4, ఆగస్టు 2010, బుధవారం

అమెరికా వాళ్ళు ఇంత పిసినారోళ్ళనుకోలేదు..

అమెరికాలోని మనుష్యులు కూడా పిసినారోళ్ళే. వీళ్ళేం పెద్ద పుడ్డింగోళేంకాదు. వీళ్ళు మామూలు మన లాంటి సాదా సీదా వాళ్ళే కానీ మనలా బయటకి కనబడరు. దొంగలు.. ఇవాల్టి యు.ఎస్.టుడే వార్తలలో ఒకటి నిరుద్యోగం వారికి ప్రభుత్వం వారు ఇచ్చే జీవన్ భృతి గురించి. ఆ వార్త శీర్షిక ఈ విధంగా ఉంది, నిరుద్యోగం మరియు ఉపాధి బెనిఫిట్స్ స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ నేను తెలుగులోకి సరిగ్గా తర్జుమా చెయ్యలేకపోతే ఈ వార్తని ఈ లంకెలో చదువుకోండి. అఖరి గణనాంకాల ప్రకారం అమెరికాలోని నిరుద్యోగుల శాతం దాదాపు ౯.౫ (9.5%). అంతే కాకుండా ప్రతీ నిరుద్యోగికి ప్రబ్యుత్వం తరుఫున అందే మొత్తం  సగటున ౧,౫౪౬$లు (1,546$). దీనిని బట్టి మీకు అర్దం అయ్యిందేమిటి, ఇక్కడ నిరుద్యోగికి భత్యం వీరి నిత్య జీవనానికి సరిపోయే అంత దానికన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అలస్కా అనే రాస్ట్రంలో అయితే ఈ సంఖ్య మరీ ఎక్కువ దాదాపు మూడున్నర వేలకు పైగా. అన్నింటికన్నా అధమంగా ఫ్లోరిడా రాస్ట్రంలో పన్నిండున్నర వందల డాలర్లు నెలసరి వేతనంగా ఇచ్చారు. ఇవి జూన్ లెక్కలు. అస్సలు ఉద్యోగం లేని వ్యక్తికి ఇలా డబ్బులు ఇస్తే వాడెందుకు ఉద్యోగం చేస్తాడు? ఈ విషయం ప్రక్కన పెడితే.. ఇందుకు భిన్నంగా మూడు నాలుగు రోజుల క్రిందట ఓ వార్త చదివాను.. అది నన్ను విశ్మయానికి గురి చేసింది.

cashcowx ప్రస్తుత గణనాంకాల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో దాదాపుగా ఎనిమిదిన్నర వందల బిలియన్ల ధనం రొక్కంగా మూలుగుతోందట. ఇక్కడ రొక్కం అనే విషయాన్ని మీరు కాష్ అని చదువుకోండి. ఈ క్యాష్ నిలువలు ఇతిమిద్దంగా పెరిగి అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని కని విని ఎరుగని మొత్తాన్ని చేరుకున్నాయంట. ఇది ఒక రికార్డ్. ఈ మొత్తం ఎదుగుదల ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంట. అంటే ఇది ఇలాగే సాగితే, ఈ సంవత్సరాంతానికి అది దాదాపు వెయ్యి బిలియన్ల మొత్తానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ళ క్రిందట మొదలైన బ్యాంకుల మూతల నష్టాన్ని అమెరికా ప్రపంచం మొత్తానికి చూపించి సానుభూతిని కొట్టేసిందే, మరి ఇక్కడ పేరుకు పోతున్న నిధుల విషయమేమిటో. అది సరే గాని ఈ ఎనిమిదిన్నర బిలియన్ల్ మొత్తం ఏ మేరకు సరిపోతుందో తెలుసా.. దాదాపు రెండున్నర మిలియన్ల మందికి సంవత్సరానికి డెభ్భైవేల జీతంతో ఐదు సంవత్సరాల పాటు ఉపాధికి సరి సమానం. అంటే ఐదేళ్ళపాటు దాదాపు పాతిక లక్షల మందికి అవసరానికన్నా మించి మూడొంతులకు సరి సమానంగా ఆర్ధిక స్థితి ఉందన్నమాట, అంతే కాకుండా వీరు సంపాదించేదానిలో మూడో వంతు మళ్ళీ టాక్సులనో తొక్కనో లేకపోతే గాదిడ గుడ్డనో ప్రభుత్వం తీసుకుంటుందికదా. సంపాదించిన ప్రతీవాడు ఏదో విధంగా ఖర్చు చేస్తాడు కదా.. ఈ విధంగా వ్యాపారాల్లు పునఃరుద్దరణకు నోచుకుంటాయి కదా.. ఒక వేళ వీడు ఖర్చు పెట్ట లేదనుకోండి, మిగిలిన డబ్బులను బ్యాంకులోనే కదా దాచుకునేది. ఆవిధంగా నైనా డబ్బు మళ్ళీ బ్యాంకుల్లోనే కదా చేరేది. ఇలా ఎలా చూసుకున్నా వీరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉండేది!! ఎప్పుడ్? పైన ఉదహరించిన నాన్-ఫైనాషియల్ సంస్థలలో నిల్వలుగా పేరుకుంటున్న నికర ధనం గనుక ఉపాధికి ఉపయోగిస్తే.

పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు? వీటన్నింటి వెనుక మరో రహస్యం. నాన్-ఫైనాన్షియల్ సంస్థలలోనే ఇంత మొత్తం మూలుగుతుంటే, మరి ఫైనాన్షియల్ సంస్థల పరిస్థితేమిటంటా!! వీటి గురించి మరో సారి మనం విశ్లేషించుకుందాం. అంత వరకూ బై..

22 కామెంట్‌లు:

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

I didn't understand completely your analysis. Later I'll read the content in the URLs that you've mentioned.

I really appreciate the govt. policy of providing support to unemployed persons. I read that similar policy is also there in many European countries as well.

If such facility is here, I'll show my real face to my manager :)

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పిన/వ్రాసిన దాంట్లో పిసినారితనం ఎక్కడ ఉందొ అర్థం కాలేదు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

గణేష్ గారు,
నేను చెప్పింది లేదా ప్రస్తావించినది రెండు పరశ్పర విరుధ్ధమైన విషయాలు. ఒకటి నిరుద్యోగం మరియు బృతి గురించైతే మరొకటి పేరుకు పోతున్న ధన నిల్వ గురించి. ఓ ప్రక్కన ధనం మూలుగుతోందంటూనే పని లేని వాడికి ఉచితంగా సౌకర్యాలు కలిగిస్తుంటే.. మొదటిది, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు. రెండొవది, డబ్బు ఉండి కూడా ఉపాధి కల్పించడం లేదెందుకో ఆలోచించండి.

ఇక మీ విషయానికి వస్తే, మీరు మీరులా ఉండండి. వసతులున్నప్పుడు ఒక లాగా వసతులు లేనప్పుడు ఒక లాగా ఉండకండి. ఇప్పుడు మాత్రం మీ రియల్ ఫేస్ చూపిస్తే ఏమౌతుంది? ఉద్యోగం ఊడుతుంది అంతే కదా.. దీనిని మనం పలు కోణాలలోంచి చర్చించుకోవచ్చు.. ఆఫ్ లైన్లో

అజ్ఞాత గారు,
మీ ఉద్దేశ్యంలో పిసినారోళ్ళంటే ఎవ్వరు? నా మటుకు నాకు డబ్బు ఉంచుకుని / లేదా దాచుకుని, దానిని సద్వినియోగమో లేక దుర్వినియోగమో చెయ్యకుండా, తాను తినడు మరింకొకడికి పెట్టని వాడు అని అభిప్రాయం. సొ ఆ విధంగా ఇలా డబ్బుని ఉచితంగా కొట్టేసోళ్ళు లేదా దాచుకుని ఖర్చు పెట్టని వాళ్ళంతా పిసినారోళ్ళే.. మీరేమంటారు..

