19, ఏప్రిల్ 2009, ఆదివారం

పండంటి బ్లాగింగ్ కి పది సూత్రాలు : ఉపోద్ఘాతం

ఈ మధ్య తెలుగు బ్లాగులలో జరుగుతున్న (అనే కన్నా..) బ్లాగుతున్న క్రమం చూసిన తరువాత, అందరికీ ఇవే నా వినపాలు. అరోగ్యకరమైన వాతావరణం లోంచి వచ్చిన నాకు ఈ మద్య స్వదేశీయులే ముష్కరుల ముసుగులో చేస్తున్న దాడులను తలపే విధంగా.. కొంత మంది మనలో వాళ్ళే ముసుగులు వేసుకుని మారు పేర్లతో ఇతరులము అనేటట్లు ఫీలింగ్ ఇచ్చి ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుంటే.. అదిగో వాళ్ళు మమ్మల్నే అంటున్నారు అని తలచి తలచి గోకి గోకి గోరంతలును కొండంతలుగా చేసి చూసి భాధ పడేవారికి ఇది ఒక సున్నితమైన మొట్టికాయ. అదేదో పాత సామెత చెప్పినట్లు.. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.. ప్రక్కలో బల్లెంలా మన మధ్యనే మెసుగుతూ దేశానికె వెన్నుపోటు పొడిచే దేశద్రోహిలా మనకీ వెన్నుపోటు పొడిచే పిరికి పందలను ఎదుర్కోవాలనుకునే వారికి ఇది ఒక హితవు.

 

ఏదైనా వ్రాసే మ్రుందు నాలో కొంత అలజడి రేగుతుంది.  దానిని అంతర్మధనం అని మనం అనుకోవచ్చు. అలాంటి అంతర్మధనం లోని కొన్ని ముఖ్యాంశాలు..

  1. అసలు మనం ఎందుకు బ్లాగాలి?
  2. ఎవ్వరి కోసం బ్లాగాలి?
  3. ఏ విషయాన్ని బ్లాగాలి?
  4. బ్లాగడం ద్వారా మనం ఆసించేది ఏమిటి?
  5. ఏదైనా ప్రచురించినప్పుడు వచ్చే స్పందనలను ఏవిధంగా ఎదుర్కొనాలి?
  6. స్పందనకు ప్రతి స్పందన ఎలా ఉండాలి?
  7. స్పందించే వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి?
  8. ..
  9. ..

ఇలా పలు పలు ప్రశ్నల నా బుఱని తొలచి తొలచి మేఘ మధనంలా మరో పాల సంద్రం మధనం చేసినట్లుగా చిలికి చిలికి తీసిన కొన్ని సూత్రాలు మీతో పంచుకునే ముందు..

క్లుప్తంగానో .. కూలంకుషంగానో.. విడివిడిగానో.. వివరంగానో.. సంష్కిప్తం గానో .. సశేషంగానో .. ఏదో విధంగా ఈ పుట చదివే చదువరులు ఏమనుకుంటున్నారో తెలుసు కోవాలనుకుంటున్నాను.

నువ్వేదో పెద్ద పొడిచేస్తావని మేమొస్తే, మమ్మల్ని ఇలా ప్రశ్నించడం అసందర్బం .. అఘాతుకం.. అహేతుకం.. అంటూ చిందులెయ్యకండి. నేను చెప్పాలనుకున్నది ఎలాగో చెప్పక మానను. నేను చెప్పాలనుకున్న పుట ఇప్పుడు చక్కగా అంగరంగ వైభవాలతో అని అనను కానీ చక్కగా రూపుదిద్దుకుని మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉంది.

అది మిమ్ములను అలరించే ముందుగా మీ అలోచనలలో ఏముందో చెబుతారేమో అని ముందుగా మీ అభిప్రాయ సేకరణ అన్నమాట.

ఏమంటారు!!??

5 కామెంట్‌లు:

నాగప్రసాద్ చెప్పారు...

అసలు మనం ఎందుకు బ్లాగాలి?

1.వ్యక్తిగత ఆనందం కోసం, 2.అందరి నోళ్ళలో నానడం కోసం, 3.ప్రకటనలతో డబ్బులు సంపాదించటం కోసం కూడా బ్లాగొచ్చు.


