3, నవంబర్ 2010, బుధవారం

అవినీతి రహిత సమాజం కలుగుతుందా!!

ఈ మధ్య బిఎస్‍ఎన్‍ఎల్ వాడు ఒక ఎస్‍ఎమ్‍ఎస్ పంపించాడు. అవినీతి రహిత సమాజం కోసం కేంద్రప్రభుత్వం ఒక కమీషన్ ఏర్పరిచింది, దానియందు మీరు కంప్లైంట్ చెయ్యవచ్చు. దాని వివరాలకై http://www.cvc.nic.in సంప్రదించండి లేదా 011-24651000 కు కాల్ చెయ్యండి వివరాలు తెలుసుకోండి అని ఆ ఎస్‍ఎమ్‍ఎస్ తాత్పర్యం.

ఇది చదివిన తరువాత నాకు కలిగిన మొదటి సందేహం అవినీతి రహిత సమాజం వీలౌతుందా? ఒక వేళ వీలు చేద్దాం అని అనుకుంటే, మన రాజకీయ నాయకులు వీలు కలిగించడం మాట అటుంచి, అలా ఆలోచించే వాళ్ళని ఏరి పారేస్తారుగా!! మరి అలాంటప్పుడు అలా ఆలోచించేదెవ్వరు? ఒక వేళ నాలాంటి వాడు ఏదో ఉద్దరిద్దాం కదా అని నడుము కట్టుకుంటే, ఎగతాళి చేసే వారే కానీ కలిసి ముందుకు సాగుదాం అని ఎంతమంది ముందుకు వస్తారు. ఇకవేళ ఎవ్వరో కొందరు ముందుకు వచ్చినా ఇలా వచ్చిన అందరూ ఒకే తాటిపై నడిచేదెప్పుడు? అందరూ కాకపోయినా కొందరైనా చేతోడుగా ముందుకు సాగితే, మిగిలిన కొందరు వారికి పెద్ద పీట ఇవ్వలేదన్న కోపంతో వీరిని వెనక్కు లాగుతూ ముందుకు పోకుండా అడ్డుకుంటూ ఉంటే, అవినీతి ఎప్పటికి నశించేది? ఇలా ప్రశ్నిస్తూ కూర్చోకుండా, నలుగురిని పోగేసుకుని పోదాం అనే ఉద్దేశ్యంతో, నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ చేరవేస్తున్నాను.

మీరు కూడా మీకు తెలిసిన వారికి ఈ సమాచారాన్ని తెలియ జేయండి.

8 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

జిల్లాలో స్థానిక ACB కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియక కంప్లెయింట్ ఇవ్వనివాళ్లు ఉన్నారు. తెలిసినా వెయ్యి రూపాయల కోసం కంప్లెయింట్ ఏమి ఇస్తాములే అనుకునేవాళ్లు ఉన్నారు. ACB వాళ్లు వెయ్యి, రెండు వేలు లంచం తీసుకునే చిన్న అవినీతిపరులని పట్టుకుని లక్షలు స్కామ్ చేసిన పెద్ద అవినీతిపరులని రాజకీయ ప్రభావాలతో వదిలేస్తున్నారు. ఈ విషయం ACB అధికారులని అడిగితే కేసులు ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్టాఫ్ సరిపోవడం లేదని సమాధానం చెపుతున్నారు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారు,

నిజమేనండి. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్లే చాలా మంది కంప్లైంట్ చెయ్యటం లేదు. కానీ ఎవ్వరైనా ముందుకు వస్తే ఇలాంటి వారికి బుద్ధి చెప్పినట్టౌతుంది. స్పందించి మీ మనోభావాన్ని తెలియ జేసినందులకు నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

‘అవినీతిరహిత సమాజం కలుగుతుందా’ ఇదేం భాష భవదీయుడా?

సుజాత వేల్పూరి చెప్పారు...

