17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

34 కామెంట్‌లు:

సత్యాన్వేషి చెప్పారు...

వారు వెల్లడించిన వివరాలు చాలా తక్కువ అని సమాచారం. నిన్నటినుంచీ 15మంది సిబ్బంది, ముగ్గురు బ్యాంక్ సిబ్బంది, మూడు లెక్కించే మెషీన్లు ఉపయోగించి లెక్కించారంటే ఇంకా చాలా ఎక్కువ ఉండి ఉంటాయి. ఆయన మంచం కూడా వెండిదేనట. ఇంకా వజ్రాలు, ఫారిన్ కరెన్సీ వివరాలు బయటికి చెప్పలేదు.

చక్రవర్తి చెప్పారు...

సత్యాన్వేషి గారు,

అంతమంది లెక్కించారంటే అది అంత పెద్ద మొత్తమైన కోట్ల వివరం. ఇక మంచం గురించి అయితే, ఎప్పుడో చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నగదు రూపంలో అంత మొత్తంలో స్వదేశీ లేదా పరదేశీ ద్రవ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఏమిటో నాకు అర్దం కావటం లేదు. అదే ఈ పోస్టు వెనకాల ముఖ్య ఆంతర్యం. స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియ జేసినందులకు నెనరులు

Praveen Mandangi చెప్పారు...

అంత డబ్బు, బంగారంతో పనేమిటో నాకూ అర్థం కాదు. పెళ్ళి కాని బ్రహ్మచారికి వ్యక్తిగతంగా పెద్ద ఖర్చులు ఉండవు. అయినా అతనికి అంత బంగారమేమి అవసరమొచ్చింది?

అజ్ఞాత చెప్పారు...

@సత్యాన్వేషి,
ఊరు పేరు చెప్పుకోలేని వెధావా నువ్వొక సత్యానేవేషివా? ఊరికినే సొల్లు వాగుడు వాగమాకు. అసలు సాయిబాబా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఇంత అని నీకు ఎలాతెలుసు? ఆ వెల్లడించిన వివరాలు చాలా తక్కువ అన్న సమాచారం అని నువ్వు ఖచ్చితంగా ఇంతా అని నీకు ఎవరు నివేదిక ఇచ్చారు? నన్ను అనామకుడని నోరు పారేసుకోవద్దు. నేను నీలా బ్లాగు పెట్టుకొని అసత్యాన్వేషణ చేయటం లేదు.

అజ్ఞాత చెప్పారు...

మొహానికి చేయి అడ్డం పెట్టుకొనే పోటొ పెట్టు కొన్న వేధవా , మొదటినుంచి నీకు మెదడు మొకాలి లో ఉందని తెలుసు. రెండు కామేంట్లు వ్యతిరేకం గా రాస్తే పరువు కొరకు పాకులాడురూ మోడరేషన్ పెట్టుకున్న దేడ్ దమాక్గా. నీ బోటీ మేంటల్ గాల్లకి డబ్బులే కనిపిస్తాయి ఇంకొకటి ఎదీ కనీంచదు. గత 50సం|| నుంచి ఆయనని నీలాంటి బుర్ర లో గుజ్జు లేని తెల్లతోలు, ఎర్ర రంగు మేధావులు విమర్శిస్తున్నా ఒక్కరోజు కూడా కోపగించు కోకుండా ప్రతి రోజు అదే ఉత్సాహం తో ఆయన అందరిని కలుసుకొన్నారు.

అజ్ఞాత చెప్పారు...

సారి చక్ర వర్తి అతనిని మీ బ్లాగు లో అలా తిట్టినందుకు. మీరేమి అనుకోకండి.

అజ్ఞాత చెప్పారు...

సారి చక్ర వర్తి అతనిని మీ బ్లాగు లో అలా తిట్టినందుకు. మీరేమి అనుకోకండి.

సత్యాన్వేషి చెప్పారు...

@అగ్నాత

ఊరు, పేరు చెబితే ఏమన్న ఫత్వా విధించే ప్లాను ఉందా? నీలాంటి ఉన్మాదులు ఉండగా సత్యాలు రాయాలంటే ఊరు పేరు చెప్పకపోవటమే బెటర్. నీకూ ఒక బ్లాగున్నట్టు సమాచారం, కనీసం ఐడీతో రాయలేని వెధవ.

అజ్ఞాత చెప్పారు...

నీ మొహనికి ఫత్వా ఒకటా, లేకి వెధవ నిన్ను నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకొంట్టున్నావు. నేను ఉన్మాదిని, నువ్వు ప్రేమ స్వరూపానివి. నీ కన్న వెధవలు ఎంతో మంది పేరు పెట్టుకొని, డబ్బులు ఎక్కువైతే పేపర్లు పెట్టుకొని ఇంకా చెత్త రాస్తున్నారు. వారినే పటించుకొనే రోజులు కావు. ఐదు పైసలంత విలువ లేని నీ నెత్తిన మళ్ళి ఒక ఫత్వానా, నీకంత సీను లేదు. కాని వారేవరు నీలా సత్యానేవేషి అనే పేరు పెట్టుకోలేదు. కనుక నీ అసత్యాలను ప్రశ్నించాను. దానికి ఒక్క సమాధానం లేదు. నీ మొహానికి తెలివి అనేదే ఉంటె ముందరగా నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తరువాత తిట్టే వాడివి, నీ దగ్గర తెలివి లేదు, సమాచారం లేదు, ఇతరులు తిట్టిన్న ఒపిక గా నీ పాయింట్ చేప్పే నేర్పు, లీడర్షిప్ క్వాలిటి అంతకన్న లేదు. సాధారణ గూణాలే నీకు లేవు. నీ బోటీ అల్పులు, అధములు బాబాని అనాలిసిస్ చేయటం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇక నువ్వు వీటీని అభివృద్దిచేసుకొని రతన్ టాటా స్థాయో లేక పెద్ద బిజినెస్ లీడర్ స్థాయికి వెల్లిన తరువాత అప్పుడు కొంచెం ఆలో చిస్తే సాయి బాబా నీకు కొంచెం అర్థం కావచ్చు. అంతే కాని యురప్లో ఆదేశం ఈదేశం చూసి ప్రపంచం లో గొప్ప వాడిని అనే బ్రమలో ఉన్నావు. నువ్వు చేసే విదేశి కూలి ఉద్యోగాన్ని చూసుకొని విర్ర వీగమాక. పాలమురు కులివాడికి నీకు పెద్ద తేడాలేదు. టై కట్టుకోవటం తప్ప. డబ్బు సంపాదించే వారికి ఎంత సేపటికి కులీ డబ్బులు లేక్క పెట్టుకోవటం తో సరిపోతుంది. ప్రేమ పుచ్చకాయ గురించి తెలియదు. ఎదో నాలుగు తెలుగు,హింది సినేమాలు చూసి అదే ప్రేమను కొంటారు. ఇక సత్య సాయిబాబా చెప్పే ప్రేమ తత్వం అర్థం కావటం జరగదు గాని, నీకు చేతమైంతే, నీకు నిజంగా నీ ప్రేమ మీదే నమ్మకం ఉంటే నీ ఆస్తులన్నింటిని నీ భార్య పేరుతో రాసి ఆమేకు చెప్పు, నిన్ను నేను ఎంతో ప్రేమించాను కనుక నా ఆస్తంతా ఈ రోజే నీపేరున రాసేశానని. ఇక నాదగ్గర నాపేరుతో పైసా లేదు అని చెప్పు. నీ భార్యని మనస్పుర్తిగా ప్రేమిస్తె అలా చేయటానికి ఆలోచించు. నీలో ఎన్ని అనుమానాలు మొదలౌతాయో చూడు, ఆమే డబ్బులు తీసుకొని నన్ను ఒక్క ఆట ఆడిస్తే నని ఆలోచించటం మొదలుపెడతారు.
---------------------------------------------------------------

