11, మార్చి 2011, శుక్రవారం

నేను అనుభవాలనుంచి నేర్చుకోవటం లేదు

ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది. దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం.

స్వతహాగా నాకు ఉన్న కొన్ని బలహీనతలలో ఒకటి నన్ను చాలా ఇబ్బందులలోకి తోస్తోంది. అలా చెయ్యడం ద్వారా నేను ఇబ్బందుల పాలౌతున్నాను అన్న విషయం గ్రహించి కూడా అలా చెయ్యడం మానుకోలేక పోతున్నాను. అలా చెయ్యడం మానడానికి నేను చాలా శ్రమించ వలసి వస్తుంది. కానీ చాలా కాలంనుంచి ఉన్న అలవాట్లు తొందరగా మానుకోలేం అన్న ఆంగ్ల నానుడి నాయందు స్పష్టమైంది. ఆంగ్ల నానుడిని ఆంగ్లంలో, Old habits die hard.

ఈ పుట వ్రాయడం వెనకాల ఉన్న చాలా విషయాలలో ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ’రాయడం’ అనే పదం చూచిన రోజునుంచి నాకు చాలా కోపంగా ఉండేది. ఎవ్వడో చదువురాని లేదా వ్రాయడం చేత కాని ఓ అభాగ్యుడు వ్రాయడం అనే అచ్చమైన తెలుగు పదాన్ని తెలియక అలా వ్రాస్తే, ఏవిదంగా వ్రాస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తూ ఈ నాటి చాలా మంది రచయితలు అందునా విద్యావంతులు అంతే కాక సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా ఈ రాసే జబ్బుని వారంటించుకుని అందరికీ పూయ్యడం అలవాటు చేస్తుంటే కడుపు రగిలిపోయ్యేది. ఇక్కడ మరో విషయన్ని ప్రస్తావించాలి.

ఉదాహరణాకి, ఓ ఇంటి ముందు నుంచొని ఓ పెద్దాయిన ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది..

౧) అబ్బాయి, మీ నాన్నగారు ఉన్నారా?

౨) బిడ్డా!, మీ నాయిన ఉన్నడా?

౨) కొడకా, బాబు ఏంజేస్తుండు?

౪) వగైరా .. వగైరా..

ఇవన్నీ ఏదో ప్రాంతీయ యాస కలిగి ఉంటాయి, అంతే కానీ ఏ భాణిలోను మనం తండ్రి అనే పదాన్ని అగౌరవ పరచం. కాకపోతే మనం చేయ్య వలసినదల్లా, ఆ ప్రాంతీయ తత్వాన్ని మనం అర్దం చేసుకోవడమే.

అదిగో అలాంటి సమయంలో తెలుగు బ్లాగింగ్ చెయ్యడం, eతెలుగులో చేరడం, నా అభిప్రాయాన్ని నలుగురితో పంచుకోవడం, పలువురు నన్ను వ్యక్తిగతంగా నిందించడం, వగైరా వగైరా, ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయ్యాయి. ఎవ్వరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ విషయమై నేను ఓ అభిప్రాయానికి వచ్చేసాను. నేను తెలుగు భాషని నలుగురిలోకి తీసుకు వేళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరు ఏవిధంగా నైనా తెలుగులో వ్రాయడం మొదలైతే ఎంతో కొంత తెలుగు భాష వాడుకలోకి వస్తుంది కదా అని సమర్దించుకుని నా భాదని దిగమింగుకుని నాకు వీలైనంత వరకూ వ్రాయడమే చేస్తున్నాను.

అదిగో అలాంటిదే మరొక్కటి. అయినా నాకు ఎందుకో ఈ జాడ్యం? భాష యందు పూర్తి పట్టులేక పోయినా కొన్ని కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పవచ్చు. నాకు అవగాహన ఉన్న విషయాలలోని అర్దాన్ని తెలియని అందునా మాకు తెలియని విషయాన్ని చెప్పండి అని అడిగిన వారికి మాత్రమే తెలియ జేస్తుంటాను. అలా తెలియజేస్తూ ఉండే ప్రక్రియలో తెలుసుకునే వారు, తాము చేస్తున్నది భాషకి విరుద్దం అని తెలిసి.. ఆ విషయాన్ని ఒప్పుకునే చొరవ లేక వితండంగా వాదించడమే కాకుండా తిరిగి నాపై లేదా నేను చేసే తప్పులను భూతద్దంలో చూపించి వారేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవుతారు.

ఇలాంటి వారి విషయాలలో కొన్ని అంశాలు. మొదటిది, నాకు నేరుగా తపుచేస్తున్న వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం లేదు. వారు అడిగితేనే నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను. రెండవది. నేనేమి తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని ఎవ్వర్ని నేను అడగలేదే, మరి అలాంటది నా చర్యలపై ఎందుకు స్పందిస్తారు? ఇలాంటి వాటి గురించి మరోసారి. ప్రస్తుతానికి ముఖ్య విషయానికి వచ్చేస్తా..

ప్రస్తుత ముఖ్య విషయాన్ని, అనుభవం నుంచి నేర్చుకోవడం అనే విషయంపై నేను ఇంతకు ముందు ’వ్రాయడం’ అనే విషయంలో అనుభవించి ఉన్నాను. కానీ ఇది పునరావృత్తం అవుతోంది అంటే, నేను అనుభవాలనుంచి నేర్చుకో లేక పోవడమే కాకుండా, స్వయం కృతాపరాధానికి అనుభవించాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం జరుగుతుందో చూడాలి ఇకనైనా నేను నాలోని ఈ బలహీనతను అధిగమించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూచుకోవాలి.

2 కామెంట్‌లు:

Mauli చెప్పారు...

:))

భాష పై మీకున్న అభిమానమే మిమ్మల్ని ఆ పొరబాటు మళ్ళీ మళ్ళీ చేసేలా ప్రోత్సహిస్తున్నది.

ఇవ్వన్నీ మనసులో పెట్టుకోక౦డి.

చక్కగా ఈ సబ్జెక్ట్ పై ఒక ప్రత్యేక బ్లాగుని ప్రార౦భి౦చ౦డి. ఎవరో ఒకరికి నచ్చుతు౦ది, ప్రశ్న అడిగిన వారికి నచ్చకున్నా.

ఓ బ్రమ్మీ చెప్పారు...

మౌళి గారు,

బాగున్నదండి మీ ప్రోత్సాహం. మీ ఆలోచన కూడా చాలా శ్రేష్టంగా ఉంది. ఆ పనిలో నేనెందుకు ముందుకు పోకూడదు అని ఆలోచిస్తున్నాను. ఓ మంచి ఆలోచనకు నాంది పలికారు అలాగే స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics