరుగా సముద్రం అంటే మీ జీవితాన్ని మీరు డిస్క్రైబ్ చేసినది.

 

మూడవ ప్రశ్న: ఇది రంగులకు సంబందించినది. ఇక్కడ కొన్ని రంగులు ఇచ్చి వాటి ప్రక్కన మీకు నచ్చిన లేదా ఈ రంగుని మీకు తెలిసిన వారి పేర్లను జ్ఞప్తికి తెచ్చేవిగా ఉంటే వారి పేర్లను వ్రాసుకోండి అన్నాను

యెల్లో - మీరు ఎప్పటికీ మరచిపోలేని వ్యక్తి
ఆరెంజ్ - మీరు నిజాయతీగా కంసిడర్ చేసే ఓ నిజమైన స్నేహితుడు
రెడ్ - సమ్ వన్ దట్ యు రియల్లీ లవ్
వైట్ - మీ ట్విన్ సౌల్
గ్రీన్ - మీ జీవిత చరమాంకం వరకూ మీరు గుర్తు పెట్తుకునే వ్యక్తి

 

ఆఖరుగా నాల్గొవ ప్రశ్నకు అర్దం లేదని నా అభిప్రాయం, అయినా సరే దానిని మీకు చెబుతాను, కానీ పాటించవద్దని మనవి

ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ అన్ని విషయాలను మీ ఫేవరేట్ అంకెలో చెప్పినన్ని మనుష్యులకు చేరవేయ్యండి అప్పుడు మీరు వ్రాసుకున్న రోజు లోగా మీరు కోరుకున్నది జరుగుతుంది.

14, ఆగస్టు 2010, శనివారం

మీ జీవితం మరియు మీ ప్రాముఖ్యతలు

ఈ మద్య నాకు ఓ మాస్ మైల్ వచ్చింది. అందులోని అంశాలు నాకు చాలా మటుకు సూట్ అయ్యాయి అంతే కాకుండా ఆ విషయాలై నేను చాలా కాలం ఆత్మ శోధన చేసుకోవలసి వచ్చింది. అలాంటి ప్రశ్నల మరియు సమాధానాల మైల్ మీకు కూడా వచ్చే ఉంటుంది, ఒక వేళ మీకు కనుక రాకపోతే, ఇదిగో ఇక్కడ ప్రశ్నించిన నాలుగింటికి సమాధానాలేమిటో మీరు మీవద్దేఉంచుకోండి. కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాసుకునేటప్పుడు మీకు మీరు నిజాయతీగా ఉండండి. వీటి సమాధానాలు ఏమిటో నేను మిమ్మల్ని అడగబోవటం లేదు, మీరు నాకు తెలియ జేయనక్కరేదు, నాకే కాదు మరెవ్వరికీ మీరు ఆన్సరబుల్ కాదు, కానీ మిమ్మల్ని మీరు ఒక్క సారి ప్రశ్నించుకోమంటున్నాను.

ఈ ప్రశ్నల వల్ల నాకు జీవితంలో ఏమి ప్రాముఖ్యమైనవో అర్దం అయ్యింది. అలా మీకు కూడా అవుతుందని ఆశిస్తూ.. ముందుగా

-------------------------

మొదటి ప్రశ్నః
ఈ క్రింది ఉఅదహరించిన జంతువులను మీకు నచ్చిన వరుసక్రమంలో పేర్చండి

ఆవు
టైగర్
గొఱె
గుఱము
పంది

రెండొవ ప్రశ్నః

ఈ క్రింది ఉదహరించిన జంతువులను డిస్రైబ్ చెయ్యండి. అంటే మీ స్వంత వాక్యాలలో వీటిని వల్లించండి.

కుక్క
పిల్లి
ఎలుక
కాఫీ
సముద్రము

మూడవ ప్రశ్నః

ఈ క్రింద ఉదహరించిన రంగులను ఉద్దేశ్శించి మీకు తెలిసిసిన ఎవ్వరైనా వ్యక్తులను మరియు మీకు అత్యంత ఇంపార్టెంట్ అయిన వారి పేర్లను ఆయా రంగుల ప్రక్కన వ్రాసుకోండి

ఎల్లో - Yellow
ఆరెంజ్ - Orange
రెడ్ - Red
తెలుపు - White
గ్రీన్ - Green

ఆఖరిగా నాల్గొవ ప్రశ్న..

మీకు ఇష్టమైన సంఖ్యని మరియు వారంలో ఇష్టమైన రోజుని వ్రాసుకోండి

-----------------------

ఇప్పుడు మీరు వ్రాసుకున్న మరియు నేను అడిగిన ప్రశ్నల వెనకాల ఆంతర్యం ఏమిటో మరో పుటలో ప్రచురిస్తాను. అంత వరకూ మీరు వ్రాసుకున్న సమాధానాలు మరొక్క సారి సరి చూసుకోండి అంతే కాకుండా నన్ను మొట్టండి..

13, ఆగస్టు 2010, శుక్రవారం

అమెరికా అలవాట్లు / ఆచారాలు / పద్దతులు / ఇతరేతమైన పదాలు నాకు ఎప్పటికీ అర్దం కావనుకుంటా!!

అమెరికాలో నాకు నచ్చని మరో మూడు అంశాలు. అమెరికా అంటే ఇష్టం ప్రేమ అభిమానం తొక్క తోటకూర వంకాయ్ బెండకాయ్ గాడిద గుడ్డు గోంగూర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఈ పుటని చదవవద్దని మనవి. ఎందుకంటే ఇవి నాకు అనిపించిన నిజాలు. అవి మీకు నిష్టూరంగా మరియు వెటకారంగా అనిపిస్తాయి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న.


మొదటిది.. ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో చేస్తారు. అసలు విషయానికి వద్దాం.  ఇక్కడ నీరు సంవృద్దిగా దొరుకుతుంది. అందువల్లన వీరి ప్రకృతి సంపద చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చక్కటి చెట్లు మంచి రోడ్లు. శీతాకాలం వస్తే మోకాలు ఎత్తుకు మంచు. అన్నీ బాగుంటాయి. అందువల్ల వీరు నీటిని చాలా శుద్ది చేసి వాడుకుంటారు. ఎంత శుద్ది చేసి అంటే, అచ్చంగా కుళాయి నుంచి వచ్చే నీటిని మనం యధావిధిగా త్రాగేయవచ్చన్నంతగా. నీరు ఇంత బాగా దొరుకుతున్నా, అన్ని పనులకు నీటిని వీరు వాడుతున్నా అసలైన చోట మాత్రం వీరు నీటిని వాడరు. ఎక్కడంటారా.. అదే అక్కడికే వస్తున్నా.. అది మల విశర్జన చేసి అశుద్దం అంటిన శరీరాన్ని నీటితో కడగరు సరికదా కాగితంతో తుడుచుకుని బయటకి వచ్చి, *డ్డిని నీటితో కడుక్కోరు కానీ *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు. అసలు అలాంటి చోట నీళ్ళను ఏర్పాటు చేసుకోరు. ఏమైనా అంటే కాగితంతో తుడుచుకున్నాంగా అంటారు.

అలాగే ఈ కాగితాన్ని తయారు చేసే కంపెనీలు విపరీతమైన రీసెర్చ్ చేసి మా కాగితంలో పది శాతం మాయిశ్చర్ ఉంటుంది, దీనితో కనుక మీరు తుడుచుకుంటే అది అచ్చంగా నీటితో కడిగినంత స్వఛంగా ఉంటుంది అని ప్రకటనలు చేస్తాయి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ చక్కగా నీటితోనే కడుక్కోవచ్చు కదా అంటే, అందరూ చేసింది మేము చేస్తే ఇక మా స్పెషాలిటిటీ ఏంటి? అని ఎదురు ప్రశ్నిస్తారు.