సత్య సాయి బాబా గారికి హాస్పిటల్ పేట్టాలంటే ఒక అమేరికన్ నిముషం కూడాఅలోచించ కుండా 150 కోట్లు డబ్బులు ఇచ్చాడు. రతన్ టాటా కి, టాటా బోర్డులో ఉండే వారికి బాబా చేసేది వ్యాపారమని తెలియక అంత దూరం ఆయనని చూడటానికి వెళ్ళి,డబులు ఇచ్చుకొని వస్తారు. వీళ్ళంతా తమ ఆస్తుల్ని వేరే వాడైనా బాబా కి ఇచ్చుకొన్నారు, నువ్వు నీ పేళ్లానికి ప్రేమకానుక గా ఇచ్చి చూడు. ఎంతైనా ఆమే నిభార్యే కదా ప్రాయి వ్యక్తికాదుగదా! నీకు పేళ్ళి కాకుండా ఉంటే పెళ్ళి ఐన తరువాత ఈ ప్రయోగం చేసి నీలోని ప్రేమను పరిక్షించుకొనేది.
చివరిగా ఒకరిని చూసి ఒకరని పొరబడమాక. బ్లాగు ఉంటే లేదు అని చెప్పుకోవాలసిన అవసరం నాకు లేదు. అనవసరం గా నా మీద కోపంతో ఇతరులను ద్వేషించకు. నీku నేనేవరో తెలియదు. నమ్మితే నమ్ము లేక పొతే పో nI ఇష్ట్టం.

అజ్ఞాత చెప్పారు...

Well said.

This is the problem with Hindu religious gurus and leaders. They stash the wealth in Temples, and some invader loots it. It is happening over and over again.

In modern times, the anti-Hindu Government controls this wealth. You can see this happening in Tirupati (TTD) and other major Hindu Temples. All these temples are managed, controlled and loot by anti-Hindu Government.

Are you aware that Hindu Temples are under anti-Hindu Govt. control?

The wealth stashed in those temples is 100,000 times more than what was stashed by Saibaba. Agreed, one big crime can not wash away a small crime.

And Sai baba is nothing when compared to kirastani missionary cabal in India. They use Helicopters to go to soul harvesting caps. Late YS Reddy's Son-in-law and Daughter use Helicopters to roam around the state and soul harvest Hindus.

Agreed on one point. India's wealth is wasted by stashing it in Swish Banks and/or in some hide outs in some ones backyard.

That wealth must be used to help people.

Praveen Mandangi చెప్పారు...

చక్రవర్తి గారు, ఈ పోస్ట్ చదవండి: https://profiles.google.com/kirandotc/posts/iCzfdhfkc9f

Praveen Mandangi చెప్పారు...

If someone like Kathi Mahesh justifies inserting gods' images on footwear, a hundred anonymouses in the name of kelukudu batch will be ready to attack him. If the same thing is done by a baba, none of them will dare to criticise.

ANALYSIS//అనాలిసిస్ చెప్పారు...

అసలే బలహీనమైన గుండె నీది ... లోపలికి రావద్దంటే విన్నావు కాదు ... ఈ నీళ్ళు తాగు

http://analysis-seenu.blogspot.com/2011/06/blog-post_10.html

vijay చెప్పారు...

మీరు ఒక నానుడి విన్నారా?
రాజు కంటే అతని చుట్టూ ఉన్న పరివారం (చెంచాల) ది పెత్తనం ఎక్కువని. అలాగే బాబా గారి చుట్టూ ఉన్న శిష్యగణం యొక్క టాలెంట్ అని ఎందుకనుకోకూడదు.

చక్రవర్తి చెప్పారు...

అఙ్ఞాతలు అందరికీ
మీరు చాలా ఓవర్ గా స్పందిస్తున్నారు. అసలు విషయాన్ని ప్రక్కన పెట్టి వ్యక్తిగతంతా దూషించుకునే వాళ్ళకు నేను స్పందించను.

ప్రవీణ్ గారు,
బంగారం విషయంలో నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, ప్రముఖులు వచ్చినప్పుడు వారికి గుర్తుగా ఇచ్చేవారట. ఇప్పుడు విషయం అర్దం అయ్యిందనుకుంటాను.

విజయ్ గారు,
నిజమేనండి. రాజు గారి అండ జూసుకుని ఈ చుట్టూ జనాలు చిటికెడంతదానికి కొండంత చేసి చూపిస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

@విజయ్,

బాబా గారి శిష్యుల లో అనేక రకాలు ఉన్నారు. సచిన్,రతన్ టాటా, గవాస్కర్,అబ్దుల్ కలాం, నాని పాల్ఖివాలా నుంచి ఊరిలోని సామాన్యుడి వరకు ఉన్నారు. పెద్ద గొప్ప అనాలిసిస్ చేసి అనుమానాలు వ్యక్తం చేసే బ్లాగర్లకు ఒక చిన్న ప్రశ్న ఆయన దగ్గరికి వేళ్ళినవారు అంతా ఎదో దొంగ డబ్బు దాచుకొవటానికి, పనులు చేయించుకోవటానికి వేళ్ళారని అనుమానం కదా! మరి సచ్చిన్ లాంటి ఆటగాడికి అతనితో అవసరమేమీటీ? సచిన్ ఎంత ప్రతిభావాంతుడైన ఆటగాడో అందరికి తెలుసు, అతనికి బాబా పలుకుబడి తో ఎమీ భారత క్రికేట్ లో స్థానం సంపాదించలేదు కదా? అయినా అతను బాబా చనిపోయిన తరువాత ఆఖరు సారిగా చూడటానికి పోకపోతే ఎవరైనా అడిగేవారు ఉన్నారా? మీ దృష్ట్టీలో చెప్పాలంటే బాంబె నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి కి వెళితే ఎన్నో లక్షల ఖర్చు అవుతుంది. అయినా కడసారి దర్శనానికి వేళ్ళి అక్కడ కన్నిరు పెట్టుకొన్నాడు. ఇక్కడ ఓ అని వాదించే వారు జీవితం లో ఎమి సాధించారో నాకు తెలిదు గాని మా ఆఫీసులో లీడర్ అంటే సచిన్ అని చూపించారు. అతని ప్రత్యేకథల మీద వివిధ కోణాలలో ఎన్నో స్లైడ్స్ వేసారు. నేను పని చేసే అమేరికన్ కంపేని బ్రాండ్ వాల్యు ప్రపంచం లోని మొదటి 25 లలో వస్తుంది. ఇండియా నుంచి ఎవరైనా మా కంపెని లో చేరాలంటే ఐ.ఐ.యం. నుంచి మాత్రమే తీసుకొంటారు. ఇక్కడ ఇది రాయటానికి కారణం నా డబ్బ కొట్టుకోవటానికి కాదు. అంతటి ప్రతిభవంతులు కూడా రోల్ మాడల్ లీడర్ గా సచ్చిన్ ని బ్రహ్మ రథం పట్టారు. అటువంటి సచిన్ వచ్చి ఆరోజు సత్య సాఇ బాబా దగ్గర కానీరు పెట్టుకొని ఎడవక పోతే ఎవరు అడిగే వారు లేదు. కాని సచ్చిన్ ని సత్యసాయి బాబా గారు ఎంత ఆకర్షించి ఉంటే అతను అక్కడి వచ్చాడు. అలాగే రతన్ టాటా కూడా. మానసికం గా వీరి అంత పరిణాతి చెందిన తరువాతా బాబా యొక్క ప్రత్యేకత అర్థమౌతుంది. అంతే కాని సైన్స్ పేరు తో, డబ్బు పేరు తో పిచ్చి పిచ్చి నేల బారు అనాలిసిస్ చేసెవారికి ఆయన అదేవిధం మీరు ఊహించుకొంట్లు బురిడి బాబా లాగానే కనిపిస్తాడు. యద్భావం తద్భవతి.
-------------------------
Here’s a link to the final part of a 3-part article on Sathya Sai Baba, by Pundita (a very popular blogger analyst on US foreign policy).

http://pundita.blogspot.com/2011/05/there-is-no-contraption-sathya-sai-baba.html

అజ్ఞాత చెప్పారు...