ఎవ్వరి కోసం బ్లాగాలి?

మనకోసం, మన బ్లాగును చదివే వాళ్ళ కోసం.

ఏ విషయాన్ని బ్లాగాలి?

ఇతరులను నొప్పించనంత వరకూ ఏ విషయమైనా బ్లాగొచ్చు.

బ్లాగడం ద్వారా మనం ఆసించేది ఏమిటి?

మెదటి ప్రశ్నకిచ్చిన జవాబును చదువుకోండి. :)

....
.....

మిగతావి మీరు చెప్పదల్చుకున్న టపా వెలువడిన తర్వాత చెబుతాను.

శరత్ కాలమ్ చెప్పారు...

మీ టపా టైటిల్ ని ఖండిస్తున్నాను. పన్నెండు సూత్రాలు అని పెడితే మీ సొమ్మేం పోయింది :)

asha చెప్పారు...

1. 'నాకోసం'

2. నాకోసమే బ్లాగుతాను. నా సొద చెప్పుకోటానికి, కొందరు వింటున్నారనే ఆనందం పొందటానికీ, వాళ్ళేమైనా చెప్తే నేర్చుకోటానికీ...ఇంకా అలాంటి వాటి కోసమే.

3. మనకి నచ్చినదాన్ని బ్లాగుకోవచ్చు.

4. వీలయితే ఒక కప్పు కాఫీ...కుదిరితే నాలుగు మాటలు:) లేకపోతే ఏంటండి. కొంత సంతృప్తి. అంతే.

5. నిజంగా మనమెలా ఎదుర్కుంటామో, అలానే ఎదుర్కోవాలి...ముసుగులూ, లొసుగులూ లేకుండా.

6. కేవలం స్పందనలోని విషయానికి మాత్రమే ఉండాలి. ఆ మనిషిని దృష్టిలో పెట్టుకోకూడదు.

7. ఇవి నిర్ణయించటం చాలా కష్టం. ఎవరైనా స్పందించొచ్చు.

అజ్ఞాత చెప్పారు...

గ్రూపులు, ఆదిపత్యం, రాజకీయాలు .. అనేవి ఎక్కడైనా వుండేవే అని అర్దం చేసుకోవాలి.

ఓ బ్రమ్మీ చెప్పారు...

@శరత్ గారూ..

మీ ఖండనను నేను ఏకీభవిస్తున్నాను .. ఏదో టైటిల్ పాతది కదా అని అలా అన్నాను కానీ అసలు విషయంలో అచ్చంగా పదే చెప్పటం లేదు .. నెక్స్ట్ పుటలో ఈ విషయాన్ని నేను చక్కగా ప్రస్తావించాను. కానీ ఇంతలో మీరు అసలు విషయాన్ని లీక్ చేసారు..

ఇంతకీ మీరు మిగిలిన విషయాలపై దృష్టి సారించినట్లు లేరు.. కొంచం మిగితా విషయాలను కూడా ఖండించడమో (లేక) ఆమోదించడమో (లేక) మరింకేమైనా చెయ్యండి

@a2zdreams గారు,
ఈ విషయాన్ని కూడా ప్రస్తావించబోతున్నాను.. కానీ ఇంతలో మన శరత్ గారు లీకినట్లు తమరు కూడా లీకారు. చాలా మంచి పని చేసారు. ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని తెగ మదన పడుతున్నాననుకోండి. అసలు ఈ విషయాన్ని మన ప్రజలు జీర్ణించు కుంటారా అని యమ వర్రీ అయ్యాననుకోండి. ఏది ఏమైనా విషయాన్ని సింపుల్ గా తేల్చేసారు. మరి మిగితా విషయాల మాట ఏమిటి??

@నాగ ప్రసాద్ గారు,
స్పందించినందులకు నెనరులు. మిగితా విషయాలపై మీ స్పందన!!

@భవాని గారు,
మహిళా బ్లాగర్లు అస్సలు స్పందించరు అని అనుకున్నాను. కాని మీరు స్పందించిన తీరు నా అంచనాలకు మించి చాలా పరిపక్వంగా ఉంది. మీరు ఇలానే స్పందిస్తూ ఉంటారని నా మనవి. స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics