2, మార్చి 2011, బుధవారం

దైవం – నా ఆలోచనలు

ఇంతకు పూర్వం, 2009 వ సంవత్సరం ఆగస్ట్ నెలలో దైవంపై నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓ మూడు ప్రయత్నాలు చేసాను. అప్పుడు పుట్టిన ఆలోచన రూపం దాల్చుకోవడానికి చాలా కాలం పట్టేడట్టు ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించిన విషయాలను కూలంకుషంగా కాకపోయినా, నాకు తృప్తి కలిగేంత వరకూ సోధించి ఆ తరువాత దానిగురించి స్వీయావలోకనం చేసుకుంటాను. ఆ తరువాతే నాకు అర్దం అయ్యిన దానిగురించి వ్రాసుకుంటాను. ఈ ప్రక్రియలో దైవం గురించి అర్దం చేసుకోవడానికే చాలా కాలం పట్టేడట్టుంది.  కాని అంతవరకూ ఊరికే ఉండకుండా కొంచం కొంచంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన పాత పుటలలో మొదటిది, దేవుడా !! తొక్కా !! ఎవ్వడాడు ? ఎక్కడుంటాడు? అనే శీర్షికన వచ్చింది. అక్కడ మొదలైంది హేతువాదంపై నాలో చర్చ మరియు పరిశోధన. అలాంటి ఆలోచనకు కొంత రూపం ఏర్పడటం వలన ఇక్కడ ప్రారంభం చేస్తున్నాను. ఈ పుట ప్రచురించిన తరువాత ఓ పూజ్యనీయులైన పెద్దాయన సున్నితంగా నన్ను ఈ క్రింది విధంగా హెచ్చరించారు..

.. కుమారా, దైవదూషణ ఏవిధంగానైనా పద్దతి కాదు, జాగ్రత్త ..

అప్పుడు వారితో ఒక్క విషయం మాత్రమే చెప్పాను. “మరికొంత కాలం ఎదురు చూడండి” అని. అప్పటినుంచి ఆలోచించగా.. చించగా, ఇదిగో ఇప్పుడు కుదిరింది అని మాత్రం చెప్పను, కానీ, నా ఆలోచనలో పూర్తి స్పష్టత రాకపోయినా, ఎంతో కొంత వివరం బయట పడింది. దానిలోని కొన్ని పాయింట్స్ ఇక్కడ. మొదటి పుటలో స్పందనగా ఓ నాస్తికుడు తన పాత పోస్టుని ఇక్కడ వ్రాసాడు. ఈ మధ్యలో ఒక సారి “నేను” అనే పదంపై ఓ గుంపులో చర్చ మొదలు పెట్టగా, నాకు అందిన మొదటి స్పందన రమణ మహర్షి వారి రచనల గురించి.

అంతకు ముందు వరకూ నాకు రమణ మహర్షిగారి గురించి తెలియక పోవడం వల్ల కించిత్ తడబడ్డా, రమణ మహర్షిగారి భావనలోని మూలం ఏదిశగా సాగుతుందో అర్దం అయ్యింది. ఈ పుట వ్రాస్తున్నప్పటికి నాకు రమణ మహర్షిగారి గురించి పూర్తిగా కాకపోయినా సూచనా మాత్రంగా అణువంత మాత్రమే తెలుసు, వీలు చేసుకుని వీరి గురించి మరోసారి కూలంకుషంగా అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.

దైవంపై నేను వ్రాసిన మొదటిపుట చాలా మందిలో నాపై లేదా నా వ్యక్తిత్వంపై ఓ రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచి నన్ను అపార్దం చేసుకునేటట్టు చేసింది. అలా వారు అనుకునే విధంగా పుట వ్రాయడంలో నేను ఆశించినది నూటికి నూరు శాతం సిద్దించింది. ఎక్కువ మంది నన్ను లేదా నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొలమానంగా నేను వ్రాసే వ్రాతలనే తలచి నందువల్ల వీరు నన్ను అపార్దం చేసుకున్నారు.