ఏమ్మాట్లాడుతున్నారు మీరు?
బోడేపల్లివారికి నచ్చవు ఇవన్నీ. వారు విన్నారంటే అస్సలు కషమించరు మిమ్మల్ని. ఎంత ఎత్తున ఎదిగినా రాబందుల దృష్టి పీనుగులమీదనే ఉండిద్ది అని వాకృచ్చారు. మనం అసలుకి బాబా వెనక్కాల ఎంత సొమ్ముందో ఆలోచించకూడదు, ఆ డబ్బు క్రిస్టియన్‌ మైనారిటీ లకీ, స్విస్స్‌ బాంక్‌ ఖాతాల్లోకీ వెళ్ళిపోయినా పర్లేదు. కాదూ కూడదూ అంటే మీరు రాబందులమనీ మిమ్మల్ని సభ్య సమాజం నుండి వెలివేయాలని బ్లాగులతో పాటు లాగులువిప్పి శివతాండవం చేస్తారు, మన బాగ్మిత్రులు
కనుక జాగ్రత్త వహించాలి

చక్రవర్తి చెప్పారు...

విజయ్ గారికి స్పందించిన అఙ్ఞాత గారికి ఈ వివరం,

సాయి బాబాగారిని ఓ ఉన్నతమన వ్యక్తిగా మనం తలచుకోవడంలో తప్పులేదు అని నా అభిప్రాయం. ఎంత డబ్బు వొచ్చినా అంతలోంచి కొంత ప్రక్కన పడేయ్యటం వెనకాలా స్వలాభం ఉన్నా, అలా పడేసినందులకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం. ఇక్కడ మనం మఱో విషయాన్ని గమనించాలి, నికరంగా హార్డ్ కాష్ పదకొండు కోట్లు కలిగిన వ్యక్తికి వందకోట్లతో త్రాగు నీటి కార్యక్రమం చేయ్యడం పెద్ద లెక్క కాదు. ఇంతకు ముందు ఓ అఙ్ఞాత చెప్పినట్లు హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వచ్చే జనాలలోంచి ఆర్జించన సొమ్ముతోనే నిర్మించ బడినది ప్రస్తుతం మనం చూస్తున్న హాస్పిటల్. ఈ కోణం గురించి మనం మఱో సారి చర్చించుకుందాం. ఇక మీరు చెప్పే సచిన్ లాంటి వారి విషయానికి వచ్చే ముందు, అందం ఎక్కడ ఉంది అని అడిగితే, చూచేవారి కళ్ళలో ఉంది అనే ఆంగ్ల సామెత మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోతే బింగ్ చెయ్యండి అప్పుడు తెలుస్తుంది.
సచిన్ లాంటి వారు మంచి హృదయంతో చూడబట్టే సాయిబాబాగారు వీరికి ఆప్తులులాగా అనిపించి దుఃఖించారు. అంత మాత్రానా సాయిబాబాగారు అందర్నీ ఆకర్షించాలని రూల్ లేదు కదా? మీరు చెప్పినట్లే యత్ భావం తత్ భవతి. ఇక్కడ గొప్పతనం సచిన్ దే గాని సాయిబాబాగారిది కాదని మీరు గమనించాలి. మంచితనం మనలో ఉంటే మన చుట్టూ చాలా మంచి కనబడుతుంది.
ఇక సచిన్ భారత టీం స్థానం గురించి బాబాగారి పలుకుబడి లేదని మీకు తెలుసా? గవాస్కర్ గారు రికమెండ్ చేసి ఉండొచ్చుకదా!! అందుకని ఇలాంటి చెత్త చెత్త కోణాలను ఉదాహరణాలుగా తీసుకోవద్దని మనవి. ఇలా స్పందించినంత మాత్రాన సచిన్ అంటే నాకు గౌరవం లేదనుకోకండి. వివాదాలకు దూరంగా బ్రతుకుతున్న సచిన్ చూసి నేర్చుకోండి అని మీ కంపినీలో మీకు నూరి పోస్తున్నా పట్టించుకోకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న మీరు ముందుగా లీడర్ అంటే ఏమిటో తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతలో కొంత సత్యాన్వేషి అనే దొంగ పేరుతో స్పందిస్తున్న వ్యక్తి నయం, ఎందుకంటే, ముసుగు వేసుకునైనా స్పందిస్తున్నారు. ఊరు పేరు లేకుండా స్పందిస్తున్న మీలాంటి వారు విజయ్ లాంటి వారిని తూలనాడటం అలాగే బాబాగారి పరిణితి గురించి వ్రాయడం హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా, నీచంగా ఉంది. అందుకని ఇకనైనా మారండి. మీరు మారరని నాకు తెలుసనుకోండి. నిద్రపోతున్నవాళ్ళని మెల్కొలపవచ్చు, అంతే గాని నిద్రపోతున్నాం అని నటించే మీలాంటి వారికి ఎంత చెబితే మాత్రం ఏమి లాభం?

