31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త సంవత్సరమా !!

స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను.

జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది

తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే విషయాలు
తేదీ మార్పు అర్దరాత్రి 12 గంటలకు  తేదీ మారుతుందా?
ఎలా మారుతుంది?
ఏమార్పు కనిపిస్తుంది?
ఈ తేదీ మార్పునకు ఆధారం ఏమీ లేదు..
సూర్యోదయంతో చీకట్లు తొలగి ప్రపంచం నిదుర వీడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చిన మార్పుతో తారీఖు మారుతుంది.
     
సంవత్సరం మార్పు జనవరి 1వతారీఖునకు గానీ డిసెంబర్ 30వ తారీఖునకు కానీ ప్రకృతిలో కానీ, వాతావరణంలో కానీ, గ్రాహాల స్థితిలో కానీ, భూమి గమనంలో కానీ ఏమార్పు ఉండదు. చాలా మంది తెల్లవాడి గొఱ్ఱెలకు జనవరి 1 నే సంవత్సరం  మారుతుందనుకుంటారు ఉగాది నాడు ప్రకృతిలో క్రొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో, శోభాయమానమైన వాతావరణంతో, నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే క్రొత్త సంవత్సరంగా భారతీయ సింహాలు భావిస్తారు.
     
క్యాలెండర్ మార్పు తెల్లవాడి క్యాలెండర్లో కేవలం వారాలు, తేదీలు మాత్రమే తెలుస్తాయి
ఏ రోజు ఏమి చెయ్యాలో / ఎప్పుడు తెలవారుతుందో / ఎప్పుడు ఏఏ మార్పులు వస్తాయో చెప్పలేని ఒక గీతల కాగితం గోడకు వేలాడుతుంది
తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం, అనే పంచ అంగాలతో సంవత్సరం పొడువునా ఏరోకు ఏమి చెయ్యాలో, విత్తు ఏప్పుడు నాటాలో, పెండ్లి ఎప్పుడు చెయ్యాలో, పగలు, రాత్రి, ఎప్పుడెప్పుడు వస్తాయో, చంద్రుడి గమనం ఏమిటో వివరిస్తూ, గ్రహాణాలు ఎప్పుడు వస్తాయో చెబుతూ, జీవితానికి క్రమపద్దతిలో ప్లానింగ్ ఇచ్చేది భారతీయ పంచాంగం

శాస్త్రీయంగా, విఙ్ఞానంగా, సనాతనంగా ఈ దేశంలో వస్తున్న పద్దతులను వదిలేసి, అశాస్త్రీయతకు ఆధారమైన తెల్ల వాడి పద్దతులపై ఎందుకీ వ్యామోహం?

వైఙ్ఞానీకంగా, ప్రకృతి సహజంగా, మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ఉగాదిని సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకుందాం..

తెల్ల వాడి గొఱ్ఱెలుగా మారొద్దు. భారతీయ సింహాలు కండి..

6 వ్యాఖ్యలు:

కొత్తపాళీ చెప్పారు...

శబాష్! గర్జిద్దాం పదండి! :)
పిల్లాట పక్కన బెడితే, మేమంతా హేతు వాదపద్ధతిలో అన్నీ శాస్త్రీయంగా చేస్తామో అని గోలగోల చేసే పాశ్చాత్యులు ఇటువంటి దైనందిన విషయాల్లో పక్కా అశాస్త్రీయమైన కేలెండరుని అనుసరించడం తమాషా కదూ?

జయ చెప్పారు...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సో మా ర్క చెప్పారు...

"నాలిక మూడంగుళాలైనా అది ఆరడుగుల మనిషిని చంపగలదు."

సలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానం చెప్పారు...

ఇరగ కేక కత్తి తురుము తోపు .

rajachandra akkireddi చెప్పారు...

నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
post chala bagundi.

అజ్ఞాత చెప్పారు...

బాగుంది

 
Clicky Web Analytics