వీళ్ళలాగే వీళ్ళ పిల్లలు కూడా, నేను ఉంటున్న హోటల్లో నేను గమనించినది ఏమిటంటే.. ఉదయం నిద్ర లేవంగానే తినడానికి ఏమి ఉంది అంటూ క్రిందనున్న బ్రేక్ ఫాస్ట్ స్థలానికి వెళ్ళి ఏదో నోటికి పట్టినంత కుక్కుకుని ప్రక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. ఆడినంత సేపు ఆడి ఆ తరువాత మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తారు. మరి శారీరక శుబ్రత వంటి వాటి విషయాలేమిటంటే, గాడిద గుడ్డేం కాదు అంటూ మనల్ని వెధవల్ని చేస్తారు.


ఇక రెండవ విషయానికి వస్తే అది.. పెళ్ళి .. ఇక్కడ నేను కలిసిన ప్రతీ అమెరికన్ని కదిపితే, మగాడైతే ఇలా అంటూ ఉంటాడు.. "నా మొదటి పెళ్ళాం .. ఇప్పుడున్న పెళ్ళాం.. రేపు కనుక విడిపోతే మరో పెళ్ళాం .." ఇలా అనే వాడికి ముడ్డి క్రిందకి యాభై ఏళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు కూడా వీడికి కొత్త పెళ్ళాం కావల్సివస్తే, అమ్మాయిల పని మరోలా ఉంటుంది. నా మొదటి బాయ్ ఫ్రండ్ నా రెండో పెళ్ళికి వచ్చి త్రాగి తందనాలాడి తతంగం చేస్తే నా మొదటి మొగుడు వీడ్ని పట్టుకుని చితకొట్టాడు.. అంటారు. ఇవన్నీ ఏదో ఉత్తుత్తి వ్రాతలు అని మీరనుకుంటే ఈ మధ్య ఓ మాస్ మైల్ నాకు భలే నవ్వు తెప్పించింది. అదేదో పాత కమల హాసన్ సినిమాలో ఉన్నట్టుంది. ఆ మైల్ లోని సారంశం. వీలైనంత విపులంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.. ఒక వేళ అర్దం కాకపోతే వదిలేయ్యండి. స్టోరి ఇలా సాగుతుంది

నేనెవ్వరు? మీకు తెలిస్తే చెప్పండి. . . . ఈ మధ్యకాలంలో నేనో విదవరాలితో కలసి సహజీవనం కానిస్తూ ఓ బిడ్డను కనే ఆలోచనలో ఉండగా ఆ విదవరాలి పెద్దమ్మాయి ఎవ్వరినో ఇష్ట పడి ఆపై కష్టపడి ఓ పిల్లని కన్న తరుణంలో ఆ పుట్టిన బిడ్డ శాక్షిగా పెళ్ళి చేసుకుంటున్నాను మీరు రావాలి అని మా ఇద్దరికి వెడ్డింగ్ కార్డ్ పంపింది. తీరా వెళ్ళి చూస్తె ఆ పెళ్ళి కొడుకెవ్వరో కాదు నాకు జన్మనిచ్చిన బయలాజిలక్ తండ్రి. అంటే నా తండ్రికి నేను ఇప్పుడు మామగారినన్నమాట మా నాన్నకు పుట్టిన ఆ బిడ్డకి నేను తాతనా లేక అన్ననా.. నా నాన్న నాకు అల్లుడా లేక నేను డేటింగ్ చేసే విధవరాలి కూతురు భర్తగా నా పెళ్ళాం కూతురు మొగుడైతే నాకు అల్లుడౌతాడు కదా .. అలా అల్లుడా లేక ..

ఇలా సాగుతుంది వావి వరుస లేని వీరి వృత్తాంతం. ఈ మధ్య ఇక్కడ జరిగే చెర్చి పెళ్ళిళ్ళలో అక్కడి ఫాదర్ ఈ విధంగా అడగటం మొదలు పెట్టారు..

ఫాదర్ అమ్మాయితో : ఏమ్మా!! జాన్ అనే ఈ అబ్బాయితో నీకు నచ్చినంత కాలం నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈయన ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అమ్మాయి : అవును..
ఫాదర్ అబ్బాయితో : ఏరా!! జాకీ అనే ఈ అమ్మాయితో నీకు నచ్చినంత కాలం / నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈమె ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అబ్బాయి : అలాగే కానీయ్యండి

వీళ్ళిద్దరు చెర్చి బయట ఇలా ఈ ఎగ్రిమెంట్ కి వచ్చి ఉంటారు. నాకు నీకు పిల్లలు కలిగితే మొదటి ఐదేళ్ళు నేను పెంచుతానని అమ్మాయి ఒప్పుకుంటే మరో ఐదేళ్ళు అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ తరువాత పుట్టిన పిల్లలకు యుక్త వయసొచ్చింది కాబట్టి వాడి సంపాదన వీళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి అచ్చోసిన ఆంబోతులా వదిలేద్దాం. ఆ తరువాత మనమిద్దరం మరొకళ్ళని తగులుకుందాం .. వాకే!! అని ఒక ఎగ్రిమెంట్కి వచ్చుంటారు.

ఇక్కడ నేను వ్రాసేవన్నీ ఉత్తుత్తి వ్రాతలనుకునేవారు ఎప్పుడైనా ఒక నేటివ్ అమెరికన్ వ్యక్తిగత జీవితం ఏమిటో అడగండి అప్పుడు బయట పడుతుంది అస్సలు విషయం. ఇక్కడ ఓ పదేళ్ళు కలసి కాపురం చేసాము అన్నామంటే అదో గొప్ప విషయం అలాగే ఓ వింత విషయం కూడా.. ఇదే సంస్కృతి ఇప్పుడు మన దేశానికి దిగుమతి అయ్యి మన జీవనంలో ఓ చీడపురుగౌతోంది. ఆ విషయం గురించి మరో సారి.


ఇక ఈ పుటకి ఆఖరి పాయింట్.. అప్పాయింట్ మెంట్స్.. ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలోని ఓ ఉద్యోగి తండ్రి మరణించిన విషయాన్ని నాతో చర్చిస్తూ ఇలా అన్నాడు..

.. మానాన్న ఫలాన రోజు ఉదయం పది గంటలకు హృదయ స్పందన ఆగిపోవడం వల్ల హాస్పిటల్లో కాలం చేసారు, ఆరోజు  మాకు లంచ్ ఎప్పాయింట్ మెంట్ ఉంది కదా అని నేను అక్కడకు చేరుకుంటే ఇంట్లో ఎవ్వరూ లేరే!! కనీసం నాకు చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళుతున్నారు అని. విషయం ఏమిటో అని తెలుసుకుందాం అని మా చెల్లెలికి ఫోన్ చేస్తే చావు కబురు చల్లగా అప్పుడు చెప్పింది ..

పైన వ్రాసిన పేరా ద్వారా చదివే వాళ్ళకు ఏమి అర్దం అయ్యిందో గాని నాకు మాత్రం ఓ విషయం అర్దం అయ్యింది. తండ్రితో  కలసి భోజనం చెయ్యాలంటే కొడుకులకు అప్పాయింట్‍మెంట్ కావాలని. ఇలాగయితే ఈ క్రింద చెప్పబోయే మాటలు నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టదేమో!!

ప్రియమైన పెళ్ళానికి ఓ అమెరికన్ మొగుడు వ్రాయునది,
వచ్చే శనివారం సాయంత్రం ఏడు గంటలకు హిల్టన్ హోటల్లో మన ఇద్దరికి డిన్నర్ ఎరేంజ్ చేస్తున్నాను. ఓ గంటకి నాలుగు వందల డాలర్లు. ఇందులో రెండు వందల యాభై డాలర్లు నేను పెట్టుకుంటా మిగిలిన నూట యాభై డాలర్లు నువ్వు పెట్టుకోవలసి వస్తుంది. మనకు కేటాయించిన గంటలో ఓ అరగంట భోజనం చేస్తూ ఈ క్రింద వ్రాసిన లిస్టులోని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం మిగిలిన అరగంట సంసారం చేద్దాం. ఇందుకు నీకు ఇష్టమైతే ఈ మీటింగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి లేక పోతే కాన్సిల్ కానీ / క్రొత్త ప్రపోజల్‍ని పంపించు.

