ఇంతక మ్రుందు వ్రాసిన పుటలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సమాధానాలు వ్రాయడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసానంటే.. దానికి పలు కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి ఈ పాత పాట మళ్ళీ నా చెవిన పడటం మొదటి కారణమైతే, ఇంతకు ముందు వ్రాసిన పుటకి ఎవ్వరూ స్పందించకపోవడం ఈ ఆలశ్యానికి మఱో కారణం. ఏది ఏమైనా ఈ సినిమా నేను పుట్టడానికి ఓ సంవత్సరం ముందు విడుదలైంది, అంటే 1971 లో అన్నమాట. ఈ సినిమాకి కేవీ మహదేవన్ సంగీతాన్ని అందిస్తే మల్లికార్జున్ దర్శకత్వ భాద్య్తతలను స్వీకరించారు. నట శేఖర కృష్ణ మరియు భారతి అలాగే జయసుధ ముఖ్య పాత్రలలో నటించింన అందరికీ మొనగాడు సినిమాలోని "ఆడగనా మాననా అమ్మాయి.." పాటలోని చరణాలే ఇంతకు మ్రుందు వ్రాసిన పుటలో ప్రశ్నలకు మూలం.
ఇదిగో ఇక ఆలశ్యం చెయ్యకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా..
౧) మగవాడు చేసేది అల్లరి .. వగలాడి విరిసేది మురిసేది రాగ వల్లరి..
౨) మగవాడు తలచేది కమ్మని కైపు.. జవరాలు మఱువనిది ప్రియతమ రూపు..
౩) మగవాడు కోరేది ఆనందం.. ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబందం..
౪) ..
నాల్గొవ ప్రశ్నకు సమాధానం నేను వ్రాయను. మీకు తెలుసుకోవాలనిపిస్తే ఎక్కడైనా ఈ పాటని పట్టుకోండి లేదా నన్ను సంప్రతించండి. ఈ పాటను నేను మీకు పంపుతాను, అది విన్న తరువాత మీకే అర్దం అవుతుంది ఆ నాల్గొవ ప్రశ్నకు సమాధానం
2 కామెంట్లు:
పాట సంగతి పక్కనబెడితే, అసలు ఈ సినిమా పేరే వినలేదెప్పుడూ. పాట విన్నాను కాని బాలేదనిపించింది. నే విన్న పాటలో, మూడు చరణాలే ఉన్నాయి. నాలుగో ప్రశ్న లేనే లేదు
కేకే గారు,
ఈ సినిమా పేరు నాకు కొంచం చిత్రంగానే అనిపించింది. కాని ఎలాగోలా సద్ది చెప్పుకుని వ్రాసేసాను. నాకు మొదట్లో బాగాలేదనిపించినా వినగ వినగ బాగుపడింది
ఏమైనా సరే నా మాట మన్నించి ఆ పాటని విన్నందుకు నెనరులు.. ఇలాగే స్పందిస్తూ ఉండండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి