భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.
తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.
గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు.
యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు.
ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్ వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు లేదా సూత్రాలలో చాలా వరకూ నిజాయితీగా ఉండమంటాయి. నీతిగా ముఖాముఖీ చర్చించమంటాయి. చర్చలలో అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే పారదర్శకత.
భార్య భర్తతో దాపరికంలేకుండా మాట్లాడదు,
తండ్రితో బిడ్డలు ఉన్న విషయాలను ఉన్నట్లుగా ప్రస్తావించరు,
గురువుని కించపరచే విధ్యార్ధులు,
యజమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఉద్యోగులు ఎందుకు ఉన్నారో నాకు అర్దం కావటం లేదు.
ఈ విషయాలను ప్రక్కన పెడితే, ప్రోత్సాహముతో కూడిన వ్యక్తులు ఉండాలంటుంది, అందరినీ విశ్వసించమని చెబుతుంది. అంటే, ప్రస్తుత ఉద్యోగ వాతావరణమే కాకుండా, జీవనవిధానం కూడా విశ్వసించ లేని విధంగా ఉందంటే, మనుష్యులు మనుష్యులుగా బ్రతుకుతున్నారా లేక రాక్షసులుగానా!!!
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
1 కామెంట్:
good information blog
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel
కామెంట్‌ను పోస్ట్ చేయండి