5, ఆగస్టు 2010, గురువారం

ద గివింగ్ ప్లడ్జ్ – సంపాదనను దానం చేస్తానన్న ప్రమాణం

page_header

ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వారిలో కొంతమంది అంటే ఓ లభైమంది తాము సంపాదించిన దానిలో వీరి ఆస్తిలోని దాదాపు అంతా సమాజ సేవకు దానం చేస్తామని ప్రమాణం చేసారు. ఇలా ప్రమాణం చేసిన వీరి ఆస్తులు వీరు బ్రతికి ఉండగాగానీ తదనంతరం కానీ సమాజ సేవకు ఉపయోగ పడుతుందన్న మాట. వీరంతా వ్యాపారాలకు భిన్నంగా ఒకే గూటి క్రిందకు చేరి పాలు నీళ్ళుగా కలసి మెలిసి అందరం బాగుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని నేను ఏదో సొల్లు వేస్తున్నాననుకోకండి. వీలైతే ఓ సారి ఈ లంకెను దర్శించండి. మీకే అర్దం అవుతుంది. ఇలా ఈ గివింగ్ ప్లడ్జ్ లో పాలు పంచుకోవాలంటె మీకు ఉండవలసిన అర్హత అల్లా ఒక్కటే మీ ఆస్తి బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ ఉండటమే..

ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు. కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇది నిజం కాకపోతే.. ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే, వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని, ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు.

నా ఆలోచనలు నా అభిప్రాయాలను ప్రక్కన పెట్టి మనం కనుక ఆలోచించుకుంటే, హిల్టన్ హోటల్స్ అధిపతికూడా ఇలా తన సంపాదనలో ఎక్కువ శాతం సంపాదనని అవసరమైన వారికి ధారాదత్తం చేస్తానని ప్రమాణం చేసారు. ఇలా ఇక్కడ ఓ నలభై మంది ప్రమాణం చేస్తే, వీరందరిలో ఓ ముగ్గురి గురించి మాత్రమే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉంది. నాకు తెలిసిన ఆ ముగ్గురు ఎవ్వరంటే, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ మరియు వీరి భార్య ఒక్కరైతే, తన ఆస్తిలో 99% వాటాని మిలిండా గేట్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ పేర వ్రాసిన అపర దానశీలి వారెన్ బఫేట్ మరొక్కరు. ఆఖరుగా నేను అభిమానించే వ్యక్తి, ఆరకిల్ అధిపతి లారీ ఎలీసన్.

వీలైతే మీరు ఒకసారి చూడండి.

2 కామెంట్‌లు:

భావన చెప్పారు...

పర్లేదు లెండి. నాకు ఆ ముగ్గురే తెలుసు. చాలా మందే మన బడే వుండి వుంటారు. గుంపులో గోవిందా. ;-) నిజమే ఇవ్వటం చాలా గొప్ప పని కదా.

ఓ బ్రమ్మీ చెప్పారు...

భావన గారు,
అవునండి కొంతమంది ఉంటారు అదేదో సామెత చెప్పినట్టు ఎంగిలి చేత్తో కూడా కాకిని విదిల్చరు. ఏమైనా స్పందించినందులకు నెనరులు

 
Clicky Web Analytics