31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

5 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నాదీ అదే పరిస్థితి.ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియక అక్కడే ఉన్న మా పెదనాన్నగారి అమ్మాయిని ఆదిలక్ష్మిగారిని కలిసి సాంత్వన పరచమని చెప్పాను.అసలు అంతర్జాలంలోకి రావాలంటేనే మనసొప్పడంలేదు.

Mauli చెప్పారు...

మీరు ఇలా మీలా౦టి ఇ౦కొ౦దరి బాధను కూడా ప౦చుకొ౦టున్నారు. నిజానికి ఆ తల్లిద౦డ్రులకే కాదు ఓదార్పు కావలసినది , మీతో సహా ఇలా ఆత్మీయులుగా భావి౦చే ప్రతిఒక్కరికి అవసరమవుతు౦ది. మొదట మీరు మరచిపోతే వారికి ధైర్యం చెప్పగలుగుతారు. కాని ఈ ప్రయత్నం లో పలానా కారణాలపై కోపం కుడా అ౦తే తీవ్ర౦గా ఉ౦టు౦ది. వాస్తవ౦ లోకి రావడానికి సమయ౦ పడుతు౦ది. మిమ్మల్ని మీరు ని౦ది౦చుకు౦టు ఉ౦టే ఇ౦కో సమస్య వచ్చి చెరుతు౦ది. మీరు చెయ్యగలిగినది చేస్తున్నానన్న తృప్తి మాత్రమె మీకు ఓదార్పునిస్తుంది :)

అజ్ఞాత చెప్పారు...

మీ బాధ అర్థమయ్యింది, ఒకరినే ఓ దార్చలేకుండా మీరేడుస్తుంటే, ఓదార్పు యాత్రలు చేసి వందలమందిని ఓదార్చే మన ప్రియతమ మాజీ యువరాజు ఎంత ఏడ్వాలి?

చక్రవర్తి చెప్పారు...

విజయ మోహన్ గారు,

నిజాన్ని నిర్బయంగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. మీరు నిర్బయంగా మీ భావనను తెలియజేసినందులకు నాకు కొంచం స్వాంతనగా ఉంది. స్పందించి మీ భావాలను పంచుకున్నందులకు శత సహస్ర ధన్యవాదాలు.

మౌళి గారు,
మీ స్పందనలో నాకు చాలా ధైర్యం కనబడుతోంది. ఇలాంటి పదాలకు కూడా నా గొంతుక నోచుకోక పోయిందంటే, అది నా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఏమైనా స్పందిచి ఊరట కలిగేటట్లు స్పందించినందులకు మీ వ్యక్తిత్వానికి జేజేలు. ఇలాగే స్పందిస్తూ ఉండండి.

అఙ్ఞాత గారు,
మీరు ఎవ్వరిని గూర్చి స్పందన చేసారో నాకు అర్దం అయ్యింది. కెలుకుడు బ్యాచ్ వారికి చెప్పండి నాకు కొన్ని బలహీనతలున్నాయి, వాటిని కనుక ఉపయోగించుకోగలిగితే వారికి ఫుల్లుగా టైం పాస్ అవుతుంది అని. అలాంటి కాలక్షేపం గురించి ఇలాంటి చోట స్పందిస్తే నిర్మొహమాటంగా తొలగించబడుతుందని మొదటి హెచ్చరిక. ఇకపై ఇలాంటి చోట మర్యాదని పాటిస్తారని ఆశిస్తాను.

అజ్ఞాత చెప్పారు...

మీరు ఆ వూరిలోనే వుంటే ఒకసారి వెళ్లి కలసి మాట్లాడండి. బ్లాగులోకం లో ఆమే లేని లోటు బాగా తెలుస్తున్నాది.

 
Clicky Web Analytics