నేను జీవితాన్ని చాలా తక్కువ చూసాను, కానీ నా ఈ చిన్ని జీవన ప్రయాణంలో నేను గమనించిన ఓ విషయమేమిటంటే ..

ఎక్కువ మంది ఎదుటి వారి ప్రవర్తనను పూర్తిగా గమనించకుండా స్వల్ప కాలంలోనే నిర్ణయించేస్తారు. ఇదే విషయాన్ని ఆంగ్లంలో, Most of the people judge others in అ very short time and spontaneously without studying for a long time

ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, మన మధ్య జరుగుతున్న ఘటనల నుండి మనం తేరుకుని జరిగిన విషయాన్ని జీర్నించుకుని ఏవి జరిగాయో అది ఎందుకు జరిగిందో అవగతం చేసుకునేంత వ్యవధి ఇవ్వకుండా దైవంపై అప్పుడు నేను పేలినట్టు అవాకులు చెవాకులు చేస్తుంటాము. ముఖ్యంగా దైవంపై. ఎందుకంటే, మనం చేసిన నిందలకు పరదైవం వచ్చి వివరం ఇచ్చుకోరుగదా. నామరూప ప్రధానమైన ఈ జగత్తులో అందునా ప్రస్తుత సామజిక జీవనంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఉదాహరణగా తీసుకుంటాను. ప్రస్థుత న్యాయ వ్యవస్థ ప్రకారం ఎవ్వరైనా మరొకరిపై దొంగతనం కేసు వేస్తే, అభియోగం మోపబడ్డ ముద్దాయి, ఆ దొంగతం తాను చెయ్యలేదన్న నిరూపణ చేయ్యవలసిన భాద్యత వహించ వలసి వస్తుంది.

ఈ విధమైన ఆలోచన కలిగిన వాళ్ళే చాలా మంది, ఏదీ దేవుడ్ని చూపించు చూద్దాం అని దైవ భక్తులను నిలదీస్తుంటారు. మరో పుటలో మనకు కనబడని ఏదో ఒక అతీత శక్తి గురించి మరోసారి. అంత వరకూ .. ఓం, నమః శివాయః

7 కామెంట్‌లు:

రామరాజ్యం చెప్పారు...

ఓం నమః శివాయ.

శివ చెరువు చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

ఓ బ్రమ్మీ చెప్పారు...

రామరాజ్యం పేరుతో బ్లాగుతున్న మీకు స్పందించినందులకు నెనరులు

శివ చెరువు గారికి,
శివ రాత్రి పర్వదినం మీకు శుభం కలిగించుగాక. స్పందించినందులకు నెనరులు

Vasu చెప్పారు...

నాకు టపా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది.
ఇంకా ఎదో చెప్తారు అనుకునేలోపు ముగించేసినట్టుంది.

దీనికి ముందు టపా కూడా చదివితే ఇంకా
గందరగోళంగా ఉంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో.



వాసు

Mauli చెప్పారు...

ఇప్పుడే చూసాను మీ ఈ టపాలు. అచ్చు ఇలా౦టి వి వ్రాయాలని http://teepi-guruthulu.blogspot.com/2011/02/anagha-devi-by-sri-kuppa-vkrishna.html ఇలా మొదలు పెట్టాను.

మీరు వ్రాసిన అనుబ౦ధ టపాలన్నీ చదివి వ్యాఖ్యానిస్తాను.

ఓ బ్రమ్మీ చెప్పారు...

వాసు గారు,
మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టేసినందులకు క్షంతవ్యుడను. ఏదో వ్రాద్దామని ప్రయత్నం చేస్తే అది ఏదో అయ్యింది. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు.

మౌళి గారు,

మున్ముందుగా ఒక్క విషయం. నాకు తెలుగే సరిగ్గా రాదు, అలాంటిది ఆంగ్లంలో వ్రాసి దానిని చదవమంటే, ఎలా చెప్పండి. ఆ వ్రాసేదేదో కొంచం తెలుగులోకి అనువదించి వ్రాయమనవి. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

durgeswara చెప్పారు...

అనుభవానికి మించిన గురువులేడు.

 
Clicky Web Analytics