మనం మాట్లాడుకోవాలని నాకు అనిపించిన విషయాల లిస్ట్

౧) మనకు పిల్లలు పుడితే ఎవ్వరెంతకాలం సాకాలి, సాకినందుకు ఎవ్వరు ఎవ్వరికి ఎంత ఇవ్వాలి

౨) ఎవ్వరెవ్వరికి ఏ ఏ కార్లు ఉన్నాయి, వాటిని ఎవ్వరు తయ్యారు చేసారు, వాటి ఇన్‍స్యూరెన్స్ ఎంత

౩) సంవత్సరాంతంలో వచ్చే వెకేషన్ ఎక్కడ జరుపుకోవాలి మరియు ఎంత ఖర్చు పెట్టాలి

ఇవి కాకుండా నీకేమైన ఉంటే ముందుగా నాకు తెలియ జేయి, నేను కొంచం ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాను.
ఇక ఉంటాను

లవ్యా

ఇక మీ టైం మొదలైంది.. దేనికంటారా, స్పందనలకు.. ఆఖరుగా మరో విషయం మర్చిపోయ్యాను. ఇవ్వాళ 13th అందునా శుక్రవారం.. దీని వెనకాల మరో ఇస్టోరి.. అప్పటిదాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను.

పాత పాటలోని లిరిక్స్ – ప్రశ్నలకు సమాధానాలు

ఇంతక మ్రుందు వ్రాసిన పుటలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సమాధానాలు వ్రాయడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసానంటే.. దానికి పలు కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి ఈ పాత పాట మళ్ళీ నా చెవిన పడటం మొదటి కారణమైతే, ఇంతకు ముందు వ్రాసిన పుటకి ఎవ్వరూ స్పందించకపోవడం ఈ ఆలశ్యానికి మఱో కారణం. ఏది ఏమైనా ఈ సినిమా నేను పుట్టడానికి ఓ సంవత్సరం ముందు విడుదలైంది, అంటే 1971 లో అన్నమాట. ఈ సినిమాకి కేవీ మహదేవన్ సంగీతాన్ని అందిస్తే మల్లికార్జున్ దర్శకత్వ భాద్య్తతలను స్వీకరించారు. నట శేఖర కృష్ణ మరియు భారతి అలాగే జయసుధ ముఖ్య పాత్రలలో నటించింన అందరికీ మొనగాడు సినిమాలోని "ఆడగనా మాననా అమ్మాయి.." పాటలోని చరణాలే ఇంతకు మ్రుందు వ్రాసిన పుటలో ప్రశ్నలకు మూలం.

ఇదిగో ఇక ఆలశ్యం చెయ్యకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా..

౧) మగవాడు చేసేది అల్లరి .. వగలాడి విరిసేది మురిసేది రాగ వల్లరి..

౨) మగవాడు తలచేది కమ్మని కైపు.. జవరాలు మఱువనిది ప్రియతమ రూపు..

౩) మగవాడు కోరేది ఆనందం.. ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబందం..

౪) ..

నాల్గొవ ప్రశ్నకు సమాధానం నేను వ్రాయను. మీకు తెలుసుకోవాలనిపిస్తే ఎక్కడైనా ఈ పాటని పట్టుకోండి లేదా నన్ను సంప్రతించండి. ఈ పాటను నేను మీకు పంపుతాను, అది విన్న తరువాత మీకే అర్దం అవుతుంది ఆ నాల్గొవ ప్రశ్నకు సమాధానం

5, ఆగస్టు 2010, గురువారం

ద గివింగ్ ప్లడ్జ్ – సంపాదనను దానం చేస్తానన్న ప్రమాణం

page_header

ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వారిలో కొంతమంది అంటే ఓ లభైమంది తాము సంపాదించిన దానిలో వీరి ఆస్తిలోని దాదాపు అంతా సమాజ సేవకు దానం చేస్తామని ప్రమాణం చేసారు. ఇలా ప్రమాణం చేసిన వీరి ఆస్తులు వీరు బ్రతికి ఉండగాగానీ తదనంతరం కానీ సమాజ సేవకు ఉపయోగ పడుతుందన్న మాట. వీరంతా వ్యాపారాలకు భిన్నంగా ఒకే గూటి క్రిందకు చేరి పాలు నీళ్ళుగా కలసి మెలిసి అందరం బాగుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని నేను ఏదో సొల్లు వేస్తున్నాననుకోకండి. వీలైతే ఓ సారి ఈ లంకెను దర్శించండి. మీకే అర్దం అవుతుంది. ఇలా ఈ గివింగ్ ప్లడ్జ్ లో పాలు పంచుకోవాలంటె మీకు ఉండవలసిన అర్హత అల్లా ఒక్కటే మీ ఆస్తి బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ ఉండటమే..

ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు. కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇది నిజం కాకపోతే.. ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే, వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని, ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు.

నా ఆలోచనలు నా అభిప్రాయాలను ప్రక్కన పెట్టి మనం కనుక ఆలోచించుకుంటే, హిల్టన్ హోటల్స్ అధిపతికూడా ఇలా తన సంపాదనలో ఎక్కువ శాతం సంపాదనని అవసరమైన వారికి ధారాదత్తం చేస్తానని ప్రమాణం చేసారు. ఇలా ఇక్కడ ఓ నలభై మంది ప్రమాణం చేస్తే, వీరందరిలో ఓ ముగ్గురి గురించి మాత్రమే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉంది. నాకు తెలిసిన ఆ ముగ్గురు ఎవ్వరంటే, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ మరియు వీరి భార్య ఒక్కరైతే, తన ఆస్తిలో 99% వాటాని మిలిండా గేట్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ పేర వ్రాసిన అపర దానశీలి వారెన్ బఫేట్ మరొక్కరు. ఆఖరుగా నేను అభిమానించే వ్యక్తి, ఆరకిల్ అధిపతి లారీ ఎలీసన్.

వీలైతే మీరు ఒకసారి చూడండి.

4, ఆగస్టు 2010, బుధవారం

అమెరికా వాళ్ళు ఇంత పిసినారోళ్ళనుకోలేదు..

అమెరికాలోని మనుష్యులు కూడా పిసినారోళ్ళే. వీళ్ళేం పెద్ద పుడ్డింగోళేంకాదు. వీళ్ళు మామూలు మన లాంటి సాదా సీదా వాళ్ళే కానీ మనలా బయటకి కనబడరు. దొంగలు.. ఇవాల్టి యు.ఎస్.టుడే వార్తలలో ఒకటి నిరుద్యోగం వారికి ప్రభుత్వం వారు ఇచ్చే జీవన్ భృతి గురించి. ఆ వార్త శీర్షిక ఈ విధంగా ఉంది, నిరుద్యోగం మరియు ఉపాధి బెనిఫిట్స్ స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ నేను తెలుగులోకి సరిగ్గా తర్జుమా చెయ్యలేకపోతే ఈ వార్తని ఈ లంకెలో చదువుకోండి. అఖరి గణనాంకాల ప్రకారం అమెరికాలోని నిరుద్యోగుల శాతం దాదాపు ౯.౫ (9.5%). అంతే కాకుండా ప్రతీ నిరుద్యోగికి ప్రబ్యుత్వం తరుఫున అందే మొత్తం  సగటున ౧,౫౪౬$లు (1,546$). దీనిని బట్టి మీకు అర్దం అయ్యిందేమిటి, ఇక్కడ నిరుద్యోగికి భత్యం వీరి నిత్య జీవనానికి సరిపోయే అంత దానికన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అలస్కా అనే రాస్ట్రంలో అయితే ఈ సంఖ్య మరీ ఎక్కువ దాదాపు మూడున్నర వేలకు పైగా. అన్నింటికన్నా అధమంగా ఫ్లోరిడా రాస్ట్రంలో పన్నిండున్నర వందల డాలర్లు నెలసరి వేతనంగా ఇచ్చారు. ఇవి జూన్ లెక్కలు. అస్సలు ఉద్యోగం లేని వ్యక్తికి ఇలా డబ్బులు ఇస్తే వాడెందుకు ఉద్యోగం చేస్తాడు? ఈ విషయం ప్రక్కన పెడితే.. ఇందుకు భిన్నంగా మూడు నాలుగు రోజుల క్రిందట ఓ వార్త చదివాను.. అది నన్ను విశ్మయానికి గురి చేసింది.

