3, ఆగస్టు 2010, మంగళవారం

అమెరికాలో నేను చేసిన మొదటి సాహసం

 

DSCN1095 అమెరికాని దర్శించడం నేను ఇది రెండవసారి. మొదటి సారి వచ్చినప్పుడు పెద్దగా ఏమీ చూడలేదు సరికదా ఎక్కువగా ఎక్స్ ప్లోర్ చేసింది లేదు. కాని అందుకు భిన్నంగా ఈ సారి ఎన్నో సాహస ప్రయత్నాలు చేస్తున్నాను. వాటిల్లో మొదటిది వచ్చీ రాగానే న్యూయార్క్ నగరాన్ని చుట్టేయ్యడం. దీని గురించి ఒక్క సారి క్లుప్తంగా కాకపోయినా కొంచం తక్కువ వివరంగా..

నా ఫ్లైట్ భాగ్యనగరం నుంచి దుబాయికి మొదటి అంగలో చేరుకుంటే, రెండవ అంగ దుబాయి నుంచి న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయానికి, ఆ తరువాత అక్కడినుంచి ఫిలడెల్‍ఫియాకు మూడవ అంగలో విమాన యానం. ఫిలడెల్‍ఫియా నుంచి రెడింగ్ నగరానికి కారులో ప్రయాణం అన్నమాట. ఇదిగో ఇక్కడే నేను చేసిన మొదటి సాహసం. న్యూయార్క్ ఏయిర్ పోర్టులో దిగిన తరువాత ఇక్కడి సహోద్యోగులకు ఫోన్ చేసి నేను క్షేమంగా చేరుకున్నాను ఇక్కడ నాకు ఓ అయిదు గంటల సమయం ఖాళీ దొరికింది, కనుక ఏమి చెయ్యమంటారు అని అడిగాను. ఏమీ చెయ్యొద్దు, చక్కగా అక్కడ లాంజ్‍లో నిద్దరో అన్నారు. ఉన్న అయిదు గంటల్లో ఓ గంట మళ్ళీ సెక్యూరిటీ చెకిన్.. గాడిద గుడ్డు .. గోంగుర పాసు ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కడో ఓ జాగా చూసుకుని ఓ మూడు గంటలు కళ్ళు మూసుకుని కునుకు తీయ్యు అని ఓ చెత్త సలహా ఇచ్చారు.

అది కాదురా ఎలాగో న్యూయార్క్ ఏయిర్ పోర్టులో ఉన్నాగా అలా ఓ రౌండ్ వేసి వస్తా అన్నా, ఎవ్వడి కాడు నన్ను భయపెట్టినోళ్ళే గాని, భలే !! మంచి ఆలోచన జాగ్రత్తగా పోయి చూసి క్షేమంగా తిరిగిరా అన్న వెధవలేడు. అలాంటప్పుడేకదా నేను సాహసం చేసేది. ఇంకేం, లగేజీ చెకిన్ చేసేసి కెన్నెడి విమానాశ్రయం నుంచి మాన్‍హట్టన్ నగరానికి ఎయిర్ ట్రైన్ ఉంటే అది పట్టుకుని జాం అంటూ బయలు దేరాను, అక్క్డడకు వెళ్ళంగానే నాకోసమే అన్నట్టు లోకల్ ట్రిప్స్ తిప్పే బస్సు వాడు వేచి ఉన్నాడు. వాడి మొహాన ఓ నలభై నాలుగు డాలర్లు కొట్టి ఇక ఫో అన్నా. వాడు వెంటనే ఓ తాడి చెట్టంత చిట్టా చించి నా మొహాన విసిరి నా పనైపోయిందన్నట్టు చూసాడు. ఇంతకీ ఇది ఏమిటిరా అబ్బాయి అని అడగ్గానే, ఓ వింత మనిషిని చూసినట్టు ఓ లుక్కేసి, దీనిని రిసీట్ అంటారు, నువ్వు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా నిన్ను ఎవ్వరూ అడగరు. నిన్ను న్యూయార్క్ నగరం మొత్తం చుట్టాలంటే, మూడు దారులు గుండా నిన్ను తిప్పాలి కాబట్టి ఒక్కొ మార్గంలో తిరిగే బస్సు వాళ్ళు ఒక్కొక్క బిల్లు తీసుకుంటారు అంటూ విసుక్కున్నాడు