అజ్ఞాత చెప్పారు...

అయ్యా ,
*ఇక్కడ గొప్పతనం సచిన్ దే గాని సాయిబాబాగారిది కాదని మీరు గమనించాలి.*
గమనించాము, నీ అజ్ణాన్ని. నువ్వు నామిదపడి నువ్వు జ్ణానివా అని క్లాస్ పీకకు. గవస్కర్ టాలేంట్ ఉండబట్టే సచ్చిన్ రేకమేండ్ చేశాడు అదేమైనా తప్పా. అతని కొడుకు రోహన్ పెద్దగా రాణించలేదు. అతనిన్ని ఎమీ రేకమేండ్ చేసి షో ని నడిపించలేదు కదా?
---------------------
తమరి జ్ణానం తెలిక ఎదో ఇక్కడ రాశాను, అది నా పోరపాటు. ఇంకా చెప్పలి అంటే తమరి కళ్ళు అమేరికాను ఎవిధంగా చూశాయో, దాని గురించి రాయటం మొదలుపెట్టిన తరువాత మీ అక్క గారు రెంటాల కల్పన చేప్పిన అభ్యంతరాలు నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చి, ఇక్కడ ఇలా రాయటం నాదే నాదే అని తప్పని తెలుసుకొన్నాను. తమరి చూపే ఒక టైపు, ఆరు అని చెపితే తొమ్మిది అని వాదించేరకం. నీకో నమస్కారం. ప్రణామలతో శెలవు.

చక్రవర్తి చెప్పారు...

అఙ్ఞాత గారు,

హమ్మయ్య. బ్రతికించారు. ఇకపై ఇటురాకండే.

Mauli చెప్పారు...

వె౦డి బ౦గార౦ లను సమర్ధి౦చుకోగలిగిన మీకు, డబ్బు వేరుగా ఎ౦దుకు కనిపి౦చి౦ది. కొన్ని లక్షల కోట్లు ట్రస్టు లోను, వ౦దల కోట్లు స్తిరాస్థులు గాను, ఒక వ౦ద కోట్లు సేవాకార్యక్రమాల్లో ఉ౦డగా, చేతిలో ఒక పది .కో ఉ౦డట౦ లో ఆశ్చర్యమా? పది కాదు వ౦ద ఉ౦టే మాత్ర౦ ఎవరికి లెక్క?

అవి ఎక్కడ ఉన్నా మనకు పోయేదేమీ ఉ౦డదు కదా. ఇచ్చేవాళ్ళకి ఇవ్వన్ని కనిపి౦చవు.(మీ లాటి వారు చెప్పినా కూడా) ఇవ్వని వాళ్ళు అడగనవసర౦ లేదు అని బెదిరిస్తారు .


ఏ లోకాన ఉన్నా తీసుకొన్న వ్యక్తికి బాధ్యత ఉ౦ది అన్న కర్మ సిద్దా౦తమో, పోయేటప్పుడు ఏమీ కట్టుకుపోలేదన్న తత్వ౦కాని అనుకొని వదిలేద్దా౦.

చక్రవర్తి చెప్పారు...

మౌళి గారు,

మున్ముందుగా వెండి బంగారం విషయంలో నా అభిప్రాయాన్ని ఒక్క సారి చదవండి. అవి బాబాగారు విచ్చేసే భక్తులకు ఇచ్చేందుకు చేయించి ఉంటారని నా అభిప్రాయం. లేకపోతే అన్ని బంగారు ఆభరణాలు ఇక్కడ చేరుకుని ఉండవు. ఇక అంత పెద్ద మొత్తంలో డబ్బుని కలిగి ఉండటం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమై ఉండవచ్చో నాకు అర్దం కావటం లేదు. అలాగే ఒక్క సారి నా పోస్టు చదివి ఉంటే, ఇంత డబ్బు కలిగి ఉండటం వెనకాల రెండు కారణాలు ఉండవచ్చు.
మొదటిది, వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సిన అవసరం లేదా రొండవది వీరికి ఎవ్వరైనా ఇచ్చి ఉండాలి.