cashcowx ప్రస్తుత గణనాంకాల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో దాదాపుగా ఎనిమిదిన్నర వందల బిలియన్ల ధనం రొక్కంగా మూలుగుతోందట. ఇక్కడ రొక్కం అనే విషయాన్ని మీరు కాష్ అని చదువుకోండి. ఈ క్యాష్ నిలువలు ఇతిమిద్దంగా పెరిగి అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని కని విని ఎరుగని మొత్తాన్ని చేరుకున్నాయంట. ఇది ఒక రికార్డ్. ఈ మొత్తం ఎదుగుదల ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంట. అంటే ఇది ఇలాగే సాగితే, ఈ సంవత్సరాంతానికి అది దాదాపు వెయ్యి బిలియన్ల మొత్తానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ళ క్రిందట మొదలైన బ్యాంకుల మూతల నష్టాన్ని అమెరికా ప్రపంచం మొత్తానికి చూపించి సానుభూతిని కొట్టేసిందే, మరి ఇక్కడ పేరుకు పోతున్న నిధుల విషయమేమిటో. అది సరే గాని ఈ ఎనిమిదిన్నర బిలియన్ల్ మొత్తం ఏ మేరకు సరిపోతుందో తెలుసా.. దాదాపు రెండున్నర మిలియన్ల మందికి సంవత్సరానికి డెభ్భైవేల జీతంతో ఐదు సంవత్సరాల పాటు ఉపాధికి సరి సమానం. అంటే ఐదేళ్ళపాటు దాదాపు పాతిక లక్షల మందికి అవసరానికన్నా మించి మూడొంతులకు సరి సమానంగా ఆర్ధిక స్థితి ఉందన్నమాట, అంతే కాకుండా వీరు సంపాదించేదానిలో మూడో వంతు మళ్ళీ టాక్సులనో తొక్కనో లేకపోతే గాదిడ గుడ్డనో ప్రభుత్వం తీసుకుంటుందికదా. సంపాదించిన ప్రతీవాడు ఏదో విధంగా ఖర్చు చేస్తాడు కదా.. ఈ విధంగా వ్యాపారాల్లు పునఃరుద్దరణకు నోచుకుంటాయి కదా.. ఒక వేళ వీడు ఖర్చు పెట్ట లేదనుకోండి, మిగిలిన డబ్బులను బ్యాంకులోనే కదా దాచుకునేది. ఆవిధంగా నైనా డబ్బు మళ్ళీ బ్యాంకుల్లోనే కదా చేరేది. ఇలా ఎలా చూసుకున్నా వీరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉండేది!! ఎప్పుడ్? పైన ఉదహరించిన నాన్-ఫైనాషియల్ సంస్థలలో నిల్వలుగా పేరుకుంటున్న నికర ధనం గనుక ఉపాధికి ఉపయోగిస్తే.

పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు? వీటన్నింటి వెనుక మరో రహస్యం. నాన్-ఫైనాన్షియల్ సంస్థలలోనే ఇంత మొత్తం మూలుగుతుంటే, మరి ఫైనాన్షియల్ సంస్థల పరిస్థితేమిటంటా!! వీటి గురించి మరో సారి మనం విశ్లేషించుకుందాం. అంత వరకూ బై..

3, ఆగస్టు 2010, మంగళవారం

అమెరికాలో నేను చేసిన మొదటి సాహసం

 

DSCN1095 అమెరికాని దర్శించడం నేను ఇది రెండవసారి. మొదటి సారి వచ్చినప్పుడు పెద్దగా ఏమీ చూడలేదు సరికదా ఎక్కువగా ఎక్స్ ప్లోర్ చేసింది లేదు. కాని అందుకు భిన్నంగా ఈ సారి ఎన్నో సాహస ప్రయత్నాలు చేస్తున్నాను. వాటిల్లో మొదటిది వచ్చీ రాగానే న్యూయార్క్ నగరాన్ని చుట్టేయ్యడం. దీని గురించి ఒక్క సారి క్లుప్తంగా కాకపోయినా కొంచం తక్కువ వివరంగా..

నా ఫ్లైట్ భాగ్యనగరం నుంచి దుబాయికి మొదటి అంగలో చేరుకుంటే, రెండవ అంగ దుబాయి నుంచి న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయానికి, ఆ తరువాత అక్కడినుంచి ఫిలడెల్‍ఫియాకు మూడవ అంగలో విమాన యానం. ఫిలడెల్‍ఫియా నుంచి రెడింగ్ నగరానికి కారులో ప్రయాణం అన్నమాట. ఇదిగో ఇక్కడే నేను చేసిన మొదటి సాహసం. న్యూయార్క్ ఏయిర్ పోర్టులో దిగిన తరువాత ఇక్కడి సహోద్యోగులకు ఫోన్ చేసి నేను క్షేమంగా చేరుకున్నాను ఇక్కడ నాకు ఓ అయిదు గంటల సమయం ఖాళీ దొరికింది, కనుక ఏమి చెయ్యమంటారు అని అడిగాను. ఏమీ చెయ్యొద్దు, చక్కగా అక్కడ లాంజ్‍లో నిద్దరో అన్నారు. ఉన్న అయిదు గంటల్లో ఓ గంట మళ్ళీ సెక్యూరిటీ చెకిన్.. గాడిద గుడ్డు .. గోంగుర పాసు ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కడో ఓ జాగా చూసుకుని ఓ మూడు గంటలు కళ్ళు మూసుకుని కునుకు తీయ్యు అని ఓ చెత్త సలహా ఇచ్చారు.

అది కాదురా ఎలాగో న్యూయార్క్ ఏయిర్ పోర్టులో ఉన్నాగా అలా ఓ రౌండ్ వేసి వస్తా అన్నా, ఎవ్వడి కాడు నన్ను భయపెట్టినోళ్ళే గాని, భలే !! మంచి ఆలోచన జాగ్రత్తగా పోయి చూసి క్షేమంగా తిరిగిరా అన్న వెధవలేడు. అలాంటప్పుడేకదా నేను సాహసం చేసేది. ఇంకేం, లగేజీ చెకిన్ చేసేసి కెన్నెడి విమానాశ్రయం నుంచి మాన్‍హట్టన్ నగరానికి ఎయిర్ ట్రైన్ ఉంటే అది పట్టుకుని జాం అంటూ బయలు దేరాను, అక్క్డడకు వెళ్ళంగానే నాకోసమే అన్నట్టు లోకల్ ట్రిప్స్ తిప్పే బస్సు వాడు వేచి ఉన్నాడు. వాడి మొహాన ఓ నలభై నాలుగు డాలర్లు కొట్టి ఇక ఫో అన్నా. వాడు వెంటనే ఓ తాడి చెట్టంత చిట్టా చించి నా మొహాన విసిరి నా పనైపోయిందన్నట్టు చూసాడు. ఇంతకీ ఇది ఏమిటిరా అబ్బాయి అని అడగ్గానే, ఓ వింత మనిషిని చూసినట్టు ఓ లుక్కేసి, దీనిని రిసీట్ అంటారు, నువ్వు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా నిన్ను ఎవ్వరూ అడగరు. నిన్ను న్యూయార్క్ నగరం మొత్తం చుట్టాలంటే, మూడు దారులు గుండా నిన్ను తిప్పాలి కాబట్టి ఒక్కొ మార్గంలో తిరిగే బస్సు వాళ్ళు ఒక్కొక్క బిల్లు తీసుకుంటారు అంటూ విసుక్కున్నాడు