DSCN1117 విసుక్కుంటే విసుక్కున్నాడు వివరం చెప్పాడు అనుకుని ఎదురుగా కనబడ్డ డబల్ డక్కర్ బస్సెక్కి మన బొమ్మరిల్లు సినిమాలో వీరోయిన్ కూర్చున్నట్టు బస్సు టాప్ ఎక్కి అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్న రెండు సీట్లను ఆక్రమించేసా. ఇంతలో మరో తెల్ల తోలు వచ్చి నీ ప్రక్కన చోటుందా అని అడిగితే, మొహమాటం లేకుండా అదిగో ప్రక్కన ఉన్న మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ సద్దుకో అని ఓ సలహా పడేశా.. హీ హీ.. అదిగో అలా బయలు దేరిన న్యూయార్క్ ప్రయాణంలో అక్కడి చారిత్రక కట్టడాలను చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోలు తీసుకుంటూ గడిపేశా. అక్కడ నేను చూసిన కొన్ని చారిత్రాత్మక స్థలాలలో మొదటిది.. టైటానిక్ ఓడని ఉపయోగించిన వ్యాపార సంస్థ భవనం. ఆ తరువాత ఎంపైర్ స్టేట్ భవనం.. అటుపై గ్రౌండ్ జీరో మరియు దానికి ప్రక్కనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి, దూరం నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టి, న్యూయార్క్ బ్రిడ్జ్, చైనా టౌన్ మొదలగు ప్రదేశాలు చూస్తుంటే పుణ్యకాలం ఎలా గడిచిపోయిందో తెలియదు.

న్యూయార్క్ లో నా ఫ్లైట్ మూడు గంటలకు తీరా చూద్దును కదా అప్పటికే రెండయ్యింది. ఇంకే మరొసారి సాహసం. గబగబా దగ్గర్లోని సబ్‍స్టేషన్ పట్టుకుని, అక్కడి నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం. ఇది దాదాపు ఓ నలబై నిమిషాలు. తీరా అక్కడికి చేరుకున్న తరువాత తెలిసిన విషయమేమిటంటే సెక్యూరిటీ చెకిన్ మూసేశారని. అక్కడి కౌంటర్ క్లర్క్ ఆ రోజున ఎవ్వరితోనో గొడవ పడ్డట్టున్నాడు అందువల్ల ఏ మాత్రం నాగోడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని, కొంచం టోన్ మార్చి గంభీరంగా అడిగా, ఎప్పుడైతే గొంతుకులో సౌండు మారిందో వెధవ దారికొచ్చాడు. బోర్డింగ్ టికెట్ ఇస్తా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆలశ్యం చేస్తే దానికి నాది కాదు పూచీ అన్నాడు. ఏదో ఒకటి ముందు చెయ్యిరా మగడా అని వాడినుంచి బోర్డింగ్ టికెట్ తీసుకుని సెక్యూరిటీ చెకిన్ చేసే క్యూలోకి దూరాను. అక్కడ మరో చాంతాడంత క్యూ ఉంది. ఎలాగరా అనుకుంటూ దిక్కులు చూస్తుంటే అక్కడి సెక్యూరిటీ వాళ్ళకు నాపైన అనుమానం కలిగింది.

వెంటనే ఓ ఆఫీసర్ నన్ను ప్రక్కకి పిలిచి విషయమేమిటన్నాడు. ఇదీ సంగతి అక్కడ నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకొన్ని నిమిషాలలో ఎగర బోతున్నది ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నా. విషయం అర్దం చేసుకున్న ఆఫీసర్ ముందుగా క్షమాపణలు అడిగి ఆతరువాత అక్కడ ఉన్న మరో ఆఫీసర్‍తో ఏదో మాట్లాడి ఆ క్యూలోంచి ప్రక్క దారిలో చెక్కింగ్ చేయించే ప్రయత్నం చేసాడు. హమ్మయ అనుకునేంతలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఆఖరుగా చెక్కింగ్ చేసే అధికారికి నాపై లేని పోని అనుమానం కలిగింది. నన్ను తీసుకొచ్చిన ఆఫీసర్ నాకెలా తెలుసు, నన్ను ఎందుకు ప్రక్కదారిలో ఇక్కడకు తెచ్చాడు, వంటి వంకర టింకర ప్రశ్నలు వేస్తుంటే.. ఇందాక టికెట్ దగ్గర వాయిస్ పెంచితే పనైన విషయం గుర్తుకు వచ్చి మెల్లగా నా వాయిస్ స్థాయిని పెంచి సమాధానాలిస్తూ, ఒక వేళ నేను ఫ్లైట్ మిస్ అయితే నువ్వే మరో ఫ్లైట్లో నన్ను పంపించాల్సొస్తుంది అని క్లూ ఇచ్చాను. ఈ విషయం తెలియంగానే ముందుగా కంట్ర్లోల్ రూమ్‍కి ఫోన్లో నా విషయాన్ని చేరవేసి మా ఫ్లైట్ కొంత సేపు ఆపించాడు.