మీరిద్దరూ కాకుండా నాతోనేను,
ఈ పుటకి ముందుగా మన శరత్ గారు స్పందించి, ఒరేయ్ భడుద్దాయ్, నీవన్నీ సత్య దూరాలు, నిన్ను నిజనిద్దారణ కమీటీ ముందుంచాలి.ఈ విషయాని నేను ఖండిస్తూ.. వేరీజ్ ఏకలింగం .. అంటారేమో అనుకున్నా. హమ్మయ్య. మన శరత్ గారు ఇంకా లేచినట్టు లేరు. ఓ!! ఇప్పుడే గుర్తుకు వచ్చింది, వీరి పెళ్ళాం ఊరెళ్ళింది కదా.. రాత్రి ఎక్కడికో చెక్కేసి పుల్లుగా కొట్టేసి అక్కడే పడిపోయుంటారు..

శరత్ గారు,
ఇటీజ్ జస్ట్ ఫర్ ఫన్. మీ మనోఃభావాలను దెబ్బ దీశాననిపిస్తే, ఐ యామ్ సారి. మన్నించండి

శరత్ కాలమ్ చెప్పారు...

సంస్థల్లో ఎంత మూలుగుతుందన్న విషయంపై నాకు అవగాహన లేదు కానీ నిరుద్యోగ భృతి గురించి మీ అవగాహన అవాస్తవం. ఎందుకనేది ఇప్పుడు వివరించే తీరిక లేదు. వేరే ఎవరయినా మీకు వివరిస్తే బావుండును. లేకపోతే తీరికున్నప్పుడు వచ్చి వివరిస్తా. ముందు నా బ్లాగు బాధ్యతలు చూసుకోవాలి కదా :)) అక్కడ చాలామంది నన్ను కెలికేస్తున్నారు!

నా మనోభావాలు అంత వీజీగా గాయపడవు లెండి :)

ఓ బ్రమ్మీ చెప్పారు...

శరత్ గారు,

వచ్చారా.. అనుకున్నా మీరు నన్ను ఖండించనిదే ఊరుకోరని. అందుకనే ఈ సారి ఉత్తుత్తి మాటలు కాకుండా నేను చదివినది / ఉన్నది ఉన్నట్టుగా లంకెలతో సహా ఇచ్చాను. కాబట్టి ఇవి అవాస్తవాలు కావు. అయితే గియితే ఆ వార్తా పత్రికల వాళ్ళు లేదా అలాంటి సర్వే నిర్వహించే వాళ్ళు అసత్య వార్తలు వ్రాస్తే దానికి నేను కాదు బూచి.
హాస్యాన్ని హాస్యంగా తీసుకున్నందుకు మీకు జేజేలు. ఇక మీ ఏకుడు గురించైతే మరో పుట అవసరం, అక్కడ చెప్తా నా స్పందన. అంత వరకూ నెనరులు.

తార చెప్పారు...

• Company revenues of $37.4 billion
• Total company orders of $19.2
• Industrial cash flow from operations at $6.3 billion YTD
• $74 billion consolidated cash and equivalents

cash and equivalent అనగానే అది సినిమాల్లో లాగ ఒక ఇనప పెట్టెలో పెట్టి దాయరు కదా, మనకే అనుకున్నాను, అమెరికాలొనూ ఈ కమ్యూనిష్ట్ వాళ్ళు ఉన్నారా..

జియి నే తీసుకుంటే, దాని సంవత్సర ఆదాయం దాదాపు ౧౦౦ బిల్.$ పైనే, పోయిన ఏడాది వచ్చినట్టు మాధ్యం ఇంకో ౨-౩ ఏళ్ళు ఉంటే? అప్పుడు ఏమి చెయ్యాలి, పొని ఈ డబ్బులు అన్నీ దాచుకొని (వెరే విధంగా ఇన్వెస్ట్ చెస్తే) అప్పుడు ఆ మాధ్యంలో అవీ కుప్పకూలతాయి కాబట్టి ఈ ౭౪బిల్ $, మహా ఐతే ౧౦, ౧౫బి$ అవుతాయి, అప్పుడు రెండో రొజే కంపెనీ ముసేసుకోవాలి, ఇప్పుడు ఐతే ఒక ౨ ఏళ్ళు ఎంత పెద్ద విపత్తు వచ్చినా కంపెనీ మూత పడదు, ఎలాగొలా నడుపుకోవచ్చు, తరువాత మెల్లగా కోలుకోవచ్చు..
అసలు ఇఒ (Industrial Organization) మీద కనీస జ్ఞానం లేని వాడి చేత రాయించిన ఆ పేపర్ వాడ్ని అనాలి.

పానీపూరి123 చెప్పారు...

> పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు?
తె.దే.పా నాయుడుగారు గెలిచుంటే, ఇంకా సోమరిపోతులు ఎక్కువ అయ్యేవారా?

ఓ బ్రమ్మీ చెప్పారు...

తారగారు,

అస్సైన్స్ అంటూ భలే లాజిక్కు పట్టారే.. ఏది ఏమైనా నాకు తెలిసినంత వరకూ ఒక్కటే విషయం.. బ్యాంకులోనైనా లేదా సేఫ్ డిపాజిట్ లోనైనా లేదా మరింకెక్కడైనా సరే, డబ్బులున్నాయా లేవా అనేదే. అంతకు మించి ఆర్ధిక శాస్త్రం మనకు అంతగా తెలియదు. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

పానీపూరీ గారు,

నెను చెబుతున్న సోమరి పోతులు మరియు ప్రభుత్వాల విషయం అంతా అమెరికాలోనిది అంతే గాని ఆంద్రపదేశ్ కి సంబందించినది కాదు. కావున తెదెపా నాయుడు గారికి ఇక్కడి సోమరిపోతులకి ముడి వెయ్యకండి. థాంక్స్ ఫర్ కామెంటింగ్

శరత్ కాలమ్ చెప్పారు...

హ హ. అక్కడే పొరబడ్డారు. అంకెలు సరిగానే ఇచ్చారు కానీ అవగాహనలో పొరబడ్డారు. మళ్ళీ వస్తా.

తార చెప్పారు...

మీ లంకె చూసాక దడుచుకున్నాను అండి.

మనం రొఖ్ఖం అని కొలిచేది, ఎంత త్వరగా ద్రవ్యంగా మార్చుకోగలము అనే, అంటే, స్థలాలు కుడా డబ్బే, కానీ అది నగదు రూపం లో మార్చుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టీ దాన్ని ౪ లెవల్ మనీ అంటాము, అలానే, ౧ లెవెల్ లో చేతిలో ఉన్న నగదు, ఇంక దాన్ని నగదు రూపంలో త్వరగా పొందగలిగే విధంగా దాచుకున్నా, బ్యాంక్ లో వేసుకున్నా, అలా, దాన్ని క్యాష్ అంటాము, అది వడ్డీ వచ్చే విధంగా ఉన్నదా, లేదా అన్నది చెప్పలేము.. కానీ ఆ పేపర్ వాడు చక్కగా తేల్చి పడేసాడు..వెధవాయి

ఓ బ్రమ్మీ చెప్పారు...

శరత్ గారు,

ఐయామ్ వెయిటింగ్..

తారగారు,

ముందే చెప్పనుకదా.. నాకు ఆర్ధిక శాస్త్రంలో అంత పట్టు లేదు.. ఏదో కట్టుకున్నది ఏమైనా నాకు ఈ విషయంలో సహాయ పడుతుంది అనుకుంటే అక్కడకూడా అంత టాలెంట్ లేదు .. ఇక మనకి చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు అలాగే తెలుసుకోవాలన్న కుతూహలమూ లేదు. సో .. just depend on news for all or any financial reports. What they say is వేదం. వెధవాయ్ గాడ్ని పట్టుకొస్తా ఓ సారి ఝాడించేయ్యండి వెధవని.

నేను చెప్పారు...

ఆ లెక్కలు అవి చూడలేదు కాని అక్కడ డబ్బులు ఊరికే ఇచ్చెయ్యరు (అనుకుంటా). ఆ నిరుద్యోగులు అంతకుముందు పనిచేసుంటె ఆ సమయంలో అన్ఎంప్లోయ్మెంట్ టేక్స్ వసూలు చేసుంటారు. అవే నిరుద్య్యోగసమయమంలో తిరిగి ఇస్తున్నట్టు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

బద్రి గారు,

నిరుద్యోగులకు ఈ విధంగా డబ్బులిస్తే సోమరి పోతుల్లాగా తిరుగుతారని సంవత్సరనికి మూడో నాలుగో నెలలు మాత్రమే ఇలా డబ్బులు పంచుతారు. ఈ డబ్బుని ఏవిధమైన టాక్స్ గానో తీసుకోరు. ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఇస్తారు. మరి ఖజానాకు రావడం మాత్రం పలు పలు కారణాలు ఉంటాయి కానీ అన్‍ఎంమ్లాయ్‍మెంట్ టాక్స్ అంటూ విడిగా ఏమీ ఉండదు. ఏమైనా స్పందించారు అందుకు నెనరులు

కొత్త పాళీ చెప్పారు...

1. నిరుద్యోగ భృతి అనేది కొంచెం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఒక నిరుద్యోగ బీమా సంస్థ ఉంది. ఆ రాష్ట్రంలో నడిచే కంపెనీలు, తమ పేరోల్‌లో ఉన్న ఉద్యోగస్తులందరి తరపునా నెలకింత అని నిరుద్యోగ బీమా చెల్లిస్తారు ఆ సంస్థకి. ఏదైనా కంపెనీ తన ఉద్యోగస్తులు కొందరిని lay-off పద్ధతిమీద పనిలోంచి తొలగిస్తే ఆ బీమా సంస్థ సదరు ఉద్యోగికి కొంత ఆదాయం ఏర్పాటు చేస్తుంది. ఇది పొందడానికి మళ్ళి చాలా నిబంధనలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సదరు నిరుద్యోగి ఏక్టివ్‌గా ఇంకొక ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారని తరచూ సాక్ష్యం ఇవ్వాలి. అంచేత, ఈ నిరుద్యోగ భృతి ప్రభుత్వం అప్పనంగా అందరు నిరుద్యోగులకీ పంచిపెట్టే దానం కాదు.
2. ఐతే, ఈ సారి దేశాన్ని పట్టుకున్న ఆర్ధిక మాంద్యం ఈ మధ్యకాలంలో అనుభవం కానంత తీవ్రంగా ఉండడంతో, ఫెడరల్ ప్రభుత్వం ఈ బీమా సంస్థలకి కొంత ఆర్ధిక సహాయం అందిస్తున్నది. భృతి పొందాలి అనుకుంటే నిరుద్యోగి పాటించవలసిన నియమాలు పన చెప్పినట్టు షరామామూలే.
3. కొందరు సోంబేరులు ఎక్కడైనా ఉంటారు, ఈ దేశంలోనూ ఉన్నారు. కానీ సగటు ఉద్యోగి, తన సంపాదన మీద ఒక మాదిరి జీవనశైలికి అలవాటు పడినవారు, కేవలం నిరుద్యోగ భృతితో తృప్తి పడి కూచోలేరు అనేక కారణాలవల్ల. ఆ భృతి వాళ్ళు సంపాదించుకో గలిగిన ఆదాయంలో నాలుగోవంతుకూడా ఉండదు. అందుకని (అనేక ఇతర కారణాల వల్ల కూడా) ఆ వ్యక్తి కొత్త ఉద్యోగం కోసం వెతకడం మానడు.

Anyway, interesting point you have raised.

నేను చెప్పారు...

చక్రవర్తిగారు, మాకు ఇక్కడ స్విట్జర్లాండ్ లో అన్ఎంప్లోయ్మెంట్ టేక్స్ అని వెరేగా వసూలు చేస్తారు. అమెరికాలో కూడా అలానే అనుకుని చెప్పెసా :(

Thanks for your clarification.

శరత్ కాలమ్ చెప్పారు...

నాకు తీరికలేదు కాబట్టి ఈలోగా ఎవరయినా చెబుతారా అని చూసాను. కొత్తపాళీ గారు చెప్పారు. అది 100% వాస్తవం. నిరుద్యోగ భృతి సాధారణంగా రెంటుకీ, రోజూ రెండు బ్రెడ్డు ముక్కలకీ సరిపోతుంది. అది కూడా ఇచ్చేది కొన్ని నెలలే. దానితో ఎవరయినా పండగ చేసుకుంటారని భావిస్తే అది అవివేకమే అవుతుంది.

ఓ బ్రమ్మీ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఓ బ్రమ్మీ చెప్పారు...

కొత్తపాళీ గారు,

నిరుద్యోగ బృతి గురించి సవివరంగా వ్రాసినందులకు నెనరులు. దీని వెనకాల ఎంత తతంగం ఉంటుందో అర్దం చేసుకోగలను.

బద్రి గారు,

మనది స్విస్సా .. ఈ డిసెంబర్లో అటు వచ్చే ఆలోచన ఉంది అప్పుడు వీలైతే అక్కడ కలుద్దాం. అంతవరకూ ఇలాగే స్పందిస్తూ ఉండండి.

శరత్ గారు,

ఇదేమీ బాగాలేదు, మీరు కూడానా.. నేను డూడూ బసవన్నలను ఒప్పుకోను, ఐ వాంట్ ఏకలింగం టు డు ద ఖండన.

నేను చెప్పారు...

తప్పకుండా కలుద్దామండి.

భావన చెప్పారు...

నేను ఇప్పుడే చూసేను మీ పోస్ట్. కొత్తపాళి గారు చెప్పేసేరు ఇప్పటికే.
నిరుద్యోగ భృతి కింద ఇచ్చే డబ్బులు సగటు అమెరికా జీవన విధానానికి సరిపోవు.. ఐనా పర్వాలేదు అని పిల్లల పోషణార్ధం అని అది కూడా కొంత కలిపి తీసుకుంటూ ఆ దిగువ మధ్యతరగతి కంటే తక్కువ లో బతికే వాళ్ళు వుంతారు.

ఈ నిరుద్యోగ భృతి కూడా ముందు ఆరు నెలలు ఆ పైన మనం ప్రయత్నిస్తున్నా వుద్యోగం దొరకలేదనే ఆధారాలు (చూపిస్తే) ఇంకో ఆరు నెలలు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలలలో ఇంకా ఒక ఆరు నెలలు ఇస్తారు అంతే జీవితాంతం ఇవ్వరు.

అందరికి ఒకే అమౌంట్ ఇవ్వరు. మన ఆదాయపు తరగతులను బట్టే వచ్చేది నిర్ణయించ బడుతుంది. అందులోను టేక్స్ పోతుంది కాని చాలా అల్ప శాతం. మొత్తం గా ఐతే ఇవ్వరు.

రెండో ప్రపంచ యుద్ధం తో లాభించి ఆర్దిక మాధ్యం నుంచి బయట పడిన అమెరికా వూరక వుండదు లెండి. కాని ఎవరి మూల్యం తో ఎటువంటి మూల్యం తో అని అడిగితే నాకు తెలియదు నేను గాయబ్.. :-)

అజ్ఞాత చెప్పారు...

Know the facts and then write your article or talk about it. If you say the same thing with American or Indian who is established here will laugh on your face.
First at least gather the info from the inter net.

 
Clicky Web Analytics