2, అక్టోబర్ 2019, బుధవారం

శ్రీరామ .. శ్రీరామ .. నీ నామము .. కైవార అమర నారేయణ

ఈ పాటని ఎన్ని సార్లు విన్నా, పాడుకున్నా ఏదో తెలియని ఆనందం. ఆ అనందం పాటలో ఉందా, పాట సాహిత్యంలో ఉందా, పాడే పాటగాని గొంతులో ఉందా, ఏమో .. తెలియదు ..

తెలియని శూన్యంలో ఉన్న నాకు ఏదో ఉపశమనంలా, ఓ బీ కాంప్లెక్స్ టాబ్లెట్లా పని చేసింది. ఈ పాట విన్న తరువాత ఏదో తెలియని కొత్త ఉత్సాహం నాలో చేరుకుంది అని నాకు అనిపించింది. అందరూ వదిలేసిన స్థితిలో ఉన్న నాకు ఏదో తెలియని చేయూత అయినట్లైంది.

కైవార అమర నారేయణ వారిచే రచించబడిన ఈ కీర్తన గురించి తెలుగులో




సగ మగ.. సగ మగ.. సగ మగ.. రి స ని
పరి మరి.. పరి మరి.. నిరి పమ.. గ రి స

శ్రీరామ నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నాది.
ఎప్పూడు, ఏవ్వేళా మనసు మరువా కున్నాది.


మోహా పాసమనే మొలక తృంచమనేది.
కష్టా కామ క్రోధములను తృంచి కొట్టమన్నాది.  || శ్రీరామ||

సగ మగ.. సగ మగ.. సగ మగ.. రి స ని
పరి మరి.. పరి మరి.. నిరి పమ.. గ రి స

కాయా పోషణము బహు కష్టామన్నాది
మాయావాది గురుని భోద మోసమన్నాది.   || శ్రీరామ||

సగ మగ.. సగ మగ.. సగ మగ.. రి స ని
పరి మరి.. పరి మరి.. నిరి పమ.. గ రి స

పామరులతోను పొందు పాప మన్నాది
సజ్జనులతోనూ బాగా సౌఖ్యమన్నాది.  || శ్రీరామ||

సగ మగ.. సగ మగ.. సగ మగ.. రి స ని
పరి మరి.. పరి మరి.. నిరి పమ.. గ రి స

సుజ్ఞానులను ఎరుగ జాడ సులభమనేది
నారేయన స్వామి గురుని నమ్ము మన్నాది.  || శ్రీరామ||

సగ మగ.. సగ మగ.. సగ మగ.. రి స ని
పరి మరి.. పరి మరి.. నిరి పమ.. గ రి స



-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
 కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కామెంట్‌లు లేవు:

 
Clicky Web Analytics