విషయం తెలియంగానే హమ్మయ్య అనుకున్నా. ఇక నీ ఇష్టం ఎన్ని ప్రశ్నలు కావాలో అన్ని ఏసుకోరా అంటూ ఎదురు తిరిగాను. అప్పుడు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం దాదాపు ఓ అరవై నిమిషాలు సాగింది. వాడికి కాలక్షేపం నాకు అదో ఆటవిడుపు. ఈ ప్రశ్నోత్తరాలలో నా బ్యాగ్‍లో ఉన్న టూత్ పేస్ట్ కూడా పాలు పంచుకుంది. దాని అలా టాయిలెట్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్ళకూడదంట. దానికి మరో ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు పట్టుకెళ్ళాలంట. వీటికి తోడు మా అమ్మ చేసిచ్చిన గారెలు మరియు దిబ్బరొట్టెలు. ఇవేంటన్నాడు. వీటిల్ని దిబ్బరొట్టేలంటారు వీటిల్ని ఆవకాయతో తింటాం అంటే ఏదీ ఇప్పుడు తిని చూపించమన్నాడు. ఒరేయ్ ఇవి నాకు రాత్రికిరా అంటే వినడే. అప్పటికప్పుడు తినమంటాడు. సరే అని ఓ సగం తిన్న తరువాత అంతా నువ్వే తింటావా అన్న లుక్కు వాడి మొహంలో కనబడగానే ఓ సగం వాడికి ఆఫర్ చెసా. ఆకలి మీద ఉన్నపులి మాంశం కనబడగానే ఎలా ఎగ్గిరి దూకుతుందో అలా వీడు నా దిబ్బరొట్టిపైకి దాడి చేశాడు.

ఎప్పుడైతే వీడు మనదారిలోకి వచ్చాడో అని తెలియంగానే ఇక మా ఇద్దరి మధ్య వాయిస్ సౌండ్‍లో స్థాయి తగ్గి సిఖరాగ్రావేశ సమావేసపు చర్చలు సజావుగా సాగినాయి. అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇకపో అన్నాడు. ఏడికి పోయేది నువ్వురా నాతోటి లేకపోతే ఆ ఫ్లైట్ వాళ్ళు నన్ను తిడతారు అన్నా. సరే అలాగే కానీయ్ అంటూ నా వెనకాలే మా బోర్డింగ్ కౌంటర్ దాకా వచ్చి దింపి పోయ్యాడు. అలా ఉన్న అయిదు గంటల్లో ఓ సారి న్యూయార్క్ నగరాన్ని చుట్టి రావడమే కాకుండా సెక్యూరిటీ వాళ్ళకు ఆంద్రా దిబ్బరొట్టెలను ఆవకాయను రుచి చూపించాను.

ఈ వీకెండ్లో మరో సాహస యాత్ర విషయమై మళ్ళీ మీముందుంటాను, అప్పటి దాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూఉంటా..

13 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

బావున్నయ్ మీ సాహసాలు. నన్ను ఇలాగే ఓసారి రెండు గంటలు తనిఖీ చేసారు ఎల్ ఆల్ (ఇజ్రాయిల్) ఎయిర్ వేస్ వాళ్ళు. అది కూడా మీకు లాగే నాకు నేను చేసుకున్న దృశ్యం!

పానీపూరి123 చెప్పారు...

> సెక్యూరిటీ వాళ్ళకు ఆంద్రా దిబ్బరొట్టెలను ఆవకాయను రుచి చూపించాను.
are you serious?

అజ్ఞాత చెప్పారు...

భవదీయుడూ .. న్యూయార్క్ నీళ్ళు వంట బట్టినట్టున్నాయ్, ఫోటోలో బాగా ఒళ్ళు చేసినట్టున్నారు. పాపం, సెక్యూరిటీ కి మీ సద్ది దిబ్బరొట్టెల ప్రాప్తం తప్పించుకోలేకపోయాడు. ఏం చేస్తాం! విధి బలీయమైనది.

అజ్ఞాత చెప్పారు...

ilaanti verri pappa software guys etlaa vastarra babu

చెప్పాలంటే...... చెప్పారు...

బావున్నయ్ మీ సాహసాలు

అజ్ఞాత చెప్పారు...