DSCN1117 విసుక్కుంటే విసుక్కున్నాడు వివరం చెప్పాడు అనుకుని ఎదురుగా కనబడ్డ డబల్ డక్కర్ బస్సెక్కి మన బొమ్మరిల్లు సినిమాలో వీరోయిన్ కూర్చున్నట్టు బస్సు టాప్ ఎక్కి అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్న రెండు సీట్లను ఆక్రమించేసా. ఇంతలో మరో తెల్ల తోలు వచ్చి నీ ప్రక్కన చోటుందా అని అడిగితే, మొహమాటం లేకుండా అదిగో ప్రక్కన ఉన్న మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ సద్దుకో అని ఓ సలహా పడేశా.. హీ హీ.. అదిగో అలా బయలు దేరిన న్యూయార్క్ ప్రయాణంలో అక్కడి చారిత్రక కట్టడాలను చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోలు తీసుకుంటూ గడిపేశా. అక్కడ నేను చూసిన కొన్ని చారిత్రాత్మక స్థలాలలో మొదటిది.. టైటానిక్ ఓడని ఉపయోగించిన వ్యాపార సంస్థ భవనం. ఆ తరువాత ఎంపైర్ స్టేట్ భవనం.. అటుపై గ్రౌండ్ జీరో మరియు దానికి ప్రక్కనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి, దూరం నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టి, న్యూయార్క్ బ్రిడ్జ్, చైనా టౌన్ మొదలగు ప్రదేశాలు చూస్తుంటే పుణ్యకాలం ఎలా గడిచిపోయిందో తెలియదు.

న్యూయార్క్ లో నా ఫ్లైట్ మూడు గంటలకు తీరా చూద్దును కదా అప్పటికే రెండయ్యింది. ఇంకే మరొసారి సాహసం. గబగబా దగ్గర్లోని సబ్‍స్టేషన్ పట్టుకుని, అక్కడి నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం. ఇది దాదాపు ఓ నలబై నిమిషాలు. తీరా అక్కడికి చేరుకున్న తరువాత తెలిసిన విషయమేమిటంటే సెక్యూరిటీ చెకిన్ మూసేశారని. అక్కడి కౌంటర్ క్లర్క్ ఆ రోజున ఎవ్వరితోనో గొడవ పడ్డట్టున్నాడు అందువల్ల ఏ మాత్రం నాగోడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని, కొంచం టోన్ మార్చి గంభీరంగా అడిగా, ఎప్పుడైతే గొంతుకులో సౌండు మారిందో వెధవ దారికొచ్చాడు. బోర్డింగ్ టికెట్ ఇస్తా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆలశ్యం చేస్తే దానికి నాది కాదు పూచీ అన్నాడు. ఏదో ఒకటి ముందు చెయ్యిరా మగడా అని వాడినుంచి బోర్డింగ్ టికెట్ తీసుకుని సెక్యూరిటీ చెకిన్ చేసే క్యూలోకి దూరాను. అక్కడ మరో చాంతాడంత క్యూ ఉంది. ఎలాగరా అనుకుంటూ దిక్కులు చూస్తుంటే అక్కడి సెక్యూరిటీ వాళ్ళకు నాపైన అనుమానం కలిగింది.

వెంటనే ఓ ఆఫీసర్ నన్ను ప్రక్కకి పిలిచి విషయమేమిటన్నాడు. ఇదీ సంగతి అక్కడ నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకొన్ని నిమిషాలలో ఎగర బోతున్నది ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నా. విషయం అర్దం చేసుకున్న ఆఫీసర్ ముందుగా క్షమాపణలు అడిగి ఆతరువాత అక్కడ ఉన్న మరో ఆఫీసర్‍తో ఏదో మాట్లాడి ఆ క్యూలోంచి ప్రక్క దారిలో చెక్కింగ్ చేయించే ప్రయత్నం చేసాడు. హమ్మయ అనుకునేంతలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఆఖరుగా చెక్కింగ్ చేసే అధికారికి నాపై లేని పోని అనుమానం కలిగింది. నన్ను తీసుకొచ్చిన ఆఫీసర్ నాకెలా తెలుసు, నన్ను ఎందుకు ప్రక్కదారిలో ఇక్కడకు తెచ్చాడు, వంటి వంకర టింకర ప్రశ్నలు వేస్తుంటే.. ఇందాక టికెట్ దగ్గర వాయిస్ పెంచితే పనైన విషయం గుర్తుకు వచ్చి మెల్లగా నా వాయిస్ స్థాయిని పెంచి సమాధానాలిస్తూ, ఒక వేళ నేను ఫ్లైట్ మిస్ అయితే నువ్వే మరో ఫ్లైట్లో నన్ను పంపించాల్సొస్తుంది అని క్లూ ఇచ్చాను. ఈ విషయం తెలియంగానే ముందుగా కంట్ర్లోల్ రూమ్‍కి ఫోన్లో నా విషయాన్ని చేరవేసి మా ఫ్లైట్ కొంత సేపు ఆపించాడు.

విషయం తెలియంగానే హమ్మయ్య అనుకున్నా. ఇక నీ ఇష్టం ఎన్ని ప్రశ్నలు కావాలో అన్ని ఏసుకోరా అంటూ ఎదురు తిరిగాను. అప్పుడు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం దాదాపు ఓ అరవై నిమిషాలు సాగింది. వాడికి కాలక్షేపం నాకు అదో ఆటవిడుపు. ఈ ప్రశ్నోత్తరాలలో నా బ్యాగ్‍లో ఉన్న టూత్ పేస్ట్ కూడా పాలు పంచుకుంది. దాని అలా టాయిలెట్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్ళకూడదంట. దానికి మరో ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు పట్టుకెళ్ళాలంట. వీటికి తోడు మా అమ్మ చేసిచ్చిన గారెలు మరియు దిబ్బరొట్టెలు. ఇవేంటన్నాడు. వీటిల్ని దిబ్బరొట్టేలంటారు వీటిల్ని ఆవకాయతో తింటాం అంటే ఏదీ ఇప్పుడు తిని చూపించమన్నాడు. ఒరేయ్ ఇవి నాకు రాత్రికిరా అంటే వినడే. అప్పటికప్పుడు తినమంటాడు. సరే అని ఓ సగం తిన్న తరువాత అంతా నువ్వే తింటావా అన్న లుక్కు వాడి మొహంలో కనబడగానే ఓ సగం వాడికి ఆఫర్ చెసా. ఆకలి మీద ఉన్నపులి మాంశం కనబడగానే ఎలా ఎగ్గిరి దూకుతుందో అలా వీడు నా దిబ్బరొట్టిపైకి దాడి చేశాడు.

ఎప్పుడైతే వీడు మనదారిలోకి వచ్చాడో అని తెలియంగానే ఇక మా ఇద్దరి మధ్య వాయిస్ సౌండ్‍లో స్థాయి తగ్గి సిఖరాగ్రావేశ సమావేసపు చర్చలు సజావుగా సాగినాయి. అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇకపో అన్నాడు. ఏడికి పోయేది నువ్వురా నాతోటి లేకపోతే ఆ ఫ్లైట్ వాళ్ళు నన్ను తిడతారు అన్నా. సరే అలాగే కానీయ్ అంటూ నా వెనకాలే మా బోర్డింగ్ కౌంటర్ దాకా వచ్చి దింపి పోయ్యాడు. అలా ఉన్న అయిదు గంటల్లో ఓ సారి న్యూయార్క్ నగరాన్ని చుట్టి రావడమే కాకుండా సెక్యూరిటీ వాళ్ళకు ఆంద్రా దిబ్బరొట్టెలను ఆవకాయను రుచి చూపించాను.