చక్రవర్తి గారూ,
అవినీతి సమాజం కలగదు. ఎందుకంటే అది ఆకలి, దహం, కోపం,నీరసం వంటి భావన కాదు... కలగడానికి!

అవినీతి రహిత సమాజం మహా అయితే "ఏర్పడుతుంది" లేదా "రూపొందుతుంది" లేదా "వస్తుంది"! అంతే కానీ "కలగను మాత్రం కలగదు"!

ఇకపోతే మీరు ఇచ్చిన లింకు బాగుంది కానీ, ఎంతమంది ముందుకొస్తారో మరి! "speak out" అనే దాని గురించే పాపం జేపీ చాలా ఏళ్ళ గురించి చెప్తున్నారు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

మొదటి అజ్ఞాత,

ప్రశ్నించడం అందరికీ చేతనౌతుంది. కానీ సమాధానం చెప్పడమే చాలా కష్టం. దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఒక్కసారి సుజాత గారి స్పందన చదువు, ఆవిడ నా పదప్రయోగాన్ని సరిదిద్దడమే కాకుండా ఎక్కడ తప్పు మరియు అది ఎలా ఉండాలి అని వివరించారు. వీలైతే అలా చెయ్యి అంతే కాని ఇలా ప్రశ్న మాత్రమే వేసి ఊరుకోకు. ఏమైనా, స్పందించినందులకు నెనరులు

సుజాత గారు,
బహు బాగా చెప్పారు. ఇకపై అలాంటి పద ప్రయోగాన్ని వాడను. తప్పుని తప్పు అని మాత్రమే చెప్పడమే కాకుండా, ఎలా తప్పో చెప్పి ఏది ఒప్పో కూడా సూచించినందులకు నెనరులు. జేపి గారు తన రాజకీయ ప్రవేశమే ఇలాంటి వాటిని సమూలంగా తొలగించాలని అని నా అభిప్రాయం. తప్పైతే సరిదిద్దండి.

Nrahamthulla చెప్పారు...

వ్యాప్తిన్ జెందక,వగవక,
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?

----పోతన భాగవతం అష్టమ స్కంధము ౫౭౩

ఓ బ్రమ్మీ చెప్పారు...

రెహమతుల్లా గారు,

స్పందించి ఓ మంచి పద్యాన్ని ఙ్ఞప్తికి తెచ్చినందులకు నెనరులు. కాకపోతే ఆ పద్య వివరాన్ని కూడ తెలిపితే బాగుండేది. నాకు తెలుగే సరిగ్గా రాదు, ఇక మహాను భావుడైన పోతనగారి కవిత్వాన్ని అర్దం చేసుకునేంతటి ఙ్ఞానమా!! అది అతిశయం.

మీలాగే అందరూ ముందుకు వచ్చి చక్కని తెలుగులో వివరించిన పోతన గారి భాగవతాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో కదా!!

Nrahamthulla చెప్పారు...

చక్రవర్తి గారూ నాకు అర్ధమైన తాత్పర్యం ఇదిః
వ్యాప్తిన్ జెందక =ఆస్తిపాస్తులసంపాదనకోసం అంతటా విస్తరించక
వగవక =పొరుగువాడికి ఎక్కువ ఆస్తి ఉందే అని అసూయ పడక,నాకు లేదే అని ఏడవక
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్ =దక్కిందే చాలులే అనుకొని
దృప్తింజెందని మనుజుఁడు =తృప్తి పడని మనిషి
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే? =ఏడు ద్వీపాలలో ఎక్కడయినా చక్కబడతాడా?
----పోతన భాగవతం అష్టమ స్కంధము 573
ఎవరికి వారు ఈ పద్యాన్ని అన్వయించుకుంటే వారివారి మనస్సాక్షి చక్కగా అర్ధమయ్యేలా చెప్పే పద్యం ఇది.పోతన హితబోధను పాటిస్తే ప్రపంచ ప్రజలకు ఇన్ని కష్టాలు రావు.

 
Clicky Web Analytics