ఈ మధ్య మా కంపెనీ వారు ఏవైనా ఆర్టికల్స్ పంపండి వాటిని మంత్లీ మెగజైన్‍లో మీ పేరుమీద వేస్తాం అంటే, అమేజింగ్ డివైకేస్ అనే శీర్షికన ఈ క్రింద చెప్పిన విధంగా ఓ ఆర్టికల్ వ్రాసి పంపాను. అందులో జావా గురించిన విషయం ఉండటం వల్ల వారు ప్రచురించ లేదు. అది వేరే సంగతి, ఇంతకీ ఈ విషయాలు మీకేమైనా తెలుసా!!
****
మొదటి ఆశ్చర్యకరమైన విషయం
ప్రతీ పద్నాలుగు రోజులకి ఓ భాష చనిపోతోంది అంటే మీరు నమ్ముతారా!!?? 2100 నాటికి ఏడువేలకు పైగా భాషలు అంతరించిపోతాయి, వీటిల్లో చాలా వాటిని ఇప్పటికీ రికార్డ్ చెయ్యబడలేదు. ఇవన్నీ మానవుల సంస్కృతికి మరియు జ్ఞానానికి నిధులు. మానవుల చరిత్రకు ఇవి సాక్షాలు. ప్రకృతి పరంగా మానవుని మేధస్సుకి ఇవి తార్కాణాలు. ఇంకా చదవాలనుకుంటే http://bit.ly/LangDie
రెండవ ఆశ్చర్యకరమైన విషయం
జావా వర్చ్యువల్ మెషీన్ లో చాలా లోపాలున్నాయి, ఇది డాట్‍నెట్ వర్ట్చ్యువల్ మెషీన్ కన్నా చాలా లోపభూయిష్టమైనది అంటే మీరు నమ్ముతారా!! అమెరికాలోని వర్జీనియా యూనివర్శిటి వారి కంప్యూటర్ విభాంగం వారు పరిశోధించి వివరాలను ఓక శ్వేత పత్రంగా వెలువరించారు. దాని మరిన్ని వివరాలకై http://bit.ly/JavaVMLeak
మూడవ ఆశ్చర్యకరమైన విషయం
అమెరికా వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.. దేనికంటారా? అదేనండి పెట్టుబడి పెట్టడానికి. వారి వద్ద ఎంత ధనం నికరంగా మూలుగుతోందో మీకు తెలుసా? వీరి ఆర్ధిక చరిత్రలో ఈ సంవత్సరంలో అత్యధికంగా, దాదాపు 837 బిలియన్ డాలర్ల అంటే మీరు నమ్ముతారా. ఇంత డబ్బు పెట్టుకునీ వారు జనాలకు ఉపాధి కలిగించడం లేదు, ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇదిగో http://usat.ly/US837B
నాల్గొవ ఆశ్చర్యకరమైన విషయం
మీరు కాలేజీ బంక్ కొట్టి ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నారా, అలాగే చదువు ఎగ్గొట్టి మంచి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా!! ఇదిగో యహూ వాడు మీకోసం ఓ ఏడు విధాల ద్వారా బాగా డబ్బు సంపాదించే వివరాలను అందిస్తున్నాడు. మరిన్ని వివరాలకై http://bit.ly/SkipCol
ఐదొవ ఆశ్చర్యకరమైన విషయం
Mayfly అనే కీటకం దాదాపు 30 నిమిషాల నుంచి అత్యధికంగా ఓ రోజు వరకూ మాత్రమే జీవిస్తుంది అంటే మీరు నమ్ముతారా. అత్యల్ప జీవితకాలం బ్రతికే జీవులగురించి చదవండి, http://bit.ly/ShortLive
****
వీటిల్లో మూడు నాల్గొవ అంశాల గురించి నేను బ్లాగాను, మీలో కొందరు ఆ విషయమై స్పందించారు. అవి కాకుండా మిగిలిన విషయాల గురించి స్పందించమనవి. ఒకవేళ మీరుగాని 3 & 4 విషయాల గురించి ఇప్పుడే చదువుతున్నట్లైతే ఆ విషయాలపై కూడా స్పందించ వచ్చు.
5 కామెంట్‌లు:
మీరు జావా గురించి ఇచ్చిన లింక్ వేరేచోటకి వెళ్తుంది. సరిచేయగలరు.
బద్రి గారు,
స్పందించి తెలియజేసినందులకు నెనరులు. మార్పు చేసాను, గమనించండి. మీరు గనుక ఇంత తొందరగా స్పందించకపోతే చాలా మంది దీనిని గమనించే వారు కాదు. మెనీ మెనీ థాంక్స్
కీటకాల లింకు .. పనిచేయటం లేదండి
మొదటి అజ్ఞాత గారు,
చాలా చాలా నెనరులు. ఎందుకో మరి ఈ చిరు లంకెలు పని చెయ్యడం లేదు. కానీ ఎవ్వరైనా స్పందించిన తరువాత సరిదిద్దుతున్నాను. స్పందించి సరిచేసినందులకు నెనరులు. ఇప్పుడు సరిగ్గా ఉందో లేదో చూడండి.
తెలవదు కాని మీరు సెప్పినవి బాగున్నాయి
కామెంట్‌ను పోస్ట్ చేయండి