సార్ మీకు టాయిలెట్ ఎక్కనీకి పరేషాన్ అయ్యిందా? సీటు పైకి ఎక్కి సవారి చేయాలంట అవునా? పేపర్లే అంట కదా. తెలిసినోళ్ళని అడగాలంటే నామోషీ , జర సెప్పు సారు.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Few silly questions:

1. I'm wondering that how those people co-operated with you after raising your tone?

2. Will they stop the flight for a single person? Rest might be suffering because of your security check right?

3. How they'll(security people) arrange another flight because of the security checking delays? It's your fault that you went there around 2.00 PM, right?

అజ్ఞాత చెప్పారు...

Why not Mr.Ganesh? They must have thought him as super cop after seeing his cap. :))
Correct me if I am wrong, bhavaa. ;)

Abhimaani.

ఓ బ్రమ్మీ చెప్పారు...

శరత్ గారు,

మీ అనుభవాన్ని గుర్తు చేసుకుని స్పందించినందులకు నెనరులు

పానీపూరి గారు,

ఒక్కడు కాదండి ముగ్గురికి పెట్టా.. అదే ముగ్గురు పోలీసోళ్ళ చేత తినిపించాను. వాళ్ళలో ఒకడు మళయాళీలాగా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇమ్మిగ్రేషన్ చెక్ ఉన్నప్పుడు ఫుడ్ ఏమైనా తెచ్చారా అని అడిగినప్పుడు తెచ్చానని చెప్పాను. అప్పుడు వాడు లోపలికి రానివ్వలేదు. మా అమ్మ పెట్టిచ్చిన పెరుగన్నాన్ని ఫలహారంగా కానిచ్చి అయిపోయిందన్నాను. అప్పుడు వాడు లోనికి రానిచ్చాడు. ఇది ఉదయం జరిగింది. మరి మధ్యాన్నం మళ్ళీ సెక్యూరిటి చెక్ చేసినప్పుడు వీడు మిగిలిన దిబ్బరొట్టేలను పట్టుకున్నాడు. ఏమి చేస్తాం ఇక తినక తప్పింది కాదు. కాస్త మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి కూడా రుచి చూపించాను. కానీ వర్క్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏమీ తినరు, అందునా నాలాంటి స్ట్రేంజర్స్ ఇచ్చేది అస్సలు ముట్టరు. ఏమైనా ఆఫర్ చేస్తే.. ఐయామ్ గుడ్ థాంక్స్ .. అంటూ తిరస్కరిస్తారు. నా ఫీలింగల్లా మా అమ్మ చేసిన దిబ్బరొట్టెలను పారెయ్యాలే అన్న సెంటిమెంట్. ఎలాగో ఒకలా వాళ్ళకీ వీళ్ళకి పెట్టి కానిచ్చేసా.. బిలీవ్ మి .. యెస్, ఐ డిడ్ ఇట్

ఓ బ్రమ్మీ చెప్పారు...

మొదటి అజ్ఞాత గారు,

మీరు చూస్తున్న చిత్రాలు నేను న్యూయార్క్ నగరంలో తీసినవే, కానీ న్యూయార్క్ నగరంలో నేను మంచి నీళ్ళు తప్పితే ఇంకేం తినలేదు. రెడింగ్ చేరుకునేంత వరకూ మా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డే.. కాబట్టి అక్కడి నీళ్ళు తప్ప మనకి ఇంకా ఏమీ పడలేదు. సొ ఆ వొళ్ళు అంతా ఇండియాలో పట్టిందే. ఇక దిబ్బరొట్టెల విషయానికి వస్తే, నా మటుకు నేను పట్టుకొచ్చి నాకు వీలున్నప్పుడు తింటాగా, కాదు కుదరదు ఇప్పుడే తినాలి అంటే ఎవ్వరికి మాత్రం కాలదు, అందునా పారేయ్యాలంటే మనసు రాలేదు. ఏ విధంగా పారేయ్యకుండా ఉండాలి అని ఆలోచించిన తరువాత వీళ్ళచేత కూడా తినిపిస్తే ఎలా ఉంటుంది అని ఓ ట్రై చేసా .. వర్క్ అవుట్ అయ్యింది. ఎనీ హౌ థాంక్స్ ఫర్ కామెంటింగ్.

రెండవ అజ్ఞాత గారు,
ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి వస్తారు. హోప్ యు గాట్ ద ఆన్సర్.. థాంక్స్ ఫర్ కామెంటింగ్

ఓ బ్రమ్మీ చెప్పారు...

చెప్పాలంటే గారు,

స్పందించినందులకు నెనరులు.