ఈ వీకెండ్లో మరో సాహస యాత్ర విషయమై మళ్ళీ మీముందుంటాను, అప్పటి దాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూఉంటా..

2, ఆగస్టు 2010, సోమవారం

పాత పాటలోని లిరిక్స్ - ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలు ఓ పాత పాటలోనివి.. కొంచం ద్వందర్దాలుగా ఉంటాయి కానీ బాగున్నాయి. వీలైతే మీరు ప్రయత్నించండి. వీటికి సమాధానాలు మరో పుటలో.. అప్పుటిదాకా ప్రశ్నలు మాత్రమే. చదివే వాళ్ళు ఏ విధింగా స్పందింస్తారో చూద్దాం.

 

౧) మొగవాడు చేసేది ఏమిటి? వగలాడి మురిసేది ఏమిటి?

౨) మొగవాడు తలచేది ఏమిటి? జవరాలు మరువనిది ఏమిటి?

౩) మొగవాడు కోరేది ఏమిటి? ప్రియురాలు ఇచ్చేది ఏమిటి?

౪) మొగవాడు అడిగేది ఏమిటి? ప్రాణసఖి ఇచ్చేది ఏమిటి?

 

ఈ పాటలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే నాయికని ఎన్ని విధాలుగా వర్ణించారో బాగుంది కానీ నచ్చని విశయమేమిటంటే అన్ని సార్లు మగవాడు అంటూ వర్ణించడం. ఏది ఏమైనా వీటి వర్ణనలు ప్రక్కన పెడితే, పాటలోని చరణాలు వాటిల్లోని పద ప్రయోగం మాత్రం బాగుంది.

నిజం వ్రాయాలంటే ఈ పాట వింటున్నప్పుడు అన్ని సార్లు ద్వందార్ద సమాధానాలు మదిలో తలచాయి, కానీ సున్నితంగా వీటికి నాయిక సమాధానం ఇవ్వటం బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది?

30, జులై 2010, శుక్రవారం

భిన్నత్వంలో ఏకత్వానికి ఓ ఉదాహరణ

ఈ పుటకి పేర్కొన్న శీర్షిక వెనకాల అప్పుడెప్పుడో చదువుకున్న జోక్ ఒకటి మూల కారణం. మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరోసారి గుర్తు తెచ్చుకుంటాను. అదేమిటంటే, భిన్నత్వంలో ఏకత్వానికి అస్సలైన ఉదాహరణ ఎమిటి అని ఎవ్వరినైనా అడిగితే, డయనా మరణం అంటారు. ఎందుకంటే ఓ బ్రిటన్ అమ్మాయి ఓ ఈజిప్ట్ దేశస్తుడితో కలసి జెర్మనీలో తయ్యారయిన బెంజ్ కారులో వెళుతూ ఫ్రాన్స్ లోని పారిస్ లో చనిపోవడం, ఆ విషయాన్ని ఇండియాలోని ఓ అబ్బాయి చైనా లో తయ్యరయ్యిన చిపు ఉన్న జపాన్ మేడ్ కంప్యూటర్లో వ్రాసి ప్రచురిస్తే ఆస్ట్రేలియాలోని మరో తెలుగు వాడు స్పందించాడు .. అంటూ ఈ జోక్ అన్ని దేశాలను కలుపుతూ ఉంటుంది. ఆ జోక్ కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. మీకు గనక తెలిస్తే నాకు పంపించండి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఓ భారతీయుడు అమెరికా వచ్చి మెక్సికో వాళ్ళు జరుపుకునే ఓ గెట్ టుగెదర్ లో పాలుపంచుకుంటే బ్రజీల్ అమ్మాయిలు బెల్లి డాన్స్ చేస్తే వెనుజ్యువెలా అమ్మాయిలు మరో రకమైన నాట్యాలు చేసారు. వీటికి తోడుగా పెరు సంస్కృతిని ప్రతిబింబించే వంటకాలలో బొల్వియా లభ్యమయ్యే ఓరకం జంతువు యొక్క మాంశంతో తయ్యారు చేసిన ఓ వంటకం ప్రధాన అంశం అయ్యింది. దాన్ని చైనాలో తయ్యారయ్యిన ఐఫోన్లో నేను భందిస్తే.. బ్లా .. బ్లా.. ఇక ఇక్కడితో ఈ దేశాలను కలిపే పని ఆపి ఆ కార్యక్రమం విషయాలకు వస్తాను. ఓ మెక్సికో దేశస్తుడు నేను ఉంటున్న హోటల్లోనే బస చేస్తున్నాడు అదిగో అతనే రమొన్. మేమిద్దరం సాయత్రం ఐదు గంటల వేళ రెడింగ్ టౌన్ హాల్ ప్రక్కనే ఉన్న చర్చికి చేరుకున్నాం. మేము అక్కడకు చేరుకునేటప్పటికి అక్కడ ఒకరిద్దరే కనబడ్డారు.

Mexican Families

Mexican Families

Ramon

IMG_0037 కాసేపు అయిన తరువాత మెల్లగా ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభమైంది. దాదాపు అందరూ వచ్చిన తరువాత, ఇక లేండి అందరం భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు. తీరా అక్కడకు వెళ్ళి చూద్దును కదా అంతా మాంశాహారమే.. అందుకే అక్కడ ఉన్న కొన్ని అప్పడాలు కొన్ని చిప్స్ మరియు కొన్ని టాకోస్ లాంటివి తెచ్చుకుని నేను భోజనానికి సిద్దం అయ్యా.

ఇక నా భోజనంపై నా ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.

అప్పడాలు అప్పడాల్ల లేవు, విష్ణూ చక్రాల్లా ఉన్నాయి. వాటిల్ని విరక్కొట్టడానికి నా వేళ్ళల్లో శక్తి చాల్లేదు. ఇక ఠాకో లైతే ఉండ చుట్టిన అరిసెల్లాగా కరకర లాడేటట్టు కాల్చి ఉంచారు. నాకు తెలిసినంత వరకూ ఠాకోకు మన చెపాతిల్లాగా ఉంటాయి. అందువల్ల అవి మెత్తగా ఉంటాయి. ఇవి వాటికి వ్యతిరేకంగా గట్టిగా కరకర లాడేటట్టు తయ్యారు చేసారు. ఇక మనకు నచ్చినది ఒకటే.. అదేనండి పొటాటో చిప్స్. సరే వాటితోనే పని కానించేసా.

IMG_0044

IMG_0042IMG_0048 ఇలా జరుగుతున్న మా సాయంకాల వేళలో కొంత మంది పిల్లకాయలు దూరారు. వీళ్ళంత అక్కడి మెక్సికన్ కుంటుంబాల పిల్లలన్నమాట. మన రమోన్ గారు వీరికి కొన్ని చిన్న డాన్సలు నేర్పించారు, వాటిల్ని వీరు అక్కడ ప్రదర్శించారు.

IMG_0038IMG_0040IMG_0041

ఇలా చిన్న పిల్లల నృత్యాలు నడుస్తుంటే, ప్రక్కనే మరికొంతమంది అమ్మాయిలు సిద్దం అయ్యారు..

IMG_0047

IMG_0046

నిజం చెప్పొకోవాలంటే, ఈ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేశింది. అల్లరి చేసే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అలాంటి అల్లరిపిల్లలో కొంత మంది ఇంత చక్కగా నేర్చుకుని, గుర్తు పెట్టుకుని భేషుగ్గా పెర్‍ఫామ్ చేసారంటే ముద్దెట్టుకోక ఎవ్వరుంటారు చెప్పండి. ఇలా ఆలోచిస్తూ ఉండగానే మెక్సికన్ స్టైల్ లో నాట్యం మొదలైంది

IMG_0049

IMG_0052 IMG_0050 IMG_0057

ఇది కొంత సేపు నడిచింది. ఈ నాట్యంలో నాకు పెద్ద గొప్పదనం కనబడలేదు సరికదా అంతగా ఆనందించ లేక పోయ్యాను. దీనికి కొన్ని కారణాలు. అన్నింటికన్నా మించి నాకు డాన్స్ వచ్చి ఉండటం. ఈ నృత్యం వీళ్ళకీ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ప్రస్తావించే రెండు నృత్య రీతుల్ని మన భారతీయ శాస్త్రీయ నృత్య రీతులత్ పోల్చుంకుంటే, నక్కకు నాగలోకానికి ఉన్న దూరం కనబడుతుంది. భారతీయ నృత్య రీతులలో ఉన్నంత వైవిధ్యం నేనింత వరకూ ఎక్కడ చూడలేదు. అఫ్ కోర్స్ నేను చూసిన లోకం చాలా చిన్నది.

