దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.
ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.
సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?
ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.
ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.
ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..
- రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
- ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
- బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
- మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..
అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!