12, జనవరి 2009, సోమవారం

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు - నా భావనలు

ఎన్నో ఆలోచనలు కలగా పులగమై, ఏమీ వ్రాయాలో తెలియటం లేదు. ఇక లాభం లేదనికుని ఏదో ఒకటి మొదలు పెట్టాలని తెగించేసాను..

మెదటిగా.. e-తెలుగు స్టాల్ ఒకటి పుస్తక ప్రదర్శనలో పెడుతున్నారని తెలిసిన తరువాత నా మదిలో మెదలిన

మొదటి ప్రశ్న .. ఎందుకు పెడుతున్నారు?

రెండవది .. ఏం చేద్దాం అనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు?

మూడవది .. స్టాల్ కి వచ్చే వారి నుంచి ఎటువంటి స్పందన కై ఎదురు చూస్తున్నారు ?

ఆఖరుగా .. ఒక వేళ నేను కనున పాలు పంచుకుంటే, నేను చెయ్య వలసిన పని ఏమిటి?

ఇలా ఒక దానికి ముడి పడి ఒకటొకటి చొప్పున చాలా సమాధానాలు లేని ప్రశ్నలు మదిలో తలెత్తాయి. వాటన్నింటినీ ఒకే ఒక సమాధానంతో కొట్టి పడేశాను.

ఏది ఏమైనా.. ఎవ్వరు ఏమి చేసినా.. నేను మాత్రం అక్కడ "తెలుగుని అంతర్జాలంలో ఏ విధంగా ఉపయోగించ వచ్చో.. " అనే విషయాన్ని తెలియ జేయ్యాలి

అన్న దృడ సంకల్పంతో పాలు పంచుకున్నాను. అదేదో పాత తెలుగు సినిమా పాట చెప్పినట్లు.. "ఎవ్వరో ఒకరు.. ఎపుడో అపుడు, నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు.. " అలా, ఎవ్వరు ఏమి చేసినా.. తెలుగు ప్రాపకం కోసమే కదా అని సమర్దించుకుని మారు చించకుండా దూకేశాను. అదిగో అలా ప్రారంభం అయ్యింది నా ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో పదనిశలు.. మరెన్నో తీపి గుర్తులు.. ఇంకెన్నో చేదు అనుభవాలు.. ఎన్నని చెప్పను.. ఏమని వివరింతును. కానీ ఏదో చెప్పాలి.. ఎలా చెప్పాలి.. అన్న ప్రశ్నలు బుఱని తొలుస్తుంటే.. ఫలితంగా వెలువడినవే ఈ పుటలు.

అసలు విషయానికి వస్తే, మొదటి సారిగా నేను శనివారం నాడు వెళ్ళాను. అదికూడా సాయంత్రం వేళలో. అప్పటికే కొంత మంది చేరుకున్నారు. అందరికన్నా ముందుగా గమనించ తగ్గ వ్యక్తి మన దూర్వాసుల పద్మనాభం గారు. వీరు పుస్తక ప్రదర్శనలో నేను పాల్గొన్న అన్ని రోజులు కనబడ్డారు. అలాగే పాలు పంచుకున్నారని తెలిసింది. వీరి గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. లేదనుకోండి, మిగిలిన వాళ్ళు నా తోలు వలిచే క్రమంలో ఏమైనా జరగ వచ్చు. అందుకని ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తాను.

అక్కడ చేరుకున్న వాళ్ళలో కొందరు ముందు వరుశలో నిలుచొని కరపత్రాలు పంచి పెడుతున్నారు. వారికి వెనుకగా మరి కొందరు చేరి చక్కగా కాళ్ళు చాపుకుని కూర్చుని యాజమాన్య తరహాలో వీక్షిస్తున్నారు (అనేకన్నా పర్యవేక్షిస్తునారు అంటే బాగుంటుందేమో..) వారిలో చెప్పుకో తగ్గ వారు అట్లూరి అనీల్ గారు. నేను చూస్తుండగా వీరు ఏనాడూ ముందు వరుశలో ఉన్నట్లు లేరు. అలాగే ఒక్క కర పత్రమూ పంచగా నేను చూడలేదు. వీలు అయితే స్టాలు లోపల కుర్చీలో, లేక పోతే స్టాలుకి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి వచ్చే పొయ్యేవారిని ఓ కంట కనబెడుతూ కనబడ్డారు. ఒక సారి మెల్లిగా నేనూ వారి దగ్గరకు చేరి మాట మాట కలిపాను.

ఆ మాటల్లో అర్దమయ్యింది ఏమిటంటే, చురుకుగా పాల్గొంటూ చలాకీగా ఉన్న యువతరానికి అవకాశం ఇచ్చే క్రమంలో వీరు అక్కడ జరిగే కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారంట. అబ్బో.. చాలా తెలివైన .. సున్నితమైన .. డిప్లమాటిక్ సమర్దనగా అనిపించింది. ఏది ఏమైనా వీరు మాత్రం నేను వెళ్ళినన్ని రోజులు కనబడ్డారు. అలాగే అందరికీ అవకాశం ఇచ్చే క్రమంలో ఏమీ చెయ్యకుండా పర్య వేక్షిస్తూ, వీలు కలిగినప్పుడల్లా (నా ఉద్దేశ్యంలో కూర్చోవడానికి కుర్చి దొరికినప్పుడల్లా అని) అందరితో పిచ్చాపాటీ వేస్తూ చురుకుగా పాల్గొనే వాళ్ళలో ఎవ్వరైనా పలకరిస్తే నవ్వుతూ సమాధానం ఇస్తూ కనబడ్డారు.

అస్సలు రాని వాళ్ళకన్నా వీరు చాలా గొప్పవారు. ఠంచనుగా సాయం అయ్యేటప్పటికి చేరుకునే వారు. రాజు గారి ఇంట్లో పెళ్ళంట తలా కొంచం పాలు పొయ్యండి అని చాటింపు వేస్తే, కొందరు / అందరూ నీళ్ళే పోసారంట. కనీశం ఏదో ఒకటి పోసారు, "రాజుగారికి మనం ఇచ్చేదేంటిలే.." అనుకొని ఏమీ చెయ్యని వాళ్ళ కన్నా ఎంతో కొంత అనుకుంటూ నీళ్ళైనా పోసిన వాళ్ళు గొప్ప అని నా అభిప్రాయం. ఇది నా గమనిక మాత్రమే. నేను లేనప్పుడు మరి వీరేమి చేశారో నన్ను అడగకండి.

  మరో పుటలో ఇంకొందరి గురించిన వివరాలతో..

3 కామెంట్‌లు:

Shiva Bandaru చెప్పారు...

మరో పుట కోసం ....

oremuna చెప్పారు...

మీమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది.

సరే మరీ ఎక్కువగా వ్రాసి విమర్శకులకు ఎక్కువ కోణాలు ఇవ్వదల్చుకోలేదు.

"అనిల్ అక్కడలేకపోతే ఆ స్టాలే లేకపొయ్యేది"

ఓ బ్రమ్మీ చెప్పారు...

జాలి పడండి తప్పులేదు.

నిజమా.. ఈ విషయం నాకు ఇంత వరకూ తెలియదు. అదీ సంగతి. వ్యాపార దృక్పధంతో నెలకొన్న ప్రాంగణంలో ఉచితంగా ఎందుకు ఇచ్చారా అని ఎంత ఆలోచించినా అర్దం కాని కొన్ని విషయాలు మెల్లమెల్లగా తేట తెల్లమౌతున్నాయి.

ఏది ఏమైనా .. ఎలా చేసినా, ఏమి చేసినా వీరి ప్రమేయం కూడా ఉందన్న మాట. ఇదిగో ఇలాంటి వాళ్ళను చూస్తే అనిపిస్తూ ఉంటుంది.. ఏమని అంటారా.. "నిప్పు వీరు రాజేసారు.. మిగతా వాళ్ళు ఆజ్యం పోసారు" అని.

ఇంత కాలం eతెలుగు వారికి మరియు పుస్తక ప్రదద్శన యాజమాన్యానికి మధ్య దాగి ఉన్న తెర వెనకాల వ్యక్తి వీరన్నమాట.

 
Clicky Web Analytics