మూడవ అజ్ఞాత గారు,

ఈ విషయమై ఓ సారి వ్రాసాను. వీలైతే మరో సారి వ్రాస్తాను. అడిగినందులకు నెనరులు

గణేష్ గారు,

మీ ప్రశ్నలు వరుస్ సంఖ్యల పరంగా నా సమాధానాలు
౧) మొదట వాయిస్ మృధువుగా శాంతంగా ప్లజెంట్ గా మొదలై, మంద్ర స్థాయి నుంచి తీవ్ర స్థాయి చేరుకుంటే.. అప్పుడు తప్పని సరిగ్గా పని చేస్తుంది. అలా కాకుండా ఎత్తుకోవడమే, డమ్మడక్కడాలి .. అన్నామనుకోండి, ఆ వాయిస్‍ని ఎవ్వరూ పట్టించుకోరు సరికదా అది ఎలాంటి ఇన్ఫుయన్స్ ఇవ్వదు
౨) దట్స్ ఎ డొమెస్టిక్ ఫ్లైట్, అదీ కాక అక్కడ మరో చిత్రం జరిగింది. నా ఫ్లైట్ అక్కడ రన్ వే పై దాదాపు ఐదు గంటలు నిల్చొంది. కారణమేమిటంటే ఫిల్లీలో వాతావరణం ఇబ్బందికరంగా ఉందంట. ఈ అయిదు గంటలలో ఓ రెండు సార్లు ఫ్లైట్ ఎక్కి దిగాల్సొచ్చింది. కాబట్టి ఫ్లైట్ ఆపరేటర్ పెద్ద ఫేవర్ ఏమీ చెయ్యలేదు. సిగ్లల్ లేక పోవడం కూడ నాకు కలిసి వచ్చింది. వాడేమో మొదట్లో మన సెక్యూరిటీ ఆఫీసర్‍కి స్టిల్ల్ కొట్టాడు.
౩) అది నా బెదిరింపు. నా బెదిరింపు వెనకాల మరో కారణమేమిటంటే, సింపుల్ సెక్యూరిటీ చెక్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు. ఇలా డీటేల్డ్ అయితేనే మనం మాట్లాడ వచ్చు. నిజమే నేను అక్కడకు ఎర్లీగా చేరుకోవాలి, అదేదో సామెత చెప్పినట్టు, ఎర్లీగా చేరుకుంటే అది సాహసం ఎందుకు అవుతుంది.. స్పందించినందులకు నెనరులు

నాల్గొవ అజ్ఞాత గారు,

సదరు గణేష్ కూడా ఓ తెలుగు బ్లాగరే, ఒక్కసారి వారి ప్రొఫైల్ చూడండి. అంతే కాని మీలాగ పిరికి పంద కాదు, ధైర్యంగా స్పందించారు, ఎటొచ్చి తమరే ముసుగేశుకుని స్పందిస్తున్నారు. అది సరే గాని బావ గీవ అంటూ వరుసలు కలుపుతున్నారేమిటి? అలాగే మీ అభిమానానికి సంతోషం. అలాగే స్పందించినందులకు నెనరులు

Rao S Lakkaraju చెప్పారు...

రూల్స్ ని తప్పించుకుని మనవేపు ఎలా తిప్పుకోవచ్చో (అమెరికా లో కూడా) మీ పోస్ట్ చెప్పక చెబుతోంది. మీరు పెట్టి వారు తిన్న దిబ్బ రొట్టెలు లంచము క్రిందకి వస్తుంది. వాళ్ళ ఉద్యోగాలు ఊడకపోతే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

లక్కరాజు గారికి,

ముందుగా ఆసాంతం చదివి స్పందించినందులకు నెనరులు.. అలాగా.. దాన్ని ఇలా కూడా పిలుస్తారా.. లంచం అంటే స్వలాభం కోసం ఏదైనా పని జరిపించుకోవడానికి ఇచ్చేదని నా అభిప్రాయం. ఇక్కడ నేను ఏ పని వీరి చేత జరిపించుకోవటం లేదు సరికదా.. నాకున్నది నాకున్నంతలో వృధా చెయ్యకుండా నలుగురితో పంచుకుంటున్నాను. ఇలా చెయ్యటం ద్వారా నేను వారు చేసే పనిని ఆపటం లేదు సరికదా నాకు ఏదో ఫేవర్ చెయ్యమనటం లేదు. ఐయామ్ కోఅపరేటింగ్ విత్ దెమ్ ఇన్ ఆల్ వేస్.. అదీ కాకుండా నేను బెదిరించిన తరువాతే నన్ను వీళ్ళు ఇంకా ఎక్కువ సెర్చ్ చేసారు. అలా ఆలశ్యం అవుతున్నదనే డెల్టా ఎయిర్ లైన్స్ వాళ్ళకి వాకీ టాకీలో సమాచారాన్ని అందించారు.

 
Clicky Web Analytics