ఈ మద్య వచ్చే ప్రతీ సినిమాలోనూ హీరో గారికి చదువు అబ్బదు. ఇలా కధలు వ్రాయడం ఓ పెద్ద స్టైల్ అయ్యిపోయింది. అదేదో పెద్ద ఘన కార్యం అన్నట్లుగా చిత్రీకరిస్తారు మన సినిమా దర్శకులు. దానికి తోడు ఇలాంటి కధలు మరిన్ని రావాలని తీసిన వారి వెనకల తాన తందానా అంటూ తిరిగుతూ కోతలు కోసే భట్రాజులు, మరికొందరు.
ఏది ఏమైనా మన సినిమాలలో హీరో గారికి చదువు అబ్బదు.. జులాయి వెధవ.. పోరంబోకు.. ఇలా చూపించాం అనుకోండి.. ఇహ ఆ సినిమా వందరోజులు ఖాయమే..
అయినా నా వెఱి కాకపోతే, నేను బ్లాగితే మాత్రం జనాలు మారతారా పెడతారా.. ఆ విషయాని ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం. చదువు ఎగ్గొట్టి జులాయిగా తిరుగుదాం అనుకునే యువతరానికి మఱో ఆయుధం. ఎలాగో కాలేజీ అయ్యిన తరువాత మంచి ఉధ్యోగం వచ్చిందా లేదా అని మనల్ని వేపుకు తినే వాళ్ళు ఎలాగూ ఉంటారు, అదే ఫైల్ అయ్యామనుకోండి అప్పుడూ తిడతారు. అంటే పాస్ అయ్యినా తిట్లే అలాగే ఫైల్ అయ్యినా తిట్లే.. అలాంటప్పుడు చక్కగా ఫైల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనం రిటన్లో వాళ్ళని తిట్టోచ్చు కదా.. అందుకని చదువు సంధ్యా వద్దు .. చక్కగా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి. మరి ఉధ్యోగం మాట అంటారా.. అదిగో అక్కడికే వస్తున్నా..
యాహూ వారి హోమ్ పేజీలోని వార్త నన్ను చాలా ఆశ్చర్యాని మరియు ఆనందానిచ్చింది. ఓ ఏడు రకాల ఉధ్యోగాలకు అస్సలు కాలేజీ డిగ్రీ అవ్వసరం లేదని మరియు అవన్నీ చాలా దండిగా జీతానిస్తాయని వ్రాసారు. ఇంకేం మీరు కూడా చదివేయ్యండి అలాగే మీరు కూడా వేలకు వేల డాలర్లను సంపాదించి పెట్టే ఉధ్యోగాన్ని కొట్టేయ్యండి. వారి పాఠ్యాంశం క్లుప్తంగా..
ఈ క్రింద పేర్కొన్న ఏడు ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు అందువల్లన తమరు నిశ్చింతగా కాలేజీకి బంకు కొట్టేయ్యండి
౧) ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ – కనీస వేతనం – దాదాపు $47,800
౨) చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవిగారు చేసిన పాత్ర, ప్రైవేట్ డిటెక్టివ్ ఆర్ ఇన్వెస్టిగేటర్ – కనీస వేతనం - $50,600
౩) లిఫ్ట్ మెకానిక్ – కనేస వేతనం - $61,500
౪) న్యీక్లియర్ పవర్ రియాక్టర్ ఆపరేటర్ – కనీస వేతనం $79,100
౫) పర్సనల్ ట్రైనర్ – కనీస వేతనం - $37,500
౬) డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటి – కనీస వేతనం - $62,400
౭) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – కనీస వేతనం – $60,200