  • ఇందులో లంగాను ఊపడం తప్పితే మరింకేం కనబడలేదు
  • పాద ప్రయోగం చాలా సున్నితంగా సాగితే చేతులు అచ్చంగా లంగాను పట్టుకుని ఊపడంతో సరిపోయాయి
  • హావభావాలకన్నా ఇంస్ట్రుమెంటల్ మ్యూజికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు

ఇది అయిన తరువాత బెల్లీడాన్స్..

IMG_0059

ఇదిగో ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాం. ఈ పిల్లలు చాలా సేపు ఇలా తలలు దించుకుని కూర్చొని ఉన్నారు, ఎంతకీ పాట ప్రారంభం అవటం లేదు. వీళ్ళందరికీ మధ్యలో ఉందే ఆ అమ్మాయే వీళ్ళకు లీడర్ అన్న మాట. చాలా సేపు ఎదురు చూసిన తరువాత ఏమి జరుగుతోంది అని అలా తల ఎత్తి చూస్తోంది.

ఏదో కొంచం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున నేనున్నా అంటూ నేను ఓ దూకు దూకా!! దూకే ముందు ప్రక్కనున్న అమ్మాయికి నా ఐ ఫోన్ ఇచ్చి నన్ను ఫొటో తియ్యమంటే, అలాగే కూర్చున్న అమ్మాయిలని ఓ పది తీసింది.. ఇదిగో ఇలా

IMG_0060

IMG_0062

IMG_0063

ఆఖరికి అమ్మాయిలు కాస్తా లేచి నాట్యం మొదలు పెట్టారు. ఈ నృత్యం నన్ను ఆకట్టుకుంది. ఎందుకంటే ఆద్యంతం పూర్తిగా కదలికలతో కలిగి ఎక్కడా ఆగకుండా ఓ పదినిమిషాల పాటు సాగింది. మెల్లగా మొదలైన ఈ నృత్య శైలి మంద్రస్థాయిలో సాతి ఆఖరికి ఉదృత స్థాయి చేరుకుంది. ఒక్క ఫొటో కూడా బాగా రాకపోవడాని ఇదీ ఒక కారణమే

IMG_0064

IMG_0065

IMG_0066

IMG_0067 IMG_0068 IMG_0069 IMG_0070

ఇలా వాళ్ళు అక్కడ నాట్యం చేస్తుంటే నా ప్రక్కనే ఉన్న నెలల పాపకూడా ఆ సంగీతానికి ముగ్దురాలై చేతులు కాళ్ళు కదపడం మొదలెట్టింది.

IMG_0071

IMG_0072

నలుగురు స్నేహితులు – ఓ పని

నా క్రిందటి పుటలో ఆరవ అజ్ఞాత స్పందనను చూసిన తరువాత ఇది వ్రాయాలనిపించింది. ఇలాంటి అజ్ఞాతలు ఎంతమంది స్పందించకుండా పోయ్యారో వారందరికీ ఇది ఒక సలహా అవ్వాలని ఈ పుట యొక్క అంతరంగం. ఈ పుట ఓ నలుగురు స్నేహితుల గురించి నేను చదువుకున్న ఆంగ్ల కధ. క్లుప్తంగా ఆంగ్లంలోనే వ్రాస్తాను. ఎందుకంటే తెలుగులోకి అనువదించి వ్రాస్తే ఆ కధ యొక్క పట్టు అంత మజాగా ఉండదు.

Once upon a time there lived 4 friends by names, EveryOne, AnyOne, SomeOne and NoOne. There is a work that AnyOne can do and EveryOne is thinking that SomeOne would come forward and do the work. But finally NoOne did the work.

So to conclude when there is some thing that we can do, please do so. Why wait for some one to come forward.

తెలుగులో నాకు నచ్చిన ఓ పాట .. ఇదే విధంగా ఉంటుంది..

ఎవరో ఒకరు .. ఎప్పుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఏటో వైపు..

అలా మీరు చెయ్యాల్సిన పని ఎవ్వరో చేస్తారని ఎదురు చూడకండి. ప్లీజ్ మీరే చెయ్యండి.

26, జులై 2010, సోమవారం

అమెరికాలోని జీవన విధానం – నా పాయింట్స్ : మొదటి పుట

అక్కడెక్కడో బ్లాగుల్లో అమెరికా జీవన విధానం గురించి చర్చ జరుగుతుంటే, నేను కూడా పాలు పంచుకుంటే ఏమి పోతుందిలే అని పూనుకున్నాను అనుకోకండి.. ఏదో ఇక్కడ (అంటే అమెరికాలో) ఉన్నా కదా అందుకే ఇలా. అయినా ఇక్కడి జీవన విధానం ఎప్పుడో ఒక సారి వచ్చి పోయే నాలాంటి వాడికి ఎలా తెలుస్తుంది!!?? ఏదో కోతలు తప్ప.. అందుకని సీరియస్ గా ఆలోచించకుండా .. ముందుకి సాగిపొండి..

  1. ఇక్కడ పిల్లల బాల్యం నుంచే ఆధారపడకుండా బ్రతికేటట్టు తల్లి తండ్రులు నేర్పిస్తారు. ఇక్కడ ఆధార పడటం అనే విషయంపై ఇంతకు ముందు వ్రాసాను, ఓ లుక్కేయ్యండి.
  2. పిల్లల్లో స్వతంత్ర భావాలకు నాంది పలుకుతున్నాం అనే ముసుగులో వీరు భాద్యతను నెత్తి కెక్కించుకోవటం లేదని నా అభిప్రాయం. పిల్లలను చిన్నప్పటినుంచే వేరే గదిలో నిద్ర పోయేటట్టు నేర్పిస్తారు. అలా వారు వారి గదులను వారి అభిరుచి మేఱకు తీర్చిదిద్దుకోవచ్చు అన్న మాట. మరి బెడ్ టైమ్ స్టోరీస్ విషయమేమిటో..
  3. దేవుడు దయ్యం, నీతి నియమం, మంచి చెడు, స్థితి గతి.. వగైరా వగైరా వంటి విషయాలను తల్లి తండ్రులు పాటించరు అలాగే పిల్లలకు నేర్పించరు. ఏమైనా అంటే, అది వాళ్ళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలనిపిస్తే వాళ్ళే నేర్చుకుంటారు లేదా జులాయి వెధవల్లా పోతారు అని వీరి ఉద్దేశ్యం.
  4. పిల్లల బడిలో తల్లికూడా కూర్చుంటుంది కానీ అది నామ మాత్రం మాత్రమే.. మేమే అన్ని నేర్పిస్తే ఇక ఉపాద్యాయులుగా మిమ్మల్నెందుకు పెట్టుకున్నారు అని అంటారు.. మరి కొందరైతే ఇంకొంచం ముందుకెళ్ళి, చక్కగా “హోమ్ స్కూలింగ్” అని చెప్పి పిల్లల్ని వారి వయసు ఉన్నవారితో దూరంగా, సామూహికంగా కలసి మెలసి చదువుకోవలసిన సమయ్యాన్ని ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసేస్తున్నారు.

 

ఈసారికి ఇక్కడితో ఆపేస్తున్నాను, మరింకెన్ని వస్తాయో..