ఈ రెండింటి విషయాలలో మొట్టమొదటి దాని విషయం గురించి మాట్లాడుకుంటే, వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వస్తే ఎందుకు డబ్బుని నికరమైన కాష్ పరంగా ఇస్తున్నారు? ఏం, లెక్కా పత్రంగా ఉంటుంది కదా అని బ్యాంక్ చెక్ ఇచ్చి ఉండొచ్చు కదా? అలా కాని పక్షంలో ఎవ్వరైనా వీరికి ఇచ్చారనుకుందాం. ఇలా నగదుని తీసుకోవడం దేనికి, చక్కగా హుండి పెట్టి అందులో వెయ్యమనవచ్చు కదా, లేకపోతే, ముందే చెప్పినట్టుగా లెక్కా పత్రంగా ఉంటుందని చెక్కు పరంగా తీసుకోవచ్చు కదా? ఈ రెండు కారణాలు కాకుండా మరింకేమై ఉండవచ్చు?

ఏది ఏమైనా వీరు కూడా నల్లధనాన్ని ప్రోత్సాహిస్తున్నారనేది ఋజువైంది. ఇక్కడ నల్లధనం అంటే, లెక్కలలోకి రానిది రైడ్ చేస్తే దొరికింది అని నా అభిప్రాయం. మీరేమంటారు?

Mauli చెప్పారు...

@వెండి బంగారం విషయంలో నా అభిప్రాయాన్ని ఒక్క సారి చదవండి

అది కేవల౦ మీ అభిప్రాయ౦ మాత్రమే. అలా అనుకొన్నా డబ్బు ను కూడా అలానే భావి౦చవచ్చు. బ౦గార౦ ,వె౦డి ఏ రూపాల్లో ఉన్నది మనకి ఖచ్చిత౦గా తెలిదు. విగ్రహాలు కాని ఇ౦కేమైనా.


సరే ఆ డబ్బు ఇ౦కా కొ౦త బ౦గార౦ తెప్పి౦చడానికి తెచ్చారు అనుకో౦డి మీకు మనశ్శా౦తి :)

నల్లధన౦ అనే మాటలో వస్తే, అసలు దాతల వివరాలు మనకి తెలుసా? ఏదో గొప్పకోస౦ ఒకరిద్దరి పేర్లు చెబుతారు కాని.

చక్రవర్తి చెప్పారు...

మౌళి గారు,

డబ్బు విషయంలో అలా అనుకోవాలంటే, ఒక్కసారిగా బాబాగారు ఇంత మొత్తాని పంచే ప్రయత్నంలో ఉన్నారంటే, నమ్మమంటారు. ఒకవేళ అదే నిజమైతే దానిని ఎక్కడి నుంచి తెచ్చారో లెక్కా పత్రం ఉంటుంది కదా, దానికి IT వారికి చూపించ వచ్చుకదా. ఇది నా మనః శాంతికి సంబందించిన విషయం కాదండి నిజాలకు సంబందించినది. పుట్టపర్తిని నేను ఒక్క సారి దర్శించుకోవడం జరిగింది. అక్కడ నాకు ఎదురైన అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తా.

డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు స్పెషల్ దర్శనం లేకపోతే సాధారణ దర్శనం. ఈ పద్దతిని తితిదే వారి పద్దతితో పోల్చకండే. తితిదే వారు ప్రతీరోజు అక్కడ లభ్యమైన హుండీ ధనాన్ని ఆ మరునాడే లెక్కించి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అలా చేసే ప్రక్రియను పరకామణి ద్వారా చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి హుండీ ఏమీ లేదు, అంతా గుట్టుగా లెక్కా పత్రం లేకుండా వారి వారి అభీష్టం మేరకు జరుగుతుంది అనేది సత్యం.
ఆఖర్లో దాతల విషయంలో మీతో ఏకీభవిస్తాను. పేర్లదేముంది ఎవ్వర్నో ఒకరి పేరుని చూపించేయ్యవచ్చు.

