7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

2 కామెంట్‌లు:

మన్మధన్ చెంబు చెప్పారు...

అలాంటి ఫైల్ లేదు కాని, అలాంటి online resource ఒకటుంది. చూడండి మీకెమన్న పనికొస్తుందేమో.

http://www.bankrate.com/calculators/mortgages/loan-calculator.aspx

లోన్ మొత్తం, వడ్డీ రేటు మొదలైన వివరాలు నింపి, క్రింద ’Show/Recalculate Amortization' అన్న బటన్ నొక్కండి, మీ మొత్తం అసలు, ప్రతి సంవత్సరం కట్టబోయే అసలు, వడ్డీ మొదలైన వివరాలన్నీ వస్తాయి. ఒకవేళ EMI తోపాటుగా మీరు మరికొంత మొత్తంకూడా (towards principal) చేర్చాలనుకుంటే, ఆ సౌలభ్యంకూడా వుంది. play with it and see if it works for you.

Saahitya Abhimaani చెప్పారు...

మన్మధన్,

మంచి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు.

 
Clicky Web Analytics