18, జులై 2010, ఆదివారం

తల్లి చేసే అతి ముఖ్యమైన పనులు – మొదటి పుట

తల్లి .. ఇది నిజం.. తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ నేను వ్రాయాలనుకోవటం లేదు.. వ్రాసినా అది ఎటువంటి అనర్దాలకు మరియు అపార్ధాలకు దారి తీస్తుందో అన్న భయం నన్ను ఇక్కడ ఆపేస్తోంది..

mom

అమ్మ .. చాలా పనులు చేస్తుంది .. పవన్ కళ్యాణ్ పులి సినిమా ఆడియూ రిలీజ్ ఫంక్షన్ లో ఒక చోట రెహమాన్ గురించి మరియు రెహమాన్ తల్లి గురించి ప్రస్తావిస్తూ అన్న మాటలు ..

“.. మొదటి గురువు తల్లి.. విలువలు మరియు వినయం తల్లి నేర్పిస్తుంది ..”

ఈ మాటలు చాలా మంది ఇంతకు ముందు చెప్పినా మఱోసారి తలచుకోవాలనిపిస్తోంది .. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూడకండి .. ఆ మాటల వెనకాల ఎంత అర్దం దాగి ఉందో అర్దం చేసుకోవడాని ప్రయత్నించండి.

తల్లి అనే రెండక్షరాలు వివరించడానికి ఒక జీవితం చాలదు. ఏది ఏమైనా తల్లి కావలని తపిస్తున్న ప్రతీ స్త్రీకి ఉండ వలసిన ముఖ్యలక్షణాలు .. విలువలు మరియు వినయం.

వీటిల్లో మొదటిది .. విలువలు.. లేకనే రావణాసురుని తల్లి సమయం కాని వేళల్లో రతి కార్యం చేసి రావణాసురుడికి జన్మనిచ్చింది. కాని,  ఆవిడకు గాని రావణాసురునికి గాని వినయం లేదని నేనను..

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రావణాసురుడి తండ్రికి విలువలున్నాయా?

సుజాత వేల్పూరి చెప్పారు...

చక్రవర్తి గారూ,రావణబ్రహ్మ తల్లి కైకసి గురించి మీరు చాలా చదవాలి. విలువలు లేవని ఒక్కమాటలో తీర్పిచ్చారే! ఇది కూడా పవన్ కళ్యాణే చెప్పాడా ఏమిటి కొంపదీసి? నేనా ప్రోగ్రామ్ చూడలేదు,అందుకే అడుగుతున్నాను.

అజ్ఞాత చెప్పారు...

I am sorry
okka mukka artham kaledu

ఓ బ్రమ్మీ చెప్పారు...

మొదటి అజ్ఞాత గారు,

ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే, కైకసి వచ్చి విప్రవసుని అనే మునివర్యుని వేళ కాని వేళలో సంతానం కోసం కోరిక కోరుతుంది. ఇది సమయం కాదని విప్రవసుడు అప్పటికీ వారిస్తాడు, అయినా సరే పట్టు పట్టి అప్పటికి కానిస్తుంది. అందువల్లన సాయం సంధ్య వేళల్లో పుట్టడం వల్ల అలా రావణునికి కొన్ని విషయాలలో విలువలకు తావివ్వకుండా ప్రవర్తించాడు. మంచి ప్రశ్న వేశారు.. నెనరులు.

సుజాత గారు,
నాకు తెలిసినది చాలా తక్కువ .. నాకు తెలిసినంతలో విప్రవసుని కైకసి కోరిక కోరే సమయం సరైంది కాదని, సంధ్యా వందన కార్యక్రమానికి విలువనిచ్చే మనుష్యులెవ్వరైనా అలా చెయ్యరని నా అభిప్రాయం. అందు వల్ల ఆ అభిప్రాయం మేఱకు అలా వ్రాయ వలసి వచ్చింది. కైకసి గురించి మీకు తెలిసిన లంకెలేవైనా ఉన్న యడల తెలియ జేయగలరు. ఈ అభిప్రాయం వెనుక పవన్ కళ్యాణ్ హస్తం ఏమీ లేదు. ఏమైనా స్పందించినందులకు నెనరులు.

రెండొవ అజ్ఞాత గారు,

మీకు ఏమీ అర్దం కాకపోవడానికి తమరు సారీ చెప్పడానికి పొంతన లేదండి. మర్యాద కోసం చెప్పారని తలుస్తాను. స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics