ఈ మధ్య ఓ సహ తెలుగు బ్లాగరు వ్రాసిన దానిని చదివిన తరువాత నాకు నవ్వాగలేదను కోండి. సోది ప్రక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తాను. అస్సలు నాస్తికత్వం అనేది ఏదైనా ఉందా అని నా అనుమానం. ఆస్తికులు అనేటోళ్ళు ఎవ్వరు? అలాగే నాస్తికులు అని వేరు చేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి? ఓ!! మర్చిపోయ్యాను. ఇక్కడ దేవుడు అనే ఓ విషయం ఉంది కదా .. అలాంటి విషయం ఉంది అని నమ్మేటోళ్ళు ఆస్తికులా .. నమ్మని వాళ్ళు నాస్తికులా .. మరి నేను నాస్తికుడినా? లేక ఆస్తికుడినా? ఈ విషయం గురించి తరువాత చర్చిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి.. తెలియక ముందు నుంచి కూడా, నాకు ఫలానాది ఇది అని చెప్పినోళ్ళు చాలా మంది. ప్రతీ ఒక్కరూ నాకు గురుతుల్యులే.
కష్టే శ్రమే ఫలి అన్న మొదటి పాఠాన్ని నేర్పిన తల్లి మొదటి గురువు. ఎలా అనుకుంటున్నారా.. అకలి వేసి ఏడిస్తే, ఆ ఏడుపుని అర్దం చేసుకుని చనుబాలను నాకు అందించి కతకడం అనే అలవాటు నేర్పిన మొదటి గురువు అమ్మ. ఈ రోజుల్లో అమ్మలు పిల్లలకు ఆ విధ్యని నేర్పించకుండా పుట్టిన వెంటనే పోత పాలు అలవాటు చేసి కష్ట పడకుండా ఎలా ఎదగచ్చో నేర్పుతున్న తల్లులు నా దృష్టిలో పిల్లలకు స్వతహాగా నేర్చుకునే అలవాటుకు అడ్డిపడి వారి ఎదుగుదలకు అడ్డుపడే అవరోధాలని అభిప్రాయం. ఆ పిల్లల పాలిట శాపాలుగా అనిపిస్తారు. ఇక్కడ పాలు రాని తల్లుల విషయం నేను ప్రస్తావించడం లేదని చదివే వారు గమనించాలి.
నేను మాటలు రాక ఏవేవో శబ్దాలు చేస్తుంటే, నా శబ్దాలలోంచి వారి వారి బంధుత్వ వరుసలు నాకు తెలియ జేస్తూ నాచేత నాన్న .. మామ.. అత్త.. తాత.. బామ్మ.. ఇంకా ఏవేవో పలికించి వారిని వారు పరిచయం చేసుకుంటూ, నీకంటూ ఈ లోకంలో నేనున్నాను అంటూ అభయమిచ్చిన నా బంధు జనం అంతా నాకు మాటలు నేర్పిన గురువులే. బడిలో పలకా బలపం పట్టుకోవడం నేర్పిన భాద్యత గల ఓ ఉధ్యోగి నాకు విధ్యా బుద్దులు నేర్పిన గురువు. ఆట పాటలతో తింగరేషాలు వేస్తుంటే, తాళగతులతో నాట్యాన్ని నేర్పిన వాసిరెడ్డి కనకదుర్గగారు నాకు గురువు. ఈత కొట్టడంలో మెళుకువలు నేర్పి బంగారు పతకాలు చేజిక్కించుకునే నైపుణ్యాన్నిచ్చిన వెంకటేశ్వరరావ్ కోచ్ నాకు గురువు.
విధ్యాభ్యాసాన్ని ముగించి ఉద్యోగ వేటలో సహాయం చేసి బ్రతుకు బ(బం)డిలో పలు పలు పాఠాలను నేర్పిన విస్వేశ్వరుడు నాకు గురువు. ఏవిధంగా సంగమిస్తే రతి సుఖం లబిస్తుందో తెలియ జెప్పే భార్య నాకు గురువు. ఎవ్వరికి సహాయం చెయ్యాలో ఏ సమయంలో చెయ్యాలో తెలియజేసి నాకు పుణ్యాన్ని ఆర్జించి పెట్టే అన్నయ నాకు పుణ్యఫలం చేజిక్కించుకునే నైపుణ్యాన్ని నేర్పిన గురువు. షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో తెలియ జెప్పే కంపెనీలు నాకు వ్యపార పరంగా గురువులు.
ఇలా ఎందరో మరెందరో గురువులు నా దృష్టిలో దేవుళ్ళు. వీళ్ళంతా కనిపించే దేవుళ్ళు. నేను వీళ్ళనే దేవుళ్ళంటాను. మరి ఆస్తికులు ఉదహరించే సదురు దేవుడు వీళ్ళల్లో లేడే. మరి నేను ఆస్తికుడినా లేక నాస్తికుడినా?? సరే ఆస్తికుడు అనుకుందాం అనుకుంటే మరి ఆ దేవుడిని గుర్తించాలిగా ?? ఇంతకీ ఆ సదురు దేవుడేక్కడున్నాడు? రమ్మనండి నాముందుకు. రాడే!! ఎందుకొస్తాడు ఉంటేగా!!?? సరే నేను ఆస్తికుడిని కాదు నాస్తికుడిని అనుకుందాం అనుకోండి, నాకంటూ దేవుళ్ళు ఉన్నారే!! మరి నేనెలా నాస్తికుడినౌతాను??
నాకు తెలియక అడుగుతాను.. ఆస్తికుడు అంటే తెలుగులో అస్తికలు కలవాడనేగా!! (కాకపోతే సరిజేయ గలరు) మరి ఈ లెక్కలో నాస్తికుడు అంటే అస్తికలు లేని వాడనా!! అంటే ఎవ్వరిలో ఎముకలు లేవంటే వారంతా నాస్తికులా?? యదవ లాజిక్కులు తీసి తొక్కలో డైలాగ్లు వెయ్యొద్దంటారా!! సరే వెయ్యను గాక వెయ్యను. మీరే చెప్పండి. దేవుడంటే ఎవ్వరు? ఎలా ఉంటాడు? ఓ!! రాముడిలా మీస్సాలేకుండా క్లీన్ షేవ్ చేసుకుని ఉంటాడా. లేక కృష్ణుడిలా చిలిపి దొంగతనాలు చేస్తూ ఉంటాడా!! అదీ ఇదీ కాదు.. ఏమీ చేతకాని వాడిలా అందరూ తిడుతూ కొడుతూ ఉంటే.. ’పోనీలే పాపం చేస్తున్నారు, వీళ్ళందరూ సంజాయిషీ ఇచ్చేరోజు వస్తుంది’ అని అవమానాలు ఛీత్కారాలు భరించిన ఏసు ప్రభువు లాగుంటాడా!!