చదువు ఎగ్గొట్టే పిల్లలకు ఇదొక శుభవార్త

rr ఈ మద్య వచ్చే ప్రతీ సినిమాలోనూ హీరో గారికి చదువు అబ్బదు. ఇలా కధలు వ్రాయడం ఓ పెద్ద స్టైల్ అయ్యిపోయింది. అదేదో పెద్ద ఘన కార్యం అన్నట్లుగా చిత్రీకరిస్తారు మన సినిమా దర్శకులు. దానికి తోడు ఇలాంటి కధలు మరిన్ని రావాలని తీసిన వారి వెనకల తాన తందానా అంటూ తిరిగుతూ కోతలు కోసే భట్రాజులు, మరికొందరు.

 

ఏది ఏమైనా మన సినిమాలలో హీరో గారికి చదువు అబ్బదు.. జులాయి వెధవ.. పోరంబోకు.. ఇలా చూపించాం అనుకోండి.. ఇహ ఆ సినిమా వందరోజులు ఖాయమే..

 

అయినా నా వెఱి కాకపోతే, నేను బ్లాగితే మాత్రం జనాలు మారతారా పెడతారా.. ఆ విషయాని ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం. చదువు ఎగ్గొట్టి జులాయిగా తిరుగుదాం అనుకునే యువతరానికి మఱో ఆయుధం. ఎలాగో కాలేజీ అయ్యిన తరువాత మంచి ఉధ్యోగం వచ్చిందా లేదా అని మనల్ని వేపుకు తినే వాళ్ళు ఎలాగూ ఉంటారు, అదే ఫైల్ అయ్యామనుకోండి అప్పుడూ తిడతారు. అంటే పాస్ అయ్యినా తిట్లే అలాగే ఫైల్ అయ్యినా తిట్లే.. అలాంటప్పుడు చక్కగా ఫైల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనం రిటన్లో వాళ్ళని తిట్టోచ్చు కదా.. అందుకని చదువు సంధ్యా వద్దు .. చక్కగా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి. మరి ఉధ్యోగం మాట అంటారా.. అదిగో అక్కడికే వస్తున్నా..

యాహూ వారి హోమ్ పేజీలోని వార్త నన్ను చాలా ఆశ్చర్యాని మరియు ఆనందానిచ్చింది. ఓ ఏడు రకాల ఉధ్యోగాలకు అస్సలు కాలేజీ డిగ్రీ అవ్వసరం లేదని మరియు అవన్నీ చాలా దండిగా జీతానిస్తాయని వ్రాసారు. ఇంకేం మీరు కూడా చదివేయ్యండి అలాగే మీరు కూడా వేలకు వేల డాలర్లను సంపాదించి పెట్టే ఉధ్యోగాన్ని కొట్టేయ్యండి. వారి పాఠ్యాంశం క్లుప్తంగా..

ఈ క్రింద పేర్కొన్న ఏడు ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు అందువల్లన తమరు నిశ్చింతగా కాలేజీకి బంకు కొట్టేయ్యండి

౧) ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ – కనీస వేతనం – దాదాపు $47,800

౨) చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవిగారు చేసిన పాత్ర, ప్రైవేట్ డిటెక్టివ్ ఆర్ ఇన్వెస్టిగేటర్ – కనీస వేతనం - $50,600

౩) లిఫ్ట్ మెకానిక్ – కనేస వేతనం - $61,500

౪) న్యీక్లియర్ పవర్ రియాక్టర్ ఆపరేటర్ – కనీస వేతనం $79,100

౫) పర్సనల్ ట్రైనర్ – కనీస వేతనం - $37,500

౬) డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటి – కనీస వేతనం - $62,400

౭) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – కనీస వేతనం – $60,200

18, జులై 2010, ఆదివారం

తల్లి చేసే అతి ముఖ్యమైన పనులు – మొదటి పుట

తల్లి .. ఇది నిజం.. తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ నేను వ్రాయాలనుకోవటం లేదు.. వ్రాసినా అది ఎటువంటి అనర్దాలకు మరియు అపార్ధాలకు దారి తీస్తుందో అన్న భయం నన్ను ఇక్కడ ఆపేస్తోంది..

mom

అమ్మ .. చాలా పనులు చేస్తుంది .. పవన్ కళ్యాణ్ పులి సినిమా ఆడియూ రిలీజ్ ఫంక్షన్ లో ఒక చోట రెహమాన్ గురించి మరియు రెహమాన్ తల్లి గురించి ప్రస్తావిస్తూ అన్న మాటలు ..

“.. మొదటి గురువు తల్లి.. విలువలు మరియు వినయం తల్లి నేర్పిస్తుంది ..”

ఈ మాటలు చాలా మంది ఇంతకు ముందు చెప్పినా మఱోసారి తలచుకోవాలనిపిస్తోంది .. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూడకండి .. ఆ మాటల వెనకాల ఎంత అర్దం దాగి ఉందో అర్దం చేసుకోవడాని ప్రయత్నించండి.

తల్లి అనే రెండక్షరాలు వివరించడానికి ఒక జీవితం చాలదు. ఏది ఏమైనా తల్లి కావలని తపిస్తున్న ప్రతీ స్త్రీకి ఉండ వలసిన ముఖ్యలక్షణాలు .. విలువలు మరియు వినయం.

వీటిల్లో మొదటిది .. విలువలు.. లేకనే రావణాసురుని తల్లి సమయం కాని వేళల్లో రతి కార్యం చేసి రావణాసురుడికి జన్మనిచ్చింది. కాని,  ఆవిడకు గాని రావణాసురునికి గాని వినయం లేదని నేనను..

6, జులై 2010, మంగళవారం

కాళ్ళు లేవు చేతులు లేవు.. అలాగే కష్టాలు కూడా లేవు..

మనలో చాలామందికి అన్ని కష్టాలే.. కానీ ఈ అబ్బాయికి కాళ్ళు లేవు, చేతులు లేవు అలాగే జీవితంలో కష్టాలు కూడా లేవంట. ఎలా అనుకుంటున్నారా.. ఇదిగో ఈ క్రింద చెప్పాడు చూడండి. ఈ పుటని క్రింద చూపిన వీడియోలో ఆడియో లేకుండా చూసాను అయినా కన్నీళ్ళు ఆగలేదు.

అన్నీ ఉన్న మనకే అన్ని కష్టాలు అయితే, శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కొన్నింటి లేని ఇతని ఆత్మనిబ్బరం నన్ను అబ్బుర పరచింది. మరి మీ సంగతేంటి..

5, జులై 2010, సోమవారం

కామెంట్స్ మాడరేషన్ తీసేసాను

నాకు ఉన్న రెండు బ్లాగులలో ప్రస్తుత బ్లాగుకి కామెంట్స్ మొడరేషన్ తీసేసాను. ఇకపై ఇక్కడ ప్రచురించే అన్ని పుటలకు స్పందించే వారు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెయ్యడం వెనకాల కొన్ని ముఖ్యాంశాలు.

ఒకటి) అందరికీ తెలుస్తుంది నాపై స్పందించే వారి భావనలేమిటో..

రెండు) పారదర్శకత..

మూడు) నిస్సంకోచంగా .. నిర్బయంగా.. నిష్కర్షగా అనానిమస్ వారు కూడా స్పందించొచ్చు..

ఇలా చెయ్యడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే మరికొన్ని నష్టాలు ఉన్నాయి. కాలం నాకు అన్నింటిని నేర్పుతుందని అలోచిస్తూ, ఇదిగో ఇలా మొదలు పెట్టేస్తున్నాను.

బైదవే.. ప్రస్తుతం నేను వమెరికాలో ఉన్నాను కదా.. ఈరోజు అమెరికన్స్ జరుపునే స్వాతంత్ర దినోత్సవం. హాపీ ఇండిపెండెన్స్ డే టు అమెరికా

 
Clicky Web Analytics