31, జనవరి 2010, ఆదివారం

ఆధారపడటం - మన బలహీనతా !! ??

 

helping-hand మొన్నా మధ్య "అధారపడటం .. " అనే  విషయమై తెలిసిన వాళ్ళతో చర్చిస్తుంటే నాలో కలిగిన కొన్ని ఆలోచనలు మరియు ఆ చర్చనించి వెలువడిన కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను. నా ఆలోచనలలో ఏమైనా మార్పు రావాలంటే లేదా నా ఆలోచనలలో ఏదైనా లోపాలున్నట్లైతే లేదా నా ఆలోచనను మరో విధంగా కూడా ఆలోచించవచ్చు అని మీకు అనిపించినట్లైతే.. ప్లీజ్.. ప్లీజ్.. స్పందించండి

ఈ పుట గురించి కొంచం ఎక్కువగా ఆలోచించానో అని అనిపించింది. కానీ నాకు ఉన్న కొన్ని లోపాపలో ఇది ఒకటి. అదేమంటే, నా భావాలను అక్షర రూపం ఇవ్వాలంటే, అది ఒక యజ్ఞమే. భావ వ్యక్తీకరణకు భాషపై చాలా పట్టు ఉండాలని నా అభిప్రాయం. నా ఈ ప్రయత్నంలో అక్షరలోపాలు దోషాలు ఉన్నట్లైతే మన్నించి సరిదిద్దండి. సరిదిద్దే కొద్ది నా శైలి మారుతుంది అని నా నమ్మకం. నా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకండి.

౧) ముందుగా మనం ఎందుకు మనం ఎదుటి వాళ్ళపై మనం ఆధారపడాలి?

ఈ ప్రశ్న గురించి మొదలు పెట్టే ముందు సదురు "ఎదుటి వాళ్ళు .." ఎవ్వరు అని తెలుసుకోవాలి.

మొన్నామధ్య నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు, నేను స్పృహలేకుండా రోడ్డు పైన పడి ఉన్నప్పుడు నాకు పరిచయంలేని ఓ బాటసారి నడిరోడ్డుపై పడి ఉన్న నన్ను ప్రక్కకు లాగి  నా ఫోన్ నుంచి 108 కాల్ చేసి నన్ను ఆసుపత్రి చేరుకునేటట్టు చేస్తే, మరో బాటసారి నన్ను గుద్దిన వారిని కూడా రోడ్డు ప్రక్కకు చేర్చి అంతా చోద్యం చూస్తున్న పోలీసోళ్ళతో మాట్లాడి గుద్దిన వాళ్ళని వారికి అప్పజెప్పారు. ఇలాంటి విషయాలలో నాకు ప్రమేయం లేకుండానే నేను వారిపై అధార పడ్డాను. దీనిని అధారపడటం అంటారా!!?? ఏమో!! నాకు స్పృహలేనప్పుడు జరిగిన పరిణామాల గురించి నేను స్పందించలేను. ఒకవేళ్ళ నాకు స్పృహ ఉన్నట్లైతే నేను తప్పని సరిగ్గా వారి సాయాన్ని తీసుకునే వాడిని కాను. నాలో శక్తి ఉన్నంత వరకూ పోరాడే వాడిని. దానికి ఉదాహరణే, అంతటి గాయాలతో కూడ నాకు చికిత్స అయ్యిన తరువాత వైద్యుడిని ఆడిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను. అలా ఇంటికి చేరుకున్న నన్ను చూసి ఒక్క సారి జడుసుకుంది నా భార్య. దీనిని మొండి ధైర్యం అని నేను అంటే, కొంత మంది మూర్ఖత్వం అని అంటారు. మరి మీరేమంటారు?

ఇలా మనకు పరిచయం లేని వాళ్ళని నేను "ఎదుటి వాళ్ళు.." అని నిర్వచిస్తాను.

ఇక అసలు విషయానికి వస్తే, మనం ఎదుటి వాళ్ళపై అధార పడాలి అని చెప్పను. కానీ ఎదుటి వాళ్ళపై అధార పడకుండా ఉండేందుకు ప్రయత్నించమంటాను. మనలో మనకు శక్తి ఉన్నంత వరకూ పోరాటం చెయ్యాల్సిందే అంటాను. మనం పూర్తిగా అశక్తులమైనప్పుడు సదురు ఎదుటి వారిపై ఆధారపడటంలో తప్పులేదు.

౨) మనం ఎవ్వరిపై ఆధారపడాలి?

నా ఆలోచనలో కొన్ని ..

  • శారీరక సుఖం కోసం భార్య భర్తపై మాత్రమే ఆధారపడాలి, అలాగే భర్త భార్యపైన మాత్రమే
  • భర్త తన ద్వారా కలగ బోయే పిల్లల కొరకు భార్యపై మాత్రమే ఆధారపడాలి.. (భార్యకు పిల్లలు పుట్టలేని పరిస్థితి వస్తే.. అదే భర్త నపుంశకుడైతే.. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం, నేను ఆ విషయాన్ని సృజించను)
  • పెద్దలు బ్రతికున్నంత వరకూ పిల్లలు వారి తల్లి తండ్రులపై మాత్రమే ఆధారపడాలి .. (ఒక వేళ్ళ వారి తల్లి తండ్రులు అంతటి విధ్యావంతులు కాని పక్షంలో ఈ విషయాన్ని మనం పలు పలు కోణాలలో చర్చించుకోవచ్చు)
  • మనకు భావోద్వేగాలు కలిగినప్పుడు పంచుకోవడానికి ఒక ఆసరా కావాలి, కాబట్టి వాటి కొరకు ఒకరిపై మనం ఆధారపడవచ్చు. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు, అలా అధరాపడే వాళ్ళు మనిషై ఉండాల్సిన అవసరం లేదు. నాకు చాలా హితుడైన ఒక స్నేహితునికి ఓ వింత అలవాటు ఉంది. ఏమిటంటే, అతనికి ఎటువంటి భావోద్వేగాలు కలిగినప్పుడైనా, తనకు అతి ఇష్టమైన ఓ కొండపైన ఉన్న ఓ పెద్ద బండరాయి వద్దకు వెళ్ళి ఏడ్వటమో లేక నవ్వడమో చేసే వాడు. నాకు అందులో ఎటు వంటి అతిశయం కనబడలేదు.
  • ప్రతీ అనుభవం మనకు ఒక గుణపాఠమే. కాబట్టి అనుభవాలపై కూడా అధారపడాలి. కాబట్టి, ప్రతీ అనుభవాన్ని** మనం అనుభవించే ప్రయత్నం చెయ్యవచ్చు. సదురు మొదలుగా ఉదహరించిన అనుభవం** నాది అవ్వవచ్చు లేదా మీది అవ్వవచ్చు. మీది ఫలనా అనుభవం అని తెలిసినప్పుడు .. కొన్ని అనుభవాలు చదివి తెలుసుకోవాలి, మరికొన్ని విని తెలుసుకోవాలి, మరికొన్ని స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి. భూమి  గుండ్రంగా ఉంది అని మనం గురుముఖఃతహ తెలుసుకున్నాం అలాగే చదువుకున్నాం కాబట్టి నమ్మాలి. అంతె కానీ, తూచ్ .. నేను స్వయంగా చూస్తేనే నమ్ముతాను అని అనడం మూర్ఖత్వం అని నా అభిప్రాయం. అలాగే సైన్సులో మన చేత కొన్ని ప్రయోగాలు చేయిస్తారు మన గురువులు అప్పుడు వాటిల్ని మనం స్వయంగా అనుభవించి తెలుసుకుంటాం. ఇలా వేటిల్ని శూత్రప్రాయంగా నమ్మెయ్యాలో వేటిల్ని మనం అనుభవించాలో అది ప్రతీ ఒక్కరి ఉచితానుచితాల పరిధిలో పరిమితమై ఉంటుంది. అది గమనించడమే మన సక్సస్

౩) అస్సలు ఆధార పడకుండా మనం జీవించలేమా!!!

జీవించగలం.. కాకపోతే అడవిలో. అక్కడకూడా మనం చెట్టూ చేమలపై ఆధారపడాలి, తప్పదు. మనిషి ఒక సామాజిక జీవి. కాబట్టి మనకు ఒక సమాజం కావాలి. అలాంటి సమాజంలోని కొన్ని అంశాలపై మనం తప్పని సరిగా ఆధారపడాలి. 

  • ఉదయం నిద్రలేస్తే కాలకృత్యాల అవసరాలకై నీళ్ళు తెచ్చి ఇచ్చే వారిపై ఆధారపడాలి
  • అహార అవసరాలకై మనకు సహాయం చేసే పని వాళ్ళపై  మనం ఆధారపడాలి
  • తెచ్చిన కాయగూరల్ని మనం తినేందుకు వీలుగా అమర్చి ఇచ్చే వంట వాళ్ళపై మనం ఆధారపడాలి
  • మన ఆహార్యం బాగా ఉండాలి కాబట్టి మంచి బట్టలు కట్టుకునే మనకు బట్టలు ఇచ్చే వారిపై మనం ఆధారపడాలి
  • దినచర్యలో అవసరమైన శుబ్రమైన వాతావరణం తెచ్చి పెట్టె పని వారిపై మనం ఆధారపడాలి
  • మనకు ఇంతమంది చేస్తున్న సహాయాన్ని అర్దవంతమైన ప్రతి సహాయం చేయ్యడానికి మనకు ఓ పని కావాలి కాబట్టి మనకు పని ఇచ్చే వాళ్ళపై మనం ఆధారపడాలి
  • ఇంత చేసి ప్రశాంతంగా నిద్రపోవడానికి తోడు కావాలి. అలాంటి తోడుపై మనం ఆధారపడాలి, ఆ తోడు
    ** పిన్న వయస్సులో తల్లితండ్రులు
    ** యుక్తవయస్సులో చెలి(కాడు) తలపులు
    ** యవ్వనంలో ప్రియు(డు)రాలు సాంగత్యం
    ** మలి వయస్సులో పిల్లలో / మనుమలో / అనుభూతులో / జ్ఞాపకాలో / మరేమైనా ..

ముగింపుగా, మనం ఎంత తక్కువ ఆధారపడి.. ఎంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఇస్తామో మనం అంత గొప్ప వాళ్ళం మరియు అది మన వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?

10, జనవరి 2010, ఆదివారం

తప్పిపోయినారు - పట్టి ఇచ్చిన వారికి బహుమానం

పై చిత్రం లో ఉన్న వ్యక్తి 2008 క్రిస్మస్ రోజునాటి నుంచి కనబడుట లేదు. కావున ఎవ్వరికైనా కనబడితే తెలియ జేయగలరు. పట్టి ఇచ్చిన వారికి తగిన బహుమానం. [[Wanted only  alive]]
.
.
.
.
నాయినా.. నువ్వు ఎక్కడ ఉన్నా కొంచం కనబడు.. నువ్వులేక మా ప్రక్క ఇంట్లో అంతా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళింట్లోని రామ చిలుక కూడా పారిపోయింది. కావున ఎక్కడ ఉన్నా వచ్చేయ్.. నిన్ను కొట్టము తిట్టము.

ఇట్లు
శ్రేయోలాభిలాషి

 

గమనికః ఇది ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో వ్రాసినది కాదు. It is an attempt to rebuild the interface with his person, with whom I lost contact with since Dec 2008 . తప్పుగా అనిపించిన యడల మన్నించండి.

7, జనవరి 2010, గురువారం

తెలుగు బ్లాగర్లకు ఓ ఉచిత సౌలభ్యం


తెలుగులో బ్లాగే వారందరికీ ఈ నూతన సంవత్సర కానుకగా కంప్యూటర్ విఙ్ఞానం వారు జనవరి నెల పుస్తకాన్ని ఉచితంగా మీ ఇంటికే పంపే ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిన వారు చెయ్యవలసినదల్లా.. మీ బ్లాగు పేరు మరియు మీ ఇంటి పోస్టల్ అడ్రసుని నాకు పంపించడమే. ఈ సదవకాశం ఫిబ్రవరి నెల పత్రిక వచ్చే లోపులే అని గమనించగలరు. కావున ఈ నెల ఇరవయ్యో తారీఖులోపుల మీ చిరునామాలను నాకు పంపండి. మర్చిపోవద్దు...

జనవరి నెల పత్రికతో ఉచితంగా బ్లాగుల గురించిన ఒక చిఱు పుస్తకాన్ని మరియు రెండు సిడీలను ఇస్తున్నారు. ఒక సిడి లో బ్లాగింగు ఎలా చెయ్యాలో వివరంగా తెలియ జేస్తున్నారు. బ్లాగు ఉన్న మీకు అది ఉపయోగ పడక పోయినా మీ స్నేహితులకు అది ఉపయోగ పడవచ్చు. మర్చిపోకండి నా మైల్ ఐడీ dskcheck@gmail.com
 
Clicky Web Analytics