Mauli చెప్పారు...

@ఎక్కడి నుంచి తెచ్చారో లెక్కా పత్రం ఉంటుంది కదా, దానికి IT వారికి చూపించ వచ్చుకదా.

ఎవరు చూపి౦చాలి? ఆ డబ్బు తో బాబాకు స౦బ౦ధ౦ ఉన్నదని నిరూపి౦చగలమా. ఇ౦కా బోల్డన్ని చూడాలి మన౦

చక్రవర్తి చెప్పారు...

మౌళి గారి పేరుతో స్పందిస్తున్న మఱో అగంతకుడు గారు,

మీ స్పందన వెనకాల రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి. మొదటిది, బాబాగారికి తెలియకుండానే ఆయన స్వీయ మందిరం అయిన, యజుర్వేద మందిరం లోకి వచ్చిందంటె, నమ్మమంటారు. హు..
రెండొవది, విజయ్ గారు చెప్పినట్లు, రాజుగారికనా చుట్టూ ఉన్న వారిది పెత్తనం ఎక్కువగా ఉంటుందనేది నిజమే అన్నమాట.

vijay చెప్పారు...

నేను ప్రస్తావించినది కొందరు (శిష్యగణం) గురించిమాత్రమే, అంతే గాని అందరూ అని మాత్రం కాదు.
ఎవర్నైనా నొప్పించింటే మాత్రం క్షమించేది.
మేముండేది పుట్టపర్తి కి కేవలం 40 కి.మీ. దగ్గరలోనే. అక్కడి పరిస్తితుల గురించి కొద్దిగా అవగాహన ఉన్నది.

చక్రవర్తి చెప్పారు...

విజయ్ గారు,

మీరు తప్పుగా ఏమీ మాట్లాడలేదు / ప్రస్థావించనూ లేదు. కాకపోతే అర్దం చేసుకునే వారిని మీరు దృష్టిలో ఉంచుకోకుండా, మీకు తెలిసిన విషయాలను నిర్బయంగా తెలియజేయండి. అంతే మనకు కావలసినది.

Mauli చెప్పారు...

మీ రె౦డు ప్రశ్నలు సబబైనవే.

ఇ౦తమ౦దిని ఆధ్యాత్మిక౦గా దగ్గర చేశాడు అని మెచ్చుకోవడ౦ లో అబ్య౦తర౦ లేదు.కాని అవి అ౦తా బాబా అధ్యాత్మికత లానే తేలిపోయాయి.

అజ్ఞాత చెప్పారు...

పుట్టపర్తి యజుర్మందిరంలో పట్టుపడుతున్న సొమ్ము వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ప్రధానితో సహా ఇతర గ్రేడ్‌-1 ప్రభుత్వ అధికారులూ న్యాయమూర్తులూ అందరూ లోక్‌ పాల్‌ పరిధిలోకి తేబడాలి

అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు, ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి

అజ్ఞాత చెప్పారు...

https://plus.google.com/117840393190353819278/posts/1VCnUEgKK8k


---------------------

idandi eee blog owner asalu swaroopam

అజ్ఞాత చెప్పారు...

https://plus.google.com/117840393190353819278/posts/1VCnUEgKK8k

Nrahamthulla చెప్పారు...

తెలుగు భాషకు సత్యసాయి అండ http://nrahamthulla3.blogspot.in/2012/03/blog-post.html

Unknown చెప్పారు...

ఆయన మందిరం జరిగిన ఆరు హత్యల సంగతేంటి.చిన్నశిక్ష వేసిన గురువునే తన మంత్రశక్తితో ఫ్రీజ్ చేసిన వ్యక్తి తనను చంపటానికి వచ్చిన వాళ్ళను చూసి ఎందుకు పారిపోయారు.అదంతా దైవలీల నీబోటి అఙ్ఞానులకు అర్ధంకాదు అంటారా అయితే సరే

 
Clicky Web Analytics